సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను ఈనెల 21వతేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. కరోనా నియంత్రణ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం ఉండేలా బస్సు సీట్లలో మార్పులు చేశామన్నారు.
మధ్యలో ఎక్కడా ఆగవు...
► జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తారు. మధ్యలో ఎక్కడా బస్సులు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోరు. ప్రయాణికులు మాస్క్‌లు ధరించాలి.
► టికెట్లు ఆన్‌లైన్‌లోనే రిజర్వేషన్ చేసుకోవాలి. కరెంట్ బుకింగ్ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే రిజర్వేషన్ చేసుకోవాలి. టికెట్‌లు చూపించటం, మొబైల్ మెస్సేజ్‌లు చూపించటం లాంటివి ఉండవు.
► కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర పనులు, వైద్య సేవల కోసం మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
రేపట్నుంచి ఆర్టీసీ సర్వీసులు
Published Wed, May 20 2020 4:38 AM | Last Updated on Wed, May 20 2020 8:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment