
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం రేపుతోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు.
కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్‌లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
ఇదిలా ఉండగా కోవిడ్ పాజిటివ్‌పై వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
చదవండి: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment