
సాక్షి, హైదరాబాద్ : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త‍్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమంచి తన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ... త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు. (టీడీపీకి ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా)
ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. కొద్ది రోజుల క్రితం ఆమంచి పార్టీ మారుతున్నారని వార్తల నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే చీరాల నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పార్టీలో లేనివారి ప్రమేయం ఎక్కువగా కావడం వల్లే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆమంచి తెలిపారు. మరోవైపు ఆమంచి రాజీనామాతో ... టీడీపీ నేత కరణం బలరామ్‌ను...చీరాల వెళ్లి పార్టీ పరిస్థితిని సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment