హైదరాబాద్ : అనంతపురం జిల్లా మడకశిర ప్రమాద ఘటనా స్థలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం వెళ్లనున్నారు. కాగా మడకశిర వద్ద ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 16మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మధ్యాహ్నం మడకశిరకు వైఎస్ జగన్
Published Wed, Jan 7 2015 11:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement