Fog disrupts
-
బెంబేలెత్తిస్తున్న పొగమంచు.. ఢిల్లీ అతలాకుతలం
ఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో(zero visibility) రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 100 దాకా విమానాలు, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఇక రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉండగా.. చలి కారణంగా వేళల్లో మార్పులు చేశారు. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు గంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోరుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
-
భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు వీలులేక బెంగుళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగుళూరు నుంచి సుమారు 50మంది ప్రయాణికులతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం సుమారు అరగంట పాటు 8 సార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి వచ్చిన మరో ఇండిగో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టాయి. దాదాపు 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో పాట్నాకి దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! -
7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దాంతో గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇక శనివారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాలిలో చక్కర్లు కొట్టింది. 7 సార్లు చక్కర్లు కొట్టిన అనంతరం దిగేందుకు వీలులేక హైదరాబాద్ వెనుదిరిగింది. -
40 నిమిషాలు గాల్లోనే చక్కెర్లు కొట్టిన విమానాలు
గన్నవరం : దట్టమైన పొగమంచు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు సుమారు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తెల్లవారుజాము నుంచి గన్నవరం విమానాశ్రయంలో రన్‌వేని పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రూజెట్ విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. అలాగే హైదరాబాద్-విజయవాడ-బెంగళూరు స్పైస్ జెట్, హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానాలు ల్యాండింగ్‌కు అవకాశం లేకపోవడంతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరుల నుండి కనెక్టివిటీ విమానాలలో వెళ్ళవలసిన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. -
చెన్నైను కమ్మేసిన పొగమంచు..
సాక్షి, చెన్నై : చెన్నై నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో పొగమంచు భారీగా పేరుకుపోవడంతో అధికారులు.. 12 విమానాలను దారి మళ్లించారు. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన మరో 30 విమానాలు ఆలస్యంగా వెళ్లనున్నాయి. విమానాలు బయలుదేరడానికి కనీసం 400 మీటర్ల మేర విజిబులిటి ఉండాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పొగమంచు కారణంగా 50 మీటర్ల విజిబులిటి మాత్రమే ఉండటంతో విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు...విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. మరోవైపు చెన్నై నుంచి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి నాలుగు విమానాలు రావల్సి ఉండగా, వెలుతురు సరిగా లేకపోవడంతో ఆ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
-
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
లక్నో: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచుతో వెలుతురు సరిగాలేని కారణంగా పాదచారులతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా గ్రేటర్ నోయిడా దన్కౌర్ ప్రాంతంలో గౌతమ్ బుద్ధా నగర్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద సుమారు పది వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ..భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం పది గంటలైన పొగమంచు వీడకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పొగమంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీని పొగమంచు చుట్టుముట్టేసిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఢిల్లీ సర్కార్ పాఠశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించింది. కాగా యమునా ఎక్స్‌ప్రెస్ వేపై 2016 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. -
పొగమంచుతో 90 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: పొగమంచు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రభావం చూపింది. పొగ మంచు దట్టంగా అలముకోవడంతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు మూడు గంటల పాటు విమానాలు నిలిచిపోయాయి. సుమారు 150 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడవం, కొన్నింటిని దారి మళ్లించారు. మంచు కారణంగా వెలుతురు మందగించడంతో పలు విమానాలు రద్దు చేశారు. గత రాత్రి 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల మధ్యలో 90 విమానాలు రద్దు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. పొగమంచుతో రైళ్ల రాకపోకలకు కూడా ఆటంకం కలిగింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రద్దయ్యాయి. ఉదయం సమయంలో రోడ్లపై వాహనాలు సంచారం చాలా తక్కువగా ఉంది. -
ఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. కనెక్టింగ్ ఫ్లైట్, ట్రైన్ పట్టుకోలేకపోతున్నామని, దీంతో చాలా సమయం వృధా అయిపోతోందని ప్రయాణికులు అంటున్నారు. అయితే ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు. పొగమంచు కారణంగా పగటిపూట కూడా లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్లల్లోంచి బైటకు రావాలంటేనే భయమేస్తుందని స్థానికులు వెల్లడించారు. డిసెంబర్ మాసంలోనే చలి ఇంతగా ఉంటే, ఇక జనవరిలో ఎలా ఉంటుందోనని హస్తినవాసులు గజగజలాడుతున్నారు. అలాగే పంజాబ్‌పై చలి పంజా విసిరింది. చలిగాలులతో అమృత్‌సర్‌వాసులు వణికిపోతున్నారు. మంటలు వేసుకుని ... గరం గరం ఛాయ్ తాగుతూ ... వెచ్చదనాన్ని పొందుతున్నారు. అయితే బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా విమానాలు విమానాశ్రయానికే పరిమితమైనాయి. అలాగే రైళ్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన చలి ఉండడంతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో చలికి గజగజలాడుతూ .. బస్సులు, రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.