
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
= మృతులు చీరాల ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు
= ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే
చీరాల : దీపావళి తర్వాత వెలుగులు నిండాల్సిన ఆ రెండు కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు విద్యార్థులను లారీ రూపంలో మృతువు కబళించింది. మరో గంటలో ఇంటికి చేరాల్సిన విద్యార్థులు విగతజీవులయ్యారు. వివరాలు.. చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న గుంటూరు జిల్లా కర్లపాలే చెందిన వై.రాజేష్( 21), పొన్నూరుకు చెందిన షేక్ నితిన్ షరీఫ్ (21)లు సోమవారం కళాశాల వదిలిన తర్వాత బైకుపై స్వగ్రామాలకు బయల్దేరారు.
కొత్తపేట బజాజ్ షోరూమ్ సమీపంలో బైపాస్‌లో లారీని ఢీకొట్టి ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. రాజేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా నితిన్ షరీఫ్ చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొత్తపేట నుంచి వడ్డే సంఘం వైపునకు ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. బైపాస్‌పై వాహనాలు వస్తుండటంతో అమె ఆగింది. ద్విచక్ర వాహనం ఆపే క్రమంలో అదుపుతప్పి ఆమె వాహనం కిందపడిపోరుుంది.
ఆమె ముందు వెళ్తున్న విద్యార్థులు వెనక్కి చూస్తూ బైకు నడుపుతూ అదుపుతప్పి ఎదురుగా వేగంగా వస్తున్న లారీ కిందపడి దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు అప్పటి వరకూ తమతోనే ఉన్న మిత్రులు కొద్దిసేపటికే విగజీవులవ్వడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహలను పొస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.