Corona Virus
-
బైడెన్‌కు కరోనా నెగిటివ్.. వైట్‌హౌస్ వేదికగా భావోద్వేగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా టెస్టుల అనంతరం ఫలితం నెగిటివ్‌గా వచ్చింది. దీంతో, ఆయన మళ్లీ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా బైడెన్ స్పందిస్తూ.. వైట్ హౌస్‌లో మళ్లీ అడుగుపెట్టడం ఓ ఆనందంగా ఉందన్నారు.కాగా, కరోనా పాజిటివ్ కారణంగా జో బైడెన్ ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నెగిటివ్‌గా తేలడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైడెన్‌కు చికిత్స అందించిన డాక్టర్ కెవిన్ ఓ కన్నర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బైడెన్ ఆరోగ్యం చాలా బాగుంది. బైడెన్లో కరోనా లక్షణాలో లేవు. టెస్టుల్లో నెగిటివ్‌గా తేలింది అంటూ కామెంట్స్ చేశారు. It's great to be back at the White House. pic.twitter.com/f2HLk1Jp3O— President Biden (@POTUS) July 23, 2024 మరోవైపు.. బైడెన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కరోనా తర్వాత మళ్లీ వైట్ హౌస్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. తాను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పుకొచ్చారు. 🚨 UPDATE: President Biden just boarded Air Force One and is on his way back to the White House. pic.twitter.com/k2wNDleGa3— Chris D. Jackson (@ChrisDJackson) July 23, 2024 ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా చాలా రోజుల నుంచి బైడెన్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ‘వేర్ ఈజ్ జో’ అనే ట్యాగ్ ట్విట్టర్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లోకి వచ్చింది. బైడెన్ ఎందుకు కనిపించడం లేదంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అధ్యక్షుడు బైడెన్ గతవారం కరోనా బారినపడ్డారు. ఐసోలేషన్‌లో ఉన్నారంటూ ‘వైట్‌హౌస్’ ఒక ప్రకటన కూడా చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి.అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, రాత్రి గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొందంటూ సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు దర్శనం ఇచ్చాయి. ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. కాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మరో సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేసు నుంచి తప్పించేందుకు బైడెన్‌పై తిరుగుబాటు జరిగిందని ఆరోపించారు. -
2020లో భారత్‌లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.అవన్నీ కరోనా మరణాలు కాదు అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది. -
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
ఆయుర్దాయానికి కోవిడ్ కోత
కరోనా కోరల్లో చిక్కి యావత్ ప్రపంచం విలవిల్లాడిన ఘటన ఇప్పటికీ చాలా మందికి పీడకలే. అధునాతన కోవిడ్వ్యాక్సిన్లతో ఎలాగోలా కోవిడ్‌పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేదు నిజం తాజాగా బయటపడింది. 2019–2021 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆయుష్షు దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కష్టాల నుంచి తెరిపినపడి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానీకానికి ఇది పిడుగుపాటులాంటి వార్తే. లాన్సెట్ అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధికారక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే 2020, 2021 సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై తాజా అధ్యయనం సమగ్ర వివరాలను వెల్లడించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది. ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది. ► మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి చోట్ల ఆయుఃక్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. కరోనా తొలినాళ్లలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసుల వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది. ► ప్రపంచవ్యాప్తంగా టీనేజీ, యుక్త వయసు వాళ్లలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగానే ఉందని పేర్కొంది. ► ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 7 శాతం తగ్గాయి. అంటే మరణాలు 5,00,000 తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. ► దక్షిణాసియా, ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్ శాపమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియాలోనే చనియారు. ప్రతి నలుగురిలో ఒకరు సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రాణాలు వదిలారు. ► అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో 15 ఏళ్లుపైబడిన వారు ఎంత మంది? వారిపై కోవిడ్ ప్రభావం, ఆయుర్దాయం వంటి అంశాలను విశ్లేషించారు. వీరిలో 2019–2021 కాలంలో పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం మరణాల రేటు పెరగడం ఆందోళనకం ► 2020, 2021 సంవత్సరాల్లో మొత్తంగా 13.1 కోట్ల మంది మరణించారు. అందులో కోవిడ్ సంబంధ మరణాలు ఏకంగా 1.6 కోట్ల పైమాటే. ► గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్, నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి. ► దక్షిణాఫ్రికాలోని క్వాజూలూ–నాటల్, లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది ► కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న/ కోవిడ్ బారిన పడి కూడా బార్బడోస్, న్యూజిలాండ్, ఆంటిగ్వా, బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం. ► కోవిడ్ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా 1950 నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అన్ని వేరియంట్లకు ఒకే టీకా?
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సైంటిస్టులు వినూత్నమైన కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. సార్స్–కోవ్–2కు చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని చెబుతున్నారు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపైనా పోరాడగలదని అంటున్నారు. కాగా, ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నేతృత్వంలో ఐఐఎస్సీ మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ బృందం తయారు చేసిన ఈ టీకాకు ఆర్ఎస్2 అని పేరుపెట్టారు. కోవిడ్–19పై జరుగుతున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని సైంటిస్టులు అభివర్ణించారు. ఇది వేడిని తట్టుకోగలదని, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా వైరస్‌కు చెందిన స్పైక్ ప్రొటీన్లలోని రెండు కాంపోనెంట్ల సమ్మేళంతో ఆర్ఎస్2 టీకాను అభివృద్ధి చేశారు. ఇదొక సింథటిక్ యాంటీజెన్. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలతో పోలిస్తే ఆర్ఎస్ఈ టీకా మరింత ఎక్కువ రక్షణ ఇస్తుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులోని ఎస్2 అని సబ్ యూనిట్ వైరస్ మ్యుటేషన్లను సమర్థంగా తట్టుకుంటుందని పేర్కొన్నారు. -
619కి చేరిన జేఎన్.1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో జనవరి 4వ తేదీ వరకు కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 619 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయన్నారు. ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్లో 36, ఏపీలో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్తాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హరియాణాల్లో ఒక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. -
Corona: గడిచిన 24 గంటల్లో 761 కేసులు.. 12 మంది మృతి
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మరోసారి భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులోనే 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,249 యాక్టివ్ కేసులు ఉండగా కర్ణాటక 1,240, మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్‌గఢ్- ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్‌తో మరణించిన వారిలో కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు. కాగా గతేడాది తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. డిసెంబర్ 5 వరకు వందలోపు నమోదైన కేసులు.. తర్వాత కొత్త వేరియంట్ వెలుగుచూడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020లో కరోనా తొలిసారి బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 5.3లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. 4.4 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. -
India: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యశాఖ మరోసారి హెచ్చరించింది. తాజాగా వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440 — ANI (@ANI) January 3, 2024 ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. -
TS: కరోనా కలకలం.. రెండు జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలో పాజిటివ్ కేసుల కలకలం చోటుచేసుకుంది. రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. రేకుర్తికి చెందిన ఓ మహిళకు, 18 నెలల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక, మహబూబ్‌నగర్ జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు ఇప్పటి వరకు 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. -
దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! -
కరోనా కల్లోలం..భారీగా పెరుగుతున్న కేసులు
-
వరంగల్ లో కరోనా కలకలం...3 చిన్నారులకు కరోనా పాజిటివ్
-
కొత్త కరోనా టెన్షన్ తో ఐటీ కంపెనీల కీలక నిర్ణయం
-
ఒక్కరోజులో 797 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జేఎన్.1 ఉప వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకేరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత ఏడు నెలల్లో ఇదే మొదటిసారి. మొత్తం యాక్టివ్ కేసుల 4091కి చేరుకుంది. ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ బారినపడిన బాధితుల సంఖ్య 162కు చేరింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు, గుజరాత్లో 34 జేఎన్.1 కేసులు వెలుగుచూశాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో జేఎన్.1 ఉప వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సారి్టయం(ఇన్సాకాగ్) శుక్రవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో కరోనా కాటుకు ఐదుగురు బలయ్యారు. -
TS: కరోనా కేసులపై దొంగ లెక్కలు?
హైదరాబాద్, సాక్షి: దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే.. మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్, తాజాగా మంచిర్యాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ, అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు!. కరోనా వైరస్‌లో జేఎన్.1 వేరియెంట్.. వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. చలికాలం.. ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు.. ఆఖరికి కరోనా బులిటెన్‌ను విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజలుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనేం చేయడం లేదు. అధికారుల్ని అడిగితే.. ప్రభుత్వమే ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. రెండ్రోజులకొకసారి విడుదల చేస్తారని చెప్పినా.. అందులోనూ స్పష్టత లేదు. మరీ ఇంత తక్కువా? రెండు రోజుల కిందట బులిటెన్‌ను పరిశీలిస్తే.. 1,333 టెస్ట్‌లు చేయగా అందులో ఎనిమిది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలిందట. మొత్తంగా.. ఆ రోజునాటికి యాక్టివ్ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ.. రెండు కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే.. జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. వింటర్ సీజన్.. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్నవాళ్లు.. పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవాళ్ల లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శా బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైరస్ విజృంభించే అవకాశాలున్న సమయంలో రాష్ట్రంలో కొవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. -
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా 797 కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్.1 కరోనా వేరియంట్‌కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అత్యధికంగా 78, గుజరాత్ (34), గోవా (18), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4) కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
ఐటీకి కరోనా భయం
-
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
-
పాలమూరులో 20ఏళ్ల యువకుడికి కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్
పాలమూరు: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడు కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో మళ్లీ అలజడి మొదలైంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మంగళవారం 14 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాకేంద్రంలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఆర్ఓగా పని చేస్తున్న సదరు యువకుడికి స్వల్ప లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ వెల్లడించారు. సదరు యువకుడి శాంపిల్స్ గాంధీ ఆస్పత్రిలోని ల్యాబ్ పంపించి ఏ రకం వైరస్ అని తెలుసుంటామని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఐదు రోజులుగా 151 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా ఆరోగ్యశాఖతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పడకలు సిద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, పీపీ, పీసీఆర్ కిట్స్, మందుల ఇతరత్రా సామగ్రిని సమకూర్చారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని, జాతర్లు, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్లడం, జన సమూహంలో ప్రయాణించడం వల్ల కరోనా వైరస్ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
తెలంగాణలో కోవిడ్ మరణం.. స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. తగ్గుముఖం పట్టిందనున్న మహమ్మారి మరోసారి విస్తరిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా మరణం సంభవించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా మరణంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదని తెలిపారు. కోవిడ్ మరణం నమోదు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు. ఉస్మానియాలో చనిపోయిన వ్యక్తులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ మరణాలను కో మార్బిడ్ అంటారని చెప్పారు. కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్టంరలో కోవిడ్ టెస్టులను రోజుకి 4 వేలకు పెంచామని తెలిపారు. మెడికల్ డిపార్ట్మెంట్ను అలెర్ట్ చేశామని తెలిపారు. కోవిడ్ మరణం అనే అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆరా తీసిన మంత్రి.. మహమ్మారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సాయంత్రం సమీక్ష చేయనున్నారు. పూర్తిస్థాయి కరోనా వివరాలతో రావాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచినట్లు వార్తలు వచ్చాయి. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించిన్లు సమాచారం. చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ -
ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో వ్యక్తి మృతి
-
తెలంగాణలో ఈ ఏడాది తొలి కోవిడ్ మరణం!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు.. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మృతులను 60 ఏళ్ల వ్యక్తితోపాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు. తెలంగాణలోనూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 54 పాజిటివ్ చేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్ట్‌లు పెంచారు, -
తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసుల కలకలం
-
భారత్‌లో కరోనా: 4,170 యాక్టివ్ కేసులు
ఢిల్లీ/బెంగళూరు, సాక్షి: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికే 4 వేలు దాటేసింది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కొత్త వేరియెంట్ జేఎన్.1 మూలంగానే అధిక కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. మరోవైపు కర్ణాటకలో కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం అక్కడి ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఒక్క బెంగళూరులోనే 20 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఈ వేరియెంట్ ధాటికి.. కర్ణాటక వ్యాప్తంగా ముగ్గురు మరణించారు. బెంగళూరులో ఇద్దరు, రామనగర జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడి మరణించారు. అయితే వాళ్ల వయసులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మరణాలకు కారణమా? అనేదానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కొత్త కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో.. కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ►వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వ్యాప్తి అధికమవుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం.. కేవలం జేఎన్.1 కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. ►తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా సోమవారం మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. ►తెలంగాణలో సోమవారంనాటికి 10 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒకరు వైరస్ బారిన నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. మరోవైపు ఏపీలోనూ యాక్టివ్ కేసుల సంఖ్య 24కి చేరింది. కొత్త వేరియంట్‌గా వ్యాప్తి చెందుతున్న జేఎన్.1 ఉపరకం కేసుల భయం తెలుగు రాష్ట్రాలను పట్టుకుంది. ఇప్పటికే నమోదు అయిన కేసుల శాంపిల్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు.. ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశారు. ►జేఎన్.1 అంత ప్రమాదకరమైందేం కాదని మొదటి నుంచి వైద్య నిపుణులు, ఆఖరికి డబ్ల్యూహెచ్‌వో కూడా చెప్పింది. అయితే వైరస్ తేలికపాటిదే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జాగ్రత్తలు చెబుతూ వస్తోంది. తాజాగా కొత్త వేరియెంట్ కేసుల విజృంభణ నేపథ్యంలో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
TS: కొత్త వేరియంట్ కలకలం.. నర్సుకు పాజిటివ్!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా పాజిటివ్ కేసులు జిల్లాల్లో సైతం నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో, వారికి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ కలకలం చోటుచేసుకుంది. కొత్త వేరియంట్ జేఎన్-1కు సంబంధింంచి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక ఆసుపత్రి నర్సు, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళకు పాజిటివ్‌గా తేలింది. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారి శాంపిల్స్‌ను జీనోమ్ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. వారి సన్నిహితుల సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ నగరంలో 9, కరీంనగర్లో ఒక్క కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి ఒకరు కోలుకున్నారు. మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్ సూచించారు. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. యాదమ్మ కుటుంబసభ్యులు భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఇంట్లోనే ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారు.