Yamuna Express way
-
UP Accident: ఘోర బస్సు ప్రమాదం
లక్నో: యూపీలో అర్ధరాత్రి యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించారు. 15 మందికి గాయాలు కాగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు.. తప్పల్ వద్ద ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టింది. ఘటనలో ఐదుగురు చనిపోగా.. ఇందులో ఓ పసికందు, మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తుక్కుతుక్కు అయ్యింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రుల్ని జెవార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. यमुना एक्सप्रेस वे पर हुआ बड़ा हादसा, कांच से भरे ट्रक और वोल्वो बस में हुई टक्करअलीगढ़ : यमुना एक्सप्रेसवे पर वोल्वो बस और काँच से भरे ट्रक की हुई भिड़ंत, टप्पल के समीप हुआ हादसा। एक दर्जन से अधिक यात्रियों के घायल होने की सूचना। यात्रियों के बीच मची चीख पुकार। PS TAPPAL… pic.twitter.com/NlsQHitlJp— Praveen Vikram Singh (@praveen_singh5) November 20, 2024 -
Up: యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మధుర పరిధిలోని మహవాన్ వద్ద యమునా ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది. ఈ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా కాలిపోయి అందులోని వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సులో ఉన్నవారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ఇదీ చదవండి.. పారా గ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి -
రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో..
ఒక చోట అని కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు డ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు భదత్రకు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతకు సంబంధించి నిత్యం అధికారులు జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తమ జీవితాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టుతున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మరణించాడు. ఉత్తరాఖండ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసి అయిన అగస్త్య చౌహాన్ ప్రొఫెషనల్ బైకర్. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే మోటార్‌బైక్ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని టప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకు చేరుకోగానే.. గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి ప్రయత్నించాడు. బైక్ వేగంగా దూసుకుపోతున్న సమయంలో అతడు ఒక్క సారిగా తడబడ్డాడు. దీంతో అగస్త్య బైక్ అదుపుతప్పి యమునా ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం దాటికి అతను ధరించి ఉన్న హెల్మెట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మొదటిసారిగా ఈ సాహసం చేసిన అగస్త్య దుర్మరణం చెందడంతో అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా అగస్త్యకు ‘PRO RIDER 1000’ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి 1.2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. వేగంగా బైక్ నడుపుతూ స్టంట్లు చేస్తున్న వీడియోలను తన ఛానెల్లో అప్లోడ్ చేసేవాడు. ప్రమాదం జరగడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. వేగంగా వాహనాలు నడపడం ప్రమాదకరం అని తన ప్రతి వీడియోకు హెచ్చరికలు సైతం జారీ చేసేవాడు. చివరికి అదే వేగంతో తన ప్రాణాలు కోల్పోయాడు. -
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్‌ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి. ‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు. చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు. అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్‌కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు. ‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్. అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్‌ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్‌కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర. అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్‌లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు. కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు. హెల్మెట్‌ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది. -
విషాదం: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బస్సు బోల్తాపడిన ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. వివరాలు.. ఆగ్రా ఖండౌలి ప్రాంతంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో గురువారం ఉదయం 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది. చదవండి: ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే! -
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
-
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
లక్నో: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచుతో వెలుతురు సరిగాలేని కారణంగా పాదచారులతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా గ్రేటర్ నోయిడా దన్కౌర్ ప్రాంతంలో గౌతమ్ బుద్ధా నగర్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద సుమారు పది వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ..భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం పది గంటలైన పొగమంచు వీడకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పొగమంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీని పొగమంచు చుట్టుముట్టేసిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఢిల్లీ సర్కార్ పాఠశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించింది. కాగా యమునా ఎక్స్‌ప్రెస్ వేపై 2016 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. -
యమున ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదాలు
మథుర: ఉత్తరప్రదేశ్ దట్టంగా కురుస్తున్న పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యమున ఎక్స్ ప్రెస్ హైవేపై పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 12 వాహనాలు ఎదురెదురుగా ఒకదాన్ని మరొకటి ఢీ కొన్న ఈ ఘటనల్లో ఓ వ్యక్తి మరణించగా, పది మందికిపైగా గాయాలపాలయ్యారు. -
డివైడర్‌ను ఢీకొన్న కారు; ఐదుగురు దుర్మరణం
యూపీ: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో యుమున ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. యువన ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. -
యమునా ఎక్స్‌ప్రెస్ వేపై పోలీసు నిఘా
గ్రేటర్ నోయిడా: యమునా ఎక్స్‌ప్రెస్ వే పోలీసు నిఘాను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ రహదారిలో వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం, అధిక వేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడటం, ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కేసు నమోదుచేసుకునే విషయంలో పోలీసుల మధ్య అంతరం రావడం తదితర అంశాలన్నింటినీ పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఇందుకోసం అంకిత భావంతో పనిచేసే పోలీసు బృందాన్ని ఈ నెలాఖరులోగా నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వ అధికారులు, హైవే అథారిటీ సభ్యుల మధ్య లక్నోలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు చొరవ తీసుకుంటోంది. అంతా సవ్యంగా సాగితే ఈ నెలాఖరులోగా హైవేపై పటిష్టమైన పోలీసు బృందం విధులు నిర్వర్తించే అవకాశముంది. తద్వారా వేలాది మంది ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుందని నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్ వే అథారిటీస్ చైర్మన్ రమ రమణ్ తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో ఉన్న ఈ హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు అధికార పరిధిపై ఆయా ప్రాంత పోలీసుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని చెప్పారు. ఇలాంటి సంఘటనలను నిలువరించి వ్యవస్థను సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు పోలీసుల సంఖ్యను పెంచాలని తెలిపారు. అధికార పరిధి విషయంలో పోలీసుల మధ్య తలెత్తుతున్న విభేదాలకు చెక్ పెట్టేందుకు 165 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవేను ప్రత్యేక జోన్ జిల్లాగా పరిగణించేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించే అవకాశముందని ఆయన వివరించారు. సర్కిల్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, ఇతర సిబ్బందితో ఉన్న పోలీసు బృందానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ) సారథ్యం వహిస్తారని రమ రమణ్ తెలిపారు. ఒక్కసారి ప్రత్యేక జిల్లా జోన్‌గా ప్రకటిస్తే ఈ హై స్పీడ్ లింక్‌పై శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న గౌతమ్ బుధ్ నగర్, బుల్దాన్సార్, మాతురా, హత్రాస్, అలీగఢ్, ఆగ్రా పోలీసులకు అధికారాలు ఉండవని చెప్పారు. సర్కిల్ అధికారుల నియామకంపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను కోరామన్నారు. గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రా వరకు మధ్యలో పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. అయితే హైవే వెంట విధులు నిర్వర్తించే పోలీసులకు గృహ వసతితో పాటు కార్యాలయ భవన సౌకర్యాలను కూడా కల్పిస్తామని తెలిపామన్నారు, ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై తగిన సంఖ్యలో పోలీసులు లేకపోవడంతో వారి డిమాండ్ల సాధన కోసం రైతులు కూడా రహదారిపై ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకునే సరికి ఆలస్యమవుతోందని, ఫలితంగా ప్రమాద నష్టం పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతోందని వివరించారు. ఈ రహదారిపై పోలీసులు లేకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా వాహన చోదకులు 150, అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఒకవేళ పోలీసు సంఖ్యను పెంచితే సురక్షిత ప్రయాణం ఆచరణ రూపంలోకి వచ్చే అవకాశముందని చెప్పారు. ‘ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వచ్చే విదేశీ పర్యాటకులు ఈ హైవేపై పోలీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటకు 100 కిలోమీటర్ పోవాల్సినవారు అతివేగంతో వెళుతున్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు అధికార పరిధి గురించి పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. దీంతో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టాలంటే మంచి పోలీసులు నియమించడమే ఉత్తమ ఆలోచన అని’ ఒర్రిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అమిత్ గుప్తా అభిప్రాయపడ్డారు.