several injured
-
సెంట్రల్ మెక్సికోలో కాల్పులు.. 19 మంది మృతి
మెక్సికో: మెక్సికో దేశంలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలో గుర్తు తెలియని వ్యక్తులు జరిగిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మిచోకాన్ రాష్ట్రంలోని లాస్ టినాజాస్ పట్టణంలో ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ ఉత్సవంలో గుమిగూడిన వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 19 మంది మృతదేహాలను గుర్తించినట్లు, వీరిలో 16 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలపై తుపాకీ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతమంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఫెడరల్ అధికారులు పనిచేస్తున్నారని మిచోకాన్ పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ కార్యాలయం ట్విటర్లో తెలిపింది. చదవండి: Ukraine: న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర తగలబడుతున్న అడవి.. పెను ముప్పు తప్పదా? కాగా మిచోకాన్ దాని పరిసర ప్రాంతం గునజుటో మెక్సికోలోనే అత్యంత హింససాత్మక ఘటనలు చోటుచేసుకునే రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నిత్యం కాల్పులు జరుపుతూ ఉంటాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయిల్ దొంగతనం సహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో కాల్పుల్లో ప్రతి ఏడాది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత -
బాణాసంచా పేలుడు : ఆరుగురు దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మిరేచి పట్టణంలో ఒక ఇంట్లో నిల్వ చేసిన బాణాసంచా పేలడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ యజమానితోపాటు మరో ఐదుగురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోవడంతో శిధిలాల కింద ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులున్నారు. మిరేచి పట్టణంలోని టాకియా ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మిరేచి పోలీస్ స్టేషన్ పరిధిలో నివించే మున్నీ దేవి (35) ఇంట్లో ఈ పేలుడు సంభవించిందని, అదే ఏరియాలో నివసిస్తున్న ఒక గిరిరాజ్‌తో పాటు ఆమె కూడా ఫ్యాక్టరీకి సహ యజమాని అని పోలీసులు తెలిపారు. ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ సంభవించిన ఈ పేలుడులో దేవితో పాటు అంజలి (8), రాధా (12), ఖుషీ (6), షీటల్ (18), రజనీ (14) మరణించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ సుఖ్లాల్ భారతి తెలిపారు. దేవీ కుమార్తెలు పూజ, మాధురితో మరో 12మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో బాణా సంచా తయారీకి దేవి, గిరిరాజ్‌లకు అనుతులున్నప్పటికీ, లెసెన్స్ చాలా పాతదని పేర్కొన్నారు. -
పధాని మోదీ పశ్చిమ బెంగాల్ ర్యాలీలో తొక్కిసలాట
-
పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు చనిపోగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ అలహాబాద్‌కు వెడుతుండగా రాయబరేలి, హరచాంద్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నో నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్విన్ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర సమాచారం నిమిత్తం హెల్ప్‌లైన్ నంబర్లు అధికారులు ప్రకటించారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్-బిఎస్ఎన్ఎల్-05412-254145, రైల్వే -027-73677 పాట్నా స్టేషన్ నం: బిఎస్ఎన్ఎల్-0612-2202290, 0612-2202291, 0612-220229, రైల్వే ఫోన్ నంబర్- 025-8328 ఎక్స్‌గ్రేషియా : ఈ ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం సభలో అపశ్రుతి,పలువురికి గాయాలు
-
చంద్రబాబు సభలో అపశ్రుతి
సాక్షి, మండపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేదికకు సమీపంగా ఉన్న కాలువలపై నడవటానికి వీలుగా ఏర్పాటుచేసిన రేకులు విరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అమాంతం కాలువలోకి కూరుకుపోయిన బాధితులను పోలీసులు పైకిలాగారు. సీఎం సభలో నాసిరకం ఏర్పాట్లపై జనం పెదవివిరిచారు. సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఏడాది లోగా ఇంటింటి నుంచి చెత్తను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పారు. ప్రతి ఇంట్లో ఎల్ఈడీ బల్బులనే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎం వెంట పలురువు మంత్రులు, టీడీపీ ముఖ్యులు కూడా ఉన్నారు. -
వరంగల్ నిట్‌లో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ
-
వరంగల్ నిట్‌లో తన్నుకున్న విద్యార్థులు
సాక్షి, వరంగల్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో జరిగిన స్ప్రింగ్ స్ప్రీ-2018 ముగింపు వేడుకల్లో అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు విద్యార్థి గ్రూపులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో త్రివంత్ అనే విద్యార్థి గాయపడటంతో అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడ్డ త్రివంత్ బీటెక్ సివిల్ తృతీయ సంవత్సరపు విద్యార్థి. మరోవైపు విద్యార్థుల గొడవ నేపథ్యంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో నిట్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. -
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
-
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
లక్నో: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచుతో వెలుతురు సరిగాలేని కారణంగా పాదచారులతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా గ్రేటర్ నోయిడా దన్కౌర్ ప్రాంతంలో గౌతమ్ బుద్ధా నగర్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద సుమారు పది వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ..భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం పది గంటలైన పొగమంచు వీడకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పొగమంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీని పొగమంచు చుట్టుముట్టేసిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఢిల్లీ సర్కార్ పాఠశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించింది. కాగా యమునా ఎక్స్‌ప్రెస్ వేపై 2016 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. -
బోను నుంచి తప్పించుకున్న పులి.. జనం దడదడ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జూలో ఒక ఆడపులి తన బోను నుంచి ఉన్నట్టుండి తప్పించుకుని బయటకు రావడంతో జనం ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. అందరూ పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆదివారం కావడంతో వేలాదిమంది ప్రజలు జూకు వచ్చారని, వాళ్లంతా పరుగులు పెట్టడంతో చాలామంది కిందపడి గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పులి ఎక్కడో చీకట్లోకి దూరిపోవడం.. అధికారులు అది ఎక్కడుందోనని వెతుకుతూ కంగారు పడటంతో దాదాపు గంట పాటు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. జూ మొత్తాన్ని ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించినా, చాలా కుటుంబాలు లోపలే ఇరుక్కుపోయాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే పులి దాడి చేసిందన్న వదంతులు కూడా వ్యాపించడంతో జనం మరింత భయాందోళనలకు గురయ్యారు. పులి ఉన్నట్టుండి తమవైపు దూకిందని.. అయితే అదృష్టవశాత్తు తమకు ఏమీ జరగలేదని ఓ కుటుంబ సభ్యులు తెలిపారు. ఎట్టకేలకు రాత్రి 7.30 గంటల సమయంలో పులి మళ్లీ కనిపించింది. అటవీశాఖ అధికారులు ఒక జీపు సాయంతో దాన్ని మళ్లీ బోనులో పెట్టారు. జూ బయట జరుగుతున్న పెళ్లి సందర్భంగా పెద్ద శబ్దంతో బ్యాండు మేళం పెట్టారని, ఆ శబ్దం వల్లే జమున (తప్పించుకున్న ఆడ పులి) చిరాకు పడి ఉంటుందని కొందరు జూ అధికారులు చెప్పారు. దానికితోడు కొంతమంది పిల్లలు తరచు దానిపై రాళ్లు వేశారని, ఆ సమయంలో వాళ్లను అపడానికి అక్కడ గార్డులు కూడా ఎవరూ లేరని చెప్పారు. -
థాయ్‌లాండ్ రిసార్టులో వరుస పేలుళ్లు
-
థాయ్‌లాండ్ రిసార్టులో వరుస పేలుళ్లు
థాయ్‌లాండ్‌లోని హువాహిన్ రిసార్టు సమీపంలో రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. దాంతో నలుగురు మరణించగా దాదాపు 20 మందివరకు గాయపడినట్లు థాయ్ పోలీసులు తెలిపారు. థాయ్ రాణి సిరికిట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు అక్కడ సెలవు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో పేలుళ్లు సంభవించాయి. వరుస సెలవులు రావడంతో హువాహిన్ రిసార్ట్ వద్దకు ఎక్కువ మంది జనం చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాబులు పేలాయి. దాంతో ఒక థాయ్ మహిళ సహా నలుగురు మరణించగా కొందరు థాయ్ పౌరులు, మరికొందరు విదేశీయులు గాయపడినట్లు స్థానిక డిప్యూటీ పోలీసు చీఫ్ సమీర్ యోసమ్రన్ తెలిపారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు బాంబులు 50 మీటర్ల దూరంలో పేలాయి. బాంబులు ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో ఇంకా తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక గొడవల వల్లే బాంబులు పేలి ఉంటాయని భావిస్తున్నారు. థాయ్ రాజు భూమిబాల్ (88), ఆయన భార్య సిరికిట్ ఇద్దరూ బ్యాంకాక్ ఆస్పత్రిలోనే ఉన్నారు. వాళ్లు కొంతకాలం పాటు హువాహిన్ ప్రాంతంలో కూడా నివసించారు. -
పట్టాలు తప్పి..ప్రాణాలు నిలిచి!
అప్పటి దాకా గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు వచ్చిన పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతలోనే కొన్ని బోగీలు కళ్లెదుటే కూలిపోతుండడం చూసి గాబరాపడ్డారు. డ్రైవర్ చాకచక్యంతో చివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వేలూరు: కన్యాకుమారిలో గురువారం రాత్రి 24 బోగీలతో ఐల్యాండ్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరుకు బయలుదేరింది. తెల్లవారుజాము 3.55 గంటల సమయంలో వేలూరు జిల్లా తిరుపత్తూరు సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. సిగ్నల్ అందిన వెంటనే రైలు బెంగళూరు వైపునకు బయలు దేరింది. సుమారు పది కిలో మీటరు దూరం వెళ్లిన వెంటనే 4.10గంటలకు రైలు బోగీలు భారీగా కుదుపులకు లోనయ్యాయి. గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోగా ఎస్4 నుంచి ఎస్ 9 వరకు ఆరు స్లీపర్ బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నాట్రంబల్లి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. తీవ్రగాయాలైన 20 మంది ప్రయాణికులను 108 అంబులెన్స్‌లో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని క్షత గాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. వేలూరు జిల్లా కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ సెంథిల్ కుమారి, రైల్వే ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ పూర్తిగా రద్దు చేశారు. జోలార్‌పేట- బెంగళూరు నుంచి వచ్చే రైళ్లు కిలో మీటర్ల దూరంలో నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన రైల్వే సిబ్బంది రైలు పట్టాలకు మరమ్మతులు చేపట్టారు. డ్రైవర్ చాకచక్యం: ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయాన్ని తెలుసుకున్న రైలు ఇంజిన్ డ్రైవర్ గోవిందరాజ్ వెంటనే రైలును ఆపాడు. దీంతో ఆరు బోగీలు మాత్రమే బోల్తా పడ్డాయి. లేకుంటే మొత్తం 24 బోగీలు ప్రమాదానికి గురయ్యేవని తెలసింది. క్షతగాత్రుల వివరాలు: జయశీలి జాకఫ్(కొట్టాయం), అబ్దుల్ రహమాన్(కొచ్చిన్), ప్రదీఫ్(తిరుచ్చూర్), జాకఫ్ పురువలా(తిరుప్పూర్), పావమ్మాల్ (తిరుప్పూర్), ఆనంద్ వ ల్లియం(కోయికేడు), జాక్ వల్లార్(బెంగళూరు), సర్వర్ బాషా(బెంగళూరు), రాణ (కొట్టాయం), ప్రకాష్(కొట్టాయం), బాలు (కొట్టాయం) వీరికి ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. -
ఢిల్లీలో గాలి దుమారం
-
ఢిల్లీలో గాలిదుమారం, కొట్టుకుపోయిన వాహనాలు
నిన్నటివరకు ఎండ, ఉక్కబోతతో అల్లాడిన దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా పెను దుమారం వచ్చింది. మొత్తం వీధులన్నీ చీకటి మయమైపోయాయి. భారీ గాలి దుమారం రావడంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. కొంతమంది రోడ్డుమీద వెళ్లేవాళ్లు గాయపడ్డారు. పాదచారులు కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. నైరుతి రుతు పవనాల ప్రభావం ఢిల్లీ మీద కూడా పడింది. ఉదయం నుంచే మేఘాలు అలముకున్నాయి. పెద్ద ఎత్తున గాలులు, దుమారం చెలరేగాయి. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిన ఢిల్లీ.. ఇప్పుడు మాత్రం చల్లటి జల్లులతో కూల్ అయింది. అక్కడక్కడ చినుకులు కూడా పడుతున్నాయి. -
కిరణ్ బేడీ కార్యాలయంపై న్యాయవాదుల దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కార్యాలయంపై సోమవారం న్యాయవాదులు దాడి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలోని కృష్ణానగర్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఆ సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో లేరు. న్యాయవాదులు కిరణ్ బేడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తన కార్యాలయంపై న్యాయవాదులు దాడిచేశారని, కొందరు గాయపడినట్టు సమాచారం అందిందని కిరణ్ బేడీ చెప్పారు. -
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: మావటూరులో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులు నర్సింహులు , గంగాధర్, అనిల్‌కుమార్, నరేంద్ర, అశోక్, భాస్కర్ , హన్మతరాయుడు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలలో ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదని అన్నారు. -
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
'బస్సు ప్రమాదం తప్పు ప్రభుత్వానిదే'
అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన తప్పును డ్రైవర్ మీదకో.. మరెవరి మీదకో తోసేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదనన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ''ప్రమాదం జరిగిన చోట ఎలాంటి బ్యారికేడ్లు లేవు. దానివల్లే 15 మంది పిల్లలు మరణించారు. మరింతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారికి ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏ పాటి? ఈ పిల్లల పట్ల, వారి కుటుంబాల పట్ల చూపే మానవత్వం ఇదేనా? మళ్లీ ఇలాంటి తప్పులు జరగకూడదంటే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఆర్ అండ్ బీ ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలంటే చనిపోయిన ప్రతి ఒక్కళ్ల కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తీవ్ర గాయాలపాలైన వాళ్లకు 5 లక్షల వంతున ఇవ్వాలి. తప్పు తమవల్లే జరిగిందని ప్రభుత్వం తెలుసుకుని, ఆ తప్పు తామే చేశామని ఒప్పుకొని, ఆ పిల్లలల కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరిమీదనో నెపం నెట్టడం మానుకుని. ఈ పిల్లల కుటుంబాలకు కనీసం 25 లక్షల పరిహారం ఇవ్వాలి''. -
'అనంత' బస్సు ప్రమాదం జరిగిన తీరిదీ!
-
బస్సు ఘటనపై సుమోటో కేసు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై బాలల హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. బస్సు ఘటనను సుమోటో గా స్వీకరించింది. సంఘటనపై పూర్తి విచారణ జరిపించి ఈనెల 19 లోగా నివేదిక సమర్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ కు బాలల హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మడకశిర-పెనుగొండ మార్గంలో బుధవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 16 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. బస్సు మడకశిర నుంచి పెనగొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారు. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు : పలువురు మృతి
-
ఘటనాస్ధలికి చేరుకున్న పరిటాల సునీత
-
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం
-
పెరుగుతున్న మృతుల సంఖ్య
-
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం
హైదరాబాద్ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండకు బయల్దేరిన బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. కాగా మృతుల సంఖ్య 15 నుంచి 20 వరకూ ఉండవచ్చని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న తాము... ఘటనా స్థలానికి బయల్దేరినట్లు పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. మధ్యాహ్నానికి సంఘటనా స్థలానికి చేరుకుంటామని ఆయన చెప్పారు. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. -
పెరుగుతున్న మృతుల సంఖ్య
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకి పెరుగుతోంది. ఇప్పటివరకూ 12మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. మరో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు, అనంతపురం, హిందుపురం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో సుమారు 60మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కాగా మృతి చెందినవారి వివరాలు ఖచ్చితంగా తెలియరాలేదని, మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు హుటాహుటీన ఘటనా స్థలానికి బయల్దేరారు. -
మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే..
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మడకశిర నుంచి పెనుకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం మలుపు తిరుగుతూ లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రమాదానికి గురైన బస్సు AP 10 Z 1053. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, 16మంది మృతి
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ, మడకశిర మార్గంలో బుధవారం ఉదయం పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు మడకశిర నుంచి పెనుకొండ వెళుతుండగా మలుపు తిరిగే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం సుమారు 50మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఓ కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ : షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్రా ఉస్మానాబాద్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 12మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానాబాద్ లోని ఆస్పత్రికి తరలించినట్లు షిర్డీలోని ఎస్వీఆర్ ట్రావెల్స్ ఎండీ బోస్ తెలిపారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో షిర్డీకి తరలించినట్లు ఆయన చెప్పారు. బాబా దర్శనం అనంతరం వారిని హైదరాబాద్ తరలించనున్నట్లు చెప్పారు. -
పెళ్లి బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లికి రెండు బస్సుల్లో బయల్దేరిన బృందం ప్రమాదానికి గురైంది. ఈ బస్సులు నల్లగొండ జిల్లా పరిధిలో ఉండగా వాటిలో ఒక బస్సు డివైడర్ పైకి ఎక్కడంతో పల్టీకొట్టింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు తమ అన్నకొడుకు పెళ్లి కోసం బయల్దేరామని, ఇంతలో ఉన్నట్టుండి ఈ ప్రమాదం జరిగిందని, బస్సు మొత్తం తుక్కు తుక్కు అయినా అదృష్టవశాత్తు కొంతమంది గాయాలతోనే బయటపడ్డామని, ఎవరూ ప్రాణాలు మాత్రం కోల్పోలేదని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. గాయపడిన వారిని నల్లగొండ జిల్లా భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.