అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై బాలల హక్కుల సంఘం కేసు నమోదు చేసింది.
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై బాలల హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. బస్సు ఘటనను సుమోటో గా స్వీకరించింది. సంఘటనపై పూర్తి విచారణ జరిపించి ఈనెల 19 లోగా నివేదిక సమర్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ కు బాలల హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
మడకశిర-పెనుగొండ మార్గంలో బుధవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 16 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. బస్సు మడకశిర నుంచి పెనగొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారు.