Chirala
-
ఇసుక దందాతో తాగునీటికి కటకట
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఇసుక దందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి ఏకంగా జాతీయ స్థాయికి చేరింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటాయని, తాగునీటికి కటకట తప్పదని వేటపాలెం మండలం పుల్లరిపాలెంలోని సాయి ఎస్టీ కాలనీ వాసులు యానాది హక్కుల పరిరక్షణ సంఘం పేరున నవంబర్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.‘రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఎస్టీ కాలనీ సమీపంలోని ఇసుక దిబ్బల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పరిసర ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉండడంతో తవ్వకాల వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన కొందరికి అప్పగించారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతకు పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. వేటపాలెం ప్రాంతం నుంచి బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు సైతం ఇసుక భారీగా తరలిపోతోంద’ని వారు వివరించారు. ఈ విషయమై తక్షణం విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. అయితే అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులు నవంబర్ 27న తొలి విచారణ సందర్భంగా బాధితులనే బెదిరించారు. ఈ విషయమై ఎస్టీలు మరోమారు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తహసీల్దార్, పోలీసు, ఇతర అధికారులతో కూడిన బృందం ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తూ విచారించాలని ఆదేశించింది. కాగా, తాము చెప్పినట్లు విచారణలో చెప్పాలని, ఇక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగడంలేదని అధికారులు రాసిన పేపర్లలో సంతకాలు పెట్టాలని అధికార పార్టీ నేతలు.. ఎస్టీలను బెదిరించినట్లు సమాచారం. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అని అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాము న్యాయవాదిని నియమించుకుని సమాధానం ఇస్తామని శుక్రవారం విచారణకు వచి్చన అధికారులకు బాధితులు తేల్చి చెప్పారు.మామూళ్ల మత్తులో అధికారులు! వేటపాలెం ప్రాంతంలో ఇప్పటికే కనుచూపు మేర రొయ్యల చెరువులు వెలిసి, కెమికల్స్ ప్రభావంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఇప్పుడు ఇసుక తవ్వకాల వల్ల వేసవిలో తాగునీటి కోసం తమ కుటుంబాలకు ఇబ్బందులు తప్పవని యానాది హక్కుల పరిరక్షణ సంఘం ప్రెసిడెంట్ ఇండ్ల స్వాతి, సెక్రటరి పోలయ్య, కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ విషయమై మండల, జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది. అయినా కొందరు అధికారులు ఇసుక మాఫియా నుంచి నెల మామూళ్లు పుచ్చుకుంటుండటంతో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం. -
డ్రైనేజీ భూముల్లో టీడీపీ గద్దలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్‌తోపాటు పచ్చ నేతల కన్ను ఇప్పుడు ప్రభుత్వ భూములపై పడింది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని డ్రైనేజీ (ప్రభుత్వ) భూములపై పచ్చనేతతోపాటు ఒక మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, ఇన్నాళ్లూ ఆ భూములను కాపుకాసిన విశ్రాంత అధికారి కన్నూ పడింది. తలో ఇంత పంచుకున్నారు. ఎటువంటి పట్టాలు పొందే అవకాశం లేని ఆ ప్రభుత్వ భూములను ఏకంగా అమ్మకానికి పెట్టారు. అగ్రిమెంట్ల మీదనే ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు అమ్మారు. వీటిలో ఎక్కువ భూములను మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దొరకబుచ్చుకున్నారు. ఆ భూముల్లో రొయ్యల చెరువుల సాగుకు సిద్ధమయ్యారు. వేటపాలెం మండలం సంతరావూరు బ్రిడ్జి సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే రొంపేరు డ్రైన్, ముసలమ్మ మురుగు నీటి కాలువల మధ్య 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. డ్రైన్స్ నిర్మాణంలో భాగంగా వాటిని పూర్వం ప్రభుత్వం కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం వరకు వేటపాలెం ప్రాంతంలో ఉన్న కుమ్మరులు (శాలివాహనులు) కుండలు, ఇతరత్రామట్టి పాత్రలు తయారు చేసేందుకు ఆ భూముల్లో ఉన్న బంకమట్టిని తీసుకువెళ్లేవారు. అప్పట్లో ఆ భూముల ఆక్రమణకు కొందరు నేతలు ప్రయత్నించగా కుమ్మరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత మట్టి పాత్రలకు డిమాండ్ పడిపోయి తయారీ నిలిచి పోవడంతో కుమ్మరులు వాటిని వదిలేశారు. దీంతో ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.వాలిపోయిన పచ్చ మూకలుఇప్పుడు వాటిని పరిరక్షించే వాళ్లు లేకపోవడంతో పచ్చ మూకలు వాలిపోయాయి. చీరాల ప్రాంతానికి చెందిన టీడీపీ నేత అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, మరికొందరు ఆ భూములను ఆక్రమించారు. 10 మంది కలిసి 15 ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేసేవారు. ఇంకొందరు కొన్ని భూములు వారివంటూ హద్దులు గీసుకున్నారు. వేటపాలేనికి చెందిన డ్రైనేజీ విభాగం విశ్రాంత అధికారి సైతం కొంత మేర ఆక్రమించారు. వాస్తవానికి డ్రైనేజీ, డొంక, శ్మశాన తదితర పోరంబోకు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వదు. ఇక్కడ కూడా ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని సమాచారం. కానీ టీడీపీ నేతల అనుచరులు ఇప్పటికే సుమారు 18 ఎకరాలు ఆక్రమించడంతో పాటు, అప్పటికే ఆక్రమించిన వారి వద్ద భూములను కూడా ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు కొన్నారు. ఇలా ఇప్పటివరకూ 30 ఎకరాలకుపైగా డ్రైనేజీ భూములు విక్రయాలు జరిగినట్లు సమాచారం. డ్రైనేజీ విభాగం రిటైర్డ్ అధికారి సైతం కొన్ని భూములను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. వీటన్నింటినీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడొకరు కొంటున్నారు. ఈ భూముల ఆక్రమణ, అమ్మకాలను అడ్డుకోవాల్సిన డ్రైనేజీ విభాగం అధికారులు కూడా కబ్జాదారులతో కుమ్మక్కైపోయారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారి ఉంటాయని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, డ్రైనేజీ భూములను కొందరు సాగు చేసుకుంటున్న విషయం తన దృష్టిలో ఉందని, ఆక్రమణలు విషయం తన దృష్టికి రాలేదని మురుగునీటిపారుదల శాఖ డీఈ వెంకట సుబ్బారావు చెప్పారు. విచారణ జరిపి క్రయవిక్రయాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నేతన్న కంట కన్నీళ్లు
చీరాల: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం. చీరాలతోపాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్ వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. జీఎస్టీ రద్దు హామీ అమలయ్యేనా..? మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. చేనేత వృత్తులు చేసే వారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. చేనేతలు కూటమి సర్కారులో మేలు జరగకపోగా చేనేతలు కునారిల్లుతున్నారు. చేనేత వృత్తిలో రాణించలేక చివరకు కారి్మకులు ఇతర వృత్తుల వైపు తరలిపోతున్నారు. కరువైన నేతన్న నేస్తం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బడ్జెట్లో చేనేతలకు రూ.200 కోట్లు కేటాయింపుతోపాటుగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు అందించారు. చేనేతలకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల తలరాత మార్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లలో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066 శాతం కేటాయించారని కారి్మక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కలగానే చేనేత పార్కు.. చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా నమ్మబలికారు. నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖ మంత్రి సవిత హాజరై చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప టెక్స్టైల్స్ పార్కు గురించి ప్రస్తావించలేదు. చేనేత వృత్తి చేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు లేవు. కనీస వేతన చట్టానికి దిక్కేది? కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలి ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కారి్మకుడికి కూలి తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కారి్మకులకు ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదలైతే పార్కు పనులు ప్రారంభిస్తాం హ్యాండ్లూమ్ పార్కుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పార్కు పనులు ప్రారంభిస్తాం. మగ్గం కార్మికులకు 200 విద్యుత్ యూనిట్లపై మార్గదర్శకాలు అందలేదు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కార్మికుడికి అందాల్సిన రూ.24 వేలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే కార్మికుడికి అందిస్తాం. ఆప్కో ద్వారా కొంత మేర స్వయం సహకార సంఘాల ద్వారా కొనుగోలు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెడుతున్నాం. – నాగమల్లేశ్వరరావు, హ్యాండ్లూమ్, ఏడీ -
బియ్యం ఇస్తే ఓకే.. లేదంటే ‘6ఏ’ అస్త్రం
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని ఒక రేషన్ డీలర్ (ఇతను రేషన్ మాఫియాలో నెలకు రూ.25 వేల జీతానికి పనిచేస్తున్నాడు) మండలంలో ఉన్న రేషన్ డీలర్ల నుంచి మాఫియా తరఫున నెలనెలా బియ్యం సేకరించి అప్పగిస్తాడు.ఇదే మండలంలో కూతురు పేరుతో రేషన్ షాపు నడుపుతున్న మరో డీలర్‌ను బియ్యం ఇవ్వాలని నవంబరు 2న కోరాడు. అమ్మకాలు పూర్తికాలేదని, బియ్యం తర్వాత ఇస్తానని ఆ డీలర్ చెప్పాడు. దీంతో డీలర్ కం మాఫియా ఉద్యోగి వెంటనే రేషన్ మాఫియాను నడిపిస్తున్న ‘ఒంగోలు ప్రసాద్’కు ఫోన్‌చేశాడు.బియ్యం అడిగితే డీలర్ స్పందించడంలేదని, అతను మనకు సక్రమంగా బియ్యం ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశాడు. అంతే.. రేషన్ షాపులు పర్యవేక్షించే ఎన్ఫోర్స్మెంట్ అధికారికి ప్రసాద్ ఫోన్ కొట్టి తనకు బియ్యం ఇవ్వని రేషన్ డీలర్‌ను వెంటనే బుక్‌చేయాలని హుకుం జారీచేశాడు. అరగంటలో అక్కడ వాలిన అధికారి షాపును తనిఖీచేసి 92 బస్తాల బియ్యం అధికంగా ఉన్నాయంటూ ఆ డీలర్ వివరణ కూడా తీసుకోకుండా సిక్స్–ఏ కింద బుక్‌చేసి వెంటనే ఆయనను తొలగించారు. కొసమెరుపు ఏంటంటే రేషన్ మాఫియాలో నెలజీతానికి పనిచేస్తున్న వేటపాలెంకు చెందిన డీలర్‌కే ఈ డీలర్షిప్ అప్పగించారు. బియ్యం విషయంలో చీరాల రూరల్ పరిధిలోని ఒక డీలర్‌తో రేషన్ మాఫియాకు నవంబరులో గొడవైంది. ఏకంగా డీలర్‌పైనే రేషన్ మాఫియా మనుషులు దాడిచేసి కొట్టారు. రేషన్ డీలర్ చీరాల టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదైంది. చీరాల నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. రేషన్ మాఫియా ఆగడాలు శృతిమించాయనడానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణ.సాక్షి ప్రతినిధి, బాపట్ల: పేదల బియ్యాన్ని చవగ్గా కొట్టేసి రీసైక్లింగ్ చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న మాఫియా, రేషన్ డీలర్లను శాసిస్తోంది. పేదల కడుపుకొట్టి మొత్తం చౌక బియ్యాన్ని తమకే అప్పగించాలని బెదిరిస్తోంది. ఈ ప్రాంతంలో ఓ పచ్చనేత ఇలాగే రేషన్ మాఫియా నుంచి రూ.20 లక్షలు కప్పం పుచ్చుకుంటున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో రెచి్చపోతున్న మాఫియా రేషన్ డీలర్లతో కుమ్మక్కైంది. ఈ అక్రమ వ్యాపారం తొలిరోజుల్లో కార్డుదారులకు కిలోకు రూ.8 నుంచి రూ.10.. డీలర్లకు రూ.13 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యానికి డిమాండ్ నెలకొనడంతో ఎక్కువ ధర ఇస్తామని వ్యాపారులు పోటీపడుతున్నారు. కిలో బియ్యానికి రూ.10 నుంచి రూ.13 ఇస్తామని లబ్ధిదారులకు.. అదే సమయంలో డీలర్లకు రూ.16 ఇస్తామని చెబుతున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో.. లబ్దిదారులు, డీలర్లు ఇంకా ఎక్కువ మొత్తం కోరుతున్నారు. మరోవైపు.. నియోజకవర్గ పచ్చనేతల డిమాండ్ కూడా పెరిగింది. ప్రారంభంలో చీరాల ప్రాంతంలోని ఒక పచ్చనేతకు నెలకు రూ.12 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న మాఫియా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచినట్లు సమాచారం. ఇలా పచ్చనేతకు పెద్ద మొత్తంలో కప్పం కడుతున్న చీరాల మాఫియా రేషన్ డీలర్లను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. కొందరు ఎక్కువ మొత్తం కావాలని డిమాండ్ చేస్తూ బియ్యం సక్రమంగా ఇవ్వకపోవడంతో ఈ మాఫియా ప్రైవేటు సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగడమే కాక ఏకంగా భౌతికదాడులకు తెగబడుతోంది. రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సైతం నెలనెలా మామూళ్లు ఇస్తుండడంతో వారు మాఫియాకు దన్నుగా నిలుస్తున్నారు. వారిని అడ్డుపెట్టి మాటవినని డీలర్లపై సిక్స్–ఏ కేసులు నమోదు చేయించి డీలర్లను తొలగిస్తున్నారు. ఇలా తొలగించిన వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్న చుట్టుపక్కల డీలర్లకు ఈ షాపులను అప్పగిస్తున్నారు. దీంతో.. పచ్చనేత, అధికారుల మద్దతు ఉండడంతో రేషన్ మాఫియా ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఉంటోంది. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు బియ్యం అస్సలు ఇవ్వకుండా మొత్తం బియ్యం తీసేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కార్డులు రద్దుచేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో రీసైక్లింగ్ చేసి కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. కొందరు జిల్లాస్థాయి అధికారులు మాఫియాతో కుమ్మక్కై తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోవడంతో రేషన్ దందా జోరుగా సాగుతోంది. సిక్స్–ఏ కేసు అంటే..ప్రభుత్వ రేషన్ షాపుల్లో అవకతవకలు జరిగితే రెవెన్యూ అధికారులు (ఎన్ఫోర్స్మెంట్ డిటీ, తహసీల్దారు తదితరులు) ఈ 6ఏ కేసులు నమోదు చేస్తారు. ప్రధానంగా డీలర్ వద్ద ఉన్న స్టాకు రికార్డులకు అనుగుణంగా ఉండకపోతే ఈ కేసులు పెట్టడం పరిపాటి. విచారణలో నిజమని తేలితే ఆర్డీఓ స్థాయిలో డీలర్‌ను తొలగించవచ్చు. రాజకీయంగా ఎలాంటి మద్దతు లేకపోతే ఈ కేసు బుక్ చేసిన వెంటనే తహసీల్దార్ స్థాయిలోనే డీలర్íÙప్ నిలిపివేసి వేరొకరికి కేటాయిస్తారు. -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్‌రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
చీరాలలో యువకుడి హత్య
చీరాలటౌన్: చీరాలలో ఆదివారం దారుణహత్య జరిగింది. పండ్ల వ్యాపారి వద్ద పనిచేసే యువకుడు చిన్న కారణానికే కత్తితో పొడిచి క్యాటరింగ్ షాప్ నిర్వాహకుడు కంచర్ల సంతోష్ (36)ను హత్యచేశాడు. పట్టణ సీఐ పి.శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు.. కంచర్ల సంతోష్ (36) సంగం థియేటర్ సమీపంలో (ఖానాఖజానాలో) అయ్యప్ప క్యాటరర్స్ నిర్వహిస్తూ కర్రీ పాయింట్ కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడ రోడ్డు మీద పండ్ల వ్యాపారాలు జరుగుతుంటాయి. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పండ్ల వ్యాపారి చిన్న వద్ద పనిచేసే ఉమామహేశ్వరరావు తాగునీటి క్యాన్‌ను నీటితో కడిగాడు. ఆ నీరు ఎదురుగా ఉన్న అయ్యప్ప క్యాటరర్స్ ఖానాఖజానా దుకాణం వద్దకు చేరాయి. ఈ విషయమై కర్రీ పాయింట్లో పనిచేసే మహిళలు ఉమామహేశ్వరరావును ప్రశి్నంచారు. దీంతో అతడు వారిపై వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ మహిళలు తమ యజమాని సంతో‹Ùకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన సంతోష్ ఈ విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఉమామహేశ్వరరావు పండ్లు కోసే కత్తితో సంతోష్‌ని పొడిచాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన సంతోష్‌ను స్థానికులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి ఉన్నారు. ఘటనాస్థలాన్ని, సంతోష్ మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉమామహేశ్వరరావును, పండ్ల వ్యాపారి చిన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. -
హత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్
చీరాల/చీరాల అర్బన్: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం సీతారాంపేటకు చెందిన యువతిపై హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీతారాంపేటకు చెందిన పౌజుల సుచరిత (21) ఇంటర్ వరకు చదివి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఆ యువతి ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ తరువాత రైల్వే ట్రాక్ పక్కన ముళ్లపొదల్లో వివస్త్రగా ఆమె మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారని హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు సవాల్‌గా తీసుకుని 10 బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. గంజాయి మత్తులో.. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. ఈపూరుపాలెం గ్రామానికే చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహే‹Ù, దేవరకొండ శ్రీకాంత్ ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలింది. నిందితులు ముగ్గురినీ శనివారం సాయంత్రం చీరాల బైపాస్ రోడ్డు వద్ద హాయ్ రెస్టారెంట్ సమీపంలోని వాడరేవు వెళ్లే రోడ్డులో 50 మీటర్లు దూరంలో అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గంజాయి మత్తుకు బానిసలైన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున రైల్వేట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని ఏ1 విజయ్, ఏ2 మహేష్ బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్ళారు. యువతి నోరుమూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడి చేయడంతోపాటు నోరు, ముక్కు మూసి హత్య చేశారన్నారు. ఆ ఇద్దరికీ ఏ3 శ్రీకాంత్ ఆశ్రయం కల్పించాడన్నారు. ముగ్గురు నిందితులకు నేరచరిత్ర ఉందని.. వారిపై చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు. అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, బాపట్ల డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ దర్యాప్తు చేశారన్నారు. ముగ్గురు నిందితులపై కోర్టులో చార్జిïÙట్ వేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి యువతి హత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులను శనివారం సునీత పరామర్శించారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ ఆకురాతి పద్మిని, గంజి చిరంజీవి ఉన్నారు. ఇదిలావుండగా.. హత్యాచారానికి గురైన పౌజుల సుచరిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించారు. యువతిపై హత్యాచార ఘటన దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
చీరాలలో హత్యాచారం!
చీరాల: బహిర్భూమికి వెళ్లిన యువతి(21)పై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వలస వచ్చిన బాధితురాలి కుటుంబం చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురంలో నివసిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన బాధితురాలు రెండేళ్లుగా ఇంటి వద్ద టైలరింగ్ పనులతో కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. బాధితురాలు పెద్ద కుమార్తె. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు బహిర్భూమికి వెళ్లిన బాధితురాలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో తండ్రి వెళ్లి చూడగా శరీరంపై దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉండటం చూసి భీతిల్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. కొందరు యువకులు మద్యం తాగుతూ బహిర్భూమికి వెళ్లే మహిళల పట్ల ఆ ప్రాంతంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి ముఠా పనే! సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో యువతి మృతదేహాన్ని పరిశీలించారు. బాధితురాలిపై గంజాయి ముఠా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటన కలిచివేసిందన్నారు. చేనేత మగ్గం పనులపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబంలో యువతి హత్యకు గురికావడం దారుణమన్నారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో నార్కోటెక్ సెల్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. గంజాయి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అందజేశారు. -
చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
చీరాల టౌన్/చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ అనుచరులు జరిపిన దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం గవినివారిపాలెం పోలింగ్ కేంద్రానికి కొండయ్య యాదవ్ అనుచరులతో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారు. దీన్ని రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆయనపై కొండయ్య దురుసుగా ప్రవర్తించారు. ఇదే అదనుగా ఆయన అనుచరులు రాడ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదారు.పోలీసుల కళ్లముందే ఇదంతా జరుగుతున్నా చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ, డీఎస్పీ బేతపూడి ప్రసాద్ చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోవడానికి యత్నించలేదు. పైగా దాడిలో గాయపడిన చీదరబోయిన రమణమ్మ, మరో ముగ్గురిని బలవంతంగా పక్కకు నెట్టేశారు. గవిని శ్రీను, మరో నలుగురు వైఎస్సార్సీపీ నాయకులను పోలీసు జీపులో ఎక్కించుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడకు చేరుకున్న కొండయ్య కుమారుడు మహేంద్ర, అతని అనుచరులు కర్రలతో వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు డీఎస్పీ బేతపూడి ప్రసాద్ రంగంలోకి దిగి కొండయ్యను బతిమిలాడి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత పిట్టువారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ టీడీపీకి ఓట్లు వేయకపోతే అందరి అంతూ చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి దౌర్జన్యంచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కొండయ్య గెలవాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ నేత బలగంశెట్టి అంకమ్మరావుపై దాడికి దిగారు. రెడ్డిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద అంకమ్మరావు ప్రజలకు నమస్కరిస్తూండగా కారులోంచి దిగిన ఆమంచి దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కరణంపై ఆమంచి దాడిచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో కలసి బీభత్సం సృష్టించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు పట్టణంలోని ఏడో వార్డుకు సోమవారం సాయంత్రం వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌ను కులం పేరుతో దూషించి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తన అనుచరులతో కలసి దాడికి తెగబడ్డారు. వెంకటేష్ కారు అద్దాలు పగులకొట్టించారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చీరాల వన్‌టౌన్, టూటౌన్ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమంచి వర్గీయులను అక్కడ నుంచి పంపించి వేశారు. -
చంద్రబాబు ఓ మోసగాడు..
-
చీరాలలో బడుగుల జాతర
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బడుగు, బలహీనవర్గాల సాధికార జాతర జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికారతను చీరాల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎలుగెత్తి చాటారు. సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బçస్సు యాత్రలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి ప్రారంభమైన యాత్రకు వీధి వీధిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్ర అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ నేతృత్వంలో గడియారం సెంటర్లో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైఎస్ జగనే మళ్లీ సీఎం అంటూ స్లోగన్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. అంబేడ్కర్, పూలే ఆశయాల సాధకుడు సీఎం వైఎస్ జగన్: మంత్రి నాగార్జున దేశ చరిత్రలో అంబేడ్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్, వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక విప్లవం సాధించారని అన్నారు. చంద్రబాబు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారని, జగన్ మాత్రం అంబేడ్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి పేద పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించి, వారికి విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ముళ్లపొదల్లో పడేస్తే వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తల ఎత్తుకునేలా చేశారన్నారు. తెలంగాణలో పార్టీని పెట్టి, ఏపీతో సంబంధం లేదని చెప్పిన షర్మిల.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చంద్రబాబు కుట్రలో పావుగా మారారన్నారు. సీఎం జగన్ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలను దోషులుగా చిత్రీకరించింది బాబే: ఎంపీ నందిగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అక్రమంగా కేసులు పెట్టి దొంగలుగా, దోషులుగా చిత్రీకరీంచి చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబేనని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక పదవులిచ్చి దొరలను చేస్తున్నారన్నారు. ఎంపీలను చేసి పార్లమెంటులో ప్రధాని పక్కన కూర్చోబెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు జగనన్నతోనే: కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సుపరిపాలన అందిస్తున్న జగనన్నతోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. అర్హతే ప్రామాణికంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ జగనన్నను సీఎంగా ఎందుకు చేయాలంటే..: మోపిదేవి రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగుల సాధికారత, పేదలకు పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ముందంజలో ఉండాలన్నదే సీఎం జగన్ తపన అని తెలిపారు. 2024 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా నందిగం సురేష్, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కరణం వెంకటేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
సిలోన్ కాందిశీకుల కల నెరవేరింది
చీరాల: వారంతా శ్రీలంకలో బతకలేక.. ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో తమిళనాడుకు వలస వచ్చారు. జీవనోపాధి కోసం వచ్చిన కాందిశీకులకు వసతులు, ఉపాధి కష్టంగా మారింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీలంక కాందిశీకులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అప్పట్లో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి కాందిశీకులకు ఉపాధి కల్పించింది. కాగా.. 1980లో చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం దేశాయిపేట వద్ద కేంద్ర ప్రభుత్వం నూలు మిల్లు ఏర్పాటు చేసింది. ఆ మిల్లులో పనుల కోసం దాదాపు 200 శ్రీలంక కాందిశీక కుటుంబాలను చీరాల తరలించారు. నూలు మిల్లు పక్కనే 10 ఎకరాలు స్థలాన్ని కేటాయించి కాందిశీకులకు కాలనీ కట్టించి ఇళ్లు కేటాయించారు. ఆ కాలనీలో కాందిశీకులు నివాసం ఉంటూ నూలుమిల్లులో పనులు చేసుకుంటూ జీవించేవారు. నూలు మిల్లులు నష్టాల పాలవడంతో వాటన్నింటినీ మూసివేశారు. 2000 సంవత్సరంలో చీరాల నూలు మిల్లు కూడా మూతపడింది. అప్పటినుంచి కాందిశీకులు ఈ ప్రాంతంలోనే ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నారు. కాందిశీకుల కల నెరవేర్చిన జగన్ దేశాయిపేటలో నిర్మించిన సిలోన్ కాలనీలో ఇళ్లలో నివాసం ఉంటున్న కాందిశీకులకు ఆ ఇళ్లపై ఎటువంటి హక్కు లేకుండా పోయింది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిలోన్ కాలనీలో నివాసం ఉంటున్న కాందిశీకులందరికీ ఇంటి పట్టాలు అందజేశారు. దీంతో వారికి ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కు లభించింది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది శ్రీలంక నుంచి చీరాల వచ్చి స్థిరపడిన కాందిశీకులకు 42 ఏళ్ల తరువాత సొంత గూడు ఏర్పాటుకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సిలోన్ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాం. కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా. – కరణం బలరాం ఎమ్మెల్యే, చీరాల ఇళ్ల పట్టాలు ఇచ్చారు 43 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వలస వచ్చాం. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సిలోన్ కాలనీలో ఉంటున్నాం. ఆ ఇళ్లపై మాకు పూర్తి హక్కులు లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం వాటికి పట్టాలు మంజూరు చేసింది. – ఎం.శివనాడియన్, సిలోన్ కాలనీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సిలోన్ కాలనీలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నూలుమిల్లు మూసివేసిన తరువాత ఈ ప్రాంతంలోనే వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయాం. కాలనీలో ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. – ఎం.సత్యవేలు, సిలోన్ కాలనీ -
సోము వీర్రాజుకు నిరసన సెగ..!
-
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ చీరాల వాసులు
-
సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్‌లో.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల నడుమ జరుగుతున్న ఆధిపత్య పోరులో సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. కాల్పుల విరమణతో విరామం ప్రకటించడంతో.. అక్కడి నుంచి విదేశీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఈ క్రమంలో ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ వయా జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్నారు. తొలి బ్యాచ్‌గా.. ఢిల్లీకి చేరుకున్నారు 360 మంది భారతీయులు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు వర్ధన్ కూడా ఉన్నారు. సూడాన్‌లోని పరిస్థితుల గురించి సాక్షితో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు చీరాల. నేను డిప్లోమా చేశాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఆరేళ్ల కిందట సూడాన్ వెళ్లాను. ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను తిరిగి రావాల్సి వచ్చింది. సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితులు లేవు. అక్కడి నుంచి బయటపడితే చాలని బయలుదేరాం. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల వద్ద ఉన్న వాటన్నింటిని దోచుకుంటున్నారు. సూడాన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదని తెలిపారాయన. ‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ భవన్ అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏపీ భవన్లో ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇంటికి చేరేవరకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు’’ అని విష్ణువర్థన్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సూడాన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఏపీఎన్ఆర్టీఎస్ రంగంలోకి దిగింది. సూడాన్‌లో రాష్ట్రానికి చెందిన 58 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లలో ఇప్పటికే సగానికి పైగా జెడ్డాకు చేరుకున్నారు. అటు నుంచి ఢిల్లీకిగానీ, ముంబైకిగానీ చేరుకునే వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చే బాధ్యతలను, అందుకు అయ్యే ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. హెల్ప్‌లైన్ నెంబర్లు.. 0863 2340678 వాట్సాప్ నెంబర్ 85000 27678 ఇదీ చదవండి: మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి నలిగిపోయినట్లు.. -
భద్రాద్రి రాములోరి కల్యాణానికి చీరాల గోటి తలంబ్రాలు
చీరాల: భద్రాద్రి సీతారాముల కల్యాణం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఎనలేని భక్తిభావం. అవకాశం ఉన్నవాళ్లు భద్రాద్రి వెళ్లి ఆ కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోతారు. వెళ్లలేని వాళ్లు టీవీల్లో వీక్షిస్తూనే భక్తిభావంతో ఉప్పొంగిపోతారు. సీతారాముల కల్యాణ క్రతువులో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తలంబ్రాలలో వినియోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి స్వామివారికి సమర్పించే అవకాశం క్షీరపురిగా పిలిచే చీరాల వాసులకు వరుసగా తొమ్మిదోసారి దక్కింది. సీతారాముల కల్యాణానికి వడ్లను గోటితో ఒలిచి ఇక్కడి నుంచి పంపించడం ఈ ప్రాంత ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ మహాసంకల్పానికి చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు పూనుకుని నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11మందితో ఏర్పాటైంది. వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం పూర్వజన్మ సుకృతంలా వచ్చింది. తలంబ్రాల కొరకు వడ్లను ఎంతో శ్రమంచి ఒలిచి, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి.. నియమనిష్టలతో, శాస్త్రోక్తంగా తలంబ్రాలు చేస్తారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2015 అక్టోబర్ 23న చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో.. ఏటా వందలాది భక్తులు పాల్గొంటున్నారు. విదేశాల్లోని వారికీ భాగస్వామ్యం రాములోరి కల్యాణానికి అవసరమైన తలంబ్రాలను తయారు చేసే క్రతువులో స్థానికంగానే గాక దేశ, విదేశాల్లోని తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని 10 వేల మంది భక్తులు ఇందులో భాగస్వాములయ్యారు. కమిటీ ప్రతినిధులు సీతారామ కల్యాణ వైభోగం, భద్రాద్రి సీతారామ కల్యాణం పేర్లుతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న భక్తులను గ్రూపుల్లో చేర్చుకుని ఆయా ప్రాంతాలలో పర్యవేక్షకులుగా ఉన్న వారి ద్వారా భక్తులకు వడ్లు ఇచ్చారు. మరికొందరికి కొరియర్ ద్వారా పంపారు. అమెరికా నుంచి నాలుగేళ్లుగా వక్కలగడ్డ వెంకటేశ్వరరావు, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే దక్షిణాఫ్రికాలో 400 మంది భక్తులు మూడు సంవత్సరాలుగా వడ్లు ఒలిచి పంపిస్తున్నారు. ఇక్కడ ఆత్మకూరి శ్రీనివాసరావు, అప్పాజోస్యుల వీరవెంకటశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 25న భద్రాద్రికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, భద్రాద్రికి తీసుకెళ్తారు. పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం మాకు కలగడం పూర్వజన్మ సుకృతమే. ప్రతి సంవత్సరం మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్న విధానంపై దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే. – పొత్తూరి బాలకేశవులు, చీరాల -
క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు
కొత్తపట్నం/చీరాల టౌన్: బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుపోగా.. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆదివారం సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న ఏడుగురు మత్స్యకారుల బృందం ఓడరేవు గ్రామం నుంచి గరికన కృష్ణ, మల్లె బంగారయ్య, మెరుగు శివ, కుక్కల మహేష్, మరద పౌలు, దాసరి పంపోజీ, మెరుగు ప్రసాద్ (డ్రైవర్) సముద్రంలో నెల్లూరు జిల్లా వైపు బయలుదేరారు. 4 రోజుల పాటు వేట కొనసాగించారు. ఆ సమయంలో మాండూస్ తుపాను హెచ్చరికలు వెలువడటంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం వీరి మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోగా.. కాసేపటికే ఆ బోటులోని ఒక ఇంజన్ చెడిపోయింది. అలల ఉధృతికి బోటు ముందుకు సాగలేదు. దీంతో వారు నడిసంద్రంలోనే బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా ముందుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం మొబైల్ సిగ్నల్స్ పనిచేయడంతో టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తాము ఆపదలో ఉన్నామని అధికారులకు సమాచారమిచ్చారు. యంత్రాంగం అప్రమత్తం సమాచారం తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మెరైన్, మత్స్యశాఖ, స్పెషల్ బ్రాంచ్, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులతో ఫోన్లో సంప్రదించగా.. రాకాసి అలలు ఉధృతంగా వస్తున్నాయని బోటు తిరగబడే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపట్నం సమీపంలోని గుండమాల రేవుకు వెళ్తామని అధికారులకు చెప్పగా.. చీరాల మత్స్యశాఖ జేడీ పి.సురేష్, ఇతర అధికారులు కొత్తపట్నం బీచ్‌కు చేరుకున్నారు. అనంతరం మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడి.. వారిని గుండమాలకు వెళ్లొద్దని, కొత్తపట్నం బీచ్‌కు రావాలని, తాము ఇక్కడే ఉన్నామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వారంతా శనివారం రాత్రి 9 గంటలకు కొత్తపట్నం సమీపానికి వచ్చారు. అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో ముందుకు రాలేమని చెప్పి బీచ్‌కు 500 మీటర్ల దూరంలో లంగర్ వేసుకుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగం కొత్తపట్నం బీచ్‌కు చేరుకుని వేరే బోటును తీసుకెళ్లి వారిని తీసుకొచ్చారు. -
వినూత్న కేజ్ కల్చర్.. అద్భుత ప్యా‘కేజ్’
అలరారే అపార మత్స్య నిక్షేపాలకు ఆలవాలమైన నడి సంద్రంలో వినూత్న కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టడం ఓ సాహసం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి పది యూనిట్ల సమాహారం (ప్యాకేజ్)తో భారీ ప్రాజెక్టుకు నడుం కట్టడం నిజంగా అద్భుతం. ఈ పెను విప్లవానికి నాంది పలికారు చీరాల మండలం వాడరేవు యువకులు. కడలిపై వానర సైన్యం వారధి కట్టినట్టు.. వీరు భారీ పంజరాన్ని (కేజ్) నిర్మించి విజయవంతంగా సాగర జలాల్లోకి పంపారు. మహాద్భుత ఘట్టాన్ని కళ్లెదుటే ఆవిష్కరించి ఔరా అనిపించారు. చీరాల : మనం చెరువులు, కుంటలలో చేపలు, రొయ్యల పెంపకం చూసుంటాం. సముద్రంలో మత్స్య సాగును అసలు ఊహించలేం. ఈ అనూహ్య పరిణామాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు చీరాల మండలం వాడరేవు యువకులు. సముద్రంలో భారీ కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టారు. ఇతర దేశాల్లో ఉన్నదే.. చెరువులు, కుంటల్లో రొయ్యలు, చేపల సాగుకు కొన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. తరచూ మత్స్య సంపదకు వ్యాధులు సోకుతున్నాయి. దీని నుంచి తప్పించుకోవడం ఎలా.. అనే ప్రశ్న నుంచే సముద్రంలో మత్స్యసాగు చేయాలనే వినూత్న ఆలోచన పుట్టుకొచ్చింది. నిజానికి కేజ్ కల్చర్ కొత్తేమీ కాదు. పలు దేశాల్లో ఉన్నదే. మన దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విశాఖ ప్రాంతంలోనూ కొందరు ఈ సాగును చేస్తున్నారు కూడా. ఆచరణ ఇలా.. చీరాల మండలం వాడరేవుకు చెందిన రాకాతి శివ మత్స్యకారుడు. ఫైబర్ బోట్ల తయారీలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇతని మేనల్లుళ్లు ఉస్మాన్, సతీష్ వైజాగ్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఆ సమయంలో సముద్రంలో చేపల సాగు (మెరీ కల్చర్) గురించి తెలుసుకుని మేనమామకు చెప్పారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థ నుంచి వివరాలు సేకరించారు. శివ, మేనల్లుళ్లు ఇద్దరితో పాటు వాడరేవుకు చెందిన మరో ఏడుగురు మిత్రులతో కలిసి బృందంగా ఏర్పడి కేరళ, తమిళనాడు, విశాఖపట్నం, కాకినాడలలో చేపడుతున్న కేజ్ కల్చర్‌ను పరిశీలించారు. భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వాడరేవులో అలల సాంద్రత, మత్స్య ఉత్పత్తి అనుకూలంగా ఉందని సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో 2018లో మత్స్యశాఖ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి తొలి అడుగు పడింది. అయితే కరోనా వల్ల నిర్మాణ పనులు ఆలస్యమైనా ఎట్టకేలకు గతనెల 6న భారీ కేజ్ జల ప్రవేశం చేసింది. వంద టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఆరు నెలల్లో వంద టన్నుల మత్స్య ఉత్పత్తులు లక్ష్యంగా ఈ కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టారు. సముద్రంలో 9 కిలోమీటర్ల దూరంలో ఈ కేజ్‌ను నిలిపి సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రొయ్య, చేప పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీని కూడా ప్రారంభించి రోజూ లక్ష పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోనున్నారు. మత్స్య సంపద రవాణా, రాకపోకలకు అనుకూలంగా పడవలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో జూన్ 15 వరకు సాగుకు విరామం ప్రకటించారు. నిర్మాణం.. ప్రత్యేకం.. ఈ భారీ కేజ్ పంజరంలా ఉంటుంది. 145 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో 2,700 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. కేజ్ మధ్యలో నిలువు, అడ్డంగా దారుల ఏర్పాటుతోపాటు సిబ్బంది నివాసం, దాణా నిల్వకు రెండు గదుల నిర్మాణం, చేపలు, రొయ్యల సాగుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు అమర్చారు. జనరేటర్లూ అందుబాటులో ఉంచారు. తుప్పు పట్టని తేలికపాటి ఇనుప పైపులు తయారీకి వినియోగించారు. 3.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర మత్స్యశాఖ ఉన్నతాధికారులు ఈ కేజ్ నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి సూచనలు అందించారు. రూ.1.50 కోట్లతో.. నీలి విప్లవం పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2017–18లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 41 కేజ్ కల్చర్ యూనిట్లను మంజూరు చేసింది. విడివిడిగా అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని భావించిన శివ బృందం అప్పటి మత్స్యశాఖ అధికారుల సహకారంతో ఒక సంఘంగా ఏర్పడింది. ఒక్కో యూనిట్ కాకుండా పది యూనిట్లను కలిపి ఏక ప్యాకేజ్‌గా దరఖాస్తు చేసుకుంది. దీంతో రూ.50 లక్షల రుణం మంజూరైంది. రూ.37 లక్షల రాయితీ వచ్చింది. దీనికి అదనంగా ఈ బృందం మరో రూ.కోటి వెచ్చించి భారీ కేజ్ కల్చర్‌ను రూపొందించింది. బహుళ ప్రయోజనకారి చీరాల వాడరేవులో తొలిగా కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టాం. సీఎంఎఫ్ఆర్ఐ, మత్స్యశాఖ సహకారంతో భారీ ప్రాజెక్టును చేపట్టగలిగాం. సముద్రంలో మత్స్య సాగు ప్రయోజనకరంగా ఉంటుంది. పలు చోట్ల ఈ కేజ్ కల్చర్ అమల్లో ఉంది. వాడరేవుకు ఖ్యాతిని తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలో మత్స్య ఉత్పత్తిలో చీరాల ప్రాంతం ముందుంటుంది. మత్స్యకారులకు ఉపాధి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనకారి. – రాకాతి శివ, కేజ్ నిర్మాణకర్త, వాడరేవు ఇదో విప్లవం వాడరేవులో ఏర్పాటు చేసిన భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఓ విప్లవం. యువకుల అంకితభావం, మత్స్యశాఖ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. సముద్రంలో భారీ కేజ్ నిలుపుదలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాం. మత్స్యశాఖ తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తాం. – ఎ.చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖాధికారి, ఒంగోలు -
చీరాల బీచ్‌లో బాలయ్య ఫ్యామిలీ సందడి
-
చీరాలలోని శివాలయాలకు పోటెత్తిన భక్తులు
-
Chirala: చీరాలలో బంగారం నల్ల వ్యాపారం
ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా గోల్డ్ బిస్కెట్ల అక్రమ వ్యాపారం మాయా బజారును తలపించే రీతిలో జోరుగా సాగుతోంది. సౌదీలోని ఖతర్ నుంచి వాయు, జలమార్గాల ద్వారా కస్టమ్స్ కళ్లుగప్పి దేశానికి బంగారం వస్తోంది. అక్రమార్కుల ద్వారా దర్జాగా చీరాల చేరుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చీకటి వ్యాపారం ఊపందుకుంది. తక్కువ ధరకే వస్తుండడం వ్యాపారులకు లాభసాటిగా మారింది. సుంకాలు ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరో వైపు తక్కువకే బంగారం ఇస్తామనే కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. చీరాల: వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాలకు మినీ ముంబయిగా పేరుంది. తాజాగా బంగారం జీరో దందా వ్యాపారం విస్తరిస్తోంది. కొందరు సుంకాలు ఎగ్గొట్టి తక్కువ ధరకు బంగారాన్ని వర్తకులకు విక్రయిస్తుంటే.. మరి కొందరు ఈ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకురావాలంటే కస్టమ్స్, జీఎస్టీ పన్నులు 17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అవి చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెప్పి తీసుకొస్తున్నామని, అందువల్లే చౌకగా బంగారం దొరుకుతుందని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సౌదీ నుంచే స్మగ్లింగ్ బంగారు గనులు విస్తారంగా ఉన్న సౌదీలోని ఖతర్ నుంచి స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా తెచ్చిన బంగారాన్ని ఏజెంట్ల ద్వారా చీరాల, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి లెక్కా పత్రాలు లేకుండా తక్కువ ధరకు లభిస్తుండడంతో వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సాగుతోంది. ఇక్కడ బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఆభరణాల తయారీ కూడా జరుగుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి జీఎస్టీ బిల్లు కాకుండా ఎస్టిమేషన్ బిల్లులే ఇవ్వడం విశేషం. అందుకే అక్రమార్కులు చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 17 శాతం పన్నుల్లో సుమారు 5 నుంచి 7 శాతం తక్కువ ధరకే బిస్కెట్లు దొరకడంతో చీరాల, తెనాలిలోని బంగారం వ్యాపారులతో పాటు అనధికారికంగా కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. చీరాలలో 75 వరకు, తెనాలి ప్రాంతంలో 200కుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. కస్టమ్స్‌లో ఉద్యోగమని.. చీరాలకు చెందిన పి.రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2017 నుంచి చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020లో తెనాలిలో బులియన్ మార్కెట్లో మదన్ అనే బంగారం వ్యాపారితో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా చీరాలలోని పలు బంగారం దుకాణాలతో పాటు కొందరు వ్యక్తులకు మార్కెట్ ధర కంటే 5 నుంచి 10 శాతం తక్కువకు ఇవ్వడం మొదలు పెట్టాడు. చీరాల చుట్టు పక్కల బంగారు వ్యాపారులతో పాటు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసే మరి కొందరిని ఆకర్షించాడు. చాలా కాలంగా తాను కస్టమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. కస్టమ్స్ డ్యూటీతో పాటు జీఎస్టీ లేకుండా బంగారం తెచ్చి అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం ఈ వ్యాపారం సజావుగా సాగింది. ఈ మార్గంలో అయితే భారీగా సంపాదించలేననుకున్నాడో ఏమోగానీ, 700 బిస్కెట్లకు (ఒక్కో బిస్కెట్ 100 గ్రా.) అడ్వాన్సుగా పలువురు వర్తకుల వద్ద డబ్బు తీసుకున్నాడు. చివరికి వారికి బంగారం ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్సును స్వాహా చేశాడు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు, ఇతర వ్యక్తులు చీరాల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యాపారుల వద్ద నుంచి రూ.3.50 కోట్లకుపైగా నగదు తీసుకుని అతని జల్సాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అందులో బయటపడని వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. తమ అక్రమ వ్యాపారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వారంతా మౌనం దాల్చారు. మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. బంగారం వ్యవహారంపై దృష్టి సారిస్తున్నాం తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పే కేటుగాళ్లపై దృష్టి సారించాం. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికే ఒక ఏజెంట్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.24 లక్షల నగదు, కొంత బంగారం రికవరీ చేశాం. బంగారం వ్యాపారులు కూడా కేటుగాళ్ల మాయమాటలు వినిమోసపోవద్దు. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు. – పి.శ్రీకాంత్, డీఎస్పీ, చీరాల మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. -
చిన్న ముంబైలో పెద్ద మోసం..
చీరాల: జిల్లాలో చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో భారీ బంగారం మోసం వెలుగు చూసింది. మోసగాళ్లు కొందరు బంగారం వ్యాపారులకు బంగారం బిస్కెట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని నిలువునా మోసం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో మోసగాళ్ల ముఠాలోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతో విషయం బయటపడింది. సుమారు రూ.35 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఒక్కో బిస్కెట్ బరువు 100 గ్రాములు. అలాంటివి 700 బంగారం బిస్కెట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన కొందరికి బంగారం బిస్కెట్లు ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. అందరి ‘బంధువు’గా వ్యవహరించే ఓ వ్యక్తి ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పాటు స్వయంగా ఎస్పీ మలికా గర్గ్‌కు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ..జరిగింది గతంలో చీరాల రూరల్ ప్రాంతాల్లో ర్యాప్‌లు (దొంగ బంగారం విక్రయం) జరిగాయి. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి తీరా డబ్బులు తీసుకుని వారిపైనే దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటీవల చౌకగా బంగారం దొరుకుతుందని కొందరు ఏజెంట్లు బంగారం వ్యాపారులకు ఆశ కల్పించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని వారిని బురిడీ కొట్టించారు. ఎటువంటి బిల్లులు లేకున్నా వ్యాపారులు కూడా బిస్కెట్ల కోసం డబ్బులు కట్టి ఇప్పుడు నిలువునా మోసపోయారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కస్టమ్స్ ఆఫీసర్‌గా చెప్పుకున్న వ్యక్తి, ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇతను కాస్త డిఫరెంట్... ఆటోలో గార్డెన్
చీరాల: ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు ఈ ఆటోవాలా. ‘నే ఆటోవాణ్ణి.. ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి’ అంటూ ప్రయాణికుల్ని ఎక్కించుకుని రయ్యిన దూసుకుపోతున్నాడు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన సీహెచ్ జక్రయ్య. మొక్కల పెంపకానికి అనువైన స్థలం లేకపోవడంతో జక్రయ్య తన ఆటోలోని ముందు భాగంలో ప్రత్యేకంగా ట్రే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మొక్కలు పెంచేందుకు అనువుగా మట్టి, రాళ్లు వేసి గార్డెన్‌లా తయారు చేశాడు. మొక్కలకు పోసే నీరు కిందికి వెళ్లేలా ఓ పైపును అమర్చాడు. చదవండి: ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి ఓపీఎం వెనుక డ్రగ్ మాఫియా! -
ఇలాంటి వింత చేపను ఎప్పుడూ చూడలేదు..!
చీరాలటౌన్: చీరాల వాడరేవు సముద్ర తీర ప్రాంతానికి గురువారం వింత చేప కొట్టుకువచ్చింది. తెల్లని రంగులో మూడు కళ్లుతో కేజీన్నర బరువు ఉన్న ఈ చేప రబ్బరులా సాగుతోంది. వాడరేవు సముద్ర తీరం ఒడ్డున వింత ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో మత్స్యకారులు భయ్చాందోళన చెందారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆకారంతో వింతగా ఉన్న చేపలను తాము చూడలేదని తెలిపారు. కిలోన్నర బరువుతో వింతగా మూడు కళ్లుతో ఉన్న చేపను తిలకించేందుకు మత్స్యకారులతో పాటుగా చాలామంది తీరానికి చేరుకున్నారు. ఇలాంటి వింత చేపను తామెన్నడూ చూడలేదని చీరాల మత్య్సశాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
'20 ఏళ్లలో ఎన్నో అవమానాలు'
సాక్షి, ప్రకాశం: సంవత్సరాలుగా పోరాడిన బీసీలకు దక్కని రాజ్యాధికారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేయడం, 56 మందిని చైర్మన్లుగా, 728 మందిని డైరెక్టర్లుగా ఎంపిక చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేశారు. చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. 'బీసీ మహిళగా ఉన్న తనను 20 ఏళ్లపాటు చంద్రబాబు ఎన్నో అవమానాల పాలు చేశాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. 'పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏడాదిన్నర కాలంలోనే అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది' అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృతపాణి, మాజీమంత్రి పాలేటి రామారావు, బీసీ కమిషన్ మెంబర్ ముసలయ్య పాల్గొన్నారు. -
చీరాల: మందలించాడని మర్డర్ చేశాడు
-
దారుణం: మందలించాడని రిటైర్డ్ ఏఎస్ఐ మర్డర్
సాక్షి, ప్రకాశం: చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గొడవ చేయొద్దని మందలించినందుకు రిటైర్డ్ ఏఎస్ఐ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. రౌడీ షీటర్ సురేంద్ర మద్యం మత్తులో స్థానికంగా ఇళ్ల వద్ద రోజూ గొడవ చేస్తున్నాడు. అక్కడే నివాసముండే రిటైర్డ్ ఏఎస్ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు గొడవ చేయొద్దని సురేంద్రను మందలించాడు. దీంతో గత అర్ధరాత్రి ఇంట్లో చొరబడి నాగేశ్వరరావుపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలోఉన్న నిందితుడు సురేంద్ర కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. (చదవండి: రౌడీషీటర్ షానూర్‌పై హత్యాయత్నం) -
ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, ఒంగోలు: మాస్క్ వివాదంలో ప్రాణాలు విడిచిన చీరాల యువకుడు కిరణ్ కేసులో ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటుపడింది. కిరణ్‌పై పోలీసులు దాడి చేయడం వల్లే మృతి చెందాడని ఆరోపణల నేపథ్యంలో చీరాల ఎస్సై విజయ్‌కుమార్‌ని సస్పెండ్ చేస్తూ ఎస్పీ గంగాధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. చీరాలలోని థామస్‌పేటకు చెందిన ఎరిచర్ల మోహన్‌రావు, హెప్సీబాల కుమారుడు కిరణ్‌కుమార్ (26), స్నేహితుడు షైనీ అబ్రహాంతో కలిసి ఈనెల 19వ తేదీన తన పల్సర్ వాహనంపై వెళుతుండగా కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఔట్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి మాస్కు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా, వారు వాగ్వావాదానికి దిగారు. ఎస్ఐ విజయ్‌కుమార్ వారిని పోలీస్ జీపులో తరలిస్తుండగా, మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు దాడి చేశారని పేర్కొంటూ కిరణ్, షైనీలు ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలైన కిరణ్‌ను అదే రోజు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. (మాస్కు వివాదం.. యువకుడి బలి) (చీరాల ఘటనపై సీఎం జగన్ సీరియస్) -
కిరణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమంచి
సాక్షి, ప్రకాశం: మాస్క్ వివాదంలో ప్రాణాలు విడిచిన యువకుడు కిరణ్ మృతదేహానికి చీరాల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత నివాళర్పించారు. యువకుడి అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కిరణ్ మృతిపై విచారణ చేస్తామని అడిషనల్ ఎస్పీ గంగాధర్ తెలిపారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు దాడి చేయడం వల్లనే ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తుండగా, మాస్కు ఎందుకు వేసుకోలేదని అడిగినందుకు తమతో వాగ్వాదానికి దిగాడని, అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు తీసుకెళ్తుండగా పోలీస్ జీపు నుంచి కిందకు దూకాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేయించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతి చెందిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
చీరాల ఘటనపై సీఎం జగన్ ఫైర్
-
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్ లాఠీతో కిరణ్‌ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. -
ఆందోళన వద్దు: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: చీరాలో వెలుగు చూసిన రెండు కరోనా పాజిటివ్ కేసుల వ్యక్తులు 280 మంది బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్, క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. (పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!) కాగా ప్రస్తుతం వారి రిపోర్టులు రావాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక మిగతా వారిని కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వెల్లోచ్చిన బృందంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం.. వీరివెంట అధిక సంఖ్యలో ప్రజలు ఉండటంతో కొంత భయానక వాతావారణం నెలకొందన్నారు. దీనిపై ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన పడొద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు, వైద్యులు చెప్పిన సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు కఠిన తరం అయినప్పటికీ పాటించక తప్పదని మంత్రి సూచించారు. (ఇంటికెళ్లాలని ఉంది: కనికా కపూర్) -
ప్రకాశం జిల్లాలో ప్రమాద ఘంటికలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరోనా వైరస్ (కోవిడ్–19 ) దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 19వ తేదీన ఒంగోలు నగరంలోని ఓ యువకునికి తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే సదరు యువకుని కుటుంబ సభ్యులకు, తనతో ప్రయాణించిన వ్యక్తులకు సైతం రిపోర్టులు నెగిటివ్ రావడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే శనివారం ఒంగోలు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న చీరాలకు చెందిన ముస్లిం మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. (ఒకట్లూ, పదులు, వందలు.. నేడు వేలు!) ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తి నివాసముండే చీరాల చుట్టు పక్కల ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించి నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రజలు స్వీయ నియంత్రణే ఆయుధంగా అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలను అందుబాటులోకి తెచ్చామని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి అనుమానితులను అందులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వలంటీర్ల సాయంతో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఇళ్లకే పరిమితం కావాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. (క్వారంటైన్ కేంద్రం ఎలా ఉంటుందంటే..) ముస్లిం మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆయనతో పాటు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ వార్డులకు తరలించే పనిలో పడ్డారు. చీరాల రూరల్ మండలం సాల్మన్ సెంటర్ పంచాయతీ పరిధిలోని నవాబ్‌పేటకు చెందిన ముస్లిం మతపెద్ద ఈ నెల 19వ తేదీన సుమారు 80 మంది ముస్లింలతో కలిసి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. (మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ) ఈ నెల 15న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన మతపెద్దతో కూడిన బృందం విజయవాడ మీదుగా 17వ ఉదయం చీరాలకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే మతపెద్ద ప్రయాణించిన భోగీలో చీరాల, పేరాల, కారంచేడు, ఈపురుపాలెం, ఒంగోలుకు చెందిన ఐదుగురు ప్రయాణించినట్లు అధికారులకు సమాచారం అందింది. వీరంతా మతపెద్దతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు తేలడంతో వీరందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సదరు మతపెద్ద చీరాలకు వచ్చిన తరువాత నవాబ్‌పేట మసీదులో ప్రార్థనలు చేయడంతో పాటు రెండు వివాహ కార్యక్రమాలకు సైతం హాజరైనట్లుగా చెబుతున్నారు. దీంతో ఆయనతో పాటు ప్రయాణించిన వారి గురించి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. (కోవిడ్‌తో స్పెయిన్ యువరాణి మృతి!) చీరాలలో భయం..భయం చీరాల ప్రాంతం కరోనా కబంద హస్తాల్లోకి వెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేయడంతో ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ కరోనా వైరస్ కబళిస్తుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పంజా చీరాలపై పడింది. చీరాల మండలం సాల్మన్ సెంటర్ పంచాయతీలోని నవాబుపేటలో గురువారం రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. నవాబుపేటకు చెందిన భార్య, భర్తలకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన ప్రత్యేక అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. (ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ) రక్త పరీక్షల అనంతరం శనివారం వారిద్దరికీ కరోనా వైరస్ ఉన్నట్లుగా రిపోర్టులు రావడంతో చీరాల ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కరోనా మహమ్మారి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో చీరాల ప్రాంత వాసులల్లో వణుకు మొదలైంది. అయితే కరోనా బాధితులు ఎక్కడెక్కడకు వెళ్లారు... ఎవరిని కలిశారు అనేది తెలియాల్సి ఉంది. దీంతో బాధితులతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తుల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. సుమారు 50 నుంచి 60మందిని ఐసోలేషన్‌కు తరలించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే 1056 మంది విదేశీ ప్రయాణికులను సర్వేలేన్స్లో ఉంచారు. (కరోనాతో చిన్నారి మృతి; తొలి కేసు!) పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడకు వెళ్లారో పరిశీలిస్తే.. మార్చి 12: చీరాల మండలం సాల్మన్‌సెంటర్ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు. మార్చి 14: ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. మార్చి 14,15,16: మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. మార్చి 17: ఢిల్లీలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరారు. మార్చి 19: ఒంగోలులో రాజీవ్ గృహకల్ప కాలనీలో కుమారుడి ఇంటి వద్ద ఉన్న భార్యను తీసుకుని అదే రోజు అర్ధరాత్రి 2 గంటలకు చీరాలకు చేరుకున్నారు. మార్చి 20 నుంచి 25వ తేదీ వరకు చీరాలలో ఉన్నారు. ఆ సమయంలో ఒక వివాహానికి, ఒక ముస్లిం కుటుంబంలో జరిగిన అంత్యక్రియలకు హాజయ్యాడు. 20వ తేదీ శుక్రవారం మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నాడు. మార్చి 25: భార్యాభర్తలు ఇద్దరికి దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం రావడంతో వారిని ఏఎన్ఎం పరీక్షల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మార్చి 26: దంపతులిద్దరికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. శనివారం వారికి కరోనా పాజిటివ్‌గా రావడంతో నవాబుపేట ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. రెడ్‌జోన్‌గా గుర్తించి రాకపోకలు నిలిపివేశారు. అయితే కరోనా అనుమానితులుగా వైద్యశాలకు తరలించిన వెంటనే ఆ ప్రాంతంలో అధికారుల బృందం పర్యటించింది. బ్లీచింగ్, శానిటేషన్ పనులు చేశారు. బాధితుడి నివాసం పరిసర ప్రాంత ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి భరోసా కల్పించారు. -
ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటు పడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం పరిశీలనకు వస్తున్నారు. -
కాశీ వెళ్లే ప్రయత్నాల్లో ఉండగానే.. కటకటాల్లోకి..!
సాక్షి, చీరాల రూరల్: ఓ వ్యక్తి వ్యసనాలకు బానిసై అందిన కాడికి అప్పులు చేసి జులాయిగా తిరుగుతూ ఇంటిని కూడా విక్రయించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న మాజీ భార్యను కర్రతో మోది హత్య చేశాడు. ఆమె మాజీ భర్తను ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చీరాల రూరల్ మండలం తోటవారిపాలెం పంచాయతీ బండారు నాగేశ్వరరావు కాలనీకి చెందిన నీలం కృష్ణమూర్తి, ఆదిలక్ష్మి (39) భార్యాభర్తలు. వీరికి 1996లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణమూర్తి పదేళ్లుగా మద్యానికి, పేకాటకు బానిసయ్యాడు. ఇంట్లో జరగడం లేదని, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే ఎలాగని భర్తను ఆదిలక్ష్మి ప్రశ్నిస్తుండేది. కృష్ణమూర్తి ఇంట్లోకి డబ్బులు ఇవ్వకపోగా కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భర్త బాధలు భరించలేని ఆమె 2011లో ఈపురుపాలెం పోలీసుస్టేషన్లో కేసు కూడా పెట్టింది. పోలీసులు కృష్ణమూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారు. జైలు నుంచి వచ్చిన అతడిని అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయసాగారు. ఏం చేయాలో పాలుపోని అతడు ఉన్న ఇంటిని తెగనమ్మేందుకు సాహసించాడు. ఇందుకు భార్య అడ్డుపడింది. ఉన్న ఇంటిని అమ్మితే నడిరోడ్డుపై ఉండాల్సి వస్తుందని, కుటుంబం పరువు బజారున పడుతుందని వేడుకుంది. ఇరువర్గాలకు చెందిన పెద్దలు రాజీ కుదిర్చారు. అయినా ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో ఆదిలక్ష్మి 10 నెలలుగా అతడికి దూరంగా ఉంటోంది. తనకు విడాకులు కావాలని కోర్టులో కేసు వేసి భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఆదిలక్ష్మిపై పగ పెంచుకున్న కృష్ణమూర్తి ఎలాగైన ఆమెను చంపుతానని తనకు తెలిసిన వారికి చెబుతూ తిరుగుతున్నాడు. సరైన అదను కోసం ఎదురు చూస్తుçన్న అతడు ఈ ఏడాది ఆగస్టు 25న సాయంత్రం ఏడు గంటల సమయంలో కర్రతో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్త గాయాలైన క్షతగాత్రురాలిని స్థానికులు, ఆమె బంధువులు చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె అదే నెల 30వ తేదీన మృతి చెందింది. పోలీసులు మొదట కొట్లాట కేసుగా నమోదు చేసి ఆమె మరణానంతరం హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం వేట కొనసాగించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఇచ్చిన ఆదేశాల మేరకు డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, రూరల్ సీఐ జె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అనేక వేషధారణల్లో నిందితుడు నిందితుడు తప్పించుకునేందుకు అనేక వేషధారణల్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారనే సమాచారం తెలుసుకున్న కృష్ణమూర్తి గుండు గీయించుకుని అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. కొంతకాలం తనకు తెలిసిన వారి వద్ద పొడుగుల పని చేశాడు. చేతిలోకి కొంత డబ్బులు వచ్చాక తిరిగి మరొక చోటికి మారేవాడు. మరికొంత కాలం బేల్దారి పనులకు వెళ్లేవాడు. ఇలా పోలీసులకు చిక్కకుండా సుమారు రెండు నెలలు పాటు తిరిగాడు. చివరికి అతడు ప్రముఖ పుణ్య క్షేత్రం కాశీ వెళ్లేందుకు సమాయత్తమై తన స్వగ్రామానికి దగ్గరగా ఉన్న గుంటూరు జిల్లా స్టూవర్టుపురం చేరుకున్నాడు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ శ్రీనివాసరావు ఈపురుపాలెం ఎస్ఐ సుధాకర్, హెడ్‌కానిస్టేబుల్ కుంభా శ్రీను, కానిస్టేబుళ్లు విజయ్‌కృష్ణ, నజీర్, హోంగార్డు రవూఫ్‌లు నిందితుడు కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. -
ఆ చేతి బజ్జీ
చలి గజగజ వణికిస్తున్నా... జోరున వాన కురుస్తున్నా... వెంటనే బజ్జీలు, పునుగుల మీదకు మనసు వెళ్తుంది...ఆవురావురుమంటూ లాగిస్తూ, ప్రకృతిని ఆస్వాదించాలనిపిస్తుంది...పుల్లారావు బజ్జీలకు యమ క్రేజ్... ఏ సీజన్లో అయినా ఆ బజ్జీల రుచి చూడాల్సిందే... స్వచ్ఛమైన బజ్జీ, పునుగులను రుచి చూడటం కోసం బారులు తీరతారు చీరాల వాసులు... 30 సంవత్సరాలుగా బజ్జీ ప్రియులకు విందు చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు పుల్లారావు... ఇక్కడి బజ్జీల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొని తింటారు... పుల్లారావు వ్యాపార విజయ రహస్యమే ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... రాత్రి ఏడు గంటలైతే చాలు ఆ ప్రాంతమంతా కమ్మని సువాసనలు వెదజల్లుతుంది. అటుగా వెళ్తున్నవారంతా ఆ వాసన ఏంటా అనుకుంటూ అక్కడకు వస్తారు. అంతే! మరి అక్కడ నుంచి కాలు కదపలేకపోతారు. అప్పటికే అక్కడ క్యూలో నిలబడినవారిని అడిగి విషయం తెలుసుకుంటారు. ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ తిరునాళ్లను తలపిస్తుంది. చిన్నదే అయినా... చూడటానికి చిన్న అంగడే అయినా అక్కడ దొరికే బజ్జీ, పునుగులను ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. వేడివేడిగా లభ్యమయ్యే పుల్లారావు బజ్జీలంటే చీరాల పట్టణ వాసులకు యమ క్రేజ్. స్వచ్ఛమైన పదార్థాలతో, రుచికరంగా తయారు చేసే పునుగు, బజ్జీలను గత మూడు దశాబ్దాలుగా చీరాల, చుట్టుపక్కల ప్రాంతాలకు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు పుల్లారావు. స్థానిక కొట్లబజారు రోడ్డులోని తుపాకి మేడ దగ్గర ఊర పుల్లారావు చిన్న బడ్డీ బంకు పెట్టి, అందులోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా చేస్తారు... బజ్జీలకు పచ్చి పప్పు మాత్రమే ఉపయోగిస్తారు. వాటి పిండిని బాగా మెత్తగా చేసి ఉప్పు, కారం అన్ని సమపాళ్లలో కలిపి, స్పెషల్‌గా తెచ్చిన మిరపకాయలను కోసి, వాటిలో వాము పొడిని తగినంతగా చేర్చి, కాగిన నూనెలో రెండు సార్లు వేయించుతారు. అందుకే వాటికి అంత రుచి అంటారు బజ్జీ తిన్నవారంతా. మినప్పప్పు, బియ్యప్పిండిని వాడుతూ రుచికరమైన పునుగులను తయారుచేస్తారు. పునుగు పిండితో తయారుచేసిన బరోడా బజ్జీ, బొండాలకు మరింత క్రేజ్ ఉంది. ఆ బజారులో ఎన్నో బజ్జీల షాపులున్నా పుల్లయ్య బజ్జీల షాపు దగ్గరే జనం కనిపిస్తారు. స్వచ్ఛమైన నూనె, మన్నిక కలిగిన పదార్థాలతో రుచికరంగా తయారయ్యే పుల్లయ్య బజ్జీలను తిన్న ఎంతటివారైనా ‘వాహ్వా! పుల్లయ్య బజ్జీ!!’ అని పొగడక మానరు. – సంభాషణ, ఫొటోలు: పి. కృష్ణ చైతన్య, చీరాల అర్బన్ -
ఇక్కడ ప్రతి ఆహార పదార్థం కల్తీ!
సాక్షి, చీరాల(ప్రకాశం): కల్తీ ఆహార పదార్థాలకు చీరాల మల్టీ బ్రాండ్‌గా మారింది. ఉప్పు..పప్పు.. కారం.. టీ పొడి నుంచి ప్రతి ఆహార పదార్థం కల్తీగా మారింది. అయితే కల్తీలన్నింటిలో నూనెలదే పైచేయిగా ఉంది. పైకి బ్రాండెడ్ కంపెనీల పేరుతో లోపల మాత్రం నాణ్యతలేని నాసిరకం నూనెను నింపి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. బ్రాండెడ్ వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి వచ్చే నీటిని కలిపి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు జరిపితే చీరాలలోని నూనె వ్యాపారులు అంతా దుకాణాలు సర్ది పరారయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం చీరాల పట్టణంలో ఓ బ్రాండెడ్ కంపెనీ పేరుతో కల్తీ నూనెలను విక్రయిస్తున్న దుకాణంపై అధికారులు దాడులు చేశారు. అక్కడ వేరుశనగ నూనె కావాలని కోరిన గ్రామీణులకు వ్యాపారులు కల్తీ నూనెనే విక్రయిస్తున్నారు. నూనె వ్యాపారుల కాసుల కక్కుర్తికి కొందరు అధికారులు తోడుగా నిలిచి నామమాత్రంగా కూడా తనిఖీలు చేయకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి తీసిన నూనెను కలిపి చీరాల్లోని వ్యాపారులు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటుగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విడి వినియోగం ఎక్కువే.. చీరాల ప్రాంతంలోని బార్లు, రెస్టారెంట్లు, ఖానా ఖజానాలు, హోటళ్లు, మెస్లల్లో వంటకాల తయారీకి, తోపుడు బండ్లలో పిండివంటలు చీరాల్లోని నూనె దుకాణాలు, గానుగల నుంచి వంట నూనెలను కొనుగోళ్లు చేస్తున్నారు. ఒక్క చీరాల ప్రాంతంలోనే వీటి ద్వారా నెలకు రూ.90 లక్షలకు పైగా వ్యాపారాలు చేస్తుంటారు. తినుబండారాలు, ఆహార పదార్థాలు విక్రయించే వారు అధికంగా నూనె వినియోగిస్తుంటారు. ఆహార పదార్థాలను తయారు చేసినప్పుడు మిగిలిన నూనెను మరుసటి రోజు వాడకుండా పారబోయాలని నిబంధనలు ఉన్నా వ్యాపారులు పట్టించుకోకుండా ఆ నూనెలను వాడుతూనే ఉన్నారు. కల్తీ నూనెలతో వ్యాపారాలు చేసే వారికి కనీసం 95 శాతం మందికి లైసెన్స్‌లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కల్తీ నూనెలతో వంటపదార్థాలు తయారు చేసిన వ్యాపారులకు రూ.5 లక్షల వరకు జరిమానా విధించాల్సి ఉన్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నెలకు రూ.కోటికి పైగా విక్రయాలు కల్తీ నూనె విక్రయాలు నెలకు దాదాపుగా రూ. కోటి వరకు విక్రయాలు జరుగుతున్నాయంటే కల్తీ వ్యాపారం ఇక్కడ ఎంత జోరుగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చీరాల్లో 30 వరకు ప్రత్యేక నూనె దుకాణాలు ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకు కల్తీ నూనె అమ్మకాలు జరుగుతున్నాయి. చీరాల నుంచి తయారైన కల్తీ నూనెను చీరాల, పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ నూనెల విక్రయాల్లో కనీసం 10 శాతం మేరకు ఇతర నూనెలు కలిపి నాసిరకం నూనె, విడినూనెలను బ్రాండెడ్ కంపెనీల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ కల్తీ నూనె తయారీ, అమ్మకాల్లో దర్బార్ రోడ్డు, సంతబజారు, రామమందిరం వీధిలోని నూనె దుకాణాలు, కొన్ని హోల్‌సేల్ కిరాణా వ్యాపారులు కీలకపాత్ర పోసిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రత్యేక నూనె దుకాణాలు ఇతర ప్రాంతాల నుంచి పత్తి గింజల నూనె, పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెలను డ్రమ్ముల్లో చీరాలకు దిగుమతి చేసుకుని వేరుశనగ నూనెలో కల్తీలు చేసి బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని నాసిరకం నూనెల డ్రమ్ములను దిగుమతి చేసుకుని ప్రజలకు బ్రాండెడ్ పేరుతో అమ్మకాలు చేస్తున్నారు. కల్తీ పక్కకు.. అసలు పరీక్షలకు..! ఆహార భద్రతాధికారులు ప్రతినెలా నూనెలను తనిఖీలు చేయాల్సి ఉండగా వారు వచ్చే సరికి వ్యాపారులు కల్తీ నూనెల డ్రమ్ములను పక్కనబెట్టి బ్రాండెడ్ నూనెలను చూపించి వాటిని పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. అక్రమ, కల్తీ వ్యాపారాల్లో అధికారులు పాత్ర కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. నూనెలను కొనుగోళ్లు చేసిన హోటళ్లు, మెస్‌లు, పిండివంటల తయారీదార్లు నుంచి అధికారులు శాంపిళ్లు తీసుకుని పరీక్షలకు పంపిస్తే కల్తీ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది. కలీలకూ చెక్ పడుతుంది. కానీ ఆహారభద్రతా అధికారులు మాత్రం కేవలం బ్రాండెడ్ నూనెలను ల్యాబ్‌లకు పంపించడం వలన కల్తీ నూనె విషయం తెలియడం లేదు. అనారోగ్యం తప్పదు కల్తీ ఆహార పదార్థాలను భుజించడం వలన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వంట నూనెల్లో కల్తీ వలన హృద్రోగ, రక్తనాళ సంబంధిత వ్యాధులు, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. కొవ్వు పెరిగి రక్తపోటు, కొన్ని సందర్బాల్లో గుండెపోటు, మొదడు పోటు వచ్చి ప్రాణాలను హరించివేస్తుంది. ఆహార పదార్థాల్లో నాణ్యత, పరిశుభ్రత లోపిస్తే అతిసారం, ఫుడ్‌పాయిజనింగ్, జీర్ణకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. డాక్టర్ ఎన్.రాజ్‌కుమార్, చీరాల -
వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, చీరాల రూరల్ (ప్రకాశం): చీరాల రామకృష్ణా పురం పంచాయతీలోని బోడిపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై చీరాల ఒన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గృహ నిర్వాహకులతో పాటు ఒక పురుషుడు, నలుగురు మహిళలను అరెస్టు చేశారు. వారివద్ద రూ. 9,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఒన్‌టౌన్ సీఐ నరహరి నాగ మల్లేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. రామకృష్ణాపురం పంచాయతీలోని బోడిపాలెంలో నివాసముండే అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులు గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. వీరు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే మహిళలను, కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలకు దూరంగా ఉండే మహిళలను గుర్తిస్తారు. వారికి డబ్బులు ఆశచూపించి లోబరుచుకుని వ్యభిచార కూపంలోకి బలవంతంగా దించుతారు. అంతేకాక వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించారు. ఈ విధంగా వారు వ్యాపార పరంగా చీరాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వ్యభిచార మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే వారు చీరాల, ఈపురుపాలెం, విజయవాడ, గుంటూరు, వైజాగ్, వంటి ప్రాంతాలకు చెందిన మహిళలను చీరాలకు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని సిఐ తెలిపారు. అయితే ఇటువంటి సంఘటనలపై తరచు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయా ప్రదేశంపై పోలీసులు ఎప్పటినుండో నిఘా పెట్టారు. పూర్తి సమాచారం అందుకున్న ఒన్‌టౌన్ సీఐ నాగ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో రామకృష్ణాపురంలోని బోడిపాలెం వ్యభిచార గృహంపై దాడిచేశారు. ఈ దాడిలో ఒక పురుషుడితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. వారితో పాటు గృహ నిర్వాహకులైన అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులను కూడా అరెస్టు చేశారు. వారిని తనిఖీలు చేయగా వారివద్ద రూ. 9,230 నగదు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన నగదుతో పాటు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోని దించినట్లయితే కఠినంగా శిక్షిస్తామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అయ్యో పాపం.. ఆడపిల్ల
నాగరిక ఎంత అభివృద్ధి చెందినా... సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా ఈ లోకంలో ఆడ జన్మకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కనటానికి తల్లి నరక బాధను అనుభవిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన శిశువును నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లింది. రోడ్డుపై మాంసం ముద్దలా విగత జీవిగా పడి ఉన్న ఆ శిశువును చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. చందాలు వేసుకుని మరీ ఆ శిశువుకు దహన సంస్కారాలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం చీరాలలో చోటుచేసుకుంది. సాక్షి, చీరాల రూరల్(ప్రకాశం) : అది చీరాల పట్టణంలోని విఠల్ నగర్ ప్రాంతం. ఊరు పేరు తెలియని నిండు గర్భిణి... ఎవరి చేతిలోనైనా మోసానికి గురైందో లేక ఆ తల్లికి ఏ కష్ట మొచ్చిందో తెలియదు బుధవారం రాత్రి స్థానిక రెడ్డిగారి స్కూలు వద్దకు చేరుకుంది. నా అనేవారు ఎవరూలేని ఆ అభాగ్యురాలు స్కూలు సమీపంలోని రహదారిపై ఏ సమయంలో పురుడు పోసుకుందో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే మృత శిశువును చూసిన స్థానికులు తీవ్ర కలత చెందారు. పేగు కూడా కత్తిరించని స్థితిలో మాతృమూర్తి కడుపులోని అవయవాలు కూడా రోడ్డుపైనే పడివున్నాయి. అప్పటికే ఆ ఆడ శిశువు అచేతనంగా రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యన్ని చూసిన స్థానికులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొందరు మహిళలు కంటతడి పెట్టారు. తలో కొంత డబ్బులు చందాలు రూపంలో వసూలు చేసుకుని గురువారం ఆ శిశువుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం కాకూడదని ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నా మానవత్వాన్ని మరచిన కొందరు కఠిన హృదయులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం శోచనీయం. -
చీరాల ఎమ్మెల్యే పై కేసు నమోదు
-
చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్‌ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు సూచనల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. చదవండి : నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..! ఈనెల 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేను యడం రవిశంకర్ ప్రశ్నించగా నన్నే ప్రశ్నిస్తావా... నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యడం రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కరణం బలరామకృష్ణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
దీనులంటే లెక్కలేదు!
సాక్షి, చీరాల: దుగ్గిరాల గోపాల కృష్ణయ్య స్మారక 100 పడకల చీరాల ప్రభుత్వాసుత్రిలో చికిత్సలు పొందే రోగులకు అక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య సేవలు సక్రమంగా అందించడంలేదనే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి. వారిపై ఉన్న ఆరోపణలు అటుంచితే వివిధ ప్రమాదాల బారినపడి ఆస్పత్రిలో చికిత్సలు పొందుదామని వచ్చే క్షతగాత్రులకు, నడవలేని స్థితిలో ఉన్న బాధితులకు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కనీసం స్టెచ్చర్లు కూడా అందించలేని స్థితిలో ఉన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ సూరినేని ఉష గత మంగళవారం వైద్యలను, వైద్య సిబ్బందిని వైద్య సేవలు అందిస్తున్న తీరుపై ఆస్పత్రిలో విచారణ చేస్తున్న సమయంలో కూడా ఆస్పత్రికి వచ్చిన బాధితులను సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటువంటి సంఘటనలు నిత్యం ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్నా స్పందించే అధికారులు లేకపోవడం శోచనీయం. చీరాలకు చెందిన శంకర్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బ తగిలింది. తన బంధువుల సాయంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుదామని గత మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. అతడు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లే సమయంలో నేలపై దోకుతూ లోపలికి వెళ్లాడు. అతని పరిస్థితిని చూసిన ఆస్పత్రి సిబ్బంది కనీసం అతనికి స్టెచ్చర్ కానీ వీల్ చైర్ కానీ అందించలేదు. అతడు ఆస్పత్రిలోకి వెళ్లి కాలికి కట్టు కట్టించుకున్న అనంతరం లోపలికి ఏవిధంగా అయితే వెళ్లాడో బయటకు కూడా నేలపై దేకుతూ అదే విధంగా వచ్చాడు. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారిణి డాక్టర్ ఉష అదే ఆస్పత్రిలో వార్డులను తనిఖీలు చేసి వైద్య సేవలపై వైద్యులను విచారిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. మరోవ్యక్తిని కూడా... స్థానిక హైమా ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సు డోరు తగిలి పాత చీరాల గేటు సమీపంలో నివాసముండే సుద్దపల్లి సాయి అనేవ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. అయితే బాధితుణ్ణి అతని స్నేహితులు చికిత్స నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాధితుణ్ణి ఆటోలో తీసుకొచ్చిన అతని స్నేహితులే అచేతనంగా.. రక్త గాయాలతో ఉన్న బాధితుణ్ణి ఆ ఇద్దరు స్నేహితులు బాధితుడి కాళ్లు, చేతులు పట్టుకొని అతి కష్టం మీదు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి బెడ్‌పై పడుకోపెట్టారు. ఆ తర్వాతే సిబ్బంది బాధితుడి వద్దకు చేరి హడావుడిగా చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ కోసం బాధితుని తల్లి రత్న కుమారి పడరాని పాట్లు పడింది. చాలా సేపటి వరకు అంబులెన్స్ దొరకకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె వైద్య సిబ్బందిని విచారణ చేస్తున్న జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయ కర్త డాక్టర్ ఉష వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేదని ఉన్న అంబులెన్స్ కూడా పూర్తిగా పాడై పోయిందని, డ్రైవర్ కూడా లేడని డాక్టర్ ఉష బాధితుని తల్లి రత్న కుమారికి చెప్పడం విశేషం. నిరుపేదలు ఎక్కువగా చికిత్స పొందే ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం దారుణమని బాధితుని తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. అయితే ఆస్పత్రి ఆవరణలో నిత్యం ఉండే 108 అంబులెన్స్ కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణిని ఒంగోలు ఆస్పత్రిలో చేర్చేందు వెళ్లిందని సిబ్బంది చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్ ఉష ఆస్పత్రి పర్యవేక్షకుని పిలిచి వివరణ తీసుకున్నారు. ప్రతినెలా ఎన్ని కేసులు ఒంగోలు పంపుతున్నారని ప్రశ్నించారు. అయితే ఎంపీ ల్యాడ్స్ ద్వారా చీరాల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు. -
చీరాలలో టీడీపీ నేతల హైడ్రామా..
సాక్షి, చీరాల (ప్రకాశం): చీరాల మండల పరిషత్ అబివృద్ధి అధికారి వ్యవహరిస్తున్న తీరుతో వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు అన్నిశాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక జాబితా జిల్లా అధికారులకు పంపినది ఒకటి ఉండగా.. టీడీపీ నేతల బెదిరింపులకు, ఆదేశాలకు తలొగ్గి వారి మెప్పు పొందేందుకు మరొక జాబితాను తయారు చేశాడు ఆ అధికారి. దీంతో బుధవారం చీరాల గ్రామ వలంటీర్ల శిక్షణ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తమకు సంబంధించిన అనుచరులతో కలిసి హై డ్రామా సృష్టించారు. ఆదివారం ప్రకటించిన జాబితా ఫైనల్‌కాగా సోమవారం అర్ధరాత్రి వరకు టీడీపీ నేతలు ఎంపీడీవో కార్యాలయంలో నానా హంగామా సృష్టించి బెదిరింపుకుల పాల్పడటంతో ఎంపీడీవో మరొక జాబితా తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం చీరాల ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల గేటు ముందు టీడీపీకి చెందిన నాయకులు తమ అనుచరులతో కలిసి నానా హైరానా సృష్టించారు. చీరాల్లో పోలీసులు 30 యాక్టు, 144 సెక్షన్‌ను విధించడంతో తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు వన్‌టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేసిన అనంతరమే పోలీసులు వలంటీర్లను శిక్షణ కేంద్రం లోపలికి అనుమతించారు. ఒన్‌టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్, రాజేశ్వరరావు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని తోటవారిపాలెం, తదితర గ్రామాలకు చెందినవారు వలంటీర్ ఇంటర్వ్యూలో అర్హత సాధించామంటూ మరో జాబితాలతో మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాషా, కొందరు టీడీపీ నేతలను వెంటబెట్టుకుని శిక్షణ కేంద్రంలోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వలంటీర్లుగా నియామకం పొందిన జాబితా చూపించాలని కోరారు. దీంతో వారు తమ వద్ద ఉన్న జాబితా చూపించగా మండల పరిషత్ సిబ్బంది వద్ద ఉన్న తుది జాబితాతో సరిపోకపోవడంతో వారిని శిక్షణకు అనుమతించలేదు. ఒక దశలో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని పోలీసులు హెచ్చరించి పంపించారు. టీడీపీ నేతలు మాత్రం దురుసుగా వ్యవహరించడంతో కొందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు జాబితాలు తయారు చేసిన ఎంపీడీవో నమ్మక ద్రోహం చేశారని వారు వాపోయారు. మిగిలిన ఆ 61 పోస్టులు ఎక్కడ? 446 పోస్టులకు గాను 385 మందిని గ్రామ వాలంటీర్లుగా ఎంపిక చేశారు. మిగిలిన 61 మందిని ఎంపిక చేయకండా ఎంపీడీవో అవకతవకలకు పాల్పడుతున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. చీరాల ఇన్చార్జి ఎంపీడీవో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమనాలను రేకెత్తించడంతో పాటు, టీడీపీ నాయకులు సూచించిన వారిని నియామకం చేసేందుకు పాల్పడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. -
పస్తులతో పోరాటం..
తరాల తరబడి ఆకలి పోరాటం వారిది. చేతి వృత్తినే నమ్ముకొని ఎంతో కళాత్మకంగా నేసే బట్టలు వారికి పూట కూడా కడుపు నింపడం లేదు. అందరికీ అందమైన వస్త్రాలను తయారు చేస్తుంటే వారికి మాత్రం రోజంతా పని చేసినా పూట గడవని దుర్భిక్షం. నమ్మిన వారే కష్టానికి కూలీ కట్టకపోవడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా కలిసి ఒక రోజంతా పనిచేస్తే కనీసం రూ.300 కూడా సంపాదించలేని పరిస్థితి. ఈ రూ.300తోనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు అన్ని సర్దుకుపోవాల్సిన పరిస్థితిల్లో కార్మికులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాక్షి, చీరాల (ప్రకాశం): చేనేత కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మాస్టర్‌వీవర్లు (పెట్టుబడిదారులు) మాత్రం కోటీశ్వరులుగా మారుతుంటే వస్త్రాలను తయారు చేసే చేనేత కార్మికులు మాత్రం అర్ధాకలితోనే అలమటిస్తున్నారు. ఇప్పటికీ 2016లో ఉన్న మజూరీ(కూలీ)లే అమలవుతున్నాయి. ఇదేమని గొంతెత్తి అడిగితే అలాంటి వారికి పని కల్పించకుండా మాస్టర్ వీవర్లందరూ ఒకే విధంగా వ్యవహరించడంతో కనీసం పని కూడా లేక అవస్థలు పడుతున్నారు. అందుకే అవస్థలన్నీ మౌనంగానే ఎదుర్కొంటున్నారు నేత కార్మికులు. కొద్ది నెలల పాటు ఆందోళన చేస్తే కార్మికశాఖ, చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం రేట్లను కూడా అమలు చేయకుండా మాస్టర్‌వీవర్లు మోసానికి ఒడిగడుతున్నారు. చీరాల ప్రాంతంలో 17 వేల మగ్గాలకు పైగా ఉండగా, 50 వేల మంది కార్మికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మాస్టర్‌వీవర్ల వద్ద కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇంటి వద్దే మగ్గం పెట్టుకొని మాస్టర్‌వీవర్ ఇచ్చే ముడిసరుకుతో వస్త్రాలను తయారు చేసి ఇస్తుంటారు. ఇందుకు గాను వస్త్రాల రకాలను బట్టి కూలీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుతం సాదా చీరకు రూ.1700 వరకు చెల్లిస్తున్నారు. ఈ చీర నేయాలంటే కనీసం ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది. కుప్పడం చీరకు రూ.8500 నుంచి రూ.9వేల వరకు చెల్లిస్తారు. ఈ చీర నేయాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. కంచి బోర్డర్‌కు రూ.7000 వరకు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. ఇందులో కార్మికుడు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అల్లు కట్టినందుకు, అంచులు అతికినందుకు, కడ్డీలు చుట్టినందుకు, గమ్ము పెట్టింనందుకు, ఇతర పనులకుగాను ఒక్కో బారుకు రూ.1000ల వరకు కార్మికుడే ఖర్చు భరాయించాలి. ఉదాహరణకు కంచి బోర్డర్ చీరలు నేస్తే మాస్టర్ వీవర్ రూ.7000 ఇస్తే అందులో రూ.1000లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. అంతే సరాసరిన రోజంతా భార్యభర్తలు కలిసి పని చేస్తే రూ.300 పడుతుంది. దీంతో కుటుంబమంతా జీవించడం అసాధ్యంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. పిల్లలను చదివించలేని పరిస్థితి ఎదురుకావడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారు కూడా మగ్గంలోనే మగ్గిపోవాల్సి వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా మాస్టర్‌వీవర్లు మానవత్వంగా వ్యవహరించడం లేదు. మజూరీలను పెంచాలని కార్మికులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకున్న దిక్కేలేదు. గత రెండు నెలలుగా మజూరీలను పెంచాలని చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. కనీస వేతన చట్టానికీ కరువే కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. 2016 నుంచి పెంచని మజూరీలు చేనేత కార్మికులు, మాస్టర్‌వీవర్లు ఒప్పందం మేరకు కార్మికశాఖ ఆద్వర్యంలో రెండేళ్లకు ఒకసారి కూలీలు పెంచేవిధంగా ఒప్పందం చేసుకుంటారు. కానీ 2016 నుంచి ఇప్పటి వరకు మాస్టర్ వీవర్లు కార్మికుల కూలీలు పెంచేందుకు ముందుకురావడం లేదు. గత కొన్ని నెలలుగా కార్మికులు మజూరీలు పెంచేందుకు ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, కార్మికశాఖ కార్యాలయాల ముట్టడిలను చేపట్టారు. ఇప్పటికీ కార్మికులు, మాస్టర్ వీవర్ల మద్య మజూరీల ఒప్పందంపై 9 సార్లు చర్చలు జరిగినా ఫలితం శూన్యంగా మారింది. బుధవారం జరిగిన చర్చలకు మాస్టర్ వీవర్లు ఎవ్వరూ హాజరుకాలేదు. పైపెచ్చు తమవద్ద పనిచేసే కార్మికులతో తమకు కూలీలు పెంచాల్సిన అవసరం లేదంటూ కార్మికశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా బలవంతంగా సంతకాలు చేయించి అందిస్తున్నారు. తమతో మాస్టర్ వీవర్లు బలవంతంగా సంతకాలు చేయించారని, నిజంగా వారికి కూలీలు పెంచాల్సిన అవసరం లేదని కార్మికశాఖ అధికారుల ముందే కార్మికులు చెప్పాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాస్టర్ వీవర్లను బెదిరించిన కార్మికులనే భయాందోళనలకు గురిచేస్తున్నారని వారి ఆరోపణ. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న కూలీలకు అదనంగా 20 శాతం కూలీ పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే పని బంద్ అర్ధాకలితో అవస్థలు పడుతున్న చేనేత కార్మికులు తమ దుర్భర పరిస్థితులపై కార్మిక శాఖాధికారులకు ఫిర్యాదు చేస్తే అంతే సంగతులు... ఆ రోజు నుంచి సదరు మాస్టర్‌వీవర్ ఆ కార్మికుడికి పని చూపించడు. మిగతా మాస్టర్వీవర్లూ అతనికి పని కల్పించరు. ఒకవేళ కల్పించినా నాసిరకపు రకాలను నేయించడంతో పాటు నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. అందుకే కార్మిక శాఖ అధికారులకు చేసిన ఫిర్యాదులు కూడా కార్మికులు వెనక్కి తీసుకోవడం తప్పితే వారిపై ఉద్యమం చేసేందుకు నిలబడలేని పరిస్థితి. -
సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు
సాక్షి, ఒంగోలు : చీరాల రామాపురం బీచ్‌లో రెండు రోజుల క్రితం గల్లంతైన కార్తీక్‌రెడ్డి మృతదేహం గురువారం చీరాల వాడరేవుకు కొద్ది దూరంలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. మృతదేహం రెండు రోజుల పాటు సముద్రపు నీటిలో ఉండటంతో చీకిపోయింది. కార్తీక్‌రెడ్డి శరీరాన్ని చేపలు కొరుక్కు తినడంతో శరీరంపై అక్కడక్కడా గాయాలు ఏర్పడ్డాయి పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ టీచర్స్ కాలనీకి చెందిన చల్లమల్లి వెంకట నారాయణరెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి (28) ఓ హోటల్లో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కార్తీక్‌రెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి చీరాల రామాపురం బీచ్‌కు సరదాగా గడిపేందుకు వచ్చాడు. సోమవారం రాత్రి వారంతా కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరి 18న ఉదయం చీరాల రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. అంతా కలిసి సరదాగా సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి కార్తీక్‌రెడ్డి గల్లంతయ్యాడు. ఆందోళన చెందిన అతని స్నేహితులు సమీపంలోని మత్స్యకారులకు తెలుపగా వారు సముద్రంలో వెతికారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తండ్రి వెంకట నారాయణరెడ్డి వచ్చి ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కార్తీక్‌రెడ్డి ఆచూకీ కోసం సముద్ర తీరంలో గాలిస్తుండగా విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కార్తీక్‌రెడ్డి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇది నిజంకాదా? నార్కో అనాలసిస్ టెస్ట్‌కు చంద్రబాబు సిద్ధమా?
-
చంద్రబాబు..దేవన్ష్‌పై ప్రమాణం చేస్తావా?: ఆమంచి
సాక్షి, చీరాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మీద 17 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి. నాపై ఉన్న కేసులు ప్రజా ఉద్యమంలో జరిగినప్పుడు పెట్టినవి. చంద్రబాబు పిరికివాడు...అవకాశవాది. కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చాడు. నేను ఇక్కడే ఉండి ప్రజల కోసం పోరాడుతున్నా. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తా అని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్. ప్రజలకు ఏమి అవసరమో ...ఆయనకు అవగాహన లేదు. చంద్రబాబు అతి తక్కువ నిధులు ఇచ్చింది చీరాల నియోజకవర్గానికే. ప్రజలు కట్టే పన్నులతో మేము అభివృద్ధి చేసుకున్నాం తప్ప చీరాలకు చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయనకు మహిళలపై గౌరవం లేదు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు. అక్కడ ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ సీపీ మహిళలో అక్రమ సంబంధం అంటగట్టమని చెప్పిన నీచుడు చంద్రబాబు. ఇది వాస్తవం కాదా?. దీనిపై నార్కో ఎనాలసిస్ పరీక్షకు సిద్ధమా?. లేకుంటే నీ మనవడు దేవన్ష్‌పై ప్రమాణం చేసి చెబుతావా?’ అని సవాల్ విసిరారు. -
ఇల్లాలే హంతకురాలు..
సాక్షి, చీరాల రూరల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ ఇల్లాలు తన భర్తను చంపించింది. తండ్రి చనిపోవడం..తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. ఈ సంఘటన చీరాలలో వెలుగు చూసింది. పట్ట పగలు అంతా చూస్తుండగా ఐదు రోజుల క్రితం మాణిక్యరావు అనే యువకుడిని ఇద్దరు కలసి అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కేసులో చీరాల టూటౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో సీఐ రాజమోహన్‌రావు ఆధ్వర్యంలో డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చీరాల రంగారెడ్డి నగర్‌కు చెందిన పాశం మాణిక్యరావు (30), కృష్ణకుమారిలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమారై, కుమారుడు ఉన్నారు. బెస్తపాలెంలో ఆర్యాస్ ఫ్యాషన్ పేరుతో బట్టల షాపు నిర్వహిస్తున్నారు. నిత్యం సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేసే కృష్ణకుమారికి ఫేస్బుక్ ద్వారా తమిళనాడు రాష్ట్రం గుడియాట్టానికి చెందిన వెంకట్ నాథన్ శివ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలం పాటు వీరు స్నేహం కొనసాగించారు. అనంతరం వెంకట్ నాథన్ శివతో తెగతెంపులు చేసుకుంది. వెంకట్ నాథన్ శివ స్నేహితుడు మధన్ కుమార్ మనోగరన్తో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ కలిసి కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమారి తన భర్త పాశం మాణిక్యరావుకు మధన్ కుమార్ మనోగరన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో మధన్ అప్పుడప్పుడూ చీరాల వచ్చి కృష్ణకుమారి ఇంట్లో బస చేసేవాడు. భార్య ప్రవర్తనపై మాణిక్యరావుకు అనుమానం కలిగింది. ఎలాంటి బంధుత్వం లేని తమిళనాడుకు చెందిన యువకుడితో భార్య సన్నిహితంగా ఉంటడం భర్తకు నచ్చలేదు. తప్పుడు ప్రవర్తన మానుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలూ జరిగాయి. భార్య పథకం ప్రకారమే హత్య విసుగు చెందిన ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఇదే విషయాన్ని మధన్‌తో చెప్పింది. ఇద్దరూ కలిసి మాణిక్యరావును చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ప్రణాళిక రచించారు. ఏ విధంగా హత్య చేయాలనే విషయంపై మధన్ తన సోదరుడైన దీపక్‌తో చర్చించాడు. దీపక్ అతని స్నేహితుడైన బ్లేడ్ అనేవ్యక్తి సాయంతో పది రోజుల క్రితం చీరాల చేరుకున్నారు. మాణిక్యరావుపై రెక్కీ నిర్వహించారు. గత నెల 29వ తేదీ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మాణిక్యరావును కొత్తపేటలోని ఏకేపీ జూనియర్ కళాశాల సమీపంలో దీపక్ అతని స్నేహితుడు బ్లేడు ద్విచక్ర వాహనంపై అనుసరించారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్లు ధరించి మాణిక్యరావును అడ్డుకున్నారు. ఆ వెంటనే దీపక్, అతని స్నేహితుడు బ్లేడు కలిసి మాణిక్యరావు మెడపై కత్తితో తీవ్రంగా పొడిచి పరారయ్యారు. మాణిక్యరావు రక్తమోడుతున్న పరిస్థితిలో సమీపంలోనే ఉన్న టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని దీపక్ అనే వ్యక్తి తనను పొడిచాడని పోలీసులకు చెప్పి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్పందించిన పోలీసులు ఆయన్ను చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరులోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదులో కదిలిన డొంక తన కుమారుడిని పాత గొడవల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన దీపక్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడనే మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ రాజ మోహనరావు, ఎస్ఐ నాగేశ్వరరావుతో కూడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. మాణిక్యరావు భార్య కృష్ణకుమారిని కూడా తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ తెలిపారు. కేసులో దీపక్, అతని స్నేహితుడు బ్లేడు, మరికొందరిని కూడా అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కేసును ఐదు రోజుల్లో ఛేదించిన సీఐ రాజమోహన్‌రావు, ఎస్ఐ నాగేశ్వరరావు మరి కొందరు కానిస్టేబుళ్లను డీఎస్పీ నాగరాజు అభినందించారు. -
చీరాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆమంచి ప్రచారం
-
మా అన్నకు సంబంధం లేదు: ఆమంచి
సాక్షి, చీరాల: ఎన్నికల్లో గెలవడానికి అధికార టీడీపీ అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తోందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. అధికార పార్టీ అండతో చీరాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలుకి పంపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్యాయంగా తన అన్నపై కేసు పెట్టారని తెలిపారు. ప్రమాదంలో కాలు చెయ్యి విరిగి సుదీర్ఘ కాలం వైద్యం తరువాత ఇప్పుడే పాక్షికంగా కోలుకున్న తన అన్న మీద హత్యాయత్నం కేసుపెట్టి, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజలిపేటలో యువకుల మధ్య జరిగిన గొడవలో తమ అన్నకు సంబంధం లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి అమాయకులను అరెస్టు చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో చీరాల టీడీపీ నేతల ప్రోద్భలంతో పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తన అన్నను ఒక్కడిని ఇబ్బంది పెడితే చీరాలలో వేలాది మంది అన్నలు, తమ్ముళ్లుతో కలసి ఎన్నికలలో దీటైన సమాధానం ఇస్తామని, టీడీపీ బెదిరింపులకు భయపడబోనని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. -
బాలుడు స్కూలుకు వేళ్లలేదని మేనమామ దాష్టికం
-
ఏపీకి వైఎస్ జగన్ తప్ప మరో ఆప్షన్ లేదు: ఆమంచి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ లేదు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...ఆయన వారసుడు జగన్. అందుకే వచ్చాను. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ సీపీలో చేరతా. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. నేను పార్టీ మారడానికి.. నా అసెంబ్లీ సమస్యలే కాదు, అనేకం ఉన్నాయి. స్థానికంగా నా ప్రత్యర్థి ఎవరైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నాలుగున్నరేళ్లుగా నేను చీరాల నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసాను అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమో! ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే ఆమంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే పిచ్చి పట్టినట్లు ఉందని, ఆయనకు 70 ఏళ్లు దాటయాని, అల్జీమర్స్ వచ్చిందనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ రోజు ఒకమాట చెప్పి, తర్వాత మరో మాట చెబుతారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అతీత శక్తులు నడిపిస్తున్నాయని, సమాజంతో సంబంధం లేని వ్యక్తులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారని ఆమంచి మండిపడ్డారు. పార్టీకి సంబంధం లేకున్నా తన నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు కలిగించారని, ఈ అంశాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో, ఆయన పేషీలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకున్నారని మండిపడ్డారు. పసుపు-కుంకుమ పేరు చెడగొట్టారు.. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు గాల్లో మేడలే. గత నాలుగేళ్లుగా రూ.6400 కోట్లు వడ్డీ రాయితీ ఇవ్వలేదు. వడ్డీ రుణం మాఫీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ చేయలేదు. పసుపు-కుంకుమ పేరును చంద్రబాబు చెడగొట్టారు. పసుపు-కుంకుమను జారుడు బండపై పోశారు. అది గాల్లోకి కలిసిపోతోంది. ఇలాంటి దారుణమైన చర్యలు భరించలేకే వైఎస్సార్ సీపీలో చేరాను. తెలుగుదేశంలో కులం పిచ్చి ముదిరిపోయింది. ఒక కులం గుత్తాధిపత్యం కోసం యత్నిస్తోంది. చిన్న విషయానికి హైదరాబాద్ వదిలేశారు.. కాపు రిజర్వేషన్లపై రాజకీయం చేయడం తగదు. తుని ఘటనలో మా సోదరుడిపై తప్పుడు కేసు పెట్టారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. మనం ఏం చెప్పినా వింటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారు. అనుభవొం ఉందని అధికారం ఇస్తే చిన్న విషయానికి హైదరాబాద్ నుంచి పారిపోయారు. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది. అమరావతిలో ఉద్యోగులకు కనీసం మంచినీళ్లు, కూర్చోడానికి చెట్ల నీడ కూడా లేదు. రోశయ్య ఆశీస్సులు తీసుకున్నా.. గతంలో పవన్ కల్యాణ్‌తో చాలాసార్లు భేటీ అయ్యాను. అయితే రాష్ట్ర సమస్యలపై చర్చించానే కానీ, జనసేనలో చేరతానని చెప్పలేదు. పార్టీ మారే ముందు మాజీ సీఎం రోశయ్య ఆశీస్సులు తీసుకున్నాను. అయిదు రోజుల క్రితం ఆయనను కలిశాను. నీ మనసుకు నచ్చిన విధంగా చేయమన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే ఆమంచి
సాక్షి, హైదరాబాద్ : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమంచి తన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ... త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు. (టీడీపీకి ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా) ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. కొద్ది రోజుల క్రితం ఆమంచి పార్టీ మారుతున్నారని వార్తల నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే చీరాల నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పార్టీలో లేనివారి ప్రమేయం ఎక్కువగా కావడం వల్లే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆమంచి తెలిపారు. మరోవైపు ఆమంచి రాజీనామాతో ... టీడీపీ నేత కరణం బలరామ్‌ను...చీరాల వెళ్లి పార్టీ పరిస్థితిని సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. -
ప్రకాశం జిల్లాలో టీడీపీకీ ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. చీరాల నియోజకవర్గంలో కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, ప్రభుత్వం, పార్టీకి సంబంధం లేని శక్తులు అక్కడ పని చేస్తున్నాయని, అందుకే తాను టీడీపీకి రాజీనామ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి తన లేఖలో పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా ఆయన టీడీపీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు కూడా. 2014లో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. -
చీరాలలో జగన్ పుట్టిన రోజు సంబరాలు
-
వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా మెడికల్ క్యాంప్
-
చీరాల సమోసా చిరుతీపి
ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. సుమారు మూడు దశాబ్దాలుగా చీరాల పేరు మిఠాయికి కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మునీర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది స్వీట్ సమోసా. సమోసా అంటే త్రికోణాకారంలో ఉండేది అనుకుంటే పొరపాటు. పై భాగాన్ని మైదా పిండితోనే తయారుచేస్తారు. ఫిల్లింగ్ మాత్రం ప్రత్యేకంగా జీడిపప్పులు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్లతో తయారుచేస్తున్నారు మునీర్. సమోసాలను ఏరోజుకారోజు తాజాగా తయారుచేస్తారు మునీర్. దోరగా వేయించిన సమోసాలను బెల్లం పాకంలో వేసి చాలాసేపు ఊరిన తరవాత తింటారు. అందువల్ల ఇవి బాగా జ్యూసీగా, తియ్యగా ఉంటాయి.చీరాల సమోసాను మునీర్ స్వయంగా రూపొందించారు. డెబ్భయ్యో పడిలో పడిన మునీర్ తాను యువకుడుగా ఉన్నప్పుడు ఒంగోలులో అరటిపండ్ల వ్యాపారం చేసేవారు. వాటితో పాటు ఆయా ఋతువులలో వచ్చే అన్నిరకాల పండ్లను సుమారు పది సంవత్సరాల పాటు అమ్మారు. ఈ వ్యాపారాలేవీ తన ఆర్థిక ఇబ్బందులను తీర్చకపోవడంతో, చీరాల వెళ్లి, సమోసా వ్యాపారం ప్రారంభించారు.సాధారణంగా తయారుచేసే ఉల్లిపాయ, బంగాళదుంప బదులు, జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ తో స్టఫింగ్ చేసి సమోసా రూపొందించారు మునీర్. ‘‘30 సంవత్సరాల క్రితం చీరాల వచ్చేసి సమోసా వ్యాపారం ప్రారంభించాను. ఆ రోజుల్లో చీరాలలో సమోసాలు తయారుచేసేవారు లేకపోవడంతో నా వ్యాపారం బాగా సాగింది. కొద్ది రోజులకే పోటీ ఎదురైంది. ఆ పోటీ తట్టుకోవడానికి కొత్తగా ఏదైనా కనిపెట్టాలనుకున్నాను. చేతికి దొరకిన వాటితో రకరకాలుగా ప్రయత్నించాను. చిట్టచివరకుఈ ఆలోచన వచ్చింది. సమోసాలో ఇదొక కొత్త ప్రయోగం కావడంతోను, ఇందులో ఉపయోగించేవన్నీ విలక్షణమైనవి కావడంతోను స్వీట్ సమోసా ప్రారంభించిన వెంటనే మంచి ఆదరణ వచ్చింది’ అంటారు మునీర్.భార్య సహాయంతో ఇంటి దగ్గరే తయారుచేసి, వాటిని తోపుడు బండి మీద పెట్టుకుని, సాయంత్రం అవుతుండగా దర్బార్ రోడ్డులోని ఎస్బిఐ ఏటిఎం దగ్గరకు వస్తారు. అమ్మకాలు ప్రారంభించిన రెండు మూడు గంటల లోపే సమోసాలన్నీ అమ్ముడైపోతాయి. స్వీట్ సమోసాకి అంత డిమాండ్ ఉంది. ఇందులో ఉపయోగించే వస్తువుల వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల, ఇప్పటికీ స్వీట్ సమోసా విషయంలో పోటీ లేదు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ సమోసాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అందువల్లే ఇవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మంచి క్వాలిటీతో తయారుచేస్తుండటం వల్ల ఈ సమోసా ధర 7 రూపాయలతో ప్రారంభమై ఇప్పుడు 25 రూపాయలకు పెరిగింది. వీటి గిరాకీ కూడా అలాగే పెరిగింది. ఆర్డర్ల మీద కూడా మునీర్ సమోసాలు సప్లయి చేస్తుంటారు. ఇదంతా ఒంటి చేతిమీదే జరుగుతుంది. తయారుచేసుకున్న సమోసాలను నూనెలో వేయించి తీసాక, సిద్ధం చేసి ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి రెండు మూడు నిమిషాలు ఉంచి బయటకు తీస్తాడు. -
మహిళలు సీరియల్స్ చూసి ఆనందించాలి: లోకేష్
చీరాల: మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు రూ.25 కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మానానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలో 225 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరగలేదని అందులో చీరాల మండలానికి రూ.10 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తన పర్యటన ముగింపునకు కొద్దిరోజుల క్రితమే చీరాల నియోజకవర్గానికి బీటీ రోడ్లు నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించానని, కొద్ది రోజుల్లో రూ.15 కోట్లు కేటాయించి 225 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. రామాపురంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమానికే టీడీపీ ప్రభుత్వం పాటు పడుతోందని, మత్య్సకారులందరికీ డీజిల్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 150 మందికి ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, ముఖద్వారం ఏర్పాటు చేస్తానన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అందుకే సీరియల్స్ చూసి ఆనందంగా ఉండాలంటూ మహిళలకు సూచించారు. 2020 నాటికి రాష్ట్ర అబభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి అంగన్ వాడీ భవనాలు, ఎల్ఈడీ భవనాలు, సీసీ రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు. దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సభలో లోకేష్ వాఖ్యానించారు. రైతు రుణమాఫీకి నియోజకవర్గానికి రూ.1.30 కోట్లు విడుదల చేశామన్నారు. హార్బర్ రాదు.. ‘కేంద్రం, రాష్ట్రాన్ని మోసం చేసింది..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేధించింది. మత్య్సకారుల చిరకాల వాంఛ అయిన హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు. నీతి ఆయోగ్ పథకం ఒట్టిదే’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలో జరిగిన మత్య్సకారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం 11 గంటలు కష్టపడుతున్నారని, మత్య్సకారుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మత్య్సకారులకు ముఖ్యమైన హార్బర్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఆమంచి అడుగగా మంత్రి ఆదినారాయణ మాత్రం కేంద్రం హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు....సాగర్ మాల అంతా బూటకం అని వాఖ్యానించారు. డబ్బులు, పెట్రోల్ ఫ్రీ మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు చీరాలకు వచ్చిన మంత్రి లోకేష్ పర్యటనలో తన ఓటు బ్యాంకును చూపించుకోవడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి 4 నుంచి 6 ప్రైవేటు స్కూళ్ల బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు బైక్ ర్యాలీతో స్వాగతం పలికించారు. టూవీలర్‌కు 2 లీటర్ల పెట్రోల్, డబ్బులు, పార్ట స్టికర్లు పంపిణీ చేశారు. ఆమంచి వర్సెస్ కలెక్టర్ చీరాల: మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొత్తపేట జెడ్పీ హైస్కూల్ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆమంచి మధ్య వాగ్వాదం జరిగింది. హైస్కూల్ నిర్మించిన స్థల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. అసలు కొత్తపేట హైస్కూల్ ప్రారంభానికే వచ్చినప్పటికీ కలెక్టర్ సూచనల మేరకు మంత్రి లోకేష్ వెనుతిరిగారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొత్తపేటలో హైస్కూల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో రూ.2.20 కోట్ల అంచనాలతో కేవలం 50 రోజుల్లోనే నూతన భవంతులు నిర్మించారు. ఈ స్కూల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా స్కూల్ నిర్మాణం చేశారు. అయితే కొత్తపేట హైస్కూల్ నిర్మించిన స్థలం ది ఐఎల్టీడీ కోపరేటివ్ సొసైటీకి చెందింది. అందులో కార్మికులు కొందరికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా ఇదే స్థలంలో హైస్కూల్ నిర్మాణం చేపట్టడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తుండగా స్టే కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చీరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి అల్పాహారానికి వెళ్లారు. లోకేష్‌తో పాటుగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులున్నారు. ఇక్కడ సమస్యను కలెక్టర్ వినయ్‌చంద్ లోకేష్‌కు వివరించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆమంచి.. కలెక్టర్‌తో విభేందించారు. ఉదయం 8 గంటలకే మంత్రి లోకేష్‌తో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖాముఖి అన్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు పాఠశాల ప్రారంభం కానీ, ముఖాముఖి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
టీడీపీలో మినీ వార్
చీరాల: నియోజకవర్గ కేంద్రం చీరాలలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాటగా మారింది. ఒకప్పుడు పార్టీకి బలమైన పునాదులుండగా ప్రస్తుతం చీలికలు.. పేలికలుగా మారింది. ఎమ్మెల్యే ఆమంచి వైపు ఒకవర్గం ఉండగా మాజీమంత్రి పాలేటి రామారావు మరో వర్గాన్ని నడిపిస్తున్నారు. మూడో వర్గానికి ఎమ్మెల్సీ పోతుల సునీత సారధ్యం వహిస్తోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇటీవల చీరాల నియోజకవర్గంలోనే రెండు మినీ మహానాడులు జరిగాయంటే పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీలోకి ఎమ్మెల్యే ఆమంచి చేరిన తర్వాత మున్సిపల్ చైర్మన్‌తో పాటు కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు చేరినప్పటికీ పాలేటి రామారావు వర్గీయులు మాత్రం ఆమంచితో కలవలేదు. ఆమంచి కూడా మొదటి నుంచి వస్తున్న తన సొంత క్యాడర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారే కానీ టీడీపీలో ఉన్న మాజీ నాయకులు, సీనియర్ నేతలను తన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆమంచి మధ్య వర్గ పోరును కూడా జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలు పరిష్కరించలేకపోయారు. దీంతో చీరాల టీడీపీ మూడు ముక్కలాటగా మారింది. పోరు.. హోరు.. చీరాల నియోజకవర్గలో పోటా పోటీ కార్యక్రమాలు జరగడం ఆనవాయితీగా మారింది. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, మినీ మహానాడు వంటి అంశాలే దీనికి ఉదాహరణ. ఈనెల 16వ తేదీన ఎమ్మెల్యే ఆమంచి ఆధ్వర్యంలో మినీ మహానాడును ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్లోని ఓపెన్ థియేటర్లో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేకు పోటీగా మాజీమంత్రి పాలేటీ వర్గీయుడైన ఎంపీపీ గవిని శ్రీనివాస్ స్థానిక ఐఎంఏ హాలులో మినీ మహానాడు నిర్వహించారు. అలానే ఎమ్మెల్యే ఇంటింటి తెలుగుదేశం, దళితతేజం కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. పాలేటి కూడా తమ వర్గీయులతో దళిత తేజం, ఇంటింటి టీడీపీ నిర్వహించి వార్డులు, బూత్ కమిటీలను కూడా పోటీగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కమిటీలను, పట్టణంలోని వార్డుల కమిటీలను కూడా పాలేటి నియమించారంటే టీడీపీలో పోరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలను పాలేటి నిర్వహించడం వి«శేషం. తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేతలు పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ క్యాడర్ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. మరో 8 నెలల్లో టీడీపీ పాలన పూర్తి కానుంది. దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందో.. రాదో అనే మీమాంసలో నాయకులున్నారు. ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు ఎంపిక జరగకపోవడం, మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జరగకపోవం గమనార్హం. చివరకు పార్టీ రాష్ట్ర, జిల్లా పదవులతో పాటుగా ఇతర నామమాత్రపు పోస్టులు చీరాల్లో ఎవ్వరికి దక్కకపోవడంతో పార్టీలో తామెందుకు కొనసాగుతాన్నామనే అంతర్మధనం మొదలైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 9 ఏళ్లు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా ఎలాంటి గుర్తింపు లేకపోవడం, నామినేటెడ్ పోస్టులు కల్పించకపోవడంతో తాము అధికారంలో ఉన్నామా....? లేక ప్రతిపక్షంలో ఉన్నామా...? అని పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరికొందరైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నారు. -
గౌతమిది హత్యే
చీరాల రూరల్: భర్త, అత్త మామల వేధింపుల కారణంగానే గౌతమి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె మృతికి కారణమైన భర్తను అరెస్టు చేసినట్లు డీఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ తెలిపారు. మంగళవారం ఆమె స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చీరాల పట్టణం కొట్లబజారు రామ మందిరం వీధికి చెందిన కోట పాండురంగారావు కుమారుడు కోట వెంకట రామకృష్ణ మణికంఠ పవన్‌కుమార్ అలియాస్ మణికంఠతో గుంటూరుకు చెందిన గాదుమల్ల వెంకట రత్నం కుమారై గౌతమికి 2014లో వివాహం జరిగింది. ఆ తర్వాత మణికంఠ సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి చీరాలలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇది గౌతమికి నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గౌతమి పుట్టింటి వారు విక్రయించిన ఆస్తులకు సంబంధించి వాటా తీసుకురాకపోవడంతో భర్త, అత్తమామలు ఆమెను ఇబ్బంది పెట్టారు. వారి బాధలు భరించలేని గౌతమి గత నెల 26వ తేదీ ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో ముగిని ఆత్మహత్యకు పాల్పడింది. గౌతమి మృతికి ఆమె భర్త, అత్త మామలే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పాండురంగారావు, పుష్ప అమృతవల్లిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన ఆమె భర్తను అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ కేసులో మిగిలిన నిందితులైన మణికంఠ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఈపురుపాలెం ఎస్ఐ అనూక్ న్నారు. -
అతివేగంతో ఉన్న రైలును అందుకోలేక...
సాక్షి, ప్రకాశం : చీరాల రైల్వే స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. అతి వేగంతో ఉన్న రైలు ను ఎక్కేందుకు యత్నించిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడిని దర్శి మండలం సామంతపూడికి చెందిన కడకలుపు వెంకట శివ (18)గా గుర్తించారు. ఆ వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. శివ బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ విభాగంలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అక్కడ హాస్టల్లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి చెన్త్నెలో జరిగే ఎడ్యుకేషన్ సెమినార్లో పాల్గొనేందుకు బాపట్ల నుంచి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. అయితే మంచినీటి కోసం దిగిన అతను.. రైలు కదులుతుండటం గమనించిన రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలు వేగం ఎక్కువగా ఉండటంతో అతడి కాలు జారడంతో బోగి.. ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో శివ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వెంటనే స్పందించిన స్నేహితులు క్షతగాత్రుడిని చికిత్సకు తరలించేందుకు చీరాల 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అప్పటికే వాహనం మరో ప్రాంతానికి వెళ్లి ఉండటంతో చేసేది లేక ఆటోలో చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్.. క్షతగాత్రుడు వెంకట శివను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీఆర్పీ ఎస్ఐ రామిరెడ్డి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు వెంకటాద్రి, సత్యవతితో పాటు తోటి విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. శోకంలో సన్నిహితులు... ప్రైవేట్ స్కూలు టీచర్‌గా పనిచేసే వెంకటాద్రికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు. వెంకట శివ చివరివాడు. కుటుంబ సభ్యులంతా గారాబంగా చూసుకునేవారు. అతడు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. చదువులో కూడా వెంకట శివ అందరికంటే ముందుండేవాడు. చలాకీగా అందరితో కలసిమెలసి తిరిగేవాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన ఆ కుటుంబానికి కుమారుడి మరణం తీరని లోటు మిగిల్చింది. -
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
చీరాలరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తనయుడిని కత్తితో కసితీరా పొడిచి కడతేర్చాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జాండ్రపేటలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. జాండ్రపేటలోని నేతాజీ నగర్‌కు చెందిన షేక్ బుజ్జి, మస్తానీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలున్నారు. బుజ్జి మటన్ దుకాణం నడుపుతుంటాడు. అతడు నిత్యం మద్యం తాగి కుటుంబంలో గొడవలు పడుతుంటాడు. ఈ క్రమంలో అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ పడుకునేందుకు మంచం వేసుకుంటున్నాడు. బుజ్జి ఆఖరి కుమారుడు బాబి (19) అన్నం తింటున్నాడు. మంచం వేస్తే నడిచేందుకు అడ్డుగా ఉంటుందని, అన్నం తిన్న తర్వాత మంచం వేసుకోవాలని బాబి తన తండ్రి బుజ్జికి సూచించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బుజ్జి.. తన కుమారుడు బాబి పొట్టలో కసితీరా కత్తితో పొడిచాడు. చివరకు కుమారుడి పొట్టలోని పేగులు సైతం బయటపడ్డాయి. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాబి మృతి చెందాడు. మృతుడు టైలర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒన్‌టౌన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమచారం. -
చీరాలలో హెబ్బా పటేల్ సందడి
-
చీరాలలో హెబ్బా పటేల్ సందడి
చీరాల: సినీనటి హెబ్బా పటేల్ సందడి చేసింది. స్థానిక దర్బార్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బిన్యూ మొబైల్ షాపును శనివారం ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా బిన్యూ షోరూం ఎండీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37 షోరూంలను ప్రారంభించామని, చీరాలలో 38వ షోరూంను ప్రారంభించినట్లు తెలిపారు. అలానే బాపట్ల, పొన్నూరు, హిందూపూర్లలో కూడా షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలో వంద షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బిన్యూ షోరూం ప్రారంభించేందుకు ప్రముఖ నటి హెబ్బా పటేల్ చీరాలకు వచ్చిందని తెలుసుకున్న ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. -
ఆమంచి వర్గీయుల దాడిలో మహిళ మృతి
-
బ్రేకింగ్: చీరాలలో ఆమంచి వర్గీయుల రౌడీయిజం
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేత ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీలైతే లొంగతీసుకోవడం, కుదరకపోతే బెదిరించడం, అదీ సాధ్యం కాకపోతే చంపడం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం తమకు ఎదురు తిరిగిందని గవినివారి పాలెంకు చెందిన దేవర సబ్బులు అనే మహిళపై ఆమంచి వర్గీయులు దాడికి పాల్పడ్దారు. ఈదాడిలో సుబ్బులు తీవ్ర గాయాలపాలైంది. దీంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తీవ్రగాయలతో ఉన్న సుబ్బులు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా ఆస్పత్రి వద్ద ఆమంచి వర్గీయులు మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావడాన్ని అడ్డుకున్నారు. దీంతో సుబ్బులు కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. అయితే చేతిలో అంగబలం, అధికార బలం ఉన్న ఆమంచి వర్గం రెచ్చిపోయింది. ఆందోళనకు దిగిన వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా మృతదేహాన్ని గ్రామంలోకి రానీకుండా అడ్డుకోవడానికి అనుచరులను గవినివారిపాలెంలో పెద్ద ఎత్తున్న మొహరించారు. అధికారానికి పోలీసుల వత్తాసు : న్యాయంవైపు ఉండాల్సిన పోలీసులు కూడా ఆమంచి వర్గీయులకు వత్తాసు పలికారు. నాయకుల మెప్పు కోసం సుబ్బులు కుటుంబ సభ్యులను, వారికి మద్దతుగా వచ్చిన ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమ వారిని విడిచిపెట్టాలంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. -
చీరాలలో రేష్మీ సందడి
చీరాల: స్థానిక ముంతావారి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మై స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి, ప్రముఖ యాంకర్ గౌతమ్ రేష్మీ హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె ప్రేక్షకులకు అభివాదం చేశారు. రేష్మీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.రమేష్‌బాబు, స్టోర్స్ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. రేష్మీని చూసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులు -
ఇంజినీరింగ్ విద్యార్థుల ఆత్మహత్య
► పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం ► పెళ్లైన 24 గంటల్లోపే రైలు కిందపడిన వైనం ► అవయవాలు దానం ఇవ్వాలని ఫోన్లో విజ్ఞప్తి ► ఇరు కుటుంబాల్లో నెలకొన్న విషాదం చీరాల : వారిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. కలిసి బతకాలన్న ఆ జంట ఆకాంక్షకు కులాలు అడ్డు వచ్చాయి. పెద్దలను ఎదిరించలేక ఆ జంట కలిసికట్టుగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సరిగ్గా 24 గంటల ముందు ఓ గుడిలో వివాహం చేసుకుని దంపతులయ్యారు. హృదయ విదారకమైన ఈ సంఘటన మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లాలోని వేటపాలెం రైల్వేస్టేషన్లో జరిగింది. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బత్తుల సందీప్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ అగ్రకులాల వారే. అయినా కులాలు వేరు కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమను వదులుకోకుంటే చనిపోతామని పెద్దలు బెదిరించారు. దీంతో కన్నవారిని ఎదిరించలేక ఇద్దరూ కుమిలిపోయారు. తాము ప్రాణాలు వదిలినా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని భావించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తలచారు. ఆత్మహత్యకు ముందు ఒక్క క్షణమైనా దంపతులుగా జీవించాలని భావించారు. విజయవాడ వెళ్లి అక్కడ ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. స్నేహితుడికి ఫోన్ చేసి.. పెళ్లి విషయాన్ని సందీప్ తన స్నేహితుడికి ఫోన్లో తెలియజేశాడు. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఈ విషయాన్ని ఇరువర్గాల పెద్దలకు చెప్పాలని కోరాడు. తమ అవయవాలు ఇతరులకు దానం ఇవ్వాలని కోరాడు. సంఘటన జరిగిన వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రాథేయపడ్డాడు. తలలు మాత్రమే పట్టాలపై ఉంచి.. సందీప్, మౌనిక తలలు మాత్రమే పట్టాలపై ఉంచి పడుకున్నారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. స్నేహితులు వెంటనే చీరాల జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డికి చెప్పడంతో ఆయన తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. సందీప్ మొబైల్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు ప్రేమికుల మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఉదయం ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులతో తమ కలలను నిజం చేస్తారన్న వారు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులు తమ తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. తల్లడిల్లిన మౌనిక తల్లిదండ్రులు... అమృతలూరు(వేమూరు) : వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండల గ్రామం మోదుకూరు గ్రామానికి చెందిన గోగిరెడ్డి పెద్దిరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్న కుమార్తె మౌనిక తమ కళాశాలలో చదువుతున్న సందీప్‌ను మంగళవారం ఉదయం విజయవాడలో వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఆ నవజంట సందీప్ ఇంటికి వెళ్లారు. వారిని చూసి తల్లిదండ్రులు క్రోపోద్రిక్తులయ్యారు. ఇంటి నుంచి గెంటేశారు. దీంతో వివాహమై పట్టుమని 10 గంటలు కూడా కాకముందే వారు లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. వేటపాలెం సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమార్తె అర్ధంతరంగా మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. -
వేటపాలెంలో యువతి దారుణ హత్య
- గొంతు కోసి పరారైన ఆటో డ్రైవర్ సాక్షి, వేటపాలెం (చీరాల): ఆటోడ్రైవర్ ఓ యువతిని గొంతుకోసి హతమార్చిన ఘటన శనివారం రాత్రి ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన యువతి శవనం తేజ(22)ఎంటెక్ పూర్తి చేసి చీరాల పట్టణంలోని టీవీఎస్ షోరూంలో పనిచేస్తోంది. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ రామానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ గోపీచంద్ ఆ యువతితో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో గోపీచంద్ శనివారం రాత్రి 7 గంటల సమయంలో తేజను రామానగర్‌లోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనక తలుపు పగలగొట్టి ఇద్దరూలోనికి వెళ్లారు. ఆ తరువాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గోపీచంద్ తేజ గొంతుకోసి పరారయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. గోపీచంద్ స్నేహితులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ ప్రేమ్‌కాజల్, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి యువతి మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
ఆశలు బుగ్గి
∙ చీరాలలో భారీ అగ్నిప్రమాదం ∙ కాలి బూడిదైన సురేష్ మహల్ ∙ ఆధునిక వసతులతో సిద్ధమైన థియేటర్ ∙ ప్రారంభానికి ముందు రోజు ప్రమాదం ∙ రూ.కోటిన్నరకు పైగా ఆస్తినష్టం ∙ తీవ్ర నిరాశలో సినీ అభిమానులు జిల్లాలో ప్రముఖ పట్టణమైన చీరాలలో నేటికీ టూరింగ్ టాకీసుల వంటి పురాతన థియేటర్లు మినహా ఆధునిక వసతులతో కూడిన సినిమా హాలు ఒక్కటీ లేదు. మోడ్రన్ థియేటర్లో సినిమా చూడాలంటే అటు గుంటూరో.. ఇటు ఒంగోలో వెళ్లాల్సిందే. సినిమా కోసం యాభై, అరవై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం ఇక్కడి సినిమా అభిమానులకు ప్రయాసే. ఈ పరిస్థితుల్లో అత్యాధునిక వసతులతో కూడిన మల్టీప్లెక్స్ ఏసీ థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కానీ, దురదృష్టవశాత్తు ప్రారంభానికి ఒక్కరోజు ముందు అగ్నికి ఆహుతైపోయింది. యాజమాన్యానికి పెద్దమొత్తంలో ఆస్తినష్టం.. అభిమానులకు నిరాశకు తీవ్ర నిరాశను మిగిల్చింది. చీరాల: పట్టణంలోని చర్చిరోడ్డులో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన సురేష్ మహల్ ఉంది. దీనిని ఏసీ థియేటర్‌ను నవీకరించి, అన్ని హంగులతో రెండు స్క్రీన్లుగా మార్చారు. కొత్త ఫర్నీచర్, సౌండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు నెలలపాటు ఆధునీకరణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శుక్రవారం సినీనటుడు దగ్గుబాటి రానా చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రానా నటించిన ‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమాతో పునఃప్రారంభించాలనుకున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం థియేటర్లో పనులు చేస్తున్న సమయంలో ఏసీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పనివారు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపట్లోనే పొగ, మంటలు థియేటర్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఓ కార్మికుడికి గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చీరాల డీఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్, తహశీల్దార్ ఆర్.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ సూర్యనారాయణలు సిబ్బందితో వచ్చి థియేటర్‌ను పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్నవారి నుంచి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జిల్లా అగ్నిమాపక అధికారి సి.పెద్దిరెడ్డి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా.. లేక మరేదైనా కారణాలున్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉందని, థియేటర్‌కు అగ్నిమాపక అనుమతులు కూడా లేవని చెప్పారు. ప్రమాదంలో దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు... సురేష్‌మహల్ అగ్నిప్రమాదానికి గురైందనే సమాచారం తెలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. నిత్యం వాహనాలతో రద్దీతో ఉండే రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. చీరాలలో మొదటిసారిగా ఏసీ థియేటర్ ప్రారంభం కానుందని, గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా చీరాలలోనే సినిమా చూడవచ్చని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. వారిని అదుపు చేసేందుకు పోలీస్ సిబ్బంది ఇబ్బంది. -
ఆ గడ్డ నేరాలకు అడ్డా..!
► నేర సామ్రాజ్యం వైపు అడుగులేస్తున్న చిన్న ముంబై యువకులు ► హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదం షరామామూలే ► తరచూ అరాచకాలకు పాల్పడుతున్న కిరాయి మూకలు ► రోజురోజుకూ దిగజారుతున్న పోలీసు ప్రతిష్ట చిన్న ముంబైగా పేరొందిన చీరాలలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. సుమారు 400 ఏళ్ల క్రితం ఏర్పడిన చీరాల నేడు జిల్లాలోనే నేరాలకు నిలయంగా..ఘోరాలకు అడ్డాగా మారింది. హత్యలు, హత్యాయత్నాలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదాలు నిత్య కృత్యమయ్యాయి. నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ కళ్లప్పగించి చూస్తోంది. పోలీసు అధికారులైతే అవినీతి మరకలంటించుకుని ఖాకీ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారు. దొంగతనాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా రికవరీల సంగతి గాలికొదిలేశారు. – చీరాల చీరాల: ఒకప్పుడు జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాత్రమే ప్యాక్షన్, కిరాయి హత్యలు జరిగేవి. ప్రస్తుతం అది ఒంగోలు నుంచి చీరాలకు మారింది. గడచిన మూడు నెలల్లో చీరాల నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయి. పాత కక్షలు నేపథ్యంలో మూడు నెలల క్రితం రౌడీ షీటర్ కత్తి శ్రీను సైకిల్‌పై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా పాత ప్రసాద్ థియేటర్ సమీపంలోని బోసు నగర్లో అతని సమీప బంధువులు క్రికెట్ బ్యాట్లతో తలపై మోది హత్య చేశారు. నెల క్రితం వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో మరో హత్య జరిగింది. పెరుగు శ్రీనివాసరావుకు చెందిన రొయ్యల చెరువుల వద్దకు గుంటూరు జిల్లాకు చెందిన రాజు పోతురాజురెడ్డి తన భార్యతో కలిసి కాపలాగా వచ్చాడు. పోతురాజు రెడ్డి భార్యతో చెరువుల యజమాని వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. విషయం రెడ్డికి తెలిసి భార్యను మందలించాడు. చివరకు రెడ్డిని మరోవ్యక్తి సాయంతో కొట్టి చంపేశారు. వారం క్రితం వేటపాలెం మండలం పాత పందిళ్లపల్లికి చెందిన రొయ్యల సాగు చేసే తిరుమల శ్రీహరిని అతని సొంత బావ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చీరాలలో కిరాయి హంతక ముఠాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చంపేందుకు కొందరు సుఫారీలు తీసుకుంటున్నారు. చెన్నంబొట్ల అగ్రహరంలో ట్రిపుల్ మర్డర్ నిందితునులను హత మార్చేందుకు ఓ ముఠా సుఫారీ తీసుకుంది. నగదు పంచుకునే విషయంలో విభేదాలు ఏర్పడి ముఠా సభ్యులే ఒకరినొకరు హత మార్చుకునేందుకు సిద్ధమై చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. జోరుగా జూదం పేదలు అధికంగా జీవించే చీరాలలో జూదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. చేనేతలు అధికంగా నివసించే జాండ్రపేట, దేశాయిపేట, ఈపురుపాలెం, పేరాల ప్రాంతాల్లో సింగిల్ నంబర్ లాటరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెన్సెక్స్ పాయింట్ల అధారంగా జరిగే జూదంలో ప్రధానంగా చేనేత కార్మికులు అధికంగా నష్టపోయి అప్పులు పాలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల్లో కూడా చీరాల ఆరితేరింది. ఇటీవల వరసుగా అంతర్జాతీయ క్రికెట్ పోటీల సందర్భంగా చీరాలలో బెట్టింగ్ జోరుగా సాగింది. విద్యార్థులే బెట్టింగ్‌లకు బలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఏడాదిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మసకబారిన పోలీసు ప్రతిష్ట గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు ప్రతిష్ట మసకబారింది. సబ్ డివిజన్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు అవినీతి మరకలంటించుకున్నారు. బచ్చులవారిపాలెంలో జరిగిన ఓ హత్య కేసులో కేసు నమోదు చేయనందుకు ఓ ఎస్ఐ, సీఐ శాఖాపరమైన విచారణ ఎదుర్కొని చివరకు సస్పెండయ్యారు. సీఐ స్థాయి అధికారి వాడరేవులో పోలీసు అతిథి గృహం పేరుతో లక్షల రూపాయల నిధులు సేకరించి అభాసుపాలై సస్పెండయ్యాడు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలంటూ వ్యాపారులు, వైద్యశాలలు, కళాశాలల వద్ద భారీగా నిధులు సేకరించి అక్రమాలకు పాల్పడడంతో సీనియర్ సీఐ ఇటీవలే సస్పెండయ్యారు. కొత్తపేటలోని టూటౌన్ పోలీసుస్టేషన్లో ఓ మహిళను అర్ధరాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చి ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె స్టేషన్çపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయంలో అక్కడ విధులు నిర్వర్తించే ఎస్ఐ, సీఐ సస్పెండ్‌కు గురయ్యారు. నో రికవరీలు ఇటీవల దొంగలు చీరాల ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసుస్టేషన్‌కు కూత వేటు దూరంలోని షాపులు, మద్యం దుకాణాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఓ బనియన్ దుకాణంలోకి అర్ధరాత్రి సమయంలో దూరిన దొంగలు విలువైన దుస్తులు, కొంత నగదు అపహరించారు. డీజీకె పార్కు సెంటర్లోని ఓ మద్యం దుకాణంలోకి అర్ధరాత్రి చొరబడిన దొంగలు విలువైన మద్యం బాటిళ్లతో పాటు రూ..50 వేలకు పైగా నగదు అపహరించారు. సాల్మన్ సెంటర్లో ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 20 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, కొంత నగదు దోచుకెళ్లారు. ఇలాంటి ఎన్నో చోరీ కేసుల్లో పోలీసులు సవర బంగారాన్ని కూడా రికవరీ చేయలేకపోయారు. -
చీరాలలో రాచరిక పాలన
► అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి ఇష్టారాజ్యం ► ఆయన అండతో రెచ్చిపోతున్న అనుచరులు ► అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాల ధ్వంసం ► సామగ్రి విక్రయించి సొమ్ము చేసుకున్న చోటా నేత చీరాలలో రాజరిక పాలన నడుస్తోంది. చట్టం.. న్యాయం.. అక్కడ చట్టుబండలే. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరులు ఏది అనుకుంటే అది జరగాల్సిందే. అధికారులు, కోర్టులు జాంతానై. సర్వం ఎమ్మెల్యేనే. ఆయన ఆదేశిస్తారు.. అనుచరులు పాటిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో చీరాల ప్రజలకు బాగా తెలుసు. ఆమంచి అనుచరులు తమ స్వలాభం కోసం చివరకు ప్రభుత్వ పాఠశాలను కూడా వదల్లేదు. ధ్వంసం చేసి దాని సామగ్రిని కిలోల కింద అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మండల పరిషత్‌లో తీర్మానం చేసి సభ్యుల ఆమోదం మేరకు విద్యాశాఖ అధికారులు దగ్గరుండి శిథిల పాఠశాలను తొలగించాలి. చీరాల టౌన్: పాఠశాల దేవాలయంతో సమానం. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించే ఈ దేవాలయాన్ని అధికార పార్టీ నాయకులు అధికారుల అనుమతి తీసుకోకుండా అడ్డగోలుగా కూల్చేశారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను నిలువునా కూల్చివేయడంతో అధికార పార్టీ నేతల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పది రోజుల క్రితం చీరాల అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో శిథిలావస్థకు చేరి ప్రమాదంగా ఉన్న పాఠశాలలు, తుఫాన్ షెల్టర్లు కూల్చి వేయాలని ఎమ్మెల్యే అధికారులకు హుకుం జారీ చేశారు. మండలంలోని వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెంలో 1 నుంచి 3 తరగతి వరకు, 4 నుంచి 5 తరగతి వరకు 2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఆనుకుని తుఫాన్ షెల్టర్ కూడా ఉంది. తుఫాన్ షెల్టర్ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా ఉండటంతో పాటు స్కూల్‌కు ఆనుకుని ఉండటంతో స్కూల్ భవనం కొతం శిథిలావస్థకు చేరకుంది. కీర్తివారిపాలెం తుఫాన్ షెల్టర్‌తో పాటు శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనాన్ని కూడా తొలగించాలని ఎమ్మెల్యే స్థానిక అధికార పార్టీ నాయకులను ఆదేశించారు. చట్ట ప్రకా రం అన్ని అనుమతులు తీసుకుని మండల తీర్మానంతో పాటు పంచాయతీ పాలకవర్గం అనుమతితో స్కూల్ భవనాన్ని తొలగించాలి. అనుమతులు..జాంతానై ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాత్రం ఎలాంటి తీర్మానాలు లేకుండానే అధికార పార్టీ నాయకుడినన్న గర్వంతో చదువుల కోవెలను క్రేన్ సాయంతో ఇష్టానుసారం పగలగొట్టించాడు. ప్రభుత్వ స్కూల్‌ను టీడీపీ నాయకుడు అనుమతి లేకుండా ధ్వసం చేస్తున్నాడని పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ప్రభుత్వ స్కూల్‌ను పగలకొట్టడం ఎందుకని ప్రశ్నించిన గ్రామస్తులతో సంబంధిత టీడీపీ నాయకుడు దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.. అంతా నా ఇష్టం.. అడ్డు వస్తే మీకే నష్టం.. అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాడు. గ్రామంలోని స్కూల్‌ను అనుమతి లేకుండా ధ్వంసం చేస్తున్నా పంచాయితీరాజ్, విద్యాశాఖ, ఎంపీడీవోలు కనీసం గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తడం సమంజసం కాదని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం నుంచి వచ్చిన ఇనుము, ఇతర సామగ్రిని సైతం టీడీపీ నేత అమ్ముకుంటున్నాడు. పంచాయతీ అనుమతి ఇవ్వలేదు: మా గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనాలు తొలగించాలని మండల పరిషత్ నుంచి పంచాయతీకి ఎలాంటి తీర్మానాలు రాలేదు. కీర్తివారిపాలెంలో ప్రభుత్వ స్కూల్‌ను పగలగొట్టేందుకు ఎవరికీ పంచాయతీ అనుమతి ఇవ్వలేదు. – ఎరిపిల్లి రమణ, సర్పంచ్, వాడరేవు నాకేమీ తెలియదు : కీర్తివారిపాలెం ఎంపీపీ స్కూల్‌ను పగలకొడుతున్నారని నాకు తెలియదు. ఎవరు పగలకొడుతున్నారో కనుక్కుంటా. శిథిల భవనాలు తొలగించాలంటే మండల పరిషత్ నుంచి అనుమతులు అవసరం. సభ్యుల తీర్మానం కూడా ఉండాలి. తీర్మానం లేకుండా ధ్వంసం చేయడం సరికాదు. అధికారులతో విచారణ జరిపించి కారణాలు తెలుసుకుంటా. – వెంకటేశ్వర్లు, ఎంపీడీవో -
చీరాలలో రాచరిక పాలన
⇔అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి ఇష్టారాజ్యం ⇔ఆయన అండతో రెచ్చిపోతున్న అనుచరులు ⇔అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాల ధ్వంసం ⇔సామగ్రి విక్రయించి సొమ్ము చేసుకున్న చోటా నేత చీరాలలో రాజరిక పాలన నడుస్తోంది. చట్టం.. న్యాయం.. అక్కడ చట్టుబండలే. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరులు ఏది అనుకుంటే అది జరగాల్సిందే. అధికారులు, కోర్టులు జాంతానై. సర్వం ఎమ్మెల్యేనే. ఆయన ఆదేశిస్తారు.. అనుచరులు పాటిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో చీరాల ప్రజలకు బాగా తెలుసు. ఆమంచి అనుచరులు తమ స్వలాభం కోసం చివరకు ప్రభుత్వ పాఠశాలను కూడా వదల్లేదు. ధ్వంసం చేసి దాని సామగ్రిని కిలోల కింద అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మండల పరిషత్‌లో తీర్మానం చేసి సభ్యుల ఆమోదం మేరకు విద్యాశాఖ అధికారులు దగ్గరుండి శిథిల పాఠశాలను తొలగించాలి. – చీరాల టౌన్ పాఠశాల దేవాలయంతో సమానం. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించే ఈ దేవాలయాన్ని అధికార పార్టీ నాయకులు అధికారుల అనుమతి తీసుకోకుండా అడ్డగోలుగా కూల్చేశారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను నిలువునా కూల్చివేయడంతో అధికార పార్టీ నేతల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పది రోజుల క్రితం చీరాల అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో శిథిలావస్థకు చేరి ప్రమాదంగా ఉన్న పాఠశాలలు, తుఫాన్ షెల్టర్లు కూల్చి వేయాలని ఎమ్మెల్యే అధికారులకు హుకుం జారీ చేశారు. మండలంలోని వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెంలో 1 నుంచి 3 తరగతి వరకు, 4 నుంచి 5 తరగతి వరకు 2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఆనుకుని తుఫాన్ షెల్టర్ కూడా ఉంది. తుఫాన్ షెల్టర్ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా ఉండటంతో పాటు స్కూల్‌కు ఆనుకుని ఉండటంతో స్కూల్ భవనం కొతం శిథిలావస్థకు చేరకుంది. కీర్తివారిపాలెం తుఫాన్ షెల్టర్‌తో పాటు శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనాన్ని కూడా తొలగించాలని ఎమ్మెల్యే స్థానిక అధికార పార్టీ నాయకులను ఆదేశించారు. చట్ట ప్రకా రం అన్ని అనుమతులు తీసుకుని మండల తీర్మానంతో పాటు పంచాయతీ పాలకవర్గం అనుమతితో స్కూల్ భవనాన్ని తొలగించాలి. అనుమతులు..జాంతానై ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాత్రం ఎలాంటి తీర్మానాలు లేకుండానే అధికార పార్టీ నాయకుడినన్న గర్వంతో చదువుల కోవెలను క్రేన్ సాయంతో ఇష్టానుసారం పగలగొట్టించాడు. ప్రభుత్వ స్కూల్‌ను టీడీపీ నాయకుడు అనుమతి లేకుండా ధ్వసం చేస్తున్నాడని పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ప్రభుత్వ స్కూల్‌ను పగలకొట్టడం ఎందుకని ప్రశ్నించిన గ్రామస్తులతో సంబంధిత టీడీపీ నాయకుడు దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.. అంతా నా ఇష్టం.. అడ్డు వస్తే మీకే నష్టం.. అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాడు. గ్రామంలోని స్కూల్‌ను అనుమతి లేకుండా ధ్వంసం చేస్తున్నా పంచాయితీరాజ్, విద్యాశాఖ, ఎంపీడీవోలు కనీసం గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తడం సమంజసం కాదని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం నుంచి వచ్చిన ఇనుము, ఇతర సామగ్రిని సైతం టీడీపీ నేత అమ్ముకుంటున్నాడు. నాకేమీ తెలియదు : కీర్తివారిపాలెం ఎంపీపీ స్కూల్‌ను పగలకొడుతున్నారని నాకు తెలియదు. ఎవరు పగలకొడుతున్నారో కనుక్కుంటా. శిథిల భవనాలు తొలగించాలంటే మండల పరిషత్ నుంచి అనుమతులు అవసరం. సభ్యుల తీర్మానం కూడా ఉండాలి. తీర్మానం లేకుండా ధ్వంసం చేయడం సరికాదు. అధికారులతో విచారణ జరిపించి కారణాలు తెలుసుకుంటా. – వెంకటేశ్వర్లు, ఎంపీడీవో -
వివాహేతర సంబంధ నేపథ్యంలో మహిళ మృతి
వెంకటపాలెం (తుళ్లూరు రూరల్): వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహిత మృతి చెందిన సంఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల వద్ద తోటావారిపాలెం గ్రామానికి చెందిన ప్రశాంతి కుమారి(25), ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రశాంతి బీఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసింది. దీంతో అశోక్ సింగరాయకొండలోనే ఉంటూ సిమెంట్ పని చేస్తూ భార్యను ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అయితే రాజధానిలో పనులు అధికంగా ఉంటాయని వెంకటపాలెంకు వలస వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పని ముగించుకుని అశోక్ భోజనానికి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా భార్య తీయలేదు. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న గ్రామ పంచాయతీ గుమస్తా పి.సత్యనారాయణ బయటకు వస్తూ అశోక్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీనిపై భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంతి ఒంటిపై కిరోసిన్ పోసుకోగా, అశోక్ భార్యకు నిప్పు అంటించడంతో పెద్దగా కేకలు వేసింది. అశోక్ మంటలు ఆర్పి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తుళ్లూరు ఎస్సై సందీప్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి వద్ద నుంచి వాగ్మూలాన్ని తీసుకున్నారు. చికిత్స పొందుతున్న ప్రశాంతి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సందీప్ తెలిపారు. -
లాగేసుకున్నారు..!
► కోస్టల్ కారిడార్ రహదారి కోసం నోటీసులు ఇవ్వకుండానే భూసేకరణ ► చీరాలలో వంద ఎకరాలు సేకరించిన ప్రభుత్వ యంత్రాంగం ► రూ.25 లక్షల విలువైన భూమికి రూ.5 లక్షల పరిహారం ► పైసా చెల్లించకుండానే పనులు ప్రారంభం ► ఆందోళనబాట పట్టిన రైతులు టీడీపీ ప్రభుత్వంలో రైతుల భూములకు భరోసా లేకుండా పోయింది. భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ పేరుతో అడ్డగోలుగా లాగేసుకుంటున్నారు. కనీసం చట్టపరంగా కూడా వ్యవహరించడం లేదు. పరిహారంపై ఎటూ తేల్చకుండానే భూములు సేకరించి ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. ఇలా ఒక్క చీరాలలోనే జాతీయ కోస్టల్ రహదారి కోసం వంద ఎకరాల రైతుల భూములను సేకరించారు. అయితే పరిహారంలో మాత్రం రైతులకు చుక్కలు చూపెడుతున్నారు. విలువైన భూములకు పరిహారం నామమాత్రంగా ఉంది. చీరాల: జిల్లాలోని ఒంగోలు మండలం త్రోవగుంట నుంచి కృష్ణాజిల్లా కత్తిపూడి వరకు జాతీయ కోస్తా రహదారి హైవే నంబర్ 216ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించే పనులు మొదలుపెట్టారు. దీని కోసం జిల్లాలో 172.45 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటున్నారు. దీని పరిధిలో విలువైన భూములతో పాటు రొయ్యల చెరువులు పోనున్నాయి. అక్కడ సుమారు ఎకరం రొయ్యల చెరువు రూ.20 నుంచి రూ.25 లక్షల విలువ ఉంటుంది. గతంలో వాన్‌పిక్ సమయంలో ఎకరం కోటి రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కనీసం రూ.20 లక్షల పైనే ఎకరం ధర ఉన్నప్పటికీ పరిహారం మాత్రం ఎకరాకు రూ.3 నుంచి రూ 5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని వలన సుమారు 130 మందికిపైగా రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. 3ఈ నోటీసులు జారీ చేయకుండానే... భూములు సేకరించాలంటే ముందుగా రైతులకు 3ఈ నోటీసు అందించి వారి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. అయితే 70 శాతం మంది రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భూసేకరణ పనులు పూర్తి చేస్తున్నారు. వేటపాలెం మండలంలో 40 మంది రైతుల నుంచి 42 ఎకరాలు, చీరాల మండలంలో 92 మంది రైతుల నుంచి 70 ఎకరాలకు పైనే పట్టా భూములు సేకరిస్తున్నారు. అయితే రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో నష్టపరిహారం సైతం ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి రైతులు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వం అదే మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. విలువైన భూములు... త్రోవగుంట నుంచి కడవకుదురు రైల్వే ట్రాకు సమీపంగా పందిళ్లపల్లి, నాయినిపల్లి, పుల్లరిపాలెం, తోటవారిపాలెం, ఈపూరుపాలెం మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. వేటపాలెం మండలంలో ఎక్కువ నష్టపోయేది రొయ్యల చెరువుల రైతులే. అక్కడి రైతులు రొయ్యల చెరువులు తవ్వించుకోవడంతో పాటు నిర్మాణాలు, చేనుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎకరం రూ.25 లక్షల వరకు డిమాండ్ ఉంది. కౌలు రేట్లే ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పలుకుతోంది. అంత విలువైన భూములకు సాధారణ భూముల్లా కేవలం రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. చీరాల మండలంలో వేరుశనగ, ఇతర పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వేరుశనగ పంట ఉంది. ఈ భూములకు కూడా రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తామని చెబుతోంది. వాన్‌పిక్ ఏర్పాటు సమయంలో భూములు ఎకరా కోటి వరకు పలకగా ప్రస్తుతం ఆ ప్రాజెక్టు రాకపోవడంతో ఎకరా రూ.25 లక్షల వరకు ఉంది. విలువైన భూములకు పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లిస్తామని చెప్పడంతో చీరాల, వేటపాలెం మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం చెల్లించకుండానే... సేకరించిన భూములకు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వకుండానే జాతీయ రహదారి పనులు మొదలుపెట్టారు. పరిహారం వ్యవహారం కొలిక్కి రాకుండా పనులు మొదలు పెట్టడంతో పాటు చీరాల మండలం తోటవారిపాలెం ప్రాంతంలో రైతుల భూములలో ఉన్న మోటార్లు తొలగించారు. రైతులు భూసేకరణతో పాటు ప్రస్తుతం భూములలో ఉన్న పంటకు, మోటార్లకు నిర్మించుకున్న షెడ్లుకు, రొయ్యల చెరువు రైతులకు మోటార్లు, చెరువు తవ్విన వ్యయాన్ని కూడా నష్టపరిహారంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండానే భూసేకరణ చేయడంతో పాటు రోడ్డు పనులు కూడా మొదలుపెట్టడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. రైతుల ఆందోళనను కూడా కనీసం పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా జాతీయ కోస్టల్ రహదారి పనులు మొదలు పెట్టడం గమనార్హం. -
చీరాల.. ఐపీ ఖిల్లా
► పక్కాగా నమ్మించి డబ్బు తీసుకుని మోసం ► రూ.7 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ఫైనాన్స్ వ్యాపారి ► వడ్డీలకు ఆశపడి అసలు కూడా నష్టపోతున్న అభాగ్యులు చీరాల : చీరాల పట్టణం మోసాలకు అడ్డాగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు రకరకాల మోసాలు. మోసపోయేవాళ్లు ఉండాలేగానీ మోసం చేయడానికి మాత్రం ఇక్కడ కోకొల్లలుగా ఉంటారు. కాకపోతే.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ప్రస్తుతం చీరాల్లో ఐపీ మోసాలు కొనసాగుతున్నాయి. ఐపీలు పెట్టేవారు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారం కోసం అప్పులు తెస్తారు. చాలామంది వ్యాపారులు, చిరువ్యాపారులు దాచుకున్న డబ్బు బ్యాంకుల్లో వేసుకుంటే వడ్డీ తక్కువ వస్తుందని భావించి ఎక్కువ వడ్డీ కోసం ఆశపడి అడిగిందే తడవుగా మోసగాళ్లకు అప్పులిస్తారు. కొన్ని రోజులు నమ్మకంగా వడ్డీలు చెల్లించే మోసగాళ్లు.. ఎక్కువ మంది వద్ద కోట్లాది రూపాయలు అప్పు చేసి చివరకు ఐపీ పేరుతో అప్పులిచ్చిన వారికి కుచ్చుటోపీ పెడతారు. వడ్డీ సంగతి అలా ఉంచితే.. చివరకు అసలు కూడా కోల్పోయి అప్పులిచ్చిన వారు రోడ్డున పడతారు. ఈ తరహా మోసాలు ప్రస్తుతం చీరాల్లో అధికంగా జరుగుతున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం పేరుతో దగా... స్థానిక ఎంజీసీ మార్కెట్లో ఒక వ్యక్తి దశాబ్ద కాలంగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా వ్యాపారం చేస్తుండటంతో స్థానిక వ్యాపారులతో పాటు పట్టణంలోని మధ్యతరగతి కుటుంబాల వారు సైతం అడిగిందే తడవుగా అతనికి అప్పులిచ్చారు. అలాగే నోట్ల రద్దు సమయంలో ఎక్కువ మొత్తంలో వ్యాపారులు ఫైనాన్స్ రూపంలో ఇచ్చేశారు. జనం వద్ద రూ.100కి రూ.2 చొప్పున వడ్డీకి తీసుకుని అతను మాత్రం ఇతరులకు రూ.100కి రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీకి ఇచ్చి వసూలు చేసేవాడు. తనవద్ద అప్పు తీసుకున్న వారు ఎవరైనా సకాలంలో డబ్బు చెల్లించకుంటే అంతే సంగతులు. తనవద్ద ఉండే యువకులను పంపి బెదిరించి భయపెట్టి వసూలు చేసేవాడు. అలా కోట్లలోనే వడ్డీలకు తిప్పేవాడు. ఫైనాన్స్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. అయితే ఏమైందోఏమోగానీ కొద్దిరోజుల క్రితం ఏకంగా రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. బాగా సంపాదించాడు కదా తాము ఇచ్చిన డబ్బులో అసలైనా వస్తాయని ఆశించారు. కానీ, అప్పులిచ్చిన వారికి కొద్దిరోజులకు ఐపీ నోటీసులు ఇంటికి పంపాడు. మొత్తం రూ.7 కోట్లకుగానూ రూ.5 కోట్లకు ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. కొద్దిరోజులు మొహం చాటేసిన ఆ ఫైనాన్స్ వ్యాపారి.. ఐపీ నోటీసులు ఇచ్చిన తరువాత మరలా చీరాల వచ్చి తనకు రావాల్సిన బకాయిలను దర్జాగా వసూలు చేసుకుంటున్నాడు. అయితే ఈ ఫైనాన్స్ వ్యాపారి జనం సొమ్మును కొంత దాచిపెట్టడంతో పాటు మరికొంత సొమ్ముతో తన తనయుడితో వ్యాపారం చేసుకునేందుకు వచ్చినట్లు సమాచారం. అంటే జనం సొమ్ముతో జల్సా అన్నమాట. మోసగాళ్లు ఎంతో మంది... నమ్మించి అప్పుచేయడం.. ఆ తరువాత కోట్లకు ఐపీలు పెట్టి మోసం చేయడం. చీరాల్లో చాలామందికి ఇది పరిపాటిగా మారింది. ప్రస్తుతం పట్టణంలోని ఒక వస్త్రవ్యాపారి తనయుడు ఒక ప్రైవేట్ వైద్యశాలలో వాటాదారుడిగా ఉండి రూ.3 కోట్లకుపైగా ఐపీ పెట్టినట్లు సమాచారం. సదరు వ్యాపారి కొద్దిరోజులుగా చీరాలలో కనిపించకుండా వేరే ప్రాతంలో తిరుగుతున్నట్లు సమాచారం. అప్పులిచ్చిన వ్యక్తులు అతని కోసం తిరుగుతున్నారు. అలాగే గొల్లపాలేనికి చెందిన వస్త్రవ్యాపారి కూడా కొద్దిరోజుల క్రితం రాత్రికిరాత్రే తన దుకాణంలోని వస్త్రాలను బయటకు పంపి దుకాణం మూసేశాడు. సదరు వ్యాపారి అప్పులిచ్చిన వారికి రూ.2 కోట్లకు ఎగనామం పెట్టేశాడు. కేవలం ఎక్కువ వడ్డీ వస్తుందని అశపడిన చాలామంది జనం చీరాల్లో ఐపీల బారినపడి చివరకు రోడ్డున పడుతున్నారు. రోడ్డున పడిన బాధితులు... ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారికి కొంతమంది వస్త్రవ్యాపారులు అప్పులివ్వగా చాలామంది మాత్రం చిరువ్యాపారులు, మధ్య తరగతి వారు ఉన్నారు. ముంతావారిసెంటర్లో రోడ్ల పక్కన హోటళ్లు, ఇతర చిరువ్యాపారులు చేసేవారు తీవ్రంగా మోసపోయారు. ఒకరు తన కూతురు వివాహం కోసం అక్కరకు వస్తాయని ఆశించి ఇచ్చిన డబ్బును మోసపోయారు. బ్యాంకులో ఇస్తే రూపాయి కూడా వడ్డీ రాదని భావించి రూ.2 వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారికి ఇచ్చి అన్యాయమయ్యారు. ఐపీ నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. వడ్డీవద్దు.. అసలైనా ఇప్పించండని వేడుకుంటున్నారు. -
చీరాలలో రాష్ట్రాస్థాయి ఎడ్ల పోటీలు
-
రౌడీ షీటర్‌ను హత్య చేసిన ప్రత్యర్థులు
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు చుక్కలు చూపించింది..
చీరాల : మూడు నెలల క్రితం ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించిన యువకుడికి మాయలేడీ చుక్కలు చూపించింది. బాధితుడి కథనం మేరకు.. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన వింజమూరి సురేశ్ కుమార్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. జనవరిలో తన ఫేస్‌బుక్‌కు ఓ యువతి చల్లా పల్లవి అనే పేరుతో, ప్రొఫైల్ పిక్చర్లో మలయాళ హీరోయిన్ ఫొటో పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. రిక్వెస్ట్‌ను సురేశ్ అంగీకరించి ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకున్నారు. తాను ఇన్ఫోసిస్‌లో జావా డెవలపర్ టీం లీడర్‌గా పనిచేస్తానని చెప్పింది. తన తండ్రి ఒంగోలులో డీఎస్పీగా పనిచేస్తున్నాడని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చింది. తర్వాత తన అసలు పేరు మౌనిక, సొంతూరు చీరాల కొత్తపేటని చెప్పింది. ప్రేమిస్తున్నానని చెప్పడంతో ప్రేమను అంగీకరించాడు. చివరకు ఒకరోజు ‘మన ప్రేమను మా నాన్న అంగీకరించలేదని, నిద్ర మాత్రలు మింగానని చెప్పింది. దీంతో సురేశ్ ఒంగోలులో డీఎస్పీకి ఫోన్ చేయగా మౌనిక పేరుతో తనకు కూతురే లేదని చెప్పాడు. తర్వాత మూడు రోజుల్లోనే మౌనిక.. సురేశ్‌కు ఫోన్‌చేసి తన బావతో ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నానని సమాచారం అందించింది. హోటల్లో ఉన్న మౌనికను కలిసేందుకు సురేశ్ వెళ్లాడు. అక్కడ నల్లగా పెద్ద వయసు ఉన్న ఓ మహిళ తాను మౌనికగా పరిచయం చేసుకుంది. విషయం అర్థమైన సురేశ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా గది తలుపులు మూసేసి ఇక్కడి నుంచి వెళ్తే మీ కుటుంబమంతా జైలుకెళ్తుందని బెదిరించి దండలు మార్పించింది. సురేశ్ బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మౌనికను, ఆమె నాయనమ్మ అని చెప్పుకుంటున్న వృద్ధురాలిని తీసుకుని విజయవాడ రైల్లో బయలుదేరారు. మధ్యలో సురేశ్ బంధువులు వచ్చి వారిని అడ్డుకోవడంతో.. అక్కడి నుంచి మౌనిక, వృద్ధురాలు పారిపోయారు. తరువాత విచారణ చేయగా అసలు ఆమె పేరు మౌనిక కాదని.. ఉయ్యాల కనక మహాలక్ష్మి (35) అని, అనేక కేసుల్లో నిందితురాలని తేలింది. ఆమెకు పెళ్లై భర్త చనిపోయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం సురేశ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి కులం పేరుతో దూషించాడని కనకమహాలక్ష్మి ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితుడు కూడా ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, చీటింగ్‌లో ఆమె ముద్దాయి. ఆమెపై తిరుపతి సీసీఎస్, క్రైం, నార్కెట్‌పల్లి పీస్‌లో అరెస్టు వారెంట్, కందుకూరులో అనుమానాస్పదురాలిగా కేసులున్నాయి. ఈ కేసు నుంచి నువ్వు బయట పడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని కూడా బెదించిందని బాధితుడు వాపోయాడు. -
రాములోరి పెళ్లికి తలంబ్రాలు సిద్ధం
చీరాల: శ్రీరామనవమి పర్వదినాన తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో దేవతామూర్తులపై పోసే తలంబ్రాల తయారు చేసే అవకాశం చీరాల వాసులకే దక్కింది. చీరాల వాసులు ఈ అవకాశాన్ని దక్కించుకోవడం వరుసగా ఇది మూడోసారి. శ్రీ రఘురామ భక్త సేవా సమితి 2011లో 11 మందితో చీరాలలో ఏర్పాటైంది. ప్రస్తుతం 700 మంది ఇందులో భాగస్వాములు అయ్యారు. గోటితో వడ్లు వొలిచి వాటిని తలంబ్రాలుగా తయారు చేసే కార్యక్రమం క్షీరపురి వాసులకు దక్కడం ఎదురుచూడని అదృష్టం. విజయదశమి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకుడు పొత్తూరి బాలకేశవులు తెలిపారు. స్థానిక సంతబజారులోని శివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చీరాల నుండి తీసుకెళ్లే 144 కేజీల తలంబ్రాలను స్వామివార్లకు వినియోగిస్తారు. అలానే ఆరు వేల కేజీల తలంబ్రాలను దేవస్థానం ఏర్పాటు చేసి వాటిని భక్తులకు అందిస్తారు. 122కేజీల పసుపు, 60 కేజీల గులాం, 51 కేజీల కుంకుమను ఇప్పటికే భద్రాచలం దేవస్థానానికి పంపినట్లు తెలిపారు. వరుసగా మూడు సంవత్సరాలుగా ఈ అవకాశం దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. -
ఇంకెన్నాళ్లీ దాడులు ?
-
చంద్రబాబు, మంత్రులు స్పందించరా?
-
కీచక కండక్టర్‌పై విద్యార్థినుల ఫిర్యాదు
► విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ కండక్టర్ ► ప్రశ్నించిన వారిని బస్సు నుంచి దించేసిన వైనం ► నిరసనగా డిపో ఎదుట విద్యార్థినుల ధర్నా ► చీరాల డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చీరాల: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థినులతో కొందరు కండక్టర్లు వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా ఉంది. బస్సు పాసుల తనిఖీల పేరుతో విద్యార్థినుల చేతులు, బుగ్గలు పట్టుకుని వేధిస్తున్నారు. ప్రశ్నించిన విద్యార్థినులను మార్గమధ్యంలోనే బస్సు నుంచి దించేసి ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై విద్యార్థినులు ధర్నాకు దిగి కీచక కండక్టర్‌పై డిపో మేనేజర్ డి.శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. ఈపూరుపాలెం నుంచి రోజుకు సుమారు 100 మంది విద్యార్థినులు చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లో వస్తుంటారు. గురువారం కళాశాల అనంతరం ఇంటికి వెళ్లేందుకు చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో రేపల్లె వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆ బస్సులో ఉన్న కండక్టర్ శ్రీనివాసరావు.. స్టూడెంట్ పాస్ ఉన్న విద్యార్థులు బస్సు ఎక్కొద్దంటూ హెచ్చరించాడు. తమకు పాస్‌లున్నాయని చెప్పి కొందరు బస్కెక్కారు. బస్ పాస్‌ల తనిఖీ పేరుతో విద్యార్థినుల చేతులు, బుగ్గలు పట్టుకుని కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఏం చదువుతున్నారు...ఏ కళాశాలలో చదువుతున్నారంటూ అనవసరంగా ప్రశ్నించి వేధించాడు. కొందరు విద్యార్థినులు తమపై చేతులు వేయవద్దంటూ కండక్టర్‌కు ఎదురుదిగారు. కోపగించుకున్న కండక్టర్.. స్టూడెంట్ పాస్‌లు ఉన్న వారు తమ బస్సులు ఎక్కొద్దని, మీ వల్ల ఆర్టీసీకి నష్టం... అంటూ విద్యార్థినులను బస్స్టాండ్లోనే దించేశాడు. విద్యార్థినులంతా తమకు ఆర్టీసీ బస్సులో జరిగిన అన్యాయాన్ని శుక్రవారం కళాశాల అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేశారు. కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎం శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ విద్యార్థినులను వేధించిన కండక్టర్ ఏ డిపోకు చెందిన వారో తెలుసుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. డీఎంను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిత్య, అనీల్, విద్యార్థినులు ఉన్నారు. -
ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో అగ్నిప్రమాదం
ప్రకాశం: ట్రాన్స్పోర్ట్ గొడౌన్లో మంటలు చెలరేగడంతో.. కోట్ల రూపాయల విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాల ముంతవారికూడలిలోని దీపక్ ట్రాన్స్పోర్ట్ గొడౌన్లో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో గొడౌన్లో ఉన్న దుస్తువుల కాటన్లు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. -
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
= మృతులు చీరాల ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు = ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే చీరాల : దీపావళి తర్వాత వెలుగులు నిండాల్సిన ఆ రెండు కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు విద్యార్థులను లారీ రూపంలో మృతువు కబళించింది. మరో గంటలో ఇంటికి చేరాల్సిన విద్యార్థులు విగతజీవులయ్యారు. వివరాలు.. చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న గుంటూరు జిల్లా కర్లపాలే చెందిన వై.రాజేష్( 21), పొన్నూరుకు చెందిన షేక్ నితిన్ షరీఫ్ (21)లు సోమవారం కళాశాల వదిలిన తర్వాత బైకుపై స్వగ్రామాలకు బయల్దేరారు. కొత్తపేట బజాజ్ షోరూమ్ సమీపంలో బైపాస్‌లో లారీని ఢీకొట్టి ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. రాజేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా నితిన్ షరీఫ్ చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొత్తపేట నుంచి వడ్డే సంఘం వైపునకు ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. బైపాస్‌పై వాహనాలు వస్తుండటంతో అమె ఆగింది. ద్విచక్ర వాహనం ఆపే క్రమంలో అదుపుతప్పి ఆమె వాహనం కిందపడిపోరుుంది. ఆమె ముందు వెళ్తున్న విద్యార్థులు వెనక్కి చూస్తూ బైకు నడుపుతూ అదుపుతప్పి ఎదురుగా వేగంగా వస్తున్న లారీ కిందపడి దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు అప్పటి వరకూ తమతోనే ఉన్న మిత్రులు కొద్దిసేపటికే విగజీవులవ్వడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహలను పొస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
చీరాలలో సినీతార సమంత సందడి
-
యువత ఆధ్యాత్మికత పెంచుకోవాలి
చీరాల : యువతీయువకులు చెడుతనాన్ని విడనాడి చదువుతో పాటు ఆధ్యాత్మికత పెంచుకోవాలని..పెద్దలు, గురువులను గౌరవించాలని ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం గుంటూరు హెడ్ క్వార్టర్ (ఏఈఎల్సీ) అధ్యక్షుడు మోటరేటర్ బిషఫ్ కె.ఎఫ్. పరదేశిబాబు అన్నారు. స్థానిక చర్చికాంపౌండ్‌లోని సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చి ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన స్టేట్‌వైడ్ యూత్ కన్వెన్షన్–2016 బుధవారంతో ముగిసింది. స్థానిక చర్చి పాస్టర్ రెవరెండ్ వేముల బాబు సర్వోన్నతరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో 2వేల మంది యువత పాల్గొనడం శుభ పరిణామమన్నారు. చర్చి చైర్మన్ దేట అశోక్ కుమార్, ట్రెజరర్ జ్యోతుల జాకబ్‌లు మాట్లాడుతూ 2003లో నిలిచిన యూత్ కన్వెన్షన్ క్యాంపు తిరిగి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఉత్సాహంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం (ఏఈఎల్సీ) లోని 69 లూథరన్ చర్చిల నుంచి పాస్టర్లు కూడా హాజరయ్యారు. బైబిల్లోని సారాంశాలను విశదీకరించి పాఠ్యాంశాలుగా బోధించారు. బైబిల్ క్విజ్, పాటలు పోటీలు నిర్వహించారు. దేవుని గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. క్యాంపు చివరిరోజు ముగింపు సందర్భంగా సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో క్యాంప్ఫెయిర్ నిర్వహించారు. పెద్దఎత్తున బాణ సంచా కాల్చారు. పోటీల్లో విజేతలకు బిషఫ్ పరదేశిబాబు బహుమతులను అందజేశారు. ఏఈఎల్సీ సెక్రటరీ సీహెచ్ కిషోర్‌బాబు, ఏఈఎల్సీ యూత్ డైరెక్టర్ రెవరెండ్ జి. సతీష్, కె. ఆశాకిరణ్ పరదేశిబాబు, ఏఈఎల్సీ మాజీ అధ్యక్షుడు రెవరెండ్ విక్టర్ మోజెస్, స్థానిక చర్చి అడిషనల్ పాస్టర్ రెవరెండ్ జి. చంద్రకాంత్, స్థానిక చర్చి యూత్ ప్రెసిడెంట్ డి. సుధీర్, చర్చి ఎల్సీసీ, పీసీపీ సభ్యులు పాల్గొన్నారు. -
ఈ చేప రూ. ముప్పై వేలు
చీరాల: అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది. శనివారం ఉదయం వేటకు వెళ్లిన గంగులు తన బృందంతో వేట చేస్తుండగా 25 కిలోల బరువున్న ఈ చేప గాలానికి చిక్కిందని మత్స్యకారులు తెలిపారు. కేన్సర్, మెదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయారీలో ఈ చేపను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. తీరం ఒడ్డున నిర్వహించిన వేలంలో బెంగళూరుకు చేపలను ఎగుమతి చేసే నాగేంద్ర అనే వ్యాపారి దీన్ని రూ.30 వేలకు దక్కించుకున్నాడు. -
చీరాలలో పోలీసుల కార్టన్ సర్చ్
* 20 మందిని అదుపులోకి తీసుకున్న ఖాకీలు * 20 వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలింపు చీరాల రూరల్ : ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ ఆదేశాల మేరకు స్థానిక ఆర్టీసీ గ్యారేజీ వద్ద ఉన్న ఆదినారాయణపురంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు పోలీసులు కార్టన్ సెర్చ్ చేశారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 200 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటికి పోలీసులు స్వయంగా వెళ్లి ఇంట్లో ఎవరెవరు నివసిస్తున్నారు? ఇతర ప్రాంతాలకు చెందినవారు దొంగతనాలు, నేరాలకు పాల్పడి తలదాచుకునేందుకు ఏమైన వచ్చారా? అని ఆరాతీశారు. పాత నేరస్థులు ఇళ్ల వద్ద ఉంటున్నారా.. లేదా.. ఇతర ప్రాంతాలకు ఏమైనా వెళ్లారా, వెళితే ఎంతకాలం నుంచి ఇక్కడ ఉండటం లేదని నిశితంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 20 వాహనాలనూ పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. -
వైఎస్సార్ సీపీ నేతపై దుండగుల దాడి
చీరాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దాసరి శ్రీకాంత్, ఆయన భార్య విజయపై గుర్తు తెలియని ఏడుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన స్థానిక ఐఎల్టీడీ రామ్‌నగర్‌లోని శ్రీకాంత్ నివాసం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈ విషయమై శ్రీకాంత్‌తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొరబండి సురేష్, మున్సిపల్ కౌన్సిలర్ మొగిలి బాబ్జీ, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, స్థానికులు కలిసి టూటౌన్ సీఐ పి.పరంధామయ్యకు ఫిర్యాదు చేశారు. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకాశం... దాసరి శ్రీకాంత్ తన ఇంటి వద్ద స్నేహితులు రాజేష్, సురేష్‌లతో మాట్లాడుతున్నాడు. తొలుత ఆటోలో వచ్చిన నలుగురు శ్రీకాంత్‌ను కిందపడేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఇంతలో మరో ముగ్గురు కారులో వచ్చి శ్రీకాంత్‌పై దాడికి దిగారు. స్నేహితులు రాజేష్, సురేష్ ఎందుకు కొడుతున్నారంటూ వారించినా వినకుండా వారిని అక్కడి నుంచి తరిమేశారు. కేకలు విన్న శ్రీకాంత్ భార్య పరుగున ఇంట్లో నుంచి వచ్చి తన భర్తను ఎందుకు కొడుతున్నారని నిలదీసింది. ఆమెపై కూడా దాడికి దిగారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్‌ను వాహనంలో ఎక్కించుకునేందుకు విఫలయత్నం చేశారు. బాధితుడు పెద్దగా కేకలేశాడు. స్థానికులు రావడంతో ఏడుగురూ కారులో పరారయ్యారు. కారు నంబర్ కనిపించకుండా గ్రీసు పూసి ఉంది. స్థానికులు అతి కష్టంపై గ్రీసును తుడిచి నంబర్‌ను గుర్తించగలిగారు. అంతా ఒక్కటై టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని సీఐ పి. పరంధామయ్యకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సీఐను వేడుకున్నారు. -
బస్సులో భార్యను అలా చూసి..
చీరాల: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆమె సహోద్యోగిపై కత్తితో దాడిచేసి, పీకకోశాడో హెడ్ కానిస్టేబుల్. ప్రకాశం జిల్లా చీరాల బస్ స్టాండ్ లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటనలో కానిస్టేబుల్ చెయ్యికూడా తెగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలనుబట్టి.. భార్యాపిల్లలతో కలిసి చీరాలలో నివసిస్తోన్న బాలిగ శ్రీనివాసరావు కారంచేడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య అదే ఊళ్లోని ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. అదే ఆఫీసులో అసిసెంట్ మేనేజర్ సునీల్(35)తో ఆమెకు చనువు ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీనివాసరావుకు తెలియడంతో పలు మార్లు భార్యను హెచ్చరించాడు. మాట వినకపోయేసరికి ఎలాగైనా సునీల్ ను అంతం చేయాలనుకున్నాడు. మంగళవారం తన భార్య సునీల్ తో కలిసి బస్సులో ఉండటాన్ని శ్రీనివాసరావు గమనించాడు. ఒక్కసారిగా బస్సులోకి వెళ్లి వెంటతెచ్చుకున్న కత్తితో సునీల్ పై దాడిచేసి పీకకోశాడు. ఈ పెనుగులాటలో హెడ్ కానిస్టేబుల్ చెయ్యి కూడా తెగిపోయింది. ఈ సంఘటనతో బస్టాండ్ ప్రాంతమంతా నివ్వెరపోయింది. రక్తపుమడుగులో పడిఉన్న సునీల్ ను, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును కొందరు ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
అడ్డుగా ఉన్నాడని అంతం చేసింది
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిందో మహిళ. తాగిన మైకంలో కింద పడి మృతి చెందాడని మొదట అందరినీ నమ్మించేందుకు యత్నించింది. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా తానే మరో యువకుడి సహకారం తీసుకొని హత్య చేశానని ఒప్పుకుంది. సోమవారం రాయదుర్గం సీఐ దుర్గప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా, చీరాలకు చెందిన గవిని సత్యనారాయణ(39), హిందూపూర్‌కు చెందిన సొంటిపాయి భావన(25) 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వస్త్ర వ్యాపారం చేసే సత్యనారాయణ నష్టాలు రావడంతో ఐపీ పెట్టాడు. ఈ క్రమంలోనే మణికొండ శ్రీనివాస కాలనీలోని సిల్వర్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ తరచూ ఆమెతో గొడవపడేవాడు. హిందూపూర్‌లోని తల్లిగారి ఇంట్లో ఉన్న తన సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని ఈనెల 10న భర్తకు చెప్పి భావన వెళ్లింది. ఆమె అక్కడికి వెళ్లలేదని తెలిసి భర్త... ఫోన్ కాల్ డాటా ఆధారంగా భావన తిరుపతిలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడి వెళ్లాడు. ‘నీ విషయం నాకు తెలిసిపోయింది. నేను తిరుపతి వచ్చా’ అని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో భావనతో పాటు ఆమె క్లాస్‌మెట్ కుమార్ సత్యనారాయణ వద్దకు వెళ్లారు. ఇద్దరూ కలిసి రావడంతో భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. నీవు హిందూపూర్ వెళ్లు.. నేను చీరాల వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. దీంతో తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని భావన ప్రియుడు కుమార్‌తో కలిసి పథకం వేసింది. ఈనెల 15న జూబ్లీహిల్స్‌లో స్నేహితుల వద్ద ఉన్న భర్తకు ఫోన్ చేసి.. నేను మన ఫ్లాట్‌కు వచ్చా.. నీవు కూడా రా అని పిలిచింది. అతను వెళ్లాక ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి బిర్యానీ, మద్యం తెచ్చుకున్నారు. భావన బిర్యానీ తినగా.. సత్యనారాయణ మద్యం తాగాడు. ముందే వేసుకున్న పథకం ప్రకారం.. హిందూపూర్ నుంచి తన్వీర్(22) అనే యువకుడిని హైదరాబాద్‌కు రప్పించింది. సాయంత్రం 6 గంటలకు అతడికి ఫోన్ చేసి ఫ్లాట్‌కు పిలిచింది. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను అతడు గట్టిగా పట్టుకోగా... భావన పప్పు గుత్తితో భర్త గొంతుపై బలంగా నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తాగిన మైకంలో కిందపడి చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, మృతుడి మెడ కమిలిపోయి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి భావనను విచారించగా తానే తన్వీర్ సహాయంతో చంపేశానని ఒప్పుకుంది. కాగా, హిందూపూర్ నుంచి వచ్చిన తన్వీర్‌కు భావన.. భర్తను చంపేందుకు తనను పిలించిందని మొదట తెలియదని పోలీసులు తెలిపారు. హత్యకు తన్వీర్ ముందు ఒప్పుకోలేదని, అయితే, అతడిని కూడా చంపేస్తానని భావన భయపెట్టిందన్నారు. నిందితులు భావన, తన్వీర్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు కుమార్ కోసం గాలిస్తున్నారు. -
గుడి వద్ద బాంబులు పేలి ఇద్దరికి తీవ్రగాయాలు
చీరాల (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బచ్చువారిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఆదివారం ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చీరాల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయం గుడి పక్కన ఒక బాంబు పేలింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కాసేపటికి శబ్దం ఆగిపోయింది. ఆ సమయంలో పాపబోయిన శ్రీనివాసులు(30), వెంకటేశ్వర్లు(32) ఇద్దరూ బాంబు పేలినచోలును పరిశీలిస్తుండగా కర్పూరం ఉండలాంటిది కనిపించింది. శ్రీనివాసులు దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలిస్తుండగా చేతిలోనే పేలిపోయి అతని రెండు చేతుల వేళ్లు తెగిపోయాయి. పక్కనున్న వెంకటేశ్వర్లుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చీరాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుడి వద్ద పేలినవి నాటు బాంబులేనని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
చీరాల (ప్రకాశం) : పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలోని బెంజిపాలెంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పవన్‌కుమార్(18) అవనిగడ్డలోని కళాశాలలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో కళాశాలకు క్రిస్మస్ సెలవులు కావడంతో.. చీరాలలోని సొంతింటికి వెళ్లాడు. కాగా శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం. -
సారాల!
చీరాలకు చిన ముంబైగా పేరుంది. అంటే ఇక్కడ నిత్యం ముంబై తరహా వ్యాపారం జరుగుతోంది కాబోలు..అని కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరైనా ఊహిస్తారు! ఇప్పుడు చిన్న ముంబై స్థానంలో మరో పేరు తెరపైకి వస్తోంది. అదే.. సారాల..! సారా అంగళ్లు సందు సందుకూ.. గొంది గొందికీ పుట్టుకొచ్చాయి. పట్టణంలో సారా పరవళ్లు తొక్కుతోంది. దీని తయారీదారులను సారా సామ్రాట్లు, సారా కింగ్‌లుగా పిలుస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు చీరాల.. సారాలగా మారిందంటూ పట్టణ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - చీరాలను సారాలగా మార్చుతున్న సారా సామ్రాట్లు - స్టూవర్టుపురం నుంచి నిత్యం యథే చ్ఛగా రవాణా - కాపుసారా మత్తులో బడుగులు, కూలీలే అధికం - నిద్రనటిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు చీరాల : చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో సారా పరవళ్లు తొక్కుతోంది. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న స్టూవర్టుపురం నుంచి వేల లీటర్ల నాటుసారా యథేచ్ఛగా వస్తోంది. అక్కడి నుంచి చీరాల ప్రాంతంలో ఉన్న వివిధ గ్రామాలు, ప్రాంతాల్లో ఉన్న సారా అంగళ్లకు చేరుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా నివసించేది బడుగులే. కాయకష్టం చేసుకుంటూ కుటుంబాలను భారంగా నెట్టుకొస్తుంటారు. మద్యం కొనలేక.. కూలీలకు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రత్యామ్నాయ మార్గంగా తక్కువ ధరకు వచ్చే సారా వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఇక్కడ సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరం..అంటే సరిగ్గా ఐదు కిలోమీటర్లలోపే స్టూవర్టుపురం ఉంది. ఉదయం విజయవాడ వైపు వెళ్లే ప్యాసింజర్ స్టూవర్టుపురంలో ఆగినప్పుడు చూస్తే ఏదో పెద్ద జాతర జరుగుతున్నట్లు కనిపిస్తుంది. సారా ఉత్పత్తి కేంద్రం స్టూవర్టుపురం రాష్ట్రస్థాయి, అంతర్రాష్ట్ర స్థాయి దొంగలకు స్టూవర్టుపురం ఒకప్పుడు పెట్టింది పేరు. ప్రస్తుతం దొంగతనాలకు వెళ్లటం మానేసిన కొందరు మాజీ నేరస్తులు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారు. రోజూ నాటుసారా కాచి స్టూవర్టుపురం రైల్వేస్టేషన్‌తో పాటు బేతపూడి సమీపంలో మల్లె తోటల వద్ద బహిరంగంగా విక్రయిస్తున్నారు. ఇవిగో..కేంద్రాలు చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్కాలనీకు చెందిన కొందరు స్టూవర్టుపురంలో కాచే సారాను ఐదు లీటర్ల క్యాన్ రూ.400లకు కొనుగోలు చేసి మందుబాబులకు గ్లాస్ రూ.10, క్వార్టర్ రూ.20 నుంచి 30 చొప్పున విక్రయిస్తున్నారు. చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణరోడ్డు, జాలమ్మగుడి, ఉజిలీపేట, శృంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్, రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో కూడా సారా నిత్యం అందుబాటులో ఉంటోంది. -
దాడులకు వెళ్లిన పోలీసులకు ముచ్చెమటలు
చీరాల: చీరాల నాటుసారా విక్రయ కేంద్రాలకు అడ్డాగా మారింది. ఉజిలిపేట, దండుబాట, ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద, జవహర్నగ ర్, జాలమ్మగుడి, జాన్‌పేట, రామ్‌నగర్, ఆదినారాయణపురం వంటి ప్రాంతాల్లో వీధివీధినా సారా దుకాణాలే. తరచూ ఎక్సైజ్ దాడులు కొనసా.. గుతూనే ఉంటాయి. కానీ ఒక్క దుకాణం కూడా మూతపడదు. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా పూర్తి స్థాయిలో దాడులు చే యాలంటే ఎక్సైజ్ పోలీసులకు ఒకింత భయమని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక మంది అధికారులు దాడులకు గురయ్యారు. చాలామంది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు బలయ్యారు. దింతో ఎక్సైజ్ పోలీసులు మొక్కుబడి దాడులకు పరిమితవుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం పదిమందికిపైగా ఎక్సైజ్, సివిల్ పోలీసులు.. అందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ వి.చంద్రశేఖరరెడ్డి, టూటౌన్ సీఐ పరంధామయ్య, ఇతర అధికారులు, సిబ్బంది మూకమ్మడిగా సారా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 50 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఉజిలీపేటలో చాలాకాలంగా నాటుసారా విక్రయిస్తున్న అంగడి సురేష్ అలియాస్ కుక్కల సురేష్ నివాసంలో విక్రయానికి ఉంచిన సారాను స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు కేసుల్లో ఉన్న సురే ష్ తన ఇంటికే ఎందుకొచ్చారంటూ పోలీసులతో ఘర్షణకు దిగాడు. ఇంట్లోకి వెళ్లి సోదాలు చేస్తున్న ఏఈఎస్ చంద్రశేఖరరెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. సురేష్‌కు మద్దతుగా తన కుంటుంబ సభ్యులు వచ్చారు. దింతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతవరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఏఈఎస్కు చేతికి గాయాలయ్యాయి. పోలీసులపైనే తిరగబడ్డ సురేష్‌ను చాలాసేపటి తర్వాత అరెస్టు చేసి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రుడు ఏఈఎస్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. ఆయన ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులపైనే దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకోవడంతో ఎక్సైజ్ పోలీసులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే తమ్ముని ఇసుక లారీల సీజ్
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు ఇసుక క్వారీపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. -
చనిపోయిన వ్యక్తికి వైద్యం..
⇒చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుని బంధువుల ఆందోళన ⇒రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించి మోసం చేశారని మండిపాటు ⇒వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందని ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చీరాలలో ‘ఠాగూర్’ తరహా మోసం ఠాగూర్ చిత్రంలో ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఓ ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి మృతుని బంధువుల నుంచి వైద్యులు రూ.లక్షలు దండుకుంటారు. విషయాన్ని కథానాయకుడు గ్రహించి వైద్యుల గుట్టురట్టు చేస్తాడు. చీరాలలో అచ్చం అలాగే జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందించారు. బంధువులతో రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరకు గుంటూరు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ ఆటో డ్రైవర్‌ను పరిశీలించిన వైద్యులు.. ఇతడు చనిపోయి ఇప్పటికే రెండు రోజులైందని చెప్పడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరొక్కసారి అందరూ ఠాగూర్ చిత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చీరాల : వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన గవిని నాగరాజు (30) పురుగుమందు తాగి గత నెల 20న ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అప్పులు పాలవడంతో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో పురుగుముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నాగరాజును చీరాలలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. 15 రోజులు పాటు చికిత్స అందించారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. గురువారం సాయంత్రం 3గంటల సమయంలో నాగరాజుకు సీరియస్‌గా ఉందని, గుంటూరు తరలించాలని వైద్యులు చెప్పడంతో బంధువులు హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు. నాగరాజు చనిపోయి రెండు రోజులైందని వైద్యులు ధ్రువీకరించడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుని బంధువులు, గ్రామస్తులు పోస్టుమార్టం అనంతరం చీరాల వచ్చి గడియారస్తంభం వద్ద ధర్నా చేశారు. వైద్యశాల అద్దాలు పగలగొట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆందోళన చేశారు. 15 రోజులు పాటు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరకు ప్రాణాలు పోగొట్టారని, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను నియంత్రించారు. ఈ సంఘటనపై వైద్యశాల డాక్టర్లు మాత్రం తమ తప్పు ఏమీలేదని, సక్రమంగా వైద్యం చేశామని, అవసరమైతే కేసు పెట్టుకోవాలని ఉచిత సలహా కూడా ఇవ్వడం గమనార్హం. విచారణ జరిపించండి : ఎమ్మెల్యే ఆమంచి నాగరాజు మృతిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచించారు. ఆటో డ్రైవర్ మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని, వైద్యశాలను సీజ్ చేయాలని కోరారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాగరాజు మృతదేహాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పోతుల సునీత పరిశీలించారు. మృతుని బంధువులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామన్నారు. -
చీరాలలో పట్టపగలే భారీ చోరీ
= చీరాలలో ఆర్అండ్బీ డీఈ ఇల్లు లూటీ = 250 గ్రాముల బంగారం అపహరణ = రూ.15 వేల నగదు కూడా.. చీరాల రూరల్ : చీరాలలో రోజు రోజుకూ దొంగలు బరితెగిస్తున్నారు. ఇళ్లల్లో చొరబడి అందినకాడికి దోచుకుంటున్నారు. సహజంగా రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే దొంగలు ప్రస్తుతం తమ పంథా మార్చుకుని పగటి వేళల్లో కూడా ఇళ్లు లూటీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలతో పాటు నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన మేరుగ శ్రీనివాసరావు ఆర్అండ్బీ డీఈగా చీరాలలో విధులు నిర్వర్తిస్తుంటారు. రోజూ మాదిరిగా ఉదయాన్నే ఆయన ఆఫీసుకు వెళ్లారు. అతని భార్య భారతి కంప్యూటర్ నేర్చుకునేందుకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి ఒంటి గంటకు వచ్చింది. వంటగది తలుపులు బార్లా తెరచి ఉండటంతో అనుమానం వచ్చి బెడ్రూమ్లోని బీరువాలను పరిశీలించింది. రెండు బీరువాల్లోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారణకు వచ్చింది. బీరువాలో దాచుకున్న నాలుగు బంగారు గాజులు, రెండు హారాలు, రెండు చైనులు, చెవి కమ్మ (సుమారు) మొత్తం 250 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. అంతేకాకుండా ఇంటి అవసరాలకు దాచుకున్న రూ.15 వేలు మాయమైనట్లు గుర్తించింది. తొలుత తన భర్త శ్రీనివాసరావుకు సమాచారం అందించి అనంతరం టూటౌన్ పోలీసులకు భారతి ఫిర్యాదు చేసింది. డీఎస్పీ జయరామరాజు, సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ వచ్చి బైపాస్ వైపు పరుగులు తీసింది. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ డాక్టర్ ఇంట్లో దొంగలు పడి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న విషయం తెలిసిందే. ఇదే ప్రాంతంలో మళ్లీ మరో భారీ చోరీ జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ కాలనీపై రాత్రి వేళల్లో నిఘా ఉంచాలని కోరుతున్నారు. -
కన్నీటి సేద్యం
చీరాల : బాబు పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగర్ జలాలపై ఆధారపడిన ఆయకట్టుదారులకు నీరు అందక..రుణమాఫీ మాట నమ్మి అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక రైతన్నలు వడ్డీ వ్యాపారుల గడప తొక్కుతున్నారు. శనగల కొనుగోలు చేస్తామని ఇచ్చిన బాబు తరువాత ఆ ఊసే ఎత్తకపోవడంతో ఇరకాటంలో పడ్డారు. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా జిల్లాలోని రైతుల దుస్థితి ఏర్పడింది. అప్పులతో సతమతం... అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత అప్పులతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో వర్షాలు పడడంతో రైతులంతా జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. రుణమాఫీ కాలేదు ... కనీసం రీషెడ్యూలు కూడా అమలు కాలేదు. బ్యాంకర్లు అన్నదాతలకు ఒక్క రూపాయి కూడా అప్పు ఇచ్చేదిలేదని మొండికేశారు. పెట్టుబడులు అత్యవసరం కావడంతో నూటికి రూ.3 నుంచి రూ.5 వరకు వడ్డీకి తెచ్చి వ్యవసాయంలో పెట్టుబడిగా పెడుతున్నారు. బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు తీసుకుందామన్నా వీలుకాని పరిస్థితులు బాబు కల్పించిందని వాపోతున్నారు. ఎరువు బరువైంది... ఎరువు రైతులకు మోయలేని భారంగా మారింది. ఇప్పటికే కౌలు రేట్లు పెరిగాయి. కూలీ రేట్లు రెట్టింపయ్యాయి. విత్తనాల ధరలు గతంలోకంటే అధికమయ్యాయి. ఎరువులు, పురుగు మందులు కొనే పరిస్థితి కనిపించడం లేదు. రూ.284లకు అమ్మాల్సిన యూరియా రూ.400కు అమ్ముతున్నారు. అది కూడా కాంప్లెక్స్ ఎరువులు కొంటే విత్తనాలు ఇస్తున్నారు. మరికొందరు పురుగుల మందులు కొన్నవారికే యూరియా ఇస్తున్నారు. పంటను కాపాడుకోవాలంటే తప్పని పరిస్థితుల్లో అధిక ధరలకు ఎరువులు, పురుగుముందుల కొనుగోలు చేయాల్సి వస్తోంది. ‘సాగర్’ వెతలు... నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరు రాక రైతులు పోరాటాలకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దంకి బ్రాంచ్ కెనాల్ నుంచి పర్చూరు డివిజన్లో కోటపాడు, ద్రోణాదుల, పమిడిపాడు, నూతలపాడు మేజర్ల ద్వారా మొత్తం 72 వేల ఎకరాలకు సాగు నీరు రావాల్సి ఉంది. దిగువ ప్రాంతాలకు సాగు నీరురాక మాగాణి భూములన్నీ బీడుగా మారిపోతున్నాయి. జిల్లాలో వరి పండించే రైతులు వరిసాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, అపరాలు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రెండో జోన్ పరిధిలో యద్దనపూడి బ్రాంచి కాలువ కింద ఐదు వేల ఎకరాల్లో పంట ప్రశ్నార్థకంగా మారింది. -
ఇసుమంత భయం లేదు
చీరాల : ఇసుక అక్రమ రవాణా చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో జోరందుకుంది. కొన్నేళ్ల నుంచి తీరప్రాంతాన్ని కండబలంతో కబళిస్తున్నా అరికట్టాల్సిన సంబంధితాధికారులు రాజకీయ అండను చూసి ప్రేక్షకపాత్ర వహించడంతో అడ్డూ అదుపూ లేకుండా తరలిపోతోంది. చీరాల టూ హైదరాబాద్ పేరుతో రోజూ భాగ్యనగరానికి వందల సంఖ్యలో ఇసుక లారీలు తరలివెళ్లడంతో ఈ ప్రాంతంలోని ఇసుక దిబ్బలన్నీ కాలువలుగా మారిపోయాయి. తీరప్రాంతంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇందుకు సహకరించిన కొంతమంది పోలీస్ అధికారులు, సిబ్బందిపై వేటుపడినా ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించినవారు కూడా పాతవారి బాటే పట్టడంతో అక్రమార్కులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. టీడీపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలను నిషేధించినా రాజకీయ నేతల అండదండలతో రోజూ వందల లారీలు వరుసకడుతున్నాయి. అప్పుడప్పుడు పట్టుకున్నట్టు హడావుడి చేసినా తరువాత వదిలేయడం రివాజుగా మారిపోయింది. నిషేధం తరువాత రెట్టింపైన ధర : రూ.15 వేల నుంచి 20 వేలు ఉండే లారీ ఇసుక నిషేధం అనంతరం రెట్టింపైంది. ఇసుక రవాణా నిలిచిపోయిందని, ఇసుక పంపడం సాధ్యం కాదంటూనే అధిక ధర ముట్టచెబితే చూస్తామంటూ బేరాలకు దిగుతున్నారు. దూరాన్ని బట్టి ధరలో మార్పులుంటాయి. హైదరాబాదైతే లారీ ఇసుకను రూ.40 వేలకు అందిస్తున్నారు. గతంలో మాదిరిగా బైపాస్, హైవేపై కాకుండా వేటపాలెం, చినగంజాం మండలాల్లోని ఇసుక అక్రమ రవాణాదారులు పందిళ్లపల్లి, తిమ్మసముద్రం ప్రాంతాల మీదుగా ఇసుకను లారీల్లో నింపి రవాణా చేస్తున్నారు. గతంలో రూ.600 ఉండే టైరుబండి ఇసుక ప్రస్తుతం రూ.1200లకు చేరింది. రూ.1500 ఉండే ట్రాక్టర్ ఇసుక రూ. 4000 చేరింది. రూ.20,000 ఉండే టర్బో లారీ ఇసుక రూ.40,000 చేరింది. ఈపూరుపాలెం, బోయినవారిపాలెం నుంచి రోజుకు వందల ట్రాక్టర్లలో చీరాల, పరిసర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఇసుక వీరుడిగా పేరున్న ఓ మాజీ సర్పంచి ఈ అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. నిలిచిన నిర్మాణాలు జిల్లాలో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో పెద్ద ఎత్తున ఇసుక రీచ్‌లున్నాయి. ప్రభుత్వం నదీ పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే ఇసుక రీచ్‌లను లాటరీల ద్వారా మహిళా సంఘాలకు కేటాయిస్తున్నారు. మైదాన ప్రాంతాలతోపాటు ఇసుక పొలాల్లో అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఈ మూడు మండలాల్లో ఎవ్వరికీ కేటాయించలేదు. దీంతో కళ్లెదుటే ఇసుక ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి నెలకుంది. నిర్మాణాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, భవన సముదాయలు, రోడ్లు, ప్రైవేటు గృహాల నిర్మాణాలు అర్థంతరంగా నిలిచిపోయాయి. డేగరమూడి వాగులోనూ... డేగరమూడి(మార్టూరు): మార్టూరు మండలం డేగరమూడి గ్రామం వద్ద పర్చూరు వాగుకు ఇటీవల వరదతో భారీగా ఇసుక కొట్టుకురావడంతో అక్రమార్కుల కన్న పడింది.మంగళవారం వాగులో పొక్టయిన్తో తవ్వకాలు మొదలు పెట్టారు..పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలింపు నకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని చేలలోని మట్టిని, గ్రావెల్‌ను ఇళ్లకు, రోడ్లకు తొలుకుంటేనే లక్షల రూపాయల జరిమానాలు విధించే మైనింగ్, విజిలెన్స్ అధికారులు కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తుంటే ఏమి చేస్తున్నారని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. -
బీజేపీలోకి చీరాల ఎమ్మెల్యే?
చీరాల : హస్తం వీడి కమలం చేతబట్టిన కాంగ్రెస్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో మాజీ ఎమ్మెల్యే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్ కాషాయ కండువ కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గతంలో ఆయన టీడీపీలో చేరుకుందు ప్రయత్నించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి టీడీపీకి మద్దతు కూడా ప్రకటించారు. అయితే ఆమంచి టీడీపీలోకి వచ్చే విషయంలో స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత రావటంతో సైకిల్ ఎక్కేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈనేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదే సామాజిక వర్గానికి చెందిన ఆమంచితో బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చలు జరపటంతో ఆయన కమలం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆమంచి ఆయనకు కుడిభుజంగా ఉండేవారు. -
హైటెక్ వ్యభిచారం
చీరాల : చిన్న ముంబైగా పేరొందిన చీరాల ఇప్పుడు హైటెక్ వ్యభిచారానికి కేంద్ర బిందువైంది. కొందరు యువతులు, మహిళలు బ్రోకర్ల ఉచ్చులో చిక్కుకుని పచ్చని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎటువంటి అమ్మాయి కావాలి.. ఎంత వయసుండాలి... ఎక్కడకు పంపాలి.. ఈ వివరాలు రాసివ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు.. అనుకున్న సమయానికి ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. చీరాల కేంద్రంగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. మెట్రో నగరాల్లో సాగే ఈ హైటెక్ వ్యభిచారం చివరకు చీరాలకు కూడా పాకింది. కొందరు బ్రోకర్లు స్థానికంగా మకాంలు ఏర్పాటు చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు, మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. కొత్తపేట పంచాయతీలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. కాలేజీ విద్యార్థినులతో పాటు మహిళలకు డబ్బు ఆశపెట్టి లోబర్చుకుని వారిని ఈ వృత్తిలోకి దించుతున్నారు. కొత్తపేట పంచాయతీలోని దీనమ్మదిబ్బ, మూడురోడ్ల సెంటర్, పట్టణంలోని ఓ లాడ్జి, రైల్వేస్టేషన్ ఎదురు ఉన్న రెసిడెన్సీతో పాటు తీర ప్రాంతంలో ఉన్న పలు భవనాల్లో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. మహిళలను బేరం పెడుతున్నారు. విటుల వద్ద నిర్వహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. మరికొందరైతే అమ్మాయిల బలహీనతలను అడ్డం పెట్టుకుని వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. బ్రోకర్లు వారికి డబ్బు ఆశ చూపి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన చీరాల ప్రాంతం ప్రస్తుతం ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు వేదికైంది. గతంలో కొత్తపేట పంచాయతీలో ఓ లేడీస్ హాస్టల్ నిర్వాహకురాలు తనతో పాటు కాలేజీ అమ్మాయితో స్వలింగ సంపర్కాన్ని నగ్నంగా వీడియో తీయించిన విషయం తెలిసిందే. ఆప్పట్లో ఆ వీడియో నెట్కేఫ్ల్లో హల్చల్ చేయడంతో పాటు మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలాగే మండలంలోని తోటవారిపాలెంలోనూ ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా.. ఇటీవల కాలంలో బ్రోకర్లు కూడా తెలివిమీరారు. నివాసాల మధ్య ఇళ్లు అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగిస్తున్నారు. అక్కడ విషయం బయటకు తెలియడంతో మకాం మార్చేసి మరోచోట దుకాణం తెరుస్తున్నారు. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకుని అక్కడ అమ్మాయిలను ఉంచి నిర్వాహకులు మాత్రం ఇంటి వద్ద ఉంటూ కేవలం ఫోన్ ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తూ కొత్త తరహా వ్యభిచారానికి తెరలేపారు. టీనేజీ అమ్మాయిలు, మహిళలు..అంటూ కేటగిరీలుగా విభజించి మహిళలను ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా విటులు చెప్పిన గదులకు మహిళలను పంపుతున్నారు. విటులు కోరుకున్న విధంగా మహిళలను తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తూ వారి జేబులు గుల్ల చేస్తున్నారు. కుటుంబ పరిస్థితులే కారణమా? కుటుంబ పరిస్థితుల కారణంగా కొందరు, డబ్బు కోసం ఆశపడి మరికొందరు ఈ మురికి కూపంలోకి దిగుతున్నారు. చేసేది తప్పయినా కుటుంబ భారాన్ని మోసేందుకు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వ్యభిచార వృత్తిలోకి వస్తున్నారు. కొందరు పోలీసుల దాడుల్లో దొరికిపోయి అందరి ముందు నేరస్తుల్లా నిలబడుతున్నారు. పడుపు వృత్తిని వదిలేసి కొంతమంది మహిళలు ఇతర వృత్తులను చేస్తున్నా మరికొందరు ఇదే వృత్తినే కొనసాగిస్తుండటం గమనార్హం. -
డోంట్ కేర్
ఇదో జన్మభూమి కార్యక్రమం. ఇందులో అధికారులు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రమే పాల్గొనే ఓ అధికార కార్యక్రమం. కానీ చీరాల నియోజకవర్గంలో ఛీత్కార రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారులు అడ్డుపడినా, పోలీసులు అభ్యంతరాలు పెట్టినా డోంట్‌కేర్ అంటూ చీరాల టీడీపీ ఇన్‌ఛార్జి పోతుల సునీత దౌర్జన్యాలకు పాల్పడడంతో ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. రెండు రోజులుగా ఇదే తరహా బెదిరింపులకు దిగుతుండడంతో దీర్ఘకాలిక సెలవులే శరణ్యమంటున్నారు సిబ్బంది. చీరాల:రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఒంటెత్తు పోకడలతో జన్మభూమి గ్రామసభలు రణరంగాలుగా మారుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం సంగతేమో కాని..దూషణలు, కుమ్ములాటలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలం కదా... మమ్మల్ని ఎవరేంచేస్తారు...అనే అహంకార ధోరణితో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చీరాల గాంధీనగర్‌లో సోమవారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదంతో ఘర్షణ నెలకొనడంతో అధికారులు సభను రద్దు చేశారు. టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీత గ్రామంలో జరుగుతున్న జన్మభూమి గ్రామసభకు హాజరై నేరుగా వేదికపైకి వచ్చి కూర్చున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికపై ఉండాలనే నిబంధన ఉన్నా సునీత వేదికపై కూర్చోవడాన్ని గ్రామ సర్పంచ్ తాతా సుబ్బారావు, ఈవోఆర్డీ పీ శంకరరెడ్డి, ఉపసర్పంచ్ వెంకయ్య, ఇతర పాలకవర్గ సభ్యులు ఆక్షేపించారు. ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయలేని కారణంగా..ఈవోఆర్డీ వేదికపై నుంచి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల అధికారులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వేదికపై ఉన్న సునీత మాత్రం జన్మభూమిని నిర్వహించాలని పట్టుబట్టారు. దీనికి గ్రామసర్పంచ్ సుబ్బారావు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సునీత సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు. ఁనేను అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ని..నేను చెప్పిందే చేయాలి...సభ జరగాల్సిందే...ఒప్పుకోకపోతే వెళ్లిపో సభను నేను జరుపుతాననిరూ. సర్పంచ్‌ని అగౌరవంగా దూషించారు. ఒక దశలో అధికారులు, పోలీసులు చూస్తుండగానే సర్పంచ్‌పై దాడికి యత్నించారు. వయస్సులో పెద్దవాడినైనా తనను టీడీపీ నేత సునీత దూషించడం, హెచ్చరికలు జారీచేయడంతో తీవ్రమనోవే దనకు గురైన సర్పంచ్ జన్మభూమిని గ్రామంలో రద్దు చేస్తున్నానని, అధికారులు, ప్రజలు తనను క్షమించాలని కోరారు. సునీత మాత్రం బలవంతంగా మైకును తీసుకుని సభలో మాట్లాడారు. దీన్ని అడ్డుకోబోతున్న ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు, టీడీపీ నేత సునీత వర్గీయుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఒక దశలో పరిస్థితి చేయిదాటిపోయేలా ఇరువర్గాల నాయకులు బలప్రదర్శనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పి ఆందోళనకారులను పంపించి వేశారు. సభ లో కేవలం గ్రామస్తులు, అధికారులు మాత్రమే ఉండాలని సీఐ భీమానాయక్ మైకులో హెచ్చరించినా పోతుల సునీత వర్గీయులు, టీడీపీ విభాగాల నాయకులు మాత్రం సభాప్రాంగణాన్ని వదల్లేదు. దీంతో మళ్లీ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అయితే టీడీపీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున వచ్చి కయ్యానికి కాలుదువ్వారు. నాయకులు రావడంతో అధికారులు గాంధీనగర్‌లో జరగాల్సిన జన్మభూమిని రద్దు చేశారు. మండల స్థాయి అధికారులను, పోలీసులను సైతం పోతుల సునీత బహిరంగంగానే అగౌరవంగా మాట్లాడటంతో సభలో గందరగోళం నెలకొంది. సునీత వాఖ్యలకు నిరసనగా అధికారులంతా సభను వాకౌట్ చేశారు. ఒన్‌టౌన్ సీఐ భీమానాయక్, ఎస్సైలు శ్రీహరి, రామానాయక్, పోలీసు సిబ్బంది, ప్రత్యేక పోలీసులు 20 మంది వచ్చి ఆందోళనకారులను పంపించివేశారు. తహశీల్దార్ బి.సత్యనారాయణతో సునీత మాట్లాడుతూ సీఏం ఆదేశాలున్నాయని అందుకే సభలకు వస్తున్నానని, అడ్డుచెప్పేహక్కు మీకు లేదన్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ జన్మభూమి అధికారిక కార్యక్రమమని, మీకు వేదికపైకి వచ్చే హక్కులేదనితేల్చి చెప్పగా జన్మభూమి వేదికల్లో పాల్గొనేందుకు మంత్రి వద్ద నుంచి అనుమతి పత్రం తీసుకుని వచ్చి పాల్గొంటానని..అప్పుడు ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సునీత హెచ్చరించడం గమనార్హం. ‘జన్మభూమి’కి మేం రాం..రాం ! = మూకుమ్మడి సెలవు పెట్టే యోచనలో మండల అధికారులు = ఉన్నతాధికారులకు ఫిర్యాదు చీరాలటౌన్: చీరాల మండల స్థాయి అధికారులు జన్మభూమి కార్యక్రమానికి రాలేమంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు రాజకీయ నేతల ఘర్షణలు, వాగ్వాదాల కారణంగా ఁజన్మభూమిరూ.కి రావాలంటేనే జంకుతున్నారు. మండలంలో జన్మభూమి- మా ఊరు గ్రామసభలు ప్రారంభమైన తొలి రోజు నుంచీ నేతల తీరుతో రణరంగాలుగా మారడంతో అధికారులంతా మూకుమ్మడి సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగర్ కాలనీ, గాంధీనగర్ పంచాయతీల్లో జరగాల్సిన జన్మభూమి కార్యక్రమాలు నేతల ఘర్షణలతో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, తహశీల్దార్‌తో సహా ఇతర శాఖల అధికారులు సెలవు పెట్టే ఆలోచనలో ఉన్నారు. సోమవారం జరిగిన పరిణామాలతో విసుగు చెందిన అధికారులు కలెక్టర్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా మంత్రికి, ముఖ్యమంత్రి పేషీకి, జన్మభూమి ప్రత్యేకాధికారులకు సంఘటనలపై వివరంగా తెలియజేస్తూ లిఖితపూర్వకంగా అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు. జన్మభూమి కార్యక్రమాలకు అడ్డు తగలకుండా గట్టి బందోబస్తు అందించి, సజావుగా జరిపేందుకు చర్యలు చేపడితేనే తాము వస్తామని లేకుంటే సామూహిక సెలవులు తీసుకుంటామని మండల అధికారులు తెలిపారు. మనస్తాపానికి గురై సభను రద్దుచేశా గ్రామ ప్రథమ పౌరుడినైన నన్ను ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ సునీత అగౌరవపరిచారు. వేదికపైకి వచ్చినందుకు అడ్డుచెప్పిన నన్ను దూషించినందుకు నిరసనగా జన్మభూమి సభను రద్దుచేశా. గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు మాత్రమే సభకు హాజరై పోలీసులు సహకారం ఉంటేనే సభను నిర్వహిస్తా. - తాతా సుబ్బారావు, గాంధీనగర్ సర్పంచ్ -
బాహాబాహీ
చీరాల: జన్మభూమి కార్యక్రమం చీరాలలో అపహాస్యమైంది. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన వేదిక కాస్తా..వీధి తగాదాకు నెలవైంది. తమ గోడు చెప్పుకుందామని వచ్చిన ప్రజలు రాజకీయ నేతల మధ్య జరిగిన ఘర్షణ చూసి..వీరా తమ తలరాత మార్చే నేతలంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రొటోకాల్ రేపిన వివాదంతో ఎమ్మెల్యే ఆమంచి, టీడీపీ ఇన్చార్జ్ పోతుల సునీతల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నేతలు, వారి అనుచరులు అధికారుల ముందే పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కాలనీలో ఏర్పాటు చేశారు. సభలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో జీ సాంబశివరావు ప్రారంభించి వేదికపైకి సర్పంచ్ దుడ్డు రూపవతి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తహశీల్దార్ బీ సత్యనారాయణలను పిలిచారు. తర్వాత సర్పంచ్ రూపావతిని అధ్యక్షత వహించాలని ఎంపీడీవో కోరారు. అప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీత వేదిక వద్ద ఉన్నారు. ఆమంచి వర్గీయులు ‘ఆమంచి జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీడీపీ సర్పంచ్ రూపావతి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీతను వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఎటువంటి ప్రొటోకాల్ లేకున్నా..సునీతను వేదికపైకి ఆహ్వానించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాల్సిన ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ని వేదికపైకి పిలవడంపై తొలుత మాటల యుద్ధం నడవగా..చివరకు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలను పిలవడం ఏమిటని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అయితే సర్పంచ్ మాత్రం ‘నేనే గ్రామానికి పెద్ద. మా నేత వేదికపైకి వస్తే మీకేంటి’ అని అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీనికి ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ ఇది రాజకీయ కార్యక్రమం కాదని..ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆమంచి, పోతుల వర్గీయులు కుర్చీలు, కర్రలతో దాడులకు దిగారు. ఆమంచి వర్గీయులు కొందరు సర్పంచ్‌పై దాడి చేశారు. సునీత వర్గీయులు కూడా ఆమంచి వర్గీయులపై దాడులు చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుని, తోసుకున్నారు. ఆమంచి, సునీత మధ్య దూషణల పర్వం కొనసాగింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆగ్రహానికి గురైన సునీత విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆమంచి వర్గీయురాలు అనుకొని చేయిచేసుకోవడంతో పాటుగా దుర్భాషలాడారు. టూటౌన్ సీఐ అబ్దుల్సుబాన్, ఎస్సై రాములు నాయక్, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ మహిళా కానిస్టేబుల్‌పై సునీత దాడిచేస్తున్నా నిలువరించలేకపోయారు. చివరకు సునీతను పోలీసులు పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. జన్మభూమి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్యెల్యే పట్టుబట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఈనెల 10 తేదీకి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒన్‌టౌన్ సీఐ బీమానాయక్ సునీత, ఆమంచిలతో చర్చించి గ్రామ సభ నుంచి వెళ్లాలని సూచించగా ఇరువర్గాలు ఒకరి తరువాత ఒకరు సభాప్రాంగణం నుంచి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఘర్షణలో గ్రామసర్పంచ్ డి.రూపవతిపై ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు దాడిచేయడంతో గాయాలయ్యాయి. దీంతో సర్పంచ్‌ని వైద్యసేవల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె పోలీసులకు ఫిర్యాదు చే శారు. పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న ఘర్షణలో ఎమ్యెల్యే ఆమంచి సోదరుడు స్వాములు కూడా ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా ఏఎస్పీ వి.రామానాయక్ గ్రామాన్ని సందర్శించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సర్పంచ్ డి.రూపవతిని పరామర్శించి సంఘటన వివరాలు సేకరించారు. చంద్రబాబు ఆదేశాలతోనే జన్మభూమిలో పాల్గొంటున్నాం: పోతుల సునీత జన్మభూమి- మాఊరు కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జులు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకే జన్మభూమిలో పాల్గొన్నాం. కానీ ఎమ్యెల్యే ఆమంచి చేతకాని వ్యక్తిగా ప్రవర్తించారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకుని మా పార్టీ వారిపై దాడి చేయించారు. అధికారులను బెదిరించారు. ఇటువ ంటి వ్యక్తులకు భయపడేది లేదు. పోలీసులు సర్పంచ్‌పై దాడిచేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇది పార్టీ కార్యక్రమమా? - ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ జన్మభూమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం. టీడీపీ సమావేశంలాగా సునీత వేదికపైకి రావడం సరికాదు. అధికారుల అలసత్వం, అవగాహనా లోపం వలనే ఇలా జరిగింది. శనివారం దేవినూతల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ సునీతను వేదికపైకి ఆహ్వానించకుండా ఉండాల్సింది. ఇకపై ఆమె మరో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాల వేదికపైకి రాకుండా ఉండాలి. సర్పంచ్ రూపావతి జన్మభూమి కార్యక్రమాన్ని ఆటంకపరిచారు. జన్మభూమిలో పంచాయతీ అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నాం. మరలా ఇదే గ్రామంలో జన్మభూమిలో పాల్గొని అభివృద్ధికి చర్యలు చేపడతాను. -
మినీ హార్బర్‌కు ‘లంగర్’
చీరాల వాడరేవులో మినీహార్బర్ నిర్మిస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. హార్బర్ నిర్మాణ హామీ ఆచరణలోకి రావడం లేదు. చీరాల: స్థానిక వాడరేవులో మినీ హార్బర్ (జెట్టీ) నిర్మిస్తామంటూ పాలకులు ఎన్నో ఏళ్లుగా కోతలు కోస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిపాదిత నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని డబ్బాలు కొడుతూనే ఉన్నారు. కానీ వారి మాటలు హామీల వృక్షంపై పదిలంగా ఉన్నాయి. మత్స్యకారులు మాత్రం హార్బర్ వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. మత్స్య సంపద ఫుల్.. చీరాల ప్రాంతంలో నెలకు రూ.40 లక్షలకుపైగా మత్య్ససంపద లభిస్తుంది. విలువైన చేపలను స్థానిక మార్కెట్‌తో పాటు విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ వేట సాదాసీదాగా ఉండదు. చేపలు పుష్కలంగా పడేందుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల విలువ చేసే వలలను వినియోగిస్తుంటారు. నియోజకవర్గంలో 4 వేల కుటుంబాల్లోని వారు వేట, అమ్మకాలు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. కానీ వారికి ఎంతో అవసరమైన జెట్టీ లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు బోట్లు పదిలపరచుకోనే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. దీని నిర్మాణంపై నాటి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, చీరాల ప్రజాప్రతినిధులు ఆశ చూపించి పక్కకు తప్పుకున్నారు. కేంద్ర బృందం పర్యటనకే పరిమితం.. మినీ హార్బర్ కోసం రూ. 300 కోట్ల బడ్జెట్ అంచనా రూపొందింది. అలాగే అనువైన ప్రదేశం, స్థల సేకరణ, సముద్రం లోతు తదితర వసతుల పరిశీలన కోసం 2013 నవంబర్‌లో కేంద్ర బృందం పర్యటించి వెళ్లింది. కానీ ఇప్పటికీ హార్బర్ నిర్మాణంపై ఎలాంటి పనులూ ముందుకు క దల్లేదు. స్థల సేకరణ పూర్తై పనుల జాప్యంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంగరు వేయడం ప్రహసనం.. కష్టపడి రాత్రంతా వేటాడిన జాలర్లు తిరిగి తమ బోట్లను ఒడ్డుకు చేర్చి లంగరు వేయాలంటే ముప్పతిప్పలు పడుతున్నారు. వాడరేవు, చిన్నబరప, విజయలక్ష్మీపురం, బాపట్ల మండలంలోని దానవాయిపేట, పాండురంగాపురం గ్రామాలకు చెందిన మత్య్సకారులు ప్రస్తుతం ఈపూరుపాలెం స్ట్రయిట్కట్పై ఉన్న బ్రిడ్జి సమీపంలో బోట్లను కట్టేస్తున్నారు. మండల పరిధిలోని ఇతర జాలర్లు కొన్నేళ్లుగా బాపట్ల మండలంలోని దానవాయిపేట సమీపంలో లంగరు వేస్తున్నారు. తుపాన్లు వస్తే అంతే.. బంగాళాఖాతంలో తుపాన్లు సంభవించినా.. తీవ్ర వాయుగుండాలు ఏర్పడినా సముద్రం అల్లకల్లోలమవుతుంది. అలలు ఎగిసి పడుతుంటాయి. ఇలాంటి సమయంలో బోట్లను ఒడ్డుకు తేవడం చాలా కష్టం. జెట్టీ లేకుండా లంగరు వేస్తే బోట్లు ధ్వంసం అవుతాయి. సాధారణంగా సముద్రంలోనే లంగరు వేసే మత్స్యకారులు.. ఇలాంటి ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రం దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. చేపలను దించడం కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. చేసేది లేక.. బోట్లను సముద్రంలోనే వదిలేయలేక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీరానికి దూరంగా ఎక్కడో భద్రపరచుకోవాల్సి వస్తోంది. వలలదీ ఇదే పరిస్థితి. కానీ దీనివల్ల వారి సామగ్రికి భద్రత కరువవుతోంది. హామీలతోనే సరిపెట్టారు... పి.విశ్వనాథం... మినీ హార్బర్ మత్స్యకారుల భవిష్యత్. కానీ దీనిపై ప్రభుత్వం స్పందించడంలేదు. వేలాదిమందికి ఉపయోగపడే పని చేయడానికి పాలకులకున్న అడ్డంకి ఏమిటో తెలియడంలేదు. వరదలు వచ్చినప్పుడు ఉన్నదంతా కోల్పోవాల్సి వస్తోంది. -
చేనేతల కళ ‘కల’
చీరాల: తరాల తరబడి వారిది ఆకలి పోరాటం. చేతి వృత్తి నే నమ్ముకొని ఎంతో కళాత్మకంగా నేసే దుస్తులు వారికి పూట కూడా కడుపు నింపడం లేదు. అందరికీ అందమైన వస్త్రాలను తయారు చేసే వారు.. రోజంతా పని చేసినా పూట గడవని దుర్భిక్షం. నమ్మిన వారే కష్టానికి కూలి కట్టకపోవడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా కలిసి ఒక రోజంతా పనిచేస్తే కనీసం రూ.100 కూడా సంపాదించలేని పరిస్థితి. తాను అధికారంలోకి వస్తే చేనేతలకు పూర్వవైభవం తీసుకువచ్చి ఆదుకుంటానని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వా త చేనేతల సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడంలేదు. ఇబ్బందులు పెడుతున్న ఆప్కో... జిల్లాలో 33,184 మగ్గాలుండగా 25వేల చేనేత కార్మిక కుటుంబాల్లోని 70వేల మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 సహకార సంఘాల్లో 17,862 మంది చేనేతలు పని చేస్తున్నారు. వీరు తయారు చేసే వస్త్రాలను చేనేత సహకార సంఘాల ద్వారా ఆప్కో కొనుగోలు చేయాలి. కానీ దీనిని సమర్థవంతంగా నడిపించేవారు కనుమరుగయ్యారు. దీంతో గత ఆరు నెలల నుంచి 20 శాతం మాత్రమే కొనుగోలు చే శారు. ఇప్పటికే ఉత్పత్తి అయిన వస్త్రాలు సహకార సంఘాల వద్ద పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. ఈ దెబ్బకు సహకార సంఘాలు ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడంతో ఉపాధి లేక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు గతంలో ఆప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు ప్రభుత్వం ఇప్పటికీ డబ్బు చెల్లించలేదు. పాత బకాయిలు కూడా రాకపోవడంతో చేనేతలు అప్పుల పాలవుతున్నారు. నీరుగారిన చంద్రబాబు వాగ్దానాలు టీడీపీ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. దీంతో ఘనకార్యం సాధించినట్లు జబ్బలు చరుచుకుంటున్న పాలకులు చేనేతలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా మరిచారు. నాడు చేనేతల కోసం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. కానీ చేనేత, జౌళిరంగానికి కలిపి రూ. 99.87కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది చేనేత రంగానికి చెల్లించాల్సిన బకాయిల్లో సగానికి కూడా సరిపోవు. చేనేత వస్త్రాలపై 30 శాతం రిబేట్ ఇస్తామని ఆ నాడు ప్రగల్భాలు పలికినా.. బడ్జెట్లో ఆ ఊసేలేదు. సగం ధరకే జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పుకున్నారు. వృద్ధ చేనేత కార్మికులకు ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం తదితర పట్టణాల్లో వృద్ధాశ్రమాలు, ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్న బాబు.. ఇప్పుడేమో ప్లేటు తిరగేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 76940 మందికి చేనేత పెన్షన్లు ఇస్తున్నారు. దీనితో పాటు వంద రోజుల ప్రణాళికలో 3276 మందికి అదనంగా పెన్షన్ ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. రూ. 1.50 లక్షలతో 13 జిల్లాల్లో 901 మందికి వర్క్షెడ్లతో కూడిన ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎంగారికి ఆ మాట గుర్తుందో లేదో మరి. ప్రమాణ స్వీకారం చేసే రోజు చేనేత రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల మొత్తం రూ. 119కోట్లు రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 176కోట్లు చేనేత రుణాలున్నాయి. కానీ వీటితో పాటు సహకార సంఘాలు సీసీ కింద తీసుకున్న రూ. 26కోట్ల లెక్క చూపించలేదు. మొత్తం మీద రూ. 202కోట్లు రద్దు కావాల్సి ఉండగా కేవలం రూ. 119 కోట్లు మాత్రమే అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో! రైతు, డ్వాక్రా రుణాలు రద్దు కోసం జీఓ నెం. 174ను విడుదల చేశారు. అయితే అందులో చేనేత ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ముందుగా ప్రకటించినట్లు చేనేతలకు రూ. 1000 కోట్లు కేటాయించాలని.. చేనేత పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. వస్త్ర ఉత్పత్తిని సమీక్షించేందుకు ఓ మిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిని చేనేతలు వ్యతిరేకిస్తున్నారు. పారిశ్రామిక వేత్తల చేతుల్లో తమ బతుకులు పెట్టేందుకే ఈ ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆరోపిస్తోంది. -
ఆటోడ్రైవర్ దారుణ హత్య
గుంటూరు: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని స్థానిక మరియమ్మ పేటలో ఆటోడ్రైవర్ బాబురావును ఆగంతకులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అతడి కాళ్లు చేతులు కట్టేసి నరికి చంపారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి విచ్చేసి.... ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ బాబురావు భార్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
మున్సిపల్ కార్యాలయంలో ఈవీఎంలు
చీరాల రూర ల్: చీరాల మున్సిపల్ కార్యాలయంలోని స్టేషనరీ గదిలో ఆరు ఈవీఎంలు భద్రపరిచి ఉన్నాయి. అన్ని రకాల ఎన్నికలు పూర్తైఫలితాలు కూడా వెలువడితే చీరాల మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ ఈవీఎంలు ఎందుకు భద్రపరిచారో ప్రజలకు అర్థం కావడంలేదు. నిబంధనల ప్రకారం ఎన్నికల అనంతరం రిజర్వుడుగా ఉన్న ఈవీఎంలను, శిక్షణ కోసం తీసుకున్న ఈవీఎంలన్నింటినీ జిల్లా కేంద్రంలో అప్పగించాల్సి ఉంది. అలాంటివే అయితే వాటిని ఎప్పుడో ఒంగోలుకు చేర్చాల్సి ఉంది. చీరాలలో ఈవీఎంల రగడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున గొడవలు జరిగినా ఇంకా మున్సిపల్ కార్యాలయంలో ఈవీఎంలను ఎందుకు భద్రపరిచారో అధికారులే సెలవియ్యాలి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను సాక్షి వివరణ కోరగా ఆరు, ఏడు ఈవీఎంలు కార్యాలయంలో ఉన్నాయని, వాటిని సిబ్బంది శిక్షణ కోసం ఉపయోగించామని, ఒంగోలులో అప్పగించాల్సి ఉందని తెలిపారు. -
రొయ్యల సేద్యం రాజేసి
చీరాల : తీర ప్రాంతం డాలర్ సేద్యానికి కేంద్రంగా మారింది. ప్రభుత్వ భూములు ఆక్రమించి ఏటా వందల కోట్ల రూపాయల రొయ్యల వ్యాపారం సాగుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. కొంచెం కండబలం ... రాజకీయ దర్పం ఉంటే చాలు సర్కారు భూమి తమదేనన్నట్టుగా పాగా వేస్తున్నారు. ఈ ఆక్రమణదారుల్లో అధికంగా ప్రజాప్రతినిధులు, వీరి వెనుక చోటామోటా రాజకీయ నేతలతోపాటు బడాబాబులూ ఉన్నారు. చీరాల మండలంలోని కుందేరు భూములు నాయినిపల్లి నుంచి మోటుపల్లి వరకు కనీసం 400 ఎకరాలు ఆక్రమణలో ఉంది. ఎకరం కనీసం ఈ ప్రాంతాల్లో రూ.10-రూ.30 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ భూములను చేజిక్కించుకొని రొయ్యల చెరువులు తవ్వి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా వేటపాలెం నుంచి ఈ ఆక్రమణల పర్వం మొదలై చినగంజాం వరకు పాకింది. రొంపేరు భూములూ హాంఫట్... రొంపేరు కాలువ ఇరువైపులా ఉండే 300 ఎకరాలకుపైగా సర్కారు భూముల్లో రొయ్యల దందా సాగుతోంది. వేటపాలెం నుంచి చినగంజాం వరకు వందలాది ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. ముఖ్యంగా ‘వెనామీ’ సాగు లాభసాటిగా మారుతుండడంతో అటువైపు ఆక్రమణదారులు అడుగులు వేస్తున్నారు. దీంతో చెరువుల లీజులు భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది రూ.లక్ష వరకు ఎకరాకు లీజు ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.1.70 లక్షల వరకూ పెరిగింది. ఒక్కొక్కరు 3 నుంచి 4 ఎకరాల వరకు సర్కారు భూమిని ఆధీనంలో పెట్టుకుని ఎటువంటి పెట్టుబడి లేకుండా ఏడాదికి లక్షలాది రూపాయలను లీజు పేరుతో వెనుకేసుకుంటున్నారు. ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం: డ్రైనేజీ డీఈ సబ్బారావు కుందేరు, రొంపేరుకు రెండు ైవైపులా ఆక్రమణలున్న విషయం నిజమే. చాలామంది రొయ్యలు చెరువులు సాగు చేశారు. కుందేరులో ఆక్రమణదారులకు గతంలో రెండుసార్లు, రొంపేరు ఆక్రమణ దారులకు నాలుగుసార్లు నోటీసులు జారీచేశాం. త్వరలో రొంపేరులో ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున ఈ ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. ఈ ఆక్రమణల వ్యవహారంపై త్వరలో ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. -
మారని చేనే‘తల’రాత
చీరాల : ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్న చేనేతలను కొత్తగా కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వమైనా ఆదుకుంటుందన్న ఆశలు అడియాశలయ్యాయి. అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వారి అభ్యన్నతి కోసం నాలుగు మెతుకులు విదిల్చేందుకే ప్రభుత్వం పరిమితమైంది. జిల్లాలో కునికిపాట్లు పడుతున్న చేనేత రంగం ఈ చర్యతో మూగబోయింనట్లయింది. అధికారంలోకి రాకముందు కోతలు కోసిన టీడీపీ అధికారం హస్తగతం చేసుకున్నాక సవతిప్రేమ చూపించింది. కేవలం రూ. 98.97 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. జిల్లాలో 25వేల వరకు చేనేత కుటుంబాలున్నాయి. 50 వేల మందికి పైగా మగ్గాలపై ఆధారపడి ఉన్నారు. 20వేల మంది సహకార రంగంలో ఉండగా, మిగిలిన వారంతా సహకారేతర రంగంలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 చేనేత సహకార సంఘాలున్నాయి. కానీ దశాబ్ద కాలంగా ఈ పరిశ్రమ తిరోగమనంలో ఉంది. యంత్రాల రాకతో పాటు విదేశీ ఉత్పత్తుల దెబ్బకు కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతోమంది ఈ వృత్తిని వదిలి ఆదాయం కోసం ఇతర రంగాలను ఆశ్రయిస్తున్నారు. చాలీచాలని మజూరీ తీసుకోలేక మగ్గం పట్టుకొనేందుకే భయపడుతున్నారు. వందల కుటుంబాలు పొట్ట పట్టుకుని వలసలు వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ ఉత్పత్తులను అగ్రపథంలో నిలిపి..సంస్కృతికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన ప్రభుత్వం చేనేతలను గాలికివదిలేసినట్లయింది. చేతి వృత్తులకు చేయూతనిందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్లో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిశ్రమలకు రూ. 600 కోట్లు కేటాయిం చగా.. అందులోనే చేనేతలకు రూ. 99.87 కోట్లు కేటాయించడంపై చేనేత శ్రామిక సంఘాలు మండిపడుతున్నాయి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. డిమాండ్లు ఇవే.. చేనేతలకు ప్రత్యేక పరపతి సౌకర్యం కల్పించేందుకు పరపతి బ్యాంకు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ చేనేత వస్త్రాలను ప్రభుత్వమే నేయించాలి. వాటిని కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయాలి. దీనివల్ల చేనేతలు మూడు పూట్లా కడుపు నింపుకోగలరు. అంతే కాకుండా 20 శాతం సబ్సిడీపై నూలు అందజేయాలి. కానీ తాజాగా కేటాయించిన బడ్జెట్ చేనేతల రుణ మాఫీకే సరిపోయేలా ఉంది. అలాంటప్పుడు ఇతర సంక్షేమ పథకాలు, చేనేత వర్క్ కం షెడ్డులు, చేనేత గృహాలు, ఐహెచ్‌డీపీ (ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ డెవెలప్మెంట్ ప్రోగ్రాం), చేనేత క్రెడిట్ కార్డులకు ప్రత్యేక కేటాయింపులు మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. -
డయ్యింగ్..డేంజర్
చీరాల : వస్త్ర వ్యాపారానికి, చేనేత వస్త్రాల తయారీకి పేరెన్నికగన్న చీరాలలో డయ్యింగ్ పరిశ్రమలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడవే చీరాల ప్రాంతానికి ప్రమాదకరంగా పరిణమించాయి. డయ్యింగ్ యూనిట్ల నుంచి వచ్చే ప్రమాదకర రసాయనాలతో కూడిన జలాల వల్ల పరిసరాలు కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్నాయని..తమిళనాడులో వాటిని నిషేధించారు. దీంతో అక్కడి డయ్యింగ్ యూనిట్ల యజమానుల కన్ను చీరాల ప్రాంతంపై పడింది. ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ యూనిట్లు నెలకొల్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా...కనీస నిబంధనలు పాటించకుండా యూనిట్లు ఏర్పాటు చేశారు. ఏదో చేనేతకు సంబంధించిన నూలే కాదు..ఏకంగా ఫ్యాబ్రిక్స్ (బనియన్లు, టీషర్టులు, ఇతర రెడీమేడ్ వస్త్రాలు) డైలు వేసి కెమికల్ వ్యర్థాలను చీరాల భూముల్లో వదిలేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ అక్రమ డయ్యింగ్ యూనిట్ల వ్యవహారం జరుగుతున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వీరిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తమిళనాడు నుంచి వచ్చిన వారితోపాటు స్థానికులు కొందరు భారీ యూనిట్లు నెలకొల్పారు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు మొత్తం 60 డయ్యింగ్ యూనిట్లు ఉండగా..వాటిలో 20కిపైగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన యూనిట్లు ఉండటం విశే షం. తమిళనాడులోని తిరువూరు, సేలం, ఇరోడ్డు, కంచి, నగరి, కుంభకోణం వంటి ప్రాంతాలలో డయ్యింగ్ యూనిట్లను నిషేధించారు. కలుషిత నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు ఉంటేనే డయ్యింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన విధించింది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలంటే కోట్లతో కూడుకున్న పని. దీంతో చీరాలలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టినప్పటికీ అధికారులు, స్థానికుల వలన ఇబ్బందులు ఉండవని ఆలోచించారేమో కానీ ఏకంగా 20 మంది వ్యాపారులు చీరాలకు వచ్చి భారీ డయ్యింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి అక్కడ అమ్మే వస్త్రాలకు చీరాలలో డైలు వేసి మరలా వాటిని అక్కడికే తరలిస్తున్నారు. అంటే కేవలం వస్త్రాలకు రంగులు వేసేందుకు మాత్రమే చీరాలలో యూనిట్లను స్థాపించారు. చీరాల విషపూరితమవుతుందిలా.. చీరాల ప్రాంతంలో ఉన్న 42 డయ్యింగ్ యూనిట్ల నుంచి రోజుకు 50 లక్షల లీటర్లకు పైగానే వివిధ రసాయనాలు, ఇతర వ్యర్థ పదార్థాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. సుమారు ఒక్కొక్క డయ్యింగ్ యూనిట్లో మూడు నుంచి నాలుగు వేల కేజీల వస్త్రాలకు డయ్యింగ్ వేస్తారు. ఒక్కో కేజీ వస్త్రానికి డయ్యింగ్ వేయాలంటే రెండు వందల లీటర్లు కెమికల్స్‌తో కూడిన నీటిని వినియోగిస్తారు. తర్వాత ఆ నీటిని నేరుగా కుందేరు లేదా ఆ పక్కనే వదిలేస్తున్నారు. సంభవించే ప్రమాదాలివే... ఈ విషపూరితమైన నీరు నేరుగా విడుదల చేయడంతో అవి భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. అలానే కుందేరులో విడుదల కావడంతో ఆ పరిసర ప్రాంతాలతో పాటు సముద్రంలో కలవడం వలన కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లోకి కలుషిత నీరు చేరుతోంది. ఈ నీటిని ప్రజలు తాగడం వలన కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. నీటిలో ఉప్పు శాతం పెరిగిపోతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు జీర్ణవ్యవస్థ దెబ్బతిని జీర్ణకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అలానే బావులు, బోర్లలోని నీరు మందంగా మారుతాయి. వాటిని తాగడం వలన కూడా అనేక అనర్థాలు ఏర్పడతాయి. నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. దీనివల్ల చేపలు, రొయ్యలతో పాటు సముద్ర జీవులు చనిపోతాయి. పంట పొలాలు సైతం దెబ్బతింటాయి. నిబంధనలకు నీళ్లు.. డయ్యింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుగా సీఎస్టీ అనుమతిని కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ పెట్టే స్థలం అందుకు అనుకూలమైందా, స్థానికులకు ఇబ్బందులకు ఏర్పడతాయా అనేది పరిశీలించాలి. ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన అనుమతి తీసుకోవాలి. తప్పకుండా యూనిట్ల నుంచి విడుదలయ్యే కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్మెంట్ ప్లాంట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ చీరాలలో ఉన్న 42 డయ్యింగ్ యూనిట్లకు ఇటువంటి అనుమతులేమీ లేవు. మాట తప్పిన డయింగ్ యజమానులు.. డయ్యింగ్ యూనిట్ల యజమానులందరూ కలిసి మొత్తం మీద ఒక ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ప్రత్యేకంగా ఒక పైపులైన్‌ను వేసి డయ్యింగ్ యూనిట్ల నుంచి వచ్చే కలుషిత నీటిని ఈ పైపులైన్ ద్వారా ట్రీట్మెంట్ ప్లాంట్‌కు అనుసంధానించాలని సూచించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలంటే 4 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పిస్తుందని, మిగిలిన మొత్తం డయ్యింగ్ యూనిట్ల యజమానులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు అంగీకరించిన డయ్యింగ్ యూనిట్ల యజమానులు ఇంత వరకు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోకుండా కలుషిత నీటిని సమీప ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. వత్తాసు పలుకుతున్న పొల్యూషన్ బోర్డు అధికారులు... చీరాలలో ఉన్న డయ్యింగ్ యూనిట్ల నుంచి వస్తున్న విషపూరిత నీటి వలన జరిగే ప్రమాదాలపై అనేక మంది మానవహక్కుల సంఘం, పొల్యూషన్ కంట్రోల్బోర్డును ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి లేని డయ్యింగ్ యూనిట్లను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క డయ్యింగ్ కేంద్రం కూడా మూసివేసిన దాఖలాలు లేవు. నూతనంగా తమిళనాడు నుంచి వచ్చేవి మాత్రం వస్తూనే ఉన్నాయి. వీటిని నియంత్రించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
వర్షాలు లేక రొయ్యలకు సోకుతున్న రోగాలు
చీరాల : మూడు నెలలకే లక్షల రూపాయాల ఆదాయం తెచ్చే రొయ్యల సాగు.. ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. వరుస నష్టాలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు రైతులకు సిరులు కురిపించిన రొయ్యల సాగు.. ప్రస్తుతం నష్టాలు తెచ్చి పెడుతోంది. అదునులో కూడా వర్షాలు కురవకపోవ డంతో వైట్‌స్పాట్ సోకి రొయ్యలు చనిపోతున్నాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదు. ఏడాదికి రెండు సార్లు సాగు చేయాల్సి ఉండగా రైతులు వరస పెట్టి చెరువులు సాగు చేయడం తెగుళ్లకు మరో కారణం. రొయ్య పిల్లల్లో నాణ్యత లేకపోవడం.. సాగు ఖర్చులు పెరిగిపోవడం.. వైరస్‌లతో దిగుబడులు పడిపోవడంతో గతంలో మీసాల తిప్పిన రైతులు ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, టంగుటూరు, శింగారాయకొండ, ఉలవపాడు మండలాల్లో 3000 హెక్టార్లలో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. తెగుళ్లు ఆశిస్తున్న సమయాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే చెరువుల్లో చేరే నీటిని రైతులు బయటకు విడుదల చేస్తుంటారు. దీంతో వైరస్ ప్రభావం తగ్గుతుంది. {పస్తుతం వర్షాలు కురవక పోవడంతో రొయ్యలకు వైరస్ సోకి అవి చనిపోతున్నాయి. సీడ్ (రొయ్యపిల్లలు) ఎంపికలో నాణ్యత లేకపోడం తెగుళ్లకు మరో కారణం. ఇతర దేశాల నుంచి మన డిమాండ్‌కు తగ్గిన విధంగా బ్రూడర్ (తల్లి రొయ్య) అందకపోవడంతో రొయ్య పిల్లల కోసం రైతులు స్థానికంగా ఉండే హేచరీలను అశ్రయించాల్సి వస్తోంది. సీడ్ మంచిదో కాదో ల్యాబ్‌లో నిర్ధారించకుండానే చెరువుల్లో పెంచున్నారు. ఫలితంగా అవి నెల.. లేకుంటే రెండు నెలల్లో చనిపోతున్నాయి. సాధారణంగా చెరువుల్లో 100 పిల్లలు వేస్తే 70 పిల్లల వరకు బతుకుతాయి. ప్రస్తుతం వంద పిల్లలకుగాను 20 నుంచి 30 రొయ్య పిల్లలే బతుకుతున్నాయి. తడిసి మోపెడైన ఖర్చులు వనామి సాగు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. సీడ్, ఫీడ్, మందులు, డీజల్, లీజు ఖర్చులు అంతకంతకూ పెరిగాయి. వనామి సాగులో వరస లాభాలు రావడంతో రొయ్యల సాగుకు డిమాండ్ పెరిగి లీజు ధరలు రెట్టింప్పయ్యాయి. గతంలో ఎకరా చెరువు ఎడాదికి లక్ష రూపాయల లీజు ఉండగా ప్రస్తుతం రూ.1.80 లక్షలకు పెరిగింది. మందుల ధరలు ఈ ఎడాది 25శాతం పెరిగాయి. గత ఎడాది ఫీడ్ ధర టన్ను రూ.63 వేలుండగా ప్రస్తుతం రూ.70 వేల వరకు పెరిగింది. గత ఎడాది ఎకరా చెరువుకు రూ.7 నుంచి రూ.9 లక్షలు ఖర్చు కాగా ప్రస్తుతం రూ.13 నుంచి రూ.15 లక్షలకు పెరిగింది. దిగజారిన ధరలు రొయ్యల ధరలు రోజురోజూకూ పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో రొయ్యలు ధరలు జనవరి నెలకంటే ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. జనవరిలో.. కౌంట్ రేటు ప్రస్తుతం 30 రూ.680 రూ.540 40 రూ.580 రూ.440 50 రూ.510 రూ.350 60 రూ.400 రూ.310 సీడ్లో కొరవడిన నాణ్యత : డాక్టర్ రఘునాథ్,మత్స్యశాఖ ఏడీ సీడ్లో నాణ్యత లేకపోవడం రొయ్యల సాగులో నష్టాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా సర్వేయల్స్(బతికిన పిల్లల సంఖ్య) పడిపోతున్నాయి. 100 కిలోలకు 30 కిలోలే బతుకుతున్నాయి. రొయ్యలు సాగు చేసే రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని మన కేంద్ర ప్రభుత్వం వాటికి పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో మంచివాటిని ఎంపిక చేసుకుని చెన్నైలో ఉన్న హేచరీస్‌కు పంపి సీడ్‌ను తయారు చేస్తారు. అక్కడ పరీక్షల అనంతరం మేలైన రొయ్య పిల్లలను రైతులకు విక్రయిస్తారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్నా రొయ్య పిల్లలు దిగుమతి కావడం లేదు. రైతులు స్థానికంగా హేచరీల వద్ద నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. వాటిలో నాణ్యత లేకుండా ఉండటం వల్లే రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. -
ఇదిగో.. దండుపాళ్యం! మళ్లీ మొదలైన లైంగికదాడులు, దోపిడీలు
- చీరాల దండుబాటలో మళ్లీ మొదలైన లైంగికదాడులు, దోపిడీలు - పది రోజుల క్రితం 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి - లారీలు, ఇతర వాహనాలను ఆపి మరీ దోపిడీ - నేర ప్రవృత్తికి మళ్లీ తెరలేపిన పాత నిందితులు చీరాల : వరుస హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, నాటుసారా విక్రయాలకు చీరాల దండుబాట గతంలో అడ్డాగా ఉండేది. రాత్రివేళ అటువైపు వెళ్లిన ఎందరో మహిళలు, యువతులు లైంగిక దాడులకు గురయ్యారు. వాహనాలు ఆపి మరీ దోపిడీలకు పాల్పడేవారు. అప్పట్లో నెల వ్యవధిలో నాలుగు హత్యలు జరిగేవి. నాటుసారాకు అడ్డాగా ఉండే దండుబాటపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో కొది ్దనెలలుగా రౌడీమూకలు తమ అఘాయిత్యాలు నిలిపారు. పోలీసులు కూడా అటువైపు దృష్టి సారించడం మానేశారు. రౌడీమూకలు మళ్లీ దండుబాటను దండుపాళ్యంగా మార్చారు. పదిరోజుల క్రితం 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన గ్యాంగ్‌లో కొందరు 10రోజులు క్రితం నుంచి మళ్లీ చెలరేగుతున్నట్లు సమాచారం. దండుబాటలోని పోలేరమ్మ గుడి సమీపంలో కొందరు యానాదులు చేపలవేట సాగిస్తూ జీవిస్తుంటారు. పదిరోజులు క్రితం నలుగురు యువకులు మద్యం తాగి ఓ గుడిసెలోకి చొరబడి 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి ప్రయత్నించారు. సదరు యువతి తల్లి వారిపై కారంచల్లి ప్రతిఘటించింది. అయినా కామాంధులు ఆమెపై దాడి చేసి యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు సంఘటన చూసిన కాలనీవాసి ఒకరు మీడియాకు సమాచారం అందించారు. భయపడిన యానాది కాలనీ వాసులు విషయాన్ని పోలీసుల వరకూ తీసుకెళ్లలేదు. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు చెందిన పెద్దలు జోక్యం చేసుకుని కాలనీవాసులతో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. ఏదైనా యథేచ్ఛగానే.. రాత్రి వేళల్లో దండుబాట మీదగా రాకపోకలు చేస్తున్న వాహనదారులను అటకాయించి వారిపై దాడి చేసి నగదు, సెల్ఫోన్లు దోచుకుంటున్నారు. రాత్రివేళ దండుబాటపై రాకపోకలు సాగించాలంటే భయపడాల్సిన పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయి. గతంలో ఇదే ముఠాలోని కొందరు అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి మోటారుసైకిల్‌పై ఇంకొల్లు వెళ్తుండగా దారిలో అటకాయించి ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చాటుమాటుగా ఉంటుందని కొన్ని ప్రేమజంటలు అటువైపు వెళ్తుంటాయి. అటుగా వెళ్లే జంటలపై దాడి చేసి మహిళలను దూరంగా తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గతంలో వీటితో పాటు నలుగురు వరుస హత్యలకు గురయ్యారు. నాటుసారా కేంద్రాలపై కూడా దాడులు జరగడంతో దండుబాటలో ఏడాది పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేయడంతో అఘాయిత్యాలు తగ్గాయి. మళ్లీ కొద్దినెలలుగా అదే గ్యాంగ్‌లోని కొందరు యువకులు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ముఠాలకు ముక్కుతాడు వేయకుంటే దండుబాట దండుపాళ్యంగా మారే పరిస్థితులు ఉన్నాయి. -
ప్రమాద ఘంటికలు
చీరాల : కృష్ణా డెల్టా పరిధిలో ఈ ఏడాది ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకవైపు పొలాలు బీళ్లను తలపిస్తుండగా.. డెల్టా కాలువ పరిధిలోని కారంచేడు, పర్చూరు మండలాల్లోని తాగునీటి చెరువులు ఎండి నోళ్లు తెరుచుకున్నాయి. దీంతో ఊళ్లకు ఊళ్లే అలమటిస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టిలతో ఏటా డెల్టా రైతులు నిండా మునిగిపోతున్నారు. ఈ ఏడాదైనా ఏరువాక సవ్యంగా సాగి అప్పుల బాధల నుంచి గట్టెక్కుతామని ఆశించిన రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర జలసంఘం మంగళవారం తీసుకున్న నిర్ణయం ప్రకా రం నీరు వస్తే కనీసం తాగునీటి సమస్య కొంతైనా తీరుతుంది. వివరాల్లోకెళ్తే... వరుణుడు కరుణించకపోవడం, రెండు నెలలుగా ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో తెలుగు రాష్ట్రాలకు వరదాయిని అయిన నాగార్జునసాగర్‌లో నీటి మట్టం అడుగంటింది. ఎగువ ప్రాంతం నుంచి తుంగభద్ర, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి ప్రవాహం నిలిచిపోవడంతో సాగర్‌లో నీటి సామర్థ్యం రోజురోజుకూ గణనీయంగా తగ్గింది. నాలుగు నెలల తర్జనభర్జనల అనంతరం కేంద్ర జలసంఘం జోక్యంతో కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మధ్యంతర కమిటీ జూన్ 11న తీర్మానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు 3.6 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కృష్ణా, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినప్పటికీ జిల్లాలోని కొమ్మమూరు కాలువకు నీటి బొట్టు కూడా రాలేదు.మూడు రోజుల్లో నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌కు నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా డెడ్ స్టోరేజి 510 అడుగులు. ప్రస్తుతం 517 అడుగులకు పడిపోయింది. 517 అడుగుల నీటి సామర్థ్యం ఉంటేనే సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలనే నిబంధన ఉంది. దీనిని బట్టి కృష్ణా డెల్టా పరిధిలో ఆఖరున ఉన్న కొమ్మమూరు కాలువకు తాగు, సాగునీటి సమస్య పొంచి ఉంది. కొమ్మమూరు కాలువ కింద లక్ష ఎకరాలు సాగు అవుతుంది. వందలాది మంచినీటి చెరువులు ఉన్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనా వానల జాడేలేదు. ఎగువ ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు కురిసి నాగార్జునసాగర్‌కు నీరు వస్తేనే డెల్టా పరిధిలోని కొమ్మమూరు కాలువ ఆయకట్టు సాగవుతుంది. దాంతోపాటు తాగునీటి చెరువులూ నిండుతాయి. లేకుంటే పరిస్థితి అత్యంత దుర్భిక్షంగా ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అద్దె బలం కోసం టీడీపీ ఆకర్ష్
చీరాలలో టీడీపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సొంత బలం లేకపోవడంతో అద్దె బలం కోసం వెంపర్లాడుతోంది. ప్రత్యర్థి పార్టీల నేతలతో మంచిగా నటిస్తూనే, ముంచేందుకు యత్నిస్తోంది. వివరాల్లోకెళ్తే... పురపాలక సంఘ ఎన్నికల్లో పట్టణ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మద్దతునిచ్చారు. మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుండ గా వైఎస్ఆర్ సీపీకి 15 వార్డులు, టీడీపీకి 12, ఇండిపెండెంట్ ప్యానల్‌కు 6 వార్డులు దక్కాయి. అన్ని పార్టీలకంటే వైఎస్ఆర్ సీపీకే ఎక్కువ వార్డులు దక్కాయి. ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ పీఠంపై సందిగ్ధత నెలకొంది. ఆ పదవి దక్కించుకోవాలంటే కనీసం 17 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఈ లెక్క ప్రకారం వైఎస్ఆర్ సీపీకి ఇద్దరు, టీడీపీకి ఐదుగురు కౌన్సిలర్లు అవసరమవుతారు. చీరాలలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీతో కలసి చెరో రెండున్నరేళ్ల కాలం చైర్మన్ పదవిని పంచుకునేలా వైఎస్ఆర్ సీపీ నాయకులతో మంతనాలూ జరిపారు. ఇటువంటి పరిస్థితే చీరాల రూరల్ మండల ఎంపీపీ ఎన్నికలోనూ ఉంది. మండలంలో మొత్తం 24 ఎంపీటీసీలుండగా వైఎస్ఆర్ సీపీకి 12, టీడీపీకి 8, ఇండిపెండెంట్ ప్యానల్‌కు 3, బీఎస్పీకి 1 ఎంపీటీసీ స్థానం దక్కాయి. ఎంపీపీ పీఠం దక్కించుకోవాలంటే 13 మంది సభ్యుల మద్దతు అవసరం. వైఎస్ఆర్ సీపీకి మరొకటి ఉంటే సరిపోతుంది. ఎంపీపీ ఎంపికలో కూడా సహకరించుకోవాలనే విధంగా టీడీపీ నేతలు వైఎస్ఆర్ సీపీ నాయకులతో మంతనాలు జరిపారు. ఒకవైపు ఇలా నటిస్తూనే, మరోవైపు వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లతో బేరసారాలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లను కొనుగోలు చేసే విధంగా కొద్దిరోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 నుంచి రూ.15 లక్షలు ఇస్తామంటూ కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అడ్డదారిన చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు కొందరిని ప్రలోభాలకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లలో చాలామంది టీడీపీకి మద్దతునిచ్చేందుకు అంగీకరించడం లేదని సమాచారం. గీత దాటితే వేటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీచేసి గెలుపొందిన అభ్యర్థులు మరో పార్టీలోకి జంప్ అయితే ఎన్నికల నిబంధనలు మేరకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తింపు పార్టీగా పేర్కొంది. అయినప్పటికీ టీడీపీ అనైతిక రాజకీయాలకు ప్రయత్నించడం గమనార్హం. -
లక్షలు వెచ్చించారు..గాలికొదిలేశారు
చీరాల, న్యూస్‌లైన్: పోతేపోనీ జనం సొమ్మేకదా..అనే ధోరణిలో ఉంది చీరాల మున్సిపల్ యంత్రాగం. లక్షలాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రజల అవసరాలు, పట్టణాభివృద్ధిపై పాలకులు శ్రద్ధ చూపడంలేదు. మున్సిపాలిటీ నిధులు 13 లక్షలతో అన్ని హంగులతో నిర్మించిన స్కేటింగ్ కోర్టును 2008లో ప్రారంభించారు. మొదట్లో కొంతకాలం పెద్ద ఎత్తున యువకులు, చిన్నారులు వచ్చి ఇక్కడ స్కేటింగ్ నేర్చుకునేందుకు అలవాటు పడ్డారు. వివిధ కళాశాలలకు చెందిన యువకులు ఎక్కువగా వస్తుండటంతో ఒక కోచ్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు అప్పట్లో ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత కాలంలో స్కేటింగ్ నేర్పించేందుకు వచ్చిన ఓ మాజీ కౌన్సిలర్ కోర్టుకు రావడం మానివేయడంతో అప్పటి నుంచి అది మూతపడింది. దీంతో స్కేటింగ్ నేర్చుకునేందుకు ఆసక్తిగా వచ్చిన యువకులు, చిన్నారులు మెల్లగా రావడం మానేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ గానీ, ఇతర అధికారులు కానీ స్కేటింగ్ కోర్టు గురించి పట్టించుకోలేదు. కోచ్‌ను ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన జీతం తాము భరిస్తామని నేర్చుకునేందుకు వచ్చిన యువకులు, చిన్నారులు ముందుకొచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారి ప్రతిపాదనను ఆలకించేవారు లేకపోవడంతో మూడేళ్ల నుంచి స్కేటింగ్ కోర్టు నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయలతో నిర్మించిన స్కేటింగ్ కోర్టును మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఈవీఎంలపై రగడ
చీరాల, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఒక కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు అధికారులు ప్రయత్నించిన వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం రాత్రి తరలించేందుకు ప్రయత్నించగా..సమాచారం అందుకున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కాలేజీ వ ద్దకు ఇరుపార్టీల కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలో అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో టియర్‌గ్యాస్, ప్రత్యేక బలగాలను తరలించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఈవీఎంలు ఉంచిన గదిని పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని..ఈవీఎంలు ఉంచిన గది వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం..రాత్రివేళ ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం..స్ట్రాంగ్ రూం కిటికీలు తెరచి ఉంచడంపై తమకు సమాధానం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భర్త పోతుల సురేష్ నిలదీశారు. స్థానిక అధికారులు ముందుగా గదిలో ఉన్న ఈవీఎంల నంబర్లు తమకు ఇవ్వలేదని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారి పద్మజపై ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని..ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పర్యవేక్షణలో ఈవీఎంల అక్రమ తరలింపుపై విచారణకు నాయకులు డిమాండ్ చేశారు. స్ట్రాంగ్‌రూంలో ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలే ఉన్నాయని డీఆర్వో, ఆర్డీవోతో పాటు స్థానిక అధికారులు చెప్పినా టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించి విచారణ జరిపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా చీరాలలో ఉంచిన ఈవీఎంలను తరలించపోవడం వెనుక రెవెన్యూ అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నరహర ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. వీడిన అనుమానం.. ఈవీఎంల వ్యవహారంపై స్థానిక, జిల్లా అధికారులతో కాకుండా ఇతర అధికారులతో విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణాధికారులుగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి ఆర్డోఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల తహశీల్దార్ వెంకటేశ్వర్లును నియమించింది. సాయంత్రానికి చీరాల వచ్చిన విచారణాధికారులు పార్టీల నాయకులతో చర్చించారు. అనుమానం ఉన్న ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే సీలు తీసి పరిశీలించారు. మొత్తం అందులో ఉన్న 71 ఈవీఎంలను తనిఖీ చేశారు. అన్ని ఈవీఎంలలో రిజల్ట్ సున్నాలు రావడంతో అది రిజర్వ్, ట్రైనింగ్ ఈవీఎంలుగా విచారణాధికారులు నిర్ధారించారు. ఆ ఈవీఎంలలో అవకతవకలు లేవు కాలేజీలో భద్రపరచిన ఈవీఎంల పరిశీలన అనంతరం విచారణాధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో ఎటువంటి పోలు కాలేదని, అవి రిజర్వ్‌లో ఉంచినవని చెప్పారు. అయితే ఈవీఎంలను భద్రపరిచే విషయంలో స్థానిక ఎన్నికల, రెవెన్యూ అధికారులు నిబంధనలు విస్మరించారని, స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వలనే వివాదం తలెత్తిందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు నివేదించనున్నామన్నారు. దీంతో 24 గంటలుగా చీరాలలో ఉద్రిక్తతకు కారణమైన ఈవీఎంల వివాదానికి తెరపడింది. -
అడుగంటిన రక్త నిల్వలు
చీరాల రూరల్, న్యూస్‌లైన్ : చీరాలలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 100 పడకల ప్రభుత్వాస్పత్రి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ ఆస్పత్రిలో రోగుల సంఖ్యను బట్టి నెలకు 100 యూనిట్ల (ప్యాకెట్లు) రక్తం అవసరమవుతుంది. అయితే, ప్రస్తుతం ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో 21 రక్తం ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏదైనా అత్యవసరమైతే పరిస్థితి ఏంటో అర్థంకావడం లేదని ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని పేద ప్రజలకు ఈ వైద్యశాల సంజీవిని వంటిది. రెండు నియోజకవర్గాల్లోని పేదల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా చీరాల ఏరియా వైద్యశాలలో చేరి చికిత్స పొందుతుంటారు. ముఖ్యంగా గర్భిణులు, రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడినవారు, వివిధ రకాల వ్యాధులకు గురై ఆపరేషన్లు అవసరమైన వారు ఈ ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలోని రక్త నిల్వలను సద్వినియోగం చేసుకుంటుంటారు. వీరికి నెలకు సుమారు 100 ప్యాకెట్ల ర క్తం అవసరమవుతుంది. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వ చేసేందుకు ఈ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నాలుగు డీప్ ఫ్రిజ్‌లు 24 గంటల పాటు పనిచేస్తుంటాయి. ఒక్కొక్క ఫ్రీజ్‌లో 100 యూనిట్ల రక్తం ప్యాకెట్లు భద్రపరిచే వీలుంటుంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో రక్తాన్ని దానం చేసేందుకు దాతలు, విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఓ పాజిటివ్ రక్తం 14 ప్యాకెట్లు, ఏ పాజిటివ్ రక్తం 5 ప్యాకెట్లు, బీ పాజిటివ్ రక్తం ఒక ప్యాకెట్, ఓ నెగెటివ్ రక్తం ఒక ప్యాకెట్ కలిపి మొత్తం 21 రక్త ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటి సంఖ్యను పెంచేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉండగా, స్థానికంగా అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా రోగులకు ప్రాణసంకటంగా పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో నిల్వలు పెంచాల్సిన అవసరం ఉంది. జూన్ వరకూ ఇదే పరిస్థితి : డాక్టర్ ప్రియంవద, రక్తనిధి కేంద్రం నిర్వాహకురాలు, చీరాల ప్రతి ఏడాదీ మార్చి నుంచి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు తగ్గుతూ వస్తాయి. జూన్ వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. మిగిలిన నెలల్లో మాత్రం ఎప్పుడూ 100 ప్యాకెట్లకు తగ్గకుండా రక్త నిల్వలుంటాయి. రక్తదానం చేసేవారిలో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో రక్తదాన శిబిరాలు నిర్వహించక రక్త నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సాధారణ నిల్వల్లో సగం నిల్వలు కూడా చీరాల ఏరియా ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలో లేకుండా పోయాయి. స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆస్పత్రిలో రక్త నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తద్వారా ప్రాణదాతలుగా నిలవాలి. -
చీరాలలో ‘సైకిల్’కు పంచర్
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సైకిల్‌కు పంచరైంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాటు మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్‌దే హవా కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఎక్కడా కూడా టీడీపీ తన ఆధిక్యతను ప్రదర్శించలేకపోయింది. ఎంపీటీసీ ఫలితాల్లో చీరాల మండలంలో పూర్తిగా ఫ్యాన్‌గాలి వీయగా, వేటపాలెం మండలంలో మాత్రం ఇండిపెండెంట్ ప్యానెల్ చీరాల పరిరక్షణ సమితి హవా కనిపించింది. నియోజకవర్గంలోని చీరాల మండలంలో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్ఆర్ సీపీ రెబల్ అభ్యర్థిని కలుపుకుని మొత్తం 11 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో, చీరాల పరిరక్షణ సమితి 3 స్థానాల్లో, బహుజన సమాజ్ పార్టీ ఒకస్థానంలో విజయం సాధించాయి. వేటపాలెం మండలంలోని 21 స్థానాల్లో చల్లారెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవంతో కలుపుకుని చీరాల పరిరక్షణ సమితి 11 స్థానాల్లో, టీడీపీ 5, వైఎస్ఆర్ సీపీ 3, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు. పురపోరుతో పాటు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సీపీ హవా ప్రస్ఫుటంగా కనిపించింది. చీరాల రూరల్ మండలంలో వైఎస్ఆర్ సీపీ తరఫున గవినివారిపాలెం మెయిన్ నుంచి గవిని శ్రీనివాసరావు, గవినివారిపాలెం (ఈగవారిపాలెం) నుంచి గవిని పాపాగారి శ్రీనివాసరావు, కావూరివారిపాలెం నుంచి కావూరి హుస్సేనమ్మ, ఈపూరుపాలెం పద్మనాభునిపేట నుంచి గోలి ఆనందరావు, బుర్లవారిపాలెం నుంచి దేవరపల్లి ఎలీషమ్మ, కొత్తపాలెం నుంచి అన్నపురెడ్డి లక్ష్మి, వాడరేవు మెయిన్ నుంచి మచ్చా జ్యోతి, వాడరేవు పెదబరప నుంచి పిక్కి కాశీరావు, వాడరేవు (కీర్తివారిపాలెం) నుంచి పిన్నిబోయిన రామకృష్ణ, చీరాలనగర్ నుంచి ముచ్చు శివకుమారి గెలుపొందారు. సాల్మన్‌సెంటర్ నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసిన షేక్ బాషా గెలిచిన అనంతరం వైఎస్ఆర్ సీపీలో చేరారు. దీంతో మొత్తం 11 స్థానాలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. వేటపాలెం మండలంలో... వేటపాలెం మండలంలో గతంలో ఏకగ్రీవమైన చల్లారెడ్డిపాలేన్ని కలుపుకుని మొత్తం 11 స్థానాలలో చీరాల పరిరక్షణ సమితి గెలుపొందింది. కొత్తపేట మెయిన్ నుంచి టి.వెంకటతులసీరామ్, కొత్తపేట సంపత్‌నగర్ నుంచి దాసరి కోటేశ్వరరావు, దేశాయిపేట ఐటీఐ కాలనీ నుంచి వెంగళ భరత్‌బాబు, చల్లారెడ్డిపాలెం మెయిన్ నుంచి రావూరి సుజాత, దేశాయిపేట మెయిన్ నుంచి దంతం శివలక్ష్మి, వేటపాలెం మెయిన్ నుంచి షేక్ గౌసియా, వేటపాలెం రెడ్లలంప నుంచి జాగాబత్తుని శ్రీనివాసులు, వేటపాలెం సర్వోదయకాలనీ నుంచి షేక్ అప్సరున్సీసా, వేటపాలెం చిన్నబజారు నుంచి అంజమ్మ, రామన్నపేట మెయిన్ నుంచి బండ్ల తిరుములాదేవి, పందిళ్లపల్లి తోకపేట నుంచి పేరిశెట్ల పద్మజ గెలుపొందారు. అలానే వైఎస్ఆర్ పీపీ తరఫున కొత్తపేట ఐఎల్టీడీ కాలనీ నుంచి రొడ్డా మంగమ్మ, దేశాయిపేట జీవరక్షనగర్ నుంచి పాలెపు ఆల్ఫెడ్, పుల్లరిపాలెం నుంచి కోడూరి వెంకటేశ్వర్లు గెలుపొందారు. టీడీపీ తరఫున అక్కాయిపాలెం నుంచి బుర్ల సుబ్బరావమ్మ, దేశాయిపేట అనుమల్లిపేట నుంచి కట్టా గంగయ్య, దేశాయిపేట రామానగర్ నుంచి బుర్రా కవిత, రామన్నపేట రావూరిపేట నుంచి పేర్నేటి సుమతి, పందిళ్లపల్లి మెయిన్ నుంచి జి.వాణి గెలుపొందారు. పాపాయిపాలెం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి సూరగాని లక్ష్మి విజయం సాధించారు. రెండు మండలాల్లో టీడీపీ అభ్యర్థి ఎంపీపీ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆ పార్టీకి నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. -
పురపోరులో గెలుపు ఆమెదే
చీరాల అర్బన్, న్యూస్‌లైన్ : పురపోరులో మహిళా అభ్యర్థులు విజయఢంకా మోగించారు. హోరాహోరీగా సాగిన పోరులో రాజకీయ పార్టీల తరుపున బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులు తమ సత్తా చాటారు. పురపాలక సంఘంలోని మొత్తం 33 వార్డుల్లో 17 వార్డుల్లో మహిళా అభ్యర్థులు విజయం సాధించగా వీటిలో 10 మంది మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ పోరులో పార్టీల తరఫున పోటీ చేసిన మహిళలు కౌన్సిలర్లుగా బరిలోకి దిగారు. త్రిముఖ పోటీ సాగిన పురపోరులో వైఎస్సార్సీపీ బలపరిచిన వార్డుల్లో పది మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ తరఫున ఆరుగురు మహిళలు, చీరాల పరిరక్షణ సమితి తరఫున ఒకరు ఉన్నారు. మొత్తం 17 మంది మహిళా కౌన్సిలర్లు నూతన కౌన్సిల్లో పనిచేయనున్నారు. వీరందరూ తొలి ప్రయత్నంలోనే కౌన్సిలర్లుగా ఎన్నికైన వారు కాగా టీడీపీ తరఫున విజయం సాధించిన కల్లగుంట అంజమ్మ మూడోసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పురుషులతో పాటు మహిళలు కూడా సమాన స్థాయిలో బరిలో దిగి విజయ కేతనాన్ని ఎగురవేశారు. చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్లో 17 మంది మహిళలు కౌన్సిలర్లుగా ఉండడం ప్రత్యేకత సంతరించుకుంది. -
జగన్ ప్రసంగిస్తుండగా పవర్ కట్
-
చీరాలలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా పవర్ కట్
చీరాల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఆదివారం రాత్రి జరుగుతున్న వైఎస్ఆర్ జనభేరి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా ప్రత్యర్థులు పవర్ కట్ చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో వైఎస్ జగన్ సంయమనంతో ఉండాలంటూ కార్యకర్తలను కోరారు. ఓటుతో బుద్ది చెప్పాలంటూ పిలుపునిచ్చారు. పవర్ కోసం వైఎస్ జగన్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు నిరీక్షించారు. ఆ తర్వాత విద్యుత్‌ను పునరుద్దరించడంతో సభ కొనసాగింది. జగన్ ప్రసంగం కోసం జనం ఓపిగ్గా ఎదురు చూశారు. -
ఆధారమేదీ..
చీరాల, న్యూస్‌లైన్ : దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్దది చేనేత రంగం. అంతటి చరిత్ర ఉన్న చేనేత రంగం నిర్వీర్యమవుతోంది. ‘చేనేత రంగానికి కాలం చెల్లింది. గుంట మగ్గాలు ఇంకెంతకాలం’ అన్న చంద్రబాబు మాటలు మాత్రం నిజం కాలేదు. నేటికీ చేనేత రంగం బతికే ఉంది. అందుకు చేయూతనిచ్చింది వైఎస్ ప్రభుత్వమేనని కచ్చితంగా చెప్పవచ్చు. చేనేతలకు చంద్రబాబు చేసిందేమిటి? చేనేత బతుకులను బుగ్గిచేసే పవర్‌లూమ్‌లను ప్రోత్సహించి 2003లో టెక్స్టైల్స్ పార్కులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు కావడంతో చేనేతలకు పనిలేకుండా పోయింది. చేనేతలకు ఆసరాగా ఉండే ఆప్కోకు నిధులు కేటాయించకపోవడంతో చేనేత బట్టకొనుగోలు చేసే దిక్కులేక, చేసేందుకు పనులు లేక అప్పులు, అనారోగ్యాల బారినపడిన కార్మికులు పిట్టల్లా రాలిపోయారు. చిలుపనూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించడంతో నూలు కొనుగోలు చేయడం నేతన్నకు భారంగా మారింది. ఫలితంగా నూలు కొనలేక మగ్గం నడిచే పరిస్థితి ఉండేది కాదు. దీనిపై చీరాలలో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైల్‌రోకో చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో సైతం ఆందోళన చేపట్టారు. అయినా ఫలితం లేదు. చేనేతలకు వైఎస్ఆర్ చేసిందిదీ.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పోచంపల్లి, సిరిసిల్ల వంటి చేనేత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన మొట్టమొదటి సభలో చేనేత రంగానికి చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే వారికి ఆసరాగా నిలిచారు. - చేనేత రుణమాఫీ కింద జిల్లాలో 1520 మంది లబ్దిదారులకు * 3.23 కోట్ల రుణాలు రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో... - 2003-04లో రూ.195.37 కోట్లు (చేనేత బడ్జెట్) - ఏఏవై పథకం లేదు - 65 ఏళ్లు నిండిన వారికే వృద్ధాప్య పింఛన్, సమష్ట అమ్మక కేంద్రాలు లేవు. - నూలుపై సబ్సిడీ లేదు, చిలపల నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ - ఆప్కో అమ్మకాలు రూ.86.85 కోట్లు - పింఛన్ 75 రూపాయలు - జనతా పథకం రద్దు - నూలు మిల్లుల మూసివేత - చేనేత మహిళలకు ఒక్క పథకం కూడా లేదు. వైఎస్సార్ హయాంలో... - 2008-09లో రూ.325.32 కోట్లు (చేనేత బడ్జెట్) - 2005-06లో ఏఏవై పథకం అమలు - 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ - 2006-07 నుంచి క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం ప్రవేశపెట్టారు - 200 కోట్ల రూపాయల ఆప్కో అమ్మకాలు, చేనేత పార్కుల ఏర్పాటు - చేనేతలకు పావలా వడ్డీ రుణాలు - రూ.312 కోట్ల చేనేత రుణాల మాఫీ - రంగు, రసాయనాలు, చిలప నూలుపై 10 శాతం సబ్సిడీ - వీవర్స్ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీలేని రుణాలు - చిలప నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ రద్దు మహానేత మరణం తరువాత... - చేనేతలకు ప్రత్యేకంగా పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానన్న కిరణ్ సర్కారు హామీ నెరవేర్చలేదు. - నూలు డిపోల ఏర్పాటు హామీ కూడా కాగితాలకే పరిమితమైంది. - మూడేళ్లలో నూలు ధరలు 30 నుంచి 55 శాతం పెరిగాయి. దీంతో చాలా మంది కార్మికులు నూలు కొనుగోలు చేసే శక్తిలేక మగ్గాలను మూలనపెట్టారు. - వీవర్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకం కూడా అమలుకు నోచుకోలేదు. కార్మికులు నెలకు 80 చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. క్లైంల విషయంలో అనేక ఆంక్షలు విధించడంతో కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు. - జిల్లాలో 70 వేల మందికిపైగా చేనేతలున్నప్పటికీ చేనేత క్రెడిట్ కార్డు పథకం కింద 5 వేల మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. - నూలు, రంగులు, రసాయనాలపై పది శాతం సబ్సిడీ వైఎస్ అమలు చేస్తే తరువాత వచ్చే పాలకులు మాత్రం ఆ ఊసే ప్రస్తావించకుండా చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా చేనేతలు అప్పుల్లో కూరుకుని అల్లాడుతున్నారు. ఆదరవునిచ్చే నేత కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చేనేతల కోసం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిందిదీ.. - 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న * 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. - చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. - కిరణ్ సర్కారు రద్దు చేసిన హౌస్ కం వర్క్ షెడ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని జగన్ ప్రకటించారు. - కోస్తా తీర ప్రాంతాల్లో ఏటా సంభవించే ప్రకృతి వైపరీత్యాలకు గుంటమగ్గాల్లో పనిచేసే చేనేత కార్మికులకు ఎక్కువ నష్టం జరుగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు గుంటమగ్గాల స్థానంలో ‘ఫ్రేమ్ లూమ్స్’ను అందజేస్తామని హామీ ఇచ్చారు. - అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల యూనిఫాంలు, విద్యార్థుల యూనిఫాంలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. - అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1.50 లక్షలతో ఉచితంగా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రేమ పేరుతో మైనర్ బాలికను లొంగదీసుకుని...
చీరాల: ప్రేమపేరుతో ఓ మైనర్ బాలికను వలలో వేసుకుని, ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను కెమెరాలో రహస్యంగా చిత్రీకరించి వాటిని స్నేహితుల సెల్ఫోన్లకు పంపిన మాజీ కౌన్సిలర్ పుత్రరత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు. చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎం.భీమానాయక్ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు... స్థానిక ఉడ్నగర్కు చెందిన మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన షేక్ జునైద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఆమెతో తాగించాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి వాటిని తన స్నేహితుల సెల్ఫోన్లకు పంపాడని సీఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు. జునైద్‌పై రౌడీషీట్ కూడా తెరవనున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా మేజిస్ట్రేట్ 15 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. -
జనహోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర శనివారం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాలల్లో జరిగింది. బహిరంగ సభలు, రోడ్‌షోల్లో వేలాది మంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహానేత వైఎస్సార్ తనయకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర జిల్లాలో మూడోరోజు శనివారం అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో సాగింది. గుంటూరు జిల్లా నుంచి ఉదయం అద్దంకి చేరుకున్న షర్మిలకు సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. షర్మిల వెంట వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వేలాదిమందినుద్దేశించి ఆమె ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన మద్దతు వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అద్దంకి అభివృద్ధి చెందాలన్నా..ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న మృగాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ పాలన ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు పార్టీలో చేరారు. అద్దంకిలో సమావేశం ముగిసిన అనంతరం మార్గమధ్యంలో షర్మిల తనకోసం వేచి ఉన్న వికలాంగులను కలుసుకున్నారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకున్నారు. తిరిగి సాయంత్రం పర్చూరు వచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తన పాలనలో జరిగినవి చెప్పకుండా వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తాను చేపడతానని చెప్పుకుంటున్నాడని అన్నారు. పులిని చూసి నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా..నక్క నక్కే అవుతుంది కానీ పులికాదని అన్నారు. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి అపూర్వస్పందన లభించింది. సభానంతరం జనభేరి యాత్ర చీరాల చేరుకుంది. మార్గమధ్యంలో కారంచేడులో షర్మిల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. రాత్రి 9 గంటలకు చీరాల చేరుకున్న ఆమె పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. తొలుత నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని పాలన రాష్ట్రంలో వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పాలేటి రామారావు, పార్టీ నాయకులు అవ్వారు ముసలయ్య, కన్నేటి వెంకటప్రసాద్, వరికూటి అమృతపాణి తదితరులు పాల్గొన్నారు. అభిమానుల కోలాహలంతో దారిపొడవునా ఆమెకు ఘన స్వాగతం లభించింది. -
ఓటర్లూ.. జర జాగ్రత్త!
చీరాల, న్యూస్‌లైన్ : ఓటర్లూ.. అప్రమత్తంగా ఉండండి. ఓట్ల వేటగాళ్లొస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..! బంధువులంటూ కలేస్తారు.. కులమంటూ ముడిపెడతారు. అదిచేస్తా.. ఇది చేస్తానంటూ బీరాలు పలుకుతారు. అటువంటి గారడి నేతలను నమ్మొద్దు. మీ ఓటే వజ్రాయుధం. మీ ఓటుతోనే అటువంటి నేతలు నిజమెరుగుతారు. పోరాటాల పురిటిగడ్డ చీరాలను ఎందరు పాలకులు పాలించినా సమస్యల జంజాటం మాత్రం మిగిలే ఉంది. గత పాలకులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరని విషయం తెలిసిందే. పట్టణంలో పలు సమస్యలు తాండవిస్తున్నాయి. పాలకులు గొప్పగా చెప్పిన రోడ్ల విస్తరణ పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. పట్టణంలో మొత్తం 12 ప్రధాన రోడ్లు మాస్టర్‌ప్లాన్ ప్రకారం విస్తరించాల్సి ఉండగా కేవలం నాలుగు రోడ్లు మాత్రమే విస్తరించారు. అవి కూడా మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధమే. మిగిలిన ఎనిమిది రోడ్ల విస్తరణ పనుల ఉసే లేకుండా పోయింది. దీంతో అగ్గిపెట్టెల్లాంటి రోడ్లతో రాక పోకలు సాగించేందుకు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మురికి కూపాలుగా ప్రధాన రోడ్లు పట్టణంలోని ప్రధాన రోడ్లు మురికి కూపాలను తలపిస్తున్నాయి. రోజు వారీగా గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాల ద్వారా వచ్చే చెత్తా చెదార వేసేది ప్రధాన రోడ్లపైనే. కారంచేడు రోడ్డు, దండుబాట, కుందేరు, బైపాస్‌రోడ్లు డంపింగ్ యార్డులుగా మారాయి. ఈ రోడ్ల వెంట వెళ్లాలంటే నరకయాతనే. రామాపురం వద్ద డంపింగ్ యార్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. గుక్కెడు నీరూ గగనమే పట్టణంలో నివసిస్తున్నా చాలా ప్రాంతాల ప్రజలకు గుక్కెడు మంచినీరు దొరకడం కూడా గగనమే. ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకు అందడంలేదు. ఐక్యనగర్, రామ్‌నగర్, 300 కాలనీ, శ్రీనివాసనగర్, గాంధీనగర్, యానాదినగర్ కాలనీ, శాంతినగర్ , పేరాల రెడ్డిపాలెంతో పాటు అనేక శివారు ప్రాంతాలకు మంచినీటి సదుపాయం నేటికీ లేదు. ఈ ప్రాంతాలకు పైప్‌లైన్ లేకపోవడంతో ప్రజలు మంచినీరు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. ఆ అవకాశం లేనివారు బోర్లు, బావులపై ఆధార పడుతున్నారు. పట్టణంలో ఏళ్లతరబడి అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్న పేదలకు నేటికీ సొంత గూడు లేదు. అవినీతిలో అగ్రస్థానమే మున్సిపాలిటీలో చిన్నపని కావాలన్నా దానికో రే టు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు అక్కడి సిబ్బంది, అధికారులు. మంచినీటి కుళాయి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇళ్లు కట్టుకోవాలన్నా, వ్యక్తిగత రుణం పొందాలన్నా, మున్సిపాలిటీలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలన్నా సిబ్బంది, అధికారులకు చేతులు తడపాల్సిందే. అందుకే ఇటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే మీ చేతుల్లో ఉన్న ఓటనే అయుధంతో కల్లబొల్లి కబుర్లు చెప్పే రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పండి. -
మాతృత్వానికి మచ్చ
చీరాల రైల్వేస్టేషన్లో ఆరు నెలల చిన్నారి ఐసీడీఎస్‌కు అప్పగించిన రైల్వే పోలీసులు ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా..! అని తల్లి-బిడ్డ మధ్య ఉండే ప్రేమానురాగాలను ఓ సినీ కవి తన పాటలో అందంగా వర్ణించారు. దేవునికి ప్రతిరూపం అమ్మ.. అని భావించే సమాజంలో ఓ తల్లి తన పేగు తెంచుకు పుట్టిన పసికందును వదిలించుకుంది. మరి ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలి యదుగానీ ఎవరూ చూడకుండా రైల్వేస్టేషన్లో తన ఆరు నెలల బిడ్డను ఉంచి మాయమైంది. ఈ సంఘటన చీరాల రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం జరిగింది. చీరాల అర్బన్, న్యూస్‌లైన్ : స్థానిక రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై ఆరు నెలల పసికందు(ఆడశిశువు)ను గుర్తుతెలియని కొందరు ఆదివారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో వదిలి వెళ్లారు. ప్లాట్‌ఫాంపై పసికందు ఏడుపు వినిపించడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఉండాల్సిన బాలిక వద్ద ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల విచారించారు. అనంతరం విషయాన్ని జీఆర్పీ ఎస్సై అశోక్‌బాబుకు తెలియజేశారు. కొద్దిసేపటి తర్వాత ఐసీడీఎస్‌కు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలకు పసికందును రైల్వే పోలీసులు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం శిశువును ఒంగోలు ఐసీపీఎస్‌కు తరలిస్తామని ఐసీడీఎస్ సిబ్బంది తెలిపారు. పసికందు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై ఒంటరిగా ఉండటాన్ని ప్రయాణికులు చూసి చలించిపోయారు. కొందరు మహిళలు దగ్గరకు వెళ్లి చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఏ తల్లి కన్న బిడ్డో ఇలా ఒంటరైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు లేక ఎందరో మహిళలు నోములు నోస్తుంటే పుట్టిన బిడ్డను ఇలా వదిలి వెళ్లడంపై అక్కడి వారిని కలచి వేసింది. నెలల శిశువును అనాథగా వదిలి వెళ్లిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందోనని మహిళలు విచారం వ్యక్తం చేశారు. -
శోక సంద్రం
తెలతెలవారక ముందే హైలెస్సా..హైసెల్సా అంటూ బతుకుదెరువు కోసం కడలి కెరటాలపై సవారీ చేసే వారిని ఆ కెరటాలే కాటేశాయి. సముద్రంలో వేటకెళ్లిన వారి పడవ బోల్తా పడటంతో నలుగురి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. పెళ్లయిన ఏడాదికే భర్త కళ్లెదుటే నీటమునిగి తనువు చాలించిన వారొకరైతే...అన్నకు చేదోడుగా ఉంటున్న చెల్లెలు... భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లల పోషణ కోసం పడవెక్కిన మరో మహిళ.. భర్తతో కలిసి వేటకొచ్చిన వృద్ధురాలు నీటమునిగి ఊపిరాడక కన్నుమూశారు. ఊరికి చెందిన నలుగురు ఒకేసారి మృత్యువాతపడటంతో వేటపాలెం మండలంలోని మత్స్యకార పల్లె రామచంద్రాపురం శోకసంద్రమైంది. చీరాల, వేటపాలెం, న్యూస్‌లైన్: విధి వారి జీవితాలపై విషం చిమ్మింది. పట్టెడన్నం పెట్టే గంగమ్మకు ఆగ్రహం వచ్చింది. రోజూ కెరటాలపై ఆడుతూ పాడుతూ ఉండే వారి పాలిట అవే మృత్యుపాశాలయ్యాయి. నాగులుప్పలపాడు మండలం గుండమాల సముద్ర తీరంలో గురువారం ఉదయం జరిగిన పడవ ప్రమాదంలో వేటపాలెం మండలం రామచంద్రాపురానికి చెందిన నలుగురు మత్య్సకార మహిళలు మృతిచెందారు. మృతుల కుటుంబాలది రోజూ వేటకెళితేనే పూటగడిచే పరిస్థితి. కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా ఉందామని ధైర్యంగా సముద్రంపై వేటకు వెళ్లిన కోడూరి ముత్యాలమ్మ(35),కాటం పోలమ్మ(50), చిన్నంగారి పోలమ్మ (22), కుమారి నాగమ్మ(18) ఆటుపోటు సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలకు బలైపోయారు. మృతుల కుటుంబాలది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ...భర్త కళ్లెదుటే... ప్రమాదంలో మృతి చెందిన చిన్నంగారి పోలమ్మకు పెళ్లయి ఏడాదయింది. భార్యాభర్తలు కలిసి చేపల వేటకు వెళ్లారు. పడవ బోల్తా పడటంతో పోలమ్మ సముద్రపు నీటిలో మునిగిపోయింది. తన కళ్లెదుటే భార్య నీటిలో మునిగిపోవడంతో జాలయ్య తట్టుకోలేకపోతున్నాడు. పెళ్లయిన ఏడాదికే భార్యను పోగొట్టుకున్నానని కన్నీరుమున్నీరవుతున్నాడు. కుటుంబంలో మిగిలింది ఒక్కరే... ఐదేళ్ల కిందట కుమారి నాగమ్మ తల్లిదండ్రులు మృతిచెందారు. అన్నయ్య శివతో కలిసి బతుకుదెరువు కోసం చిన్న అమ్మమ్మ గ్రామమైన రామచంద్రాపురానికి వచ్చి ఉంటున్నారు. అన్నాచెల్లెళ్లిద్దరూ సముద్రంలో వేటసాగిస్తూ పొట్టపోసుకుంటున్నారు. పడవ ప్రమాదంలో నాగమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబంలో శివ ఒంటరివాడయ్యాడు. అనాథలైన ముగ్గురు పిల్లలు.. కోడూరి ముత్యాలమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భర్త మూడేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె చేపల వేట ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. తన కుమారుడిని తీసుకుని రోజూ సముద్రంలో చేపల వేటకు వెళ్తుంటుంది. పడవ ప్రమాదంలో ముత్యాలమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. తండ్రి లేకున్నా..తమకు అండగా ఉన్న తల్లి చనిపోవడంతో ఆ పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేపల వేటపైనే జీవనం... కాటం పోలమ్మ... 50 ఏళ్ల వయసుపై బడినా సముద్రంపై వేట ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. ఏడుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేసింది. భర్త పోలయ్యతో కలసి చిన్న కుమారుడి వద్ద ఉంటోంది. భర్తతో కలసి చేపల వేటకు వెళ్లి పడవ ప్రమాదంలో మృత్యువాత పడింది. పోలమ్మ మృతితో భర్తకు చేదోడు కరువైంది. -
వేధిస్తున్న పోస్టల్ ఆర్డర్ల కొరత
వేధిస్తున్న పోస్టల్ ఆర్డర్ల కొరత చీరాల రూరల్, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, సమాచారం కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకునే వారు పది రూపాయల పోస్టల్ ఆర్డర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఏ చిన్న సమాచారం తెలుసుకోవాలన్నా ముందుగా సమాచార హక్కు చట్టానికి సంబంధించిన దరఖాస్తుతో పాటు పోస్టాఫీసుల్లో దొరికే రూ.10 పోస్టల్ ఆర్డర్‌ను దరఖాస్తుతో పాటు జతచేసి పోస్టల్ ఆర్డర్ నంబర్‌ను కూడా దరఖాస్తుతో పాటు పొందుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కొలువుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. అయితే ఆయా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా రూ.10 పోస్టల్ ఆర్డర్‌ను జతచేసి పంపాల్సి ఉంటుంది. కానీ చీరాలలోని హెడ్పోస్టాఫీసుతో పాటు పేరాల పోస్టాఫీసులలో పది రూపాయల పోస్టల్ ఆర్డర్లు మాత్రం దొరకడంలేదు. చేసేదేమి లేక అధిక కమీషన్ చెల్లించి బ్యాంకు డీడీలు తీసి దరఖాస్తులు పంపిచాల్సి వస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక కమీషన్ చెల్లించాల్సి వస్తోంది.. సమాచార హక్కు చట్టం ద్వారా మనకు కావాల్సిన సమాచారం పొందాలంటే ఏ వ్యక్తి అయినా సరే పోస్టాఫీసులో దొరికే రూ.10 పోస్టల్ ఆర్డర్ తప్పని సరిగా జతచేయాల్సి ఉంటుంది. కానీ చీరాల హెడ్ పోస్టాఫీసులో మాత్రం రూ.10 పోస్టల్ ఆర్డర్ దొరకకపోవడంతో చేసేదేమిలేక రూ.2 పోస్టల్ ఆర్డర్లను 5 కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.10 పోస్టల్ ఆర్డర్‌పై అభ్యర్థులు పోస్టాఫీసులో ఒక్క రూపాయి కమీషన్ చెల్లిస్తే సరిపోతుంది. కానీ రెండు రూపాయల పోస్టల్ ఆర్డర్లు ఐదు తీసుకోవడం వల్ల ఒక్కొక్క దానిపై రూపాయి కమీషన్ చొప్పున రూ.5 పోస్టాఫీసులో చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదు రూపాయలు అదనంగా పోస్టాఫీసులో చెల్లించాల్సి వస్తోంది. చిల్లర దుకాణాల్లో.. పోస్టాఫీసుల్లో దొరకని రూ.10 పోస్టల్ ఆర్డర్లు మాత్రం చిల్లర దుకాణాలలో ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి. అయితే దుకాణదారులు మాత్రం అధిక ధరలకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పోస్టాఫీసుల్లో దొరకని పది రూపాయల పోస్టల్ ఆర్డర్లు చిల్లర దుకాణాలలో దొరుకుతుండడంతో ప్రజలు పోస్టల్ శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చీరాల హెడ్ పోస్టాఫీసు పోస్టు మాస్టర్ టి. శివరాంప్రసాద్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా రూ.10 పోస్టల్ ఆర్డర్లు అయిపోయిన మాట వాస్తవమేన్నారు. అయితే గత నెల 4వ తేదీ, ఈ నెల 7వ తేదీన సర్కిల్ స్టోర్స్ డిపో హైదరాబాద్ వారికి ఇండెంట్ పెట్టామన్నారు. అయితే అక్కడ కూడా పోస్టల్ ఆర్డర్లు అయిపోయాయనే సమాధానం వచ్చిందని ఆయన చెబుతున్నారు. -
16 మంది ఉపాధ్యాయులకు మెమోలు
చీరాల, న్యూస్‌లైన్ : మండల విద్యాశాఖాధికారి, ఉపాధ్యాయుల మధ్య శుక్రవారం వాగ్వాదం జరిగింది. పాఠశాల సమయానికి తెరవకపోవడంతో ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చానని ఎంఈఓ చెబుతున్నారు. కేవలం 5 నిమిషాలు ఆలస్యమైతేనే మెమోలు ఇచ్చి వేధిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఎంఈఓతో వాగ్వాదానికి దిగారు. జారీ చేసిన నోటీసులు ఉపాధ్యాయులు తీసుకోకుండా తిరస్కరించారు. వివరాలు.. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఎంఈఓ డి.రత్నకుమారి చీరాల రూరల్ మండలంలోని ఈగావారిపాలెం, గవినివారిపాలెం, కొత్తపాలెం, పుల్లాయిపాలెం, లింగాపురం గ్రామాల్లోని పాఠశాలల తనిఖీకి వెళ్లారు. అయితే ఈ పాఠశాలలు ఉదయం 9 గంటల సమయంలో తెరుచుకోలే దు. ఎంఈఓ వెళ్లిన సమయంలో వాటికి తాళాలు వేసి ఉండటంతో ఆమె 16 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. మెమోలు తీసుకునేందుకు ఉపాధ్యాయులు తిరస్కరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మెమోలు ఇచ్చిన ఉపాధ్యాయులు చీరాలలోని మండల విద్యావనరుల కేంద్రానికి చేరుకుని రూరల్ మండలంలో కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని, తామంతా ఆటోలు లేక ఇబ్బందులు పడుతూ పాఠశాలకు ప్రతిరోజూ వెళుతున్నామని, 20 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలకు వెళితే దానిని కూడా తప్పుగా చూపిస్తూ మెమోలు ఇవ్వడం వేధింపుచర్యలేనని ఎంఈఓతో వాగ్వాదానికి దిగారు. ఎంఈఓ మాత్రం తాను వెళ్లిన 9గంటల సమయంలో పాఠశాలకు తాళాలు వేసి ఉండటంతో మెమోలు ఇచ్చానని చెబుతున్నారు. బస్సులు కూడా లేని గ్రామీణ ప్రాంతాలకు ఆటోల్లో వెళ్లి విధులు నిర్వహిస్తున్నామని, కేవలం 5నిమిషాలు ఆలస్యమైన ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వడం మంచిదికాదని, అవసరమైతే ఒక దఫా హెచ్చరించి సమయానికి రావాలని మౌఖికంగా ఆదేశించాలేగానీ, మెమోలు ఇవ్వడం తప్పన్నారు. ఈ విషయమై ఎంఈఓ, ఉపాధ్యాయులకు గంటపాటు వాగ్వాదం జరిగింది. చివరకు ఎంఈఓ జారీ చేసిన మెమోలను ఉపాధ్యాయులు తీసుకోకుండానే వెళ్లిపోవడం గమనార్హం. -
భర్త కిడ్నీని అమ్మేసుకున్న భార్య
చీరాల, న్యూస్‌లైన్: ‘అప్పులపాలయ్యాను... ఆదుకోండి’ అంటూ ఓ భార్య తన భర్తను నమ్మించింది. ఆయన కిడ్నీని దళారుల సాయంతో అమ్మించింది. చివరకు భర్తను వైద్యశాలలోనే వదిలివేసి ఉడాయించింది. ఈ సంఘటన గతేడాది అక్టోబర్‌లో జరిగింది. చివరకు మోసపోయిన భర్త ఆదివారం మీడియాను ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన ఆంధ్రా కృపారావుకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన గౌరీదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. గౌరీదేవి ప్రవర్తన బాగాలేదంటూ భర్త దూరమయ్యాడు. పిల్లలు తల్లి దగ్గరే ఉంటున్నారు. కొంతకాలం దూరంగా ఉన్న గౌరీదేవి భర్తకు ఫోన్ చేసి తనకు రూ. 3 లక్షల అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చాలని ప్రాధేయపడింది. నీ కిడ్నీ అమ్మితే రూ. 5లక్షలు ఇస్తారని, దానితో సమస్యల నుంచి గట్టెక్కుతామని నమ్మబలికింది. పిల్లల కోసం కృపారావు కూడా సరేనన్నాడు. దీంతో అక్టోబర్‌లో వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ అమ్మేసుకున్నాడు. వచ్చిన రూ.5లక్షలు తీసుకుని భర్తను అక్కడే వదిలేసి గౌరీదేవి, దళారి ఉడాయించారు. చివరకు వైద్యులు బయటకు గెంటేయడంతో కృపారావు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్‌కు పదిరోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు టూటౌన్ సీఐని కలవగా మాకు సంబంధం లేదని వైజాగ్‌లోనే కేసు పెట్టాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియక చివరకు మీడియాను ఆశ్రయించాడు. -
చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో భారీగా ఓట్ల తొలగింపు
చీరాల, పర్చూరు, న్యూస్‌లైన్: ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టున్న గ్రామం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో మొత్తం 640 మంది ఓటర్లున్నారు. అయితే తాజాగా గ్రామంలోని పోలింగ్ కేంద్రం నం.175 పరిధిలో ఏకంగా 159 ఓట్లు తొలగించారు. వీరి తొలగింపునకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు చేయలేదు. బీఎల్వో విచారణ కూడా చేపట్టలేదు. అయినా జాబితాలో ఓట్లు మాత్రం తీసేశారు. ఈ జాబితా చూసిన గ్రామస్తులు అవాక్కయ్యారు. అన్ని విధాలా అర్హత ఉన్నా ఓట్లు తొలగించడంపై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పర్చూరు తహసీల్దార్ కార్యాలయానికి గుర్తింపు కార్డులతో వచ్చి నిరసనకు దిగారు. వేటపాలెం మండలం వడ్డెరసంఘం, ప్రసాద్నగరంలోని 141వ నంబరులోని పోలింగ్ బూత్‌లో మొత్తం 948 ఓట్లు ఉండగా ఎలాంటి కారణం చూపకుండా వరుసగా 470 మంది ఓట్లను తొలగించారు. చీరాల రూరల్ మండలం గవినివారిపాలెం గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 350 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. చీరాల పట్టణంలోని పదో వార్డుకు చెందిన షేక్ సుబాని రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. అతని ఓటును తీసేశారు. పాపాయిపాలేనికి చెందిన వార్డు సభ్యుడు ఆతిని చినవెంకటేశ్వర్లు ఓటూ జాబితాలో గల్లంతైంది. అదే గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ భర్త గవిని పోతురాజు గత పంచాయతీ ఎన్నికల్లో ఓటువేశాడు. ప్రస్తుతం ఓట్ల జాబితాలో ఆయన పేరు లేదు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా పల్లె..పట్నం అన్న తేడా లేకుండా బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపడంతో పాటు ఏ కారణం లేకుండా వేలాది ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారి ఓట్లనే ఎక్కువగా తీసేశారు. అధికార పార్టీ అండదండలున్న అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే ఈ ఓట్లు తొలగించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్ల తొలగింపుపై అధికారులు, బూత్‌లెవల్ ఆఫీసర్లు చెబుతున్న మాటలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. గవినివారిపాలెంలోని 23వ బూత్‌కు బూత్‌లెవల్ అధికారిగా ఉన్న ప్రేమ్‌కుమార్ ఏం చెబుతున్నారంటే తన బూత్ పరిధిలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే తిరస్కరించినట్లు నివేదిక ఇచ్చానని, కానీ జాబితా వచ్చాక చూస్తే 20 ఓట్లు తిరస్కరించినట్లు ఉందని చెప్పారు. ఓట్ల తొలగింపునకు, తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. చీరాల తహసీల్దార్ బీ సాంబశివరావు నియోజకవర్గంలో 4,500 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని, అందులో 2 వేల ఓట్లను బూత్‌లెవల్ అధికారులు, వీఆర్వోలు ఇచ్చిన నివేదికల మేరకే తొలగించామని చెప్పారు. మిగిలిన ఓట్లు తాము తొలగించకపోయినా జాబితాలో తొలగించినట్లుగా రావడం తమకే అర్థం కావడం లేదన్నారు. కంప్యూటర్లో సాంకేతిక లోపం కావచ్చని అనడం చూస్తే ఓట్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలు ఇట్టే స్పష్టమవుతున్నాయి. చీరాల రూరల్ గ్రామాలైన అక్కాయిపాలెం, గవినివారిపాలెం, పాపాయిపాలెం, బోయినవారిపాలెం, దేవినూతల, దేశాయిపేటల్లో అధికంగా ఓట్లు గల్లంతయ్యాయి. చీరాల నియోజకవర్గంలో చీరాల పట్టణంతో పాటు చీరాల రూరల్, వేటపాలెం మండలాల్లో మొత్తం 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. నియోజకవర్గంలో 1,78,502 మంది ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎన్నికల కమిషన్ కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఓట్ల నమోదు కార్యక్రమం డిసెంబర్‌తో ముగిసింది. అయితే కొత్త ఓటరు జాబితాను స్థానిక అధికారులు బయట పెట్టడంలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు హైదరాబాద్ నుంచి ఓటర్ల జాబితాలు అందాయి. వీటిని పరిశీలించిన నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఓట్లతో పాటు అక్కడక్కడా టీడీపీకి చెందిన వారి ఓట్లు సైతం తొలగించారు. అయితే మొత్తం ఎన్ని వేల ఓట్లు తొలగించారని అధికారికంగా తేలకపోయినా పది వేలకు పైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారి ఓట్లు తొలగించిన జాబితాలో అధికంగా ఉన్నాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన లకు సిద్ధమవుతోంది. కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ ఓట్ల జాబితా రూపొందిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలేటి రామారావు, కార్యకర్తలు ఇప్పటికే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు ఉడ్‌నగర్‌లోని స్థానిక తహశీల్దార్ ఇంటిని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. తమ ఓట్లను ఎందుకు తొలగించారో చెప్పాలని మాజీ మంత్రి పాలేటి రామారావు డిమాండ్ చేశారు. అలానే నియోజకవర్గంలో జరిగిన ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌తో పాటు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా... పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లే లక్ష్యంగా తొలగించినట్లు తేటతెల్లమవుతోంది. 500 ఓటర్లకు మించి లేని గ్రామాల్లో సైతం వంద ఓట్లకుపైగా తొలగించడం..పంచాయతీల్లో ఉన్న ఓట్లలో కూడా వందల సంఖ్యలో ఓట్లు జాబితాల్లో మాయం కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఆగ్రహం పెళ్లుబికింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 1828 ఓట్లు తొలగించారు. వీటిల్లో అధిక శాతం వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాలే కావడం గమనార్హం. దళితుల ఓట్లు కూడా అధిక సంఖ్యలో తొలగింపుల జాబితాలో చేరాయి. ఇలాంటి సంఘటనే పర్చూరు మండలం రమణాయపాలెంలో కూడా చోటుచేసుకుంది. ఈ గ్రామంలో 485 మంది ఓటర్లకు గాను 121 ఓట్లు ఎలాంటి దరఖాస్తులు, విచారణ లేకుండా తొలగించారు. వాటిలో పది ఓట్లు మరణించిన వారివి కాగా మిగతా ఓటర్లందరూ నూరుశాతం అర్హులే. చిన్న గ్రామంలో ఒకేసారి 111 మందిని జాబితాలో తొలగించడాన్ని బట్టి చూస్తే సైబర్ నేరం ఏ స్థాయిలో జరిగిందో తేటతెల్లమవుతోంది. ఇదే విధంగా పర్చూరు మండలంలోని నూతలపాడు, బోడవాడ, ఉప్పుటూరు, ఇంకొల్లు మండలంలోని భీమవరం, ఇడుపులపాడు, గొల్లపాలెం, ఇంకొల్లు, మార్టూరు మండలంలోని కోలలపూడి, కోనంకి, నాగరాజుపల్లి, ఇసుకదర్శి, మార్టూరు, వలపర్ల, యద్దనపూడి మండలంలోని యద్దనపూడి, జాగర్లమూడి, చినగంజాం మండలంలో మున్నంవారిపాలెం, రాజుబంగారుపాలెం, కారంచేడు మండలంలోని స్వర్ణ, యర్రంవారిపాలెం గ్రామాల్లో ఓటర్ల జాబితాల్లో భారీగా ఓట్లు తొలగించారు. అసలేం జరిగిందంటే... ఆన్లైన్ ఓటరు తొలగింపులు, సవరణలు, చేర్పులకు సంబంధించిన పాస్వర్డ్ ఆధారంగానే ఈ తతంగం జరిగినట్లు నిర్ధారణవుతోంది. కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ సిబ్బంది ద్వారానే అక్రమాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 23 నాటికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ బీఎల్వోలు విచారించి ఇచ్చిన జాబితాపై 31న తుదిజాబితా రూపొందించారు. ఈ మధ్యకాలంలో దరఖాస్తులు, బీఎల్వోల విచారణతో పనిలేకుండానే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించారు. కొన్ని చోట్ల చేర్పులు కూడా జరిగాయి. ఇప్పటికే అధికారులు నిర్ధారించిన దాని ప్రకా రం మార్టూరు మండలంలో 715, యద్దనపూడి మండలంలో 30, పర్చూ రు మండలంలో 178, కారంచేడు మండలంలో 50, ఇంకొల్లు మండలంలో 624, చినగంజాం మండలంలో 231 ఓట్ల చొప్పున సైబర్ నేరం ద్వారా తొలగించినట్లు ధ్రువీకరించారు. లోపాలు జరిగిన మాట వాస్తవమే... జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి కే మోహన్‌కుమార్ ఎన్నికల జాబితాల్లో లోపాలు జరిగిన మాట వాస్తవమేనని జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి కే.మోహన్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని, లోపాలను వీలైనంత త్వరగా సవరిస్తామని చెప్పారు. వీటిపై ఇప్పటికే విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. మోసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే అద్దంకి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తలు గొట్టిపాటి రవికుమార్, గొట్టిపాటి భరత్‌లు కలెక్టరును కలిసి వివరించారు. బుధవారం హైదరాబాద్‌లో గొట్టిపాటి భరత్ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి జరిగిన అక్రమాన్ని వివరించారు. -
చేనే‘తల రాత’ మారేనా..!
అమలుకు నోచుకోని మూడు ప్రాజెక్టులు చేనేత కార్మికులకు ఉపాధి హామీ మాటల్లోనే... పాలకుల నిర్లక్ష్యమే కారణం చీరాల, న్యూస్‌లైన్ : వ్యవసాయం తర్వాత అతిపెద్దదైన చేనేత రంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేస్తామన్న చేనేత ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తికాలేదు. ఫలితంగా మాస్టర్ వీవర్ల దయాదాక్షిణ్యాలపైనే వారు బతకాల్సి వస్తోంది. ఏళ్లక్రితం మంజూరైన ప్రాజెక్టులు కూడా పూర్తికాలేదు. శంకుస్థాపనకే పరిమితమైన చేనేత పార్కు: చీరాల ప్రాంతంలో అధికంగా ఉన్న చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు వేటపాలెం మండలం నాయినిపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య 2005లో వేటపాలెం మండలం నాయినపల్లి వద్ద రూ. 7.8 కోట్లతో చేనేత పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయినపల్లిలో 50 ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. లబ్ధిదారులుగా 140 మంది వరకు డిపాజిట్లు చెల్లించారు. కానీ పార్కు నిర్మించేందుకు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపారు. స్వలాభం కోసం మాస్టర్ వీవర్లు పార్కు నిర్మాణానికి సహకరించడం లేదు. పార్కులో కార్మికులను భాగస్వాములను చేస్తే ఎప్పటికైనా అది విజయవంతం అవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వ నిధులతో పార్కు నిర్మించి, అందులో మాస్టర్ వీవర్లకు, కొంత కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించేందుకు నిర్ణయించారు. పార్కులో మగ్గాలు, డైయింగ్ యూనిట్లు, ప్యాకింగ్ యూనిట్‌తో పాటు చేనేత అనుబంధ పనులన్నీ అక్కడే జరగేలా ప్రణాళిక రూపొందించారు. తయారీ అయిన వస్త్రాలను ఎగుమతి చేసేందుకు కూడా కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుని తద్వారా మార్కెట్ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు కూడా జరిగాయి. 500 నుంచి వెయ్యి మంది కార్మికులకు పార్కులో పని కల్పించి వారికి పార్కు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో ఉచితంగా పక్కా గృహాలు నిర్మించేందుకు నిర్ణయించారు. అయితే అంచనాలు మార్చారు. గతంలో రూ. 7.8 కోట్ల అంచనాలుండగా దాన్ని రూ. 3 కోట్లకు కుదించారు. దీంతో పార్కు నిర్మాణం కలగానే మిగిలింది. నిరుపయోగంగా చేనేత క్లస్టర్: చీరాల రూరల్ మండలంలోని ఈపూరుపాలెం, తోటవారిపాలెం ప్రాంతాల్లోని చేనేతలను ఆదుకునేందుకు 2006లో రూ. 2 కోట్లతో క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో నూతన డిజైన్లు, రంగు అద్దకాలపై అవగాహన పేరుతో లక్ష రూపాయలు ఖర్చు చేయగా, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో తయారవుతున్న దుస్తులపై అవగాహన కల్పించేందుకు కొందరు చేనేత కార్మికులను యాత్రల పేరుతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపారు. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకున్నా రూ. 5 లక్షలు ఖర్చయ్యాయి. ఈ వ్యవహారంలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత తోటవారిపాలెంలో రూ. 70 లక్షలతో చేనేత సముదాయాన్ని నిర్మించారు. కొన్ని భవనాలు ఏర్పాటు చేసి అందులో నూతన డిజైన్లు నేర్చుకునేందుకు మగ్గాలు ఏర్పాటు చేశారు. షోరూం ఏర్పాటు చేసి చేనేతలు తయారు చేసిన వస్త్రాలు నేరుగా అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. యారన్ డిపో కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అయినా అందులో శిక్షణ ఇచ్చేవారిని ఏర్పాటు చేయలేదు. కార్మికులకు ఎటువంటి శిక్షణలు, సదస్సులు నిర్వహించకపోవడంతో దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని కార్మికులు ఆ వైపు ముఖం కూడా చూడటం లేదు. కొనుగోలుదారులెవరూ క్లస్టర్లకు రావడం లేదు. ఒక్క ఎగ్జిబిషన్ కూడా జరగలేదు. ఈ వ్యవహారం మొత్తంలో రూ. 2 కోట్లు వృథా తప్ప కార్మికులకు కనీస ప్రయోజనం లేకుండా పోయింది. మెగాటెక్స్‌టైల్ పార్కు ఊసేదీ... చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి రక్షించేందుకు చీరాల, బాపట్ల మధ్య మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేయిస్తానని బాపట్ల ఎంపీ, అప్పటి చేనేత, జౌళిశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు రూ. 70 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. నేటికీ పార్కుకు సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు మొదలుకాలేదు. కనీసం భూసేకరణ ప్రయత్నాలు కూడా జరగలేదు. అసలు పార్కు ఎక్కడ కడతారో, చేనేతలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో కూడా స్పష్టత లేదు. గతంలో ఇందిరమ్మబాట సందర్భంగా చీరాలకు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరినా ఆయన స్పందించలేదు. ఇదిలా ఉంటే రూ. 70 కోట్లతో నిర్మించే టెక్స్టైల్ పార్కుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని జిల్లా చేనేత శాఖాధికారులకు కేంద్రం నుంచి ఎలాంటి సూచనలు కానీ, ఆదేశాలు కానీ అందలేదు. చేనేతలు అధికంగా ఉండే చీరాల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పనబాక లక్ష్మికి గత ఎన్నికల్లో చేనేతలు అండగా నిలిచి మంచి మెజార్టీ ఇచ్చారు. కానీ తమ సంక్షేమంపై ఆమె కనీస శ్రద్ధ చూపడం లేదని చేనేతలు ఆగ్రహంతో ఉన్నారు. -
దరిచేరని రైతుబంధు
చీరాల, న్యూస్‌లైన్: మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే రైతులకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు రూపొందించిన రైతుబంధు పథకం వారి దరి చేరడం లేదు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల రైతులకు మూడేళ్లలో ఈ పథకం కింద పైసా కూడా రుణం ఇవ్వలేదంటే పథకం పనితీరు తేటతెల్లమవుతోంది. రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నా..అధికారుల అలసత్వం కారణంగా అవి రైతులకు దక్కడం లేదు. పైసా వడ్డీ లేకుండా అప్పు ఇస్తామంటే రైతులు ముందుకు రావడం లేదని అధికారులంటున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన మార్కెట్ కమిటీలు కేవలం ఆదాయంపైనే దృష్టి సారించి సేవలను విస్మరించాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేని సమయంలో రైతుబంధు పథకం ద్వారా రుణం పొందే అవకాశం ఉంది. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించి రుణ సాయమందించాల్సిన అధికారులు రైతులు ఆసక్తి చూపడం లేదన్న సాకుతో చేతులెత్తేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిధులున్నా..మూడేళ్లుగా అరకొరగా కూడా రైతులకు రుణాలివ్వడం లేదు. రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసి వడ్డీ లేని రుణం పొందవచ్చు. పథకం కింద పంట విలువలో 75 శాతం వరకు రుణంగా ఇస్తారు. దీనికి 90 రోజుల వరకు వడ్డీ ఉండదు. పత్తి మినహా జిల్లాలో సాగయ్యే పంట ఉత్పత్తులన్నింటికీ ఈ పథకం కింద నిల్వ చేసుకుని రుణం పొందే అవకాశం ఉంది. ఇందు కోసం మార్కెట్ల వారీగా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. రైతులు వస్తే రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నా..పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో వారు విఫలమవుతున్నారు. వడ్డీ లేకుండా రుణాలిస్తామంటే వద్దనేవారు ఎవరుంటారని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రైతుబంధు పథకానికి ఏటా కేటాయించిన నిధులు మురిగిపోతూనే ఉన్నాయి. పథకం అమలులో భాగంగా ప్రారంభంలో క్రయవిక్రయాలు జరిపే రైతులకు రైతుబంధు పేరిట ప్రత్యేకంగా పాసుపుస్తకాలిచ్చారు. గతంలో వందల సంఖ్యలో రైతులు రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం రుణం పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో రైతు బంధు పథకం కాగితాలకే పరిమితమైంది. పథకంపై అవగాహన లేక డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్లో ఏ ధర ఉంటే అదే ధరకు పంట అమ్ముకొని రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. చాలా సందర్భాల్లో రైతులు అమ్ముకున్న తర్వాత పంటలకు ధరలు పెరిగాయి. అధికారులు మాత్రం రైతులు ముందుకొస్తే రుణాలిస్తామని చెబుతున్నారు. నగదు అవసరమైన రైతులు తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అమ్ముకుంటున్నారని, దీంతో రుణం తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. మూడేళ్లలో పథకం తీరు ఇదీ.. జిల్లాలో మొత్తం 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న రైతులకు మూడేళ్లలో ఒక్కపైసా కూడా రైతుబంధు పథకం కింద రుణం మంజూరు చేయలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో మాత్రం 2011-12 సంవత్సరానికి గాను 76 మంది రైతులకు రూ. 32.44 లక్షలు, 2012-13 లో 22 మంది రైతులకు రూ. 17.22 లక్షలు, 2013 నవంబర్ వరకు 31 మంది రైతులకు రూ. 22.63 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. మొక్కుబడిగా మంజూరు చేస్తూ ఈ పథకానికి దూరం చేయడంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకున్నా రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. -
‘చౌక’చక్యంగా తరలింపు
చీరాల, న్యూస్‌లైన్: పేదల బియ్యాన్ని భోంచేసే వ్యాపారులు తమ అక్రమ వ్యాపారానికి సరికొత్త పంథా ఎంచుకున్నారు. ‘ట్రాక్టర్లు, ఆటోలు, లారీల్లో చౌక బియ్యం తరలిస్తుంటే అందరికీ అనుమానం వస్తుంది. అధికారులు దాడులు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్ని బాధలు లేకుండా ఏంచేయాలి’ అని ఆలోచించారు. వెంటనే ‘ఐడియా’ అని అరిచారు. టీవీఎస్ మోపెడ్లను లైన్లో పెట్టారు. కొంతమంది వ్యక్తులను కూలీకి కుదుర్చుకుని మోపెడ్లపై నుంచి బియ్యం తరలించడం మొదలు పెట్టారు. ఈ దందా చీరాల, వేటపాలం, చినగంజాం ప్రాంతాల్లో హెచ్చు మీరుతోంది. రేషన్ దుకాణాల నుంచి బియ్యం తరలించే కార్యక్రమాన్ని ఓ నెలలో 15 వ తేదీ లోగా పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా.. అనుమానం రాకుండా బియ్యాన్ని ప్లాస్టిక్ గోతాల్లో పెట్టి కట్టేస్తున్నారు. ఓ మోపెడ్‌పై రెండు గోతాల చొప్పున ఉంచి మిల్లులకు తరలిస్తున్నారు. ఇలా ఒక్కో వాహనం ద్వారా రోజుకు నాలుగైదు ట్రిప్పులుగా బియ్యాన్ని చేరవేస్తున్నారు. మొత్తంమీద 20 మోపెడ్లు అక్రమ రవాణాలో పాలుపంచుకుంటున్నాయి. ఈ తరహా తరలింపుపై ఎవరి దృష్టీ పడకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఈ బియ్యాన్ని బాపట్లలోని మిల్లులకు తరలించిన తర్వాత.. రీసైక్లింగ్ చేస్తూ ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. దేశాయి పేట గోడౌన్ కీలకం.. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని తెల్లకార్డుదారుల కోసం నెలకు వెయ్యి టన్నుల రేషన్ బియ్యం దేశాయిపేటలోని గోడౌన్‌కు చేరుతుంది. అయితే అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. వివిధ మార్గాల్లో బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మొత్తం బియ్యంలో 600 టన్నుల దాకా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నాయి. డీలర్ల వద్ద నుంచి కిలో *10 కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. మిల్లర్లకు *13 చొప్పున విక్రయిస్తున్నారు. అధికారులు ఎందుకు ఉన్నట్లు? డీపోల నుంచి పట్టపగలే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం మమ అనిపిస్తున్నారు. అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున మామూళ్లు అందుతుండడంతో మెతక ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చలించడంలేదు. గతంలో 6ఏ కేసులు నమోదు చేసేవారు.. ఇప్పుడు సాహసించకపోవడం గమనార్హం. దీంతో పాత వ్యాపారులతో పాటు కొత్తవారు కూడా అక్రమ వ్యాపారానికి దిగారు. ప్రాంతాల వారీగా రేషన్ డిపోలను పంచుకున్నారు. మోటుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి అధికార పార్టీ అండదండలను చూసుకొని పెట్రేగిపోతున్నాడు. -
‘యడం’ అస్తమయం
చీరాల, న్యూస్‌లైన్: వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యడం చినరోశయ్య(69) శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సెమీ క్రిస్మస్ వేడుకలతో పాటు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయల్దేరబోతున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఇంటి ఆవరణలోనే తుళ్లిపడ్డారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఆయన్ను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు వదిలారు. శుక్రవారం రాత్రే గుండె నొప్పిగా ఉండటంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించగా కేవలం గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమేనని, గుండె సమస్య లేదని చెప్పడంతో ఇంటికి వెళ్లారు. చిన రోశయ్య తండ్రి యడం చెన్నయ్య 17 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అత్యంత ఆప్తుడిగా ఉన్న చినరోశయ్య దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ పటిష్టతకు చురుగ్గా పనిచేశారు. ఇటీవల వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి చీరాల నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి భారీగా జనాన్ని తరలించారు. శోకసంద్రంలో యడం కుటుంబం.. శుక్రవారం రాత్రి కూడా పార్టీ కార్యాలయంలో సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించి పేద, దళిత మహిళలకు చీరలు పంపిణీ చేసిన చినరోశయ్య ఉదయాన్నే ఉన్నట్టుండి కన్ను మూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి యడం బాలాజీ ‘అమెరికాను వదిలి నీ కోసం ఇండియాకు వస్తే నన్ను వదిలేసి వెళ్లిపోయావంటూ’ విలపించడం చూసిన వారంతా కంటతడి పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శ: గుండెపోటుతో అకాల మరణం చెందిన యడం చినరోశయ్య కుటుం బాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. చినరోశయ్య తనయుడు యడం బాలాజీతో 15 నిమిషాలు మాట్లాడారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా.. చినరోశయ్య మృతి సమాచారం తెలుసుకున్న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫోన్ చేసి చినరోశయ్య కుమారుడు యడం బాలాజీని పరామర్శించి సంఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. బాలినేని నివాళులు... వైఎస్ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి హుటాహుటిన చీరాల వచ్చి చినరోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న చినరోశయ్య తనయుడు యడం బాలాజీని ఓదార్చారు. పలువురి నివాళులు... యడం చినరోశయ్య భౌతికకాయానికి చీరాల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ, అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ పరిశీలకుడు యల్లసిరి గోపాలరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ పలు విభాగాల కన్వీనర్లు భవనం శ్రీనివాసరెడ్డి, కర్నేటి వెంకటప్రసాద్, కఠారి శంకర్, సమన్వయకర్తలు పాలేటి రామారావు, సజ్జా హేమలత, అవ్వారు ముసలయ్య, వి.అమృతపాణి, పట్టణ కన్వీనర్ యాతం ఆనందరావు, స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. చినరోశయ్య రాజకీయ నేపథ్యం ఇదీ.. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్న రోశయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1981 మున్సిపల్ కౌన్సిలర్ ప్రతిపక్ష నాయకుడిగా, ఆర్టీఏ జిల్లా సభ్యునిగా పని చేశారు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. స్థానిక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. -
విద్యార్థుల ఆకలి కేకలు
చీరాల రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారుతోంది. చీరాల పట్టణంలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే..చీరాల పట్టణంలోని ఆంధ్రరత్న మునిసిపల్ ఉన్నత పాఠశాల, ఎన్‌ఆర్‌అండ్‌పీఎం, కస్తూరిబా గాంధీ బాలికోన్నత పాఠశాలల్లో గతంలో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది. ఆంధ్రరత్న మునిసిపల్ బాలికోన్నత పాఠశాలలోని 388 మంది విద్యార్థుల్లో 50 నుంచి వంద మంది రోజూ పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఈ పాఠశాలకు అత్యధికంగా వాడరేవు, బుర్లవారిపాలెం, మరియమ్మపేట, జయంతిపేట, జాన్‌పేట, పేరాల, గాంధీనగర్, శృంగారపేట, ఆనందపేట, ప్రసాదనగర్లకు చెందిన పేద విద్యార్థులు వస్తుంటారు. అలానే కస్తూరిబా గాంధీ మునిసిపల్ బాలికోన్నత పాఠశాల లో కూడా ఇదే పరిస్థితి. ఈ పాఠశాలలో 600 మంది విద్యనభ్యసిస్తున్నారు. రోజూ 150 నుంచి 200 మంది విద్యార్థినులు పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఎన్‌ఆర్‌అండ్‌పీఎం పాఠశాలలో వంద మంది భోజనం చేస్తారు. అయితే వారం రోజుల క్రితం కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులను తహసీల్దార్ రద్దు చేశారు. దీంతో ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు రోజూ ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని తింటున్నారు. పథకం నిలిచి వారం రోజులైనా సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. ఆయా పాఠశాలల్లో కుకింగ్ ఏజెన్సీలను కొన్ని రాజకీయ కారణాలతో తొలగించినట్లు సమాచారం. ఏజెన్సీల నిలుపుదల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఏదైనా కారణాలతో ఆగితే ప్రత్యామ్నాయం చూపించాలి. బియ్యం అందకపోయినా ప్రత్యామ్నాయంగా బియ్యం తెప్పించి భోజనం పెట్టాలనే నిబంధన ఉంది. దీనిపై తహసీల్దార్ బీ సాంబశివరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈఓ, ఈఓఆర్డీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చిన తరువాతే దాని ఆధారంగా కుకింగ్ ఏజెన్సీలను రద్దు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో నూతన ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామన్నారు. -
లేహ్యం పేరుతో లూటీ
చీరాల, న్యూస్‌లైన్: వరుస ప్రకృతి వైపరీత్యాలతో అన్ని విధాలా నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకొని వ్యవసాయానికి దూరమవుతున్న రైతులను సర్కారు విధానాలు మరింత నష్టపరుస్తున్నాయి. సవాలక్ష నిబంధనలతో రుణాలు మంజూరు చేయడంలో రైతులకు ‘చెయ్యి’స్తున్న ప్రభుత్వం చివరకు వారికి ఇవ్వాల్సిన వడ్డీలు కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. గతేడాది రబీ సీజన్‌కు సంబంధించిన రుణాలు వడ్డీతో సహా కట్టినప్పటికీ రైతులకు తిరిగి ఇవ్వాల్సిన వడ్డీ మాత్రం ప్రభుత్వం బ్యాంకులకు జమ చేయలేదు. వివరాల్లోకి వెళితే...ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలను వడ్డీ లేకుండా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ఆచరణలో రుణాల తాలూకు వడ్డీ తిరిగి రైతులకు జమచేయడంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. రైతులు తీసుకున్న రుణాలకు అసలుతో పాటు ఏడు శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు చెప్పారు. రైతులు కట్టిన వడ్డీ నగదు ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన వెంటనే తిరిగి వారి ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పంట రుణాలు తీసుకొన్న వారు ఏడాది లోపు వడ్డీతో కలిపి బ్యాంకులకు తిరిగి చెల్లించేశారు. అయితే రుణాలు కట్టి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు వడ్డీ తిరిగి రైతుల ఖాతాల్లోకి చేరలేదు. పంట రుణాలు చెల్లించిన రైతులు బ్యాంకుల చుట్టూ రోజూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులు ప్రభుత్వం నుంచి వడ్డీకి సంబంధించిన నిధులు రాలేదంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు * 7 కోట్లు: లక్ష నుంచి * 3 లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ ప్రభుత్వం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో సుమారు రెండు లక్షల మంది రైతులకు గత ఏడాది రబీ సీజన్లో * 1200 కోట్ల పంట రుణాలిచ్చారు. రుణాలు తీసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది రైతులు సకాలంలో బ్యాంకులకు ఏడు శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించేశారు. రుణాలు చెల్లించి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు వడ్డీ తిరిగి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదు. ప్రభుత్వం నుంచి రుణాల తాలూకు దాదాపు * 7 కోట్ల వడ్డీ బ్యాంకులకు జమకావాల్సి ఉంది. వడ్డీలేని రుణాల మాట ప్రభుత్వం మరిచిపోయిందని రైతులు విమర్శిస్తున్నారు. వరుస నష్టాలతో అప్పులపాలైన తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణం చెల్లించి నాలుగు నెలలైంది డి.సత్యనారాయణ గత ఏడాది రబీ సీజన్లో వరి సాగు కోసం బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకున్నా. సంవత్సరంలోపు చెల్లిస్తే వడ్డీ ఉండదు. వడ్డీతో కలిపి అక్టోబర్‌లోనే రుణం తిరిగి చెల్లించా. కానీ వడ్డీ ఇంత వరకు ఇవ్వలేదు. బ్యాంకు అధికారులు ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటున్నారు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా యానాదిరెడ్డి రబీ సీజన్లో వరి సాగుకు బ్యాంకులో రుణం తీసుకున్నాను. ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండదన్నారు. ముందుగా వడ్డీతో కలిపి రుణం చెల్లించాలని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కట్టాను. నాలుగు నెలలైనా ఇంత వరకు వడ్డీ తిరిగి ఇవ్వలేదు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. గత ఏడాది రబీ రుణాలు వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారు లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రసాద్ గత ఏడాది 2012 నవంబర్ నుంచి 2013 మార్చి వరకు రబీ సీజన్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల వడ్డీ రాయితీ వ్యవహారం వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించిన రైతు జాబితాలను ప్రభుత్వం వద్దకు పంపి, వాటి వడ్డీని బ్యాంకులకు జమచేసే బాధ్యత వ్యవసాయశాఖ పైనే ఉంటుంది. -
శిశువుకు పునర్జన్మ
పసికందును పూడుస్తున్న తల్లిని అడ్డుకున్న స్థానికులు చీరాల, న్యూస్‌లైన్: ముక్కుపచ్చలారని చిన్నారిని మట్టిలో కలపాలనుకున్న ఒక తల్లి నుంచి స్థానికులు రక్షించి పునర్జన్మ ప్రసాదించిన సంఘటన గురువారం రాత్రి ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. యాచకురాలైన మహిళ తన 2 నెలల మగ శిశువును స్థానిక వైకుంఠపురం సమీపంలో ఉన్న గూడ్స్ షెడ్డు వద్ద చిత్రహింసలకు గురిచేయడంతో పాటు బతి కుండగానే మట్టిలో కలిపేందుకు ప్రయత్నించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు తల్లి నుంచి శిశువును రక్షించి తమ సంరక్షణలో ఉంచుకున్నారు. ఆ తల్లి పరారైంది. స్థానికులు చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శిశు సంక్షేమ శాఖ జిల్లా డీసీపీవో జ్యోతిసుప్రియ ఆ శిశువును సంరక్షణలోకి తీసుకున్నారు. -
కేసులుంటే.. కాసులే!
చీరాల, న్యూస్‌లైన్ : బాధితులకు అండగా నిలిచి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించాల్సిన పోలీసులు శాంతి భద్రతలకే విఘాతం కలిగిస్తున్నారు. రోజూవారీ కలెక్షన్ల యావే తప్ప.. రక్షణ కోసం పోలీసుస్టేషన్లో అడుగు పెట్టే బాధితుల గోడు వినే దిక్కేలేదు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలంటే జేబు నిండుగా ఉండాల్సిందే. స్టేషన్లోనే పంచాయితీలు చేసి అనుమానాస్పద మృతి కేసులను మాఫీ చేస్తున్న కొందరు పోలీస్ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లలో కాసులిస్తే ఎలాంటి కేసులైనా నీరుగార్చుతున్నారు. ఇందులో ముఖ్యంగా డీఎస్పీ కార్యాలయానికి దగ్గరలో ఉండే పోలీసుస్టేషన్ తీరు మరీ ఘోరం. నెల క్రితం విజయ్‌నగర్‌కాలనీకి చెందిన ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. చీరాల కేంద్రంగా జరిగే దొంగ గాడిదల అక్రమ రవాణా లారీకి అతడు డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఒక ముఠాతో కలిసి వెళ్లిన ఆ డ్రైవర్ ఇంటికి శవమై తిరిగి వచ్చాడు. దొంగిలించిన గాడిదలను విక్రయించుకుని సొమ్ము చేసుకునే విషయంలో వివాదాలు ఏర్పడి హత్యకు దారి తీశాయా.. అనే అనుమానాలున్నాయి. ముఠాలోని ఇద్దరు వచ్చి మీ వాడు విరేచనాలు, వాంతులు చేసుకుని చనిపోయాడంటూ వెళ్లిపోతుండగా అతని కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరితో పాటు దొంగ గాడిదల రవాణాకు వినియోగించిన లారీ, వారి వద్ద ఉన్న * 20 వేల నగదు తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. గాడిదలు రవాణా చేసే ముఠా యజమానిని కూడా స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ పంచాయితీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు బుట్టదాకలైంది. అదుపులోకి తీసుకున్న లారీ బయటకు వచ్చేసింది. ఎలాంటి కేసులేదు..పాడులేదు. దీని వెనుక పెద్ద మొత్తంలోనే పోలీస్ అధికారులు, సిబ్బందికి ముడుపులు ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అటువంటి అనుమానాస్పద మృతి కేసు కూడా సెటిల్మెంట్తో నీరుగారిపోయింది. అదే స్టేషన్‌కు చెందిన పోలీసులు సాయికాలనీకి చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని కొన్ని రోజులు స్టేషన్లో పెట్టి విచారించారు. తాను బంగారం దొంగిలించి కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారికి విక్రయించానని అతను పోలీసులకు చెప్పాడు. సదరు వ్యాపారిని కర్ణాటక నుంచి స్టేషన్‌కు తీసుకొచ్చి నాలుగైదు రోజుల పాటు ఉంచి రెండు కేజీల బంగారం కొనుగోలు చేశావంటా తమదైన శైలిలో విచారించారు. చివరకు పోలీసుల వేధింపులు తాళలేక 150 గ్రాముల బంగారాన్ని స్థానికంగానే కొనుగోలు చేసి పోలీసులకు ఇచ్చి వ్యాపారి కర్ణాటక వెళ్లాడు. ఇది జరిగి 15 రోజులు దాటినా ఎలాంటి రికవరీ చూపించకపోవడం గమనార్హం. ఆ స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాలు జరిగాయి. నిందితులను అరెస్ట్ చేయడం కానీ, రికవరీ చూపించడం కానీ జరగడం లేదు. కానీ దొంగల నుంచి రికవరీ చేసిన బంగారం మాత్రం ఏమవుతుందో.. ఏమో కానీ ఆ లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. ఇదిలా ఉంటే అనేక కేసుల్లో రికవరీ చేసిన పాత ఇసుము ఆ స్టేషన్లో చాలాకాలం నుంచి ఉండాలి. ఇటీవల ఆ ఇనుము చాలా వరకు మాయమైంది. పాత ఇనుము కొట్టుకు పోలీసులే అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. రికవరీ చేసిన సొత్తును కోర్టుకు అప్పగించాల్సి ఉండగా ఆ స్టేషన్ పోలీసులు, అధికారులు మాత్రం తమ సొంత జేబుల్లోకి మళ్లిస్తున్నారు. ఇదిలా ఉంటే భార్యాభర్తల గొడవ కేసుల్లో సైతం పోలీసుస్టేషన్‌కు పిలిపించి ఇద్దరి వద్ద భారీగా వసూలు చేస్తున్నారు. లేదంటే పలు సెక్షన్లు సాకుగా చూపి జీవిత కాలం జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడి ఇద్దరి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. చిన్నపాటి కేసులపై ఆ స్టేషన్‌కు వెళితే పోలీస్ వాహనం రిపేరు వచ్చిందని * 30 నుంచి * 40 వేల వరకు ఖర్చవుతుందని, మీరే చేయించాలంటూ హుకుం జారీ చేస్తుండటంతో ఆ వైపు వెళ్లాలంటేనే బాధితులు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు చినగంజాం, పందిళ్లపల్లి, వేటపాలెం మండలాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను రాత్రి వేళల్లో నిలిపి సిబ్బంది పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలానే ఐడీ పార్టీ పేరుతో అనధికారికంగా వ్యవహరిస్తున్న కొందరు సిబ్బంది సివిల్ పంచాయితీల్లో తలదూర్చి సొమ్ము చేసుకుంటున్నారు. రక్షణ కల్పించాల్సిన వారే కాసుల వైపే మొగ్గు చూపటంతో బాధితులకు అన్యాయం జరుగుతోంది. ఆ స్టేషన్‌తో పాటు సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్స్టేషన్ల పరిస్థితీ ఇదే విధంగా ఉంది. కేసు వచ్చిందంటే కాసులొస్తాయన్న ధ్యాసే తప్ప శాంతి భద్రతలపై దృష్టి సారించడం లేదు. ఇందుకు ఉదాహరణే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దొంగతనాల కేసులు. -
వెన్నులో వణుకు
చీరాల, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు.. అకాల వర్షాలకు అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కోటి ఆశలతో మొదలైన సాగు ఏటా కళ్ల ముందే తుడిచి పెట్టుకుపోతుండటంతో రైతులు కుదేలవుతున్నారు. ఈ పాటికే జల్, లైలా, నీలం వంటి తుపాన్ల ధాటిని తట్టుకోలేక సర్వం కోల్పోయారు. వ్యవసాయం కోసం తెచ్చిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే గత నెలలో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని 90 శాతం వ్యవసాయ పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం పై-లీన్ తుపాను నుంచి బయట పడినప్పటికీ లెహర్ తుపాను ప్రభావం ఎటువంటి విపత్తును మిగులుస్తుందోనని రైతులు వణికిపోతున్నారు. లెహర్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వరి, వేరుశనగ, పత్తి, పొగాకు, మరికొన్ని పంటలు సాగవుతున్నాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వరి, మొక్కజొన్న, పొగాకు, కంది, వేరుశనగ, మినుముతో పాటు సుమారు 1.96.200 హెక్టార్ల పంటలు దెబ్బ తిన్నాయి. ప్రభుత్వం నుంచి విత్తన సాయం కూడా అందలేదు. వ్యవసాయం వదులు కోవడం ఇష్టం లేక రైతులు మళ్లీ సాగు మొదలు పెట్టారు. కొన్నిచోట్ల దెబ్బతిన్న పత్తిని పీకేసి మళ్లీ నాటారు. మరికొన్ని చోట్ల దెబ్బతిన్న పత్తిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు పత్తికి * 30 నుంచి * 35 వేల వరకు ఖర్చు చేశారు. గత నెలలో కురిసిన వర్షాలకు వరి పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా ప్రస్తుతం మళ్లీ నార్లు పోశారు. చీరాల వ్యవసాయ సబ్ డివిజన్లో ఉన్న చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వరి 4185 హెక్టార్లు, మొక్కజొన్న 1566 హెక్టార్లు, వేరుశనగ 177 హెక్టార్లు, మిరప 380 హెక్టార్లు, పొగాకు 1500 హెక్టార్లు, శనగ 300 హెక్టార్లలో సాగు చేశారు. ఇవి కాక కూరగాయలను 35 హెక్టార్లలో సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరానికి * 9 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం వైట్‌బర్లీ సాగు చేస్తున్నారు. పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లో పొగాకు సాగులో ఉంది. ఎకరాకు * 10 వేల వరకు ఖర్చయింది. మరికొన్ని పంటలు కూడా సాగవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని రైతులు బెంబేలెత్తుతున్నారు. ఏటా వరుసగా ఎదురవుతున్న నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు లెహర్ ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఏమి జరుగుతుందో, వేసిన పంటలు ఏమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు ఇక్కడితో ఆగితే పంటలకు పెద్దగా నష్టం ఉండదు. మరో రోజు కొనసాగినా, అధిక వర్షాలు కురిసినా పొలాలు మళ్లీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. సర్కార్‌పై నమ్మకం వదులుకున్న అన్నదాతలు ఏటా ఎదురవుతున్న విపత్తులతో సర్వం కోల్పోయి అప్పుల పాలవుతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదు. నష్ట పరిహారం పంపిణీ చేస్తుందన్న ఆశ అన్నదాతలకు లేదు. గతంలో సంభవించిన నీలం, జల్ తుపానుకు సంబంధించిన నష్టపరిహారం పూర్తిగా రైతులకు చేరలేదు. బ్యాంక్ ఖాతాలతో పాటు అనేక ఆంక్షలతో పరిహారం రైతుల చేతికి పూర్తిగా అందలేదు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీతో పాటు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే హామీ ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు. 50 శాతంపైగా పంటలు దెబ్బతింటేనా పరిహారం జాబితాలో పేర్లు నమోదు చేస్తామని, లేకుంటే నష్టపోయినట్లుగా లెక్కల్లో పరిగణనలోకి తీసుకోమంటూ కిరణ్ స ర్కార్ మొండికేస్తోంది. ఒకవేళ ఏదైనా ఉపద్ర వం ముంచుకొచ్చి నష్టం జరిగినా మిగిలేది మొండిచెయ్యే కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశ రైతులు వదిలేశారు. -
మొద్దు నిద్ర వీడరే..
చీరాల, న్యూస్‌లైన్: సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బల్ని తవ్వేస్తున్నారు..కొండల్ని పిండి చేస్తున్నారు..అంతా అనధికారికంగా సాగిపోయే దోపిడీ. వేటికీ ప్రభుత్వ అనుమతులుండవు. ప్రకృతి సంపద కొల్లగొడుతున్న అక్రమార్కులకు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు, సిబ్బందికి మాత్రం కాసులే..కాసులు. ఈ అక్రమాన్ని అరికట్టాల్సిన మైనింగ్ శాఖ మౌనంగా కళ్లకు గంతలు కట్టుకుని ఉంది. బరితెగిస్తున్న అక్రమార్కుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ శాఖలోని అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈనెల 19న రోడ్డెక్కనున్నారు. అక్రమాలకు వంత పలుకుతున్న మైనింగ్ అధికారులను సాగనంపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టనున్నారు. వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇసుక మాఫియా గురించే. సీజన్, అన్‌సీజన్ అన్న తేడా లేకుండా ఈ ప్రాంతం నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుక తరలిపోతోంది. వీటిలో తొంభై శాతం అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నవే. కేవలం పది మందికి సిలికా పేరుతో ఇసుకను ఒక పరిధిలో మాత్రమే తవ్వుకునే అవకాశం ఉంది. కానీ జరుగుతున్న దందా మరో విధంగా ఉంది. కేవలం ఇసుకను తరలించేందుకు ప్రత్యేకమైన క్యాబిన్ తయారు చేసిన లారీల్లో ముప్పై నుంచి నలభై టన్నుల ఇసుకను నింపి హైదరాబాద్‌తో పాటు పలు నగరాలకు తరలిస్తున్నారు. ఒకనాటి ఇసుక దిబ్బలన్నీ పెద్ద గొయ్యిలుగా మారి చెరువులను తలపిస్తున్నాయి. ఈ విధంగా కొన్నేళ్లు సాగితే గతంలో ఇక్కడ ఇసుక దిబ్బలు ఉండేవంటా అని భావి తరాల వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇందులో అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులతో పాటు చాలా మంది హస్తం ఉంది. ఈ విషయంపై అనేక సార్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాల్టా చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిషేధం. అయినప్పటికీ మైనింగ్ శాఖ మాత్రం మౌనం వీడటం లేదు. రోజు వందల సంఖ్యలో వెళ్తున్న లారీల జోలికి అసలు వెళ్లడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఒకటి, రెండు లారీలను పట్టుకొని తమ పని అయిపోయినట్లుగా భావిస్తోంది. -
దొంగలు పడిన ఆర్నెల్ల్లకు..
చీరాల, న్యూస్‌లైన్ : టన్నులకొద్దీ ఇసుకతో రోజుకు 350 నుంచి 400 లారీలు వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల నుంచి అక్రమంగా తరలి వెళ్తుంటాయి. ఇది రోజూ జరిగే తంతే. ఇదేదో చాటుమాటున జరిగే వ్యవహారం కూడా కాదు. బహిరంగంగా, బరితెగించి పగలు..రాత్రి అన్న తేడా లేకుండా ఇసుక దిబ్బలను కొన్నేళ్లుగా కొందరు అక్రమార్కులు తోడేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద ఎత్తుగా ఉండే ఇసుక దిబ్బలు ఇప్పుడు ఇరవై అడుగుల లోతుగా మారి నీటి కుంటలయ్యాయి. వాల్టా చట్టం చట్టుబండలైంది. కేవలం శాస్త్రీ్తయ్ర పద్ధతి ద్వారా సిలికా ఇసుకను తవ్వుకునేందుకు మాత్రమే కొద్ది మందికి అనుమతి ఉంది. అదీ కూడా కొన్ని ఎకరాల పరిధిలో మాత్రమే. కానీ వేటపాలెం, చినగంజాం, చీరాల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలను తవ్వేశారు. ఈ అక్రమ తవ్వకాలకు అధికార పార్టీకి చెందిన బడా నేతలతో పాటు అనేక మంది అండగా ఉన్నారు. ఇన్నాళ్లూ అధికారులెవరూ దాడులు చేసిన దాఖలాలు లేవు. రోజూ వందల సంఖ్యలో వెళ్తున్న లారీలను వదిలి అప్పుడప్పుడు ఒకటో రెండో ట్రాక్టర్లను పట్టుకొని జరిమానాలు విధించి డాబుగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవారు. ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్‌ల్లో నీరు చేరడంతో అందరూ ఈ ప్రాంతంపై పడ్డారు. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత అన్నట్లుగా అడ్డగోలుగా ఇసుకను తవ్వేశారు. పోలీసుస్టేషన్‌కు, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఠంచన్‌గా మామూళ్లు ముట్టాయి. ఇవి కాక లారీలు వెళ్లే సమయంలో ఆపిన పోలీస్ సిబ్బందికి, ఇతర అధికారులకు దారి పొడవునా మామూళ్లు ముట్టచెప్పి లారీలు బయల్దేరేవి. ఈ వ్యవహారం కొన్నేళ్ల పాటు జరిగిపోయింది. పత్రికలు కోడై కూశాయి. ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. దొంగలు పడిన ఆరు నెలలకు.. అన్న చందంగా భారీ ఎత్తున తర్వాత ఏమైందో ఏమో కానీ మేము నిద్ర లేచింది ఇప్పుడే అన్నట్లుగా వేటపాలెం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇసుక తవ్వకాలపై దాడులు జరిపారు. జిల్లా అధికారుల అదేశాల మేరకు మండల పరిధిలోని పందిళ్లపల్లి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న పది లారీలు, మూడు ట్రాక్టర్లను అధికారులు శనివారం పట్టుకున్నారు. పట్టుకున్న వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. లారీలకు, ట్రాక్టర్లకు జరిమానా విధించాల్సిందిగా మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఆర్ఐ రాజేశ్, వీఆర్వోలు సత్యనారాయణ, ఎస్సై అంకబాబు పాల్గొన్నారు. -
వట్టిదే..!
చీరాల, న్యూస్‌లైన్: ‘భారీ వర్షాలు, వరదలకు ముంపునకు గురైన పొలాల రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతులకు సబ్సిడీతో కూడిన వరి, శనగ విత్తనాలందిస్తాం.’ ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా పర్చూరులో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలివి. సబ్సిడీ విత్తనాలు ఇస్తామన్న కిరణ్‌కుమార్‌రెడ్డి సాగు సమయం మించిపోతున్నా వాటి ఊసే మరిచిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తామని చెప్పగా వ్యవసాయాధికారులు మాత్రం అటువంటి విత్తనం వచ్చే అవకాశం లేదనడం చూస్తే ప్రభుత్వానికి రైతులపై ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొమ్మమూరు ఆయకట్టు కింద ఉన్న కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో వేసిన వరి ముంపునకు గురై పనికి రాకుండా పోయింది. కొమ్మమూరు ఆయకట్టు కింద లక్ష ఎకరాల్లో వరి సాగవుతుంది. మామూలుగా 92 రకం వరి పైరును సాగు చేస్తారు. అకాల వర్షాలకు ముంపునకు గురై, సాగుకు సమయం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులకు ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి విత్తనాలను అందించాలని వ్యవసాయాధికారులు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రిని పర్చూరులో జరిగిన సమీక్ష సమావేశంలో కోరారు. వెంటనే సీఎం ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, అక్కడ నుంచి తెప్పించి రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చి రెండు వారాలు గడుస్తున్నా ఎన్‌ఎల్‌ఆర్ 145 విత్తనం జిల్లాకు రాలేదు. అలానే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఈ విత్తనం అందుబాటులో లేదని వ్యవసాయాధికారులంటున్నారు. ఈ విత్తనం వచ్చే అవకాశం కూడా లేదని తేలింది. అంటే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు రైతులకు అందే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే నవంబర్ కూడా రావడంతో వరి సాగు చేసే సమయం మించిపోతోంది. ప్రస్తుతం ఆ విత్తనం వచ్చినప్పటికీ రైతులకు ప్రయోజనం ఉండదు. ఇప్పటికే రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి 10010 అనే రకం విత్తనాన్ని 30 కేజీల బస్తా రూ 1200 చొప్పున కొనుగోలు చేసి నార్లు పోశారు. ఎన్‌ఎల్‌ఆర్ 145తో మేలు... ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి విత్తనం సాగుకు అనుకూలంగా ఉంటుంది. 145 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ముఖ్యంగా పైర్లకు తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే 10010 రకానికి అయితే తెగుళ్లు అధికంగా ఆశిస్తాయి. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండదు. ఏడీఏ ఏమంటున్నారంటే... ‘ఈ ప్రాంతంలో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనం సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నివేదించాం. కానీ నెల్లూరు జిల్లాలో కూడా ఆ విత్తనం అందుబాటులో లేదు. రైతులు ప్రస్తుతం వేస్తున్న 10010 రకం విత్తనాలకు తెగుళ్లు అధికంగా ఆశించే అవకాశం ఉంది. రైతులు ఎన్‌ఎల్‌ఆర్ 145 బదులుగా ఎన్‌ఎల్‌ఆర్ 344499 రకాన్ని సాగు చేయడం మంచిది’ అని ఏడీఏ మస్తానమ్మ తెలిపారు. -
మగ్గం విలాపం
చీరాల, న్యూస్‌లైన్ : చాలీచాలని మజూరీలతో అవస్థ పడుతూ రంగురంగుల చీరలు నేస్తున్న నేతన్నల కోసం చేనేత ప్రత్యేక పరపతి బ్యాంక్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏడాది క్రితం ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. కుటుంబమంతా కలిసి పని చేస్తే పూట గడవని దుస్థితి వారిది. అప్పులు.. అనారోగ్యం.. ఆత్మహత్యలే ఆస్తులుగా మారాయి. వ్యవసాయం తర్వాత అతి పెద్ద వృత్తయిన చేనేత రంగానికి చేయూతనిస్తామని కొన్నేళ్లుగా చెబుతున్న ప్రభుత్వాలు చివరకు ‘చెయ్యి’స్తున్నాయి. ప్రభుత్వ పథకాలు కార్మికులకు చేరడం గగనంగా మారింది. ఆకలి..అనారోగ్యం.. వంటి సమస్యలతో ఎముకల గూడులాంటి శరీరాలతో చేనేత కార్మికులు జీవ చ్ఛవాలుగా మారారు. వారం రోజులు కురిసిన భారీ వర్షాలకు నేతన్నల మగ్గం మూగబోయింది. వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేతన్నల పరిస్థితి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన రాకతోనైనా చేనేతల కష్టాలు తీరుతాయో లేక ఎప్పటిలాగే ‘చెయ్యి’ ఇచ్చి వెళ్తారో వేచి చూడాలి. అరకొరగా క్రెడిట్ కార్డు రుణాలు చేనేతలకు క్రెడిట్ కార్డు స్కీం కింద రుణాలు అరకొరగా మంజూరు చేశారు. అధికార పార్టీ మెప్పు ఉన్న వారికి తప్ప మిగిలిన వారికి రుణాలు అందించలేదు. జిల్లాలో 33184 చేనేత మగ్గాలున్నాయి. 24 వేల కుటుంబాలు చేనేత వృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలో 68 చేనేత సహకార సంఘాలు పని చేస్తున్నాయి. చేనేత రుణాల కోసం 8,500 వేల మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం 1920 మందికి మాత్రమే రుణాలందాయి. ఒక్కొక్కరికి రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించి చేతులు దులుపేసుకున్నారు. రుణాల కోసం నేతన్నలు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అందని సబ్సిడీ జిల్లాలో సహకారేతర రంగంలో ఉన్న 80 వేల మంది చేనేత కార్మికులకు కూడా రంగు, రసాయనాలు, చిలపనూలు కొనుగోలుపై పది శాతం సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం 2008 మార్చిలో జీవో నంబర్-77 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క చేనేత కార్మికునికి కూడా సబ్సిడీపై చిలపనూలు, రంగు, రసాయనాలు అందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పేరుకు మాత్రం సబ్సిడీ పథకాలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేస్తుందే తప్ప వాటి అమలుపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోంది. ప్రకటనలకే పరిమితం చేనేత రంగం అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక చేనేత పరపతి బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడుసార్లు ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోలేదు. నూలు పాసు పుస్తకాలు ఇస్తామని కూడా చెప్పి వాటి గురించి పట్టించుకోవడం లేదు. క్రెడిట్‌కార్డు రుణాలు కూడా సక్రమంగా ఇవ్వలేదు. రాష్ట్రంలో నాలుగు లక్షల మగ్గాలుంటే కేవలం నలభై వేల మందికి మాత్రమే క్రెడిట్ కార్డు రుణాలు అందించారంటే చేనేతలపై కిరణ్ సర్కార్ సవతి ప్రేమ చూపుతోందని అర్థమవుతోంది. నూలును ఎన్‌హెచ్‌డీసీ (నేషనల్ హ్యాండ్లూమ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా అందిస్తామని చెప్పి హామీ కూడా నెరవేరలేదు. ఒక్క చీరాల నియోజకవర్గానికే నెలకు సగటున వెయ్యి నూలు బేళ్లు అవసరమవుతుండగా ప్రభుత్వం కేవలం రెండు వందల బేళ్లను మాత్రమే పంపడంతో అధిక ధరలకు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేతన్నల ఇబ్బందులను గుర్తించడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచన వేసేందుకు విపత్తు నివారణ నష్టపరిహార కమిటీ వేస్తామని చెప్పిన సీఎం మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. నేతన్నలను కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప వారి అభ్యున్నతికి పాటుడింది లేదు. -
ముంపు ఆగేదెన్నడు?
చీరాల, న్యూస్‌లైన్ : కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని కొమ్మమూరు రైతాంగం ముంపు బారి నుంచి బయటపడటం గగనంగా మారింది. ఏటా వ్యవసాయ సీజన్లో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా వ్యయ ప్రయాసలతో వేసిన పంటలు ముంపునకు గురై రైతులు నష్టాలపాలవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నోటిదాకా వచ్చేలోగా నీళ్లపాలవుతున్నాయి. డెల్టా రైతాంగానికి ఇటువంటి కన్నీటి కష్టాలు ఏటా మామూలే. ముంపు నుంచి బయట పడేందుకు చేపట్టిన కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు ప్రహసనంగా మారాయి. ఎప్పుడో పూర్తికావాల్సిన పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత కారణంగా మందకొడిగా సాగుతున్నాయి. రొంపేరు కుడి, ఎడమ కాలువలతో పాటు అనేక మేజర్, మైనర్ మురుగునీటి కాలువులను ఆధునికీకరించాల్సి ఉంది. ప్రధానంగా రొంపేరు కుడి, ఎడమ కాలువలను ఇప్పటి కంటే మరో 25శాతం వెడల్పు చేయాల్సి ఉంది. ఇది పూర్తయితే భారీగా వచ్చే వరదనీరు నేరుగా సముద్రంలో కలుస్తుంది. లేకుంటే వరదనీరు పంట పొలాలను ముంచెత్తుతుంది. 2006 నుంచి మొదలు.. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని వ్యవసాయ మురుగునీటి కాలువల ఆధునికీకరణకు 2006లో ప్రభుత్వం రూ. 130 కోట్లు కేటాయించింది. మూడు సార్లు టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ కొలిక్కిరాలేదు. చివరకు రెండేళ్ల క్రితం టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మాత్రం నత్తతో పోటీపడుతున్నారు. వ్యవసాయ మురుగునీటి కాలువలు బ్రిటీష్ హయాంలో నిర్మించారు. అవి ప్రస్తుతం పూర్తిగా పాడయ్యాయి. వర్షాలు, తుపాన్ల సమయంలో కురిసే భారీ వర్షాలకు పంటలను ముంపు నుంచి కాపాడేందుకు ఈ మురుగునీటి కాలువలే దిక్కు. ఎగువ ప్రాంతాల నుంచి పంట పొలాలకు అనుసంధానమవుతూ చివరకు సముద్రంలో కలుస్తుంటాయి. కొన్నేళ్లుగా మురుగునీటి కాలువలు పనికి రాకుండా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వర్షాలకే పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. జరిగింది రూ. 40 కోట్ల పనులే ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం రూ. 40 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయయ్యాయి. రొంపేరు, కుడి, ఎడమ కాలువులు, మరికొన్ని మేజర్, మైనర్ కాలువలను మాత్రమే కొంత మేర తవ్వారు. ఇంకా కాలువల వెడల్పు చేయాల్సి ఉంది. వ్యవసాయ సీజన్ ముగిసిన తర్వాత అంటే.. వేసవి కాలంలోనే ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉంది. మరో ఏడాదిన్నరతో కాంట్రాక్టర్లకు కాలపరిమితి ముగియనుంది. ఆధునికీకరించాల్సిన కాలువలు ఇవే.. రొంపేరు రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, వేటపాలెం, ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ కాలువలు, కుందేరు డ్రెయిన్, పర్చూరు వాగు, ముప్పాళ్ల వాగు, మద్దిరాల వాగు, సాకి డ్రెయిన్, పర్చూరు సబ్‌ప్లస్, నక్కలవాగు, ఆలేరు, అప్పేరు వాగులు, ఈదుమూడి, మట్టిగుంట, నాగండ్ల వాగులతో పాటు మొత్తం 27 డ్రెయినేజీ కాలువలను ఆధునికీకరించాల్సి ఉంది. డ్రైయినేజీ కాలువల వ్యవస్థ సక్రమంగా ఉంటే ముంపు నుంచి పంటలు దెబ్బతినే పరిస్థితి ఉండదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షం నీరు డ్రైయినేజీ కాలువల ద్వారా నేరుగా సముద్రంలో కలుస్తాయి. దీంతో పంటలు ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం కాలువలు అధ్వానస్థితికి చేరటంతో కొద్దిపాటి వర్షాలకే పంటపొలాలు మునుగుతున్నాయి. -
400 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
చీరాల, న్యూస్‌లైన్: పేదవాడికి గూడు కోసం ఏళ్ల తరబడి చెప్పులరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సెంటు భూమి కూడా ఇవ్వరు. అదేమంటే ప్రభుత్వ భూములు ఈ ప్రాంతంలో ఎక్కడా లేవని సెలవిస్తారు. కానీ కండబలం, అధికార పార్టీ అండదండలుంటే చాలు సర్కారు భూముల్ని కబ్జా చేసినా అదేమని అడిగేవారుండరు. చీరాలలో కోట్ల రూపాయల విలువ చేసే డ్రైనేజీ శాఖ భూములు ఇలా ఆక్రమణదారుల కబందహస్తాల్లో చిక్కుకుంటున్నాయి. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి రొయ్యల చెరువులు వేసినా..ఆశాఖాధికారుల కళ్లకు కనిపించడం లేదు. దాదాపు 400 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వివరాల్లోకి వెళితే..వ్యవసాయ భూముల నుంచి వచ్చే మురుగునీరు, వర్షాల సమయంలో వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కుడి మురుగునీటి కాలువను ఏర్పాటు చేశారు. వరద నీరు, పొలాల నుంచి వచ్చే మురుగు నీరంతా ఈ కాలువ నుంచి పెదగంజాం వద్ద సముద్రంలో కలుస్తుంది. భవిష్యత్తులో కాలువ వెడల్పు పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందు చూపుగా డ్రైనేజీ శాఖ కాలువకు ఇరువైపులా 400 ఎకరాల వరకు ఉంచింది. కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కాలువ 35 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అదే పొడవున ఆశాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కాలువ పక్కనే ఉన్న భూముల్ని ఆక్రమించుకుని కొందరు వ్యవసాయం చేస్తుండగా మరికొందరు ఏకంగా రొయ్యల చెరువులను తవ్వి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. కారంచేడు నుంచి పందిళ్లపల్లి వరకు 200 ఎకరాలను ఆక్రమించుకుని వరిసాగు చేస్తుండగా, పందిళ్లపల్లి నుంచి పెదగంజాం వరకు 200 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్న భూముల్లో రొయ్యల చెరువులు తవ్వారు. ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారం నిరాటంకంగా సాగుతున్నా సంబంధిత డ్రైనేజీ శాఖ వాటిని కాపాడుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆక్రమిత భూములకు పట్టాలు: భూములను ఆక్రమించుకున్న కొందరికి రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిదేళ్ల క్రితం బీ-ఫారాల పట్టాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే నకిలీ పట్టాలిచ్చారనే ఆరోపణలున్నాయి. డ్రైనేజీ శాఖ భూములు బదలాయింపు జరగకుండా బీ-ఫారాలు ఇవ్వడం అక్రమం. రొంపేరు ఆధునికీకరణకు భూమి కరువు: ఇదిలా ఉంటే రూ.130 కోట్లతో మురుగు కాలువల ఆధునికీకరణలో భాగంగా రొంపేరు కాలువలను ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాలువ కంటే 20 శాతం వెడల్పున కాలువను విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టారు. గతేడాది ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా డ్రైనేజీశాఖ తమ భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినా నేటికీ వారు ముందుకు రాలేదు. ఆధునికీకరణ జరగాలంటే తప్పనిసరిగా ఆక్రమణలో ఉన్న కొందరి భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొంపేరు భూములకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఇంకా మిగిలి ఉన్న భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. పెపైచ్చు తాము సాగు చేస్తున్నాము కనుక భూమిపై హక్కు తమకే ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి ఐదు ఎకరాలకు పైగా ఆక్రమించుకొని వరి, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నారు. చాలా మంది ఈ భూములను తమ సొంత భూములుగా భావించి ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా అమ్మేసుకుంటున్నా సంబంధిత డ్రైనేజీ శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కనీసం అక్రమార్కులకు నోటీసులు కూడా ఇవ్వకపోవడం విశేషం. కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నా వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోవడంతో ప్రస్తుతం ఆధునికీకరణ పనులకు అవసరమైన భూమి కూడా డ్రైనేజీ శాఖకు లేకపోవడం గమనార్హం. కాలువనూ తవ్వేస్తున్నారు... ప్రస్తుతం వేటపాలెం, చినగంజాం మండలాల్లో రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. రొంపేరు డ్రైనేజీ కోసం నిర్మించిన భారీ కరకట్టలను పొక్లెయిన్లతో తవ్వేసి రొయ్యల చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే డ్రైనేజీ మిగులు భూములు ఆక్రమణలకు గురికాగా ప్రస్తుతం కరకట్టలను సైతం తవ్వేసి రొయ్యల చెరువులను ఏర్పాటు చేస్తుండటంతో రొంపేరు డ్రైనేజీకి ముప్పు వాటిల్లనుంది. ఎగువ ప్రాంతం నుంచి కురిసిన భారీ వర్షాలు, తుఫాను వంటి విపత్తు సమయాల్లో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా కాపాడేవి రొంపేరు డ్రైనేజీలే. అటువంటి ప్రాధాన్యత ఉన్న డ్రైనేజీ భూములను కబ్జా చేయడంతో పాటు కరకట్టలు సైతం తవ్వేస్తున్నారు. డ్రైనేజీ భూములను తవ్వి రొయ్యల చెరువుగా ఏర్పాటు చేస్తున్న వారిలో అధికంగా అధికార పార్టీకి చెందిన నేతలున్నారు. దీంతో ఆ శాఖాధికారులు కళ్లకు గంతలు కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులు ఆడిందే అట... పాడిందే పాటగా సాగుతోంది. ఆక్రమణదారులకు నోటీసులిస్తాం.. డ్రైనేజీ శాఖ ఈఈ సుధాకర్ రొంపేరు కుడి కాలువపై జరుగుతున్న ఆక్రమణలు ఇటీవల మా దృష్టికి వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునేందుకు మా అధికారులను ఆదేశించాం. త్వరలో అక్రమంగా చెరువులు తవ్వుతున్న వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. -
రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
చీరాల అర్బన్, న్యూస్‌లైన్ : రైలు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన చీరాల రైల్వేస్టేషన్లో శనివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన గుర్రం ప్రేమ్‌కుమార్ (25) బ్యాండ్‌మేళం బృందంలో పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చీరాల వచ్చాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి పెదవడ్లపూడి వెళ్లేందుకు మధ్యాహ్నం చీరాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వెళ్లేందుకు ట్రాక్ దాటుతున్న సమయంలో కన్యాకుమారి నుంచి హెచ్.నిజాముద్దీన్ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్రేమ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వద్ద లభించిన సెల్‌ఫోన్, ఓటర్ కార్డు ఆధారంగా జీఆర్పీ పోలీసులు వివరాలు తెలుసుకుని బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ మస్తాన్‌షరీఫ్ తెలిపారు.