
లక్నో: యూపీలో అర్ధరాత్రి యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించారు. 15 మందికి గాయాలు కాగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు.. తప్పల్ వద్ద ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టింది. ఘటనలో ఐదుగురు చనిపోగా.. ఇందులో ఓ పసికందు, మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. మరో 15 మందికి గాయాలయ్యాయి.
ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తుక్కుతుక్కు అయ్యింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రుల్ని జెవార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
यमुना एक्सप्रेस वे पर हुआ बड़ा हादसा, कांच से भरे ट्रक और वोल्वो बस में हुई टक्कर
अलीगढ़ : यमुना एक्सप्रेसवे पर वोल्वो बस और काँच से भरे ट्रक की हुई भिड़ंत, टप्पल के समीप हुआ हादसा। एक दर्जन से अधिक यात्रियों के घायल होने की सूचना। यात्रियों के बीच मची चीख पुकार। PS TAPPAL… pic.twitter.com/NlsQHitlJp— Praveen Vikram Singh (@praveen_singh5) November 20, 2024
Comments
Please login to add a commentAdd a comment