rajastan
-
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగాలు చేయ్యొచ్చు. లేదా ఇద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచెయ్యొచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే తండ్రికి పై అధికారిగా కొడుకులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా తండ్రి రిటైర్మెంట్ ఆర్డర్‌పై కొడుకు సంతకం చేసే అవకాశం ఎవ్వరికో గానీ దక్కదు. ఇది అలాంటి ఇలాంటి గౌరవం కాదు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం దక్కుతుందో అనిపిస్తుంది. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో చోటు చేసుకుంది.బాంద్రాలోని నోఖా, బికనేర్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తునన్న జోగరామ్ జాట్‌కి ఆ అరుదైన అదృష్టం, గౌరవం లభించాయి. అతడు పనిచేస్తున్న ప్రభత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలోనే కొడుకు శ్యామ్‌సుందర్ చౌదరి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఈ ప్రభుత్వ స్కూల్‌కి 2016లో ట్రాన్స్ఫర్ అయ్యారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. జోగారామ్ 39 ఏళ్ల 2 నెలల 20 రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసి మంగళవారమే పదవీ విరమణ చేశారు. ఆ రిటైర్మ్ంట్ ఆర్డర్‌పై తన కొడుకే సంతకం చేయడంతో ఈ పదవీవిరమణ మర్చిపోలేని మధురాతి ఘట్టం ఆ తండ్రికి. జోగారామ్ కూడా ఇలాంటి అదృష్టం ఎవరికీ దక్కుతుందంటూ కళ్లు చెమర్చాడు. ఈ సమయంలో తనకు ఇంతకు మించి గౌరవడం ఇంకేముంటుందని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు జోగరామ్ జాట్ మాట్లాడుతూ..తాను 1985ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిందని, అక్టోబర్ 12న విధుల్లో జాయిన్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఈ రోజు తన కొడుకు చేతుల మీదుగా పదవీవిరమణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నటికీ మర్చిపోలేని సంతోషకరమైన సందర్భం అని అన్నారు. అలాగే కొడుకు శ్యామ్ సుందర్ కూడా తన తండ్రి పదవీవిరమణ ఆర్డర్‌పై తానే సంతకం చేయడం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. ఇక శ్యామ్ సుందర్ 2011 అక్టోబరు 13న తనకు టీచర్‌న ఉద్యోగం వచ్చిందని చెప్పారు.ఆ తర్వాత జూలై20, 2015న కెమిస్ట్రీ స్కూల్ టీచర్ కెరీర్ ప్రారభించారు. అలా ఫిబ్రవరి 28, 2023న వైస్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తరువాత, అతను అక్టోబర్ 01, 2023 నుంచి తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాట్లు సమాచారం. అంతేగాదు శ్యామ్ సుందర్ చౌదరి పాఠశాలలో చేసిన కృషికి 2022లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ గౌరవాన్ని కూడా పొందారు. కాగా, మరో గొప్ప విషయం ఏంటంటే.. పదవీ విరమణ తర్వాత, జోగారం జాట్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ బాంద్రాకు రూ. 31000, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ కెడ్లికి రూ. 11000, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కెడ్లికి రూ. 5100 విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం, అదృష్టం నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో కదూ..!.(చదవండి: ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!) -
వీధి కుక్కలు రాసిన మరణ శాసనం
జైపూర్ : ‘తల్లి మీరిక్కడే ఆడుకోండి. నేను బజారుకెళ్లి వస్తానంటూ ఓ తాత తన మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు. కానీ ఆ చూపే తన మనువరాలిని చూసే చివరి చూపవుతుందనుకోలేదు.’ ఇంతకి ఏం జరిగిందంటే..రాజస్థాన్(rajastan)లోని అల్వార్ జిల్లాలో ఇక్రానా తన తాత, ఐదుగురు స్నేహితులతో కలిసి పొలానికి వెళ్లింది. పొలం పనిచేసిన అంనతరం తాత స్థానికంగా ఉండే మార్కెట్‌కు వెళ్లాడు. వెళ్లే సమయంలో మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు.తాత మాట విన్న ఆ మనువరాలు తన స్నేహితులతో పొలంలోనే ఆడుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరింది. మార్గం మధ్యంలో 7-8 వీధి కుక్కలు (street dogs) ఇక్రానా,ఆమె స్నేహితులపై దాడి చేశాయి. కుక్కుల దాడితో భయాందోళనకు గురైన చిన్నారులు బిగ్గరుగా కేకలు వేశారు. చిన్నారుల కేకల విన్న పక్కనే పొలం పనులు చేస్తున్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లల్ని కుక్కల దాడి నుంచి కాపాడారు. అత్యవసర చికిత్స నిమిత్తం ట్రాక్టర్లో తరలించారు.అయితే, ఆ వీధి కుక్కల్లోని ఓ కుక్క మాత్రం ఇక్రానాను వదిలి పెట్టలేదు. వెంటపడి మరీ కరిచింది. ట్రాక్టర్లో తరలిస్తున్నా ఇంకా కరించేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకే కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారుల్ని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ దుర్ఘటనలో ఇక్రానా మరణించింది. ఇక్రానాపై దాడి చేసిన కుక్క గతంలో ఇతర జంతువులపై దాడి చేసిందని, అందువల్లే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 👉చదవండి : వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో -
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత
జైపూర్ : రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత డిసెంబర్ 23న మధ్యాహ్నం కోట్‌పుత్లీ జిల్లా కిరాత్‌పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్ బోర్వెల్లను కవర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024 -
భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్
కేన్సర్‌తో బాధపడుతున్న భర్తను రక్షించుకునేందుకు నేపాలీ యువతి పడిన వేదన, ప్రేమతో అతనికి సేవలు, చివరకు అతను కన్నుమూసిన తీరు పలువురి హృదయాలను కదిలించింది. భార్యభర్తల ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు ఇలాంటి మరో విషాద ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన జరిగింది.జైపూర్‌కు చెందిన దేవేంద్ర సందాల్ కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్‌గా పని చేసేవారు.. అతని భార్య టీనా అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకువాలనే లక్ష్యంతో మూడేళ్ల పదవీకాలం ఉండగానే ముందస్తు రిటైర్మెంట్ ( వీఆర్ఎస్) తీసుకున్నారు. ఈ సందర్బంగా దేవంద్ర సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దండలు, శాలువాలు, స్నేహితులిచ్చిన పూల బొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడి పరిస్థితి మారిపోయింది.नियति का खेल !पत्नी की तबीयत को देखते हुए पति ने लिया था VRS, रिटायरमेंट पार्टी में ही पत्नी की मौत,बीमार पत्नी की सेवा के लिए नौकरी छोड़ी, विदाई पार्टी में पत्नी ने हीं दुनिया छोड़ दी ।pic.twitter.com/yUn0xAGFch— राहुल चेची 🇮🇳 (@Rahulchechi26) December 25, 2024కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా కుర్చీలో కూలబడింది. భార్య వీపుపై రుద్దుతూ సపర్యలు చేస్తూ మంచినీళ్లకు కోసం అడిగాడు. ఇంతలోనే పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధవీకరించారు.భర్తతో నవ్వుతూ, సంతోషంగా ఉన్న టీనా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించిన దృశ్యాలు సంబంధించిన వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ హాయిగా నవ్వుతూ, అందర్నీ పలకరిస్తూ ఫొటోలు దిగిన ఆమెకు అవే చివరి క్షణాలవుతాయని ఎవరనుకుంటారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో టీనా ఈ ప్రపంచం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. -
700 అడుగుల లోతు బోరు బావిలో చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
జైపూర్: రెండు వారాల వ్యవధిలో రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి చేతన బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది 20 గంటలుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతులో ఉన్న పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాజస్థాన్ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చేతన తన తండ్రితో కలిసి పోలానికి వెళ్లింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా.. చేతన పొలంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవ శాత్తూ పొలంలో ఏర్పాటు చేసిన 700 అడుగుల బోరుబావిలో పడింది. దీంతో భయాందోళన గురైన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు చేతనను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. చేతన 150 అడుగుల లోతులోకి జారినట్లు గుర్తించారు. బోరుబావి లోపల పాప ఆచూకీ కోసం కెమెరాలను పంపించారు. 20 గంటలకు బోరుబావిలో ఉన్న చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. బోరుబావి లోపల ఉన్న చేతనను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. 700 फीट गहरे बोरवेल में फंसी बच्ची, गांव में चूल्हा नहीं जला। कैमरे में हाथ हिलाते हुए दिखी"दुआ करें, जिंदगी की ये जंग जीत जाए। 💕" pic.twitter.com/XJg5BDBDeR— Dinesh Bohra (@dineshbohrabmr) December 23, 2024 విఫలమైన ప్రయత్నం.. చివరిగా 150 అడుగుల లోతులో ఉన్న చేతనకు ఆక్సిజన్ పైపును లోపలికి పంపారు. బోరుబావికి ఓ వైపు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ వ్యవసాయం క్షేత్రం కావడంతో మట్టి తేమగా ఉంది. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం, పొడవైన రాడ్‌కు బిగించిన హుక్ సాయంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతన సురక్షితంగా బోరుబావి నుంచి బయట పడుతుందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఆర్యన్ కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ దౌస జిల్లాలోని కలిఖడ్ గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడ్డాడు. బాలుడి కోసం రెస్క్యూ బృందాలు సుమారు 57 గంటల పాటు శ్రమించాయి. చివరికి 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024 -
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్‌లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్‌లోని జైపుర్‌లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్‌ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్‌లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్‌పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్‌కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. ‘నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్‌ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు. -
ఎనిమిది సార్లు కారు బోల్తా పడితే.. తాపీగా ‘టీ ఉన్నాయా?’ అని అడిగారంట
జైపూర్ : ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్యూవీ క్షణాల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024అన్నా.. టీ ఉన్నాయా?స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణంప్రమాద సమయంలో ఎస్యూవీ నాగౌర్ నుండి బికనీర్‌కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి. -
వీడియో: భయానక అగ్ని ప్రమాదం.. పలువురు సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్జీ ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 20 మంది గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సీఎన్జీ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి.जयपुर के अजमेर रोड भांकरोटा स्थित DPS स्कूल के सामने अलसुबह सीएनजी गैंस टैंकर में आग लगने से भीषण हादसा, कई वाहनों में आग लगने की सूचना. कई लोगों के झुलसने की सूचना.#Jaipur #Rajasthan pic.twitter.com/RjxNYyoNEA— Surendra Gurjar (@S_Gurjar_11) December 20, 2024ఘటనా స్థలంలో 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.#WATCH | Jaipur, Rajasthan | Jaipur DM, Jitendra Soni says, "4 people have died (in the incident). Around 40 vehicles caught the fire. Fire brigade and ambulances have reached the spot. The relief work is underway. The fire has been doused off and only 1-2 vehicles are left.… https://t.co/5l1uNq2lUd pic.twitter.com/p3XDxSJQto— ANI (@ANI) December 20, 2024 ప్రమాద స్థలికి సీఎం..ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ప్రమాద స్థలికి చేరుకోనున్నారు.VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews (Full video available on PTI videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ— Press Trust of India (@PTI_News) December 20, 2024 -
ప్రభుత్వ అధికారిపై దాడి.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు మూడేళ్ల జైలు శిక్ష
జైపూర్: బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో, ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్, అతడి సహాయకుడు 2022లో ఫారెస్ట్ అధికారి రవి కుమార్ మీనాపై దాడి చేశారు. రాజావత్ తన మద్దతుదారులతో కలిసి డీసీఎఫ్ ఆఫీసులోకి వెళ్లి సదరు అధికారిని బెదిరింపులకు గురి చేసి... అనంతరం అధికారిపై చేయి చేసుకున్నారు. అయితే, ఓ పనికి సంబంధించి సదరు అధికారితో వాగ్వాదం తర్వాత ఆగ్రహానికి లోనైనా రజావత్.. దాడి చేశారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు అతని సహాయకుడు మహావీర్ సుమన్ కూడా ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాతో వైరల్ అయ్యాయి.అయితే, ఈ ఘటనపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) రవికుమార్ మీనా ఫిర్యాదు మేరకు రజావత్, సుమన్లపై 2022 మార్చి 31న ఐపీసీ సెక్షన్లు 332, 353, 34, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నయాపురా పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్బంగా తాజాగా రజావత్, సుమన్‌లకు ప్రత్యేక కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. సెక్షన్ 353 (ప్రభుత్వ అధికారి తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) సహా పలు సెక్షన్ల కింద కోర్టు వారిద్దరిని దోషులుగా నిర్ధారించారు. ఇదే సమయంలో దోషులకు ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించింది.దోషిగా తేలిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రజావత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై హైకోర్టులో అప్పీలు చేస్తాను. కోటలోని లాడ్పురా మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్-3 కింద అభియోగాల నుంచి విముక్తి పొందారని చెప్పుకొచ్చారు. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో రజావత్, సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!
ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్‌కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.రాజస్థాన్‌లో కోట్పుట్లీలోని రైకరన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్‌లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది. అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్‌లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించాడు.ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్టెక్గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్‌కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్‌ని అందించే స్టడీ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్‌కి సరైన నిర్వచనం..!.(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..) -
57 గంటల తర్వాత బోరు బావి నుంచి బయటకు.. ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించారు. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషాదం సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు కదిలి వచ్చాయి. బోరుబావిలో పడ్డ బాలుడి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, జేసీబీలు,డ్రిల్లింగ్ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నీటి మట్టం దాదాపు 160 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేశారు. భూగర్భంలో ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బంది మారింది. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అంచనా వేశారు. అయినప్పటికీ, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్ సురక్షితంగా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో కూడిన అంబులెన్స్‌లో ఆర్యన్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్ష చేసినా డాక్టర్లు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. -
150 అడుగుల బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. #WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. -
కిలో గోల్డ్ బిస్కెట్లు, కోట్ల నగదు.. కృష్ణుడి హుండీకి రికార్డు ఆదాయం
జైపూర్: రాజస్థాన్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. శ్రీకృష్ణుడి ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో, హుండీ ఆదాయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్ సమీపంలోని సన్వాలియా సేథ్ ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయంలో హుండీని రెండు నెలల తర్వాత లెక్కించారు. హుండీ లెక్కింపు సందర్బంగా అందులో నుంచి కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీకృష్ణుడికి చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, వెండి పిస్టల్ ప్రత్యేక వస్తువులను కూడా భక్తులు సమర్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఆలయానికి ఇప్పటివరకు వచ్చిన ఆదాయంలో ఇదే అతి పెద్ద మొత్తమని అధికారులు చెబుతున్నారు. ఇంకా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్పారు. అలాగే.. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కిస్తున్నట్టు తెలిపారు. ఆలయానికి భారీగా విరాళాలు భారీగా ఉండటంతో దశల వారీగా లెక్కిస్తున్నారు.Chittorgarh : श्री सांवलिया सेठ के भडांर से निकली 35 करोड़ की राशि, ढ़ाई किलो सोना, 64 किलो चांदी, सागवान की लकड़ी समेत 583 किलो चांदी का रथ भी आया चढ़ावे में, करीब 20 लाख की विदेश करेंसी भी मिली भंडार सेसिक्कों की गिनती अब भी जारीएक दर्जन से अधिक देशों की निकली विदेशी… pic.twitter.com/1Uy18JeewB— News India (@newsindia24x7_) December 6, 2024 -
ఉదయ్‌పూర్‌లో ఫ్యామిలీ డ్రామా.. ఆ వీలునామాలో అసలేముంది?
జైపూర్: మొఘలులుపై పోరాడిన మహారాణా ప్రతాప్ వారసులు ఆస్తుల కోసం, అధికారం కోసం వీధిన పడ్డారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ కోట వద్ద కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి.. పలువురు గాయపడ్డారు.ఏంటి ఈ మహరాణా ప్రతాప్ వారసుల గొడవమహారాణా ప్రతాప్ ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు. రాజస్థాన్‌లోని మేవార్ రాజు. భారతదేశ స్వాంతంత్య్ర ఉద్యమంలో మహారాణా భూపాల్ సింగ్ మేవార్ రాజు. ఈయన 1955లో శ్రీ ఎక్లింగ్జీ ( Shri Eklingji Trust) ట్రస్ట్‌ను స్థాపించారు. ఆ ట్రస్ట్ బాధ్యతల్ని ఆయన వారసులు కొనసాగిస్తూ వచ్చారు. అయితే క్రమేపీ ఈ ట్రస్ట్ వ్యవహారాలు పాలన విషయంలో కుటుంబసభ్యుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి.75వ మహారాణా విశ్వరాజ్ సింగ్ తాత భగవత్ సింగ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ కాగా మరొకరు అరవింద్ సింగ్. తన మరణానికి ముందు ట్రస్ట్ నిర్వాహక బాధ్యతల నుంచి తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను తప్పించి తన చిన్న కుమారుడు అరవింద్ సింగ్‌కు అప్పగించారు భగవంత్ సింగ్.వీలునామాలో ఉంది ఇదే..తండ్రి నిర్ణయంతో కలత చెందిన మహేంద్ర సింగ్ కోర్టును ఆశ్రయించారు. మే 15, 1984 నాటి తన చివరి వీలునామాలో భగవత్ సింగ్ తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు పేర్కొన్నారు. తన చిన్న కుమారుడే ట్రస్ట్ కార్యనిర్వహకుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అదే ఏడాది నవంబర్‌లో తండ్రి భగవత్ సింగ్ మరణించడంతో ట్రస్ట్ ఛైర్మన్‌గా అరవింద్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ ఏడాదిలో మహేంద్ర సింగ్ మరణానంతరం.. ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం, సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంటుంది.అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ మేవార్ .. తన కుమారుడు లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ తమ బలగాన్ని ఉపయోగించి విశ్వరాజ్ సింగ్ మేవాడ్‌ను రాజభవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో విశ్వరాజ్ మద్దతుదారులు రాళ్లదాడికి దిగారు. లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ అనుచరులు సైతం ప్రతి దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపై పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.అయితే.. ఈ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ కేంద్రంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిత్ చౌదరీపై ఈనియోజకర్గంలోస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హై డ్రామా మధ్య గురువారం నరేష్ మీనా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బృందం ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందు నరేష్ మీనా మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను లొంగిపోను. నా మద్దతుదారులంతా పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్ చేయండి’’అని అనుచరులకు పిలుపునిచ్చారు.‘‘ భారీగా పోలీసులు.. లాఠీలు, షీల్డ్‌లను ధరించి.. మేము వ్యూహాత్మకంగా అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మేం అతన్ని లొంగిపోవాలని అభ్యర్థించాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’’ అని చెప్పామని టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.మరోవైపు.. పోలింగ్ బూత్‌లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ కొందరు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఎస్డీఎం, తహసీల్ అధికారులు వారిని ఒప్పించేందుకు వెళ్లారు. చర్చల సమయంలో స్వతంత్ర అభ్యర్థి (నరేష్ మీనా) ఎస్డీఎంను చెప్పుతో కొట్టారు’’ అని ఎస్పీ సాంగ్వాన్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు (మీనా మద్దతుదారులు), పోలీసుల మధ్య చెలరేగిన హింసాకాండలో పోలీసు వాహనాలతో సహా ఎనిమిది కార్లు, 10పైగా మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. -
సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై ఎమ్మెల్యే అభ్యర్థి దాడి
జైపూర్ : పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై (ఎస్డీఎం)పై దాడి ఘటన కలకలం రేపుతుంది. పోలింగ్ బూత్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఎస్‌డీఎంపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ స్టేషన్లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్క్రుత నేత, డియోలీ-యునియారా ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి నరేష్ మీనా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఎస్డీఎం అమిత్ చౌదరిపై దాడి చేశారు. ఎస్డీఎం అమిత్ చౌదరి.. తనతో సన్నిహితంగా ఉన్న ఓ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడేలా ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు నరేష్ మీనాను పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. ఎస్డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైటాయించారు. రాజస్థాన్‌లోని ఝుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబెర్, రామ్‌గఢ్ స్థానాలు ఉప ఎన్నిక కొనసాగుతుంది. కాగా,గతేడాది రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 114 స్థానాల్లో, కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. मैं देवली उनियारा से नरेश मीणा का समर्थन कर रहा था परंतु आज जिस प्रकार का गंदा रवैया उनके द्वारा देखा गया वह शर्मनाक है।@NareshMeena__ की अभी कोई हैसियत नहीं है कि वह एक एसडीएम के ऊपर हाथ उठाएं, यह लोकतंत्र व भारतीय प्रशासन पर कलंक है। एकतरफ देश की सबसे कठिन परीक्षा देकर आया एक… pic.twitter.com/urAxAjR3BI— Priyanshu Kumar (@priyanshu__63) November 13, 2024 -
కల్వర్టును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సికార్‌లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్‌గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌లోని ప్రభుత్వ సంక్షేమ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచాడ్ తెలిపారు. #Sikar: #लक्ष्मणगढ़ पुलिया के पास भीषण हादसामृतकों की संख्या पहुंची12, एक और घायल ने तोड़ा दम, 35 से अधिक लोग हुए थे घायल, सीकर अस्पताल में पांच मृतकों के शव, सात शव रखे है लक्ष्मणगढ़ अस्पताल की मोर्चरी में, घायलों का जारी है इलाज, सुजानगढ़ से नवलगढ़ आ रही थी बस #RajasthanNews pic.twitter.com/LHZCnSpscb— Manoj Bisu Sikar (@manoj_bisu) October 29, 2024 -
ఐఏఎస్ టీనా దాబీ వైరల్ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు
జైపూర్ : ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్ అధికారిణి సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు."दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024 అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేపటి తర్వాత టీనా దాబి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీనా దాబిరాజస్థాన్కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.గతేడాది 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. -
టెంపోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 11 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు.. టెంపును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది చిన్నారులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని థోల్పుర్‌లో శనివారం అర్ధరాత్రి స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే, వీరంతా బరౌలీలో ఓ వివాహా వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ లెస్ కారులో మంటలు.. వీడియో వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లో డ్రైవర్ లెస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై పార్క్ చసిన బైక్‌లను ఢీకొడుతూ మంటలతోనే కారు ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు ఓనర్ అల్వార్‌కు చెందిన ముఖేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ముఖేష్ గోస్వామి అతని స్నేహితుడు జితేంద్ర జంగిద్ నడిపారు. అయితే కారు బానెట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటాన్ని ఆయన గమనించారు. మంటలు చెలరేగడంతో కారు హ్యాండ్‌బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ జితేంద్ర.. అందులో నుంచి బయటకు దూకేశారు. ఎలివేటెడ్ రోడ్డులో కారు మంటలతో అక్కడ పార్క్ చేసిన పలు బైక్‌లను ఢీకొడుతూ కిందికి కదిలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి దినేష్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. Watch Burning Car on #Jaipur Road Causes Panic Among Commuters | #Burningcar pic.twitter.com/mzEKAGCyU6— KINGSNEWS (@KINGSNEWS7) October 13, 2024చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్ -
ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో ఎన్నో గొప్ప విశిష్టత గల గ్రామలున్నాయి. వాటన్నింటిని వెనక్కినెట్టి రాజస్థాన్‌లోని ఈ గ్రామమే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎలా ఎంపికయ్యిందో వింటే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ తెలిస్తే.. ఈ రోజుల్లో కూడా ఇలా నియబద్ధంగా ఎవరు ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు. రాజస్తాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం పేరుకి తగ్గట్టుగానే చక్కటి జీవనశైలితో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ కూడా మాంసం, చేపలు, మద్యం ముట్టరట. ఇలా అందరూ నియమబద్ధంగా ఉండటం అంత ఈజీ కాదు గదా..!. అలాగే అక్కడ వేప కలపను ఎవ్వరూ కాల్చడం వంటివి చేయరట. అంతేగాదు కిరోసిన్ ఉపయోగించడం కూడా నిషిద్ధం. ఆ గ్రామంలో దేవ్‌నారాయణ్ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారట. మసుదా ఉపవిభాగంలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ గ్రామం సుమారు మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సిమ్మెంట్, కలపతో చేసిన పక్కా ఇళ్లు కూడా ఉండవు. అన్ని మట్టితో చేసిన ఇళ్లే ఉంటాయి. అయితే కొండపై వెలసిన దేవనారాయణుని అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక ఈ ఉత్తమ పర్యాటక గ్రామ పోటీని పర్యాట మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ గొప్ప సంస్కృతిని కొనసాగిస్తున్న గ్రామాలను గుర్తించి మరీ ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు.. ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాట గ్రామలను ఎంపిక చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటన్నింటి ఆధారంగానే 'దేవమాలి గ్రామం' ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యిందని మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "రాజస్థాన్ గర్వించదగ్గ ఘట్టం!. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది." అని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దేవమాలి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అనేది రాజస్థాన్‌కి ఎంతో గర్వకారణం అన్నారు. (చదవండి: అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!) -
ఇంగ్లిష్ స్పీచ్‌తో అదరగొట్టిన మహిళా సర్పంచ్..ఆశ్చర్యపోయిన ఐఏఎస్ ఆఫీసర్!
ఓ సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంగ్లీష్ స్పీచ్‌కి అందరూ ఫిదా అయ్యిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..రాజస్తాన్ బార్మర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి విచ్చేశారు. ఆ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్‌కి ఆంగ్లంలో స్వాగతం పలికింది. " ఈరోజులో తాను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్ స్వాగం పలుకుతారు. ఓ మహిళగా ఆమెను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా" అంటూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నీటి సంరక్షణపై కూడా ప్రసంగించింది. ఆ వేదికపై మహిళా సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. అంతేగాదు ఒక్కసారిగా ఆ వేదిక మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ సర్పంచ్ ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు. కాగా, 2015లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (UPSC) పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే అగ్రస్థానంలో నిలిచి కలెక్టర్‌గా అజ్మీర్ నుంచి కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే బార్మర్ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. बाड़मेर में IAS टीना डाबी @dabi_tina के सामने जब राजपूती पोशाक और घूँघट में जालीपा महिला सरपंच सोनू कँवर ने जब अपना उद्बोधन अंग्रेज़ी से शुरू किया तो उपस्थित सब लोग चौंक गए और टीना डाबी के चेहरे की मुस्कान बयां कर रही है l..जिला कलेक्टर खुद को ताली बजाने से नही रोक पाए pic.twitter.com/fLYuo0gqJo— Kailash Singh Sodha (@KailashSodha_94) September 14, 2024 (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
రాజకీయలపై రాజస్థాన్ మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
జైపూర్: రాజకీయాల్లో నాయకులు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సి వస్తుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుధర రాజే అన్నారు. శనివారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ప్రతి నాయకుడు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సిందే. రాజకీయాల్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. పదవి, మత్తు, స్థాయి. పదవి, మత్తు ఎప్పుడు ఉండకూడదు. పార్టీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటే స్థాయి దానికదే పెరుగుతుంది. రాజకీయలు అంత ఈజీ కాదు. రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ పార్టీ కోసం పని చేస్తూనే ఉండాలి. ప్రజలను సమన్వయం చేయటం కూడా అంత సులభం కాదు. మన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గతంలో కొంతమంది నాయకులు అభివృద్ది చేయటంలో విఫలం అయ్యారు’’ అని అన్నారు.ఇక.. ఇటీవల ఆమెను పార్టీలో పక్కకు పెడుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది బీజేపీ అధిష్టానం మరోసారి వసుంధర రాజేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను బీజేపీ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 11 స్థానాల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. -
బతికున్నానని చెప్పేందుకు.. పోలీసులు సైతం షాక్ తిన్న ఘటన!
చిల్లర సొమ్ములకు, చిన్నాచితకా కారణాలకు నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజులివి. అయితే వరుస దాడులతో ఇక్కడో వ్యక్తి వార్తల్లో నిలిచాడు. అయితే అలా ఎందుకు దాడులు చేశావని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. రాజస్తాన్‌లోని బాలొత్రా గ్రామానికి చెందిన బాబురామ్ భిల్ మీద డజన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో దాడుల కేసులే ఎక్కువ ఉన్నాయి. కేవలం తాను బతికే ఉన్నానని నిరూపించుకోవటం కోసమే ఆయన ఆ దాడులు చేశానని చెప్పేసరికి అంతా షాక్ తిన్నారు. ‘‘నేను చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇష్యూ అయ్యింది. అది తెలిసి నాకు నోట మాట పడిపోయింది. నా ఆస్తిని లాక్కునే ప్రయత్నంలో భాగంగానే అలా దొంగ సర్టిఫికెట్ సృష్టించారు. అందుకే నేను బతికి ఉన్నానని సమాజానికి నిరూపించుకోవాలనుకున్నా. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. ఇలా అయినా అందరికీ తెలుస్తుంది కదా’’ అని భిల్ అంటున్నారు.Villains are not born they are made pic.twitter.com/uouwZuug9y— narsa. (@rathor7_) July 24, 2024ఈ ఒక్క ఉదంతమే కాదు.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కుతున్న కేసుల సంఖ్య మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఒక కారణమైతే, అవినీతి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్ల జారీ సమయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి కేసులు వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు దోపిడీకి ఎక్కువగా గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవస్థలు సక్రమంగా పని చేయడం, అధికారుల అవినీతి కట్టడి జరిగినప్పుడే రాజస్థాన్ తరహా ఘటనలు తగ్గుతాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల్లో ఓటమి.. మంత్రి పదవికి బీజేపీ నేత రాజీనామా
జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర మంత్రి కిరోడి లాల్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనకు అప్పగించిన పలు స్థానాల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు పంపించారు. ‘‘ కిరోడి లాల్ మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు. పది రోజుల క్రితం సీఎంకు రాజీనామా లేఖను అందజేశారు’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి.లోక్‌సభ ఎన్నికల్లో కిరోడి లాల్ మీనాకు బీజేపీ ఏడు స్థానాలను అప్పగించింది. ఈ స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. తన సొంత నియోజకవర్గం దౌసాలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలకు 14 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 ఎనిమిది సీట్లు విజయం సాధించింది. మిగతా పార్టీలు మూడు సీట్లను గెలుచుకున్నాయి.