
సాక్షి, రాజమహేంద్రవరం : వేర్వేరు లిఫ్ట్ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లక్ష్మివారపుపేటలో చక్రవర్తి ఫోర్ట్ అపార్ట్‌మెంట్‌లో యర్రంశెట్టి గంగరాజు ( 65 ) మృతిచెందాడు. రెండో ఫ్లోర్ లో లిఫ్ట్ ఉందనుకుని తలుపుతీసి ఎక్కబోగా తలక్రిందులుగా కిండపడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తణుకు మండలం కాల్థారి గ్రామానికి చెందిన గంగరాజు నెయ్యి విక్రయిస్తుంటాడు. నెయ్యి అమ్మకానికి అపార్ట్‌మెంట్ పైఫ్లోర్ లోకి వెళ్లిన గంగరాజు కిందకి దిగే సమయంలో ఈ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. త్రీటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు
చీరాలలో పెళ్లింట్లో విషాదం
చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. దీంతో పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. చీరాలలోని రంగ అపార్ట్‌మెంట్‌లో వివాహ వేడుకకు హాజరైన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి లిఫ్ట్ ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తూ అతడి తల లిఫ్ట్‌లో ఇరుక్కోవడంతో లక్ష్మీనారాయణ మృతిచెందాడు. మృతుడు వరుడికి మేనమామ అవుతాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment