cheerala
-
’మార్గదర్శి’పై పోలీసుల అప్పీళ్లను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీరాల, విశాఖపట్నం, సీతంపేట బ్రాంచీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాము మార్గదర్శి చిట్ గ్రూపుల్లో చందాదారు కాకపోయినప్పటికీ, తమ సంతకాలను ఫోర్జరీ చేసి చందాదారులుగా చూపారని, దీనివల్ల తమకు భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని, ఇలా చేసినందుకు మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు చందాదారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అలాగే చీటీ పాట పాడుకున్నా తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ మరో చందాదారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేరానికి సంబంధించినదని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు నోటీసులిచ్చారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాలను స్తంభింపజేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం విచారణ జరిపింది. -
రామ్- లక్ష్మణ్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు రామ్- లక్ష్మణ్. సినీ పరిశ్రమలో బీజీగా ఉండే వారిద్దరు ఖాళీ టైమ్ దొరికితే చాలు సొంత గ్రామమైన చీరాల చేరుకుంటారు . అక్కడ వారు సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ బ్రదర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చీరాలలో ఉండే 'కోటయ్య వృద్ధాశ్రమం' కోసం ఈ బ్రదర్స్ జోలి పట్టి బిక్షాటన చేశారు. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) వృద్ధాశ్రమానికి ఒక ఆటో అవసరం కావడంతో చీరాలలోని ప్రధాన రహాదారుల్లో బిక్షాటన చేసి.. ప్రజలు నుంచి నగదు సేకరించారు. వచ్చిన డబ్బుతో పాటు వారు కూడా కొంత డబ్బును కలిపి ఆశ్రమానికి అందించారు. అదేంటి..? సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారు కదా? సొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా? ఇదంతా ఎందుకు అని ప్రశ్నించే వారికి ఇలా సమాధానం చెప్పారు. 'ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాము.'మానవసేవే మాధవసేవ' అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి.అపుడే సమాజం బాగుంటుంది' అని అన్నారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు. వారు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ.. ఫ్యాన్స్‌తో పాటు పలువురు షోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
పల్లె వెలుగు బస్సులకు కొత్త రూపు
చీరాల అర్బన్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పల్లె వెలుగు బస్సులను పూర్తి స్థాయిలో బాగు చేయించి కొత్త రూపు తీసుకొస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పల్లె వెలుగు బస్సులను కొంత హంగులతో రూపొందించి మూడు వేల బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా సుమారు రూ.25 కోట్ల వ్యయంతో అన్ని బస్స్టేషన్లలోని మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయించనున్నట్లు వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించామన్నారు. డిపోలోని సర్వీసుల వివరాలు, కార్గో సర్వీసులపై వస్తున్న ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని గార్డెన్, పరిసరాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ ఎండీకి పలు యూనియన్ల నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. -
చీరాల ఘటనపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, ప్రకాశం/అమరావతి: చీరాలలో ఈ నెల 18న ఎస్సై దాడిలో మృతి చెందిన యువకుడు కిరణ్ కేసు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంవో కార్యాలయం సేకరిచింది. యువకుడి మృతి కేసుపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మృతుడు కిరణ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: పిల్లి సుభాష్) ఈ ఘటనపై ఎస్పీ సిద్దార్థ్ కౌసల్ వివరణ ఇస్తూ.. చీరాల యువకుడు కిరణ్‌పై ఎస్సై విజయ్ కుమార్ దాడి చేశారనడం అవాస్తవమని తెలిపారు. ఈ నెల 18న చీరాల 2 టౌన్ పరిధిలో కిరణ్, అబ్రహం షైన్ అనే ఇద్దరు యువకులు మాస్క్ లేకుండా బైక్‌పై తిరుగుతుండగా ఎస్సై విజయ కుమార్ ఆపి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న కిరణ్, అబ్రహం షైన్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో యువకులను పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కిరణ్ కిందకు దూకడంతో తలకి బలమైన గాయం అయిందని చెప్పారు. అనంతరం హాస్పీటల్‌కు తరలించారని, చికిత్స అందిస్తున్న క్రమంలో కిరణ్ నిన్న(మంగళవారం) మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
-
టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి కరణం వెంకటేశ్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కరణం వెంకటేశ్‌తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. (చదవండి: ‘టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు’) ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెంకటేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. (చదవండి: వైఎస్సార్సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం) ఇది శుభపరిణామం : మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ‘కరణం వెంకటేశ్, పాలేటి రామారావు వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామం. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన చూసి వీరు పార్టీలో చేరారు. కరణం బలరాంకు టీడీపీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. కొత్తగా వచ్చిన వారిని తీసుకుని సీనియర్లను పక్కన పెట్టారు. చంద్రబాబు విధానాలను బలరాం వ్యతిరేకిస్తున్నారు’అని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన కరణం బలరాం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. (చదవండి: బాబూ.. సైకిల్ తొక్కలేం!) -
రాములోరి కల్యాణానికి క్షీరపురి గోటి తలంబ్రాలు
సాక్షి, చీరాల అర్బన్: జగదభిరాముడు.. కోదండ రాముడు.. రఘురాముడు.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే నీలమేఘశ్యాముడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలన అనే మాటకు అర్థం చెప్పిన మహోన్నతుడు. అటువంటి ఏకపత్నీవ్రతుడు శ్రీరామచంద్రమూర్తి కల్యాణమంటే జగత్కల్యాణమే. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణం చూసినా, వినినా ఎంతో పుణ్యం. అంతటి కల్యాణ ఘట్టంలో తమకు ఏదో ఒక భాగస్వామ్యం కావాలని ఎంతో మంది కోరుకుంటారు. కల్యాణంలో ప్రధానంగా వినియోగించేవి తలంబ్రాలు. ఆ తలంబ్రాలను గోటితో ఒలిచే మహద్భాగ్యం క్షీరపురి వాసులకు ఆరోసారి దక్కింది. చీరాలకు చెందిన రఘురామభక్త సేవా సమితి చైర్మన్ పొత్తూరి బాలకేశవులు 2013లో శ్రీరామనవమి కల్యాణం తిలకించేందుకు భద్రాచలం వెళ్లారు. అక్కడ కల్యాణంలో స్వామివారికి గోటితో ఒలిచిన తలంబ్రాలను ఉభయ గోదావరి జిల్లాలతోపాటు పలు జిల్లాల నుంచి భక్తులు దేవస్థానానికి సమర్పించారు. ఆ అవకాశాన్ని తమకు అందించాలని ఆయన దేవస్థాన యాజమాన్యాన్ని కోరారు. దీంతో 2014లో చీరాల వాసులకు అవకాశం దక్కింది. అప్పటి నుంచి ఏటా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి చీరాల నుంచి కూడా గోటి తలంబ్రాలు స్వామివారికి అందుతున్నాయి. 2020లో జరిగే కల్యాణానికి కూడా ఆరోసారి ఆ అదృష్టం చీరాలవాసులకు దక్కింది. ఈ మేరకు దేవస్థాన అధికారుల నుంచి అనుమతి లభించింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వడ్లను గోటితో ఒలిచే కార్యక్రమాన్ని మహిళలు సోమవారం ప్రారంభించారు. పలు మహిళా సమాజాల ద్వారా, అలానే పలు దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి శ్రీరామనవమి నాటికి భక్తిశ్రద్ధలతో భద్రాద్రికి చేరుస్తారు. అరుదైన అవకాశం ఆరుసార్లు తమను వరించడం పూర్వ జన్మ పుణ్యంగా భావిస్తున్నట్లు బాలకేశవులు చెబుతున్నారు. 150 క్వింటాళ్లకు అనుమతి భద్రాచలంలో 2020లో నిర్వహించే శ్రీరామనవమి పర్వదినానికి ఉపయోగించే తలంబ్రాలను 150 క్వింటాళ్లకు ఆలయ అధికారుల నుంచి అనుమతి వచ్చింది. కల్యాణానికి వినియోగించే మొత్తం 150 క్వింటాళ్ల తలంబ్రాలు క్షీరపురి వాసులే అందించడం కోటి నోములు ఫలం. తలంబ్రాలతోపాటు పసుపు 225 కిలోలు, కుంకుమ 450 కిలోలు, గులాం 450 కిలోలు, నూనె 225 కిలోలు, సెంటు(జాస్మిన్) 75 లీటర్లు, రోజ్ వాటర్ 75 లీటర్లు, 100 కిలోల లోపు ముత్యాలు అందించాలని అనుమతి పత్రంలో ఆలయ అధికారులు కోరారు. గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం -
కొత్తపేటలో భారీ చోరీ
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాలకు కూతవేటు దూరంలోని కొత్తపేటలో సోమవారం ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాను బద్దలు కొట్టి అందులోని 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. బాధితులు పోలీసులకు అందించిన వివరాల మేరకు...వేటపాలెం మండలం కొత్తపేట ప్రధాన కూడలి అయిన పంచాయతీరాజ్ శాఖ భవనాల సముదాయం వద్ద గోగినేని హనుమంతరావు, ధనలక్ష్మి వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. హనుమంతరావు కలప వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమారై ఉన్నారు. కుమారుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో నివసిస్తుండగా కుమారై అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి అనారోగ్యంతో నెలన్నర క్రితం చెన్నైలోని తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఆమె భర్త హనుమంతరావు మాత్రం ఇంటివద్దనే ఉన్నాడు. అయితే 15 రోజులు క్రితం హనుమంతరావు కూడా చెన్నైలోని కుమారుడి వద్దకు వెళ్లాడు. చెన్నైకి వెళ్లిన అతనికి కూడా అనారోగ్యంగా ఉండడంతో కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి శ్రేయోభిలాషిగా ఉండే వ్యక్తి ప్రతిరోజు హనుమంతరావు ఇంటికి వచ్చి బాగోగులు చూస్తుంటాడు. రోజు మాదిరిగా సోమవారం ఉదయం వచ్చిన అతనికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టి ఉండడం గమనించాడు. దీంతో అతడు హనుమంతరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన హనుమంతరావు తనకు ఉన్న పరిచయాలతో స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, సీఐలు నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇంకొల్లు సీఐ రాంబాబు, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమాచారం అందుకున్న డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చీరాలకు చేరుకున్న బాధితులు. ఇంటిలో దొంగతనం జరిగిందన్న సమాచారం అందుకున్న బాధితులైన హనుమంతరావు, ధనలక్ష్మి దంపతులు సాయంత్రం 3 గంటలకు చెన్నై నుంచి చీరాలకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆ ఇంట్లో కోటి రూపాయలు నగదు, బంగారం దొంగలు అపహరించారనే పుకార్లు పట్టణంలో షికార్లు చేశాయి. బాధితులు వచ్చే వరకు ఇతర వ్యక్తులు ఎవ్వరిని ఆ ఇంట్లోకి వెళ్లనీయలేదు. బాధితులు వచ్చి పగిలిన బీరువాను పరిశీలించారు. అలానే కొన్ని బ్యాంకులకు వారు స్వయంగా వెళ్లి లాకర్లను పరిశీలించుకున్నారు. అన్నింటినీ పరిశీలించుకున్న తరువాత 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఇంటికి కన్నం వేసేందుకు ప్రయత్నం.. దొంగతనం జరిగిన ఇంటికి కూత వేటు దూరంలోనే మరో ఇంట్లో చోరీకి దొంగలు విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరూ ఇంట్లో లేరని గుర్తించిన దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకూ తాళం పగలకపోవడంతో హనుమంతరావు ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. సీసీ కెమెరా లేకపోవడంతోనే.. కొత్తపేటలోని ప్రధాన కూడలిలో జనం నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో దొంగతనం జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పెద్ద భవంతిలోనే దొంగలు పడి దోచుకుంటే సామాన్యుల ఇళ్లు దొంగలకు పెద్ద పనికాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పెద్ద భవంతికి సీసీ కెమెరా లేకపోవడం కూడా దొంగలకు కలిసి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగతనం జరిగిన ఇంటి ముందు పోలీసులు ఏర్పాటు చేసిన భారీ సీసీ కెమెరా ఉంది. దొంగలు సీసీ పుటేజీలో పడే అవకాశం ఉంది. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ప్రజలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. ఊరికి వెళ్లే సమయంలో లాక్డ్ మానిటరింగ్ సిస్టంను ఉపయోగించుకుని ఉంటే దొంగతనం జరిగి ఉండేది కాదని, పోలీసులు నిరంతరం ఆ ఇంటిని కాపాలా కాస్తుండేవారని డీఎస్పీ తెలిపారు. -
శ్రీకృష్ణుడి జన్మ స్థలానికి కి‘లేడీ’
సాక్షి, చీరాల: చిట్టీల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన టీడీపీకి చెందిన మహిళా నేత, ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి వెళ్లారు. చిట్టీలు, గోల్డ్ స్కీం, అధిక వడ్డీల పేరుతో రూ.16 కోట్లకు పైగా వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసిన టీడీపీ నాయకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తి, కొడుకు లక్ష్మీకాంత్‌లపై చీరాల రూరల్ ఈపూరుపాలెం పోలీసుస్టేషన్లో కేసులు నమోదు చేయగా విచారించిన పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారని రూరల్ ఎస్ఐ వేముల సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి చిట్టీల వ్యాపారం చేస్తోంది. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈ మాయలేడీ రూ.16 కోట్లకు అప్పులు చేసి ఎగనామానికి సిద్ధపడింది. చిట్టీలు, అధిక వడ్డీలకు ఆశ చూపి ప్రజల నుంచి రూ.16 కోట్లు వసూలు చేసిన టీడీపీకి చెందిన నాయకురాలు మాచర్ల పద్మావతి వ్యవహారంపై ముందుగానే సాక్షి దినపత్రికలో పలు కథనాలు ‘మహిళా మేత’, ‘ఆమె భాదితులు చాంతాడంత’, ‘ఖతర్నాక్’.. వంటి అనేక శీర్షికలతో కథనాలు ప్రచురించింది. ఈపూరుపాలేనికి చెందిన బాధితులు ఇద్దరు తమను మహిళా నేత చీటింగ్ చేసిందని ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక వడ్డీలకు ఆశచూపి రూ.16 కోట్లకుపైగా టోకరా వేసిన సదరు మహిళపై ఈపూరుపాలెం రూరల్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ వేముల సుధాకర్ నిందితులైన చిట్టీల నిర్వాహకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తి, కొడుకు లక్ష్మీకాంత్‌ను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా రిమాండ్‌కు ఒంగోలు తరలించారు. ఈ మహిళా మేత బాధితుల చిట్టా చాంతాడంత పేరుకుపోయింది. చీరాల మండలం మేజర్ గ్రామం ఈపూరుపాలెంలో చిట్టీలు వేస్తున్న ఈ మహిళ వ్యాపారులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, మాస్టర్ వీవర్లు నుంచి కోట్లాది రూపాయలు డబ్బులు అధిక వడ్డీలకు ఆశ చూపించి వసూలు చేసింది. ఈమె బాధితులు చీరాల నియోజకవర్గం చివరలోని పందిళ్లపల్లి నుంచి దేశాయిపేట, వేటపాలెం, చీరాల, పేరాల, ఈపూరుపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి, బాపట్ల, కర్లపాలెంలో ఉన్న రొయ్యల వ్యాపారులు, ఉద్యోగులు, వ్యాపారులు, బిల్డర్లు, విశ్రాంత ఉద్యోగుల నుంచి రూ.16 కోట్లు కాజేసింది. తమ ఆశలను ఆడియాసలు చేసి కోట్లాది రూపాయల డబ్బులు కాజేసిన మాచర్ల పద్మావతి, భర్త శ్రీరామ్మూర్తి, కుమారుడు లక్ష్మీకాంత్‌లను కఠినంగా శిక్షించడంతో పాటు తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. -
పోలీసుల అదుపులో టీడీపీ ‘కీ’ లేడీ
సాక్షి, చీరాల : చిట్టీలు, అధిక వడ్డీలకు ఆశ చూపి ప్రజల నుంచి రూ.16 కోట్లు వసూలు చేసిన టీడీపీ కీ లేడీని ఎట్టకేలకు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాలిగా వ్యవహరిస్తూ ఆమె చేసే అక్రమాలకు కలరింగ్ ఇచ్చుకుంది. తన వెనుక రాజకీయ నాయకుల పలుకుబడి ఉందని సొంత బిల్డప్లకు దిగింది. తీరా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదహారు కోట్ల రూపాయలకుకు టోకరా పెట్టింది. ఇందులో పేద, మధ్య తరగతి వారి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, పోలీసులు, ఆర్మీ ఉద్యోగులు, రైతులు ఉన్నారు. ఈ మాయ లేడీ వ్యవహారంపై ముందుగానే సాక్షి దినపత్రికలో రెండు కథనాలు ప్రచురితమయ్యాయి. మహిళా మేత శీర్షికతో పాటు ఆమె బాధితులు చాంతాడంత అనే మరో శీర్షికతో సాక్షి రెండు కథనాలు ప్రచురించింది. ఈపూరుపాలేనికి చెందిన బాధితులు ఇద్దరు తమను మహిళా నేత ఛీటింగ్ చేసిందని ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక వడ్డీలకు ఆశచూపి రూ.16 కోట్లకు టోకరా వేసిన సదరు మహిళపై ఈపూరుపాలెం రూరల్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ వేముల సుధాకర్ తన సిబ్బందితో కలిసి చిట్టీల నిర్వాహకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తి (ఇతను ప్రభుత్వ ఉద్యోగి) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదీ..జరిగింది చీరాల రూరల్ మండలం ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి చిట్టీల వ్యాపారం చేస్తోంది. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈ మాయలేడీ రూ.16 కోట్లకు అప్పులు చేసి ఎగనామానికి సిద్ధపడింది. ఈపూరుపాలెంలో ఉన్నత కుటుంబంగా వ్యవహరిస్తూ చిట్టీల వ్యాపారం చేయడంతో పాటు చిట్టీలను వేసిన వారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు ఇస్తానని నమ్మబలికింది. చీరాల మండలం మేజర్ గ్రామం ఈపూరుపాలెం, బోయినవారిపాలెం, పేరాల, చీరాల, పిట్టువారిపాలెం తదితర ప్రాంతాల్లోని ప్రజలు అధికంగా చిట్టీ పాటలు వేశారు. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు చిట్టీ పాటలు వేయడంతో పాటు చిట్టీలు పాడిన వారి నుంచి అధికంగా వడ్డీలు చెల్లిస్తామని నమ్మబలికి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. 15 నెలలుగా సదరు మహిళ చిట్టీలు పాడిన వారికి నగదు చెల్లింపులు చేయకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. ఇదే కోవలో డబ్బులు వడ్డీకి ఇచ్చిన వారు సైతం తమ డబ్బులు ఇవ్వాలంటూ ఆ మహిళను కోరగా వారికి ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తోంది. సదరు మహిళ వద్ద అధికంగా రోజువారీ కూలీలు, ఐఎల్టీడీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్‌దారులు 500 మంది వరకు చిట్టీలతో పాటు అధిక వడ్డీలకు ఆశపడి నగదు ఇచ్చారు. గత సంవత్సరం నుంచి ఆ మాయాలేడీ వ్యవహారంపై అనుమానం వచ్చిన ప్రజలు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రతిఫలం లేకుండా పోతోందని వాపోతున్నారు. అక్రమార్కురాలికి టీడీపీ నేతల అండ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కాజేసీ తీరా తన వద్ద డబ్బులు లేవంటూ నాటకాలు ఆడుతున్న సదరు మహిళ టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. తనను ఈ వ్యవహారం నుంచి రక్షించాలని స్థానిక నేతలతో పాటు నియోజకవర్గ ముఖ్యనేతల చుట్టూ తిరుగుతోంది. ఈ జనానికి తాను అంత డబ్బు ఇవ్వలేనని, తన ఇంటిని అమ్ముతానని, తాను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తానని స్థానిక నేతలను వెంట పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలను తరుచూ కలుస్తోంది. పందిళ్లపల్లి టూ కర్లపాలెం వరకు బాధితులే ఈ మహిళా నేత బాధితుల చిట్టా చాంతాడంత పేరుకుపోయింది. చీరాల మండలం మేజర్ గ్రామం ఈపూరుపాలెంలో చిట్టీలు వేస్తున్న ఈ మహిళ వ్యాపారులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, మాస్టర్ వీవర్లు నుంచి కోట్లాది రూపాయలు అధిక వడ్డీలు ఆశ చూపించి వసూలు చేసింది. ఈ మహిళా మేత బాధితులు చీరాల నియోజకవర్గం చివరలోని పందిళ్లపల్లి నుంచి దేశాయిపేట, వేటపాలెం, చీరాల, పేరాల, ఈపూరుపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి, బాపట్ల, కర్లపాలెంలో ఉన్నారు. ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ఈపూరుపాలెంలో ప్రజల నుంచి రూ.16 కోట్లకుపైగా డబ్బులు వసూలు చేసిన మాచర్ల పద్మావతిపై ముందుగానే ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. తమను పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు మోసం చేశారని బాధితులు చాలామంది ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె బాధితులు చాంతాడంత పేరుకుపోవడంతో పాటు పలువురు కోర్టుల్లో కేసులు కూడా దాఖలు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నా మాయా లేడీ కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. అవును..విచారిస్తున్నాం ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తిలు చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. తమను మోసం చేశారని గ్రామానికి చెందిన ఇద్దరు పద్మావతి కుటంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సదరు మహిళ, ఆమె భర్తను విచారిస్తున్నాం. – సుధాకర్, ఎస్ఐ, ఈపూరుపాలెం -
దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు
సాక్షి, చీరాల: కొంతకాలంగా దండుబాటలో దండుపాళ్యం బ్యాచ్ మాదిరిగా తయారై దారి దోపిడీలు, లైంగిక దాడులకు పాల్పడుతూ చీరాలలో భయానక వాతావరణం సృష్టిస్తున్న పలు ముఠాలకు చెందిన వారిలో వన్‌టౌన్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి బంగారం, నగదు స్వాదీనం చేసుకున్నారు. శనివారం రాత్రి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. దండుబాటలో కొంతకాలంగా అసాంఘిక శక్తులు కొందరు దారి దోపిడీలు, లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై ఒన్‌టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కొన్ని బృందాలు నిఘా ఉంచాయి. గత నెల 25వ తేదీ రాత్రి 8 గంటలకు కారంచేడు మండలం జరుబులవారిపాలేనికి చెందిన కొల్లూరి చిన్న సుబ్బారావు స్వర్ణ దారిలో వెళ్తుండగా ఇద్దరు మురుగు కాలువ సమీపంలో అడ్డుకుని అతనిపై దాడి చేసి బెదిరించి అతని వద్ద ఉన్న రూ.1200 నగదు, రెండున్నర సవర్ల బంగారాన్ని లాక్కుని సెల్‌ఫోన్‌ను పగలగొట్టారు. అదే మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనాలను చూసి నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఒన్‌టౌన్ సీఐ దర్యాప్తు చేయగా నిందితులైన గాంధీనగర్‌కు చెందిన మత్తు శివశంకర్, పెదప్రోలు శివబ్రహ్మారెడ్డి అనే 20 ఏళ్ల యువకులను దండుబాట ప్రాంతంలో అరెస్టు చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
దండుపాళ్యం ముఠా కన్నుపడితే అంతే..
సాక్షి, చీరాల (ప్రకాశం): పగలు లేదు..రాత్రి లేదు.. ఎప్పుడైనా వారి టార్గెట్ ప్రేమ జంటలే. అందులోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారినే టార్గెట్ చేస్తారు. రాత్రి వేళ్లల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే దంపతులను కూడా వదలరు. చీకట్లో మాటు వేసి అందినంత దోచుకోవడం ఆపై విచక్షణ మరిచి సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. వీలుకాకుంటే చితకబాది జేబులో ఉన్న డబ్బులు, ఒంటిపై ఉన్న నగలు దోచేస్తారు. వీరి అకృత్యాలు దండుపాళ్యం సినిమాలో ఘటనలు తలదన్నేలా ఉంటాయి. గతంలోనూ విచ్చల విడిగా అరాచకాలకు పాల్పడ్డారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పలు రకాలు కేసులు బనాయించి కొందరిని జైలుకు పంపడంతో కొద్ది రోజులుగా మిన్నకున్నారు. మళ్లీ ఈ బ్యాచ్ కొద్ది నెలలుగా తమ వికృత చేష్టలకు పదును పెట్టింది. దండుబాటలో దారి దోపిడీలకు పాల్పడుతోంది. కారంచేడు బ్రిడ్జి సమీపంలో లైంగిక దాడులకు తెరలేపింది. రామాపురం బీచ్‌లో ప్రేమజంటలను టార్గెట్ చేస్తోంది. ఉజిలీపేటకు చెందిన ఈ ముఠా కొద్ది రోజులు వ్యవధిలోనే ఏడు జంటలపై లైంగిక దాడులకు పాల్పడిందంటే నిందులు ఎంతటి దుర్మార్గులో ఆర్థం చేసుకోవచ్చు. దాడులు, ఆపై లైంగిక దాడులు చీరాల విఠల్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డితో ఆమెకు పరిచయమైంది. వీరు చీరాల సమీపంలోని కారంచేడు సరిహద్దుల్లోని ఏకాంత ప్రాంతానికి వెళ్లారు. కొద్దికాలంగా అనుసరిస్తున్న ఉజిలిపేటకు చెందిన ముఠా వీరిపై కన్నేసింది. చీకట్లో కాలువ కట్టపైకి వెళ్లిన కొద్ది సేపటికి వారి వెనుకే వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రియుడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ దోచుకున్నారు. తనపై కూడా దాడి చేస్తారనే భయంతో అతడు కూడా దూరంగా ఉండిపోయాడు. విషయం బయటకు వస్తే చంపేస్తామని, మీ పరువే పోతుందని ఆమెను భయపెట్టారు. బాధితురాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్పీ కూడా కేసును సీరియస్‌గా తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ సమయంలో విస్తుకొల్పే విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం ఏడు జంటలపై దాడులు, లైంగిక దాడులకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. అందులో విఠల్‌నగర్‌కు చెందిన మహిళ తప్ప మిగిలిన ఆరు జంటల్లో ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందు రాలేదు. పోలీసులు, మరెవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని, కుటుంబంలో వివాదాలు ఏర్పడి తమ కాపురాలు ఎక్కడ పోతాయనే మౌనం దాల్చారు. ఎక్కువగా వీరు వివాహేతర సంబంధాలు ఉన్నవారు కావడంతో ముందుకు వచ్చి నోరు మెదపకలేక పోతున్నారు. దండుబాటే డేంజర్ దండుబాట రోడ్డులో రెండు ముఠాలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి. చీరాల నుంచి స్వర్ణకు దండుబాట మీదగా రాత్రి 11 గంటల వరకు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. స్వర్ణకు వెళ్లే రోడ్డులో మలుపు వద్ద వాహనాలను వేగం తగ్గిస్తారు. ఇక్కడే మాటు వేసిన ముఠాలు వాహనదారులను చితకబాది నగదు దోచుకుంటున్నాయి. వారం రోజుల క్రితం ఓ మోటార్ సైకిల్ నుడుపుతున్న వ్యక్తిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ దోచుకున్నారు. ఈ ఘటనపై ఒన్టౌన్పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దండుబాట నుంచి చీరాల నగర్‌కు వెళ్లే దారిలో సరివితోటలతో పాటు పొలాలు ఉండడంతో వివాహేతర సంబంధం ఉన్న జంటలు ఆ చీకటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. అక్కడే మాటు వేసి ఉండే ఈ ముఠాలు నిశితంగా పరిశీలించి వారిపై లైంగిక దాడులతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. అరాచాకాలకు అంతే లేదు వాడరేవు సముద్ర తీర ప్రాంతాని పర్యాటకులు, నూతనంగా పెళ్లయిన వారు, కొందమంది ప్రేమికులు జంటలుగా వాడరేవుకు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు అగంతకులు పర్యాటకులపై మానవత్వాన్ని మరిచి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తీరంలో జంటగా వెళ్లిన వారిని అటకాయించి వారి వద్ద ఉన్న నగదు, బంగారం, సెల్ఫోన్లు బలవంతంగా లాక్కుంటున్నారు. ప్రతిఘటించిన వారిపై దాడులకు దిగి గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒకటా..రెండా? వాడరేవు నుంచి రామాపురం తీరానికి వెళ్లే దారిలో ఉన్న తీరానికి ఓ ప్రేమజంట వెళ్లింది. తీరం వెంట ఉండే అటవీ శాఖకు చెందిన సరివి తోపుల వద్ద జంట ఉంది. వెళ్లిన కొద్ది సేపటికే చీరాల ప్రాంతంలోని పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఆరుగురు ఆ జంట వద్దకు వెళ్లి తాము పోలీసులమని బెదిరించడంతో పాటు ప్రియుడిని కట్టేసి అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌తో పాటు ప్రియురాలి చెవులకు ఉన్న దుద్దులు దోచుకున్నారు. సొత్తు దోచుకోవడంతో పాటు ఆరుగురూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోకుండా మానవ మృగాళ్లుగా మారి ఆమె నగ్న దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఆమె సెల్ నంబర్ తీసుకుని ఆ తర్వాత జంటను వదిలేశారు. ఆ ప్రేమ జంటది వివాహేతర సంబంధం కావడంతో బయటపడితే తమ పరువు పోవడంతో పాటు కాపురాలు దెబ్బతింటాయని మౌనంగా ఉంది. చివరకు ఆమెకు బెదిరింపులు అధికం కావడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు కేసు వద్దని, పోయిన బంగారాన్ని ఇప్పించాలని కోరడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. నిందితుల్లో కొందరిపై మాత్రం దోపిడీ కేసు మాత్రమే నమోదు చేశారు. తీరంలో జోరుగా దోపిడీలు జిల్లాలోనే సముద్ర తీర పర్యాటక ప్రాంతంగా పేరుగంచిన చీరాల వాడరేవులో ప్రస్తుతం పర్యాటకులకు అశాంతి, అభద్రత నెలకొంది. అరాచక ముఠాలు ఎప్పుడు లైంగిక దాడులు, దొంగతనాలు చేస్తాయో తెలియక పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చీరాల వాడరేవు తీరానికి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వరంగల్ జిల్లాలతో పాటుగా బెంగళూరు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. చీరాల వాడరేవు, రామాపురంలో వసతి సౌకర్యాలతో పాటు సముద్రంలో స్నానాలు చేసేందుకు మంచి అనువైన ప్రదేశం కావడంతో నిత్యం పర్యాటకులతో వాడరేవు కళకళలాడుతుంటుంది. పెట్రోలింగ్‌ను వేగవంతం చేశాం దండుబాట నుంచి స్వర్ణ వేళ్లే రోడ్డులో రాత్రి 12 గంటల వరకు పెట్రోలింగ్ చేస్తున్నాం. ఇక్కడ గతంలో దాడులు జరిగాయి. నిందితుల ఆట కట్టించేందుకు త్వరలోనే వెహికల్ చెకింగ్, ప్రత్యేకంగా సిబ్బందితో గస్తీ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలి. వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. - నాగమల్లేశ్వరరావు, ఒన్‌టౌన్ సీఐ, చీరాల -
డ్రైఫ్రూట్ కిళ్లీ@ చీరాల
సాక్షి, చీరాల(ప్రకాశం) : రుచికరమైన ఆహారాన్ని తృప్తిగా తిన్న తర్వాత ఒక కిళ్లీ వేసుకుంటే ఆ కిక్కే వేరు.! ఏ శుభకార్యమైనా భోజనం తర్వాత స్వీట్, సాదా కిళ్లీ వేయడం సహజం. అయితే కిళ్లీల్లో కూడా వెరైటీలు ఉన్నాయి. అందులో డ్రైఫ్రూట్ కిళ్లీ ప్రత్యేకమైనది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న ఈ డ్రైఫ్రూట్ కిళ్లీ జిల్లాలు దాటి చీరాలకు వచ్చింది. స్థానిక స్టేషన్ రోడ్‌లోని తాజ్ కిళ్లీ దుకాణంలో డ్రైఫ్రూట్ కిళ్లీని ప్రత్యేకంగా అందిస్తున్నారు. చీరాలలో స్వీట్ సమోసా, పుల్లయ్య బజ్జీలు, పట్టాభి స్వీట్లు ఫేమస్. వీటి కోసం రోజూ ప్రజలు ఎదురుచూస్తారు కూడా. వాటి సరసన ఇప్పుడు డ్రైఫ్రూట్ కిళ్లీ కూడా చేరింది. ఎలా వచ్చిందంటే.. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా వినియోగించే డ్రైఫ్రూట్ కిళ్లీని చీరాల వాసులకు కూడా రుచి చూపించాలని భావించాడు పాన్‌షాపు నిర్వాహకుడు బ్రహ్మం. డ్రైప్రూట్ కిళ్లీలో ఏం వాడతారో తెలుసుకుని వాటిని చీరాల తెప్పించాడు. హైదరాబాద్ నుంచి పలు రకాల ఫ్లేవర్లు కూడా తీసుకొచ్చాడు. స్వీట్ కిళ్లీలో సున్నం, వక్కతోపాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలు వేస్తుంటారు. అదే డ్రైప్రూట్ కిళ్లీకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. సున్నం, వక్కతో పాటు కిస్మిస్, బాదం, జీడిపప్పు, కర్జూరం, తేనె, కొబ్బరిపొడి, బాదం పొడి, పలు రకాల ఫ్లేవర్లు వేస్తారు. సుగంధ ద్రవ్యాలతో పాటు డ్రైఫ్రూట్స్‌ను అందంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణ. డ్రైఫ్రూట్ కిళ్లీ తయారీకి రూ.20 వరకు ఖర్చవుతుండగా రూ.25కు విక్రయిస్తున్నారు. కిళ్లీ రుచి చూసిన పలువురు శుభకార్యాలకు ఆర్డర్లు ఇస్తున్నారని షాప్ నిర్వాహకుడు బ్రహ్మం సంతోషంగా చెబుతున్నాడు. -
టీసీ కావాలంటే అ'ధనం' ఇవ్వాల్సిందే..!
సాక్షి, చీరాల (ప్రకాశం): ‘మా పిల్లలను వేరే పాఠశాలలో చేర్పిస్తున్నాము టీసీ కావాలంటూ ఓ విద్యార్థి తండ్రి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళాడు. టీసీ ఎందుకు..? మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తాము. టీసీ కావాలి’ అని అడిగాడు. టీసీ కావాలంటే అ‘ధనం’ ఇవ్వాలంటూ ఆ స్కూల్ యాజమాన్యం బదులిచ్చింది. ఫీజు బకాయిలు చెల్లించాము గదా, అదనపు డబ్బులు ఎందుకు అని ప్రశ్నించినా సమాధానం లేదు. టీసీ ఇవ్వాలంటే రూ.1000లు ఇవ్వాలంటూ ఆ స్కూల్ యాజమాన్యం బదులిచ్చింది. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో తిప్పించుకుంటున్నారు. ఇదే సంఘటనలు చీరాల మండలంలో కనిపిస్తున్నాయి. టీసీలు కావాలని అడుగుతున్నా ప్రైవేటు యాజమాన్యాలు ఇవ్వడం లేదు. మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అలానే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. రాజన్న బడిబాట, అమ్మ ఒడి పథకం వంటివి నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే రూ.15వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలు ఈ విధంగా టీసీలు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రదక్షిణలు చేయిస్తున్నాయి. వెయ్యి రూపాయలు ఇస్తేనే టీసీ ఇస్తామని అంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ సంఘటనలపై విద్యాశాఖాధికారులు కూడా స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఏఎన్ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!
సాక్షి, చీరాల (ప్రకాశం): ఓ ఏఎన్ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. జ్వరానికి వాడాల్సిన టాబ్లెట్లు కాకుండా షుగర్వ్యాధికి వాడే మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకున్నారు. కొద్ది సమయం మించితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం చీరాల మండలం విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర్ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి.బాబు, తేళ్ల బాబు, తేళ్ల పాప, రేణుమళ్ల పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీవీ వ్యాక్సిన్లు (పోలియో రాకుండా రోటావైరస్, పెంటాలెవల్) ఇంజెక్షన్లు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి వేశారు. ఈ వ్యాక్సిన్లు వేసినప్పుడు సహజంగా చిన్నారులకు జ్వరం వస్తుంది. జ్వరం తగ్గేందుకు ప్రతి చిన్నారికి పారాసెట్మాల్ టాబ్లెట్ ఇవ్వాలి. ఏఎన్ఎం అజాగ్రత్తతో జ్వరం తగ్గేందుకు ఇచ్చే బిళ్లలు (టాబ్లెట్)లకు బదులు మెట్ఫార్విన్ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏఎన్ఎం అందించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవి మింగించారు. నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్థతతకు గురి కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏఎన్ఎంను కలిశారు. పొరపాటున జ్వరం బిళ్లలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు శిశువులు నిద్రలోకి వెళ్తే చేతికి అందేవారు కారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేట్ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు చిన్నారులకు హుటాహుటిన ప్రథమ చికిత్సతో పాటు పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్లలు బయటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఇటు వైద్యశాఖ అధికారులు ఉపశమనం పొందారు. రెండు గంటల ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడం అందరిని కలచివేసింది. ఏఎన్ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్న పిల్లల వైద్య సేవలపై నిర్లక్ష్య ధోరణితో వ్యహరించడంతో ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని శిశువుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు శిశువులను పరామర్శించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 45 రోజులున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి తెలిపారు. ఏఎన్ఎంపై చర్యలు చిన్నారులకు వ్యాక్సిన్లు వేసి జ్వరం టాబ్లెట్లకు బదులు షుగర్ టాబెట్లు ఇచ్చిన ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చార్జి మెమో ఇచ్చాం. సంఘటనను డీఎం అండ్ హెచ్‌వోకు వివరించా. జిల్లా ఉన్నతాధికారులు ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటారు. - శ్రీదేవి, పీహెచ్సీ వైద్యురాలు -
ఏ అభ్యర్థికి ఓటేశారో మీట నొక్కండి!
ప్రకాశం, చీరాల టౌన్: ‘మీ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి మీరు ఓటు వేశారు. టీడీపీ అభ్యర్థికి అయితే 1 నొక్కండి.. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి అయితే 2 నొక్కండి’ అంటూ టీడీపీ ప్రభుత్వం పేరుతో ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు ఫోన్ సర్వేలు చేస్తూ ఓటర్ల నుంచి ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నారు. వివరాలు.. చీరాల నియోజకవర్గంలోని ఓటర్లకు 0866 7123668 నంబర్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఓటర్లుకు ఫోన్లు చేసి మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు? మీ అభిప్రాయాలను తెలపండని ప్రశ్నిస్తున్నారు. మీరు టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే 1 నొక్కండి..వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఓటేస్తే 2 నొక్కండి..బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే 3 నొక్కండి.. ఇతరులకు ఓటు వేస్తే 4 నొక్కండి..అంటూ ఓటర్లు నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు. సగటున 10 మందిలో 8 మందికి ఈ నంబర్ ద్వారా ఫోన్లు వస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే అక్కసుతో టీడీపీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోందని ఓటర్లు పేర్కొంటున్నారు. ఓటర్లు మాత్రం తమ అభిప్రాయాలను చెప్పాలా.. వద్దా.. అనే సంశయంలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే సర్వేలు ఏంటని కొందరు..తమ పార్టీకి ఓట్లు వేశారో లేదో తెలుసుకోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీరాల పట్టణం, రూరల్ గ్రామాల్లో ఎక్కడ చూసినా పలు కూడళ్లు, హోటళ్లల్లో ఇవే తరహా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల ఆంతర్యం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
చీరాలలో టీడీపీ నేతల రిగ్గింగ్..
సాక్షి, చీరాల (ప్రకాశం): తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమి భయంతో చీరాలలో అడ్డదారులు తొక్కారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం అనుచరులు రూరల్ గ్రామాల్లో అరాచకాలకు పూనుకున్నారు. సీసీ కెమేరాల సాక్షిగా పోలీసుల కళ్లముందే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారు. దేవినూతల, పిట్టువారిపాలెం, తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓటర్ల స్లిప్పులు లాక్కుని వారే వెళ్లి ఓట్లు వేసుకుని రిగ్గింగ్ చేశారు. వైఎస్సార్ సీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కనీసం స్పందించకుండా అధికార పార్టీ నేతలకే వత్తాసు పలికారు. అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలను, బలరాం అనుచరులను ఒక్కమాట కూడా అనలేదు. పోలింగ్ మొదలైన రెండు గంటలకే పిట్టువారిపాలెంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్‌ను టీడీపీ కార్యకర్తలు బయటకు వెళ్లిపోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అధికారుల ముందే రాయి తీసుకుని కొట్టి బయటకు తీసుకువచ్చారు. తాను ఏజెంట్‌ను అని చెప్పినా వినకుండా మాకే ఎదురొస్తావా అంటూ ఇష్టారాజ్యంగా కొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తలకు టీడీపీ నాయకులు వేసిన రాయి తగిలి రక్తగాయమైంది. సంఘటన స్థలానికి డీఎస్పీ యు.నాగరాజు, ఇద్దరు ట్రైనీ ఎస్పీలు, సిబ్బంది రావడంతో టీడీపీ నాయకులు పరారయ్యారు. దేవినూతలలో రిగ్గింగ్... దేవినూతలలోని పోలింగ్ బూత్‌లో ఒకే ఒక్క కానిస్టేబుల్ ఉండటంతో అక్కడ టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌ను కొట్టి బయటకు పంపి పోలింగ్ కేంద్రాన్ని మూసివేసి ఓటర్ల వద్ద స్లిప్పులు లాక్కుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై దాడికి దిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా అక్కడకు వెళ్లకపోవడంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజల ఓటర్ల స్లిప్పులను టీడీపీ నాయకులు లాక్కుని ఓట్లు వేశారంటే టీడీపీ నేతలు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. గవినివారిపాలెంలో కూడా పోలింగ్ బూత్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ అధికారిపై దాడికి యత్నం... చీరాల పట్టణంలోని 29వ వార్డులో గల హరిప్రసాద్‌నగర్‌లో 84వ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు ఏజెంట్లపై దాడికి యత్నించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలి విన్నపం మేరకు ఆమె సూచించిన పార్టీ అభ్యర్థికి పోలింగ్ అధికారి ఓటు వేయించారు. అయితే, ఆ అధికారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించారంటూ దాడికి యత్నించారు. ఈ ఘటనపై టీడీపీ అభ్యర్థి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, అతని అనుచరులు హరిప్రసాద్‌నగర్‌లో హల్చల్ చేశారు . -
చంద్రబాబు వెనక డోర్ నుంచి పారిపోతాడా?
-
బాబు వెనక డోర్ నుంచి పారిపోతాడా? : ఆమంచి
సాక్షి, చీరాల : తనను ఓడించడానికి చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా.. తన గెలుపు ఖాయమని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అసెంబ్లీలో అడుగుపెడితే చంద్రబాబు వెనక డోర్ నుంచి పారిపోతాడా? అని ప్రశ్నించారు. చీరాలలో గానీ, రాష్ట్రంలో గానీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయన్నారు. వైఎస్ జగన్ కనీసం 125 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. టీడీపీ... పోలీసులను వెంటబెట్టుకుని మేకవన్నెపులిలా.. కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసిందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని అన్నారు. తాను అసెంబ్లీలోకి రాకూడదని అనుకోవాల్సింది చంద్రబాబు కాదని.. ఇక్కడి ప్రజలు అనుకోవాలన్నారు. తనను అసెంబ్లీకి పంపాలా వద్దా అని ఇక్కడి ప్రజలు నిర్ణయించాలని అన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని, ఏజెంట్లు పెట్టుకుని ఎన్నికలను జరిపిస్తే కాదని.. తనకెంత మెజార్టీ వస్తుందో చూడండని ఆమంచి సవాల్ విసిరారు. ఆరు గంటలకే అధికారికంగా పోలింగ్ సమయం ముగిసినా.. ఈవీఎంలు మొరాయించడం, ఎండ తీవ్రత ఉండటంతో.. ఇంకా ఓటర్లు క్యూలో బారులు తీరారని.. పోలింగ్ రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు జరగొచ్చని అన్నారు. అధికారాన్ని వైఎస్ జగన్ చేతికిస్తేనే ధర్మంగా ఉంటుందని.. చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని ఓటర్లు నిశ్చయించుకున్నారని అన్నారు. -
క్వార్టర్ పట్టు.. ఓటు కొట్టు!
సాక్షి, చీరాల టౌన్ (ప్రకాశం): మీ ఓట్లు మాకే వేయండి.. మీ సంక్షేమంతో పాటు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం..అంటూ టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఉదయం పూట గ్రామాలు, వార్డుల్లో మంతనాలు చేయించడంతో పాటు రాత్రి వేళల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఓటర్లను తాగుబోతులుగా తయారుచేసేందుకు తమ నాయకులతో కలిసి రాత్రి వేళల్లో ఇంటికో క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని డిమాండ్ చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని 33 వార్డులు, 24 గ్రామ పంచాయతీల్లోని ఓటర్లను ప్రలోభాలకు టీడీపీ నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపి మద్యం పంపకాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని వార్డుకు ముగ్గురు టీడీపీ ఇన్చార్జులను నియమించుకుని పగలు ఓటర్లతో మంతనాలు చేసుకుంటూ రాత్రి వేళల్లో మాత్రం పంపకాలకు తెరలేపుతున్నారు. ఇంటికి ఒక క్వార్టర్ పంపకాలు చేస్తున్నారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతకు ఓట్లు కొనవచ్చు, ఏ విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకోవాలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు గ్రామాలు, వార్డుల్లో ఇంటికి ఒక క్వార్టర్‌ను రాత్రివేళల్లో పంపకాలు చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని వార్డు స్థాయి టీడీపీ నేతలు ఓటర్లకు వల విసురుతున్నారంటే ఏవిధంగా ప్రలోభాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటుకు అమ్ముడు పోవాలా? చీరాల టౌన్: సార్వత్రిక ఎన్నికల ప్రచార జాతర ముగియక ముందే నియోజకవర్గంలో నోట్ల జాతర మొదలైంది. సార్వత్రిక పోరులో పోటీ నెలకొని ఉండటంతో నేతలు నోట్లు పంపిణీ చేస్తుండటంతో ఓటర్ల జేబులు కళకళలాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్కో ఓటు రూ. 2000 పైగా పలుకుతోంది. పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో, రూరల్ గ్రామాల్లో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బుల పంపిణీలో నిమగ్నమయ్యారు. ప్రచారాల ముగింపునకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో ఓ వైపు ప్రచారాలు చేస్తూనే మరో వైపు ఓటర్లకు నోట్లు పంపిణీలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ఓటుకు రూ.2,500 నుంచి రూ.3000 చొప్పున పంపిణీ జరిగింది. మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు, రూరల్ గ్రామాల్లో ఓటుకు నోటు పంపిణీతో హోరెత్తింది. రాత్రి వేళల్లో పొలీసుల హడావుడి ఉంటుందేమోనని ఈ సారి మాత్రం పట్టపగలే ఓటుకు నోట్లు పంచారు. వార్డుకు నాలుగు బృందాలు వెళ్లి నోట్లు పంపిణీ తంతు పూర్తిచేశారు. అయితే ఓటరు మాత్రం ఎవరికి ఓటు వేస్తారో చూడాల్సిందే. అలాగే టీడీపీ నేతలు ఇంటికో క్వార్టర్ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి నామినేషన్లు, ప్రచారాలకు కావాల్సిన అద్దె కార్యకర్తలకు నోటు, క్వార్టర్ మద్యాన్ని పంచారు. -
పోలీసులా.. టీడీపీ ఏజెంట్లా..?
సాక్షి, చీరాల రూరల్ (ప్రకాశం): చీరాలలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీకి చెంఇన చిన్న పిల్లలు, ఆడవారిని పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారు. పైపెచ్చు నాయకులను మీ ఇంట్లో ఓటర్ స్లిప్పులు, డబ్బులు దొరికాయంటూ పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి అననుకూలంగా వ్యవహరించనని చెప్పే వరకూ వారిని పోలీసుస్టేషన్లోనే ఉంచుతున్నారు. చీరాల, చీరాల రూరల్, వేటపాలెం పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసులు ముందగానే బైండోవర్లు నమోదు చేస్తున్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో గొడవలు పడిన వారిని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సంఘ పెద్దలుగా చెలామణి అవుతున్న వారిని, వార్డు కౌన్సిలర్లు, గతంలో కౌన్సిలర్లుగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లను ఎన్నికల ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు స్టేషన్లకు తరలించి సెక్షన్ 107 కింద తహసీల్దార్ల ఎదుట హాజరు పరచి బైండోవర్ చేసుకున్నారు. అంతేగాక ఆయా స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లుగా నమోదైన వారిని, సస్పెక్టు షీటులు ఉన్న వారిని, అనుమానితులును కూడా పోలీసుస్టేషన్లకు తరలించి బైండోవర్ చేశారు. కేసుల నమోదుకు టార్గెట్లా? చీరాల ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 33 మున్సిపల్ వార్డులున్నాయి. వాటిలో సగం భాగం ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఉండగా మరో సగ భాగం వార్డులు టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నాయి. పోలీసుస్టేషన్ల వారీగా తీసుకుంటే ప్రతి పోలీసుస్టేషన్లో ఒక్కో పోలీసు కానిస్టేబుల్‌కు ఆయా ప్రాంతానికి చెందిన కొంతమందిని టార్గెట్‌గా ఇచ్చి వారితో కచ్చితంగా బైండోవర్ చేయించారు. ఎవరైనా తాను సంఘ పెద్దను మాత్రమేనని, ఎలక్షన్‌తో తనకు సంబంధం లేదని గట్టిగా అడిగితే నీవు ఎలక్షన్లో ఓటు కూడా వేసే పనిలేదంటూ పోలీసులు బెదిరిపుంలకు దిగుతున్నారు. ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సెక్షన్ 107 కింద 24 కేసులు నమోదు చేసి 270 మంది నేతలను బైండోవర్ చేశారు. సెక్షన్ 110 కింద 22 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఇక టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో సెక్షన్ 107 కింద 49 కేసులు నమోదు చేసి 344 మందిని బైండోవర్ చేశారు. 40 మందికిపైగా రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో సెక్షన్ 107 కింద 26 కేసులు నమోదు చేసి 473 మందిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. 23 మంది రౌడీషటర్లను కూడా బైండోవర్ చేసుకున్నారు. వేటపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో కూడా అంతే మొత్తంలో బైండోవర్లు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల రాత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ గుంటూరు జిల్లాకు చెందిన జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వరదరాజులను నిచారణ అధికారిగా నియమించింది. రెండు రోజుల క్రితం ఆయన చీరాల చేరుకుని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి టీడీపీ నాయకులు, పోలీసులు చేస్తున్న అరాచకాలను తెలిపే విధంగా పూర్తి సమాచారాన్ని డాక్యుమెంట్లు, సీడీల రూపంలో ఆయనకు అందించినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ నాయకులే టార్గెట్ బైండోవర్లు చేయడంలో కూడా పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు చెప్పిన పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో కొంచెం ఉత్సాహంగా పనిచేస్తున్న నేతలపైకి టీడీపీ నాయకులు పోలీసులను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇళ్ల వద్ద నిద్రిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆయా ప్రాంతాలకు చెందిన నేతల ఇళ్ల వద్దకు చేరుకుని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టి సహజంగా ప్రతి వారి వద్ద ఓటర్ల జాబితా ఉంటుంది. ఓటర్ల జాబితా ఉన్న వారిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. వైఎస్సార్‌లో ఎక్కువగా పని చేస్తున్నావని, టీడీపీలో పనిచేస్తే మంచిదని పరోక్షంగా ఖాకీలు సలహా ఇస్తున్నారు. లేకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. చోటామోటా నేతలు చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో ఎవరికి వారు భయపడుతున్నారు. పైపెచ్చు ఆయా నేతలతో తెల్లకాగితంపై సంతకాలు పెట్టించుకుని ఉదయాన్నే వదిలే స్తున్నారు. వారు బతుకు జీవుడా అంటూ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల 30వ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడిని పోలీసులు అర్ధరాత్రి సమయంలో స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో బెదిరింపులకు దిగారు. నీపై ఇప్పటికే కొన్ని కేసులున్నాయని, మరో రెండు కేసులు తగిలించి రౌడీషీటు కూడా తెరిచే ఆలోచన ఉందని, సక్రమంగా ఉంటే మంచిదంటూ హెచ్చరించి వదిలేశారు. 9వ వార్డుకు చెందిన మరో వైఎస్సార్ సీపీ నాయకుడిని కూడా పోలీసులు ఇదే తరహాలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి స్టేషన్‌కు తరలించారు. నీవు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నావని, ఇలాగే పనిచేస్తే కేసులు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉంటే వదిలేస్తామని, లేకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తీవ్ర బెదిరింపులకు దిగారు. తెల్ల కాగితంపై సంతకాలు తీసుకుని ఉదయాన్నే వదిలేశారు. ఇలా ప్రతి వార్డులో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను పోలీసులు టార్గెట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలించి తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఇంకా ఎంతమంది వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు స్టేషన్లకు తరలించి వేధింపులకు గురిచేస్తారోనని నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. -
చీరాల్లో వలస నేతలు.!
సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రస్తుతం చీరాల టీడీపీ నేతలు వలస నేతలతో నిండిపోయింది. పదుల సంఖ్యలో వాహనాల్లో వలస నేతలు హల్చల్ చేస్తున్నారు. ఎక్కడి వారో, ఊరివారో తెలియదు కాని చీరాల నియోజకవర్గాన్ని వలస నేతలు తిప్పేస్తున్నారు. ఒంగోలు, అద్దంకితో పాటు కొందరు హైదరాబాద్ నుంచి కూడా దిగుమతి అయ్యారు. పట్టణంలోని 33 మున్సిపల్ వార్డులతో పాటు నియోజకవర్గంలోని 24 గ్రామ పంచాయతీలకు వలస నాయకులనే ఇన్చార్జులుగా నియమించారు. కార్యకర్తలకు అవసరమైన రోజువారీ ఖర్చులు, ఓటర్ల జాబితాలు పట్టుకుని వార్డు, గ్రామం ఇన్‌చార్జులమని స్థానిక టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీన్ని ఎప్పటి నుంచే టీడీపీని అంటిపట్టుకున్న టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిసారీ అన్నీతామై చూసుకునే మేము ఈ ఎన్నికల్లో మాత్రం వలస నేతలు చెప్పిందే చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. టీడీపీ చీరాల అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరణం బలరాంను చీరాల అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన వెంటనే అద్దంకి నుంచి రాజకీయాలు నిర్వహిస్తున్న బలరాంను ఆగమేఘాల మీద చీరాలకు పంపించారు. అప్పటి వరకు చీరాల టీడీపీలో బీసీ నినాదం నడుస్తోంది. పలువురు బీసీ నేతలు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బీసీ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన బలరాంనే చీరాలకు కేటాయించారు. దీంతో వలస నేతల ప్రభావం పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు చీరల్లో నాయకులుగా చలామణి అవుతున్నారు. బలరాం కూడా స్థానిక నేతలతో కాని, గ్రామస్థాయి క్రియాశీలక నేతలతో పరిచయాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణపై స్థానిక నేతలను నమ్ముకోకుండా కేవలం బలరాం తనకున్న ముఖ్యమైన వ్యక్తులందరిని చీరాలకు తీసుకువచ్చి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. వారినే గ్రామాలకు, వార్డులకు ఇన్చార్జులుగా నియమించుకుని పార్టీ కార్యకలాపాలను చేయిస్తున్నారు. ఎన్నికల్లో కార్యకర్తలతో మాట్లాడంతో, డబ్బుల పంపకాలు, ప్రచార వ్యవహారాలను వారే నిర్వహిస్తుండటంతో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్థానిక నేతలు నొచ్చుకుంటున్నారు. ఇన్నేళ్లుగా టీడీపీ కోసం పనిచేసిన తమను కాదని బయటి ఊర్ల నుంచి వచ్చిన వలస నేతలను తమపై పెత్తనం చెలాయించేలా చేయడం ఏటని బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. -
‘కమీషన్ల కోసమే పోలవరం అంచనాలు పెంచేశారు’
సాక్షి, ప్రకాశం : ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైఎస్సార్ పాలన చూస్తే తెలుస్తుందని, ఎలా ఉండకూడదో చంద్రబాబు పాలన చూస్తే తెలుస్తుందని కేవలం కమీషన్ల కోసమే పోలవరం అంచనాలు పెంచేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య పథకాలను నిర్వీర్యం చేశారని పేదవాడు వైద్యం కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లాలా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అమరావతిలో భూములు లాక్కుని తన బినామీలకు కేటాయించారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. పప్పుకు మాత్రమే జాబు వచ్చిందన్నారు. లోకేష్‌కు జయంతికి, వర్దంతికి తేడా తెలీదన్నారు. ఒకటి కాదు, రెండు కాదు , మూడు శాఖలకు లోకేష్‌ను మంత్రిని చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు కుమారుడికి మూడు ఉద్యోగాలు ఇవ్వొచ్చు..కానీ సామాన్యులకు మాత్రం ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు అంటూ ఎద్దేవా చేశారు. మన రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన హోదాను అడ్డుకున్నారని అన్నారు. హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు హోదా అన్నారు.. తర్వాత ప్యాకేజీ అన్నారని మళ్లీ ఇప్పుడు హోదా అంటున్నారని విమర్శించారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెంటుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తని చంద్రబాబు అంటున్నారని అన్నారు. చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషమని దుయ్యబట్టారు. చంద్రబాబు వేషాలు చూసి.. ఊసరవెళ్లి కూడా పారిపోతుందన్నారు. జగనన్న పోరాటాలతోనే హోదా అంశం సజీవంగా ఉందన్నారు. హోదా కోసం జగన్ ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో యువభేరీలు పెట్టి యువతను జాగృతం చేశారని అన్నారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, వైఎస్సార్ ఎంపీలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. -
‘కమీషన్ల కోసమే పోలవరం అంచనాలు పెంచేశారు’
-
ఆమంచి కోసం సోదరి విస్తృత ప్రచారం
సాక్షి, చీరాలటౌన్: ‘మీ ఇంటి ఆడపడుచులాగా అందరికి అందుబాటులో ఉంటా.. నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..సమస్యలను పరిష్కరిస్తాం..ఆదరించండి’ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గెలుపుకోసం ఆమంచి సోదరి కంకట పద్మావతి విస్త్రృతంగా ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో మంచిని గెలిపించాలని కోరుతూ బుధవారం మండలంలోని దేవాంగపురి గ్రామంలోని పలు కాలనీల్లో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ప్రతి గృహాన్ని సందర్శించి పార్టీ బలపరిచిన అభ్యర్థి, తనసోదుడు కృష్ణమోహన్‌ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ఓటర్లంతా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ సీపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆమంచిని గెలిపించండి వేటపాలెం: చీరాల శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఓటు వేయాలంటూ కుటుంబ సభ్యులు బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని రామన్నపేట పంచాయతీలో కొత్తిళ్ళు, రామన్నపేటల్లో ఆమంచి కృష్ణమోహన్ సతీమణి సుజాత, వేటపాలెం గ్రామంలో గొల్లపూడివారి వీధి, ఆణుమల్లిపేట తదితర ప్రాంతాల్లో కృష్ణమోహన్ వదిన రాజ్యలక్ష్మి, దేవాంగపురి ప్రాంతంలో సోదరి పద్మ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి, మాజీ ఎంపీటీసీ పిచ్చుక సునీత, బాపట్ల పార్లమెంట్ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బీరక సురేష్, నేతలు గుమ్మడి సుశీల, బి. కోటేశ్వరరావు, కొలుకుల వెంకటేష్, బండ్ల బాబు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ టి. సమృద్ధి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.