recovari
-
పెరుగుతున్న రికవరీలు
న్యూఢిల్లీ: ఇటీవల కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య పెరగ్గా, శుక్రవారం మాత్రం భిన్న పరిస్థితి ఎదురైంది. అయితే శనివారం మాత్రం మళ్లీ రికవరీల సంఖ్య పెరిగింది. శనివారం కొత్తగా 85,362 కేసులు నమోదు కాగా రికవరీలు 93,379 గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,932కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 48,49,584 కు చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 1,089 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 92,290 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,60,969 గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 38 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16.28 శాతం ఉన్నాయి. -
రికవరీ రేటు పైపైకి
న్యూఢిల్లీ: దేశంలో గత ఆరు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 86,508 కేసులు నమోదు కాగా రికవరీలు మాత్రం 87,374గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57,32,518కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 46,74,987కు చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 1,129 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 91,149కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,66,382గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 37 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16.86 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 81.55 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.59 శాతానికి పడిపోయిందని తెలిపింది.ఢిల్లీలో రెండో దశ (సెకండ్ వేవ్) కరోనా సాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతు న్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం చెప్పారు. అందుకే భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని, త్వరలో రోజూవారీ కొత్త కేసుల సంఖ్య తగ్గొచ్చన్నారు. -
కేసుల కంటే రికవరీలే ఎక్కువ
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం వరకు దేశంలో కొత్త కేసులు భారీ స్థాయిలో వెలుగు చూడగా, గత రెండు రోజుల నుంచి రికవరీలు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 94,612 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,605 కేసులు బయటపడ్డాయి. నమోదైన కేసుల కంటే డిశ్చార్జి అయిన కేసులు ఎక్కువ కావడం విశేషం. వీటితో పాటు 24 గంటల్లో భారీ స్థాయిలో 12 లక్షలకు పైగా పరీక్షలు జరిగాయి. ఆదివారం వెలుగు చూసిన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 54,00,619కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,03,043కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 10,10,824గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 18.72 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 79.68 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.61 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇలా ఉండగా, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో కరోనా రెండోసారి సోకుతోందంటూ అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆయా కేసుల వివరాలను సేకరించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
24 గంటల్లో 97వేల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 97,894 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,18,253 కు చేరుకుంది. సెప్టెంబర్ 16న కరోనా కేసుల సంఖ్య 50 లక్షల మార్కు దాటింది. గత 24 గంటల్లో 1,132 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 83,198కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 40,25,079కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 10,09,976 గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసులు 30 లక్షలకు పైగా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 19.73 శాతం ఉన్నాయి. గ రెండు రోజుల్లోనే 82 వేలకు పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.64 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.63 శాతానికి పడిపోయింది. ముంబైలో నెలాఖరుదాకా సెక్షన్–144 సాక్షి, ముంబై: ముంబైలో సెక్షన్ –144 అమలును ఈ నెలాఖరుదాకా పొడిగించారు. ముంబైలో కొన్ని రోజులుగా కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరంలేదని, కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని మంత్రి ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. -
పింఛన్లు రికవరీ చేసి పంపండి
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ముకరంపుర: జిల్లాలో ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సబ్యుల్లో పింఛన్ పొందుతున్న 2932 మంది ఆసరా లబ్ధిదారుల నుంచి సొమ్ము రికవరీ చేసి ప్రభుత్వానికి పంపించాలని డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 2932 మంది ఆసరా పింఛన్దారుల్లో 1259 మందికి వృద్ధాప్య, వితంతు 692, వికలాంగులు 330, గీత కార్మికులు 36, చేనేత 57, బీడీ కార్మికుల పింఛన్లు 558 మందిని గుర్తించి ఆసరా వెబ్సైట్ నుంచి తొలగించినట్లు వివరించారు. సంబంధిత ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు నోటీసులు జారీచేసి వారి నుంచి ఇప్పటివరకు చెల్లించిన పింఛన్ల మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. ఆ మొత్తాన్ని చెక్కు, డీడీ, బ్యాంకు ఓచర్ ద్వారా వసూలు చేసి రాష్ట్ర నోడల్ అకౌంట్,హైదరాబాద్కు జమచేయాలని ఆదేశించారు.