వీడియో: భయానక అగ్ని ప్రమాదం.. పలువురు సజీవ దహనం | Many Vehicles Damaged Due To Fire After 2 Trucks Collide Outside Jaipur Petrol Pump, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Jaipur Fire Accident: భయానక అగ్ని ప్రమాదం.. పలువురు సజీవ దహనం

Published Fri, Dec 20 2024 8:15 AM | Last Updated on Fri, Dec 20 2024 9:40 AM

Many Vehicles Damaged Due To Fire Outside Jaipur Petrol Pump

జైపూర్‌: రాజస్థాన్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న సీఎన్‌జీ ట్యాంకర్‌ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 20 మంది గాయపడ్డినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌ వద్ద ఆపి ఉంచిన సీఎన్‌జీ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్‌ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్‌ టెండర్లు చేరుకున్నాయి.

ఘటనా స్థలంలో 22 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 ప్రమాద స్థలికి సీఎం..
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ప్రమాద స్థలికి చేరుకోనున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement