
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీ రాజకీయాలు చేస్తున్నారని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ నేతలే తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. దీంతో ఆరు నెలల్లో టీడీపీ మూతపడటం ఖాయమని పేర్కొన్నారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డబ్బులిచ్చి, ప్రలోభపెట్టి చేర్చుకున్నారని విమర్శించారు. గతంలో చేరికలకు, ఇప్పటి చేరికలకు చాలా తేడా ఉందన్నారు. అందరి సహకారంతో కలిసి పని చేస్తామని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment