కార్గో సర్వీసుల గురించి వివరాలను అడిగి తెలుసుకుంటున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
చీరాల అర్బన్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పల్లె వెలుగు బస్సులను పూర్తి స్థాయిలో బాగు చేయించి కొత్త రూపు తీసుకొస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పల్లె వెలుగు బస్సులను కొంత హంగులతో రూపొందించి మూడు వేల బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా సుమారు రూ.25 కోట్ల వ్యయంతో అన్ని బస్‌స్టేషన్లలోని మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయించనున్నట్లు వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించామన్నారు. డిపోలోని సర్వీసుల వివరాలు, కార్గో సర్వీసులపై వస్తున్న ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని గార్డెన్, పరిసరాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ ఎండీకి పలు యూనియన్ల నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment