madakasira road accident
-
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: మావటూరులో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులు నర్సింహులు , గంగాధర్, అనిల్‌కుమార్, నరేంద్ర, అశోక్, భాస్కర్ , హన్మతరాయుడు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలలో ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదని అన్నారు. -
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
'బస్సు ప్రమాదం తప్పు ప్రభుత్వానిదే'
అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన తప్పును డ్రైవర్ మీదకో.. మరెవరి మీదకో తోసేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదనన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ''ప్రమాదం జరిగిన చోట ఎలాంటి బ్యారికేడ్లు లేవు. దానివల్లే 15 మంది పిల్లలు మరణించారు. మరింతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారికి ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏ పాటి? ఈ పిల్లల పట్ల, వారి కుటుంబాల పట్ల చూపే మానవత్వం ఇదేనా? మళ్లీ ఇలాంటి తప్పులు జరగకూడదంటే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఆర్ అండ్ బీ ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలంటే చనిపోయిన ప్రతి ఒక్కళ్ల కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తీవ్ర గాయాలపాలైన వాళ్లకు 5 లక్షల వంతున ఇవ్వాలి. తప్పు తమవల్లే జరిగిందని ప్రభుత్వం తెలుసుకుని, ఆ తప్పు తామే చేశామని ఒప్పుకొని, ఆ పిల్లలల కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరిమీదనో నెపం నెట్టడం మానుకుని. ఈ పిల్లల కుటుంబాలకు కనీసం 25 లక్షల పరిహారం ఇవ్వాలి''. -
ప్రమాదస్థలిని సందర్శించిన వైఎస్ జగన్
-
'అనంత' బస్సు ప్రమాదం జరిగిన తీరిదీ!
-
బస్సు ఘటనపై సుమోటో కేసు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై బాలల హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. బస్సు ఘటనను సుమోటో గా స్వీకరించింది. సంఘటనపై పూర్తి విచారణ జరిపించి ఈనెల 19 లోగా నివేదిక సమర్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ కు బాలల హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మడకశిర-పెనుగొండ మార్గంలో బుధవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 16 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. బస్సు మడకశిర నుంచి పెనగొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారు. -
ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపుకు!
-
ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపు!
అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ఆర్టీసి రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సందేహం వెళ్లిబుచ్చారు. అసలు రోడ్డుకు ఎడమ వైపుకు వెళ్లాల్సిన బస్సు, కుడి వైపుకు ఎందుకు వెళ్లిందో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి స్తంభాలు కూడా లేవన్నారు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. కాగా తీవ్రంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో మృతుల సంఖ్య 16కి చేరింది. మరోవైపు ఓవర్ లోడ్ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. -
పల్లె 'వెలుగు' నుంచి చీకట్లోకి
అనంతపురం : ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అనేక కుటుంబాల్లో వెలుగులు ఆర్పేసింది. అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం 16 మంది ప్రాణాలు బలిగొంది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారు ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. మడకశిర డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు AP 28 Z 1053 పెనుకొండకు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. బస్సు ప్రయాణికుల్లో చాలా మంది విద్యార్థులే. పెనుకొండలోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న వారే. ఈరోజు ఉదయం 8. ప్రాంతంలో పెనుకొండకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మడకశిర, పెనుకొండ మార్గంలో ఉన్నవన్నీ పల్లెటూళ్లే. దీంతో చదువుకునేందుకు పిల్లలకు సమీప పట్టణమైన పెనుకొండే దిక్కు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నట్టు సమాచారం. హఠాత్తుగా బస్సులో 60 అడుగుల లోతులోకి పడిపోయవడంతో అంతా షాక్ గురయ్యారు. అంత ఎత్తు నుంచి పడటంతో... బస్సు పూర్తిగా దెబ్బతింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమన్న అక్షరాలు తప్ప బస్సంతా నుజ్జు నుజ్జు అయ్యింది. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు : పలువురు మృతి
-
మధ్యాహ్నం మడకశిరకు వైఎస్ జగన్
హైదరాబాద్ : అనంతపురం జిల్లా మడకశిర ప్రమాద ఘటనా స్థలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం వెళ్లనున్నారు. కాగా మడకశిర వద్ద ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 16మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, 16మంది మృతి
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ, మడకశిర మార్గంలో బుధవారం ఉదయం పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు మడకశిర నుంచి పెనుకొండ వెళుతుండగా మలుపు తిరిగే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం సుమారు 50మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఓ కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.