ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే (ఫైల్‌ఫోటో)
సాక్షి, ఆగ్రా : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్ సమీపంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం యూపీ రోడ్‌వేస్ బస్సు ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకుపోవడంతో వారు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ బస్సుతో సహా పరారయ్యాడు.
బీటీసీ చదువుతున్న విద్యార్థులందరూ హరిద్వార్‌కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వస్తున్న యూపీ రోడ్‌వేస్ బస్సు వీరి వాహనాన్ని ఢీ కొనే సమయంలో మరో బస్సుకు డీజిల్ పోస్తుండటంతో కొందరు విద్యార్థులు బస్సు దిగి ఉన్నారని, లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని చెబుతున్నారు. మృతుల్లో ఓ అథ్యాపకుడు సైతం ఉన్నారని సమాచారం.
ఘటనా స్థలానికి అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment