న్యూఢిల్లీ: దేశంలో గత ఆరు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 86,508 కేసులు నమోదు కాగా రికవరీలు మాత్రం 87,374గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57,32,518కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 46,74,987కు చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 1,129 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 91,149కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,66,382గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 37 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16.86 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 81.55 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.59 శాతానికి పడిపోయిందని తెలిపింది.ఢిల్లీలో రెండో దశ (సెకండ్ వేవ్) కరోనా సాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతు న్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం చెప్పారు. అందుకే భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని, త్వరలో రోజూవారీ కొత్త కేసుల సంఖ్య తగ్గొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment