
న్యూఢిల్లీ: ఇటీవల కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య పెరగ్గా, శుక్రవారం మాత్రం భిన్న పరిస్థితి ఎదురైంది. అయితే శనివారం మాత్రం మళ్లీ రికవరీల సంఖ్య పెరిగింది. శనివారం కొత్తగా 85,362 కేసులు నమోదు కాగా రికవరీలు 93,379 గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,932కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 48,49,584 కు చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 1,089 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 92,290 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,60,969 గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 38 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16.28 శాతం ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment