palle velugu bus
-
‘పల్లె’కూ బ్యాటరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వెలుపలా ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో పరిమితంగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా పది ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గరుడ ప్లస్ కేటగిరీలో ప్రారంభించారు. ఇప్పుడు తొలిసారి రాష్ట్రపరిధిలో హైదరాబాద్‌తో ఇతర ప్రధాన పట్టణాలను ఎలక్ట్రిక్ బస్సులతో అనుసంధానించే బృహత్తర కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఇవి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు కేటగిరీలో సేవలందించనున్నాయి. ఇప్పటివరకు నగరం వెలుపలి ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు లేవు. ఆ లోటును భర్తీ చేస్తూ 450 బస్సులు ఆర్టీసీ బస్సు శ్రేణిలో చేరబోతున్నాయి. మరో వారం తర్వాత నుంచి ఈ బస్సులు దశలవారీగా రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్–నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ఇవి తిరగనున్నాయి. నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రాం కింద సరఫరా.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటానని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చి, ఆమేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం గతంలో ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)’పేరుతో పథకాన్ని ప్రారంభించింది. రెండుదశల్లో దీన్ని అమలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఈ పథకం కింద వచ్చినవే. రెండోదశలో మరో 500 బస్సుల కోసం ఆర్టీసీ ప్రతిపాదించగా, అవి కూడా మంజూరయ్యాయి. కానీ కొన్ని కారణాలతో ఆ కాంట్రాక్టు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండటంతో ఆ బస్సులు రాలేదు. ఇప్పుడు ఫేమ్ స్థానంలో కేంద్రప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు(ఎన్‌ఈబీపీ)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ ఆర్టీసీకి 450 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో బస్సులు సరఫరా చేసే ఆ టెండర్‌ను ఢిల్లీకి చెందిన జేబీఎం కంపెనీ దక్కించుకుంది. వారంరోజుల్లో తొలిదశ బస్సులు బ్యాటరీ బస్సులకు జేబీఎం సంస్థ మరో వారంరోజుల్లో శ్రీకారం చుట్టనుంది. ఆ సంస్థనే అద్దె ప్రాతిపదికన బస్సుల నిర్వహణ చూసుకుంటుంది. డ్రైవర్ల బాధ్యత జేబీఎందే కాగా,కండక్టర్ మాత్రం ఆర్టీసీ నుంచి విధుల్లో ఉంటాడు. ఈ బస్సులను నడిపినందుకుగాను ప్రతి కి.మీ.కు రూ.40 చొప్పున అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లిస్తుంది. వీటికి అవసరమైన చార్జింగ్ వ్యవస్థను ఆ సంస్థనే ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్‌తోపాటు ఆయా పట్టణాల్లోని సంబంధిత డిపోల్లో వీటిని ఏర్పాటు చేస్తుంది. తొలుత 20 బస్సులు రానున్నాయి. అలా విడతలవారీగా వచ్చే రెండు నెలల్లో మొత్తం బస్సులు రోడ్డెక్కే అవకాశముంది. 450 బస్సులను సరఫరా చేయాల్సి ఉండగా, 400 బస్సులకు సంబంధించిన షెడ్యూళ్లను ఆర్టీసీ ఆ సంస్థకు అందించింది. ఇప్పుడు ఆ 400 బస్సులు వీలైనంత త్వరలో అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ ఆ సంస్థకు సూచించింది. వీటిల్లో 245 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 85 సూపర్ లగ్జరీ బస్సులు, 70 పల్లెవెలుగు సర్వీసులు ఉంటాయి. దాదాపు వేయి వరకు డీజిల్ బస్సులను ఆర్టీసీ దశలవారీగా సమకూర్చుంటుండగా, వాటికి అదనంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 350 కి.మీ. వరకు ప్రయాణం గతంలో ఎలక్ట్రిక్ బస్సులు ఒకసారి ఫుల్‌చార్జ్ చేస్తే 225 కి.మీ.వరకు తిరిగేవి. దీంతో వాటిని దూరప్రాంతాలకు నడపటం కష్టంగా మారింది. హైదరాబాద్ నుంచి గమ్యం చేరి తిరిగి సిటీకి వచ్చేలోపు చార్జింగ్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఈ సమస్యను అప్పటికిప్పుడు అధిగమించలేక ఇతర పట్టణాలకు తిప్పేందుకు ఆర్టీసీ సాహసించలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న బస్సులు ఫుల్‌చార్జ్ చేస్తే 350 కి.మీ.వరకు నడుస్తాయి. దీంతో దూరప్రాంత పట్టణాలకు వాటిని తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆయా పట్టణాల్లో కూడా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నందున, తిరుగు ప్రయాణంలో మళ్లీ ఫుల్ చార్జింగ్‌తో వస్తాయి. దీంతో మధ్యలో చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్ పాస్‌లో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ను సంస్థ తెచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ‘జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్‌ను హైదరాబాద్, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ఈ బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన! -
1,500 కొత్త బస్సులొస్తున్నాయి
సాక్షి, అమరావతి: ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. అందుకోసం కొత్తగా 650 బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. చాలా ఏళ్ల తరువాత ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జీతాల వ్యయం, అందుకోసం అప్పులు, వాటిపై వడ్డీలు, ఇతర నిర్వహణ వ్యయాలతో ఆర్టీసీ దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ వస్తోంది. అప్పుల భారం పెరిగిపోవడంతో తొమ్మిదేళ్లుగా కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఏటా రూ.350 కోట్ల జీతాల భారం లేకుండాపోయింది. ఈ మూడేళ్లలోనే దాదాపు రూ.2 వేలకోట్ల అప్పులను తీర్చగలిగింది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుండటంతో ఆర్టీసీ రాబడి కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది. అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 బస్సులు మొత్తం ఏడు కేటగిరీల కింద రూ.650 కోట్లతో బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సర్విసుల వారీగా అమరావతి–11, వెన్నెల–8, ఇంద్ర–32, స్టార్‌లైనర్–27, సూపర్‌లగ్జరీ–735, అ్రల్టాడీలక్స్–145, ఎక్స్‌ప్రెస్–542 బస్సులు కొనుగోలు చేయనుంది. అమరావతి సర్విసు కింద 11 బస్సులను నేరుగా ఓల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 1,489 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. బీఎస్–6 మోడల్‌తో అత్యాధునిక ప్రమాణాలతో బస్సులను సరఫరా చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. బిడ్లను ఈ నెల 20న తెరిచి, అనంతరం నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది. అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 కొత్త బస్సుల చొప్పున ప్రవేశపెట్టనుంది. 2024 ఏప్రిల్ నాటికి మొత్తం 1,500 బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. మరో 600 బస్సులను ఆధునికీకరించి పల్లెవెలుగు సర్విసులుగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులు అప్పుడప్పుడు బ్రేక్‌డౌన్ అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ సర్విసులుగా ఉంటూ తక్కువ మైలేజీ ఇస్తున్న 600 బస్సుల బాడీలను రీఫర్బిíÙంగ్ ద్వారా ఆధునికీకరించి పల్లెవెలుగు సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త బస్సుల కొనుగోలుతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు చెప్పారు. -
బస్సు డ్రైవర్‌కు ఫిట్స్
శృంగవరపుకోట: బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై పడిపోయాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని, బాలుడిని ఢీకొట్టింది. బాలుడు మృతిచెందగా, ఇంటి వద్ద ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. ఎస్.కోట ఆర్టీసీ డిపో నుంచి ఆదివారం ఉదయం విజయనగరం బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ధర్మవరం శివారు మారుతీనగర్ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ గంగునాయుడుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. డ్రైవర్ స్టీరింగ్‌పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిపైకి దూసుకుపోయింది. ఇంటి ముందు ఉన్న బాలుడు శిరికి అభిషేక్ (12)ను, సమీపంలో వంట చేస్తున్న తొత్తడి పాపను ఢీకొట్టింది. అభిషేక్‌ను 108లో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కూడా గాయాలయ్యాయి. -
APSRTC: పల్లె వెలుగు బస్సుల్లో న్యూమాటిక్ డోర్లు.. ఎలా పనిచేస్తాయంటే..
సాక్షి, అమరావతి: ప్రయాణికుల భద్రత కోసం ఏపీఆర్టీసీ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటున్నది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ‘న్యూమాటిక్ డోర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు బస్సుల్లో ఏర్పాటు చేసిన న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు మంగళవారం పరిశీలించారు. ప్రయాణికులు తొందరపాటుతో కదులుతున్న బస్సుల్లోంచి దిగుతున్నప్పుడుగానీ ఎక్కుతున్నప్పుడుగానీ కాలుజారి పడడం వంటి ప్రమాదాలను నివారించేందుకు న్యూమాటిక్ డోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోర్లు పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. బస్సు ఆగిన తరువాత డ్రైవర్ సీటు వద్ద ఉన్న బటన్‌ను నొక్కితేనే డోర్లు తెరుచుకుంటాయి. వర్షాలు, చలితో బస్సులోని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డోర్లు ఉపయోగపడతాయి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు డ్రైవర్లతో మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాగా, త్వరలోనే అన్ని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ) -
మళ్లీ పల్లెకు ‘వెలుగు’
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఊళ్లల్లో ‘పల్లె వెలుగు’బస్సులు సందడి చేస్తున్నాయి. తమ ఊరికి బస్సు వచ్చిందం టూ పల్లెవాసులు సంబరపడిపోతున్నారు. మూడు, నాలుగేళ్లుగా మాయమవుతూ వచ్చిన పల్లెవెలుగు బస్సులు ఇప్పుడు మళ్లీ ఊరిబాట పట్టడంతో వాటిల్లో ప్రయాణించేవారి సంఖ్య కూడా పెరిగింది. గతవారంరోజులుగా 3 వందల ఊళ్లకు బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. సోమవారం నాటికి(హైదరాబాద్ సిటీ జోన్లో ఉన్న బస్సులు మినహా) మొత్తం 6,583 బస్సులు తిరుగుతున్నాయి. ఇది గత మూడేళ్లలోనే గరిష్ట సంఖ్య కావటం విశేషం. వీటిల్లో 3,508 పల్లెవెలుగు బస్సులు గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో ఆర్టీసీ సొంత పల్లెవెలుగు బస్సులు 1,811 కావటం విశేషం. సోమవారంనాటికి ఈ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో గరిష్టంగా 63 శాతానికి చేరింది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఇదే అత్యధిక ఆక్యుపెన్సీ రేషియో కావటం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో లేదని.. ఆర్టీసీలో 2019లో జరిగిన సమ్మెతో మొత్తం పరిస్థితి తల్లకిందులైన సంగతి తెలిసిందే. సమ్మెను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆర్టీసీలో ఎన్నో మార్పులను చేసింది. ప్రధానంగా ఆక్యుపెన్సీ రేషియో తగ్గిన పల్లెవెలుగు బస్సులపై వేటువేసింది. ఇక ఊరి రోడ్లు అంత అనుకూలంగా లేకపోవటంతో వీటిల్లో డీజిల్ వినియోగం కాస్త ఎక్కువే. వెరసి ఖర్చు భారీగా ఉండేది. సమ్మెకు పూర్వం నుంచి ఈ నష్టాలు పెరుగుతూ రావటంతో పల్లెవెలుగు బస్సుల ట్రిప్పులు తగ్గించారు. దాదాపు 3వేల ఊళ్లకు బస్సులు నిలిచిపోయాయి. ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ.. ఇటీవల డీజిల్, పెట్రోలు ధరలు పెరిగి సొంతవాహనాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారటం, ఆటో కనీస చార్జీలు రెట్టింపు కావటంతో జనం జేబులపై భారం పడింది. రవాణా కష్టాలపై జనం సర్పంచులకు విన్నవించుకోవటం, వారు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచడం బాగా పెరిగింది. ఎండీగా సజ్జనార్ వచ్చాక కూడా వినతుల వెల్లువ కొనసాగింది. ట్విట్టర్లో కూడా ఫిర్యాదులు పెరిగిపోవటం తో తాజా పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో పల్లెవెలుగు బస్సులను పునరుద్ధరిస్తూ వస్తున్నారు. ఇటీవల విద్యాసంస్థలు కూడా తెరుచుకోవటంతో విద్యార్థుల ప్రయా ణ కష్టాలను దూరం చేసేందుకు పల్లెవెలుగు ట్రిప్పుల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. 2,500 ఊళ్లకు బస్సులు కావాలి ఇప్పటికీ దాదాపు రెండున్నర వేల ఊళ్లకు బస్సు వసతి సరిగా లేదు. ఇప్పుడు వాటికి కూడా బస్సు సౌకర్యం కల్పించాలంటే ప్రస్తుతం ఆర్టీసీ వద్ద చాలినన్ని పల్లెవెలుగు బస్సుల్లేవు. ఇప్పటికే 1,697 అద్దె బస్సులు పల్లెవెలుగు ట్రిప్పుల్లో ఉన్నాయి. మరిన్ని అద్దె బస్సులు తీసుకుంటే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు అవుతుంది. ఇది ప్రైవేటీకరణకు సంకేతమని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఎండీ తీసుకునే నిర్ణయం కోసం అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. -
పల్లె వెలుగు బస్సులకు కొత్త రూపు
చీరాల అర్బన్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పల్లె వెలుగు బస్సులను పూర్తి స్థాయిలో బాగు చేయించి కొత్త రూపు తీసుకొస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పల్లె వెలుగు బస్సులను కొంత హంగులతో రూపొందించి మూడు వేల బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా సుమారు రూ.25 కోట్ల వ్యయంతో అన్ని బస్స్టేషన్లలోని మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయించనున్నట్లు వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించామన్నారు. డిపోలోని సర్వీసుల వివరాలు, కార్గో సర్వీసులపై వస్తున్న ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని గార్డెన్, పరిసరాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ ఎండీకి పలు యూనియన్ల నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. -
బస్సెక్కితే బహుమతి
సాక్షి, అమరావతి: ప్రజారవాణారంగంలోని పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచనలు చేస్తోంది. పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణిస్తే లక్కీడిప్ ద్వారా రూ. 200 నుంచి రూ. 500 వరకు విలువైన బహుమతులు ఇవ్వనుంది. నెలలో రెండు సార్లు డ్రా తీసి ఎంపికైన ప్రయాణికులకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. వరుసగా మూడు నెలల పాటు లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన ప్రయాణికులకు బహుమతులు అందిస్తారు. ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణించేవారికి ఈ బహుమానాలు అందజేస్తారు. పల్లెవెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతానికి మించడం లేదు. ఈ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెంచేందుకు ఈ వినూత్న ఆలోచన ఆర్టీసీ అధికారులు అమలు చేస్తున్నారు. పల్లెవెలుగు ద్వారా నష్టాల్ని అధిగమించేందుకు ఆర్టీసీ ఈ ప్రయోగం చేస్తోంది. సత్ఫలితాలు వస్తే అన్ని సర్వీసుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ప్రయాణికులు ఏం చేయాలి? - పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి టికెట్ వెనుక ఫోన్ నంబర్, అడ్రస్ రాసి బస్సులో ఉంచిన బాక్సులో వేయాలి. నెలలో రెండుసార్లు లాటరీ తీసి ప్రయాణికుల్ని ఎంపిక చేస్తారు. - ప్రతి జిల్లాలో 150 బస్సుల్లో ఈ లక్కీడిప్ ద్వారా ప్రయాణికులకు బహుమతులు అందించనున్నారు. - రాష్ట్రంలో నిత్యం రెండున్నర కోట్ల మంది వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నట్లు రవాణా శాఖ అంచనా. - ప్రయాణికుల తరలింపులో ఆర్టీసీది 25 శాతం వాటా. రైల్వే, సొంత వాహనాల ద్వారా 30 శాతం, 45 శాతం ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నారు. - గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంత రూట్లపైనే కాకుండా.. గ్రామీణ రూట్లలోనూ ప్రైవేటు ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా పల్లెవెలుగు సర్వీస్ ద్వారా ఆర్టీసీ నష్టాలు మూటకట్టుకుంది. ప్రస్తుతమున్న పోటీని తట్టుకుని ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచనలు చేస్తోంది. -
ఇలా..ఎలా?
ఉలవపాడు: చిల్లర తిప్పలు లేకుండా చేయడం కోసం అంటూ చార్జీల సవరణల పేరుతో ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన భారీ భారం మోపింది. పల్లె వెలుగు బస్సుల్లో ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి తెచ్చింది. ఆదివారం బస్సులు ఎక్కిన ప్రయాణికులు కొత్త చార్జీలు చూసి అవాక్కయ్యారు. 10 శాతం టికెట్టు రాయితీ..అంటూ ఇచ్చిన క్యాట్‌కార్డులు, వనిత కార్డులు అసలు పనిచేయలేదు. ఇక 25 శాతం ఆధార్ తగ్గింపు కూడా 30 రూపాయలుపైన చార్జీ ఉన్న వారికి మాత్రమే వర్తించింది. ప్రయాణికులు ఇదేంటి ఇలా చేశారు.. ఇలా అయితే రాయితీ కార్డులు ఎందుకు అమ్మారని ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉలవపాడు నుంచి ఒంగోలుకు గతంలో 34 రూపాయల చార్జీ ఉంది. ఇప్పుడు ఆ చార్జీని చిల్లర పేరుతో 35 చేయాలి. కానీ 40 రూపాయలు చేశారు. రాయితీ కార్డులు ఉన్నా లేకున్నా అదే టికెట్టు కొనాల్సిందే. ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. కండక్టర్లు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు భారీగా వడ్డించారని అర్థమైంది. ఉలవపాడు నుంచి సింగరాయకొండ, టంగుటూరు, కావలి వెళ్లాలంటే రాయితీ కార్డులు పనిచేయవు. వృద్ధుల ఆధార్ కార్డులు పనిచేయవు. ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టి ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చార్జీల పెంపు అంటే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని ఇలా చేశారని ప్రయాణికులంటున్నారు. ఉపయోగం లేని రాయితీ కార్డులు ఆదివారం ప్రారంభమైన కొత్త చార్జీల్లో రాయితీ కార్డులు ఏ మాత్రం పనిచేయలేదు. కార్డు నంబర్ కొట్టినా సాధారణ చార్జీనే వస్తోంది. గతంలో రాయితీ కార్డులు ఆర్టీసీ సిబ్బంది అన్ని గ్రామాలకు వెళ్లి వీలైనన్ని ఎక్కువ అమ్మారు. జిల్లా జనాభాలో సగం మందికి క్యాట్ కార్డులు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుదారుల్లో 80 శాతం మందికి వనిత కార్డులు ఉన్నాయి. రోజూ వీరు 10 శాతం రాయితీతో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాయితీలు అన్ని పోయాయి. చార్జీల పెంపుతో పాటు రాయితీ కూడా నొక్కేసారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో సీజన్ టికెట్టు ఉన్నప్పుడు టోల్‌గేటు 5 రూపాయల టికెట్టు కొట్టేవారు. కానీ ఇప్పుడు 10 రూపాయలు కొడుతున్నారు. ఇలా భారీగా ప్రజలపై భారం మోపారు. ప్రజల్లో అసంతృప్తి చిల్లర పేరుతో భారీగా చార్జీలు వడ్డించడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనే చిల్లర పేరుతో చార్జీలు భారీగా పెంచేశారని అంటున్నారు. ఇక కార్డుల పనిచేయకపోవడం భాధాకరమని, అలాంటప్పుడు తమకు ఎందుకు అమ్మాలని ప్రశ్నిస్తున్నారు. టంగుటూరు నుంచి ఒంగోలుకు 25 రూపాయలు తీసుకుంటున్నారు. కార్డు పనిచేయదంటున్నారు. ఇలా అయితే ఆర్టీసీ బస్సులు ఎలా ఎక్కాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయని విమర్శించారు. వెంటనే రాయితీ కార్డులు అమల్లోకి వచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీ కార్డులు పనిచేసేలా చేయాలి: ఆర్టీసీ ఇచ్చిన రాయితీ కార్డులు బస్సుల్లో పనిచేయవని అనడం బాధాకరం. దీని వలన ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారు. వెంటనే రాయితీ చార్జీల్లో కల్పించాలి. ఊటుకూరి సతీష్ -
‘పల్లెవెలుగు’ల్లో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
విజయనగరం అర్బన్: సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం కూడా ప్రయాణికులతో కిటకిటలాడింది. దూరప్రాంతాల నుంచి రైళ్లల్లో వచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఇక్కడి నుంచి బస్సులను ఆశ్రయిస్తారు. ప్రధానంగా పాలకొండ, రాజాం, సాలూరు, పార్వతీపురం, రణస్థలం ప్రాంతాలకు వెళ్లేవారు అధికంగా ఉన్నారు. పట్టణంలోని వివిధ ప్రైవేటు, వ్యాపార సంస్థల్లో పనిచేసిన కార్మిక, చిరుద్యోగులకు పండగ మూడురోజులు మాత్రమే సెలవిస్తారు. దీంతో భోగీ రోజున సొంత ఊర్లకు వెళ్లేవాళ్ల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లా కేంద్రానికి ఆనుకొని ఆర్టీసీ అధికారులు 60 బస్సుల వరకు విజయగరం, సాలూరు, పార్వతీపురం, ఎస్‌కోట డిపోల నుంచి నడిపారు. అధిక శాతం విశాఖ నుంచి ప్రయాణికులను తీసుకొని రావడానికి ఉపయోగించారు. సంస్థకున్న ఎక్స్‌ప్రెస్ సర్వీ సు బస్సులు సరిపోకపోవడంతో పల్లెవెలుగు బస్సులను వినియోగించారు. చార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్ బస్సులవే వసూళ్లు చేశారు. స్థానిక బస్ కాంప్లెక్స్ ప్రాంతంలో, విశాఖలోని ద్వారకానగర్ కాంప్లెక్స్ ఆవరణలో జిల్లా ఆర్టీసీ అధికారులు కాపుకాసి జనాల రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాల రూట్లకు సిటీ బస్సులు, పల్లెవెలుగు సర్వీసులను నడిపారు. రెండోవైపు సర్వీసులకు జనాలు నిల్.. విశాఖ నుంచి జిల్లాకు, జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు నిర్వహించిన సర్వీసులకు రెండోవైపు ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు డీలాపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న చార్జీలకు రెండువైపులా జనాలు ఉన్నపుడే దానిమీద వచ్చిన ఆదాయం బాగుంటుంది. ఒకవైపు ప్రయాణికులను తీసుకెళ్లి రెండోవైపు ఖాళీగా వస్తే కిట్టుబాటుండదని వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం భోగీ రోజున దాదాపుగా 70 శాతం సర్వీసులకు రెండో వైపు సర్వీసులకు జనాలు లేరని, దీని వల్ల సంస్థకు సేవే తప్ప ఆదాయం అంతంత మాత్రమేనని చెబుతున్నారు. పల్లెవెలుగు బస్సులు అయినప్పటికీ స్టాపుల సంఖ్యను తగ్గిస్తూ ఎక్స్‌ప్రెస్ బస్‌ల స్పీడులోనే నడుపుతున్నామని, ఆ కారణంగానే ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నామని విజయనగరం డిపో మేనేజర్ ఎన్విఎస్.వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. -
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
వైద్యం అందితే నా కొడుకు బతికేవాడు..
హిందూపురం : సకాలంలో వైద్యం అందించి ఉంటే తన కొడుకు బతికేవాడని ఇంటర్ విద్యార్ధి గంగాధర్ తండ్రి ప్రభాకర్ కన్నీటి పర్యంతమయ్యారు. పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులకు ఆయన తన బాధను వివరించారు. తీవ్రంగా గాయపడి చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకువచ్చి.. పిల్లాడు చాలా బాధపడుతున్నాడు త్వరగా రండి.. అని డాక్టర్‌కు ప్రాధేయపడితే ఆయన కసురుకున్నాడని వాపోయాడు. వెంటనే వైద్యం అందించి వుంటే నా కొడుకు బతికేవాడని విలపించాడు. ఏ శవ పరీక్షలు వద్దు.. పిల్లాడి శవం ఇచ్చేయండి వెళిపోతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాయకులు ఆయనను శాంత పరిచారు.అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృత్యుంజయురాలు అనిత అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో మేకలపల్లికి చెందిన అనిత అనే విద్యార్థిని మృత్యుంజయురాలుగా సురక్షితంగా బయటపడింది. ఘటనపై ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే... నేను పెనుకొండలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ప్రతిరోజూ మా గ్రామం నుంచి 30 మందికి పైగా విద్యార్థులం ఈ బస్సులో పెనుకొండకు వస్తూ ఉంటాం. రోజులాగే మా గ్రామానికి చెందిన విద్యార్థులు బధవారం ఉదయం 8 గంటలకు బస్సు ఎక్కాము. బస్సు డ్రయివర్ వేగంగా నడుపుతూ వచ్చాడు. బస్సులోని ప్రయాణికులతోపాటు కండక్టర్ కూడా నెమ్మదిగా పోనివ్వాలని చెప్పారు. బస్సుకు ఆటో అడ్డురావడంతోనే దాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురిచేశాడు. బస్సు లోయలో పడిన విషయం మాత్రమే తెలుసు. తరువాత ఏమి జరిగిందో తెలియదు. మా టీచర్ బాలాజీ నన్ను లేపిబయటకు పంపాడు. నాతోపాటు మరో పది మందిని కాపాడాడని ఆమె వివరిచింది. -
డీఎస్సీ దరఖాస్తు కోసం వెళ్తూ..
అమరాపురం : మండల పరిధిలోని హేమావతి గ్రామంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం 5.30 గంటలకు శ్రీనివాస్(30) డీఎస్సీ దరఖాస్తు చేసుకోవడానికి బస్సులో బయలు దేరాడు. మడకశిరలో స్నేహితుడి కోసం దిగి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. పెనుకొండ సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని హేమావతి గ్రామానికి తీసుకువచ్చారు. తల్లి సరోజమ్మ, భార్య శశికళ, అక్క అనిత, బంధువులు రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే పరలోకానికి వెళ్లిపోయావా అంటూ భార్య, తల్లి రోధించారు. తల్లడిల్లిన పల్లెలు మడకశిర ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంతో పల్లెలు తల్లడిల్లాయి. గ్రామాల్లో విషాద వాతావరణం ఏర్పడింది. మా పిల్లవాడు కళాశాలకు బస్సులో వెల్లాడు, మా పాప కళాశాలకు వెల్లింది, ఎమైందో అంటూ పరుగు పరుగున ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఎక్కడ ఉన్నారోనని కన్నీరు పెట్టుకుంటూ తాపత్రయ పడడం కనిపించింది. విషాదంతో ప్రతి ఒక్కరూ గ్రామంలో ఒకరినొకరు ఓదార్చుకున్నారు. సంతోషంతో చదువుకోవడానికి వెళ్లిన తమ బిడ్డలు ఏమయ్యారోనని వారు పడిన బాధ మాటల్లో చెప్పలేనిది. ప్రమాదంలో గాయపడిన వారిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, ఎస్ఐ శేఖర్ సిబ్బందితో పాటు స్థానికులు క్షతగాత్రులను అనంతపురం, హిందూపురం ఆస్పత్రులకు స్కూల్ బస్సులు, జీపుల్లో తరలించడానికి ముమ్మర చర్యలు చేపట్టారు. మరవలేని విషాద ఘటన పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం జీవితంలో మరిచిపోలేని విషాద ఘటన అని పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య, ఆరైఓ వెంకటేశులు, డీవైఈఓ వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం ఉదయం ప్రమాద ఘటనలో తమ కళాశాల విద్యార్థులు చనిపోయారన్న సమాచారం అందడంతో చలించిపోయిన వారు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వచ్చి కంటతడిపెట్టుకున్నారు. ఆర్డీఓ రామమూర్తి మాట్లాడుతూ ప్రమాద ఘటన ఘోరమని పేర్కొన్నారు. విశిష్ట సేవలు అందించిన 108 సిబ్బంది: పెనుకొండ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో 108 సిబ్బంది విశేష సేవలు అందించారు. -
రైలు ప్రమాదం మరువకముందే..
పెనుకొండ : మండలంలోని మడకశిర ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిన రెండో పెద్ద ప్రమాదంగా నమోదైంది. 20 12 ఏప్రిల్ 24న స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో హంపీ ఎక్స్‌ప్రెస్ నిలచి ఉన్న గూడ్స్ రై లును ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఆ ఘటనను మరువకముందే ఈ ఘోరం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బస్సు ప్రమాదంల పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, మడకశిర ప్రాంత ప్రజలను శోక సంద్రంలో ముంచింది. 14 ఏళ్ల క్రితం ప్రస్తుతం బస్సు పడిన ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు పడి 10 మంది దాకా మరణించారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. సహాయక చర్యలకు ప్రత్యేక సెల్ పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన వెంట నే 18004256401 నంబర్‌తో సెల్‌ను ప్రారంభిం చారు. దీని ద్వారా క్షతగాత్రులు ఎవరెవరు చికిత్స పొందుతున్నారు.. తదితర వివరాలను బంధువులకు అందిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పతిలో 16 మంది, హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. హిందూపురంలో చికిత్స పొందుతూ బండ్లపల్లికి చెందిన గంగాధర్, హేమావతికి చెందిన శ్రీనివాసులు మృతి చెందారని వివరించారు. ఈ ప్రత్యేక సెల్ మరికొన్ని రోజులు కొనసాగించనున్నట్లు తెలిపారు. -
అనంత శోకం
* ఏపీలోని పెనుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం * లోతైన గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు * మృతుల్లో 12 మంది విద్యార్థులు.. 65 మందికి తీవ్ర గాయాలు * రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి * హుటాహుటిన హైదరాబాద్ నుంచి దుర్ఘటన స్థలానికి వైఎస్ జగన్ * క్షతగాత్రులకు పరామర్శ, మృతుల కుటుంబాలకు ఓదార్పు పెనుకొండ నుంచి సాక్షి ప్రతినిధి: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ‘షీప్-ఫామ్’. బుధవారం ఉదయం 8.24 గంటలు. మడకశిర నుంచి బయలుదేరిన ‘పల్లె వెలుగు బస్సు’ పెనుకొండకు వెళుతోంది. స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన వివిధ గ్రామాల విద్యార్థులతో పాటు 87 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. మరో 5 నిమిషాల్లో పెనుకొండకు చేరుతుందనగా.. ముందు వెళుతున్న ఆటోను దాటివెళ్లే క్రమంలో బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యింది. 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. బస్సు ఇరుకు ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న సుమా రు 150 అడుగుల లోతైన గుంతలో పడిపోవడంతో కుప్పలా అయిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మా ర్మోగింది. 11మంది అక్కడికక్కడే మరణిం చగా, నలుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందు తూ మృతి చెందారు. డ్రైవర్, కండక్టర్ సహా 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెనుకొండ, హిందూపురం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. మరణించిన 15 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నారు. నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.. ఏపీ 28 జెడ్ 1053 పల్లె వెలుగు బస్సు మడకశిర నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరింది. 7.50కి పెనుకొండ మండలం మావటూరుకు చేరింది. బండపల్లి, నాగలూరు, మావటూరు విద్యార్థులంతా బస్సు ఎక్కారు. కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో అనేకమంది నిలుచునే ప్రయాణిస్తున్నారు. మావటూరు నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణం చేసిన బస్సు ఘాట్ రోడ్డులోని షీప్ ఫామ్ (గొర్రెల పెంపక కేంద్రం) సమీపంలోకి చేరింది. అక్కడి నుండి మరో 4 కిలోమీటర్లు వెళితే పెనుకొండ వచ్చేస్తుంది. ఐదారు నిమిషాలు గడి స్తే గమ్యం చేరుతుందనగా ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఇరుకైన మట్టిరోడ్డు. పట్టుమని పది అడుగుల వెడల్పు కూడా లేదు. దీని పక్కనే కొత్త రోడ్డు కోసం లోతైన గుంత తవ్వారు. కానీ రోడ్డు పక్కన రక్షణ కోసం కనీసం రాళ్లు కూడా పెట్టలేదు. కాంట్రాక్టర్ హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. డ్రైవర్ గంగప్ప (లేపాక్షి మండలంలోని కల్లూరు స్వస్థలం) ఆటోను ఓవర్టేక్ చేయబోగా బస్సు అదుపు తప్పడంతో రోడ్డు కోసం తవ్విన లోయలాంటి గుంతలో పడిపోయింది. చేతులు, కాళ్లు, నడుం విరిగి పోరుు కొందరు, తల పగిలి మరికొందరు ఆర్తనాదాలు చేశారు. ఇంకొందరి శరీరంలో బస్సులోని ఇనుపరాడ్లు, రేకులు దిగబడిపోయాయి. 87 మంది ప్రయాణికుల్లో నలుగురు సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు బస్సు పడిపోతున్న సమయంలో రోడ్డుపైకి దూకేశారు. ఆర్తనాదాలతో మార్మోగిన ఆస్పత్రి ఘటన జరిగిన వెంటనే 108 వాహనాలు, జీపులు, ఆటోల్లో క్షతగాత్రులందర్నీ 40 పడకల పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోని వరండాలో కుప్పగా పడేశారు. సుమారు 50 మందిని హిందూపురం ఆస్పత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న బస్సు డ్రైవర్ గంగప్ప సహా 16 మందిని బెంగళూరు ఆస్పత్రి (నిమ్హాన్స్)కి తరలించారు. ఆస్పత్రిలో శ్రీనివాసులు, గంగాధర్ అనే ఇద్దరు చనిపోయారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు ఆస్పత్రి ప్రత్యేక హెల్ప్‌లైన్ (080-26995008, 26995021)ను ఏర్పాటు చేసింది. బస్సు దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిమ్హాన్సలో బాధితులను కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం 40 మంది హిందూపురంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురిని అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేయగా వారిలో అశోక్‌కుమార్, గంగాధర్ అనే ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. సీరియస్‌గా ఉన్న జి.అశోక్‌కుమార్ అనే విద్యార్థిని కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రస్తుతం అనంతపురంలో నలుగురు చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..: మంత్రి శిద్ధా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. శిద్ధా తో పాటు జిల్లాకు చెం దిన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం! పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. షీప్ ఫామ్ వద్ద ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం ఘాట్‌ను తవ్వి కొత్త రోడ్డు నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను మంత్రి పరిటాల సునీత సమీప బంధువైన ఎల్.నారాయణ చౌదరికి చెందిన శ్రీ కృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రోడ్డు వేయడం కోసం ఘాట్‌లో ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆనుకుని దాదాపు 150 అడుగుల లోతు గుంతలా తవ్వారు. ఇలాంటి చోట ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఉంచక పోవడం క్షమార్హం కాని నిర్లక్ష్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బస్సు కండీషన్ డొల్ల ప్రమాదానికి కారణమైన పల్లె వెలుగు బస్సు మడకశిర డిపోకు చెందినది. ఏమాత్రం కండీషన్ బాగోలేదు. 8.75 లక్షల కిలోమీటర్లు తిరిగింది. స్క్రాప్‌కు దాదాపుగా దగ్గరలో ఉంది. పైగా స్థాయికి మించి ప్రయాణికులు ఎక్కారు. ఈ మార్గంలో ఆటోల రద్దీ ఎక్కువ. ఉదయం వేళ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులంతా పాసులు ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. చాలామంది డ్రైవర్లు విద్యార్థులు కన్పిస్తే బస్సు ఆపరనే ఆరోపణలున్నాయి. మరో బస్సు వచ్చేలోపు సమయం దాటిపోతుందనే ఉద్దేశంతో ఆగిన బస్సులో ఎంతమంది ప్రయాణికులున్నా విద్యార్థులు అందులోనే ఎక్కుతుంటారు. నిత్యం బస్సు టాప్‌పైనా విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. కాగా డ్రైవర్ వేగంగా వెళ్లడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెప్పారు. మృతుల వివరాలు మురళి (11), నరేంద్ర (15), అనిల్ (16), లక్ష్మీనారాయణ (16), నరసింహమూర్తి (16), అశోక్‌కుమార్ (17), అనిత (17), దాసరి గంగాధర్ (17) (తండ్రి రామన్న, మావటూరు), శేఖర్ (17), హనుమంతరాయుడు (20), అశోక్‌కుమార్ (17), గంగాధర్ (17) (తండ్రి సజ్జప్ప, మావటూరు). వీరంతా విద్యార్థులు కాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ (47), డీఎస్సీ అభ్యర్థి శ్రీనివాసులు (35), గంగాధర్ (16) (తండ్రి ప్రభాకర్, బండపల్లి) రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు పంపిన సందేశంలో రాష్ట్రపతి సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సందేశంలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ పెనుకొండ: అనంతపురం జిల్లా మడకశిర-పెనుకొండ రహదారిలో రోడ్డు నిర్మాణ పనుల వద్ద ప్రమాదం పొంచి ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. అరుునా కాంట్రాక్టర్, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రోడ్డు పనుల వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదని దాదాపు నెలన్నర కిందట (2014 నవంబర్ 26న అనంతపురం టాబ్లారుుడ్ పెనుకొండ జోన్లో) ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని బుధవారం ఘటనా స్థలిలో పలువురు పేర్కొన్నారు. ‘సాక్షి’ కథనాన్ని గుర్తు చేసుకున్నారు. కన్ను మూసి తెరిచేలోగా..: ప్రత్యక్ష సాక్షులు హిందూపురం అర్బన్: రెప్పపాటు కాలంలోనే బస్సు ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఈ మార్గంలో ఇటీవల రెండు సర్వీసులు రద్దు చేశారు. దీంతో విద్యార్థులు, పెనుకొండకు వెళ్లే ప్రయాణికులు, కూలీలు ఈ బస్సులోనే ఎక్కారు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. కుదుపులు రాగానే దూకేశా సత్తారుపల్లి నుంచి బస్సు బయలుదేరిన కొంతసేపటికే ఆటోను ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి కుడివైపునకు ఒరిగిపోతుండడంతో ఎడమవైపు డోరు వద్దనే ఉన్న నేను ఒక్కసారిగా బయటికి దూకేశా. చూస్తుండగానే బస్సు పల్టీలుకొడుతూ గోతిలో పడిపోయింది. - నందీశ్వర్‌రెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి ఓవర్ టేక్ చేయబోతూ.. బస్సు వేగంగా వెళుతోంది. ఎక్కువ మందితో కిక్కిరిసివుంది. ముందుపోతున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయే ప్రమాదానికి గురైంది. ఓవర్ టేక్ చేయకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రమాదంలో నా చేయి విరిగింది. చిన్న గాయాలయ్యాయి. - రామిరెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి వేగం వల్లే పడిపోయింది బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ వెనుకనే నిలబడివున్నా. బస్సు వేగంగా పోతోంది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు గోతులపై నుంచి వెళ్లడంతో అదుర్లతో ఊగిపోయింది. అందరం కేకలు వేశాం. ఆటో పక్కనుంచి బస్సును రోడ్డుపైకి తీసుకొస్తాడని అనుకునేలోపే గోతిలోకి పడిపోయింది. తర్వాతేం జరిగిందో తెలీదు. - లలిత, సుద్దపట్లపల్లి -
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: మావటూరులో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులు నర్సింహులు , గంగాధర్, అనిల్‌కుమార్, నరేంద్ర, అశోక్, భాస్కర్ , హన్మతరాయుడు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలలో ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదని అన్నారు. -
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
'బస్సు ప్రమాదం తప్పు ప్రభుత్వానిదే'
అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన తప్పును డ్రైవర్ మీదకో.. మరెవరి మీదకో తోసేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదనన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ''ప్రమాదం జరిగిన చోట ఎలాంటి బ్యారికేడ్లు లేవు. దానివల్లే 15 మంది పిల్లలు మరణించారు. మరింతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారికి ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏ పాటి? ఈ పిల్లల పట్ల, వారి కుటుంబాల పట్ల చూపే మానవత్వం ఇదేనా? మళ్లీ ఇలాంటి తప్పులు జరగకూడదంటే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఆర్ అండ్ బీ ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలంటే చనిపోయిన ప్రతి ఒక్కళ్ల కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తీవ్ర గాయాలపాలైన వాళ్లకు 5 లక్షల వంతున ఇవ్వాలి. తప్పు తమవల్లే జరిగిందని ప్రభుత్వం తెలుసుకుని, ఆ తప్పు తామే చేశామని ఒప్పుకొని, ఆ పిల్లలల కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరిమీదనో నెపం నెట్టడం మానుకుని. ఈ పిల్లల కుటుంబాలకు కనీసం 25 లక్షల పరిహారం ఇవ్వాలి''. -
ప్రమాదస్థలిని సందర్శించిన వైఎస్ జగన్
-
'అనంత' బస్సు ప్రమాదం జరిగిన తీరిదీ!
-
బస్సు ఘటనపై సుమోటో కేసు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై బాలల హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. బస్సు ఘటనను సుమోటో గా స్వీకరించింది. సంఘటనపై పూర్తి విచారణ జరిపించి ఈనెల 19 లోగా నివేదిక సమర్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ కు బాలల హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మడకశిర-పెనుగొండ మార్గంలో బుధవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 16 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. బస్సు మడకశిర నుంచి పెనగొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారు. -
ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపుకు!
-
ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపు!
అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ఆర్టీసి రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సందేహం వెళ్లిబుచ్చారు. అసలు రోడ్డుకు ఎడమ వైపుకు వెళ్లాల్సిన బస్సు, కుడి వైపుకు ఎందుకు వెళ్లిందో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి స్తంభాలు కూడా లేవన్నారు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. కాగా తీవ్రంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో మృతుల సంఖ్య 16కి చేరింది. మరోవైపు ఓవర్ లోడ్ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. -
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి
న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మోదీ సానుభూతి తెలియజేశారు. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రమాదంలో గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా పెనుకొండ-మడకశిర రహదారిలో బస్సు లోయలోకి పడటంతో 16 మంది మరణించగా, మరో 40 మంది గాయపడ్డారు. -
ప్రమాద మృతుల వివరాలు
-
పల్లె 'వెలుగు' నుంచి చీకట్లోకి
అనంతపురం : ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అనేక కుటుంబాల్లో వెలుగులు ఆర్పేసింది. అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం 16 మంది ప్రాణాలు బలిగొంది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారు ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. మడకశిర డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు AP 28 Z 1053 పెనుకొండకు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. బస్సు ప్రయాణికుల్లో చాలా మంది విద్యార్థులే. పెనుకొండలోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న వారే. ఈరోజు ఉదయం 8. ప్రాంతంలో పెనుకొండకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మడకశిర, పెనుకొండ మార్గంలో ఉన్నవన్నీ పల్లెటూళ్లే. దీంతో చదువుకునేందుకు పిల్లలకు సమీప పట్టణమైన పెనుకొండే దిక్కు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నట్టు సమాచారం. హఠాత్తుగా బస్సులో 60 అడుగుల లోతులోకి పడిపోయవడంతో అంతా షాక్ గురయ్యారు. అంత ఎత్తు నుంచి పడటంతో... బస్సు పూర్తిగా దెబ్బతింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమన్న అక్షరాలు తప్ప బస్సంతా నుజ్జు నుజ్జు అయ్యింది. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు : పలువురు మృతి
-
ఘటనాస్ధలికి చేరుకున్న పరిటాల సునీత
-
ప్రమాద మృతుల వివరాలు
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి వివరాలు : *శేఖర్ (నాగలూరు) *లక్ష్మీనారాయణ (నాగలూరు) *అశోక్ కుమార్ (మావుటూరు) *గంగాధర్ (మావుటూరు) * నరేందర్ (మావుటూరు) *నరసింహమూర్తి (మావుటూరు) *హన్మంతరాయుడు (బండపల్లి) *రామకృష్ణ (చిలమత్తూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) *అనిల్ (మావుటూరు) 'అనిత (సబ్బరంపల్లి) *మురళి (పాత గొబ్బరంపల్లి) *శ్రీనివాసులు మృతుల్లో అశోక్, గంగాధర్ అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, హేమవతికి చెందిన శ్రీనివాసులు హిందూపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా మృతుల్లో తొమ్మిది మంది విద్యార్థులే ఉన్నట్లు సమాచారం. గాయపడిన 15 మందిని చికిత్స నిమిత్తం పుట్టపర్తి, బెంగళూరు, అనంతపురం, హిందుపురం ఆస్పత్రులకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
"బస్సు ఘటనపై విచారణ జరిపించాలి'
-
'బస్సు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: మడకశిర ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఉరవకొండ వైఎస్సార్ సిపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటన బాధాకరమని విశ్వేశ్వరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో సహాయ చర్యల్లో పాల్గొనాలని జిల్లా వైస్సార్ సిపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘటనా స్థలికి రానున్నట్టు ఆయన తెలిపారు. -
మధ్యాహ్నం మడకశిరకు వైఎస్ జగన్
హైదరాబాద్ : అనంతపురం జిల్లా మడకశిర ప్రమాద ఘటనా స్థలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం వెళ్లనున్నారు. కాగా మడకశిర వద్ద ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 16మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
పిట్టగోడను ఢీకొట్టి 60 అడుగుల కిందకి..
-
పిట్టగోడను ఢీకొట్టి 60 అడుగుల కిందకి..
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు పిట్టగోడను ఢీకొట్టి సుమారు 60 అడుగుల కిందికి పడిపోయినట్లు తెలుస్తోంది. మడకశిర-పెనుకొండ మార్గంలో ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్‌ను తొలగించేందుకు 60 అడుగుల లోతున కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. కొత్త రోడ్డు కోసం పాత రోడ్డు పక్కనే 60 అడుగుల లోతున అధికారులు తవ్వించారు. అయితే బస్సు డ్రైవర్ దీనిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 16మందికి చేరింది. మరోవైపు గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం
-
పెరుగుతున్న మృతుల సంఖ్య
-
ప్రమాద వార్త కలిచి వేసింది: వైఎస్ జగన్
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త కలచి వేసిందని ఆయన అన్నారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేకమంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా అనంతపురం జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 12మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే...ప్రమాదం
హైదరాబాద్ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండకు బయల్దేరిన బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. కాగా మృతుల సంఖ్య 15 నుంచి 20 వరకూ ఉండవచ్చని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న తాము... ఘటనా స్థలానికి బయల్దేరినట్లు పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. మధ్యాహ్నానికి సంఘటనా స్థలానికి చేరుకుంటామని ఆయన చెప్పారు. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, 10మంది మృతి
-
పెరుగుతున్న మృతుల సంఖ్య
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకి పెరుగుతోంది. ఇప్పటివరకూ 12మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. మరో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు, అనంతపురం, హిందుపురం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో సుమారు 60మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కాగా మృతి చెందినవారి వివరాలు ఖచ్చితంగా తెలియరాలేదని, మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు హుటాహుటీన ఘటనా స్థలానికి బయల్దేరారు. -
మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే..
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మడకశిర నుంచి పెనుకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం మలుపు తిరుగుతూ లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రమాదానికి గురైన బస్సు AP 10 Z 1053. -
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, 16మంది మృతి
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ, మడకశిర మార్గంలో బుధవారం ఉదయం పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు మడకశిర నుంచి పెనుకొండ వెళుతుండగా మలుపు తిరిగే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం సుమారు 50మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఓ కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముందు అద్దం లేకుండా మున్ముందుకు...!
రవాణా శాఖా మంత్రి గారూ... ఆర్టీసీకి వంద రోజుల లక్ష్యం పెట్టారు ... సమస్యలేమైనా ఉంటే సరిచేయాలని సూచించారు ... డిపో ఆవరణల్లో ఆహ్లాదం .. బస్సుల్లోనేకాదు బస్టాండుల్లో పరిశుభ్రత ... బస్సు కండిషన్ బ్రహ్మాండంగా ఉండాలని ఒకటేమిటి ఎన్నో సూక్తులు చెప్పి ఊరించారు .. ప్రయాణికులే మన దేవుళ్లంటూ హారతి పళ్లెం తిప్పి బస్సు ఛార్జీలు పెంచేసి దక్షిణ లాగేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు ... ఈ జిల్లాలోనే అందులోనూ ఒంగోలులోనే శనివారం వివిధ సమీక్షలతో బిజీబిజీగా ఉన్న మీ పక్క నుంచే చూడండి మీ శాఖను వెక్కిరిస్తూ బస్సు ఎలా దీనంగా వెళ్తుందో. ముందు అద్దం లేకుండానే పరుగులు తీస్తోంది. ఇదేదో పల్లె వెలుగు బస్సు అనుకుంటే పొరపాటే. కావలి - నెల్లూరు వైపు తిరిగే సూపర్ లగ్జరీ బస్సు. ‘ప్రయివేటీకరణ చేయం’ అంటున్న మీ మాటల్లో అంతరార్థం ఏమిటో లీలగా అర్థమవుతోంది. ఈ తరహా బస్సులు మరిన్ని తిప్పితే ప్రయాణికులే ఆర్టీసీ వద్దు ‘బాబూ’ అంటారనే కదా మీ ఉద్దేశం. ఇటు ఉద్యోగులను, అటు ప్రయాణికులను ఇలా సిద్ధం చేస్తున్నారా శిద్దా గారూ...