కుమార్తెకు డర్టీ వాటర్‌ బాటిల్‌ గిఫ్ట్‌.. తండ్రి చెప్పే ‘జీవిత సత్యం’ ఇదేనట! | Father Gifts Bottle Filled with Dirty Water to Daughter | Sakshi
Sakshi News home page

కుమార్తెకు డర్టీ వాటర్‌ బాటిల్‌ గిఫ్ట్‌.. ‘జీవిత సత్యం’ ఇదేనట!

Oct 3 2023 1:38 PM | Updated on Oct 3 2023 2:04 PM

Father Gifts Bottle Filled with Dirty Water to Daughter - Sakshi

ఒక యువతి తన పుట్టినరోజున తన తండ్రి ఎటువంటి విచిత్రమైన బహుమతి ఇచ్చాడో ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. తన తండ్రి తనకు మురికి నీటితో నిండిన బాటిల్‌ను బహుమతిగా ఇచ్చాడని తెలిపింది.  అలాంటి బహుమతి ఇవ్వడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. ట్వట్టర్‌(ఎక్స్‌) యూజర్‌ ప్యాట్రిసియా మౌ తన పోస్టులో ‘ఈ సంవత్సరం నా పుట్టినరోజున, మా నాన్న నాకు మురికి నీటి బాటిల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను తమాషాకు చెప్పడం లేదు’ అని పేర్కొంది. ఇలాంటి బహుమతి పొందడం ఇదేమీ మొదటిసారి కాదని కూడా ఆమె చెప్పింది. 

ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు అనేక బహుమతులు ఇచ్చారు. వాటిలో ప్రథమ చికిత్స కిట్, పెప్పర్ స్ప్రే, ఎన్సైక్లోపీడియా, కీ చైన్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దానిని డబ్బుతో కొనలేం.

ఆ మురికి నీటి బాటిల్‌ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. మురికి నీటితో కదులుతున్న బాటిల్‌ మన జీవితం లాంటిది. అయితే జీవితంలో మనం మన మనసును స్థిమితపరచుకున్నప్పుడు మనలోని మలినాలు 10 శాతం కంటే దిగువకు చేరుతాయి. మురికితో నిండిన బాటిల్‌ను స్థిరంగా ఉంచినప్పుడు ఇదే తెలుస్తుంది. సరిగ్గా ఇటువంటి దృక్ఫధాన్ని మనం కలిగివుండటం అవసరం అని ఆమె పేర్కొంది. 

ఆమె ఈ పోస్ట్‌ను అక్టోబర్ 2 న పోస్టు చేశారు. వైరల్‌గా మారిన ఈ పోస్టు ఇప్పటివరకూ 1.2 మిలియన్‌కు మించిన వీక్షణలు దక్కించుకుంది. ఈ పోస్ట్‌కు 5,900కు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్‌ ‘ఈ జీవిత పాఠాన్ని సేవ్ చేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న​ జనం?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement