
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్ కేసులు 31,194కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 4,47,51,259కు చేరాయి.
అదే సమయంలో మరో 11 మంది బాధితులు చనిపోవడంతో మొత్తం మరణాలు 5,30,954కు పెరిగినట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.07% కాగా, రికవరీ రేటు 98.74%గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63గా నమోదైనట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment