చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ కోసం భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్ కోసం భారత్ రూ.615 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇతర దేశాలు ఇటువంటి మిషన్ల కోసం ఇంతకన్నా ఎక్కువ మొత్తమే ఖర్చు చేస్తాయి. ఏ దేశమైనా ఒక వ్యక్తిని లేదా ఏదైనా వస్తువును చంద్రునిపైకి పంపాలనుకుంటే అందుకు అయ్యే వ్యయం అధికంగా ఉంటుంది. ఏ దేశమైనా చంద్రునిపైకి వాటర్ బాటిల్ పంపాలనుకుంటే, దానికి ఎంత వ్యయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రునిపైకి మనిషిని పంపడానికి అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. 1972వ సంవత్సరంలో యూజీన్ సెర్నాన్ చంద్రుని ఉపరితలంపై నడిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రుని ఉపరితలంపైకి ఒక వ్యక్తి చేరుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. నిజానికి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు.. చంద్రునిపైకి మనిషిని పంపాలని అమెరికా ప్లాన్ చేసింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసినప్పుడు 104,000 అమెరికా డాలర్లు ఖర్చవుతుందని తేలింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గింది.
చంద్రునిపైకి మనిషిని పంపడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చవుతుందని తేలినప్పుడు ఒక వాటర్ బాటిల్ పంపాలంటే ఎంత ఖర్చవుతుందనే విషయానికి వద్దాం. నిజానికి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగం జరగలేదు. అయితే ఒక వాటర్ బాటిల్‌ను సురక్షితంగా పంపడానికి, అంతరిక్ష నౌకలో ఉపయోగించే భద్రత, సాంకేతికత ఒక వ్యక్తిని చంద్రునిపైకి పంపిన రీతిలోనే ఉంటుంది. అయితే మనిషిని పంపడానికి అయ్యే వ్యయం కన్నా కాస్త తక్కువ ఉండవచ్చు. అయినా ఈ మొత్తం అధికంగానే ఉంటుంది. ఇంతమొత్తం ఖర్చు చేసేందుకు మన దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలే ఆలోచించాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ..
Comments
Please login to add a commentAdd a comment