వింత ఘటన: 56 బ్లేడులు మింగిన వ్యక్తి! | 25 Year Old From Rajasthan Ate 56 Metal Blades | Sakshi
Sakshi News home page

వింత ఘటన: 56 బ్లేడులు మింగిన వ్యక్తి!

Mar 14 2023 9:40 PM | Updated on Mar 14 2023 9:41 PM

25 Year Old From Rajasthan Ate 56 Metal Blades - Sakshi

కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. వాళ్లు హార్మోన్‌ల లోపం వల్ల అలా ప్రవర్తిస్తుంటారే లేక మరేదైన కారణమా అనేది ఎవరికీ అంతుపట్టదు. కానీ ఆయా పనులు వాళ్ల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..రాజస్తాన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు.

ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉన్నటుండి ఆ యువకుడు రక్తపు వాంతులు చేసుకుంటూ  తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్‌ నర్సిరామ్‌ దేవాసి ఆయువకుడి సమస్యం ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయించారు. అందులో ఆ వ్యక్తి కడుపులో ఏదో లోహం ఉన్నట్లు తేలింది. దీంతో అతనికి సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించాగా..డాక్టర్లకి ఆ వ్యక్తి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది.

వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించి దాదాపు 56 బ్లేడులు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అతను బ్లేడ్లను కవర్లతో సహా తిన్నాడని అందువల్లే అవి తింటున్నప్పుడూ నొప్పిగానీ, రక్తస్రావం గానీ జరగలేదరని చెప్పారు. అయితే అవి కడుపులోపలకి చేరాక కాగితం మొత్తం కరిగిపోయి బ్లేడ్లు ఉండటంతో.. క్రమంగా ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. దీంతో వ్యక్తి లోపల గ్యాస్‌​ ఏర్పడి మనిషి వికారం వచ్చి వాంతులు రావడం జరిగిందని అన్నారు. ఐతే అతను ఆ బ్లేడు తినేటప్పుడే వాటిని రెండుగా విడగొట్టి మరీ తిన్నాడని చెప్పారు. అతను ఇలా చేయడానికి గల కారణాలేంటో తమకు తెలియదని అతడి బంధువులు చెబుతున్నారు.   

(చదవండి: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement