Amanchi Krishna Mohan
-
రైతుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ పర్యటన: ఆమంచి
సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ఐదేళ్లకు రూ. కోటి ఇస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లకే రూ. 30 కోట్లు ఇచ్చిందన్నారు. శవాలపై పేలాలు ఏరుకున్నట్లు చంద్రబాబు రైతులను పరామర్శించారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయ పర్యటన చేశారని ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఇదీ చదవండి: తప్పుడు కథనాలతో రామోజీ శునకానందం: మంత్రి అంబటి -
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత ఆమంచి ఫైర్
-
మీ ఇద్దరికీ కలిపి చెప్తున్నా..ఆమంచి స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్, పురందేశ్వరికి ఆమంచి స్ట్రాంగ్ కౌంటర్
-
‘వాళ్లంతా వ్యతిరేకం.. అది పవన్ మాటల్లోనే అర్థమయ్యింది’
సాక్షి, గుంటూరు: పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకు ఆయన కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారని, అది పవన్ మాటల్లోనే అర్థమయ్యిందని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీతో పొత్తు వలన కాపులకు కలిగే ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ ప్రయోజనం కోసమే పవన్ పార్టీ పెట్టారని, జనసేన పార్టీ పెట్టి కాపు కులాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దని ఆమంచి అన్నారు. కరోనా వల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తినా సంక్షేమం అందించాం. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. వాలంటీర్ల వ్యవస్థతో పారదర్శకంగా పథకాలను అందిస్తున్నాం. వైసీపీకి భావజాలం లేదనటం సబబు కాదు, ఆ పదాలను పవన్ విత్ డ్రా చేసుకోవాలి. పురందేశ్వరి పూటకో పార్టీ మారుతూ విమర్శలు చేస్తుంటారు. కాంగ్రెస్‌లో ఉంటూ చంద్రబాబును విమర్శించారు. ఇప్పుడు బీజేపీలో ఉంటూ వైసీపీని విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనతో బేరీజు వేస్తూ జగన్ పాలన గురించి మాట్లాడితే బాగుంటుందని ఆమంచి కృష్ణమోహన్ హితవు పలికారు. ‘‘చంద్రబాబుతో మీ బంధుత్వాన్ని రాజకీయాలకు వాడొద్దు. ఇది అసహజమైన పరిణామం. చంద్రబాబుపై కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. పవన్ ఏనాడూ గెలిచింది లేదు. అలాంటి వ్యక్తి జగన్‌ని విమర్శించటం దారుణం. చంద్రబాబు ఎలాంటి యాత్రలు చేసినా ఎదుర్కోవటానికి మేము సిద్దమే. మా బస్సుయాత్రలకు జనం స్పందన బాగుంది’’ అని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
టీడీపీ బోగస్ ఓట్లపై ఏపీ సీఈవోకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ బోగస్ ఓట్ల వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఆమంచి కృష్ణమోహన్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఏపీ సీఈవోను కలిసిన ఆమంచి.. పర్చూరులో టీడీపీ నేతలు చేర్చిన 40వేల బోగస్ ఓట్లను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో.. దొంగఓట్లు చేర్చిన ఏలూరు సాంబశివరావు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్చూరు వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. 1000మంది ఉన్న జనాభా రేషియోకు సుమారుగా 600మంది ఓటర్లు ఉండాలి. 2014 ఎన్నికల సమయంలో 20,801 ఓట్లు కొత్తగా అక్రమంగా చేరాయి. ఎలక్టరోల్ టు పాపులేషన్ రేషియో గణనీయంగా 760కి పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. బోగస్ ఓట్లు భారీగా పెరిగినట్టు 2014లో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ కేసును నీరుగార్చారు. 2014లో పెట్టిన ఆ కేసు ఇప్పటికే తేలలేదు. అందుకే ఇప్పుడు ఆ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయమని ఈసీని కోరాం. పర్చూరులో బాగా చదువుకున్నవారు ఎక్కువమంది ఉన్నారు. 128మంది ఎన్నారైలు 6A ద్వారా ఇక్కడ ఓటు హక్కు కొనసాగిస్తున్నారు. వాళ్ళ బంధువుల ద్వారా దొంగఓట్లు వేస్తున్నారు. కారంచేడులో పక్క ఊర్లు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు 142 ఉన్నాయి. భారతదేశంలో ఏ పౌరుడికైన ఓటు ఒక్క చోటే హక్కు ఉండాలి. పెళ్ళైన మహిళల ఓట్లను ఇంకా అక్కడే ఉంచుతున్నారు. కర్ణాటక జిల్లా రాయచూరులో స్థిరపడి అక్కడ ఓట్లు ఉన్నవారికి పర్చూరులో ఓట్లు ఉన్నాయి. వేరే ఊర్లలో ఉంటూ పర్చూరులో బోగస్ ఓట్లు నమోదు చేసుకున్నారు. ఎలక్షన్ టైంకి బస్సులు, కారుల్లో వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. 2014, 2019లో మొత్తం 40వేల దొంగఓట్లు చేర్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను సొంతంగా పెట్టుకుని దొంగ ఓట్లను కొనసాగిస్తున్నారు. వీఆర్వోల ద్వారా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్తున్నాయి. పూర్తి ఆధారాలు ఈసీకి సమర్పించాను. 2014, 19లో దొంగ ఓట్లు చేర్చిన టీడీపీ నేతలతోపాటు వీఆర్వో, ఎమ్మార్వో, డేటాఎంట్రీ ఆపరేటర్లపై కేసులు నమోదు చేయాలి. చట్ట ప్రకారం శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ కోరాం అని ఆమంచి తెలియజేశారు. -
ఆమంచికి సీఎం పరామర్శ
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ను సీఎం వైఎస్ జగన్ బుధవారం ఫోన్లో పరామర్శించారు. సోమ వారం రాత్రి ఆమంచికి చెందిన ఆక్వా నర్సరీ లో వాకింగ్ చేస్తుండగా కట్లపాము కాటేసింది. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణా పాయం నుంచి కాపాడారు. వైద్యుల సూచన లతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి ఆమంచిని తరలించగా మంగళవారం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. -
పాముకాటుకు గురైన ఆమంచి..
-
వెంకటగిరి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
-
రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (పచ్చమీడియా పైత్యపురాతలు.. గంటల కొద్దీ ఆలస్యానికి ముందే ప్రణాళికలు) -
కిరణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమంచి
సాక్షి, ప్రకాశం: మాస్క్ వివాదంలో ప్రాణాలు విడిచిన యువకుడు కిరణ్ మృతదేహానికి చీరాల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత నివాళర్పించారు. యువకుడి అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కిరణ్ మృతిపై విచారణ చేస్తామని అడిషనల్ ఎస్పీ గంగాధర్ తెలిపారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు దాడి చేయడం వల్లనే ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తుండగా, మాస్కు ఎందుకు వేసుకోలేదని అడిగినందుకు తమతో వాగ్వాదానికి దిగాడని, అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు తీసుకెళ్తుండగా పోలీస్ జీపు నుంచి కిందకు దూకాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేయించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతి చెందిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
‘చంద్రబాబు మద్దతు తెలపడం హాస్యాస్పదం’
సాక్షి, చీరాల: కరోనా కష్టకాలంలో ప్రాణ భయంతో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు నాయుడు, రాజధాని పేరుతో తన సామాజిక వర్గం చేస్తున్న 200 రోజుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు తెలపడం హాస్యాస్పదం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు విదేశాల్లో ఉన్న తన సామాజిక వర్గంతో అమరావతిలో దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 300 కోట్ల రూపాయలతో చంద్రబాబు విదేశాల్లో జల్సాలు చేశారని విమర్శించారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజధాని వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం అని ఆమంచి పేర్కొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమిస్తోంది: కిలివేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి చంద్రబాబు మతి భ్రమిస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిని గ్రాఫిక్స్ లో చూపెట్టి భ్రమరావతి చేసిన చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 108, 104ల వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒకేసారి 1088 అంబులెన్స్ వాహనాలను సీఎం జగన్ ప్రవేశపెడితే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు తాపత్రాయం : దాడిశెట్టి చంద్రబాబు నాయుడు అమరావతి లో ఉన్న తన భూముల కోసం తాప్రతాయ పడుతున్నడు తప్పా, ప్రజల అభివృద్ధి కోసం తాపత్రయం పడడం లేదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాష్ట్ర బాగోగుల కంటే అమరావతిలో ఉన్న 30 గ్రామాల రియల్ ఎస్టేట్ బాగోగులే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటిస్తే దానికి మోకాలడ్డుతూ చంద్రబాబు కోర్టుఓల కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. -
కాపులకు బాబు ద్రోహంపై నోరెత్తలేదేం?
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బాణీలకు అనుగుణంగా నాట్యం చేస్తూ స్క్రిప్ట్ ప్రకారం వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. ఆదివారం వారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పవన్‌కు కనీస పరిజ్ఞానం లేదు.. ► కాపుల సంక్షేమంపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని పవన్ పేర్కొనటం విడ్డూరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపుల సంక్షేమానికి రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది. కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలతో లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమచేసింది. దీనిపై పవన్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదు. మాటకు కట్టుబడి... ► టీడీపీ ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి కాపుల కోసం ఖర్చు చేసింది రూ.1,874 కోట్లు మాత్రమే. చంద్రబాబు తొలి ఏడాది పాలనలో కాపులకు కేటాయించింది సున్నా. పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు నోరెత్తలేదు? చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం 2,54,335 మంది లబ్ధి పొందితే సీఎం జగన్ ఏడాదిలోనే కాపు కార్పొరేషన్ ద్వారా 22,89,319 మందికి లబ్ధి చేకూర్చారు. ► ఏటా రూ.2,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామన్న మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,392.43 కోట్లను కాపుల కోసం జగన్ ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.1,377 కోట్లకుపైగా ఖర్చు చేశారు. సాయం లెక్కలు ఇవిగో.. ► వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 2,35,873 మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.354 కోట్లను సీఎం జగన్ ఇటీవలే వారి ఖాతాలకు జమ చేశారు. అమ్మ ఒడి ద్వారా 3,81,185 మందికి రూ.571.78 కోట్లు, జగనన్న విద్యాదీవెన ద్వారా 1,23,257 మంది లబ్ధిదారులకు రూ.367.63 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. జగనన్న వసతి దీవెన కింద 96,739 మందికి రూ.92.93 కోట్లు, వైఎస్సార్ రైతుభరోసా కింద 7,56,107 మందికి రూ.1,497.29 కోట్లు లబ్ధి కలిగింది. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 3,92,646 మందికి రూ.1125.88 కోట్లు, వైఎస్సార్ వాహనమిత్ర కింద 29,957 మందికి రూ.57.07 కోట్లు సాయం చేశారు. జగనన్న చేదోడు (దర్జీలకు) కింద 14,021 మందికి రూ.14.02 కోట్లు, వైఎస్సార్ నేతన్ననేస్తం కింద 2,577 మందికి రూ.6.18 కోట్లు, విదేశీ విద్యాదీవెన కింద 533 మందికి రూ.29.45 కోట్లు, వైఎస్సార్ జగనన్న ఇళ్లపట్టాల కోసం 2,56,424 మందికి రూ. 663.42 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ బహిరంగంగా కళ్లెదుటే కనిపిస్తుంటే శ్వేతపత్రం ఎందుకు? బాబు డ్రామాలతో కాపులు నష్టపోయారు ► కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. సుప్రీం తీర్పు వల్ల 50% మించి రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదని తెలిసీ చంద్రబాబు ఆడిన డ్రామాలతో కాపులు నష్టపోయారు. జగన్ ధైర్యంగా, నిజాయితీగా ఈ విషయంపై మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని కాపు సోదరులు గమనించాలి. బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించటంపై తమ మద్దతు ఉంటుందని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
‘పవన్ కల్యాణ్‌ను కాపులే తరిమికొడతారు’
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కాపు మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.354 కోట్ల సహాయం చేశారని వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో కాపుల కోసం రూ.4769 కోట్ల సంక్షేమం అందించామని గుర్తుచేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే పవన్ కల్యాణ్ వాటిని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సంక్షేమ పథకాలు కాపులకు అమలు చేయలేమని చంద్రబాబు తేల్చిచెప్పారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కొత్త సంక్షేమ పథకాల్లో కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవాలని హితవు పలికారు. (‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’) కాపులపై ప్రేమ ఉంటే 2014 ఎన్డీఏ ఉమ్మడి ప్రణాళికలో రిజర్వేషన్ల అంశం ఎందుకు చేర్చలేదని ఆమంచి సూటిగా ప్రశ్నించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్ కాల్యాణ్ ఎందుకు హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. మంజునాథ కమిటీ పూర్తి నివేదిక రాకుండానే అసెంబ్లీలో చంద్రబాబు చర్చించారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలు కూడా దీన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. కాపుల్లోని ఐక్యతను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను కాపులే తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ తన రాజకీయ గురువు చంద్రబాబును వదిలేస్తేనే కనీసం ఎమ్మెల్యేగానైనా గెలుస్తారని ఆమంచి హితవు పలికారు. -
భవిష్యత్తులో ఇలాంటి తీర్పులు రాకుండా నిరోధించాలి
-
ఆరు నెలల్లో టీడీపీ మూతపడటం ఖాయం
-
ఆరు నెలల్లో టీడీపీ మూతపడుతుంది
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీ రాజకీయాలు చేస్తున్నారని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ నేతలే తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. దీంతో ఆరు నెలల్లో టీడీపీ మూతపడటం ఖాయమని పేర్కొన్నారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డబ్బులిచ్చి, ప్రలోభపెట్టి చేర్చుకున్నారని విమర్శించారు. గతంలో చేరికలకు, ఇప్పటి చేరికలకు చాలా తేడా ఉందన్నారు. అందరి సహకారంతో కలిసి పని చేస్తామని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. -
విద్యావంతుల ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలి
-
చీరాల ఇన్చార్జి ఆమంచే.. స్పష్టం చేసిన బాలినేని
సాక్షి, ఒంగోలు: చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనేనని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక మీదట కూడా ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలన్నీ ఆమంచి నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. ఇందులో ఎటువంటి అపోహలకూ తావు లేదని పునరుద్ఘాటించారు. ఆమంచి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని బాలినేని పిలుపునిచ్చారు. -
రాజీనామా చేస్తే ప్రజల తీర్పు అగౌరపరిచినట్లే..
సాక్షి, తాడేపల్లి : రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని మరో డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. భోగిమంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోలు, బోస్టన్, జీఎన్ రావు కమిటీ రిపోర్టులు కాలబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామీలతో భూములు కొనుగోలు చేయించారని అన్నారు. అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారని, చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్‌లో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా కేసుల కారణంగా హడావుడిగా అమరావతి వచ్చారని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హృదయాలు గెలుచుకున్నారని అన్నారు. ‘చంద్రబాబును, టీడీపీని గత ఎన్నికలలో ప్రజలు బంగాళా ఖాతంలో కలిపేశారు. దోపిడి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. లోకేష్‌ను సైతం ఓడించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలు 151 సీట్లతో వైఎస్ జగన్‌ను గెలిపించారు. మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజలు తీర్పును అగౌరపరిచినట్లే. సీఎం రమేష్, సుజనాచౌదరి బీజేపి కండువాతో టీడీపీ ఎజెండా ఎత్తుకున్నారు. బీజేపిలోకి పంపించిన బినామీలతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికలలోకు వెళ్లాలి. ఆర్థికమూలాలు పోతున్నాయని తెగ బాధపడిపోతున్నారు. అందుకే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. భవిష్యత్తులో చంద్రబాబు ఎంతమంది పోలీసులను వెంటబెట్టుకున్నా.. రాష్ట్రంలో తిరగలేని పరిస్దితిని కొనితెచ్చుకుంటున్నారు. అది స్వయంకృతాపరాధం. అమరావతిని ముంపు ప్రాంతంగా శివరామకృష్ణ కమిటీ తేల్చిచెప్పింది. చెన్నై ఐఐటీ నిపుణులు కూడా అదే చెప్పారు. కొండవీటి వాగుతో అమరావతి మునిగిపోతుందని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను కరిపెట్టారు. సీబీఐకి అనుమతి రాగానే చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నారు. గతంలో ప్రధాని పర్యటన సందర్భంగా టీడీపీ నల్లజెండాలతో నిరసనలు తెలిపింది. రివర్స్ టెండరింగ్అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంపై సరైన అవగాహన లేదు. టీడీపీ నేతలతోనే జేఏసిలు ఏర్పాటు చేసి ఆందోళనలు చేయిస్తున్నారు. -
పవన్.. దిగజారుడు విమర్శలు చేయొద్దు
-
మేకప్ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో
సాక్షి, తాడేపల్లి : ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఉన్నమాట కొంత వాస్తవం. వరదలతోనే ఇసుక కొరత ఏర్పడింది. ఇసుకలో దోపిడీని అరికట్టి నెలరోజుల వ్యవధిలో మంచి పాలసీ తీసుకువద్దామని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇవేమీ పట్టకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్ నానాయాగీ చేస్తున్నారు. మనల్ని ఎవరూ పట్టించుకోరనే పరిస్థితిని కార్మికులకు కల్పించారు. వారిద్దరి మాటలతో భవన నిర్మాణ కార్మికులు నైరాశ్యంలో పడిపోయారు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల తీరుపై విరుచుకుపడ్డారు. లాంగ్ మార్చ్ పేరిట పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పరిష్కార మార్గాలు చూపించలేదు సరికదా... కార్మికుల సమస్యపై ఆయనకు చిత్తశుద్ది లేదనే విషయం స్పష్టం చేసిందన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వరదల ప్రభావం తగ్గిన తర్వాత ప్రతీ వినియోగదారుడికి కూడా ప్రభుత్వం ఇసుక అందిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు నాగావళి ఇసుకను దోచుకున్నప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో తాము లేమని.. పవన్ సినీ హీరో అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రియల్ హీరో అని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్న పవన్... సీఎం జగన్ పాలనను చూసి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మేకప్ రాసుకుంటే హీరో.. తీసేస్తే జీరో.. ‘మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి గురించి పవన్ విమర్శలు సరికావు. ఆఫ్ ది రికార్డ్ ఎవరు మాట్లాడినా అది బహిరంగ వేదికలో చెప్పరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బొత్స మంచి మెజారిటీతో గెలిచారు. ఇంకో విషయం పవన్ కల్యాణ్.. విజయసాయిరెడ్డితో పోల్చుకోవడం సరికాదు. విజయసాయిరెడ్డి భారతదేశంలో పేరెన్నికగన్న ఆడిటర్. పవిత్రమైన వృత్తిలో ఉన్నారు. ఆయనను అనామకుడి కింద మాట్లాడటం దుర్మార్గం. సినిమాలలో ఎంతో వదులుకుని వచ్చానంటావు. ఏంటి నువ్వు వదులుకుని వచ్చింది. నువ్వు ముఖానికి మేకప్ రాసుకుంటే హీరో. మేకప్ తీసేస్తే జీరో. ఏమి త్యాగం చేసుకుని వచ్చావు చెప్పు. మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయద్దు. నీ గెలుపుకోసం భీమవరంలో సూర్యారావు అనే వ్యక్తి డబ్బు పంచారా లేదా? అసలు నువ్వు ఏ సినిమా తీసినా ఆదాయపన్ను లెక్కల్లో చూపించావా? ఈ రోజుల్లో రాజకీయాలలో ఉండేవారు ఏ పరిస్థితులలో జైలుకు వెళ్లివచ్చారో అందరికీ తెలుసు. చిదంబరం ఇప్పుడు జైలులో ఉన్నారు. 50 దేశాలలో అక్రమ సంపాదన ఉందని చిదంబరంపై కోర్టులలో నివేదికలు సమర్పించారు. అదే చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నపుడు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మీద అసత్య ఆరోపణలతో కేసులు పెట్టారు’ అని ఆమంచి పవన్ తీరును విమర్శించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడతారు అనగానే.. ‘రూ. 700 కోట్ల నష్టాలలో ఉన్న హెరిటేజ్ సరిగ్గా ఏడాదికే రూ. 2,500కోట్లు లాభాలలోకి ఎలా వచ్చింది. అది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే ఎలా సాధ్యం. ప్రజల వద్దకు ఎవరు రమ్మంటే వచ్చావు. పవన్ కల్యాణ్ చెప్పే నీతివంతమైన రాజకీయం శుద్ధ అబద్దం. ఇది పవన్ కల్యాణ్ వద్ద ఉన్న వ్యక్తులు చెప్పిన మాట. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బాస్... నేను మీ పార్టీలోకి వస్తానంటే ఎంపీగా టిక్కెట్టు ఇచ్చి అతడికి ప్రచారానికి కూడా వెళ్లవా.. అతనికి ఓటు వేయమని చెప్పవా. నీతో ప్రవర్తనతో ఆయన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పగలరా పవన్? నువ్వు నిజంగా బలపడి ఓ స్థానంలోకి వస్తే మంచిదే. ప్రజాస్వామ్యంలో అందరికి అది మంచిది. నాదెండ్ల మనోహర్ మాట్లాడతారు అనగానే పవన్ అభిమానులందరూ సైలెంట్ అయిపోయారు. నాదెండ్ల మనోహర్ లింగమనేనికి బంధువు. లింగమనేని చంద్రబాబుకు బంధువు. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యాలు కూల్చొద్దంటావా? నాదెండ్ల మనోహర్ స్క్రిప్టు రాసిస్తే లింగమనేని స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని ప్రస్తావిస్తావా అని పవన్ కల్యాణ్ తీరుపై ఆమంచి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం మాదిరి జనసేనను కూడా టీడీపీ శ్రేణులు నాశనం చేస్తున్నారన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. -
నాగార్జునరెడ్డి.. టీడీపీ ఏజెంట్: ఆమంచి
సాక్షి, తాడేపల్లి : నాగార్జునరెడ్డి గురించి చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నాగార్జున రెడ్డిపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నాగార్జున అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదని.. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన, తన కుటుంబం గురించి నాగార్జున ఫేస్బుక్లో తప్పుడు తప్పుడు రాతలు రాశారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులను సైతం లుచ్చా, కొజ్జా అని పేర్కొంటూ రాసిన ఘనత అతడికే చెల్లిందన్నారు. చంద్రబాబు చచ్చిపోయిన విష సర్పం వంటి వాడని... తన చేతిలో మీడియా ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున గురించి తాను చెప్పిన వాస్తవాలు ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయగలవా అని ప్రశ్నించారు. అతడిపై 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి ‘నాగార్జున సూడో నక్సలైట్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు. భార్యను వేధించిన ఘటనలో అతడిపై కేసు నమోదు అయింది. గతంలో మహిళా ఉద్యోగుల గురించి చెప్పరాని భాషలో తప్పుడు కథనాలు రాశాడు. అంతేకాదు ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసు కూడా అతడిపై ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పనిచేసిన నాగార్జున.. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నాడు. నాగార్జునపై మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి’ అని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆ రిపోర్టర్‌ను హత్య చేయించింది మీరు కాదా? ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి వంతమైన పాలన చూసి చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని సీఎం జగన్‌కు అంటగడుతున్నారు. ప్రస్తుతం నాగార్జునరెడ్డిపై దాడి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ టీడీపీ నేత పుల్లారావు అంధ్రప్రభ రిపోర్టర్ శంకరయ్యను హత్య చేయించినపుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు. నిజానికి చంద్రబాబు టీడీపీలో కీలకంగా ఉన్న సమయంలో రంగ హత్య జరిగింది. రంగాను హత్య చేసిన వారికి శిక్ష పడకుండా చంద్రబాబు కాపాడారు. ప్రస్తుతం కుటుంబ తగాదాలకు కూడా చంద్రబాబు రాజకీయ రంగు పులుముతున్నారు. చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకోలేదా.. ఆయన శవం ముందు విక్టరీ సింబల్ చూపించి శవ రాజకీయాలు చేయలేదా’ అని ఆమంచి కృష్ణమోహన్ ప్రశ్నించారు. -
కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చీరాల నుంచి కరణం బలరామ్ ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ (ఈపీ)పై హైకోర్టు స్పందించింది. కరణం బలరామ్‌తోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులిచ్చి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరణం బలరామ్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని, దీనిపై ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని, అందువల్ల బలరామ్ ఎన్నికను రద్దు చేసి తనను ఎన్నిౖకైనట్లు ప్రకటించాలని ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ఇటీవల ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమంచి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..తన నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్లో ప్రస్తావించలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ చేత రిబ్బన్ కట్ చేయించి నూతన కార్యాలయాన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా జై జగన్.. వైఎస్సార్ అమర్హై అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ పతాకాన్ని ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి చేతుల మీదుగా ముఖ్యమంత్రి దగ్గరుండి ఆవిష్కరింపజేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తాడేపల్లి ప్రాంతంలో సందడి నెలకొంది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కత్తిరింపు తరువాత లోనికి ప్రవేశించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తొలుత తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు పార్టీ కార్యాలయంలోని అన్ని విభాగాలను, అక్కడ జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన చాంబర్లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పి.అనిల్‌కుమార్‌యాదవ్, అవంతి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, మల్లాది విష్ణు, కిలారు రోశయ్య, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, జి.దేవేందర్‌రెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అన్ని హంగులతో కొత్త కార్యాలయం వైఎస్సార్సీపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా పని చేసింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో అక్కడి నుంచే కొంతకాలం పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. కొన్నేళ్ల క్రితం విజయవాడ బందరు రోడ్డులో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో అన్ని హంగులతో కేంద్ర కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇకపై పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
గీత దాటి వ్యవహరిస్తున్నారు- ఆమంచి
సాక్షి, ఒంగోలు: పోలీసు శాఖలోని పలువురు స్పెషల్ బ్రాంచి సిబ్బంది తమది కాని వ్యవహారాల్లో సైతం తలదూర్చడంతో పాటు ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్ చాంబర్లో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వడంతో పాటు రాతపూర్వకంగా ఎస్బీ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ బ్రాంచి సిబ్బంది అంటే జిల్లా పోలీసు ఉన్నతాధికారికి కళ్లు, చెవులు, ముక్కు వంటి వారన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో పనిచేస్తున్న వారు గీత దాటి మరీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన వ్యక్తులు నేటికీ ఎస్బీలో కొనసాగుతూ ప్రభుత్వంపై తప్పుడు తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అప్పటి ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ జిల్లాలో అరాచకంగా వ్యవహరించినందునే ఆయన్ను బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన టీడీపీకి తొత్తుగా పనిచేశారని, ప్రభుత్వం మారినా ఇంకా ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన సిబ్బందే ఆ వ్యవస్థలో కొనసాగుతుండటం అభ్యంతరకరమన్నారు. ఇటీవల తిమ్మసముద్రంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేస్తే దాన్ని తప్పుడు పద్ధతిలో ఎస్బీ సిబ్బంది రిపోర్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చీరాల ఏరియా వైద్యశాలలో వైఎస్సార్ సీపీ నాయకులు చికిత్స పొందుతూనే ఉన్నారన్నారు. ఎస్బీ డీఎస్పీ రాంబాబు, సీఐ కె.వెంకటేశ్వరరావు, మరికొంతమంది సిబ్బంది వ్యవహారం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మంత్రి లెటర్ హెడ్లపై దుష్ప్రచారం ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకంతో కూడిన లెటర్ హెడ్లు ఫోర్జరీ అయ్యాయంటూ నానా యాగీ చేసిందీ ఎస్బీ సిబ్బందేనని ఆమంచి గుర్తు చేశారు. ఫోర్జరీ అయితే మంత్రి ఫిర్యాదు చేయాలని, అంతే తప్ప కలర్ జిరాక్స్‌లపై ఫోర్జరీ సంతకాలంటూ దుష్ప్రచారం చేసిన వారిలో ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన బ్రిగేడ్‌లే ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లల్లో సాక్షాత్తు స్పెషల్ బ్రాంచి సిబ్బంది తనిఖీల పేరుతో సృష్టించిన హంగామాపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని ఆమంచి వివరించారు. తాను స్పెషల్ బ్రాంచి వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడం లేదని, అదే విధంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా తప్పు పట్టడం లేదన్నారు. కేవలం కొంతమంది స్పెషల్ బ్రాంచిలో చేస్తున్న కుట్రపూరిత మోసాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని, తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ బాగా పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లడం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న స్టీఫెన్ రవీంద్ర, డీజీపీ గౌతం సవాంగ్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లనున్నట్లు ఆమంచి పేర్కొన్నారు. ఆమంచి వెంట వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, కర్నేటి రవికుమార్, తులసి, మునగపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. -
అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు
సాక్షి, అమరావతి : అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారని, తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే తమ పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ లీడర్లను సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక రిసార్ట్‌లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీని నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. తన సీట్లోనే ఉన్న అచ్చెన్నాయుడిని గొడవ చేస్తున్నారంటూ సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకే మైకు ఇవ్వడంలేదని అందుకే ప్రెస్మీట్లు పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సభలో సీఎం శాసిస్తుంటే స్పీకర్ పాటిస్తున్నారన్నారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని జగన్మోహన్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో, కదిరి బహిరంగ సభలో చెప్పారని.. రాష్ట్రమంతా ఈ విషయాన్ని చెప్పుకుంటూ తిరిగారని చంద్రబాబు తెలిపారు. ఆయన ప్రకటన చూసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆశపడి ఓట్లు వేశారన్నారు. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే, పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి 255 హామీలు ఇచ్చారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 67, ఇంకా అదనంగా ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 592 హామీలు ఇచ్చారన్నారని తెలిపారు. వాటిని నిలబెట్టుకోవాలని అడుగుతున్నామన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే వారికి బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు తగ్గించారో చెప్పాలన్నారు. బీసీ నాయకుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లు పెట్టారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయని, వారి వేధింపులు తట్టుకోలేక ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వేధింపులకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రబాబు చెప్పారు. సలహాలిచ్చేందుకు అవకాశం ఇవ్వడంలేదు అంతకుముందు.. అసెంబ్లీలో మీడియాతో చంద్రబాబు ముచ్చటిస్తూ.. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్పీకర్ కానీ, విప్‌లు కానీ ఎలాంటి ప్రయత్నం చేయట్లేదన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నామని, కానీ సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదన్నారు. -
కొత్త చిక్కుల్లో కరణం!
-
కరణం బండారాన్ని బయట పెట్టిన ఆమంచి
కరణం బలరాం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆయన ఏ పని చేసినా వివాదాస్పదమే.. తాజాగా బలరాం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు.. అందులోంచి ఎలా బయటపడాలో తెలియక విలవిల్లాడుతున్నారు.. ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన వ్యవహారాన్ని ఆమంచి రట్టు చేసేశారు.. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేగా బలరాం ఎన్నిక చెల్లదంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల అఫిడవిట్లో కరణం తన కుమార్తె అంబిక పేరును చూపకుండా దాచి పెట్టారంటూ ఆమంచి వేసిన పిటిషన్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని చీరాల టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.. ఆమంచి ఆధారాలను బయటపెట్టడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం ఆమంచి హైకోర్టులో పిటీషన్ వేసినా.. మంగళవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ బలరాం బండారాన్ని బయట పెట్టారు. ఇంత జరుగుతున్నా ఆ పెద్దాయన మాత్రం నోరు మెదపక పోవడంతో తప్పు చేయడం వల్లే మౌనంగా ఉన్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదని, చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంబిక కృష్ణ అనే కుమార్తె ఉన్నప్పటికీ బలరాం తన నామినేషన్లో ఆమె వివరాలు పొందుపరచలేదని పిటిషన్లో పేర్కొనడంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన ఆమంచి హైకోర్టులో ఎన్నికల పిటీషన్ (ఈపీ) దాఖలు చేయడంతో చీరాల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో గత మూడు రోజులుగా ఇదే చర్చ కొనసాగుతోంది. అంబిక కృష్ణ ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాల్లో తండ్రి పేరు కరణం బలరామకృష్ణమూర్తిగా నమోదైన దృశ్యాలు (సర్కిల్లో) హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడమే కాకుండా ఆమంచి విజయవాడలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలు బయటపెట్టడంతో కరణం వర్గీయులు అంతర్మథనం చెందుతున్నారు. అంబిక తన కుమార్తె కాదని బలరాం అంటే ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉందని ఆమంచి సవాలు చేసినా కరణం బలరాం మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ నోరు మెదప లేదు. చిన్న ఆరోపణ వస్తేనే అంతెత్తు ఎగిరిపడే తమ నాయకుడు మూడు రోజులుగా తీవ్ర ఆరోపణలు వ్యక్తమౌతున్నా మౌనంగా ఉండిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోన చెందుతున్నారు. మౌనం అర్ధాంగీకారమే కదా అనే చర్చా జిల్లాలో కొనసాగుతోంది. ఏదైనా రాజకీయపరమైన వివాదం అయితే పార్టీ తరఫున ఖండించే అవకాశమైనా పార్టీ నేతలకు ఉండేది. వ్యక్తిగతమైన వివాదం కావడంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని జిల్లా టీడీపీ నేతలు సైతం మిన్నకుండిపోతున్నారు. ఆమంచి ఆరోపణలు ఇవీ... ► కరణం బలరాంకు 1985లో ప్రసూన అనే మహిళతో శ్రీశైలంలో వివాహం జరిగింది. ► వీరిరువురికీ అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో జన్మించింది. ► అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. ► అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టిన రోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. ► బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపర్చకుండా దాచిపెట్టారు. ► ఎన్నికల చట్ట నింబంధన ప్రకారం కరణం నామినేషన్ చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. ► బలరాం ఎన్నికను రద్దు చేయాలి.. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి తాను(ఆమంచి) ఎన్నికైనట్లు ప్రకటించాలి. ► తన తండ్రి ఎవరనేది ప్రపంచానికి చెప్పాలని అంబిక కోరిక.. ఆమెకు న్యాయం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నా.. పదవుల కోసం కాదు. ► అంబిక తన కూతురు కాదని బలరాం అంటే కనుక ఫోరెన్సిక్, డీఎన్ఏ వంటి ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉన్నారు. ► కన్న కూతురు పేరు ఎన్నికల అఫిడవిట్లో పెట్టని కఠినమైన వ్యక్తి కరణం బలరాం. -
సంతానంపై ఈసీకి బలరాం తప్పుడు అఫిడవిట్
విజయవాడ సిటీ: పిల్లలు ఎంతమంది అనే విషయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని అనర్హుడిగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల కమిషన్(ఈసీ)ను డిమాండ్ చేశారు. బలరాంకు నాలుగో సంతానంగా అంబికకృష్ణ ఉండగా, తనకు ముగ్గురు బిడ్డలేనంటూ ఈసీకిచ్చిన అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ తాను ఈనెల 4న హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఆమంచి మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బలరాం నాల్గవ సంతానానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. అన్నప్రాసన నుంచి ప్రతి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, సెయింట్ థెరిసా హాస్పటల్లో అంబిక తండ్రిగా బలరాం పేరుతో ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఎంసెట్ హాల్‌టిక్కెట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేయడానికిచ్చిన వినతిపత్రం, ఆధార్కార్డుసహా పలు పత్రాలను మీడియాకు చూపారు. బలరాం తన తండ్రి అని ఒక కుమార్తెగా తెలియజేసేందుకు ఇవి సరిపోతాయని, వీటిని కాదంటే.. డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నానని అంబిక చెప్పిందన్నారు. అతి పిన్నవయసులో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం టీడీపీ ఆంధ్ర, తెలంగాణకు అధికార ప్రతినిధిగా ఉన్న కాట్రగడ్డ ప్రసూనకు, బలరాంకు కుమార్తెగానేగాక ప్రఖ్యాత రాజకీయవేత్త ఎన్జీ రంగాకు దగ్గర బంధువుగా ఆమె అందరికీ తెలుసన్నారు. సామాన్య మహిళగా తన తల్లి, తండ్రి ఎవరనేది ఈ సమాజానికి తెలియజేయడానికి డాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా తన మద్దతు కోరిందన్నారు. తాను బలరాంపై పోటీ చేసి ఓటమి చెందాను కాబట్టి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమంచి చెప్పారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన పత్రాలన్నింటిపై తనతోపాటు అంబిక సైతం సంతకాలు చేశారన్నారు. ఈ విషయమై బలరాం స్పందించడమేగాక చట్టానికి లోబడి రాజీనామా చేయాలని లేదా నైతికంగా సమాధానం చెప్పాలని ఆమంచి డిమాండ్ చేశారు. విలువల గురించి ఊదరగొట్టే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన విషయంపై స్పందించి బలరాంపై ఏం చర్యలు తీసుకుంటారో జవాబు చెప్పాలన్నారు. చంద్రబాబుకు అంబిక బాగా తెలుసన్నారు. ఆమె రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు స్వయంగా ఆవిష్కరించారన్నారు. జన్మనిచ్చిన కుమార్తెను తన కూతురు కాదనే క్రూరమైన మనస్తత్వమున్న వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుంటే చంద్రబాబు సైతం తప్పు చేసిన వారవుతారన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్ సమర్పించారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఈ మేరకు బలరాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బలరాం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. బలరాంకు నలుగురు పిల్లలైతే ఆఫిడవిట్లో ముగ్గురని పేర్కొన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామ’ని తెలిపారు. బలరాం నాలుగో సంతానంకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను, కొన్ని పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. తనను చెల్లిగా భావించి న్యాయం చేయాలని ఆ అమ్మాయి(బలరాం కూతురు) తనను ఆడిగినట్టు ఆమంచి పేర్కొన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టే కోర్టులో పిటిషన్ వేసినట్టు స్పష్టం చేశారు. -
ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు
-
కరణం బలరాం భార్య, కుమార్తె వివరాలు దాచిపెట్టారు..
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకపోతే ఎన్నికను రద్దు చేయొచ్చు ‘కరణం బలరాం సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదు. చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించకపోయినప్పటికీ ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కరణం బలరాం తన నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టారు. భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారు. నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో, ఆధార్ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్ తన పిటిషన్లో వివరించారు. -
చంద్రబాబు వెనక డోర్ నుంచి పారిపోతాడా?
-
నేనింకా నోరు విప్పితే బాబుని జనం రాళ్లతో కొడతారు
చీరాల: టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దుర్మార్గమైన వ్యవహారాలు, అక్రమాల గురించి తాను నిజంగా నోరు విప్పి అన్నీ చెబితే సీఎం చంద్రబాబును రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొడతారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. చంద్రబాబు నిజంగానే కష్టపడ్డారని, కాకపోతే అందులో 95 శాతం తన అనుకూల వర్గానికి రాష్ట్రాన్ని దోచిపెట్టేందుకే కష్టపడ్డారని పేర్కొన్నారు. మంగళవారం వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని తన నివాసం సమీపంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు, పోలింగ్ ఏజెంట్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై తాను కొన్ని విషయాలను బహిర్గతం చేస్తే అవి నిరాధారమైన ఆరోపణలని ఒక్కరు కూడా ఖండించలేకపోయారని ఆమంచి పేర్కొన్నారు. చంద్రబాబు చీరాల వచ్చి ఆమంచిపై నేనే కేసులు పెట్టించానని ప్రకటించడాన్ని చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత నీఛంగా ఉందో ప్రతిఒక్కరు అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే కేసులు పెట్టించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఓడిపోతామని భయపడి టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు చీరాలలో ఎవరూ ముందుకు రాకపోవడంతో బలరాంను తెచ్చి తనపై పోటీకి నిలబెట్టారన్నారు. రైతు కూలీ కొడుక్కి జగన్ ఎంపీ సీటిచ్చారు: నందిగం సురేష్ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ మాట్లాడుతూ.. అనుభవం ఉందని, అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎలాంటి మాయమాటలు చెప్పాడో అందరికీ తెలుసన్నారు. ఆయన కేవలం పోలీసులతోనే పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు చంద్రబాబు పీడ వదిలిపోనుందని, ఇక భవిష్యత్తు జగన్‌దేనని స్పష్టం చేశారు. ఓ రైతు కూలీ కొడుకును ఎంపీ చేయాలనే గొప్ప మనసుతో తనకు ఎంపీ సీటిచ్చారన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనను, చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
ఆమంచి సంచలన వ్యాఖ్యలు
చీరాల: ‘‘అధికారం కోసం ఎంతటి నీచస్థాయికైనా సీఎం చంద్రబాబు దిగజారుతారు. ఇది నేను స్వయంగా చూశాను. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో గెలుపుకోసం సీఎం నీచస్థాయికి దిగారు. అ సమయంలో నాటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీయడానికి నీచానికి దిగారు. అక్కడ ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రోజాతో భన్వర్‌లాల్‌కు అక్రమ సంబంధం అంటగట్టాలని, ఆ మేరకు ప్రచారం చేయాలని నాడు ఆ నియోజకవర్గానికి ఇన్చార్జులుగా వ్యవహరించిన నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ మేరకు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లోనే ఆదేశించిన నీచుడు చంద్రబాబు’’అని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నిజం కాదంటే నార్కో పరీక్షలకైనా సిద్ధం కావాలన్నారు. లేదంటే చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ పై ప్రమాణం చేసి చెప్పాలని ఆయన సవాలు విసిరారు. ఆదివారం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలోని తన నివాసంలో ఆమంచి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మహిళలతోపాటు మనుషులకు కనీస గౌరవం ఇవ్వడని, ఆయన సామాజికవర్గానికి తప్ప మిగిలిన వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వరని, రాజకీయాలకోసం ఎంతటి నీచస్థాయికైనా దిగజారుతారని దుయ్యబట్టారు. నంద్యాలలో గెలుపుకోసం నీచస్థాయికి దిగారు నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుకోసం చంద్రబాబు నీచస్థాయికి దిగారని ఆమంచి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా 55 మందిని ఇన్చార్జులుగా నియమించారని, అందులో ఐదుగురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేల్లో తాను కూడా ఉన్నానని వివరించారు. ఈ క్రమంలో రోజూ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం తమతో మాట్లాడేవారన్నారు. నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఉప ఎన్నికలో టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కోపంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీసేందుకు ఏకంగా భన్వర్‌లాల్‌కు రోజాతో అక్రమ సంబంధం అంటగట్టాలని, ఆ మేరకు నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారం చేయాలని స్వయంగా తమను ఆదేశించారని తెలిపారు. ఆ సమయంలో తనతోపాటు మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డిసహా ఐదుగురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారన్నారు. అయితే అటువంటి ప్రచారం చేసేందుకు తాము అంగీకరించలేదని తెలిపారు. దీన్నిబట్టి చంద్రబాబు ఎంత నీచ రాజకీయాలకు పాల్పడతారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇది నిజం కాదంటే చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా? అని ఆమంచి ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరమైతే నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు చంద్రబాబు సిద్ధం కావాలన్నారు. -
ఇది నిజంకాదా? నార్కో అనాలసిస్ టెస్ట్‌కు చంద్రబాబు సిద్ధమా?
-
చంద్రబాబు..దేవన్ష్‌పై ప్రమాణం చేస్తావా?: ఆమంచి
సాక్షి, చీరాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మీద 17 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి. నాపై ఉన్న కేసులు ప్రజా ఉద్యమంలో జరిగినప్పుడు పెట్టినవి. చంద్రబాబు పిరికివాడు...అవకాశవాది. కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చాడు. నేను ఇక్కడే ఉండి ప్రజల కోసం పోరాడుతున్నా. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తా అని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్. ప్రజలకు ఏమి అవసరమో ...ఆయనకు అవగాహన లేదు. చంద్రబాబు అతి తక్కువ నిధులు ఇచ్చింది చీరాల నియోజకవర్గానికే. ప్రజలు కట్టే పన్నులతో మేము అభివృద్ధి చేసుకున్నాం తప్ప చీరాలకు చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయనకు మహిళలపై గౌరవం లేదు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు. అక్కడ ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ సీపీ మహిళలో అక్రమ సంబంధం అంటగట్టమని చెప్పిన నీచుడు చంద్రబాబు. ఇది వాస్తవం కాదా?. దీనిపై నార్కో ఎనాలసిస్ పరీక్షకు సిద్ధమా?. లేకుంటే నీ మనవడు దేవన్ష్‌పై ప్రమాణం చేసి చెబుతావా?’ అని సవాల్ విసిరారు. -
చీరాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆమంచి ప్రచారం
-
ప్రకాశం జిల్లా చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
కృష్ణాలో టీడీపీని వీడుతున్న బలమైన సామాజిక వర్గం
సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేయగల సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు కృష్ణప్రసాద్‌తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్, ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరావు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిలకు విజయవాడ, గన్నవరంలో గట్టి పట్టు ఉంది. వీరంతా వైఎస్సార్సీపీలో చేరారు. స్వయానా మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ ప్రసాద్ ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు. విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌కు అన్ని వర్గాల ప్రజలతో విస్తృత సంబంధాలున్నాయి. అవనిగడ్డకు చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు చేరికతో నియోజక వర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ గురువారం జగన్ సమక్షంలో చేరారు. వైఎస్సార్ జిల్లాల్లో టీడీపీకి ఏకైక ఎమ్మెల్యే గుడ్‌బై గత ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అధికార పార్టీని, పదవులను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు అందరితో సత్సంబంధాలున్నాయి. చాలా కాలం క్రితమే వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు రాజంపేట, మైదుకూరు, కడప సెగ్మెంట్లలో బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. మరో సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించి ప్రచారంలో చురుగ్గా పని చేస్తున్నారు. మంగళగిరిలో టీడీపీకి షాక్... గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బలమైన వర్గం ఉంది. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మైనారిటీ నేత షౌకత్, జడ్పీ చైర్పర్సన్ జానీమూన్‌కు ఆయా సామాజిక వర్గాల్లో మంచి పరిచయాలున్నాయి. బలమైన వర్గం కలిగిన రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. మాజీమంత్రి మహమ్మద్ జానీ, ఆయన ఇద్దరు కుమారులు, రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు తాజాగా చేరారు. బలమైన వర్గం వీరి వెంట ఉంది. మాగుంట చేరికతో మారిన రాజకీయం.. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు గిద్దలూరు, మార్కాపురం సెగ్మెంట్లలో మంచి పలుకుబడి ఉంది. పరిచయం అవసరం లేని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ప్రజల్లో మంచి పేరుంది. స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ పోరాటపటిమ కలిగిన నేత. వైఎస్సార్సీపీలో చేరిన ఈదర మోహన్ ఒంగోలు, సంతనూతలపాడులో ప్రభావం చూపగలరు. హిందూపురంలో సైకిల్‌కు పంక్చర్.. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘనీ, మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. జేసీ దివాకరరెడ్డి ప్రధాన అనుచరుడు కోగటం విజయ భాస్కరరెడ్డి, పరిటాల రవి స్నేహితుడు వేపగుంట రాజన్న టీడీపీని వీడారు. మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకట నాయుడుకూడా వైఎస్సాసీపీలో చేరారు. టీడీపీ టికెట్ ఇచ్చినా రాజీనామా చేసి.. నెల్లూరు జిల్లాలో టీడీపీ నెల్లూరు రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించిన ఆదాల ప్రభాకరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ టికెట్‌పై ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ కూడా టీడీపీని వీడి తిరుపతి నుంచి వైఎస్సార్ సీపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక ఆనం కుటుంబం ప్రభావం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో బలంగా ఉంది. దివంగత సీఎం నేదురుమల్లి జనార్థనరెడ్డి కుమారుడు రామ్ కుమార్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. చంద్రబాబు మోసాన్ని గ్రహించి.. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్‌పై కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి అనంతరం టీడీపీలో చేరినా చంద్రబాబు వైఖరితో మనస్థాపం చెంది తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. ఎస్వీతోపాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్ కూడా పార్టీలో చేరారు. రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ వైఎస్సార్సీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతి సీడ్స్ అధినేత పోచా బ్రహ్మానందరెడ్డికి రైతులతో మంచి సంబంధాలున్నాయి. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత దస్తగిరిరెడ్డి చేరడం నంద్యాలలో వైఎస్సార్సీపీకి మరింత బలం. -
‘ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు’
సాక్షి, చీరాల: తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్ చేసి, వారిని రాజకీయంగా వాడుకోవడం సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని చీరాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు అని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుగా ఉన్నా సిగరెట్ తాగుతూ పోజులు కొట్టేవాడని విమర్శించారు. చంద్రబాబు అండతో ఏబీ వెంకటేశ్వరరావు చేయని అరాచకాలు లేవని అన్నారు. వెంకటేశ్వరావును ఈసీ బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. వెంకటేశ్వరరావుపై లోతుగా విచారణ జరిపితే లక్ష కేసులు పెట్ట వచ్చన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పైకి బుద్ధి మంతుడిలా చంద్రబాబు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలుద్దామనుకోవడం ఓటమితో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చీరాలలో ఎవరు భయపడేది లేదన్నారు. -
మా అన్నకు సంబంధం లేదు: ఆమంచి
సాక్షి, చీరాల: ఎన్నికల్లో గెలవడానికి అధికార టీడీపీ అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తోందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. అధికార పార్టీ అండతో చీరాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలుకి పంపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్యాయంగా తన అన్నపై కేసు పెట్టారని తెలిపారు. ప్రమాదంలో కాలు చెయ్యి విరిగి సుదీర్ఘ కాలం వైద్యం తరువాత ఇప్పుడే పాక్షికంగా కోలుకున్న తన అన్న మీద హత్యాయత్నం కేసుపెట్టి, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజలిపేటలో యువకుల మధ్య జరిగిన గొడవలో తమ అన్నకు సంబంధం లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి అమాయకులను అరెస్టు చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో చీరాల టీడీపీ నేతల ప్రోద్భలంతో పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తన అన్నను ఒక్కడిని ఇబ్బంది పెడితే చీరాలలో వేలాది మంది అన్నలు, తమ్ముళ్లుతో కలసి ఎన్నికలలో దీటైన సమాధానం ఇస్తామని, టీడీపీ బెదిరింపులకు భయపడబోనని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. -
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది : ఆమంచి
-
ప్రకాశం ఎస్పీకి ఆమంచి ఫిర్యాదు
-
ఉరిమే ఉత్సాహం
జిల్లాలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డితో ఆరంభమైన వైఎస్సార్ సీపీలో చేరికల పర్వం ఆ తర్వాత మరింత ఊపందుకుంది. పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ ఇలా ఒకరి తర్వాత మరొకరు వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురామ్‌ల చేరికలతో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా బుధవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ సీపీలో చేరారు. ఈనెల 13న హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఆమంచి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం అమరావతిలో వైఎస్ జగన్ ఆమంచికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచితో పాటు ఆయన సోదరుడు స్వాములు, నియోజకవర్గానికి చెందిన అనుచర గణం పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. అదేవిధంగా ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన సీనియర్ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌లు కూడా బుధవారం అమరావతిలో జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారితో పాటు పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి అనుచర గణం మొత్తం పార్టీలో చేరింది. అటు ఆమంచి, ఇటు దగ్గుబాటిలు బుధవారం ఉదయమే నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో వైఎస్ జగన్ గృహ ప్రవేశం, పార్టీ కార్యాలయ ప్రారంభానికి తరలివెళ్లారు. అక్కడే జగన్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. వీరి చేరికతో అటు చీరాల, ఇటు పర్చూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది. వీరందరి రాక జిల్లాలో వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించేలా చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో క్లీన్ స్వీప్ అంటున్న కేడర్.. ఇప్పటికే కందుకూరుకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆతర్వాత గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీని వీడి వైఎస్సార్‌లో చేరారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల పరిధిలో అధికార టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా దగ్గుబాటితో పాటు ఎమ్మెల్యే ఆమంచి సైతం వైఎస్ఆర్సీపీలో చేరడంతో కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని 12 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు జిల్లాకు చెందిన మరి కొందరు ముఖ్యనేతలు త్వరలోనే అధికార పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో వైఎస్సార్ సీపీకి తిరుగుండదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డీలా పడిన టీడీపీ.. వైఎస్సార్ సీపీ జోష్‌తో అధికార టీడీపీ జిల్లాలో డీలా పడింది. వరుసపెట్టి ముఖ్య నేతలందరూ ఆ పార్టీని వీడుతుండడంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మిగిలి ఉన్న ఒకరిద్దరు ముఖ్యనేతలు ఆపార్టీని వీడితే వారు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థి«గా పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొంది. ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలిపితే ఎన్నికలకయ్యే ఖర్చు తామే భరిస్తామని ముఖ్యమంత్రి ఆఫర్ ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పోటీ చేసేందుకు అభ్యర్థే దొరకని పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని ఎలా ఢీ కొట్టగలమని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మొత్తంగా అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులకు పార్టీ కండువా కప్పుతున్న జగన్(ఫైల్) పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్లను ౖÐð ఎస్సార్ సీపీలోకి ఆహ్వానిస్తున్న ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఫైల్) -
ఆమంచి, దగ్గుబాటిని ఆహ్వానించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమంచి బుధవారం పార్టీలో చేరారు. ఈమేరకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఆమంచితో పాటు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ కూడా పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయం ప్రారభోత్సవం సందర్భంగా వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. (తాడేపల్లిలో వైఎస్ జగన్ గృహ ప్రవేశం) -
ఆమంచి వర్గీయులపై రాళ్లదాడి
-
ఆమంచి వర్గీయులపై రాళ్లదాడి
సాక్షి, ఒంగోలు : రోజుకొక ముఖ్య నేత పార్టీని వీడుతుండడంతో టీడీపీ అతలాకుతలమవుతోంది. పార్టీని వదిలి వెళ్లే వారిని ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార మదంతో టీడీపీ వర్గాలు దాడులకు దిగుతున్నాయి. టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. గ్రామ సభలో పాల్గొందుకు వెళ్లిన ఆమంచి అనుచరులపై రాళ్ల దాడి చేశారు. గ్రామ సభకు ఎందుకొచ్చారంటూ దూషించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. (సొంత కులానికే చంద్రబాబు సేవ) ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీకి దగ్గరగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ వైఎస్సార్సీపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారంతో చంద్రబాబు హైరానా పడుతున్నారు. (చదవండి : రేపెవరో!?) -
సొంత కులానికే చంద్రబాబు సేవ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కులానికే సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేవలం గుప్పెడు చేసి, సొంత కులానికి దోసెడు దోచిపెడుతున్నారని ఆరోపించారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి గురువారం హైదరాబాద్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత కులానికే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పోలీసు, పరిపాలన, రెవెన్యూ యంత్రాంగంలోని కీలక పోస్టుల్లో చంద్రబాబు తన సామాజికవర్గం వారినే నింపుకుని, వచ్చే ఎన్నికల్లో వారి సహకారంతో గెలుపొందాలని చూస్తున్నారని, కానీ అది జరగదని తేల్చిచెప్పారు. ఆమంచి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటిదైన సీఎం కార్యాలయంలో(సీఎంవో) నలుగురు సీనియర్ అధికారులు కార్యదర్శులుగా ఉండగా, అందులో సాయిప్రసాద్, రాజమౌళి అనే వారిద్దరూ చంద్రబాబు సామాజిక వర్గంవారే. పోలీసు సమాచారంతోపాటు ఇతర రంగాల సమాచారాన్ని సేకరించి ముఖ్యమంత్రికి నివేదించే ఇంటెలిజెన్స్ శాఖాధిపతి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి సామాజికవర్గం అధికారే. కొత్తగా ఏర్పాటు చేసిన లా అండ్ ఆర్డర్ కో–ఆర్డినేషన్ డీఐజీ పదవిలో ఉన్న ఘట్టమనేని శ్రీనివాసరావు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మనిషే. ఏబీ వెంకటేశ్వరరావుకు శిష్యులైన యోగానంద్, మాధవరావు అనే రిటైర్డు పోలీసు అధికారులను చట్టంలో లేని విధంగా జీవోలు ఇచ్చి కీలక స్థానాల్లో కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆయన పర్సనల్ సెక్రెటరీని సంప్రదించాల్సి ఉంటుంది. ఆ పోస్టులో చంద్రబాబు సామాజికవర్గం అధికారే ఉన్నారు. షార్ట్‌కట్‌లో సీఎంకు సమాచారాన్ని అందజేసే టీడీ జనార్దన్ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా పేరుకే కళా వెంకట్రావు ఉన్నారు. ఆయనకు సమాంతరంగా ప్రోగ్రామింగ్స్ కమిటీ ఛైర్మన్ పేరుతో డీవీవీ చౌదరి అనే వ్యక్తిని నియమించారు. మేమంతా వెళ్లి ఆయనకు దండం పెట్టి, అర్జీ ఇచ్చి రావాల్సి వచ్చేది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ సీఎం చంద్రబాబు వర్గం మనిషే. అంతేకాదు చంద్రబాబుకు బంధువు కూడా. చంద్రబాబు ప్రయత్నాలు ఫలించవు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూసి బెంబేలెత్తి చాలామంది మేధావులైన రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. వారి స్థానంలో కేంద్ర సర్వీసుల నుంచి 20 మంది అధికారులను డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చుకుంటే అందులో 15 మంది చంద్రబాబు సామాజికవర్గం వారే ఉన్నారు. వెంకటరెడ్డి అనే అధికారి వారిలో ఉంటే అతడు రెడ్డి కనుక ముఖ్యమంత్రి ఆ నియామకాన్ని నిలిపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వ్యవహారంపై రేపు తెల్లవారే వరకూ చెప్పగలను. చంద్రబాబు తన కులానికే ప్రాధాన్యం ఇచ్చుకుంటున్నారు. పైగా తనకు కులపిచ్చి లేదని చెప్పుకుంటున్నారు. ఆయన చుట్టూ ఆయన కులం ఒక విషవలయంగా తయారై రాష్ట్రాన్ని పెకిలిస్తోంది. ఆది చంద్రబాబు అదుపులో ఉందో లేదో కూడా నాకు తెలియదు. సొంత సామాజికవర్గం అధికారుల అండతో వచ్చే ఎన్నికల్లో నెగ్గాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ, అది సాధ్యం కాదు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఎంతటి భారీ మెజారిటీతో గెలుపొందుతారో అందరూ చూస్తారు’’ అని ఆమంచి స్పష్టం చేశారు. -
ఆమంచి రాజీనామాతో బెంబేలెత్తిన టీడీపీ అధిష్టానం
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: అధికార పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి పోవడం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కావడంతో టీడీపీ అధిష్టానం బెంబేలెత్తి పోయింది. చీరాలలో పరువు నిలుపుకొనేందుకు అప్రమత్తమైంది. చీరాల టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు ఎమ్మెల్సీ కరణం కుటుంబానికి అప్పగించేందుకు సిద్ధ్దమైంది. కరణం బలరామకృష్ణమూర్తి లేదా ఆయన తనయుడు కరణం వెంకటేశ్‌లలో ఎవరో ఒకరిని వచ్చే ఎన్నికలలో చీరాల టీడీపీ అభ్యర్థిగా నిలపాలని నిర్ణయించింది. ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని చంద్రబాబు బలరాంను ఆదేశించినట్లు తెలుస్తోంది. చీరాల నుంచి బలరాం పోటీలో ఉంటేనే బాగుంటుందని జిల్లా టీడీపీ నేతలు సీఎంకు సూచించినట్లు సమాచారం. గురువారం చీరాలలో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో గురువారం చీరాలలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కరణం, మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో చీరాల అభ్యర్థి ఎంపికపై చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. సీటు మాకంటే మాకు.. మరోవైపు చీరాల టికెట్ తనకే ఇవ్వాలని మాజీ మంత్రి పాలేటి రామారావు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పార్టీ పెద్దలను కలిసిటికెట్ కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. బలరాం కుటుంబానికి పాలేటి సహకరించే పరిస్థితి కూడా లేదు. అటు ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం రాబోయే ఎన్నికలలో తానే పోటీలో ఉంటానని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చీరాల నుంచి ఇద్దరు నేతలు టికెట్ కోసం అధిష్టానం పై ఒత్తిడి తెస్తుండగా చంద్రబాబుతో పాటు జిల్లా ముఖ్య నేతలు కరణం కుటుంబానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చీరాలలో గట్టి పట్టు ఉన్న ఆమంచిని ఎదిరించాలంటే కరణం కుటుంబమే పోటీలో ఉండాలని వారు ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కరణం తొలుత నిరాకరించినట్లు సమాచారం. ఇన్నాళ్లు చంద్రబాబు తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు అవసరానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని కరణం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాడు తనకు వ్యతిరేకంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారని ఆయన వాదనకు దిగినట్లు సమాచారం. ఇప్పుడు తన అవసరం వచ్చింది కాబట్టి మళ్లీ వాడుకునే ప్రయత్నం మొదలు పెట్టారని, తాను చీరాల నుంచి పోటీ చేయనని కరణం అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు అధిష్టానం దూతలు బుధవారం మధ్యాహ్నం అమరావతి సచివాయంలో కరణంతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత ఉంటుందని, అన్నీ మీ చేతుల మీదుగానే జరుగుతాయని, మొత్తం సీఎం చూసుకుంటారని వారు బలరాంకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ చీరాల బరిలో నిలిచేందుకు అయిష్టత చూపిన బలరాం తాను పోటీలో ఉండలేనని, అక్కడ బీసీ అభ్యర్థిని నిలపాలని సూచించినట్టు తెలిసింది. చంద్రబాబు మాత్రం పోటీలో ఉండాల్సిందేనంటూ బలరాంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. మరి దీనికి ఆయన ఎలా స్పందిస్తారు.. పోటీలో తానే ఉంటారా లేక తనయుడు వెంకటేశ్‌ను నిలుపుతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బలరాం చీరాల అభ్యర్థిగా నిలిచే పక్షంలో వెంకటేశ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారన్న ప్రచారం ఒక వైపు సాగుతుండగా మరోవైపు ఎమ్మెల్సీ హోదాలోనే బలరాం పోటీలో ఉంటారన్న ప్రచారమూ ఉంది. కుమారుడు వెంకటేశ్ భవితవ్యం పైనా బలరాం హామీ తీసుకున్నట్లు తెలుస్తున్నా అది ఏమిటన్నది తెలియాల్సి ఉంది. గురువారం సాయంత్రానికి చీరాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎమ్మెల్యే ఆమంచి వైఎస్సార్సీపీ అ«ధినేత వైఎస్ జగన్‌ను కలవడం అనంతరం టీడీపీలో పరిణామాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారాయి. టీడీపీలో డీలా... టీడీపీ ముఖ్యనేతలు వరుసబెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో జిల్లాలో ఆ పార్టీ డీలా పడింది. టీడీపీకి చెందిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరగా చీరాల సిటింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ను కలిసి, త్వరలో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతకు ముందే కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీ లో చేరగా పర్చూరు కు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌లు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు నేతలు సైతం త్వరలో వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. దీంతో జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన అభ్యర్థులు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిణామాలు వైఎస్సార్సీపీలో రెట్టించిన ఉత్సాహం నింపగా టీడీపీని డీలా పడేలా చేసింది. -
రాష్ట్రానికి జగనే కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్‌ను కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ఉన్నారని, మాట తప్పని ఆయనే ఆంధ్రప్రదేశ్‌కు సరైన నాయకుడని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ప్రాణం పోయినా మాట తప్పడనే జనాభిమతం తనను ఆయనవైపు ఆకర్షితుడిని చేసిందని చెప్పారు. బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ని కలిశారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులు, సంక్షోభంలోంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం, తదితర అంశాలపైన వైఎస్ జగన్‌తో చర్చించినట్టు చెప్పారు. త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరతానని, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని వెల్లడించారు. టీడీపీలో కొనసాగిన కాలంలో రాజకీయ, సామాజిక అంశాలన్నీ బేరీజు వేసుకున్నానని, ఇంకా ఆ పార్టీలో కొనసాగడం సరికాదని తాను, తన అనుచరులు భావించారని అందుకే టీడీపీకి రాజీనామా చేశానన్నారు. పసుపు–కుంకుమను ఛండాలం చేశారు తాను పార్టీ మారడానికి అనేక కారణాలున్నాయని ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. పొద్దున లేచిన దగ్గర నుంచి టీడీపీ నేతలు అబద్ధాలే చెబుతున్నారన్నారు. పవిత్రమైన పసుపు–కుంకుమను టీడీపీ ప్రభుత్వం ఛండాలం చేసిందని, పసుపు–కుంకుమను చంద్రబాబు జారుడు బండపై పోశారని, అది అవినీతి మార్గంలో గాలికి కొంత, నేలపై కొంత పోతోందని తీవ్ర విమర్శలు చేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబును ఎందుకు మాఫీ చేయలేదని ఎవరూ అడగడం లేదన్నారు. రూ.2 వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే ఆలోచన ఆయన చేస్తున్నారని, ఇది దారుణమని అన్నారు. చంద్రబాబు కులతత్వాన్ని ప్రశ్నించాలనే పార్టీ వీడా కొన్ని అతీత శక్తులు ముఖ్యమంత్రిని ఆయన నివాసం, కార్యాలయంలో కలుస్తున్నాయని, అవే ఆయన్ను కీలుబొమ్మను చేసి శాసిస్తున్నాయని చెప్పారు. సమాజం గురించి మాట్లాడే తనలాంటి వాళ్లకు, సామాన్యులకు ఏ స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలను, ఆయనలో ఉన్న నీచమైన కులతత్వాన్ని ప్రశ్నించాలనే టీడీపీని వీడినట్టు వెల్లడించారు. తనలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలోకి వస్తారని తెలిపారు. చంద్రబాబు ‘నిన్న చెప్పింది మర్చిపోండి, ఇప్పుడు చెప్పిందే గుర్తుంచుకోండి’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో చంద్రబాబు భాషను గమనిస్తే అవును, కాదనే ఉంటుందన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు పిచ్చిపట్టిందేమో, అల్జీమర్స్ వచ్చిందేమో అనుకోవాల్సి వస్తోందన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలంటూ 50 మందితో చెప్పిస్తారని, సన్మానాలు చేయిస్తారని మండిపడ్డారు. తన వ్యక్తిగత అవసరాల కోసం, భయంతో హైదరాబాద్‌ను వదిలిపెట్టి పారిపోయి వచ్చాడని దుయ్యబట్టారు. అనుభవం ఉందని అధికారం అప్పగిస్తే ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. అమరావతిలో ఏముందని ప్రశ్నించారు. ఉద్యోగులకు తాగడానికి నీళ్లు, కూర్చోడానికి నాలుగు చెట్లు కూడా లేవని తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి భారీ షాక్ టీడీపీకి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు. చీరాల నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీడీపీకి ఆమంచి గుడ్‌బై
-
చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమో!
-
వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే ఆమంచి
-
ఏపీకి వైఎస్ జగన్ తప్ప మరో ఆప్షన్ లేదు: ఆమంచి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ లేదు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...ఆయన వారసుడు జగన్. అందుకే వచ్చాను. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ సీపీలో చేరతా. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. నేను పార్టీ మారడానికి.. నా అసెంబ్లీ సమస్యలే కాదు, అనేకం ఉన్నాయి. స్థానికంగా నా ప్రత్యర్థి ఎవరైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నాలుగున్నరేళ్లుగా నేను చీరాల నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసాను అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమో! ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే ఆమంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే పిచ్చి పట్టినట్లు ఉందని, ఆయనకు 70 ఏళ్లు దాటయాని, అల్జీమర్స్ వచ్చిందనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ రోజు ఒకమాట చెప్పి, తర్వాత మరో మాట చెబుతారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అతీత శక్తులు నడిపిస్తున్నాయని, సమాజంతో సంబంధం లేని వ్యక్తులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారని ఆమంచి మండిపడ్డారు. పార్టీకి సంబంధం లేకున్నా తన నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు కలిగించారని, ఈ అంశాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో, ఆయన పేషీలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకున్నారని మండిపడ్డారు. పసుపు-కుంకుమ పేరు చెడగొట్టారు.. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు గాల్లో మేడలే. గత నాలుగేళ్లుగా రూ.6400 కోట్లు వడ్డీ రాయితీ ఇవ్వలేదు. వడ్డీ రుణం మాఫీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ చేయలేదు. పసుపు-కుంకుమ పేరును చంద్రబాబు చెడగొట్టారు. పసుపు-కుంకుమను జారుడు బండపై పోశారు. అది గాల్లోకి కలిసిపోతోంది. ఇలాంటి దారుణమైన చర్యలు భరించలేకే వైఎస్సార్ సీపీలో చేరాను. తెలుగుదేశంలో కులం పిచ్చి ముదిరిపోయింది. ఒక కులం గుత్తాధిపత్యం కోసం యత్నిస్తోంది. చిన్న విషయానికి హైదరాబాద్ వదిలేశారు.. కాపు రిజర్వేషన్లపై రాజకీయం చేయడం తగదు. తుని ఘటనలో మా సోదరుడిపై తప్పుడు కేసు పెట్టారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. మనం ఏం చెప్పినా వింటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారు. అనుభవొం ఉందని అధికారం ఇస్తే చిన్న విషయానికి హైదరాబాద్ నుంచి పారిపోయారు. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది. అమరావతిలో ఉద్యోగులకు కనీసం మంచినీళ్లు, కూర్చోడానికి చెట్ల నీడ కూడా లేదు. రోశయ్య ఆశీస్సులు తీసుకున్నా.. గతంలో పవన్ కల్యాణ్‌తో చాలాసార్లు భేటీ అయ్యాను. అయితే రాష్ట్ర సమస్యలపై చర్చించానే కానీ, జనసేనలో చేరతానని చెప్పలేదు. పార్టీ మారే ముందు మాజీ సీఎం రోశయ్య ఆశీస్సులు తీసుకున్నాను. అయిదు రోజుల క్రితం ఆయనను కలిశాను. నీ మనసుకు నచ్చిన విధంగా చేయమన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే ఆమంచి
సాక్షి, హైదరాబాద్ : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమంచి తన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ... త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు. (టీడీపీకి ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా) ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. కొద్ది రోజుల క్రితం ఆమంచి పార్టీ మారుతున్నారని వార్తల నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే చీరాల నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పార్టీలో లేనివారి ప్రమేయం ఎక్కువగా కావడం వల్లే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆమంచి తెలిపారు. మరోవైపు ఆమంచి రాజీనామాతో ... టీడీపీ నేత కరణం బలరామ్‌ను...చీరాల వెళ్లి పార్టీ పరిస్థితిని సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. -
ప్రకాశం జిల్లాలో టీడీపీకీ ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. చీరాల నియోజకవర్గంలో కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, ప్రభుత్వం, పార్టీకి సంబంధం లేని శక్తులు అక్కడ పని చేస్తున్నాయని, అందుకే తాను టీడీపీకి రాజీనామ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి తన లేఖలో పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా ఆయన టీడీపీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు కూడా. 2014లో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. -
ఆమంచి వర్సెస్ దామచర్ల
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల చీరాల టీడీపీ నేతలు పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలకు మద్దతు పలుకుతూ ఆమంచికి సెగ పెడుతున్నారని, దీంతో జనార్దన్‌పై ఆమంచి అక్కసుతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మంగళవారం మంత్రి లోకేష్ చీరాల పర్యటన సందర్భంగా వేసిన ప్రకటనలు, ప్లెక్సీల్లో ఆమంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం లోకేష్ పర్యటన కార్యక్రమంలో వీరిద్దరి తీరు చూసిన అధికార పార్టీ నేతల నుంచి సైతం వీరిద్దరి మధ్య అంతర్యుద్ధం నిజమేననే సమాధానం వస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మంగళవారం చీరాలలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే ఆమంచి ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. పైపెచ్చు చీరాలలో వేసిన ఫ్లెక్సీల్లోనూ దామచర్ల ఫొటోలు ఒకటి, రెంటిల్లో మినహా 95 శాతం వాటిలో లేవు. టీడీపీ బీసీ నేత నూకసాని బాలాజీ ఫొటోలు వేసిన ఆమంచి జనార్దన్‌ను మాత్రం విస్మరించడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి విబేధాలు ఎన్ని ఉన్నా మంత్రి పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయడం ఆనవాయితీ. కానీ జనార్దన్‌పై అక్కసుతో ఉన్న ఆమంచి నిర్మొహమాటంగా ఆయన ఫొటో వేయలేదు. అధికార పార్టీ నేతల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆమంచి చర్యతో దామచర్ల వ్యతిరేక వర్గం సంబర పడగా.. అనుకూల వర్గంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. జనార్దన్ మాత్రం యథావిధి చీరాలలో మంత్రి లోకేష్ పర్యటనకు హాజరయ్యారు. దామచర్ల తీరుపై ఆమంచి ఫిర్యాదు.. ఆమంచి, దామచర్ల మధ్య చాలా కాలంగా విబేధాలున్నట్లు ప్రచారం ఉంది. ఆది నుంచి దామచర్ల చీరాల టీడీపీ నేతలు మాజీ మంత్రి పాలేటి రామారావు, పోతుల సునీతలను ప్రోత్సహించేవారు. ఆమంచి అధికార పార్టీలో చేరిన తరువాత కూడా దామచర్ల అటు పాలేటిని ఇటు పోతుల సునీతను ప్రోత్సహిస్తూనే ఉన్నారని, జనార్దన్ మద్దతుతోనే వారు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది ఆమంచి ఆరోపణ. ప్రతి సమావేశానికి పోతుల సునీత, పాలేటిలను పిలిచి వేదికలపై మాట్లడించడాన్ని ఆమంచి జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. జనార్దన్ వ్యవహార శైలిపై ఆమంచి పలుమార్లు సీఎంతో పాటు ఇటు లోకేష్, బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్, మంత్రి పరిటాల సునీతకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో పార్టీకి దూరమౌతానని కూడా ఆమంచి హెచ్చరించినట్లు సమాచారం. పరస్పర ఫిర్యాదులతో ఇద్దరి మధ్య విబేధాలు పెరిగినట్లు సమాచారం. జిల్లా మహానాడులోనూ ఇదే తీరు.. ఇటీవల ఒంగోలులో జరిగిన జిల్లా మహానాడులోనూ జనార్దన్ ఆమంచిని సరిగా రిసీవ్ చేసుకోలేదు. వేదిక మీద ఉన్న పెద్దలు ఆమంచితో పాటు సభకు వచ్చిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును మాత్రమే వేదిక మీదకు పిలిచి ఆమంచిని పట్టించుకోలేదు. ఆ తరువాత వేదిక మీదకు వచ్చిన ఆమంచికి మొదటి వరుసలో సీటు కూడా ఇవ్వక పోవడంతో ఆయన వెనుక సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. దీన్ని భరించలేని ఆమంచి ఆ కొద్దిసేపు ముళ్లమీద కూర్చున్నట్లైంది. ఆ తరువాత కొందరు విషయం జనార్దన్ దృష్టికి తీసుకెల్లగా ఆతరువాత ఆయనవచ్చి ఆమంచిని మొదటి వనుసలో కూర్చోబెట్టారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా అటు ఆమంచి ఇటు దామచర్ల గొడవలు అధికార పార్టీలో పతాక స్థాయికి చేరాయి. పర్యవసానంగా సాక్షాత్తూ మంత్రి లోకేష్ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జనార్దన్‌కు ప్రాధాన్యత ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. -
మహిళలు సీరియల్స్ చూసి ఆనందించాలి: లోకేష్
చీరాల: మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు రూ.25 కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మానానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలో 225 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరగలేదని అందులో చీరాల మండలానికి రూ.10 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తన పర్యటన ముగింపునకు కొద్దిరోజుల క్రితమే చీరాల నియోజకవర్గానికి బీటీ రోడ్లు నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించానని, కొద్ది రోజుల్లో రూ.15 కోట్లు కేటాయించి 225 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. రామాపురంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమానికే టీడీపీ ప్రభుత్వం పాటు పడుతోందని, మత్య్సకారులందరికీ డీజిల్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 150 మందికి ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, ముఖద్వారం ఏర్పాటు చేస్తానన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అందుకే సీరియల్స్ చూసి ఆనందంగా ఉండాలంటూ మహిళలకు సూచించారు. 2020 నాటికి రాష్ట్ర అబభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి అంగన్ వాడీ భవనాలు, ఎల్ఈడీ భవనాలు, సీసీ రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు. దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సభలో లోకేష్ వాఖ్యానించారు. రైతు రుణమాఫీకి నియోజకవర్గానికి రూ.1.30 కోట్లు విడుదల చేశామన్నారు. హార్బర్ రాదు.. ‘కేంద్రం, రాష్ట్రాన్ని మోసం చేసింది..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేధించింది. మత్య్సకారుల చిరకాల వాంఛ అయిన హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు. నీతి ఆయోగ్ పథకం ఒట్టిదే’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలో జరిగిన మత్య్సకారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం 11 గంటలు కష్టపడుతున్నారని, మత్య్సకారుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మత్య్సకారులకు ముఖ్యమైన హార్బర్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఆమంచి అడుగగా మంత్రి ఆదినారాయణ మాత్రం కేంద్రం హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు....సాగర్ మాల అంతా బూటకం అని వాఖ్యానించారు. డబ్బులు, పెట్రోల్ ఫ్రీ మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు చీరాలకు వచ్చిన మంత్రి లోకేష్ పర్యటనలో తన ఓటు బ్యాంకును చూపించుకోవడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి 4 నుంచి 6 ప్రైవేటు స్కూళ్ల బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు బైక్ ర్యాలీతో స్వాగతం పలికించారు. టూవీలర్‌కు 2 లీటర్ల పెట్రోల్, డబ్బులు, పార్ట స్టికర్లు పంపిణీ చేశారు. ఆమంచి వర్సెస్ కలెక్టర్ చీరాల: మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొత్తపేట జెడ్పీ హైస్కూల్ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆమంచి మధ్య వాగ్వాదం జరిగింది. హైస్కూల్ నిర్మించిన స్థల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. అసలు కొత్తపేట హైస్కూల్ ప్రారంభానికే వచ్చినప్పటికీ కలెక్టర్ సూచనల మేరకు మంత్రి లోకేష్ వెనుతిరిగారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొత్తపేటలో హైస్కూల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో రూ.2.20 కోట్ల అంచనాలతో కేవలం 50 రోజుల్లోనే నూతన భవంతులు నిర్మించారు. ఈ స్కూల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా స్కూల్ నిర్మాణం చేశారు. అయితే కొత్తపేట హైస్కూల్ నిర్మించిన స్థలం ది ఐఎల్టీడీ కోపరేటివ్ సొసైటీకి చెందింది. అందులో కార్మికులు కొందరికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా ఇదే స్థలంలో హైస్కూల్ నిర్మాణం చేపట్టడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తుండగా స్టే కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చీరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి అల్పాహారానికి వెళ్లారు. లోకేష్‌తో పాటుగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులున్నారు. ఇక్కడ సమస్యను కలెక్టర్ వినయ్‌చంద్ లోకేష్‌కు వివరించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆమంచి.. కలెక్టర్‌తో విభేందించారు. ఉదయం 8 గంటలకే మంత్రి లోకేష్‌తో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖాముఖి అన్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు పాఠశాల ప్రారంభం కానీ, ముఖాముఖి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
ఆమంచి వర్గీయుల దాడిలో మహిళ మృతి
-
బ్రేకింగ్: చీరాలలో ఆమంచి వర్గీయుల రౌడీయిజం
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేత ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీలైతే లొంగతీసుకోవడం, కుదరకపోతే బెదిరించడం, అదీ సాధ్యం కాకపోతే చంపడం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం తమకు ఎదురు తిరిగిందని గవినివారి పాలెంకు చెందిన దేవర సబ్బులు అనే మహిళపై ఆమంచి వర్గీయులు దాడికి పాల్పడ్దారు. ఈదాడిలో సుబ్బులు తీవ్ర గాయాలపాలైంది. దీంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తీవ్రగాయలతో ఉన్న సుబ్బులు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా ఆస్పత్రి వద్ద ఆమంచి వర్గీయులు మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావడాన్ని అడ్డుకున్నారు. దీంతో సుబ్బులు కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. అయితే చేతిలో అంగబలం, అధికార బలం ఉన్న ఆమంచి వర్గం రెచ్చిపోయింది. ఆందోళనకు దిగిన వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా మృతదేహాన్ని గ్రామంలోకి రానీకుండా అడ్డుకోవడానికి అనుచరులను గవినివారిపాలెంలో పెద్ద ఎత్తున్న మొహరించారు. అధికారానికి పోలీసుల వత్తాసు : న్యాయంవైపు ఉండాల్సిన పోలీసులు కూడా ఆమంచి వర్గీయులకు వత్తాసు పలికారు. నాయకుల మెప్పు కోసం సుబ్బులు కుటుంబ సభ్యులను, వారికి మద్దతుగా వచ్చిన ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమ వారిని విడిచిపెట్టాలంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. -
ఆమంచికి చుక్కెదురు
చీరాల: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చుక్కెదురైంది. తాను చేసిందే శాసనం లాగా వ్యవహరించే ఆమంచికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. వాడరేవు తీరాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతూ దశాబ్దాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న మత్స్యకారుల పూరిగుడిసెలను తొలగించాలని ఆమంచి చేసిన ప్రయత్నాలకు హైకోర్టు స్టేతో ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని వాడరేవు గ్రామంలోని తీరం ఒడ్డున ఫిష్‌ల్యాండింగ్ సమీపంలో 6.73 ఎకరాల స్థలంలో మత్య్సకారులు పూరి గుడిసెలు వేసుకుని చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 80 ఏళ్లుగా 168 పూరి గుడిసెలు, 70 రేకుల ఇళ్లు, 4 మెకానిక్ షెడ్లు, 7 బంకులను ఏర్పాటు చేసుకుని మత్య్సకారులు నివాసం ఉంటున్నారు. అయితే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో వాడరేవుకు వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి వాడరేవును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ ప్రాంతంలో పూరిగుడిసెలను తొలగించి మత్య్సకారులను గ్రామంలోని వేరే ప్రదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు తీరం ఒడ్డున ఉన్న పూరిగుడిసెలను తొలగించేందుకు పొక్లెయినర్లు, పోలీసులు, వాహనాల సాయంతో తీరానికి చేరుకున్నారు. మత్య్సకారులు ఆమంచి నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటుగా తమ ప్రాణాలైనా ఇస్తాం..పూరిగుసెలను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరికలు సైతం జారీ చేశారు. వారం రోజుల పాటు మత్య్సకారులు టెంట్లు వేసుకుని గుడిసెల తొలగించకుండా అడ్డుకున్నారు. కానీ ఎమ్మెల్యే అండతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గుడిసెల తొలగింపునకు యత్నించారు. అడ్డుకున్న మత్య్సకారులను బలవంతంగా, విచక్షణ లేకుండా అరెస్టు చేశారు. అయితే తీరం మా హక్కు నినాదంతో మత్య్సకారులు పోరాటాలు చేస్తుండటంతో వారికి వైఎస్సార్ సీపీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు అండగా నిలిచారు. ఆమంచి మాత్రం వాడరేవు మత్య్సకారులు చీరాల మార్కెట్లో చేపలను అమ్ముకోనీయకుండా అధికారుల సాయంతో వారిని అడ్డుకున్నారు. మత్య్సకారులకు వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వి.అమృతపాణితో పాటుగా ప్రజాసంఘాలు, మత్య్సకార సంఘాలు అండగా నిలిచారు. పదిరోజుల క్రితం వాడరేవు మత్య్సకారులు 321 మంది, రాష్ట్ర మత్య్సకార సంఘాల నాయకులు తమకు ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయం, అరాచకాలపై హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో శుక్రవారం హైకోర్టు గుడిసెల తొలగింపు చేయవద్దని స్టే జారీ చేసింది. మత్య్సకారులకు అండగా హైకోర్టు స్టే ఇవ్వడంతో వైఎస్సార్ సీపీ నేతలు, మత్య్సకార సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వాడరేవులో 80 ఏళ్లుగా ఉంటున్న మత్య్సకారుల పూరిగుడిసెల తొలగింపు అధికారం రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలకు లేదు....ఎవ్వరైనా గుడిసెల తొలగింపునకు యత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని’ స్టే ఆర్డర్లో హైకోర్టు పేర్కొంది. నియోజకవర్గంలో నేనేరాజు....నేనే మంత్రిగా వ్యవహరించే ఆమంచి అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసిందని, భవిష్యత్తులో మత్య్సకారుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాడరేవు మత్య్సకారులు అంటున్నారు. తమను వేధించాలని చూస్తే ఊరుకోమని, తమకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ,ప్రజాసంఘాలు, మత్య్సకార సంఘా ల నాయకులకు వాడరేవు మత్య్సకారులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత
చీరాల: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేనే రాజు.. నేనే మంత్రి అన్న చందాన వ్యవహరించడంపై చారిత్రాత్మక గ్రామమైన చీరాల వాడరేవులోని మత్స్యకారులు అడ్డం తిరిగారు. అభివృద్ధి పేరుతో ముందస్తుగానే సోమవారం తమ గుడిసెల తొలగించడంపై మత్స్యకార మహిళలు మండిపడుతున్నారు. ఆమంచి తీరుతో తమ జీవనోపాధితో పాటు తలదాచుకుంటున్న గుడిసెలు కోల్పోతుండటంతో చావుకైనా సిద్ధపడతామని, అంతేగానీ, తమ గుడిసెలు తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బాధిత మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. మత్స్యకార సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నేతలు మత్స్యకారులకు అండగా నిలిచారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల అత్యుత్సాహాన్ని నిలువరించిన మత్స్యకారులు మంగళవారం ఒంగోలు చేరుకుని కలెక్టర్, ఎస్పీలను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ వినయ్‌చంద్‌ను ఆ గ్రామసర్పంచ్ ఎరిపిల్లి రమణ, నాయకులు గాలి, బాబీలు, సూరిబాబు, సీపీఎం నాయకులు వసంతరావు, జిల్లా మత్స్యకార సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. ప్రజాభీష్టం మేరకే పనులు చేయాలి : అభివృద్ధి అనేది ప్రజల అభీష్టం మేరకే చేస్తే బావుంటుంది. 150 కుటుంబాలు నివసించే ప్రాంతాన్ని కేవలం పర్యాటక అభివృద్ధి కోసం ఖాళీ చేయించాలని చూడటం గర్హనీయం. తామంతా వేట, చేపల అమ్మకంతోనే బతుకుతున్నాం. కానీ, పర్యాటక అభివృద్ధి పేరుతో ఉన్నపళంగా మత్స్యకారులు ఉంటున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని చూస్తే ఊరుకునే స్థితిలో మా మత్స్యకారులు లేరు. మాకు ప్రత్యామ్నాయం చూపించి కొంత సమయం ఇచ్చి పనులు చేయాలేగానీ, పర్యాటకానికి సంబంధించి ఎలాంటి నిధులు, ప్రకటనలు చేయకుండా, పాలకవర్గ తీర్మానాలు లేకుండా మత్స్యకారుల గుడిసెలను కూల్చివేస్తే ఉద్యమాలు చేస్తాం. అధికార పార్టీ అయినా అందరి అభీష్టంతో పనిచేస్తాం. – ఎరిపిల్లి రమణ, సర్పంచ్, వాడరేవు ఒంగోలులో కలెక్టర్ వినయ్‌చంద్‌కు వినతిపత్రం ఇస్తున్న వాడరేవు సర్పంచ్, మత్స్యకార సంఘ నాయకులు, చిన్నబరప వద్ద చించివేసిన ఆమంచి ఫ్లెక్సీ ఆమంచి ఫ్లెక్సీలు ధ్వంసం... చీరాలటౌన్: చీరాల ఎమ్మెల్యే ఆమంచి ఫ్లెక్సీల చించివేత, ధ్వంసం కార్యక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం ఈపూరుపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమంచి ఫ్లెక్సీలు చించివేసిన ఘటన తర్వాత మళ్లీ వాడరేవులో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. దీంతో మండలంలోని వాడరేవులో ఇటీవల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన 15 ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం చించివేశారు. పాకలలో పూరి గుడిసెల తొలగింపు ప్రయత్నాల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఆమంచి ఫ్లెక్సీల ధ్వంసంతో గ్రామంలో మరో అలజడి ఏర్పడింది. చించివేసిన ఫ్లెక్సీలను హుటాహుటిన పంచాయతీ సిబ్బంది తొలగించారు. అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తారా.?– మత్స్యకార కుటుంబాలకు అఖిలపక్షం భరోసా చీరాల అర్బన్: అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ఎమ్మెల్యే ఆమంచిని అఖిలపక్షం నాయకులు ప్రశ్నించారు. మంగళవారం వాడరేవులో పర్యటించి బాధిత మత్స్యకారులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ బాపట్ల పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ వి.అమృతపాణి మాట్లాడుతూ సముద్రంపై వేటసాగిస్తూ జీవిస్తున్న సుమారు 200 మంది మత్స్యకార కుటుంబాలకు చెందిన గుడిసెలను బలవంతంగా తీసివేయడం దారుణమన్నారు. వాడరేవులో టూరిజం అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేస్తున్న ప్రయత్నాలను వారు తీవ్రంగా ఖండించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులను ఉపయోగించుకుని ఇష్టానుసారంగా వ్యవహరించడం హేయమైన చర్యని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలహీనవర్గాల సమాఖ్య కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, దళిత గిరిజన ఫ్రంట్ కన్వీనర్ పులిపాటి బాబూరావు, ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన్.మోహన్‌కుమార్ ధర్మా, వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు బి.జైసన్‌బాబు, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేర్లి నాని, పార్టీ అధికార ప్రతినిధి దేవరపల్లి బాబూరావు, బీఎస్పీ, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఆమంచి దౌర్జన్యం
చీరాల: వాడరేవులోని మత్య్సకార మహిళపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దౌర్జన్యానికి దిగారు. నన్నే ఎదిరించి మాట్లాడతావా.. అంటూ ఆమె జీవనోపాధి అయిన చేపల బండిని తీసివేయించి ఆమె బతుకుదెరువును ప్రశ్నార్థకం చేశారు. వివరాలు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం సాయంత్రం వాడరేవు తీరం వద్ద పర్యటించారు. తీరం వద్ద చెత్తాచెదారం ఉండటంతో అక్కడ బండి మీద చేపలు అమ్ముకుంటున్న మత్య్సకార మహిళ కొండూరి అంజమ్మను పిలిచి చెత్తను ఇక్కడ ఎందుకు వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తామెందుకు చెత్త వేస్తామని ఆమె తిరిగి ప్రశ్నించింది. అంతేకాకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఉన్నా తమకేమీ ఉపయోగపడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే నోరు జాగ్రత్తగా పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా.. అసలు బండిపై చేపలు పెట్టుకునేందుకు పంచాయతీ అనుమతి ఉందా... అంటూ ప్రశ్నించారు. ఇక్కడ పెట్టుకున్న బండ్లు లైసెన్సులు లేవని ఆమె అనడంతో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే బండిని పంచాయతీ కార్యాలయంలో పెట్టమని రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డిని ఆదేశించారు. నువ్వు కావాలనే గొడవ చేసేందుకు వచ్చావని, నాతోనే వాదన పెట్టుకుంటావా..అంటూ ఎమ్మెల్యే ఆవేశంతో మాట్లాడారు. చేపలబండిని ట్రాక్టర్‌పై తీసుకెళ్లి పంచాయతీ కార్యాలయంలో పెట్టారు. ఆవేదనకు గురైన ఆమె తాము ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కావడంతోనే బండి తీసేశారని, మిగిలిన బళ్లను అక్కడే ఉంచారని ఆరోపించింది. సమస్యలపై ప్రశ్నించినందుకు తన పొట్టపై కొట్టారని అంజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. -
ఆమంచి నుంచి ప్రాణహాని
విలేకరి నాగార్జునరెడ్డి గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నన్ను చంపేందుకు కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలోనే చీరాల పోలీస్‌స్టేషన్ ఎదురుగా నాపై దాడి జరిగింది. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది’ అంటూ విలేకరి నాయుడు నాగార్జునరెడ్డి మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీ నియోజకవర్గం లో ఒక రౌడీ ఉన్నాడని’ ఆమంచి కృష్ణమోహన్‌ను ఉద్దేశించి స్వయంగా చంద్రబాబే గత ఎన్నికల సమయంలో చెప్పారని ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి గుర్తుచేశారు.ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు కృష్ణాంజనేయులు చెప్పారు. -
ఆమంచిపై ఆగ్రహ జ్వాలలు
జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడికి వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలు ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు ఫ్రీలాన్స్ జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడి చేయడాన్ని జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కుటుంబం పట్టపగలే ఏకంగా చీరాల పోలీస్‌స్టేషన్ ఎదుటే జర్నలిస్టుపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నివర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. దాడి ఘటనపై పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఖండనలు వెలువడ్డాయి. అసభ్య ఆరోపణలు చేశారనుకుంటే ప్రజాస్వామ్యపద్ధతిలో ఎదుర్కొనే అవకాశం ఉందని, న్యాయస్థానానికి వెళ్లవచ్చని, వాటిని పక్కనపెట్టి ఏకంగా భౌతికదాడులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి ఘటనను ఖండిస్తూ ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆందోళన నిర్వహించింది. యూనియన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి బ్రహ్మం నేతృత్వంలో జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ ప్రభాకరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుపై దాడిచేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జాప్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. దాడులను ఖండించారు. కనిగిరిలో ప్రింట్ మీడియా జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో అన్ని పత్రికల జర్నలిస్టులు ఆందోళనలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ద్వారా నిరసనలు తెలిపారు. ఆ తర్వాత తహసీల్దార్, సీఐలకు వినతిపత్రం సమర్పించారు. పీసీ పల్లిలోనూ స్థానిక జర్నలిస్టులు దాడి ఘటనను ఖండిస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పొదిలి తాలూకా ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్థానిక ఆర్అండ్బీ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. చీరాలలో సీపీఐ నేతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుపై దాడి ఘటనను ఖండించారు. జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడి చేసిన ఆమంచి స్వాములు, మిగిలిన వర్గాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమంచి స్వాములును అరెస్టు చేయాలి ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చీరాల రూరల్ : నాగార్జునరెడ్డిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు శ్రీనివాసరావు (స్వాములు), అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్‌ధర్మా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ బాబు డిమాండ్ చేశారు. నాగార్జున రెడ్డిపై దాడిజరిగి 24 గంటలు గడిచినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులకు తెగపడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగంలో ప్రతిఒక్కరికీ వాక్స్వాతంత్య్రం ఉందన్నారు. నియోజకవర్గానికి బాధ్యత వహించే ఎమ్మెల్యే.. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలేగానీ ఇష్టానుసారం వ్యవహరించరాదన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే..సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందన్నారు. దాడిని అపలేకపోయిన పోలీసులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమంచి శ్రీనివాసరావు, అతని అనుచరులను అరెస్టు చేయని పక్షంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. -
చీరాలలో టెన్షన్.. టెన్షన్
► ఆమంచి అనుచరుల హల్చల్ ► ‘సాక్షి’ వద్దకు వచ్చి గోడువెళ్లబోసుకున్న ప్రజాసంఘాల నాయకులు ► తన డబ్బులు, సెల్‌ఫోన్ తీసుకెళ్లాడని ఆమంచి స్వాములుపై ఫిర్యాదు ► నిందితులను అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ ► నాగార్జునరెడ్డిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే అనుచరుల ర్యాలీ చీరాల : చీరాలలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వందలాది మంది జనం రోడ్డుపైకి వచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు సోమవారం భారీగా మొహరించి హల్చల్ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు, అతని అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నాగార్జునరెడ్డి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై జరిగిన దాడిని మీడియాకు వివరించడంతో పాటు తన డబ్బులు, సెల్‌ఫోన్‌ను ఆమంచి స్వాములు తీసుకెళ్లాడని, అతనిపై చోరీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుపై దాడిచేసిన ఆమంచి స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు అరాచకాలను ప్రజాసంఘాల నాయకులు ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు తమ అవినీతి అక్రమాలపై బాస అనే మాస పత్రికలో కథనం రాసిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డిపై చీరాల గడియార స్తంభం సెంటర్లో దాడిచేసిన విషయం విధితమే. ఈ ఘటనతో నాగార్జునరెడ్డికి వైఎస్సార్ సీపీ, ప్రజాసంఘాలు, టీడీపీకి చెందిన పాలేటి రామారావు, పోతుల సునీతలు అండగా నిలిచారు. దాడిచేసిన ఆమంచి స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఆమంచి అనుచరులు కూడా ఉదయం నుంచి డ్రైనేజీ అతిథి గృహంలో పెద్దసంఖ్యలో చేరారు. సాక్షి ఓబీ వ్యాన్ వద్ద ప్రజాసంఘ నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఈ దాడిని ఖండిస్తూ మాట్లాడుతుండగా ఆమంచి అనుచరులు కూడా ముందుకు వచ్చి తాము కూడా మాట్లాడతామని గొడవకు దిగారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు.. వారిని పక్కకు పంపించారు. అనంతరం ఆమంచి అనుచరులు చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యే ఆమంచి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు దళి తులను కించపరిచేలా కథనాలు రాసిన నాయుడు నాగార్జునరెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు. పట్టణంలో ర్యాలీ చేసి సీఐని కలిసి వినతిపత్రం అందించారు. అయి తే ఉదయం కొద్దిసేపు సాక్షి ప్రసారాలు నిలిచిపోయా యి. అనంతరం తిరిగి ప్రసారమయ్యాయి. స్వాములను అరెస్టు చేయండి : వైఎస్సార్ సీపీ వినతి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డిపై దాడిచేసిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని సోమవారం రాత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ, బాపట్ల పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ వి.అమృతపాణి, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కర్నేటి వెంకటప్రసాద్, పార్టీ నాయకులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. నాగార్జునరెడ్డిపై దాడి జరిగి 24 గంటలైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దోషులSను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అయి తే 24గంటల్లో దోషులను అరెస్ట్ చేయని పక్షంలో చీరాల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్, ధర్నాకు అవకాశం కల్పించాలని సీఐని కోరారు. నన్ను చంపడానికి నాలుగుసార్లు ప్రయత్నించారు : బాధిత జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డి చీరాల ఎమ్మెల్యే, ఆయన బంధువులు గత పదేళ్లుగా చేసిన అవినీతి అక్రమాలు, దౌర్జనాలపై కథనాలు రాయడంతో పాటు మీడియాకు సమాచారం ఇస్తున్నానని నాపై కోపం పెంచుకున్నాను. నన్ను చంపేందుకు నాలుగుసార్లు ప్రయత్నించారు. ఆమంచి అక్రమాలపై 14 పేజీల వ్యాసం రాసినందుకు నన్ను చంపేందుకు కుట్ర చేశారు. చీరాలలో పట్టపగలే నాపై దాడి జరిగితే పోలీసులు చూస్తూ ఉన్నారేగానీ, చర్యలు తీసుకోలేదు. నా మరణం వరకు ఆమంచి అక్రమాలపై పోరాడతా. అరాచకాలను ప్రశ్నించినందుకు నాపై అక్రమ కేసులు పెట్టించారు. ఆమంచి సోదరుడు స్వాములు దాడిచేసిన సమయంలో నా వద్ద రూ.25 వేల నగదు, శ్యాంసంగ్ ట్యాబ్, పవర్ బ్యాంక్, కొన్ని ఏటీఎం కార్డులు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అతనిపై చోరీ కేసు నమోదు చేయాలని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. ఆమంచి స్వాములును అరెస్టు చేయాలి ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చీరాల రూరల్ : నాగార్జునరెడ్డిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు శ్రీనివాసరావు (స్వాములు), అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్‌ధర్మా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ బాబు డిమాండ్ చేశారు. నాగార్జున రెడ్డిపై దాడిజరిగి 24 గంటలు గడిచినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులకు తెగపడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగంలో ప్రతిఒక్కరికీ వాక్స్వాతంత్య్రం ఉందన్నారు. నియోజకవర్గానికి బాధ్యత వహించే ఎమ్మెల్యే.. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలేగానీ ఇష్టానుసారం వ్యవహరించరాదన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే..సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందన్నారు. దాడిని అపలేకపోయిన పోలీసులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమంచి శ్రీనివాసరావు, అతని అనుచరులను అరెస్టు చేయని పక్షంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. -
చీరాల టీడీపీలో ముసలం
ఆమంచి వర్సెస్ శ్రీరామ్ మాల్యాద్రి పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాలు నవనిర్మాణ దీక్షకు ఎంపీని ఆహ్వానించని ఎమ్మెల్యే మాల్యాద్రి, పోతుల సునీత వర్గం గైర్హాజరు ఆగ్రహంతో రగులుతున్న ఎంపీ.. అధిష్టానానికి ఫిర్యాదు భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు ఒంగోలు: చీరాల టీడీపీలో ముసలం పుట్టింది. అధికార పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిల మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆమంచి అధికార పార్టీలో చేరడాన్ని అటు పోతుల సునీత, ఇటు ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిలు ఆదిలోనే వ్యతిరేకించారు. అయినా ముఖ్యమంత్రి ఆమంచిని పార్టీలో చేర్చుకోవడంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. తాజాగా సోమవారం చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి నిర్వహించిన నవనిర్మాణ దీక్ష సభకు ఎంపీ మాల్యాద్రి, సునీత వర్గాలు హాజరుకాలేదు. దీక్షకు జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావులు హాజరైనప్పటికీ అధికార పార్టీ ఎంపీ, నియోజకవర్గ టీడీపీ నేత హాజరుకాకపోవడంపై చర్చలు మొదలయ్యాయి. ఎంపీ శ్రీరామ్, సునీతను ఎమ్మెల్యే ఆమంచి ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయినా ఇద్దరు మంత్రులు ఈ విషయం తమకెందుకన్నట్లు నోరు మెదపలేదని సమాచారం. అధికార పార్టీ కార్యక్రమానికి ఎంపీ హోదాలో ఉన్న తనను పిలవకపోవడంపై ఎంపీ మాల్యాద్రి ఆగ్రహం చెంది, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కనీసం మంత్రులు కూడా మాటమాత్రం కూడా తనను పిలవకపోవడంపై మరింత ఆవేదన చెంది, ఈ విషయంపై ఇటు జిల్లా స్థాయి, అటు రాష్ట్రస్థాయి నేతలకు ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం పోతుల సునీత వర్గం ఒంగోలులో ఉన్న ఎంపీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నాటి వైద్యశిబిరంలో విభేదాలకు బీజం.. చీరాల అధికార పార్టీలో ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, పోతుల సునీతలు ఒక వర్గంగా, ఆమంచి మరో వర్గంగా విడిపోయూరు. దీంతో అధికార పార్టీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే పోతుల, ఆమంచి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుండగా, తాజాగా ఎమ్మెల్యే బాపట్ల ఎంపీల మధ్య పోరు తీవ్రరూపం దాల్చుతోంది. ఆమంచి పార్టీలో చేరిన కొత్తలో ఎంపీ మాల్యాద్రి చీరాలలో మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేతో పాటు సునీతను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సునీత వర్గాలు అక్కడే గొడవకు దిగాయి. దీంతో ఆమంచిని ఎంపీ మందలించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. ఇక్కడే ఇరువర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎంపీ చీరాలలో ప్రత్యేక వర్గం కూడగట్టుకుంటుండాన్ని ఆమంచి వర్గం జీర్ణించుకోలేకపోతుంది. నాలుగు నెలల క్రితం చీరాలలో జరిగిన అంబేద్కర్ భవన్ ప్రారంభానికి సైతం ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులను ఆహ్వానించినా... ఎంపీని మాత్రం పిలవలేదు. తాజాగా నవ నిర్మాణ దీక్షకు సైతం పిలవకపోవడంతో మాల్యాద్రి, సునీత వర్గాలు ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. -
'ఆమంచి' అనుచరులు ... అర్ధరాత్రి వీరంగం
వేటపాలెం పోలీసుస్టేషన్లో అర్ధరాత్రి వీరంగం కుర్చీతో పాటు స్టేషన్‌లోని ఇతర సామగ్రి ధ్వంసం తొమ్మిది మందిపై కేసులు.. ముగ్గురు అరెస్టు కేసు నమోదైన వారిలో ఇద్దరు విలేకరులు వేటపాలెం : ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు వేటపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి హల్చల్ చేశారు. పోలీసుస్టేషన్‌పై ఆయన అనుచరులు దాడి చేశారు. కుర్చీలు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చీరాల రూరల్ సీఐ పాపారావు కథనం ప్రకారం.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ కారు డ్రైవర్ గోపిరాజు శుక్రవారం ఉదయం బైకుపై బైపాస్‌లో వెళ్తున్నాడు. ఆ సమయంలో బైకును ఎస్సై చంద్రశేఖర్ అపి లెసైన్‌స పత్రాలు అడిగారు. అవి లేకపోవడంతో ఆయన బైకును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బైకుకు సంబంధించిన పత్రాలు తెచ్చి చూపాలని, ఆ తర్వాతే బైకు తీసుకెళ్లాలని గోపిరాజుకు ఎస్సై తేల్చి చెప్పారు. అదేరోజు అర్ధరాత్రి ఎమ్మెల్యే అనుచరుడు, కొత్తపేటకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు తులసీరామ్, గోపిరాజు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పాటు మరో ఆరుగురు పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. సెంట్రీ విధుల్లో ఉన్న వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తులసీరామ్, కారు డ్రైవర్ గోపీరాజు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిలో తులసీరామ్, గోపీరాజు, వెంకటేశ్వర్లును అరెస్టు చేసి దర్శి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఇంకా మరో ఆరుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. వారిలో ఇద్దరు విలేకరులు ఉన్నారు. జర్నలిస్టుల ఖండన పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన కేసులో ఇద్దరు విలేకరుల పేర్లు చేర్చడం దారుణమని జర్నలిస్టులు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి వివరాలు సేకరించేందుకు వెళ్లిన విలేకరులపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కేసులు నమోదై ఉన్న విలేకరుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, ప్రింట్ మీడియా ప్రతినిధి (సాక్షి కాదు) ఉన్నారు. స్టేషన్‌పై దాడి జరిగిన సందర్భంలో సదరు విలేకరులు ఇద్దరూ అక్కడే ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. -
రేపు టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్
హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధమైంది. ఆయన బుధవారం టీడీపీలో చేరనున్నారు. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ చేరికపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఆమంచి చేరికను.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పోతుల సునీత వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు శిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, పోతుల సునీతలు మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోతుల సునీతను చంద్రబాబు బుజ్జగించే పనిలో పడినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఆమంచి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కాగా, 2014 ఎన్నికల్లో ఆమంచి త్రిముఖ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆమంచి.. అనంతరం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పోతుల సునీతతో పాటు మరో కీలక ఎంపీ సహా కొందరు మంత్రులు ..ఆమంచి చేరికను అడ్డుకున్నారు. -
చనిపోయిన వ్యక్తికి వైద్యం..
⇒చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుని బంధువుల ఆందోళన ⇒రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించి మోసం చేశారని మండిపాటు ⇒వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందని ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చీరాలలో ‘ఠాగూర్’ తరహా మోసం ఠాగూర్ చిత్రంలో ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఓ ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి మృతుని బంధువుల నుంచి వైద్యులు రూ.లక్షలు దండుకుంటారు. విషయాన్ని కథానాయకుడు గ్రహించి వైద్యుల గుట్టురట్టు చేస్తాడు. చీరాలలో అచ్చం అలాగే జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందించారు. బంధువులతో రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరకు గుంటూరు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ ఆటో డ్రైవర్‌ను పరిశీలించిన వైద్యులు.. ఇతడు చనిపోయి ఇప్పటికే రెండు రోజులైందని చెప్పడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరొక్కసారి అందరూ ఠాగూర్ చిత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చీరాల : వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన గవిని నాగరాజు (30) పురుగుమందు తాగి గత నెల 20న ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అప్పులు పాలవడంతో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో పురుగుముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నాగరాజును చీరాలలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. 15 రోజులు పాటు చికిత్స అందించారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. గురువారం సాయంత్రం 3గంటల సమయంలో నాగరాజుకు సీరియస్‌గా ఉందని, గుంటూరు తరలించాలని వైద్యులు చెప్పడంతో బంధువులు హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు. నాగరాజు చనిపోయి రెండు రోజులైందని వైద్యులు ధ్రువీకరించడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుని బంధువులు, గ్రామస్తులు పోస్టుమార్టం అనంతరం చీరాల వచ్చి గడియారస్తంభం వద్ద ధర్నా చేశారు. వైద్యశాల అద్దాలు పగలగొట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆందోళన చేశారు. 15 రోజులు పాటు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరకు ప్రాణాలు పోగొట్టారని, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను నియంత్రించారు. ఈ సంఘటనపై వైద్యశాల డాక్టర్లు మాత్రం తమ తప్పు ఏమీలేదని, సక్రమంగా వైద్యం చేశామని, అవసరమైతే కేసు పెట్టుకోవాలని ఉచిత సలహా కూడా ఇవ్వడం గమనార్హం. విచారణ జరిపించండి : ఎమ్మెల్యే ఆమంచి నాగరాజు మృతిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచించారు. ఆటో డ్రైవర్ మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని, వైద్యశాలను సీజ్ చేయాలని కోరారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాగరాజు మృతదేహాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పోతుల సునీత పరిశీలించారు. మృతుని బంధువులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామన్నారు. -
బీజేపీలోకి ‘ఆమంచి’?
-
బీజేపీలోకి ‘ఆమంచి’?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో ఆమంచి త్రిముఖ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీ సానుభూతి ఎమ్మెల్యేగా ఉంటానని మీడియా ముందు ప్రకటించారు. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పోతుల సునీత మరో కీలక ఎంపీతో పాటు కొందరు మంత్రులు పార్టీలో ఆమంచి చేరికను అడ్డుకున్నారు. దీంతో ఆయన కొద్దినెలలుగా రాజకీయాలకు దూరంగా ఉండి సొంత కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన ఆమంచి నియోజకవర్గంలో పలు అధికారక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులను చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కేసులో మొదటి ముద్దాయి ఆయనే. ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆయన సోదరుడి ఇసుక క్వారీపై దాడులు జరిగాయి. 12లారీలను సీజ్ చేసి సోదరుడుపై నాన్ బెయిల్‌బుల్ కేసులు బనాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరితే కేసులు, ఇతరత్రా సమస్యల నుంచి గట్టెక్కవచ్చన్నది ఆయన నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ అయిన కొణిజేటి రోశయ్యకు ఏకలవ్య శిష్యుడైన ఆమంచి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఆయన వర్గం కూడా ఖండించకపోవడం గమనార్హం. -
బీజేపీలోకి చీరాల ఎమ్మెల్యే?
చీరాల : హస్తం వీడి కమలం చేతబట్టిన కాంగ్రెస్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో మాజీ ఎమ్మెల్యే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్ కాషాయ కండువ కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గతంలో ఆయన టీడీపీలో చేరుకుందు ప్రయత్నించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి టీడీపీకి మద్దతు కూడా ప్రకటించారు. అయితే ఆమంచి టీడీపీలోకి వచ్చే విషయంలో స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత రావటంతో సైకిల్ ఎక్కేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈనేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదే సామాజిక వర్గానికి చెందిన ఆమంచితో బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చలు జరపటంతో ఆయన కమలం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆమంచి ఆయనకు కుడిభుజంగా ఉండేవారు. -
బీజేపీలోకి చీరాల ఎమ్మెల్యే?
హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నాయకులతో ఆమంచి సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఆమంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఆమంచి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలసి బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బాహాబాహీ
చీరాల: జన్మభూమి కార్యక్రమం చీరాలలో అపహాస్యమైంది. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన వేదిక కాస్తా..వీధి తగాదాకు నెలవైంది. తమ గోడు చెప్పుకుందామని వచ్చిన ప్రజలు రాజకీయ నేతల మధ్య జరిగిన ఘర్షణ చూసి..వీరా తమ తలరాత మార్చే నేతలంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రొటోకాల్ రేపిన వివాదంతో ఎమ్మెల్యే ఆమంచి, టీడీపీ ఇన్చార్జ్ పోతుల సునీతల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నేతలు, వారి అనుచరులు అధికారుల ముందే పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కాలనీలో ఏర్పాటు చేశారు. సభలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో జీ సాంబశివరావు ప్రారంభించి వేదికపైకి సర్పంచ్ దుడ్డు రూపవతి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తహశీల్దార్ బీ సత్యనారాయణలను పిలిచారు. తర్వాత సర్పంచ్ రూపావతిని అధ్యక్షత వహించాలని ఎంపీడీవో కోరారు. అప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీత వేదిక వద్ద ఉన్నారు. ఆమంచి వర్గీయులు ‘ఆమంచి జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీడీపీ సర్పంచ్ రూపావతి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీతను వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఎటువంటి ప్రొటోకాల్ లేకున్నా..సునీతను వేదికపైకి ఆహ్వానించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాల్సిన ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ని వేదికపైకి పిలవడంపై తొలుత మాటల యుద్ధం నడవగా..చివరకు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలను పిలవడం ఏమిటని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అయితే సర్పంచ్ మాత్రం ‘నేనే గ్రామానికి పెద్ద. మా నేత వేదికపైకి వస్తే మీకేంటి’ అని అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీనికి ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ ఇది రాజకీయ కార్యక్రమం కాదని..ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆమంచి, పోతుల వర్గీయులు కుర్చీలు, కర్రలతో దాడులకు దిగారు. ఆమంచి వర్గీయులు కొందరు సర్పంచ్‌పై దాడి చేశారు. సునీత వర్గీయులు కూడా ఆమంచి వర్గీయులపై దాడులు చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుని, తోసుకున్నారు. ఆమంచి, సునీత మధ్య దూషణల పర్వం కొనసాగింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆగ్రహానికి గురైన సునీత విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆమంచి వర్గీయురాలు అనుకొని చేయిచేసుకోవడంతో పాటుగా దుర్భాషలాడారు. టూటౌన్ సీఐ అబ్దుల్సుబాన్, ఎస్సై రాములు నాయక్, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ మహిళా కానిస్టేబుల్‌పై సునీత దాడిచేస్తున్నా నిలువరించలేకపోయారు. చివరకు సునీతను పోలీసులు పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. జన్మభూమి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్యెల్యే పట్టుబట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఈనెల 10 తేదీకి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒన్‌టౌన్ సీఐ బీమానాయక్ సునీత, ఆమంచిలతో చర్చించి గ్రామ సభ నుంచి వెళ్లాలని సూచించగా ఇరువర్గాలు ఒకరి తరువాత ఒకరు సభాప్రాంగణం నుంచి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఘర్షణలో గ్రామసర్పంచ్ డి.రూపవతిపై ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు దాడిచేయడంతో గాయాలయ్యాయి. దీంతో సర్పంచ్‌ని వైద్యసేవల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె పోలీసులకు ఫిర్యాదు చే శారు. పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న ఘర్షణలో ఎమ్యెల్యే ఆమంచి సోదరుడు స్వాములు కూడా ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా ఏఎస్పీ వి.రామానాయక్ గ్రామాన్ని సందర్శించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సర్పంచ్ డి.రూపవతిని పరామర్శించి సంఘటన వివరాలు సేకరించారు. చంద్రబాబు ఆదేశాలతోనే జన్మభూమిలో పాల్గొంటున్నాం: పోతుల సునీత జన్మభూమి- మాఊరు కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జులు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకే జన్మభూమిలో పాల్గొన్నాం. కానీ ఎమ్యెల్యే ఆమంచి చేతకాని వ్యక్తిగా ప్రవర్తించారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకుని మా పార్టీ వారిపై దాడి చేయించారు. అధికారులను బెదిరించారు. ఇటువ ంటి వ్యక్తులకు భయపడేది లేదు. పోలీసులు సర్పంచ్‌పై దాడిచేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇది పార్టీ కార్యక్రమమా? - ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ జన్మభూమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం. టీడీపీ సమావేశంలాగా సునీత వేదికపైకి రావడం సరికాదు. అధికారుల అలసత్వం, అవగాహనా లోపం వలనే ఇలా జరిగింది. శనివారం దేవినూతల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ సునీతను వేదికపైకి ఆహ్వానించకుండా ఉండాల్సింది. ఇకపై ఆమె మరో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాల వేదికపైకి రాకుండా ఉండాలి. సర్పంచ్ రూపావతి జన్మభూమి కార్యక్రమాన్ని ఆటంకపరిచారు. జన్మభూమిలో పంచాయతీ అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నాం. మరలా ఇదే గ్రామంలో జన్మభూమిలో పాల్గొని అభివృద్ధికి చర్యలు చేపడతాను. -
చీరాలలో జన్మభూమి రచ్చ రచ్చ
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని విజయనగర కాలనీలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ఆదివారం రచ్చ రచ్చ అయింది. జన్మభూమి కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ పోతుల సునీతను ఆహ్వానించడంపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏ అర్హతతో వచ్చావో చెప్పాలని ఆమంచి వర్గీయులు సునీతను డిమాండ్ చేశారు. దీంతో సునీతతోపాటు ఆమె వర్గీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ ఆమె వర్గీయులు ఆమంచి వర్గీయులపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదే క్రమంలో పోతుల సునీతను అదుపులోకి తీసుకునేందుకు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించారు. దీంతో సునీత ఆగ్రహంతో మహిళ కానిస్టేబుల్‌పై దాడి చేసింది. -
నాపై ఆరోపణలు నిరూపించండి
చీరాల ఎమ్మెల్యే ఆమంచి దుర్మార్గుడు విలేకరులతో టీడీపీ నేత పోతుల సురేష్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తనపై వస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆర్వోసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ధర్మవరంలో తన స్నేహితులను కలుసుకునేందుకు వెళ్తే ఓ ఎస్సై తనను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడని గురువారం అతని అరెస్టుపై వివరణ ఇచ్చారు. వాస్తవం తెలసుకుకోకుండా మీడియాలోని ఒక వర్గం తనపై బురదజల్లే ప్రయత్నం చేసిందని, తనపై పెద్ద సంఖ్యలో కేసులున్నాయని ప్రచారం చేసిందని మండిపడ్డారు. తనపై ఆరోపణలు ఉంటే పదేళ్ల కాలంలో ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దుర్మార్గుడని, అవినీతిపరుడని తాము మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు హత్యలు జరిగాయని, ఇసుక కుంభకోణంతో పాటు పలు అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆమంచి నిర్దోషని తేలితే తాను గంట కూడా చీరాలలో ఉండనని స్పష్టం చేశారు. తాను ఆర్వోసీలో పనిచేసిన సమయంలో తనపై కావాలని చాలా కేసులు పెట్టారని, వాటన్నింటి నుంచి తాను నిర్దోషిగా బయటపడ్డానని పోతుల చెప్పారు. సమావేశంలో ఆయన భార్య సునీత కూడా ఉన్నారు. -
మినీ మహానాడులో రభస
ఒంగోలు: ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో రభస జరిగింది. చీరాలలో గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. అతనిని పార్టీలోకి రానివ్వొద్దని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టిడిపి అధిష్టానం ఆమంచిని పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో కార్యకర్తలు వ్యతిరికేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత టీడీపీ నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావులు ఆమంచిని తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఆమంచి కృష్ణమోహన్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమంచి కృష్ణమోహన్ టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అతనిని పార్టీలో చేర్చుకోవడానికి సాంకేతికపరమైన ఇబ్బందులేమైనా ఉంటే ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా ఆమంచిని కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుని కలవడానికి ముందు ఆమంచి జనసేన వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా, ఆమంచి చేరిక విషయంలో కొంత మంది టీడీపీ సుముఖంగా ఉండగా, మరి కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిడిపి బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన శ్రీరాం మాల్యాద్రికి చీరాల శాసనసభ స్థానంలో ఆధిక్యత ఓట్లు లభించాయి. ఇది ఆమంచిని ఆ పార్టీలో చేర్చుకోవడానికి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆమంచి తన పట్టును నిరూపించుకున్నారు. ఈ పరిస్థితులలో అతనిని టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక టిడిపి కార్యకర్తలు మాత్రం ఆమంచి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.