![Viral: Fisherman Finds Unopened Whiskey Bottle In Fish Stomach - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/23/bottle.jpg.webp?itok=Scg0GhT9)
అనకోకుండా దొరికే వస్తువులు మనకీ భలే అనందాన్నిస్తాయి. ఇటీవల సముద్రంలో చేపల వేట కోసం వెళ్లే జాలర్లకు ఇలానే అరుదైన వస్తువులు దొరికిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. వారి దినచర్యలో ప్రతిరోజూ ఒకేలా ఉండవు ఒక్కోసారి రోజంతా వేట కొనసాగించిన చేపలతో కాకుండా నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అలానే ఇంకో రోజు అనూహ్యంగా అనుకోని రూపంలో చేపలతో పాటు బహుమతులు లభిస్తుంటాయ్.
ఈ తరహాలోనే ఓ మత్స్యకారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేట కోసమని వెళ్లిన అతనికి చేప మాత్రమే కాకుండా మరో అనుకోని బహుమతి లభించింది. ఇంకేముంది ఈ ఘటన కాస్త వీడియోగా మారి అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా రచ్చ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ జాలరికి అనుకున్నట్లే భారీ ఆకారంలో చేపలు వలలో పడ్డాయి. ఇంక మన వాడు ఆనందంతో ఎప్పటిలానే చేపలను కటే చేస్తూ, శుభ్రపరుస్తుండగా ఓ చేప కడుపు లోపలి భాగాల్లో ఏదో వస్తువు గట్టిగా తగులుతుండడం గుర్తించాడు. ఇక ఆలస్యం చేయక కత్తితో కోసి చూడగా అందులో మద్యం సీసా ఫుల్ బాటిల్ ఉంది. ఇంకేముంది అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కాగా ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మనుషుల బాధ్యతా రహితమైన ప్రవర్తనకు ఈ సంఘటన నిదర్శమని కొందరు కామెంట్ చేయగా.. మనం చేసే పనులు జంతుజలాలకు ఏ విధంగా ముప్పును కలిగిస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తోందని మరి కొందరు జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. మరికొందరు ‘జాక్‌పాట్ కొట్టావ్.. క్యాచ్ ఆఫ్ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.
చదవండి: లవ్‌బర్డ్ .... నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది ..!
Comments
Please login to add a commentAdd a comment