- ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు
పింఛన్లు రికవరీ చేసి పంపండి
Published Sat, Aug 27 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
ముకరంపుర: జిల్లాలో ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సబ్యుల్లో పింఛన్ పొందుతున్న 2932 మంది ఆసరా లబ్ధిదారుల నుంచి సొమ్ము రికవరీ చేసి ప్రభుత్వానికి పంపించాలని డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 2932 మంది ఆసరా పింఛన్‌దారుల్లో 1259 మందికి వృద్ధాప్య, వితంతు 692, వికలాంగులు 330, గీత కార్మికులు 36, చేనేత 57, బీడీ కార్మికుల పింఛన్లు 558 మందిని గుర్తించి ఆసరా వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు వివరించారు. సంబంధిత ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు నోటీసులు జారీచేసి వారి నుంచి ఇప్పటివరకు చెల్లించిన పింఛన్ల మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. ఆ మొత్తాన్ని చెక్కు, డీడీ, బ్యాంకు ఓచర్ ద్వారా వసూలు చేసి రాష్ట్ర నోడల్ అకౌంట్,హైదరాబాద్‌కు జమచేయాలని ఆదేశించారు.
Advertisement