Central Health Department
-
భారత్ లో చైనా వైరస్.. HMPV కలకలం
-
మంకీపాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ
న్యూఢిల్లీ: ‘అనుమానిత’ కేసు మంకీపాక్స్(ఎంపాక్స్) కేసుగానే నిర్ధారణ అయ్యింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలేవీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా ఎంపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్–2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించామని వివరించింది. ఇది 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్–1 రకం వైరస్ కాదని స్పష్టంచేసింది. క్లేడ్–2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. హరియాణాలోని హిసార్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ గదులు సిద్ధం చేశారు. ఎంపాక్స్ కేసుల చికిత్స విషయంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి నోడల్ సెంటర్‌గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్ గదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రజ ల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవా రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనుమానాలు తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు. -
వామ్మో మంకీపాక్స్!.. భారత్‌లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్‌కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్‌లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల బకాయి లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు రేవంత్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్వహిస్తున్నామని చెప్పారు.కేంద్రం వాటా ఆలస్యంతో మేమే చెల్లిస్తున్నాం..: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం సహకరించాలని, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయాలని నడ్డాను రేవంత్ కోరారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాల కింద రూ. 323.73 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. 2024–25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ. 138 కోట్లు మంజురు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మౌలికవసతులు, నిర్వహణ కాంపొనెంట్ కింద 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ. 231.40 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్‌లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్‌ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్‌లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్‌కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్‌కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్‌డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్‌పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!
న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. కేరళలో మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్‌లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్1 ఉపవేరియంట్‌కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు జేఎన్1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. -
భద్రం... బీ కేర్‌ఫుల్!
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం. సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి. ఆ వరుసలోదే భారత్‌లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్‌లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్‌ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్‌గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం. అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష. అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు. దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్‌లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్‌లో లేబరేటరీ నెట్వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ. గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి. ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు! -
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
-
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు..కేంద్ర అలర్ట్
-
COVID-19: మరో 6,155 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్ కేసులు 31,194కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 4,47,51,259కు చేరాయి. అదే సమయంలో మరో 11 మంది బాధితులు చనిపోవడంతో మొత్తం మరణాలు 5,30,954కు పెరిగినట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.07% కాగా, రికవరీ రేటు 98.74%గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63గా నమోదైనట్లు ఆరోగ్య శాఖ వివరించింది. -
కొత్తగా 3,824 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇవే ఒకరోజు అత్యధిక కేసులు కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 18,389కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 4,47,22,605 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 5,30,881 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. 4,41,73,335 మంది కరోనా బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల రేటు 1.19 శాతంగా రికార్డయ్యింది. కేంద్ర ప్రభత్వుం ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. -
ఔషధ నియంత్రణపై రెండు నాలుకలు
దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణీలో ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు బయటికి పొక్కడం కలకలం రేపింది. మళ్లీ ఆయనే అధికారిక సమావేశాల్లో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నాయని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమాలున్న మందులూ దొరుకుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. ఉజ్బెకిస్తాన్, గాంబియా... రెండు వేర్వేరు దేశాల్లో సుమారు 70 మంది పిల్లలు కల్తీ దగ్గుమందు కారణంగా మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ దుర్ఘటనకు కారణమైన దగ్గు మందు సరఫరా అయ్యింది మన దేశం నుంచే. కొన్ని వారాల క్రితం నోయిడా పోలీసులు ఉజ్బెకిస్తాన్ మరణాలకు సంబంధించి ముగ్గురు ఫార్మా కంపెనీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా... కొన్ని నెలల క్రితం గాంబియా ఘటనకు సంబంధించి దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రెండు కేసుల్లోనూ దగ్గుమందులో విషపూరిత రసాయనాలు కలిసి ఉండటం గమనార్హం. గాంబియా ఘటనలను ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం దృష్టికి తెచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు ముందులో గుర్తించిన డైఎథిలీన్ గ్లైకోల్ (డీఈజీ) కారణంగా మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి పిల్లలు మరణించినట్లు అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా ఈ వారమే ధ్రువీకరించింది. ఈ ఘటనలకు కేంద్ర ఆరోగ్య శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, ఫార్మా స్యూటికల్ డిపార్ట్మెంట్ల స్పందన అంతంత మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో లోపాలపై దృష్టి పెట్టాయి కానీ... ఆయా సంస్థలు గుర్తించిన అంశాల జోలికి ఇవి పోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇవ్వకపోవడాన్ని విమర్శించి ఉరకున్నాయి. ఆరోగ్య శాఖ నెపం మొత్తాన్ని గాంబియాపై నెట్టేసింది. దిగుమతి చేసుకునేటప్పుడు పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని తేల్చేసింది. అంతటితో ఆగకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కో కేసులో మరణానికీ, ఔషధానికీ ఉన్న సంబంధాన్ని వివరించలేదని వ్యాఖ్యానించింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే... గాంబియా కొన్ని కేసుల్లో శవపరీక్షలు కూడా నిర్వహించి డీఈజీ అవశేషాలను గుర్తించిందని! అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఈ ఘటనలన్నింటినీ భారత ఔషధ పరిశ్రమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే పరిగణించడం! గత నెల 24న వంద భాగస్వామ్య దేశాల భారత దౌత్యవేత్తలు పాల్గొన్న సమావేశంలోనూ మాండవియా దేశంలో నాణ్యమైన మందులు తయారవుతున్నాయని నొక్కి చెప్పడం ఇక్కడ ప్రస్తావించ దగ్గ అంశం. కేంద్ర ఆర్యోగ శాఖ మంత్రి ప్రకటనల్లో ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జరిగిన ఓ రహస్య సమావేశంలో దేశంలో మందుల నియంత్రణ దుఃస్థితిని ఆయన నేరుగా అంగీకరించారు. ‘‘దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణిలో ఉన్నాయి. కల్తీ మందులు ఎగుమతి అవుతున్నాయి కూడా. దీనివల్ల ఫార్మా రంగం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఒప్పు కొన్నారు. ఈ దుఃస్థితికి అధికారులే కారణమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఫార్మా రంగానిదే బాధ్యత. కానీ అంతకంటే ముందు ఇది మన బాధ్యత’’ అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియంత్రణ వ్యవస్థల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది చురుకుగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వ యమూ కొరవడుతోంది’’ అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అంచనా ప్రకారం, ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల సంస్థలు, ఫార్మాస్యూటికల్ విభాగాల పేరుతో ముక్కలు ముక్కలుగా ఉంది. మాండవియా ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. ఆ తరువాత ఆగిపోవడమే కాకుండా... అప్పటివరకూ రికార్డయిన వీడియోను కూడా ఛానల్ నుంచి తొలగించారు. అయితే వీడియో తొలగించినంత మాత్రాన విషయం బయ టకు పొక్కకుండా ఉంటుందా? నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్న విధంగానే నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లేని, కల్తీ, నకిలీ మందులు భారతీయ మార్కెట్లో చలామణి అవుతున్నట్లు అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. ఇలాంటి మందులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నట్లు... దుష్ఫలితాలూ వాటివల్లనే అన్న విషయమూ స్పష్టమైంది. మంత్రి ప్రకటనను బట్టి చూస్తే దేశ ఫార్మా రంగం దుఃస్థితికి కారణాలు ఆయనకూ తెలుసన్నమాట. మరి ఇదే నిజమైతే ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? గాంబియా, ఉజ్బె కిస్తాన్ ఘటనలపై వ్యతిరేక నివేదికలు వచ్చినప్పుడు బహిరంగంగా ఫార్మా రంగాన్ని, నియంత్రణ వ్యవస్థలకు మద్దతుగా మాట్లాడటం ఎందుకు? ఈ రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో కూడిన వ్యవహారం. దేశ ఫార్మా రంగ నియంత్రణ సంస్థల్లోని అకృత్యాలు ఇప్పుడు కొత్తగా తెలిసినవి ఏమీ కాదు. 2012లోనే ఒక పార్లమెంటరీ కమిటీ సీడీఎస్సీఓ పనితీరుపై విచారణ జరిపి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న అక్రమాలను బయటపెట్టింది. దురదృష్టవశాత్తూ అప్పటినుంచి ఇప్పటివరకూ జరిగిన మార్పు స్వల్పమే. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు కాగితానికే పరిమితమైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని సంస్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేకపోయాయి. ఇంకోవైపు ఫార్మా పరిశ్రమ ఎదుగుదలకు నియంత్రణ వ్యవస్థలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశ ఫార్మా మార్కెట్ సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పది లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని కూడా ఆయన అంచనా కట్టారు. ఇది కచ్చితంగా మంచి లక్ష్యం. కానీ భద్రత, సామర్థ్యం, మందుల ప్రమాణాలతో రాజీపడి సాధించడం ఎంతమాత్రమూ సరికాదు. స్థానిక మార్కెట్ అయినా, విదేశీ మార్కెట్ అయినా వీటిని పాటించడం అవసరం. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వా లన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమా లున్న మందులూ దొరుకుతున్నాయి. వేర్వేరు బ్రాండ్లు ఉండటంతో వైద్యులను ఆకర్షించేందుకు కంపెనీలు అనైతిక మార్కెటింగ్ కార్య కలాపాలకూ దిగుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచి నంతమాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. నిజానికి జన ఔషధి కేంద్రాల స్థాపన ఆలోచన మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ది. 2005లోనే ఆయన యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఔషధ కంపెనీల నుంచి జెనెరిక్ మందులను ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించారు. ఈ ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో అత్యధికం ఇప్పుడు పనిచేయడం లేదు. లేదా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, సమస్య పరిష్కా రానికి బహుముఖ వ్యూహం అవసరం. దేశంలోని నియంత్రణ వ్యవస్థ లను గాడిలో పెట్టడంతో మొదలుపెడితే సరైన దిశలో ముందడుగు వేసినట్లు అవుతుంది! వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత వారంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో గత వారంలో 132 కరోనా కేసులు నమోదు కాగా, మార్చి 15తో ముగిసిన వారంలో ఆ సంఖ్య 267కి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణకు సూచించింది. కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యం కూడా ఉన్నట్లు తెలిపింది. కాగా, తెలంగాణలో గురు వారం 27 కరోనా కేసులు నమోద య్యాయి. అంతకుముందు రోజు బుధ వారం ఏకంగా 54 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించింది. -
భారత్‌లోకి సూపర్ వేరియెంట్
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న బీఎఫ్.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్ భారత్‌లోకి ప్రవేశించింది. అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ తొలికేసు గుజరాత్లో బయటపడింది! దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖలోని జెనోమ్ సీక్వెన్సింగ్ సంస్థ ఇన్సోకాగ్ ధ్రువీకరించింది. అమెరికాలో 40 శాతానికి పైగా కేసులివే అమెరికాలో గత అక్టోబర్‌లో న్యూయార్క్‌లో ఈ వేరియెంట్ బయటపడింది. అప్పట్నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 40% పైగా ఈ వేరియెంట్‌వే. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్‌బీబీ.1.5ని సూపర్ వేరియెంట్ అని పిలుస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు పలు దేశాలకు విస్తరిస్తోంది’’ అని మిన్నెసోటా వర్సిటీ అంటువ్యాధి నిపుణుడు మైఖేల్ హెచ్చరించా రు. సింగపూర్‌లోనూ ఈ కేసులు బాగా ఉన్నాయి. ఏమిటీ ఎక్స్‌బీబీ.1.5? ఒమిక్రాన్‌లో బీఏ.2 నుంచి ఈ ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ పుట్టుకొచ్చింది. బీక్యూ, ఎక్స్‌బీబీ వేరియెంట్ల కాంబినేషన్ జన్యు మార్పులకు లోనై ఎక్స్‌బీబీ.1.5 వచ్చింది. ఎక్స్‌బీబీ కంటే 96% వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియెంట్లలో దీని విస్తరణ అత్యధికంగా ఉంది. డెల్టా తరహాలో ఇది ప్రాణాంతకం కాకపోయినా ఆస్పత్రిలో చేరాల్సిన కేసులు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియెంట్‌తో అమెరికాలో వారంలో కేసులు రెట్టింపయ్యాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ తన ట్విటర్లో ఈ వేరియెంట్ గురించి వెల్లడిస్తూ ఆర్ వాల్యూ అత్యధికంగా ఉన్న వేరియెంట్ ఇదేనని తెలిపారు. ఎక్స్ఎక్స్బీ కంటే 120% అధికంగా ఈ వేరియెంట్ సోకుతోందని తెలిపారు. కరోనా సోకి సహజ ఇమ్యూనిటీ, టీకాల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొని మనుషుల శరీరంలో ఈ వైరస్ స్థిరంగా ఉంటోందని వివరించారు. మనకు ముప్పు ఎంత? ఎక్స్‌బీబీ.1.5తో మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ ప్రబలినప్పుడు దేశ జనాభాలో దాదాపుగా 90శాతం మందికి కరోనా సోకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని దాని వల్ల రక్షణ ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే దేశ జనాభాలో బూస్టర్ డోసు 27% మంది మాత్రమే తీసుకున్నారని, ప్రజలందరూ మరింత ఇమ్యూనిటీ కోసం టీకా తీసుకుంటే మంచిదని సూచించారు. కోవిడ్ కేసులు పెరిగే విధానాన్ని లెక్కించే ఐఐటీ సూత్ర కోవిడ్ మోడల్లో భాగస్వామిగా ఉన్న ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అమెరికాలో మాదిరిగా మన దేశంలో కేసులు నమోదయ్యే అవకాశాల్లేవని వివరించారు. మరోవైపు దేశంలో 24 గంటల్లో 226 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,653కి చేరుకుంది. లక్షణాలివే..! ఎస్బీబీ.1.5 సోకితే సాధారణంగా కరోనాకుండే లక్షణాలే ఉంటాయి. జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం వంటివి బయటపడతాయి. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
సూది లేకుండా కరోనా టీకా
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ (బీబీవీ154) కరోనా వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ముక్కుద్వారా తీసుకొనే ఈ టీకాను 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాగ్జాన్ టీకా రెండు డోసుల తీసుకున్నవారు బూస్టర్ డోసుగా ఇంట్రానాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో దీన్ని చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కో–విన్ పోర్టల్ ద్వారా టీకా పొందవచ్చని వెల్లడించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముక్కుద్వారా తీసుకొనే టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు ఇన్కోవాక్ అనే బ్రాండ్ పేరుతో పిలిచే బీబీవీ154 వ్యాక్సిన్‌కు ఈ ఏడాది నవంబర్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలియజేశారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని స్పష్టం చేశారు. టీకాల పరిశోధన, అభివృద్ధి విషయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలకు ఇంట్రానాజల్ వ్యాక్సిన్ మరో ఉదాహరణ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీకాను ఇవ్వడం చాలా సులభమని తెలిపాయి. ఇన్కోవాక్ను భారత్ బయోటెక్ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్స్‌కు భారత ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని కోవిడ్ సురక్షా కార్యక్రమం కింద ఆర్థిక సహకారం అందించింది. బీబీవీ154 టీకా విషయంలో మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, సత్ఫలితాలు లభించాయని భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్ఎల్ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ సెంట్లు(బీఎంఎస్), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులను ఎన్పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. -
ఆరిపోతున్న ప్రాణదీపాలు.. ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక..
సాక్షి, హైదరాబాద్: వైద్య వృత్తిలో ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక అనేకమంది యువ వైద్యులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2016 నుండి 2020 మధ్య కాలంలో 18 నుండి 30 సంవత్సరాల వయస్సులో వివిధ రకాల వృత్తుల్లో ఉన్న 3,100 మంది పలు సమస్యలతో ఆత్మహత్య చేసుకోగా.. ఇందులో ఎక్కువమంది వైద్యులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేర్కొంది. అదే కాలంలో వివిధ వయస్సుల వారు 12,397 మంది పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలోనూ వైద్య విద్యార్థులున్నారని తెలిపింది. సూపర్ స్పెషాలిటీ చేస్తేనే.. వైద్య విద్య పూర్తిచేస్తే జీవితంలో హాయిగా స్థిరపడిపోవచ్చనే భావన ఉంది. కానీ వాస్తవం అందరు మెడికల్ విద్యార్థుల విషయంలో ఒకేలా లేదు. ఈ రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయగానే స్థిరపడిపోయినట్లు కానేకాదు. కనీసం పీజీ లేకపోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థిరపడాలంటే 15 ఏళ్లు.. ఎంబీబీఎస్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు కోర్సులు పూర్తి చేసే సరికి పదేళ్లు దాటుతుంది. అది కూడా సకాలంలో పీజీ సీటొస్తేనే. లేకుంటే అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. తర్వాత బయటకు వచ్చి స్థిరపడే సరికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అంటే వైద్య వృత్తిలో స్థిరపడాలంటే మొత్తంగా 15 ఏళ్లు పడుతుందన్న మాట. మరోవైపు లక్షలు, కోట్లు ఖర్చు చేసి ఎంబీబీఎస్ పూర్తి చేసినా, తర్వాత మళ్లీ కోట్లల్లో డబ్బులు పెడితేనే పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చదవగలిగే పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు పీజీ సీటు రాక.. ఇటు ఎంబీబీఎస్‌తో ఏమీ చేయలేక, జీవితం ఎలా గడపాలో తెలియక ఎందరో యువ డాక్టర్లు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో యోగాను ప్రవేశపెట్టి, విద్యార్థుల్లో ఒత్తిడిని, నిరాశను తగ్గించేందుకు ప్రయత్నిస్తుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. విదేశీ గ్రాడ్యుయేట్లు ఇక్కడి పరీక్షలో ఫెయిల్! ఇక్కడ సీట్ల కొరతతో వేలాది మంది విద్యార్థులు విదేశాల్లో మెడిసిన్ చదువుతుండగా, దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పరీక్ష పాసయ్యేవారు 20 శాతం కూడా మించడం లేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో కేవలం 2,348 మంది మాత్రమే పాసయ్యారు. ఓ జర్నల్ ప్రకారం.. వైద్యుల ఆత్యహత్యకు దారితీస్తున్న పరిస్థితులు.. ►ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మూడింట ఒక వంతు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు కాగా మిగిలినవారు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు ఉంటున్నారు. అనేక ఒత్తిళ్ల కారణంగా వీరంతా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పీజీలో ఆర్థిక భారం, వృత్తి పరమైన ఒత్తిడి, వివాహ సమస్యలు వంటివి కారణాలుగా ఉన్నాయి. ►ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన ఆత్మహత్యలే 60 శాతం వరకు ఉంటున్నాయి. ►ఎంబీబీఎస్ పూర్తయి, పీజీ సీట్లు రానివారిలో చాలామంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్‌తో స్థిరపడే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది యువతుల తల్లిదండ్రులు వీరిపై ఆసక్తి చూపించడం లేదు. ►కొందరు ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చేశాకే పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారు. దీంతో వారికి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో వారిలో ఒత్తిడి పెరుగుతోంది. ►ఎంబీబీఎస్ వైద్యులు కేవలం కేర్టేకర్ల మాదిరిగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. అందుకే వారి పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇది వారిని కుంగుబాటుకు గురిచేస్తోంది. ►పీజీ పూర్తయినా వెంటనే స్థిరపడిపోతామన్న గ్యారంటీ లేదు. వారి చిన్నప్పటి క్లాస్మేట్స్ కొందరు ఇంజనీరింగ్, ఐఐటీ వంటి కోర్సులు చదివి 22–23 ఏళ్లకే లక్షల్లో సంపాదిస్తుండటం వారిలో ఆత్మన్యూనతా భావన కలిగిస్తోంది. ప్రతి ఆత్మహత్య వెనుక 20 ప్రయత్నాలు ఆత్మహత్య రిస్క్ వైద్యుల్లోనే ఎక్కువ. ఏటా దేశంలో లక్ష మంది వైద్యుల్లో 40మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఆత్మహత్య వెనుక సగటున 20 ప్రయత్నాలు ఉంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య ఒత్తిడి, నిరాశతోనే.. ఎంబీబీఎస్ తర్వాత పీజీలో తామనుకున్న స్పెషలైజేషన్‌లో సీటు రాకపోవడంతో చాలామంది వైద్య విద్యార్థులు డిప్రెషన్లోకి పోతున్నారు. ఆ సీట్లు రాకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నారు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ ఎంబీబీఎస్‌తో బతకలేరు ఈ రోజుల్లో ఎంబీబీఎస్‌తో బయట బతికే పరిస్థితి లేదు. తప్పనిసరిగా పీజీ చదివితేనే భవిష్యత్తు ఉంది. అయితే ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ ఉన్నా, పీజీ సీట్లు ఆ మేరకు లేవు. దీంతో చాలామంది వైద్య నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇలాంటి కారణాలతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. – డాక్టర్ కార్తీక్ నాగుల, రాష్ట్ర అధ్యక్షుడు, జూడాల సంఘం -
కోవిడ్ వ్యాక్సిన్ @ 200 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేసిన డోసుల సంఖ్య 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 199.71 కోట్ల డోసుల టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 20,044 కరోనా కేసులు నిర్థారణయ్యాయి. దీంతో, మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయని పేర్కొంది. అదే సమయంలో, మరో 56 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,25,660కు పెరిగినట్లు తెలిపింది. -
14 దేశాలు, 100కిపైగా కేసులు
వాషింగ్టన్/లండన్: యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. భారత్ కూడా ఈ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్ విస్తరిస్తున్న తీరుని పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది. లక్షణాలివే..: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?:తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా సోకుతుంది. చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. -
కరోనా కాలర్ ట్యూన్లు తక్షణమే ఆపేయండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అందుబా టులోకి తెచ్చిన కాలర్ ట్యూన్లను ఇకపై నిలిపివేయాలని టెలికం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వ్యాధిపై ముందు జాగ్రత్తలు, టీకా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ రెండేళ్లుగా పలు దఫాలుగా వీటిని జారీ చేసింది. ఇకపై కరోనా సంబంధిత అన్ని ప్రకటనలు, కాలర్ ట్యూన్లను తక్షణమే ఆపేయాలని టెలికం ప్రొవైడర్లను కోరుతూ టెలికమ్యూనికేషన్ల శాఖ మార్చి 29వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు, కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ కూడా సమ్మతించిం దని వివరించింది. వీటి కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ ఆలస్యమవు తున్నాయంటూ కేంద్రానికి ఇటీవలి కాలంలో పలువురి నుంచి విజ్ఞాపనలు అందాయి. -
కరోనా అప్డేట్: కొత్తగా మరో 67,597 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 1,80,456 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1,188 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,02,874 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 9,94,891 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 170.21 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు.