![Corona Positive Cases At Warangal MGM Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/22/mgm.jpg.webp?itok=R4gfphoZ)
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం మొదలైంది. ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స్ ఆర్‌టీపీసీటీ టెస్ట్‌కు పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతోపాటు మరో వ్యక్తి రాజేందర్‌కు పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరికి కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్క్‌లు లేకుండా ఎవరిని ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొవిడ్ వ్యాప్తిపై అపోహలు వద్దని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో 50 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. 70కిపైగా కోవిడ్ వెంటిలెటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment