పది కార్లు ఒకదానికొకటి..ఢీ | Ten vehicles collide on Yamuna Expressway in Gautam Buddha Nagar | Sakshi
Sakshi News home page

పది కార్లు ఒకదానికొకటి..ఢీ

Published Wed, Nov 8 2017 6:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.  పొగమంచుతో వెలుతురు సరిగాలేని కారణంగా  పాదచారులతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా  గ్రేటర్ నోయిడా దన్‌కౌర్ ప్రాంతంలో గౌతమ్‌ బుద్ధా నగర్‌ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద సుమారు పది వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ..భయంతో  బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement