ఆమంచి వర్గీయులపై రాళ్లదాడి | TDP Activists Pelted Stones On Amanchi Krishna Mohan Supporters | Sakshi
Sakshi News home page

ఆమంచి వర్గీయులపై రాళ్లదాడి

Published Tue, Feb 19 2019 4:04 PM | Last Updated on Tue, Feb 19 2019 5:42 PM

TDP Activists Pelted Stones On Amanchi Krishna Mohan Supporters - Sakshi

సాక్షి, ఒంగోలు : రోజుకొక ముఖ్య నేత పార్టీని వీడుతుండడంతో టీడీపీ అతలాకుతలమవుతోంది. పార్టీని వదిలి వెళ్లే వారిని ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార మదంతో టీడీపీ వర్గాలు దాడులకు దిగుతున్నాయి. టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. గ్రామ సభలో పాల్గొందుకు వెళ్లిన ఆమంచి అనుచరులపై రాళ్ల దాడి చేశారు.  గ్రామ సభకు ఎందుకొచ్చారంటూ దూషించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. (సొంత కులానికే చంద్రబాబు సేవ)

ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీకి దగ్గరగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్‌ వైఎస్సార్‌సీపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారంతో చంద్రబాబు హైరానా పడుతున్నారు. 

(చదవండి : రేపెవరో!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement