RTC Bus Services
-
‘ఒరిజినల్ ఆధార్’ తప్పనిసరి..
సాక్షి హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని మహిళలు వినియోగించు కోవాలంటే ఒరిజినల్ ఆధార్‌కార్డు తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గుర్తింపుకార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ కార్డు అయినా సరే ఈ పథకానికి వర్తిస్తుందని ఆయన ‘ఎక్స్’వేదికగా సోమవారం పోస్టు చేశారు. అయితే పాన్‌కార్డు మాత్రం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. పాన్‌కార్డుపై అడ్రస్ ఉండదని, అందువల్ల ఆ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా..ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లో ఫొటో కాపీలు, కలర్ జీరాక్స్ చూపిస్తున్నారన్న విషయం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వ్యాఖ్యానించారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ఒరిజినల్ గుర్తింపుకార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఎండీ సజ్జనార్ తెలిపారు. వాదనలకు దిగొద్దు... ’ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం’అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని ఇది సరికాదని ఆయన తెలిపారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని చెప్పారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వారవుతారని వివరించారు. అందువల్ల ప్రతి మహిళ జీరోటికెట్ తీసుకోవాలని. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందన్నారు. అలాగే సదరు మహిళ నుంచి రూ.500 జరిమానా వసూలు చేస్తారని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: అదనపు చార్జీల భారం లేకుండా దసరా పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు నడపనుంది. దసరా కోసం ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేకంగా 5,500 బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఈ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. ► దసరా పండుగకు ముందుగా ఈ నెల 13 నుంచి 22 వరకు 2,700 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. దసరా అనంతరం ఈ నెల 23 నుంచి 26 వరకు 2,800 బస్సు సర్వీసులు నడుపుతారు. ► అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి హైదరాబాద్ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. ► విశాఖపట్నం నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355, విజయవాడ నుంచి 885, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 1,137 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. ► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. ► దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించింది. ► బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866–2570005. ► దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. -
దసరాకు 4,485 స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా ఉత్సవాల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాల కోసం ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 4,485 దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. నవరాత్రుల సందర్భంగా దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు 2,100 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. దసరా అనంతరం తిరుగు ప్రయాణం కోసం 2,385 ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా హైదరాబాద్‌కు 2,290 బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. -
బస్సు.. గుస్సా! ప్రజా రవాణాపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ‘మీ ప్రాంతానికి రావాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నచందంగా మారింది నగరంలో ఆర్టీసీ సర్వీసుల పరిస్థితి. పది వేల జనాభా ఉన్న సింగపూర్ టౌన్‌షిప్‌నకు రెండేళ్లుగా సిటీ బస్సులు నిలిచిపోయాయి. తెల్లారి లేస్తే అంతా ఉద్యోగాలకు వెళ్లేవారే. రెండేళ్లుగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళలు, పిల్లలు, ఈ టౌన్‌షిప్‌నకు వచ్చే బంధుమిత్రులు అవస్థల పాలవుతున్నారు. తాజాగా ఈ రూట్లో బస్సుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు నడుస్తాయా లేదా అనేది సందేహమే. ఒక్క సింగపూర్ టౌన్షిప్ మాత్రమే కాదు. గ్రేటర్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సులు లేవు. 10 ట్రిప్పులు నడపాల్సిన రూట్లలో కేవలం 3 లేదా 4 ట్రిప్పులు తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాల వైపు వెళ్లాల్సివస్తోంది. పదేళ్లుగా కొత్తవి పత్తా లేదు.. ► హైదరాబాద్ మహానగర జనాభా సుమారు కోటిన్నరకు చేరువైంది. ఔటర్‌ను దాటి నగరం విస్తరిస్తోంది. ఏటా వందలాది కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తున్నాయి. ప్రజా రవాణా నిపుణుల అంచనాల ప్రకారం 2015 నాటికే కనీసం 6వేల బస్సులు అవసరం. 2013 నుంచి ఇప్పటి వరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ► అదే సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సిటీ బస్సుల సంఖ్య సగానికి తగ్గింది. గతంలో 3850 బస్సులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 2500కు పరిమితమైంది. మూడేళ్ల క్రితం 850 సిటీ బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరి కొన్నింటికి కాలం చెల్లింది. బస్సుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఉన్న వాటిలోనూ కొన్ని డొక్కు బస్సులే. కానీ కొత్త వాటిని కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో ఉన్నవాటితోనే అధికారులు నెట్టుకొస్తున్నారు. గణనీయంగా తగ్గిన ట్రిప్పులు ► గత పదేళ్లలో ఆర్టీసీ లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు అన్ని రూట్లలో ట్రిప్పుల సంఖ్య పెరగాల్సి ఉండగా భారీగా తగ్గిపోయింది. మూడేళ్ల క్రితం వరకు రోజుకు 42 వేల ట్రిప్పులు తిరిగాయి. అంటే సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు నడిచాయి. ► నిజానికి పెరుగుతున్న జనాభాకు ఈ సదుపాయం తక్కువే. 2015 నాటికే కనీసం 60 వేల ట్రిప్పులకు పెరగవలసి ఉండగా అందుకు భిన్నంగా కనీసం 10 వేల ట్రిప్పులు తగ్గాయి. ‘ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్తుంటే బాధగా అనిపిస్తుంది. మా బస్సెక్కాల్సిన వాళ్లు ఇతర వాహనాల్లో వెళ్లడం బాధగానే ఉంటుంది. కానీ బస్సులే తగినన్ని లేనప్పుడు ఏం చేయగలం’అని ఓ డిపో మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ► ఇప్పటికిప్పుడు కనీసం వెయ్యి కొత్త బస్సులు వచ్చినా కొంతమేరకు ప్రయాణికులకు ఊరట లభించనుంది. ‘కొత్త బస్సులు కొనుగోలు చేయకపోతే ఆర్టీసీ మనుగడ మరింత ప్రశ్నార్థకమవుతుంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. పెరిగిన వ్యక్తిగత వాహనాలు.. కోవిడ్ కంటే ముందే సిటీ బస్సు కుదేలైంది. కోవిడ్‌తో పూర్తిగా నష్టపోయింది. పెరిగిన డీజిల్ ధరలు మరింత దారుణంగా దెబ్బతీశాయి. రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తే ఖర్చు రూ.4.5 కోట్లు దాటుతోంది. రోజుకు కనీసం రూ.కోటి నష్టం. ఈ నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపడుతున్నారే తప్ప బస్సుల సంఖ్య పెంచడంలేదు. ‘మెట్రో’ తారకమంత్రం కాదు.. మెట్రో రైలు ప్రజా రవాణాకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాబోదు. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు సిటీ బస్సు ఒక్కటే పరిష్కారమని సిటిజనులు చెబుతున్నారు. రోజుకు రెండు ట్రిప్పులే జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఉద్దమర్రికి గతంలో రోజుకు 6 ట్రిప్పులు ఉండేవి. ఇప్పుడు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే వస్తున్నాయి. విద్యార్థులు బాగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. – సత్తిరెడ్డి, ఉద్దమర్రి ఎట్టకేలకు స్పందించారు సింగపూర్ టౌన్‌షిప్‌నకు రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా బస్సులను నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు ఇప్పుడు వేశారు. – వెంకట్ మాధవ రెడ్డి, సింగపూర్ టౌన్షిప్ -
ఆర్టీసీ బస్సు ప్రయాణం మరింత సుఖవంతం
సాక్షి, అమరావతి: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’ అనే నినాదాన్ని మరింత నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దశాబ్దంగా పాతబడిన బస్సులతోనే నెట్టుకొస్తున్న దుస్థితికి ఇక ముగింపు పలకనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సులు ఉన్నాయి. వాటిలో దాదాపు 3,800 బస్సులు బాగా పాతబడ్డాయని గుర్తించారు. ఏసీ బస్సులు 10 లక్షల కి.మీ., ఎక్స్‌ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. సర్వీసును పూర్తి చేశాయి. గత టీడీపీ ప్రభుత్వం వివిధ కారణాలతో కొత్త బస్సులను ప్రవేశపెట్టలేదు. దీంతో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు బ్రేక్‌డౌన్ కావడం, ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ముగింపు పలుకుతూ కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందుకోసం మూడంచెల విధానానికి ఆమోదం తెలిపింది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ ద్వారా ఆధునికీకరించడం.. పర్యావరణహితంగా దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మలచడం దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. జూలై చివరికి రోడ్డెక్కనున్న కొత్త బస్సులు త్వరలో కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ చేపట్టి.. వచ్చే నెల రెండోవారం నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. జూలై చివరికి కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీంతో జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు తిప్పడానికి కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఇక 1,150 బస్సులను ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ ద్వారా ఆధునికీకరిస్తున్నారు. కొత్త సీట్లు వేయడం, టైర్లు మార్చడం, ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ద్వారా నూతన రూపు తెస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ గ్యారేజీలలో వెయ్యి బస్సులకు ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో ప్రయాణికులకు ఆ బస్సులు సౌకర్యవంతంగా మారాయి. 150 ఇ–బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆర్టీసీ దశలవారీగా ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో నడపడానికి 150 ఇ–బస్సుల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ఉన్న దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఒక డీజిల్ బస్సును రెట్రోఫిట్ చేసి ఇ–బస్సుగా మార్చారు. త్వరలో ఆ బస్సును పుణెలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (సీఐఆర్టీ) పరిశీలనకు పంపించనున్నారు. సీఐఆర్టీ ఆమోదించాక ఆ ప్రమాణాల మేరకు దాదాపు 2 వేల డీజిల్ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మారుస్తారు. ప్రయాణికులకు సుఖమయ ప్రయాణమే లక్ష్యం ప్రయాణికులకు సుఖమయ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. దీర్ఘకాలంగా ఉన్న పాత బస్సుల సమస్య త్వరలో పరిష్కారం కానుంది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెడతాం. అలాగే దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ కోసం ఇ–బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను వేగవంతం చేస్తున్నాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఎండీ, ఆర్టీసీ -
ప్రయాణికులకు ఆర్టీసీ సరికొత్త ఆఫర్
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ–బెంగళూరుల మధ్య ప్రయాణించే వారికి ఆర్టీసీ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి (ఏసీ) బస్సుల్లో ప్రయాణించే వారికి టిక్కెట్ చార్జీలో 20 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ బస్సులు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి. ఆయా స్టేషన్లలో బస్సులు ఎక్కే ప్రయాణికులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం మాత్రం రాయితీ లేకుండా సాధారణ చార్జీనే వసూలు చేస్తారు. వారంలో మిగిలిన అన్ని రోజులు 20 శాతం రాయితీ ఇస్తారు. విజయవాడ నుంచి బెంగళూరుకు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరే వెన్నెల స్లీపరు సర్వీసు (నెం.3870)లో సాధారణ టికెట్టు చార్జి రూ.1,830 కాగా, 20 శాతం రాయితీ పోను రూ.1,490గా నిర్ణయించారు. సాయంత్రం 6.00 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే అమరావతి సర్వీసు (నెం.3872)లో సాధారణ టికెట్టు రూ.1,710కు గాను రాయితీ పోను రూ.1,365 వసూలు చేస్తారు. ఇక బెంగళూరు నుంచి రాత్రి 7.30కి విజయవాడ బయలుదేరే వెన్నెల స్లీపరు సర్వీసు (నెం.3871)కు రూ.1,490, రాత్రి 9.00 గంటలకు బయలుదేరే అమరావతి సర్వీసు (నెం.3873)కు రూ.1,365గా టికెట్ ధర నిర్దేశించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎం.వై.దానం సూచించారు. -
ఆర్టీసీకి ఒమిక్రాన్ దెబ్బ!
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ బస్సులపై ఒమిక్రాన్ ప్రభావం గణనీయంగా పడుతోంది. సంక్రాంతికి విపరీతమైన రద్దీ ఉంటుందని ఆశించిన సంస్థకు కరోనా కొత్త వేరియంట్ దెబ్బ కొడుతోంది. రోజురోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడంతో పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారు వెనకడుగు వేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ చేదు జ్ఞాపకాలకు భయపడి ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రభావం ఆర్టీసీ బస్సులపై బాగా కనిపిస్తోంది. ఈసారి రిజర్వేషన్లు అంతంతమాత్రమే వాస్తవానికి సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దూరప్రాంతాలకు వెళ్లే వారు రెండు, మూడు వారాల ముందుగానే ముందస్తు రిజర్వేషన్లు చేయించుకుంటారు. కానీ, ఈ సంక్రాంతికి అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. కోవిడ్ ప్రభావంవల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులను నడిపారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిందన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతికి ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1,266 ప్రత్యేక (స్పెషల్) బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్‌కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు 120 బస్సులను తిప్పడానికి ప్లాన్ చేశారు. అయితే.. ఇప్పటివరకు రోజువారీ తిరిగే రెగ్యులర్ బస్సుల్లో 50 శాతం, స్పెషల్ బస్సుల్లో 40 శాతం వరకే ప్రయాణికులు రిజర్వేషన్లు చేయించుకున్నారు. గడచిన మూడు రోజుల్లో రీజియన్ నుంచి 600 స్పెషల్ సర్వీసులు నడపాల్సి ఉండగా కేవలం 150 బస్సులనే నడపగలిగినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరికి తాకిడి ఏటా సంక్రాంతి పండగకు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకుంటారు. అందువల్ల బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం భర్తీ అవుతున్న సీట్లలో విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో దాదాపు నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఆ స్థాయిలో సీట్లు భర్తీ కావడంలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి అరకొర.. ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సంక్రాంతికి వచ్చే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటోందని ఆర్టీసీ అధికారులు అంచనాకొచ్చారు. కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఆయా ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూçపకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రయాణికులు విధిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తోంది. అలాగే, రైల్వేశాఖ కూడా అప్రమత్తమైంది. అన్ని రైలు బోగీల్లోనూ ఆర్పీఎఫ్ సిబ్బంది తిరుగుతూ ప్రతి ప్రయాణికుడి వద్దకు వెళ్లి చూస్తున్నారు. మాస్కులు లేకుండా.. సరిగా ధరించని వారికి దగ్గరుండి మాస్కులు ధరించేలా చేస్తున్నారు. -
పల్లె వెలుగు బస్సులకు కొత్త రూపు
చీరాల అర్బన్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పల్లె వెలుగు బస్సులను పూర్తి స్థాయిలో బాగు చేయించి కొత్త రూపు తీసుకొస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పల్లె వెలుగు బస్సులను కొంత హంగులతో రూపొందించి మూడు వేల బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా సుమారు రూ.25 కోట్ల వ్యయంతో అన్ని బస్స్టేషన్లలోని మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయించనున్నట్లు వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించామన్నారు. డిపోలోని సర్వీసుల వివరాలు, కార్గో సర్వీసులపై వస్తున్న ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని గార్డెన్, పరిసరాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ ఎండీకి పలు యూనియన్ల నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. -
త్వరలో టీఎస్ఆర్టీసీలో స్లీపర్ సర్వీసులు!
సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీ.. నగరం నుంచి ఏపీ సహా దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ సరీ్వసులన్నీ నిండిపోయాయి. ఆన్లైన్ రిజర్వేషన్లో సోమవారం రోజున సీట్లు ఖాళీ లేవని చూపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూరప్రాంతాల సరీ్వసుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతమే. ఎందుకీ తేడా.. ఆరీ్టసీ, ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య ఆక్యుపెన్సీ రేషియోలో తేడాలుండటానికి ప్రధాన కారణం స్లీపర్ సర్వీసులే. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రి పడుకుని ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రైవేట్ ట్రావెల్స్ తమ బస్సుల్లో సింహభాగం స్లీపర్ సర్వీసులుగా మార్చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దాదాపు వేయికి పైగా స్లీపర్ సర్వీసులు నడుస్తున్నాయని అంచనా. దీనిపై ఇప్పుడు ఆర్టీసీ కూడా మేల్కొంది. కొత్తగా స్లీపర్ సర్వీసులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది.\ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆరీ్టసీలో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా స్లీపర్ సర్వీసుల అంశాన్ని ఎండీ ప్రస్తావించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండేందుకు ఇదే ప్రధాన కారణమంటూ అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. గతంలో ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు ప్రారంభించాలని నిర్ణయించినా, ఓ ఉన్నతాధికారి అడ్డుకోవడంతో అది అటకెక్కిందని చెప్పారు. ఇప్పుడు కొన్ని బస్సులు నడిపితే వాటికి ఆదరణ ఎలా ఉందో తెలుస్తుందని సూచించారు. దీంతో స్లీపర్ సర్వీసులు తీసుకునేందుకు ఎండీ సంసిద్ధత వ్యక్తంచేశారు. కాస్త ఆదాయం మెరుగుపడిన తర్వాత బ్యాంకుల నుంచి కొత్తగా రుణం తీసుకుని కొన్ని స్లీపర్ సరీ్వసులు సమకూర్చుకోవాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. నాన్ ఏసీ స్లీపర్‌కు గిరాకీ ఎక్కువ.. దాదాపు నాలుగైదేళ్ల క్రితం వరకు ప్రైవేట్ ట్రావెల్స్‌లో సాధారణ బస్సులే ఎక్కువగా ఉండేవి. 20 శాతమే స్లీపర్ బస్సులుండేవి. ప్రయాణికుల నుంచి స్లీపర్‌కు డిమాండ్ పెరగడంతో చాలా బస్సులను ట్రావెల్స్ నిర్వాహకులు స్లీపర్లుగా మార్చారు. వీటిల్లోనూ నాన్ ఏసీ బస్సులకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. స్లీపర్ సర్వీసులపై లాభాలెక్కువగా ఉండటంతో క్రమంగా వాటి సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇదే బాటపట్టింది. కాగా, సజ్జనార్ స్లీపర్ బస్సులను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉండటంతో, గరుడ ప్లస్ బస్సుల్లో కొన్నింటిని స్లీపర్ నమూనాలోకి మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. -
తిరుమల–తిరుపతిల్లో ఈ–బస్సులకు రైట్‌రైట్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సులకు ఆర్టీసీ రైట్‌రైట్ చెప్పింది. తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో 50, తిరుపతి ఇంటర్ సిటీ సర్వీసుగా 50 ఈ–బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రవేశపెట్టడానికి టెండర్లను బుధవారం ఆమోదించింది. ఏసీ డీజిల్ అద్దె బస్సుల ధరకే ఏసీ ఈ–బస్సులను ప్రవేశపెట్టడానికి ఆమోదిస్తూ టెండర్లు ఖరారు చేసింది. దేశంలోనే అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను ఖరారు చేసిన సంస్థగా ఆర్టీసీ గుర్తింపు పొందింది. రాష్ట్రంలో తిరుమల–తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరులలో 350 ఏసీ ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు 5 ప్యాకేజీల కింద ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. టెక్నికల్ బిడ్‌లో ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ కంపెనీలు అర్హత సాధించి ఫైనాన్సియల్ బిడ్లు దాఖలు చేశాయి. ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 ప్యాకేజీలలో ఎల్–1గా నిలవగా, అశోక్ లేలాండ్ 2 ప్యాకేజీలలో ఎల్–1గా వచ్చింది. అధిక ధరలు కోట్ చేస్తే సమ్మతించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులకు విస్పష్టంగా చెప్పారు. ఆర్టీసీ డీజీల్ బస్సుల రేట్లకే ఈ–బస్సులను టెండర్లు ఖరారు చేయాలన్నారు. అందుకు సాధ్యం కాకపోతే ఏకంగా టెండర్ల ప్రక్రియ నిలిపేయాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ రెండు సంస్థలతో పలు దఫాలుగా చర్చించారు. తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సుల అంశంలో డీజిల్ బస్సుల ధరలకు దగ్గరగా రావడంతో ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టెండర్లు ఖరారు చేశారు. అధిక ధరలు కోట్ చేయడంతో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరుల్లో ఈ–బస్సుల టెండర్ల అంశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఆర్టీసీపై ఆర్థికభారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తిరుమల–తిరుపతిలో ప్రవేశపెట్టే ఈ–బస్సుల పనితీరును సమీక్షించడంతోపాటు రానున్న ఏడాదిలో ఈ–బస్సుల ధరలు మరింతగా తగ్గితే ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. కిలోమీటరుకు రూ.52.52 తిరుమల–తిరుపతిల్లో 100 ఈ–బస్సులకు టెండర్లను ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఖరారు చేశారు. తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 50 బస్సులు, తిరుపతి సిటీ సర్వీసు కింద 50 బస్సులను ప్రవేశపెడతారు. ఘాట్‌రోడ్డులో తిరిగే ఈ–బస్సులకు విద్యుత్ ఖర్చులతో కలిపి కిలోమీటరుకు రూ.52.52 చొప్పున చెల్లిస్తారు. దీన్లో బస్సు చార్జీలు రూ.45.76, విద్యుత్ చార్జీలు రూ.6.76. తిరుపతి సిటీ సర్వీసులో తిరిగే ఈ–బస్సులకు విద్యుత్ ఖర్చులతో కలిపి కిలోమీటరుకు రూ.44.95 చొప్పున చెల్లిస్తారు. దీన్లో బస్సు చార్జీలు రూ.38.19, విద్యుత్ చార్జీలు రూ.6.76. దేశంలోనే అత్యంత తక్కువ ధర దేశంలోనే అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను ఆర్టీసీ ఖరారు చేసింది. ఘాట్‌రోడ్డు, సాధారణ రోడ్డులలో ఈ–బస్సులకు దేశంలో ఇప్పటివరకు తక్కువ ధరకు ఖరారైన టెండర్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. దేశంలో ఘాట్‌రోడ్లపై ఇప్పటివరకు అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను డెహ్మాడూన్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. విద్యుత్ చార్జీలతో కలిపి కిలోమీటరుకు రూ.66.78కి టెండర్లు ఆమోదించారు. మన రాష్ట్రంలో తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో ఈ–బస్సుల టెండర్లను విద్యుత్ చార్జీలతోసహా కేవలం రూ.52.52కే ఆర్టీసీ ఆమోదించింది. డెహ్రాడూన్‌లో 27+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టారు. అంతకంటే తక్కువ ధరకు తిరుమల–తిరుపతిలో 35+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. దేశంలో సాధారణ రోడ్లపై ఇప్పటికి అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను మహారాష్ట్రలోని నవీ ముంబాయి కార్పొరేషన్ ఖరారు చేసింది. విద్యుత్ చార్జీలతోసహా అక్కడ కిలోమీటరుకు రూ.52.20కు టెండర్లు ఆమోదించారు. అంతకంటే తక్కువగా ఆర్టీసీ తిరుపతి ఇంటర్ సిటీ సర్వీసుల కోసం ఈ–బస్సుల టెండర్లను కిలోమీటరుకు కేవలం రూ.44.95కే ఖాయం చేయడం విశేషం. నవీ ముంబాయిలో 27+1 కెపాసిటీ ఈ–బస్సులను ప్రవేశపెట్టగా అంతకంటే తక్కువ ధరకు తిరుపతిలో ఇంటర్ సిటీ సర్వీసుల కోసం 35+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. నాలుగు నెలల్లో రోడ్లపైకి బస్సులు టెండర్లు ఖరారు చేయడంతో తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సులు త్వరలో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బస్సులను సమకూర్చుకున్న తరువాత వాటిని రాష్ట్ర రహదారులపై పరీక్షిస్తారు. ప్రమాణాల మేరకు ఉన్నట్టు నిర్ధారించిన తరువాతే అనుమతిస్తారు. నాలుగు నెలల్లో ప్రయాణికులకు ఈ–బస్సుల సేవలు అందుతాయని ఆర్టీసీ భావిస్తోంది. -
5 బస్సులు ఆపిన తమిళనాడు.. 24 బస్సుల్ని పట్టుకున్న ఏపీ
సాక్షి, అమరావతి: పండుగ సమయంలో తమిళనాడు రవాణాశాఖ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని నిలిపేసింది. వెంటనే మన రాష్ట్ర రవాణాశాఖ తమిళనాడు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై పట్టు బిగించింది. చివరకు తమిళనాడు అధికారులు దిగొచ్చారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు సఫలం కావడంతో వివాదం ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఉన్నా.. చిన్న కారణాలతో తమిళనాడు అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఆ రాష్ట్రంలో నిలిపేశారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే. బస్సులో పర్మిట్ లేదనే కారణంతో తిరుపతి డిపోకు చెందిన మూడు, చిత్తూరు డిపోకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో తమిళనాడు అధికారులతో చర్చలు జరపాలని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. మన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడం వెనుక ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా ప్రమేయం ఉందని భావించిన రవాణాశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తమిళనాడుకు చెందిన ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు ముమ్మరం చేసి 24 బస్సులను సరైన పర్మిట్లు లేవని నిలిపేశారు. ఈలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సులను వదిలేశారు. -
ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ: దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. అయితే పండుగ సందర్భంగా ప్రయాణికులు సౌలభ్యం కోసం రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సులు నడిపేందుకు ఏసీఎస్ ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ (విజయవాడ జోన్) ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దసరా సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌కు బస్సులు నడపలేకపోతున్నామని, అయితే సరిహద్దుల దాక నడుపుతామని వెల్లడించారు. విజయవాడ నుంచి గరికపాడు వరకూ, గుంటూరు జిల్లాలో చెక్‌పోస్ట్ వరకూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం వస్తున్నా.. తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా కూడా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నిన్న మీడియాకు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని, 1.61 లక్షల కి.మీకే పరిమితం అయ్యామని చెప్పారు. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం వస్తున్నా కేవలం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు నడపాలనే ఉద్దేశంతో టీఎస్ ఆర్టీసీ డిమాండ్లకు అంగీకరించామని వివరించారు. ఈ నెల 19నే తుది ప్రతిపాదనలు పంపించామని, వాళ్లు కోరినట్లు ప్రతిపాదనలు పంపినా ఇంకా గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. రోజుకు 3.5 కోట్ల రూపాయల నష్టం ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. విజయవాడ - హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తగ్గించాలని తెలంగాణ అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపించాం. ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70 వేల కి.మీ. చొప్పున బస్సులు నడుపుదామని ప్రతిపాదించినా వారు అంగీకరించలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకు రూ. 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. -
సర్వీసులో మృతిచెందిన వారి చివరి మొత్తాల చెల్లింపులు
సాక్షి, అమరావతి: సర్వీసులో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల చివరి మొత్తాల చెల్లింపులకు యాజమాన్యం అంగీకరిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల చివరి చెల్లింపులైన గ్రాట్యుటీ, ఆర్జిత లీవులు, చివరి నెల జీతాలను చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల చివరి మొత్తాలు ఆడిట్ చేసి నవంబర్ ఐదో తేదీలోగా కేంద్ర కార్యాలయానికి రికార్డులు పంపాలని ఉత్తర్వులిచ్చారు. సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తమ ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్స్ వివరాలను సమీప బస్ డిపోలో అందించాలని ఉత్తర్వుల్లో కోరారు. -
ఆర్టీసీ బస్సుల్లో మరింత మందికి అవకాశం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లోకి ప్రయాణికుల అనుమతికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు జరిగాయి. అన్ని సీట్లలోకి ముందుగా ఒక్కో ప్రయాణికుడు కూర్చునేందుకు అనుమతించి.. ఆ తర్వాత రెండో ప్రయాణికుడికి అవకాశం కల్పిస్తామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కె.బ్రహ్మానందరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదాహరణకు పల్లెవెలుగు బస్సులో ముగ్గురు కూర్చునే సీట్లు 11, ఇద్దరు కూర్చునే సీట్లు 9 ఉంటాయి. మొదటిగా ముగ్గురు కూర్చునే సీట్లలోకి ఒక్కొక్క ప్రయాణికుడిని అనుమతించి.. అన్నీ నిండిన తర్వాత పక్కన రెండో ప్రయాణికుడు కూర్చునేందుకు అవకాశమిస్తారు. అలా ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరూ నిండిన తర్వాత.. అవసరమైతే ఇద్దరు కూర్చునే సీట్లలోకి కూడా రెండో ప్రయాణికుడిని అనుమతిస్తారు. నిలబడి ప్రయాణించడానికి మాత్రం అనుమతించరు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందే. ఇప్పటికే బస్స్టేషన్లలోని అన్ని స్టాళ్లలో మాస్క్‌లు విక్రయించేలా ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలిచ్చింది. నిబంధనలను తప్పకుండా పాటించాలని కండక్టర్లు, డ్రైవర్లను యాజమాన్యం ఆదేశించింది. -
2 రోజులు.. 4 లక్షల మంది
సాక్షి, అమరావతి: సర్వీసులు ప్రారంభమైన రెండ్రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో నాలుగు లక్షల మందికి పైగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో ఆర్టీసీ 2,824 బస్సు సర్వీసుల్ని నడిపింది. కోవిడ్–19 నిబంధనల నేపథ్యంలో భౌతికదూరం పాటించడానికి బస్సుల్లో సీట్ల సంఖ్య తగ్గించింది. దీంతో ఆక్యుపెన్సీ 64 శాతంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులకు కలిపి ఆర్టీసీ ఆదాయం రూ. కోటి దాటింది. శుక్రవారం 1,375 సర్వీసులు తిప్పాలని ప్రణాళికలు రూపొందించగా, 1,341 బస్సుల్ని నడిపారు. వీటిలో 1,003 బస్సులకు కౌంటర్లు, బుకింగ్ పాయింట్ల ద్వారా, 338 బస్సులకు ఆన్లైన్ ద్వారా టికెట్లు జారీ చేశారు. అయితే గుంటూరు జిల్లాలో బుకింగ్ పాయింట్ల ద్వారా టికెట్లు జారీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,612 బుకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో అనుకున్న వాటికన్నా అధికంగా బస్సులు తిప్పారు. ► గురువారం సర్వీసులు ప్రారంభించే రోజుకి 1,683 బస్సుల్ని తిప్పాల్సి ఉండగా, 1,483 సర్వీసుల్ని మాత్రమే ఆర్టీసీ నడిపింది. 3.78 లక్షల కిలోమీటర్ల మేర ఈ బస్సులు తిరిగాయి. ► తొలి రోజు రూ.71 లక్షలు ఆదాయం రాగా, ఇందులో రూ.10.91 లక్షల ఆదాయం ఆన్లైన్ ద్వారా సమకూరింది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తానికి ఏప్రిల్ నెల జీతం 90 శాతం మేర చెల్లించాలని సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఉత్తర్వులు జారీ చేశారు. ► ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్ట్‌లకు మాత్రమే రాయితీ పాస్‌లను అనుమతించాలని నిర్ణయించారు. -
నేటి నుంచి ప్రగతి రథం పరుగులు
చార్జీలు యధాతథంగా ఉంటాయి. అన్ని రకాల రాయితీ ప్రయాణాల్ని తాత్కాలికంగా నిలిపేశాం. ప్రతి ప్రయాణికుడు మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ కలిగి ఉండాలి. టిక్కెట్ ఉన్న ప్రయాణికుడిని మాత్రమే బస్టాండ్‌లోకి అనుమతిస్తారు. ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వాలెట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్లు దాటిన వాళ్లు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం. నెమ్మదిగా ఆర్థిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతాం. రాత్రి పూట కర్ఫ్యూ ఉన్నా, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడుపుతాం. అయితే ప్రయాణికులు రాత్రి 7 గంటలలోపే బస్టాండ్‌కు చేరుకోవాలి. విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడపటం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపాలని ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి రాగానే ఆ సర్వీసులు ప్రారంభిస్తాం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిం చనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ ప్రారంభమైంది. కండక్టర్లు లేకుండా నగదు రహిత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఆర్టీసీ హౌజ్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ► సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్ చేశాం. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బస్టాండ్లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించాం. ► 58 రోజుల నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిత్యావసర వస్తువుల కోసం కొన్ని బస్సులు తిప్పాం. వలస కూలీల కోసం అన్ని చెక్‌పోస్ట్‌లలో బస్సులు ఉంచాం. రిలీఫ్ సెంటర్లకు వారిని చేర వేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేశాం. ► ప్రతి బస్టాండ్‌లో శానిటైజర్ సదుపాయాన్ని కల్పించాం. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం. ► మన రాష్ట్రంలో తొలుత 17 శాతం సర్వీసులు, అంటే 1,683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం. ► ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. 26 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహిస్తాం. అటెండర్లు ఉండరు. ఏసీ సర్వీసుల్లో దుప్పట్లు ఇవ్వము. ► లాక్డౌన్ కాలంలో ఆర్టీసీకి రూ.1,200 కోట్ల నష్టం వచ్చింది. రూ.700 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. -
ఛార్జీలు పెంచడం లేదు : ఆర్టీసీ ఎండీ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను రేపటి నుంచి పునఃప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్నామన్నారు. సిటీ బస్సు సర్వీసులు తరువాత ప్రారంభిస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతుందన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది. అయినా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రి పూట బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కానీ, బస్ స్టాండ్‌కి రాత్రి 7 లోపు చేరుకోవాలని సూచించారు. (ఆ వెబ్సైట్ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు) ‘విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడపడటం లేదు. అంతరాష్ట్ర సర్వీసులు నడపాలని భావించాం. ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి వచ్చాక అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తాం. సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్ చేశాం. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బస్ స్టాండ్లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించాం. 58 రోజుల నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.(ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు) నిత్యావసర వస్తువుల కోసం కొన్ని బస్సులు తిప్పాం. వలస కూలీల కోసం అన్ని చెక్ పోస్ట్‌లలో బస్సులు ఉంచాం. రిలీఫ్ సెంటర్లలో వాళ్లని చేరవేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేశాం. ప్రతి బస్ స్టాండ్‌లో శానీటైజర్ సదుపాయాన్ని కల్పిచాము. బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరి, ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం. ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేస్తే, వాటికి రిజర్వేషన్ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం. నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతున్నాం. కాబట్టి 17 శాతం సర్వీసులు, అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. కానీ దుప్పట్లు ఇవ్వము. ఛార్జీలను పెంచట్లేదు’ అని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు.(యువకుడ్ని దారుణంగా హింసించిన వైనం) -
రేపట్నుంచి ఆర్టీసీ సర్వీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను ఈనెల 21వతేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. కరోనా నియంత్రణ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం ఉండేలా బస్సు సీట్లలో మార్పులు చేశామన్నారు. మధ్యలో ఎక్కడా ఆగవు... ► జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తారు. మధ్యలో ఎక్కడా బస్సులు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోరు. ప్రయాణికులు మాస్క్‌లు ధరించాలి. ► టికెట్లు ఆన్లైన్లోనే రిజర్వేషన్ చేసుకోవాలి. కరెంట్ బుకింగ్ టికెట్లు కూడా ఆన్లైన్లోనే రిజర్వేషన్ చేసుకోవాలి. టికెట్లు చూపించటం, మొబైల్ మెస్సేజ్‌లు చూపించటం లాంటివి ఉండవు. ► కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర పనులు, వైద్య సేవల కోసం మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. -
ఆర్టీసీకి వణుకు!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ నిలువెల్లా వణికిపోయే పరిస్థితి తలెత్తింది. గతంలో కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువ వేతన సవరణకు ఉదారంగా అంగీకరించిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేయడంతో దివాలా దశకు చేరుకుంది. సిబ్బందికి వేతనాలు చెల్లించటం కూడా కష్టంగా మారింది. ఇప్పుడు మరోసారి వేతన సవరణ కోసం కార్మికులు పట్టుపడుతుండటంతో సంస్థకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ఆర్టీసీలో వేతన సవరణ గడువు ప్రకారం జరగదు. ఎప్పుడూ రెండుమూడేళ్ల ఆలస్యంగానే జరుగుతుంది. ఈసారి గడువు తీరి ఏడాది గడిచింది. దీంతో వెంటనే కొత్త వేతన సవరణ చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి వేతన సవరణ జరిగే వరకు ఎదురుచూడకుండా ముందుగానే మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని, అది 25 శాతం తగ్గకుండా ఉండాలని యాజమాన్యం ముందు డిమాండ్ ఉంచారు. జీతాలకే దిక్కులు.. ప్రస్తుతం ప్రతినెలా వేతనాల కోసం ఆర్టీసీ యాజమాన్యం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మే నెల వేతనాలు నాలుగు రోజులు ఆలస్యంగా అందించింది. ఈ పరిస్థితిలో కార్మికులు డిమాండ్ చేస్తున్న 25 శాతం మధ్యంతర ఉపశమనం ప్రకటిస్తే సాలీనా రూ.300 కోట్ల భారం పడుతుంది. దాన్ని భరించే శక్తి ప్రస్తుతం ఆర్టీసీకి లేదు. గత వేతన సవరణ సమయంలో ఆర్టీసీకి 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 32 నుంచి 35 శాతం మధ్య ప్రకటించినా చాలని కార్మికులు అనుకున్నా.. ప్రభుత్వం 44 శాతం ప్రకటించడం కార్మికులను ఆశ్చర్యపరిచింది. దాంతో ఏటా రూ.850 కోట్ల భారం పడింది. ఆ భారం పూర్తిగా ఆర్టీసీపై పడకుండా చూస్తామని అప్పట్లో సీఎం హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపు సమయంలో ప్రభుత్వం రూ.750 కోట్లు అందజేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. పెరిగిన జీతాలు చెల్లించటం సాధ్యం కాక కొత్త నియామకాలను ఆర్టీసీ పూర్తిగా నిలిపేసింది. ఆదుకోకుంటే కష్టమే! పదవీవిరమణ పొందినవారి స్థానంలో కొత్త సిబ్బంది లేక ఉన్నవారిపై భారం పడింది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోందంటూ కార్మికులు యాజమాన్యంతో ఘర్షణకు దిగుతున్నారు. వెరసి సంస్థ నిర్వహణ యావత్తు అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి తరుణంలో అదనంగా రూ.300 కోట్లు భారం మోయటం అసాధ్యం. దీంతో ఏం చేయాలో తోచక ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని, సాయం అందకుంటే సంస్థను నడపలేమంటూ సీఎంకు వివరించాలని నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అధికారులు కలవనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీకే ఆర్టీసీ వేతన సవరణ బాధ్యలిస్తారా? మరో కమిటీ ఏర్పాటు చేస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదు. సగం బస్సులు డిపోలకే పరిమితం ఆర్టీసీ గుర్తింపు సంఘం సోమవారం బస్‌భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉదయం 50 శాతానికంటే ఎక్కువ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అధికారులు అతికష్టం మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కొన్ని బస్సులను తిప్పగలిగారు. కండక్టర్లు అందుబాటులో లేనిచోట డ్రైవర్లతోనే కండక్టర్ విధులు చేయించారు. -
శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌లోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి, వరంగల్‌లోని వే యి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి, పాలకుర్తి సోమనాథ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు హైదరాబాద్ నుం చి బయలుదేరి సోమవారం రాత్రికి తిరిగి హైదరాబా ద్ చేరుకుంటాయి. టిక్కెట్ ధర రూ.900. పంచారామాల దర్శనం..: గుంటూరు జిల్లా అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాల కొల్లు, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, సామర్లకోటకు వెళ్లేందుకు కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం, ఆ నెలలోని పౌర్ణమికి ఒక రోజు ముందు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. దర్శనం అనంతరం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటాయి. టిక్కెట్ ధర రూ.1500. ప్రయాణికులు తమ సీట్లను మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్ బస్‌స్టేషన్, హైదరాబాద్‌లోని అన్ని అధీకృత టికెట్ బుకింగ్ కేంద్రాలలో రిజర్వ్ చేసుకోవచ్చు. -
వినాయక చవితికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 6, 7 తేదీల్లో బయల్దేరి వెళతాయి. రోజూ తెలంగాణ జిల్లాలకు రాకపోకలు సాగించే 2,836 రెగ్యులర్ బస్సులతోపాటు 6న 145, 7వ తేదీన 300 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే తీసుకుంటారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి, పలు ఆర్టీసీ టికెట్ బుకింగ్ కేంద్రాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. పై రెండు రోజుల్లో ఆదిలాబాద్‌కు 15, నిజామాబాద్‌కు 20, కరీంనగర్‌కు 90, వరంగల్‌కు 60, ఖమ్మంకు 30, నల్లగొండకు 60, మహబూబ్‌నగర్‌కు 60, మెదక్‌కు 60 బస్సుల చొప్పున నడుపుతారు. ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ల నుంచి మరో 40 బస్సులను కూడా సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు. -
ఆగిన ప్రగతి ‘రథ చక్రాలు’
* సీమాంధ్రలో మూడోరోజూ సమ్మె సంపూర్ణం * డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు * స్వాతంత్య్ర వేడుకలకు ఉద్యోగుల హాజరు సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో గురువారం మూడోరోజూ సమ్మె సంపూర్ణంగా జరిగింది. 12 జిల్లాల్లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రం కొన్ని బస్సులు డిపోల నుంచి వెళ్లాయి. సమ్మె నుంచి తిరుమల డిపోను మినహాయించడంతో తిరుపతి, తిరుమల మధ్య గురువారం 75 బస్సులు తిరిగాయి. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులూ పూర్తిగా నిలిచిపోయాయి. పరిమిత సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఆపరేటర్లు టికెట్ ధరలను భారీగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని అన్ని జిల్లాల్లోని సమైక్య ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉద్యోగుల సమ్మె ప్రభావం పెద్దగా లేదు. వేడుకల్లో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. నేడు గుంటూరులో ఉద్యోగ సంఘాల సమావేశం సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు శుక్రవారం గుంటూరులో సమావేశం కానున్నాయి. ఈ భేటీలో సమ్మె సాగుతున్న తీరును సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఆంటోనీ కమిటీ ముందు హాజరుకావాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందంలో ఎవరు ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే విషయంలోనూ చర్చ జరగనుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆవిర్భావం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సాగుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో గురువారం ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ ఆవిర్భవించింది. వేదిక కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. సీమాంధ్రలోని అన్ని వర్గాలను వేదికలో భాగస్వాములుగా చేయాలని గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ సభలో నిర్ణయించారు. సభ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సమైక్య సభ ఏర్పాటు గురించి ఆవిర్భావ సభలో చర్చించామని వెల్లడించారు. నగరంలో ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, మరో సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ జేఏసీ సమరశంఖం విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ సమర శంఖం పూరించింది. శుక్రవారం నుంచీ నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపీడీసీఎల్ సీఎండీకి లేఖను అందజేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈపీడీసీఎల్ పరిధిలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని జేఏసీ నేతలు తీర్మానించారు. 19, 20, 21 తేదీల్లో బైక్ ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో రాస్తారోకోలు, 25న వంటావార్పు, 26, 27, 28 తేదీల్లో మౌన ప్రదర్శన.. 29, 30, 31 తేదీల్లో మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేపడతారు. సెప్టెంబర్ 4 తేదీ వరకు ఆందోళనలు నిర్వహించి, అప్పటికీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటే మెరుపు సమ్మెకు వెళతామని జేఏసీ చైర్మన్ వీఎస్‌ఆర్‌కె గణపతి లేఖలో పేర్కొన్నారు. -
ఆగిన ప్రగతి ‘రథ చక్రాలు’
* సీమాంధ్రలో మూడోరోజూ సమ్మె సంపూర్ణం * డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు * స్వాతంత్య్ర వేడుకలకు ఉద్యోగుల హాజరు సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో గురువారం మూడోరోజూ సమ్మె సంపూర్ణంగా జరిగింది. 12 జిల్లాల్లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రం కొన్ని బస్సులు డిపోల నుంచి వెళ్లాయి. సమ్మె నుంచి తిరుమల డిపోను మినహాయించడంతో తిరుపతి, తిరుమల మధ్య గురువారం 75 బస్సులు తిరిగాయి. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులూ పూర్తిగా నిలిచిపోయాయి. పరిమిత సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఆపరేటర్లు టికెట్ ధరలను భారీగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని అన్ని జిల్లాల్లోని సమైక్య ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉద్యోగుల సమ్మె ప్రభావం పెద్దగా లేదు. వేడుకల్లో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. నేడు గుంటూరులో ఉద్యోగ సంఘాల సమావేశం సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు శుక్రవారం గుంటూరులో సమావేశం కానున్నాయి. ఈ భేటీలో సమ్మె సాగుతున్న తీరును సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఆంటోనీ కమిటీ ముందు హాజరుకావాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందంలో ఎవరు ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే విషయంలోనూ చర్చ జరగనుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆవిర్భావం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సాగుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో గురువారం ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ ఆవిర్భవించింది. వేదిక కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. సీమాంధ్రలోని అన్ని వర్గాలను వేదికలో భాగస్వాములుగా చేయాలని గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ సభలో నిర్ణయించారు. సభ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సమైక్య సభ ఏర్పాటు గురించి ఆవిర్భావ సభలో చర్చించామని వెల్లడించారు. నగరంలో ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, మరో సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ జేఏసీ సమరశంఖం విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ సమర శంఖం పూరించింది. శుక్రవారం నుంచీ నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపీడీసీఎల్ సీఎండీకి లేఖను అందజేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈపీడీసీఎల్ పరిధిలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని జేఏసీ నేతలు తీర్మానించారు. 19, 20, 21 తేదీల్లో బైక్ ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో రాస్తారోకోలు, 25న వంటావార్పు, 26, 27, 28 తేదీల్లో మౌన ప్రదర్శన.. 29, 30, 31 తేదీల్లో మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేపడతారు. సెప్టెంబర్ 4 తేదీ వరకు ఆందోళనలు నిర్వహించి, అప్పటికీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటే మెరుపు సమ్మెకు వెళతామని జేఏసీ చైర్మన్ వీఎస్‌ఆర్‌కె గణపతి లేఖలో పేర్కొన్నారు.