bottle
-
సీసాతో పాలు పడుతున్నారా?
బిడ్డకు ఎప్పుడూ తల్లి పాలు పట్టడమే చిన్నారికి మేలు చేస్తుంది. కేవలం తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రమే ΄ోత ΄ాలు పట్టాలి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.పాడి పశువుల పాలు: ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు.డబ్బా పాలు: మార్కెట్లో అమ్మే పిల్లల కోసం ఉద్దేశించిన పాల ΄పోడర్ను ఉపయోగించి కలిపి ఇచ్చేవి. గేదె వంటి ΄ాడి పశువుల ΄ాలైనా / డబ్బాపాలైనా సీసాలో పాసి తాగిస్తారు. సీసాతో పాలు పట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సీసానూ, పాలపీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. కడిగాక పాల సీసాను పదినిమిషాలు మరిగే నీళ్లలో ఉంచాలి. ΄ాల పీకనూ కనీసం రెండు నిమిషాల పాటు వెడి నీళ్లలో ఉంచాలి. బిడ్డకుపాలు పట్టిన వెంటనే పక్కమీద పడుకోబెట్టకూడదు. మొదట బిడ్డను భుజంపై వేసుకుని వీపుపై నెమ్మదిగా తడుతూ ఉండాలి. తేన్పు వచ్చే వరకు ఇలా చేయాలి. ఒకసారి తాగాక సీసాలో మిగిలిన పాలను పారబోయాలి. నిద్రపోయే సమయంలో బిడ్డకు పాలు తాగించకూడదు. పాలు తాగించే సమయంలో బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు పట్టాలి. -
కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేత
ప్రముఖ కూల్‌డ్రింక్ కంపెనీ కోక-కోలా..తన అనుబంధ సంస్థ బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ (బిగ్)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ), అంతర్జాతీయ బాట్లింగ్ కార్యకలాపాలను బిగ్ నిర్వహిస్తోంది. జూన్ 30 నుంచి బిగ్ కార్యకాలాపాలను నిలిపేస్తున్నట్లు కోక-కోలా తెలిపింది.ఇప్పటివరకు బిగ్ చేపడుతున్న వ్యవహారాలు కోక కోలా అంతర్గత బోర్డు నియంత్రణలోకి వస్తాయని సంస్థ చెప్పింది. భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలు ఈ బోర్డు నిర్వహిస్తుందని తెలిపింది. బాట్లింగ్‌లో వాటాలను తగ్గించుకుని, బ్రాండ్, ఉత్పత్తులపై కోక కోలా దృష్టిపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 1997లో ప్రారంభమైన హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్‌కు ఇండియాలో 16 ప్లాంట్లు ఉన్నాయి. 3500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 25 లక్షల మంది రిటైలర్లకు కూల్‌డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్లాంట్లలో వాటాలను స్వతంత్ర సంస్థలకు విక్రయించడం ద్వారా రూ.2,420 కోట్లను సంస్థ సమీకరించింది. గతేడాది నవంబరులో మహారాష్ట్ర ప్లాంట్ కోసం రూ.1387 కోట్లు, గుజరాత్లో రూ.3000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ ఏడాది మేలో వెల్లడించింది.రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు సాఫ్ట్‌డ్రింక్స్ రంగంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీ కోక-కోలా తన వ్యాపార విస్తరణపై దృష్టిసారించడం ఇన్వెస్టర్లకు మేలు చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోటీని తట్టుకుని తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్ తయారు చేయడం గురించి విన్నారా?. ఔను ఇది నిజం. ఎనిమిది పెట్ బాటిల్స్ ఉంటే ఒక టీ షర్ట్ రెడీ. ఇరవై-ముప్పై బాటిల్స్ ఉంటే జాకెట్, బ్లేజర్ సిద్ధం. ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. పైగా ఎకో లైన్ బ్రాండ్‌తో దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి లాభాలను ఆర్జించాడు. నేడు ఏకంగా ఎనభై కోట్ల టర్నోవర్‌గా కంపెనీగా మార్చాడు. అంతేగాదు పర్యావరణాన్ని సంరక్షిస్తూ కూడా కోట్లు గడించొచ్చని చాటి చెప్పాడు. అతడెవరంటే..చెన్నైలో పెట్టి పెరిగిన సెంథిల్ శంకర్ మెకానికల్ ఇంజనీర్. తండ్రి స్థాపించిన శ్రీరంగ పాలిమర్స్‌కి ఎం.డిగా బాధ్యతలు చేపట్టాడు. పాలియెస్టర్ రీసైకిల్ చేస్తున్న సమయంలో అతడికి వచ్చిన ఆలోచనే ఎకోలైన్ దుస్తులు. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఇంతకీ బాటిల్స్‌తో చొక్కాలు ఎలా చేస్తారంటే... ఎలాగంటే..పెట్ బాటిల్స్‌కున్న మూతలు, రేపర్లు తొలగించిన తర్వాత క్రషింగ్ మెషీన్లో వేసి చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలను వేడి చేసి కరగబెట్టి ఫైబర్‌గా మార్చాలి. ఈ ఫైబర్ దారాలతో వస్త్రాన్ని రూపొందించాలి. క్లాత్‌తో మనకు కావల్సినట్లు టీ షర్ట్, జాకెట్, బ్లేజర్ వంటి రకరకాలుగా కుట్టుకోవడమే. వీటి ధర కూడా తక్కువే. ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి ఎకోలైన్ అని సెర్చ్ చేయండి అంటున్నారు సెంథిల్.అయితే ఈ వస్త్రాన్ని రీసైకిల్ చేసిన పెట్ బాటిల్స్‌తో తయారు చేసినట్లు ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. దీని కోసం, కస్టమర్‌కు అవగాహన కల్పించడానికి వెబ్సైట్లో మొత్తం మేకింగ్ ప్రక్రియను వీడియో రూపంలో బహిర్గతం చేయల్సి వచ్చిందనిసెంథిల్ చెప్పారు. ఈ లోగా మిగతా కార్పొరేట్ కంపెనీలు పర్యావరణ అనుకూలంగా రూపొందుతున్న ఈ టీ షర్ట్‌లకు మద్దతు ఇవ్వడంతో అనూహ్యంగా కంపెనీ లాభాల బాట పట్టింది.ఇక ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ప్రక్రియలో నీటిని ఆదా చేస్తారే గానీ వృధా కానియ్యరు. అలాగే వీళ్లు ఇందుకోసం బొగ్గును కూడా వినియోగించారు. చాలావరకు 90% సోలార్ ఎనర్జీపైనే ఆధారపడతారు. అంతేగాదు ఈ బాటిల్స్ వల్ల ఉత్పత్తి అయ్యే దాదాపు పదివేల టన్నులు కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలను కూడా ఈ ప్రక్రియతో నిరోధించారు. అంతేకాదండోయ్ మనం ఈ ప్లాస్టిక్ దుస్తులను వాడి వాడి బోర్ కొట్టినట్లయితే..తిరిగి వాటిని ఈ కంపెనీకి ఇచ్చేయొచ్చు. వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తుంది కూడా. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేసిన జాకెట్లను ధరించారు కూడా.ఇలా రూపొందించడానికి రీజన్..పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా ఈ ప్రక్రియకు నాంది పలికానని అన్నారు సెంథిల్ శంకర్. ప్రపంచవ్యాప్తంగా మనం వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్ల సంఖ్య నిమిషానికి మిలియన్ ఉంటున్నట్లు ఫోర్బ్స్ చెప్తోందన్నారు. ఒక బాటిల్ డీకంపోజ్ కావాలంటే నాలుగు వందల ఏళ్లు పడుతుందని, పైగా ఆ అవశేషాలు పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతుంటాయని చెప్పారు. దీంతో ఇవన్నీ వర్షం కారణంగా కాలువలకు అడ్డుపడి వరదలకు కారణమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తన వంతు బాధ్యతగా చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేస్ట్‌గా పడి ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లన్నింటిని సేకరిస్తున్నామని చెప్పారు. అంతేగాదు తమ ఫ్యాక్టరీలో రోజుకు 15 లక్షల బాటిళ్ల దాక రీసైకిల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక చివరిగా అందరూ పర్యావరణ సంరక్షణార్థం ఈ రీసైకిల్ ప్రక్రియలో పాలు పంచుకోండి అని పిలుపునిస్తున్నారు సెంథిల్ శంకర్.(చదవండి: నీట్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..) -
ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పెట్రో డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్నికల సంఘం జారీ చేసింది. పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లైయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాకుండా గొడవలు చేసే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డీలర్లకు సూచించారు. -
కుమార్తెకు డర్టీ వాటర్ బాటిల్ గిఫ్ట్.. తండ్రి చెప్పే ‘జీవిత సత్యం’ ఇదేనట!
ఒక యువతి తన పుట్టినరోజున తన తండ్రి ఎటువంటి విచిత్రమైన బహుమతి ఇచ్చాడో ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన తండ్రి తనకు మురికి నీటితో నిండిన బాటిల్‌ను బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అలాంటి బహుమతి ఇవ్వడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. ట్వట్టర్(ఎక్స్) యూజర్ ప్యాట్రిసియా మౌ తన పోస్టులో ‘ఈ సంవత్సరం నా పుట్టినరోజున, మా నాన్న నాకు మురికి నీటి బాటిల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను తమాషాకు చెప్పడం లేదు’ అని పేర్కొంది. ఇలాంటి బహుమతి పొందడం ఇదేమీ మొదటిసారి కాదని కూడా ఆమె చెప్పింది. ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు అనేక బహుమతులు ఇచ్చారు. వాటిలో ప్రథమ చికిత్స కిట్, పెప్పర్ స్ప్రే, ఎన్సైక్లోపీడియా, కీ చైన్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దానిని డబ్బుతో కొనలేం. ఆ మురికి నీటి బాటిల్ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. మురికి నీటితో కదులుతున్న బాటిల్ మన జీవితం లాంటిది. అయితే జీవితంలో మనం మన మనసును స్థిమితపరచుకున్నప్పుడు మనలోని మలినాలు 10 శాతం కంటే దిగువకు చేరుతాయి. మురికితో నిండిన బాటిల్‌ను స్థిరంగా ఉంచినప్పుడు ఇదే తెలుస్తుంది. సరిగ్గా ఇటువంటి దృక్ఫధాన్ని మనం కలిగివుండటం అవసరం అని ఆమె పేర్కొంది. ఆమె ఈ పోస్ట్‌ను అక్టోబర్ 2 న పోస్టు చేశారు. వైరల్‌గా మారిన ఈ పోస్టు ఇప్పటివరకూ 1.2 మిలియన్‌కు మించిన వీక్షణలు దక్కించుకుంది. ఈ పోస్ట్‌కు 5,900కు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘ఈ జీవిత పాఠాన్ని సేవ్ చేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం? For my birthday this year, my dad gifted me a dirty bottle of water. Not kidding. In the past he’s gifted me: a first aid kit, pepper spray, an encyclopedia, a key chain, dedicated a book he wrote to me, etc. good ol dad gifts. He told me this years gift was extra special as… pic.twitter.com/N56AiGgErJ — Patricia Mou (@patriciamou_) October 2, 2023 -
చంద్రునిపైకి ఒక వాటర్ బాటిల్ పంపాలంటే.. అదానీ, అంబానీలే ఆలోచించాలి!
చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ కోసం భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్ కోసం భారత్ రూ.615 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇతర దేశాలు ఇటువంటి మిషన్ల కోసం ఇంతకన్నా ఎక్కువ మొత్తమే ఖర్చు చేస్తాయి. ఏ దేశమైనా ఒక వ్యక్తిని లేదా ఏదైనా వస్తువును చంద్రునిపైకి పంపాలనుకుంటే అందుకు అయ్యే వ్యయం అధికంగా ఉంటుంది. ఏ దేశమైనా చంద్రునిపైకి వాటర్ బాటిల్ పంపాలనుకుంటే, దానికి ఎంత వ్యయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రునిపైకి మనిషిని పంపడానికి అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. 1972వ సంవత్సరంలో యూజీన్ సెర్నాన్ చంద్రుని ఉపరితలంపై నడిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రుని ఉపరితలంపైకి ఒక వ్యక్తి చేరుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. నిజానికి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు.. చంద్రునిపైకి మనిషిని పంపాలని అమెరికా ప్లాన్ చేసింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసినప్పుడు 104,000 అమెరికా డాలర్లు ఖర్చవుతుందని తేలింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గింది. చంద్రునిపైకి మనిషిని పంపడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చవుతుందని తేలినప్పుడు ఒక వాటర్ బాటిల్ పంపాలంటే ఎంత ఖర్చవుతుందనే విషయానికి వద్దాం. నిజానికి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగం జరగలేదు. అయితే ఒక వాటర్ బాటిల్‌ను సురక్షితంగా పంపడానికి, అంతరిక్ష నౌకలో ఉపయోగించే భద్రత, సాంకేతికత ఒక వ్యక్తిని చంద్రునిపైకి పంపిన రీతిలోనే ఉంటుంది. అయితే మనిషిని పంపడానికి అయ్యే వ్యయం కన్నా కాస్త తక్కువ ఉండవచ్చు. అయినా ఈ మొత్తం అధికంగానే ఉంటుంది. ఇంతమొత్తం ఖర్చు చేసేందుకు మన దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలే ఆలోచించాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
మాతృత్వానికే మాయని మచ్చ..పసికందు ఏడుస్తుందని ఓ తల్లి..
పక్షులు దగ్గర నుంచి చిన్న చిన్న కీటకాల వరకు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని చూసుకుంటాయి. ఆఖరికి చిన్న కోడి సైతం తన పిల్లల జోలికి వస్తే పులి అయ్యిపోతుంది. అలాంటి ఓ మహాతల్లి పసిబిడ్డ పట్ల వ్యవహరించిని తీరు చూస్తే గగుర్పాటుకు గురవ్వుతారు. ఆమె అసలు తల్లేనా? అన్నంతగా సీరియస్ అవుతారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ ఉలుకుపలుకు లేకుండా శవం మాదిరిగా పడుకుని ఉండటంతో వైద్యులు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ ఆ తల్లి నార్మల్‌గా ఉంది. ఎలాంటి భయాందోళన లేకుండా పసిబిడ్డకు కొంచెం ఒంట్లో నలతగా ఉందని ట్రీట్మెంట్ చేయమని చెప్పి మరీ వైద్యులకు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆ పసికందుని పరీక్షించగా ఆల్కహాల్ పట్టించినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా వైద్యలు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కన్న బిడ్డకే మద్యం ఇచ్చి చంపాలన చూసిందని ఆరోపణలు చేశారు. సదరు మహిళ హోనెస్టి డీ లా టోర్రేగా గుర్తించారు. ఆ మహిళ రియాల్టో గుండా డ్రైవింగ్ చేస్తుండా పాప ఏడుస్తుందని మద్య పట్టించినట్లు పేర్కొంది. పైగా మద్యం ఇవ్వడంతో ఏడుపు ఆపేసిందని చెబుతోంది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే పసికందు పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు బయటకు తెలిజేయలేదు. ఏదిఏమైనా ఇంత ఘోరమైన తల్లులు కూడా ఉన్నారా! అనిపిస్తోంది కదూ. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ స్ట్రేంజ్ అడిక్షన్ వింటే షాకవ్వాల్సిందే!) -
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..
జైపూర్: రాజస్థాన్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ విద్యార్థులు తమ క్లాస్‌మెట్ బాలిక వాటర్ బాటిల్లో యూరిన్ కలిపారు. ఆ విషయం తెలవని బాలిక ఆ నీటిని తాగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తెలుపుతూ రాసిన లవ్ లెటర్ని కూడా బాలిక తన బ్యాగులో గుర్తించింది. ఈ ఘటనపై స్థానికులు దుండగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్వారా జిల్లాలోని లుహారియా గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. పాఠశాలలో లంచ్ బ్రేక్‌లో ఓ విద్యార్థిని తాగే వాటర్ బాటిల్లో కొంత మంది విద్యార్థులు మూత్రం కలిపారు. ఆ విషయం తెలియక ఆ బాలిక వాటిని తాగేసింది. దుర్వాసన పసిగట్టిన బాలిక.. తన బ్యాగులో ఉన్న లవ్ లెటర్లో పేర్కొన్న ఆ విషయాన్ని నిర్ధారించుకుంది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా.. ఆయన సరైన చర్యలేవీ తీసుకోలేదు. ఈ వ్యవహారంపై స్థానికులు సోమవారం పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. ఆనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై దాడి చేయడానికి జనం వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీఛార్జీ కూడా జరిగింది. ఈ ఘటనలో జనం రాళ్లు రువ్వుకున్నారు. అయితే.. బాధితులు ఇప్పటికీ ఫిర్యాదు చేయలేదని ఏఎస్పీ జ్ఞాణశ్యామ్ శర్మ తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
పిల్లలకు పాలు పడుతున్నారా? కనిపించని బ్యాక్టీరియాలు..
సాధారణంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉంటాం. అందులోనూ పాలు తాగే పిల్లల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. వాళ్ల కోసం వాడే పాలసీసాలు, పాల పీకలు, ఉగ్గు గిన్నెలు, స్పూన్లు వంటివన్నీ శుభ్రంగా ఉంచాలి. అయితే ఎంత శుభ్రంగా కడిగినా కనిపించని క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి. వాటిని పారదోలేందుకు ఉపయోగపడుతుంది ఈ బేబీ బాటిల్ స్టీమ్ స్టెరిలైజర్. ఇందులో సుమారుగా ఆరు చిన్న చిన్న బాటిల్స్‌తో పాటూ నిపుల్స్, ఉగ్గు గిన్నెలు వంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ – ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ టెక్నాలజీతో ఆటో షట్ ఆఫ్ వంటి ఆప్షన్‌తో రూపొందిన ఈ డిౖవైస్.. 99.9 శాతం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత సుమారు 24 గంటల పాటు మూత తియ్యకుండా ఉంచితే.. క్రిమిరహితంగా దాచిపెడుతుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ మెషిన్.. బాటిల్స్‌ని క్లీన్ చేయగలదు. బాగుంది కదూ!. ఈ స్టీమ్ స్టెరిలైజర్ ధర 22 డాలర్లు (రూ.1,810) మాత్రమే. -
‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!
సోషల్ మీడియాలో లెక్కుమించిన వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని వింతైనవి, మరికొన్ని అమూల్యమైనవి కూడా ఉంటాయి. అయితే గతంలో ఎవరూ కూడా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూసినవారంతా కాకి ఇలాంటి పనిచేయడమేమిటంటూ, తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ వీడియో ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం విశేషం. అలాగే ఈ వీడియోను చూసిన వారంతా ఇకపై తాము కూడా బాధ్యతగా మెలుగుతామని కూడా చెప్పడం విశేషం. ఈ వీడియోను ట్విట్టర్లో @TansuYegen పేరుతో ఒక యూజర్ షేర్ చేశారు. ఈ 20 సెకెన్ల వీడియోలో ఒక కాకి తన ముక్కుతో ఒక ప్లాసిట్ బాటిల్ పట్టుకుని, ఇటునటు ఎగరడం కనిపిస్తుంది. తరువాత దానికి ఒక డస్ట్‌బిన్ కనిపించగానే దానిపై కూర్చుని, పలు ప్రయత్నాల అనంతరం ఆ బాటిల్‌ను ఆ డస్ట్‌బిన్ రంధ్రంలో నుంచి లోనికి పడవేస్తుంది. ఈ కాకి చేసిన పని చూసినవారంతా ఆశ్యర్యపోతున్నారు. ఈ విధమైన కాకిని ఎక్కడా చూడలేదని అంటున్నారు. అంత్యంత వేగంగా వైరల్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంతా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులు చేయాల్సిన పనిని ఒక పక్షిచేయడాన్ని చూసి మనమంతా సిగ్గుపడాలని అన్నారు. మరో యూజర్ పక్షులను చూసి మనం మరో గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! Be like this raven😊 pic.twitter.com/fyMhMqBWQJ — Tansu YEĞEN (@TansuYegen) July 20, 2023 -
34 ఏళ్లుగా సముద్రంలో తేలాడిన ఆ బాటిల్... ఆమె చేతికి చిక్కడంతో...
కెనడాకు చెందిన ఒక మహిళకు 34 సంవత్సరాల క్రితం నాటి ఒక బాటిల్ సముద్రపు ఒడ్డున దొరికింది. ఆ బాటిల్లోని ఒక కాగితంలో ఒక మెసేజ్ ఉంది. దానిని చదివిన ఆ మహిళ తెగ ఆశ్చర్యపోయింది. ఆ మెసేజ్ ఆధారంగా ఆ మహిళ ఆ బాటిల్ యజమాని కోసం వెదికింది. అప్పుడు ఆమెకు ఒక విషయం తెలియడంతో నిలువునా వణికిపోయింది. పురాతన కాలం నాటి వస్తువు ఏదైనా దొరికితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా లభ్యమైతే ఇక అప్పుడు కలిగే ఆసక్తికి హద్దులు ఉండవు. కెనడాకు చెందిన ఒక మహిళ విషయంలో ఇదే జరిగింది. షెల్టెర్ అనే మహిళకు సముద్రపు బీచ్‌ను శుభ్రం చేస్తుండగా ఒక వస్తువు దొరికింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. 34 ఏళ్లుగా నీటిపై తేలుతున్న బాటిల్ ఆ మహిళ ఒక బాటిల్ ఫొటోను, ఒక మెసేజ్‌ను షేర్ చేసింది. ఆ మెసేస్‌పై 1989, మే 29 తేదీ ఉంది. అంటే ఆ బాటిల్ 34 ఏళ్ల క్రితం నీటిలో పడవేశారు. అది ఇన్నేళ్లుగా నీటిలో కొన్ని వేల మైళ్లు దూరం వరకూ తేలుతూవస్తోంది. షెల్టెర్ ఆ పోస్టులో ఇలా రాసింది.. ‘నాకు ఎప్పటికై నా ఏదైనా పురాతన వస్తువు దొరుకుతుందని తరచూ అనిపించేంది. ఇప్పుడు అది దొరికింది’ అని పేర్కొంది. బాటిల్లో ఏం మెసేజ్ ఉంది? నిజానికి అ బాటిల్లో ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడిన ఎటువంటి మెజేస్ లేదు. అయినా దీనిలో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తుంది. దానిలో కొన్ని ఏళ్ల క్రితం నాడు రాసిన మెసేజ్ ..‘ఇది ఒక సన్నీ డే, గాలి వీయడం లేదు’ అని ఉంది. ఎవరో వినోదం కోసం ఈ మెసేజ్ రాసి, దానిని బాటిల్లో ఉంచి, నీటిలో పడవేశారు. ఏదో ఒకరోజు ఎవరికో ఒకరికి ఈ బాటిల్ లభ్యమవుతుందని వారు భావించివుంటారు. బాటిల్ యజమాని ఎవరంటే.. షెల్టెర్ తన ఫేస్బుక్ పోస్టులో ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. దానిలో ఆమె తనకు ఈ బాటిల్ యజమాని చిరునామా తెలిసిందని పేర్కొంది. న్యూఫౌండ్ల్యాండ్కి చెందిన గిల్బర్ట్ హేమలిన్ 1989 మే 29న ఈ బాటిల్‌ను తాను ప్రయాణిస్తున్న బోటు నుంచి సముద్రంలోకి విసిరేశారు. దీనిని పోర్ట్ ఓ చోక్స్కు 10 మైళ్ల దూరంలో నీటిలో విసిరివేశారు. ఆ బాటిల్వెనుక భాగంలో ఒక చిరునామా ఉంది. ఆ ప్రాంతం సెయింట్ ఆగస్టాన్ నది, క్యూబెక్‌కు 12 మైళ్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లిన షెల్టెర్ ఆ బాటిల్ యజమానిని కలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అతను రెండేళ్ల క్రితమే మృతి చెందారని షెల్టెర్కు తెలిసింది. దీంతో ఆమె అతని కుమారునికి ఫోనులో విషయమంతా చెప్పింది. త్వరలోనే ఈ బాటిల్ పంపిస్తానని అతనికి తెలిపింది. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు -
వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ!
మద్యం తాగితే తెలియని కిక్ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరలు వింటే మాత్రం ఎక్కిన కిక్కు కూడా దిగిపోతుంది. ప్రపంచంలో ఖరీదైన ఆల్కహాల్ బ్రాండ్లు ఎవరు ఎక్కువగా వినియోగిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే కొంతమంది ఎంత ఖరీదైన పర్లేదు గానీ ఈ కాస్ట్లీ లిక్కర్‌ను ఒక్కసారైన తాగాలని ఆసక్తి చూపుతారట. దీంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాలపై ఓ లుక్కేద్దాం! టెకీలా లీ 925 (Tequila Lee .925) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్‌గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మద్యాన్ని సేవిస్తే ఎంత మత్తు ఎక్కుతుందో తెలీదు దీన ధర వింటే మాత్రం తాగింది దిగిపోతుంది. దీని ధర దాదాపు రూ. 25 కోట్లట. ఈ లిక్కర్ ఎందుకంత ఖరీదంటే.. సీసాలో 6400 వజ్రాలు పొదిగినవి ఉండడమే. హెన్రీ IV డుడోగ్నే కాగ్నాక్ ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్. ఈ బ్రాండ్ మద్యం బాటిల్ ఖరీదు 56 లక్షల 93 వేల రూపాయలు. దాని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం అమరిక ఉండగా దీన్ని ప్లాటినంతో తయారు చేస్తారట. దీంతో ఈ తరహావి.. మద్యం లేకపోయినా కేవలం ఖాళీ సీసాలు కూడా ఎక్కువ ధరకే పలుకుతాయట. ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ అంటే.. అమండా డి బ్రిగ్నాక్ మిడాస్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు ఉంటుంది. అత్యంత ఖరీదైన రెడ్ వైన్ ధర తెలిస్తే షాక్ అవుతారు. పెన్ఫోల్డ్స్ ఆంపౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్. ఈ బ్రాండ్ రెడ్ వైన్ ఒక బాటిల్ రేటు వచ్చేసి కోటి రూపాయలు పై మాటే ఉంటుందట. ఈ ఖరీదైన మద్యం ధరలు వింటే మద్యం మత్తులో ఉన్న జనం షాక్ అవ్వాల్సిందే. -
బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....
స్కాట్లాండ్లోని ఒక ఇంటి ఆవరణలో ప్లంబర్ పీటర్ అలెన్ తవ్వుతున్నాడు. ఆ ఇంటికి సంబంధించిన నీళ్ల పంపుల కోసం నేలను తవ్వుతుండగా...ఒక పురాత గాజు బాటిల్ కనిపించింది. దీంతో అతను ఆశ్చర్యపోయి తన యజమాని ఎలిద్ స్టింప్సన్ వద్దకు తీసుకువచ్చాడు. ఆమె కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ...స్కూల్‌కి వెళ్లిన తన పిల్లలు తిరిగి వచ్చే వరకు ఈ బాటిల్ ఓపెన్ చేయకూడదని గట్టిగా అనుకుంది. ఈలోగా స్కూల్నుంచి పిల్లలు కూడా వచ్చేశారు. వారికి జరిగిన విషయమంతా చెప్పింది ఎలిద్. ఐతే వారు ఏదైన నిధేమో అనుకున్నారు గానీ ఆ బాటిల్లోని చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ బాటిల్లోని లేఖను ఓపెన్ చేయాలని తెగా ఆతృత పడ్డారు. అది విక్టోరియా కాలం నాటి పురాతన లేఖ. ఐతే ఆ బాటిల్ ఓపెన్ కాకపోవడంతో పగలుగొట్టి మరీ ఆ లేఖ తీసి అందులో ఏముందో చూశారు. అందులో జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీవ్ అనే ఇద్దరు మగ కార్మికులు సంతకాలు కనిపించాయి. ఈ బాటిల్లోని విస్కీ తాము తాగలేదని, అక్టోబర్ 6, 1887 అని రాసి ఉంది. సదరు యజమాని ఆ బాటిల్ ముక్కలను సైతం భద్రపరిచింది. ఐతే నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్ ఆ లేఖను జాగ్రత్తగా భద్రపర్చమని చెప్పింది. Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk — Newspremises (@News_premises) November 21, 2022 (చదవండి: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు) -
మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నిజాన్ని అబద్ధంగా చెప్పించే ప్రయత్నం చేసి మరోసారి టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. అసలు రహస్యం వీరమ్మ కుమారుడు బయటపెట్టాడు.దీంతో మీడియా సాక్షిగా పచ్చనేతలు దొరికిపోయారు. చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు అయోధ్య లంక మర్రిమూలలో వరద నీరు బాటిల్లో పట్టించి ఇప్పటికే నవ్వుల పాలైన టీడీపీ నేతలు.. వీరమ్మ కుమారుడు వీరాంజనేయులతో మీడియా సమావేశం పెట్టించి.. వైఎస్సార్సీపీ నేతలు బెదిరించి చెప్పమన్నారంటూ టీడీపీ నేతలు చెప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించలేదని వీరాంజనేయులు మీడియా సమావేశంలో చెప్పడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని చూసి మరోసారి టీడీపీ నేతలు అభాసు పాలయ్యారు. -
భార్యకు పాము కాటు.. కాటేసిన పామునూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు
లక్నో: యస్.. భార్యను పాము కాటేసింది. నొప్పితో ఆమె విలవిలలాడుతోంది. స్థానికులంతా చేరి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆ భర్త మాత్రం భార్యను పట్టించుకోలేదు. నానా హంగామా చేసి ఆ పామును పట్టేసుకున్నాడు. పాము కాటుకి గురైన భార్యతో పాటు పామును కూడా ఆస్పత్రికి తీసుకుపోయాడు. అది చూసి డాక్టర్లు భయపడిపోయారు.. ఆ తర్వాత ఏమైందంటే.. చిత్రమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ అఫ్జల్ నగర్ ఏరియాలో జరిగింది. భార్యను పాము కాటేయడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త రమేంద్ర యాదవ్. అయితే.. భార్యను కాటేసిన పామును సైతం ఓ బాటిల్లో బంధించి.. దానికి గాలి ఆడేలా ఆ బాటిల్‌కు చిన్నచిన్న రంధ్రాలు చేసి మరీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ‘ఎందుకు తెచ్చావయ్యా!’ అని వైద్య సిబ్బంది అడిగితే.. ‘‘నీ భార్యను ఏ పాము కాటేసిందని అడిగితే.. ఏమని చెప్పేది. అందుకే.. ఆ పామునే తెచ్చా! అని సమాధానం ఇచ్చాడు రమేంద్ర. ఆ సమాధానం విని డాక్టర్లు తెగ నవ్వుకున్నారట. చికిత్స తర్వాత కోలుకున్న భార్యను ఇంటికి తీసుకెళ్లే క్రమంలోనే.. అడవిలో ఆ పామును వదిలేశానని రమేంద్ర మీడియాకు వెల్లడించాడు. -
వైరల్: జాలరికి జాక్‌పాట్.. చేప కడుపలో కిక్కెంచే బహుమతి
అనకోకుండా దొరికే వస్తువులు మనకీ భలే అనందాన్నిస్తాయి. ఇటీవల సముద్రంలో చేపల వేట కోసం వెళ్లే జాలర్లకు ఇలానే అరుదైన వస్తువులు దొరికిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. వారి దినచర్యలో ప్రతిరోజూ ఒకేలా ఉండవు ఒక్కోసారి రోజంతా వేట కొనసాగించిన చేపలతో కాకుండా నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అలానే ఇంకో రోజు అనూహ్యంగా అనుకోని రూపంలో చేపలతో పాటు బహుమతులు లభిస్తుంటాయ్. ఈ తరహాలోనే ఓ మత్స్యకారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేట కోసమని వెళ్లిన అతనికి చేప మాత్రమే కాకుండా మరో అనుకోని బహుమతి లభించింది. ఇంకేముంది ఈ ఘటన కాస్త వీడియోగా మారి అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా రచ్చ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ జాలరికి అనుకున్నట్లే భారీ ఆకారంలో చేపలు వలలో పడ్డాయి. ఇంక మన వాడు ఆనందంతో ఎప్పటిలానే చేపలను కటే చేస్తూ, శుభ్రపరుస్తుండగా ఓ చేప కడుపు లోపలి భాగాల్లో ఏదో వస్తువు గట్టిగా తగులుతుండడం గుర్తించాడు. ఇక ఆలస్యం చేయక కత్తితో కోసి చూడగా అందులో మద్యం సీసా ఫుల్ బాటిల్ ఉంది. ఇంకేముంది అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కాగా ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మనుషుల బాధ్యతా రహితమైన ప్రవర్తనకు ఈ సంఘటన నిదర్శమని కొందరు కామెంట్ చేయగా.. మనం చేసే పనులు జంతుజలాలకు ఏ విధంగా ముప్పును కలిగిస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తోందని మరి కొందరు జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. మరికొందరు ‘జాక్‌పాట్ కొట్టావ్.. క్యాచ్ ఆఫ్ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. చదవండి: లవ్‌బర్డ్ .... నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది ..! -
తొలిసారిగా.. అర లీటర్ సీసాలో బస్తా యూరియా
సాక్షి, అమరావతి: సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) దీనిని ఇటీవల ఆవిష్కరించింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కారం. నానో టెక్నాలజీపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతుండగా.. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాను ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. ఏమిటీ నానో యూరియా.. తరతరాలుగా మనందరికీ తెలిసిన సంప్రదాయ యూరియా తెల్లటి గుళికల రూపంలో ఉంటుంది. బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను కేవలం 500 మిల్లీలీటర్ల సీసాలో పట్టేలా చేశారు. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయి. పైగా ఇది మహా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సీసాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. భావి ఎరువుల మార్కెట్ రంగంలో ఇదో మేలి మలుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుంది. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.240 కాగా.. యూరియా బస్తా ధర రూ.268. -
రెండు నిమిషాలు ఆలస్యంగా మద్యం తెచ్చాడని...
బంజారాహిల్స్( హైదరాబాద్): బోరబండ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్‌లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్‌మెన్ రంజిత్‌పై అదే సీసాతో తలపై దాడి చేశాడు. దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్‌షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. ( చదవండి: ఆస్పత్రిలో పక్కా ప్లాన్: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి ) -
చిరునామా, ఫొటోలిస్తేనే పెట్రోల్..
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌ల్లో ప్లాస్టిక్ బాటిళ్లలో ఇంధనం కొనుగోలు చేసేవారిపై సైబరాబాద్ పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనను తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు పెట్రోల్ బంక్‌లపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ బాటిల్స్ లేదా జెర్రీ కేసెస్‌లో ఇంధనం నింపడంపై నిషేధం ఉన్నా పలు పెట్రోల్ బంక్‌లు వాటిని పాటించకపోవడం వల్ల కొన్ని సార్లు నేరాలకు అవకాశం ఏర్పడుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఇంధనం అవసరం ఉన్న కొనుగోలుదారుడి చిరునామా, గుర్తింపుకార్డు జిరాక్స్ ప్రతులతో పాటు ఫొటోలిస్తేనే విక్రయించాలని, లేని పక్షంలో పెట్రోల్ బంకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బాటిళ్లలో కొనుగోలు చేసిన పెట్రోల్ ఉపయోగించి కొందరు వ్యక్తులు హత్యలకు పాల్పడి మృతదేహాలను తగలబెడుతుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నియమ నిబంధనలు పాటించని కొనుగోలుదారులు, పెట్రోల్‌బంక్ సిబ్బందిపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదుచేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే కొనుగోలుదారుడు తప్పుడు చిరునామా ఇస్తే ఇతర సెక్షన్లలు కూడా నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసుల్లో నెల నుంచి ఆరు నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ‘ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్ కొనడమనేది చట్టప్రకారం నేరం. దీనిపై పెట్రోల్ పంప్ యజమాన్యం, సిబ్బందికి అవగాహన కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామ’ని సీపీ పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా పెట్రోల్ విక్రయిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. వాహనదారులు తమ వాహనాల్లోనే పెట్రోల్ పంప్‌కు వచ్చి ఇంధనాన్ని నింపుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఎక్కడైనా ఆగిపోతే పెట్రోల్ బంక్‌లకు బాటిల్స్‌లో కొనుగోలు చేసేందుకు వస్తే గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
బాటిల్లో పెట్రోల్ కావాలంటే.. పేరు, ఫోన్ నంబర్, ఫొటో
సాక్షి,సిటీబ్యూరో: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దుర్ఘటన అనంతరం, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పట్టించుకోని వాటి యాజమాన్యాలు చిల్లర వ్యాపారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘దిశ’ సంఘనలోనూ బాటిల్ పెట్రోల్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఆదేశించినా నగరంలో ఇంకా బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు యధేచ్ఛగా సాగుతునే ఉన్నాయి. అధికారులు బంకుల పైనా, చిల్లరగా అమ్మకాలు సాగిస్తున్న దుకాణాలపై దృష్టి పెట్టకుండా ఉదాసీనంగా ఉండడంతో బాటిల్ అమ్మకాలు మూడుపూవులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. ఇలాంటి వ్యాపారం పెట్రోల్ బంకులతో పాటు బాహాటంగా రోడ్డు పక్కన కూడా సాగుతున్నాయి. నగర శివార్లలో జరిగిన తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం, దిశపై అత్యాచారం, పెట్రోల్ పోసి తగలబెట్టడం, తహసీల్ ఆఫీసుల్లో పెట్రోల్ బాటిల్స్‌తో కలకలం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. గతంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినా అధికారుల తీరుతో ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో తాజాగా పోలీసు విభాగం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. దీంతో పెట్రోల్ బంకుల్లో ‘నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే, ఇది ఎంతవరకు పాటిస్తారోనన్న దానిపై బంకులపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. రోడ్డు పొడువునా బాటిళ్లతో అమ్మకాలు హైదరాబాద్ నగరం నడిబొడ్డుతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం రోడ్డు పక్కన బహాటంగా పెట్రోల్ బాటిళ్లు పెట్టి విక్రయించడం సాధారణంగా మారింది. నగరంలో పెట్రోల్ బంకుల మధ్య గల దూరం ఆసరగా ముఖ్య కూడళ్లోని వాహనాల మెకానిక్, గాలి నింపే దుకాణాల్లో పెట్రోల్‌ను బాటిళ్లలో విక్రయిస్తున్నారు. మరోవైపు శివారు ప్రాంతాల్లో సైతం టేబుళ్లపై బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా నియంత్రించాల్సిన సంబంధిత అధికారగణం ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయం కలిగిస్తోంది. పెట్రోల్ అయిపోతే.. ప్రయాణంలో ఉన్నప్పుడు పెట్రోల్ అయిపోయి దారిలో వాహనాలు నిలిచిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటి ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఓ బాటిల్ తీసుకుని దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకునేవారు. ఇంకొందరు కుటుంబ సభ్యులకో, స్నేహితులకో ఫోన్ చేస్తే వారు బాటిళ్లలో పెట్రోల్ తెచ్చి ఇచ్చేవారు. ప్రస్తుత పోలీస్ నిబంధనల నేపథ్యంలో ఇకపై బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లడం కుదరదు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. పెట్రోల్ కోసం బాటిల్‌తో వచ్చినవారి వారి పేరు, ఫోన్ నంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలతో పాటు సదరు వ్యక్తుల ఫొటో సైతం స్మార్ట్ ఫోన్లో తీసుకుని పెట్రోల్ ఇవ్వొచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్ల అమ్మకాలు చట్ట విరుద్ధం బహాటంగా బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేయడం నేరం. పెట్రోల్ బంకుల్లో సైతం బాటిళ్లలో అమ్మకాన్నినిషేధించాం. రోడ్డు పక్కన బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. – ఎంకే రాథోడ్, రంగారెడ్డి జిల్లాపౌర సరఫరాల అధికారి -
జలకన్యల మ్యాజిక్? ఈ సీసా రష్యా వరకు వెళ్లింది!!
స్పెయిన్‌లో పర్యటిస్తున్న సమయంలో నాలుగేళ్ల పాప ఓ సందేశంతో కూడిన చిన్న సీసాను సముద్రంలోకి విసిరేసింది. ఆశ్చర్యకరంగా ఆ సీసా 3,200 కిలోమీటర్లు ప్రయాణించి రష్యా తీరానికి చేరుకుంది. అక్కడ ఆ సీసాను గుర్తించిన ఓ జంట అందులోని సందేశాన్ని చదివి అబ్బురపడటమే కాదు.. ఆ పాపకు బదులు కూడా పంపారు. ఇంగ్లండ్ సోమర్సెట్లోని వెస్టన్-సూపర్ మారె ప్రాంతానికి చెందిన చిన్నారి టైలర్ పావెల్ తన కుటుంబంతో కలిసి స్పెయిన్ విహారయాత్రకు వెళ్లింది. గత మే 19న అక్కడ బార్సిలోనా సమీపంలో సంటా సుసానె వద్ద పడవలో ప్రయాణిస్తున్న సమయంలో పావెల్ తన ఫొటో, దానితోపాటు సందేశంతో కూడిన కాగితం ముక్కను ఓ చిన్ని సీసాలో ఉంచి.. మూత బిగించి సముద్రంలోకి విసిరేసింది. ‘మీకు ఈ ఫొటో దొరికితే.. మీ దేశం పేరు, ఈ సందేశం ఫొటోను బదులుగా పంపండి’ అంటూ పాప ఆ కాగితంలో పేర్కొంది. జూన్ ఏడవ తేదీన పావెల్ తండ్రి రీచీ (31) ఓ సందేశం అందింది. పావెల్ సముద్రంలోకి విసిరేసిన సీసా ప్రయాణిస్తూ.. ప్రయాణిస్తూ ఏకంగా రష్యా మాస్కోలోని మొస్క్వా నదీ తీరంలో దొరికిందని సాషా, అలెక్స్ అనే జంట తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు పావెల్ రాసిన కాగితం ముక్కను ఫొటో తీసి పంపారు. ఈ విషయమై రీచీ మీడియాతో స్పందిస్తూ.. తన సందేశం రష్యాకు చేరిందని తెలుసుకొని పావెల్ ఎంతో సంతోషించిందని, జలకన్యలే తన సందేశాన్ని అక్కడివరకు తీసుకెళ్లాయని తను నమ్ముతూ.. సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుందని, తనకు ఇదంతా ఒక అద్భుతంలా, మాయాలా అనిపిస్తోందని చెప్పారు. పాప విసిరేసిన బాటిల్ స్పెయిన్ చుట్టూ సముద్రంలో చక్కర్లు కొట్టి.. స్కాట్లాండ్ మీదుగా ఉత్తర సముద్రంలో ప్రయాణిస్తూ రష్యా చేరుకొని ఉంటుందని సముద్ర పరిశోధక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బాటిల్ క్యాప్ చాలెంజ్.. భళే సరదా..
టెన్ ఇయర్స్ చాలెంజ్.. మరువక ముందే మరో చాలెంజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చాలెంజ్ అందరికి ఓ ఫీట్లా మారింది. అదే ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’. ఈ చాలెంజ్‌ను పలువరు సెలబ్రిటీలు ప్రయత్నించి విజయవంతంగా పూర్తిచేశారు. కాగా చాలా మంది నెటిజన్లు మాత్రం ఈ చాలెంజ్‌ను పూర్తి చేసేందుకు ప్రయల్నిస్తూ.. బాటిల్ క్యాప్ కిందపడకుండ .. వాళ్లు కిందిపడి భంగ పడుతున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాల వైరల్‌గా మరుతున్నాయి. ఈ చాలెంజ్ ఏమిటంటే.. ఒక బాటిల్‌పై దాని క్యాప్ వదులుగా బిగించి ఓ చోట కదలకుండా నిల్చోబెట్టాలి. తర్వాత దానికి కొంచం దూరం నుంచి కాలుతో కిక్(తన్నడం) చేస్తే ఆ క్యాప్ గిరగిరా తిరిగి కింద పడాలి. బాటిల్ కింద పడటం గాని, కాలు కదిలే దిశ మారటం గాని జరగకూడదు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నట దిగ్గజం జాసన్ స్టాథమ్,అమెరికా గాయకుడు జాన్ మేయర్లు ఈ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేయడంలో సఫలం అయ్యారు. -
మద్యం సీసా లేబుల్ హంతకున్ని పట్టించింది..
చౌటుప్పల్(మునుగోడు) : మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం అయిన వారినే అంతమొందిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ మారు తల్లి కొడుకును దారుణంగా హత్య చేయించింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ శివారులో మే 31న జరిగిన ఈ హత్య కేసు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి ఆదివారం చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్‌కు చెందిన పంచాల్ శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి భార్య మృతిచెందడంతో జగదేవి అలియాస్ ప్రమీలను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు కుమార్తె నవీన, కుమారుడు ప్రచీన్లు ఉన్నారు. మొదటి భార్య సంతానంలో ఇద్దరు కుమార్తెల వి వాహాలు జరగగా, కుమారుడు సచిన్(28) ఉన్నా డు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం శ్రీనివాస్ మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం జగదేవితో పాటు సచిన్‌పై పడింది. ఇదేసమయంలో అదే గ్రామానికి చెందిన మహ్మద్ గౌసొద్దీన్ అలియాస్ గౌస్(23) జగదేవి కుమార్తె నవీనను ప్రేమించా డు. ఈ క్రమంలో గౌసొద్దీన్, సచిన్‌కు గొడవలు జరిగేవి. మూడేళ్లు గడిచాక వీరి కుటుంబం జీవనోపా«ధి కోసం హైదరాబాద్‌లోని రామచంద్రాపు రం పరిధిలో ఉన్న బీరంగూడకు వచ్చింది. అందులో భాగంగా సచిన్ ఓ దుకాణంలో కార్పెంటర్‌గా పనికి కుదిరాడు. పక్కా ప్రణాళికతో.. గౌసొద్దీన్ స్వగ్రామమైన హుమ్నాబాద్ నుంచి ప క్కా ప్రణాళికతో హైదరాబాద్‌కు వచ్చాడు. నవీనతో తనకున్న సంబంధానికి అడ్డు వస్తున్న సచిన్‌ను ఎలాగైన అంతమొందించాలని ముందుగానే వ్యూహం రచించుకున్నాడు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని జగదీశ్ మార్కెట్ ఏరియాకు వచ్చాడు. అక్కడే ఉంటూ స్థానికంగా ఓ సెల్‌ఫోన్ టవర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక సచిన్‌ను కలిశాడు. తాను కూడా ఉపాధి కోసం వచ్చానని చెప్పి నమ్మించాడు. మరి కొన్ని రోజులు గడిచాక స్నేహం చేస్తున్నట్టుగానే నమ్మించి మద్యం దుకాణానికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి మద్యం సేవించేవారు. గౌసొద్దీన్ చర్యలు ఎలాంటి అనుమానం కలిగించకపోవడంతో సచి న్ స్నేహాన్ని కొనసాగించాడు. ఆస్తిని దక్కించుకునేందుకు పన్నాగం తన భర్త మరణం తర్వాత ఉన్న ఇల్లు జగదేవితో పాటు మొదటి భార్య కుమారుడైన సచిన్ పేరిట కూడా నమోదైంది. ఆ సగభాగాన్ని ఎలాగైనా తన పేరిట మార్చుకోవాలని జగదేవి కుట్ర పన్నింది. హుమ్నాబాద్లోని తమ ఇంటి సమీపంలో నివా సం ఉండే గౌసొద్దీన్ తన కుమార్తెను ప్రేమిస్తున్న విషయం తెలిసిన జగదేవి కొత్త కుట్రకు తెరలేపింది. అప్పటికే గౌసొద్దీన్తో మృతుడు సచిన్ గొడవపడ్డ సంగతిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఏదీఏమైనా ఆస్తిని దక్కించుకోవడమే లక్ష్యంగా పథకం వేసింది. ఎలాగైనా సచిన్ ను చంపాలని, ఆ తర్వాత ఆస్తి తనకు, తన కూ తురు నీకు దక్కుతుందంటూ గౌసొద్దీన్‌ను ఉసిగొ ల్పింది. ధైర్యంతో గౌసొద్దీన్ సచిన్‌ను చంపి పగను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కల్లు తాగుదామని తీసుకొచ్చి.. సచిన్‌ను హత్య చేయడమే లక్ష్యంగా కొంతకాలం గా ఎదురు చూస్తున్న గౌసొద్దీన్ పథకానికి పదును పెట్టాడు. ఈ నేపథ్యంలో మే 31న గౌసొద్దీన్, సచిన్ లక్డీకాపూల్‌లోని మయూరి వైన్స్‌కు పల్సర్ బైక్‌పై వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి బైక్‌పై హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై కి వచ్చారు. ఈ సమయంలోనే మద్యం సేవించేందుకు ఇటువైపు ఎందుకు వెళ్తున్నామని సచిన్ గౌసొద్దీన్‌ను ప్రశ్నించాడు. నీకు ఇష్టమైన తాటికల్లు ఈ ప్రాంతంలో లభిస్తుందని నమ్మబలికాడు. అలా చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామానికి సాయంత్రం చేరుకున్నారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ప్లాన్‌తో ఉన్న గౌసొద్దీన్ తక్కువ మో తాదులో తాగి సచిన్‌కు పూటుగా తాగించాడు. మద్యం మత్తులో ఉన్న సచిన్‌ను తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపాడు. సచిన్ ఫోన్, ఐడెంటిటీ కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోయాడు. హైదరాబాద్ వెళ్లేందుకు పంతంగి గ్రామం వెళ్లి యూ టర్న్ తీసుకునే క్రమంలో రోడ్డు పక్కన చెట్లల్లో కత్తిని పడేశాడు. తూప్రాన్‌పేట గ్రామం దాటాక మూసీ నదిలో సెల్‌ఫోన్, ఐడీ కార్డులు, తదితర వస్తువులు పడేశాడు. ఆ తర్వాత అనుకున్న ప్రకారంగా.. పనిపూర్తయిందని జగదేవికి ఫోన్ చేసి చెప్పి తన రూంకు వెళ్లిపోయాడు. మద్యం సీసా లేబుల్‌తో విచారణ హత్య జరిగిన ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. ఎన్నో రకాలుగా శోధించినా ఫలితం కనబడలేదు. కానీ అక్కడే పడి ఉన్న మద్యం సీసాను పోలీసులు గుర్తించారు. హత్యతో ఏదైనా సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ఆ సీసాను వెంట తీసుకెళ్లారు. దానిపై ఉన్న లేబుల్‌ను గమనించారు. వెంటనే మద్యం సరఫరా చేసే డిపోలను సంప్రదించారు. వారిచ్చిన సమాచారం మేరకు లక్డీకాపూల్‌లోని మయూరి వైన్స్‌కు వెళ్లారు. అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల ఆధారంగా మృతుడు సచిన్‌ను గుర్తించారు. కానీ మృతుడు ఎవరూ, వెంట ఉన్న యువకుడు ఎవరూ అనే విషయం మాత్రం తెలియలేదు. ఆ సమయంలోనే పోలీస్‌శాఖ అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అందులో భాగంగా లభించిన ఆధారాలతో బైరమల్గూడలో నివాసం ఉండే మృతుడి చెల్లి, బావ వద్దకు వెళ్లారు. తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ, ఫొటోలను చూపించారు. వాటిని చూసిన వారిద్దరు సచిన్‌గా గుర్తించారు. అక్కడ వారి వద్ద తీసుకున్న సమాచారం ఆధారంగా సచిన్‌ను హత్య చేసిన గౌసొద్దీన్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా పూర్తి వివరాలు వెల్లడించాడు. హత్య చేయమని ప్రోత్సహించింది జగదేవినేనని ఒప్పుకున్నాడు. మృతు డి వద్ద హత్యకు ఉపయోగించిన పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానా న్ని విని యోగించి హత్యకేసును ఛేదించిన చౌటుప్పల్ సీఐ వెంకటయ్య, హెడ్ కానిస్టేబుళ్లు నర్సిం హ, సత్యం, కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగా ర్డులు ఊడుగు సైదులుగౌడ్, ఇస్తారిలను డీసీపీ రామచంద్రారెడ్డి అభినందించారు. రివార్డులు అందజేశారు. నేరం చేసే వ్యక్తులు ఎప్పటికైనా పోలీసులకు చిక్కాల్సిందేనని డీసీపీ పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ వెంకటయ్య, ఎస్ఐ నారబోయిన నవీన్‌బాబు, సిబ్బంది ఉన్నారు. -
132 ఏళ్ల ‘సీసా సందేశం’
2003లో విడుదలైన శివమణి సినిమాలో హీరోయిన్ అసిన్ సముద్రం మధ్యలో అపాయంలో ఉన్నప్పుడు కాగితంపై ఓ సందేశం రాసి, దానిని గాజు సీసాలో పెట్టి పడవలో నుంచే నీళ్లలోకి విసిరేస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ‘బాటిల్ సందేశం’ మరో హీరోయిన్ రక్షితకు బీచ్‌లో దొరికి కథకు కీలకంగా మారుతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో అలాంటి జిన్ ‘సీసా సందేశం’ లభించింది. అయితే ఇది ప్రేమ సందేశం మాత్రం కాదు. కాగితంపై వివరాలు రాసి జిన్ బాటిల్లో పెట్టి సముద్రంలోకి విసిరిన సందేశం ఇటీవల ఓ మహిళకు దొరికింది. సినిమాలోలాగా కాకుండా ఇది ఏకంగా 132 ఏళ్ల క్రితం నాటిది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత పాత ‘బాటిల్ సందేశం’ అయ్యింది. ఇంతకీ ఆ జిన్ సీసాలోని పేపర్లో ఏముంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.. పూర్వం ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జలాల ప్రవాహాలు, అలల వేగాన్ని లెక్కించి నౌకలు సులువుగా ప్రయాణం సాగించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త సముద్ర మార్గాలను కనుక్కునేవారు. ఇందుకోసం వారు 69 ఏళ్లపాటు పరిశోధనలు చేశారు. ఇంతకీ జలాల ప్రవాహాన్ని లెక్కించడానికి వాళ్లు ఏం చేసే వారంటే.. బాటిళ్లలో తేదీతో సహా సందేశాలు రాసిపెట్టి పడవలు, ఓడల నుంచి సముద్రం మధ్యలోకి విసిరేవారు. ఆ తర్వాత ఈ బాటిళ్లు ఎవరికి దొరుకుతాయో వారు ఆ సీసాలో ఉన్న కాగితాన్ని హాంబర్గ్‌లోని జర్మనీ నౌకల విభాగానికి లేదా దగ్గర్లోని జర్మనీ రాయబార కార్యాలయానికి అందించాలి. ఆ బాటిల్ సముద్రంలో విసిరిన తర్వాత ఎన్నాళ్లకు తీరానికి వచ్చిందనేదాన్ని అంచనా వేసి సముద్ర జలాల వేగాన్ని, అలల దిశను కనుగొనేవారు. 19వ శతాబ్దంలో ఇలాంటి కొన్ని వేల సీసాలను సముద్రాల్లోకి విసరగా వాటిలో దాదాపు పది శాతం (660) సందేశాలు మాత్రమే తిరిగొచ్చాయి. చివరిగా 1934లో ఇలాంటి బాటిల్ డెన్మార్క్‌లో దొరికింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళకు అక్కడి బీచ్‌లో ‘సీసా సందేశం’ దొరికింది. జర్మనీకి చెందిన పౌలా నౌక నుంచి 1886 జూన్ 12వ తేదీన హిందూమహా సముద్రంలో ఫలానా అక్షాంశాలు, రేఖాంశాల ప్రదేశంలో ఈ బాటిల్‌ను నీళ్లలోకి విసిరేస్తున్నట్లు ఆ సందేశంలో రాసి ఉంది. -
పాత నోట్లకు వర్ధంతి.. కొత్త నోట్లకు జయంతి
శివాజీనగర (బెంగళూరు): సీసాలో కళాకృతులు రూపొందించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనికి ఎంతో ఓర్పు, నేర్పు అవసరం ఇలా సీసాల్లో కళాకృతులను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ప్రముఖ కళాకారుడు బసవరాజు ఎం.గౌడ పెద్ద నోట్ల రద్దుపై ఒక కళాకృతిని రూపొందించాడు. నోట్ల రద్దుకు బుధవారం నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ‘నేడు పాత నోట్ల వర్ధంతి, కొత్త నోట్ల జయంతి’ అంటూ సీసాల్లో ఆ నోట్ల నమూనాల ఫోటోఫ్రేమ్లను తీర్చిదిద్దాడు. మంగళవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో వాటిని ప్రదర్శించాడు. ఇందుకు అవసరమైన ఒక్కో వస్తువును బాటిల్లోకి పంపి ఆ తరువాత కళాకృతిని సిద్ధం చేసినట్లు ఆర్టిస్ట్ బసవరాజు తెలిపారు. ఆయన గతంలో కూడా ప్రముఖ సందర్భాలను పురస్కరించుకుని బాటిల్ కళాకృతులను రూపొందించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం తదితరులతో ప్రశంసలు అందుకున్నారు.