Petrol Bunk
-
వీడియో: భయానక అగ్ని ప్రమాదం.. పలువురు సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్జీ ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 20 మంది గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సీఎన్జీ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి.जयपुर के अजमेर रोड भांकरोटा स्थित DPS स्कूल के सामने अलसुबह सीएनजी गैंस टैंकर में आग लगने से भीषण हादसा, कई वाहनों में आग लगने की सूचना. कई लोगों के झुलसने की सूचना.#Jaipur #Rajasthan pic.twitter.com/RjxNYyoNEA— Surendra Gurjar (@S_Gurjar_11) December 20, 2024ఘటనా స్థలంలో 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.#WATCH | Jaipur, Rajasthan | Jaipur DM, Jitendra Soni says, "4 people have died (in the incident). Around 40 vehicles caught the fire. Fire brigade and ambulances have reached the spot. The relief work is underway. The fire has been doused off and only 1-2 vehicles are left.… https://t.co/5l1uNq2lUd pic.twitter.com/p3XDxSJQto— ANI (@ANI) December 20, 2024 ప్రమాద స్థలికి సీఎం..ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ప్రమాద స్థలికి చేరుకోనున్నారు.VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews (Full video available on PTI videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ— Press Trust of India (@PTI_News) December 20, 2024 -
Nampally: పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం
-
ఏ పెట్రోల్ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.. రోజూ వెళ్లేవారికీ తెలియని విషయాలు
న్యూఢిల్లీ: వాహనం కలిగిన ప్రతీఒక్కరూ తమ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు తప్పనిసరిగా వెళుతుంటారు. అయితే ఇలా వెళ్లేవారిలో చాలా మందికి అక్కడ లభించే ఉచిత సర్వీసులు గురించి ఏమాత్రం తెలియదు. వినియోగదారుల వాహన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను ఆయా పెట్రోల్ బంక్‌లు అందిస్తాయి. అవేమిటో వాహనదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. బంక్‌లు అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మరి.. ఆ ఉచిత సేవలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.1. ఉచితంగా గాలిని కొట్టించుకోవచ్చుఏదైనా వాహనానికి గల టైర్లలో తగిన రీతిలో గాలి ఉండటం చాలా ముఖ్యం. పెట్రోల్ బంక్‌ల వద్ద ఉచితంగా వాహనాల టైర్లలో గాలికొట్టించుకోవచ్చు. బంక్లోగల ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా వాహనాల టైర్లలో గాలిని నింపుతారు. ఇందుకోసం బంక్‌లో ఒక ఉద్యోగిని నియమిస్తారు.2.ఫైర్ సేఫ్టీ డివైజ్ఏవో కారణాలతో వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే, అదే బంక్‌లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం వినియోగించుకున్నందుకు బంక్‌లో ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు.3. అత్యవసర కాల్ సౌకర్యంఅత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లోని టెలిఫోన్ నుంచి ఉచితంగా కాల్ చేయవచ్చు. అయితే వాహనదారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పుడు లేదా బ్యాటరీ ఛార్జింగ్ జోరో అయినప్పుడు మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.4. ప్రథమ చికిత్స బాక్సువాహనదారులు ఏదైనా గాయం అయినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని మందులను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ బాక్సులోని మందులు గడువు ముగియనివి అయి ఉండాలని గుర్తుంచుకోండి. పెట్రోల్ పంప్ యజమానులు ప్రథమ చికిత్స బాక్సులలోని మందులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి.5. మంచినీటి సౌకర్యంపెట్రోల్ పంపులో మంచినీటి సౌకర్యం కూడా ఉచితం. చాలా బంకులలో వాటర్ కూలర్ సదుపాయం కూడా ఉంటుంది. తద్వారా వాహన వినియోగదారులు చల్లని, పరిశుభ్రమైన నీటిని తాగవచ్చు.6. ఉచిత వాష్రూమ్వాహనదారులుతమ ప్రయాణంలో వాష్‌రూమ్ అవసరమైన సందర్భంలో పెట్రోల్ బంక్‌లోని వాష్‌రూమ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ వాష్‌రూమ్‌లను సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత సౌకర్యాల కోసం ఏ బంక్‌లోనైనా డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.చాలా మంది వాహనదారులకు బంక్‌లలో అందించే ఈ సేవల గురించి తెలియదు. ఫలితంగా వారు ఇబ్బందులకు ఎదుర్కొంటుంటారు. పెట్రోల్ బంక్ యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సేవలను ఉచితంగా అందించడం తప్పనిసరి. పెట్రోల్ బంక్‌లో ఈ సౌకర్యాలు ఉచితంగా అందించకపోయినా, లేదా ఇందుకోసం ఛార్జీలు విధించినా వినియోగదారులు ఆ పెట్రోలియం కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి, దానిలో ఫిర్యాదు చేయవచ్చు.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
చెత్తకుప్పలో దొరికిన ఆ సెల్‌ఫోన్ ఎవరిది?
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో గత మంగళవారం రాత్రి దంపతులు ఎర్రా వెంకటరమణ – కృష్ణకుమారి హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా.. ప్రత్యేక పోలీసు బృందాల విచారణ కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు మిస్టరీ వీడకపోగా శుక్రవారం కీలక ఆధారంగా భావిస్తున్న సెల్‌ఫోన్ పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్ డేటాతో పాటు ఫోన్ లభించిన ప్రాంతానికి సమీపాన ఉన్న షాపు నుంచి సీసీ కెమెరాల పుటేజీ సేకరించడంతో దర్యాప్తులో అడుగు ముందుకు పడినట్లు భావిస్తున్నారు.చెత్త కుప్పలో ఫోన్నేలకొండపల్లిలో పెట్రోల్ బంక్ ఎదురుగా గ్రామపంచాయతీ స్వీపర్ శుక్రవారం ఉదయం చెత్త తొలగిస్తుండగా ఓ చోట సెల్‌ఫోన్ లభించింది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ విషయం తెలియగానే ప్రత్యేక బృందాలు సైతం సదరు స్వీపర్ ఇంటికి సైతం వెళ్లి విచారించారు. అంతేకాక సెల్‌ఫోన్ దొరికిన ప్రాంతంలో ఓ దుకాణం నుంచి సీసీ కెమెరాల పుటేజీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ నిందితులు పారిపోయే క్రమంలో కింద పడిందా, లేక మృతుల ఫోన్‌ను తీసుకెళ్లే క్రమాన వదిలేశారా అనే విషయాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుండగా స్పష్టత ఇవ్వడం లేదు. హంతకుల ఫోన్ అయితే హత్య జరిగిన రోజే లభించేదని, రెండు రోజుల తర్వాత దొరకడంతో నిందితులు మళ్లీ ఇక్కడకు వచ్చి, వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యాన సెల్‌ఫోన్ కాల్‌డేటా, సీపీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తులో వేగం పెంచినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్‌తో పాటు వివిధ పోలీస్స్టేషన్ల ఎస్సైలు శుక్రవారం సైతం మండల కేంద్రంలో పర్యటించి పలువురు అనుమానితులను విచారించినట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా సెల్‌ఫోన్ దొరికిన మాట వాస్తవమేనని చెప్పినా ఇతర వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. -
పెట్రోల్ బంక్ వద్ద ఆగిఉన్న లారీలో మంటలు
-
దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడి అదృశ్యం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు దుబాయ్‌లో అదృశ్యమయ్యాడు. పది రోజులుగా అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన ఆకెన రవి(36) పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. దుబాయ్‌లో మెరుగైన ఉపాధి లభిస్తుందనే ఆశతో సిరిసిల్లకు చెందిన మరో యువకుడు వేముల శ్రీనివాస్‌తో కలిసి విజిటింగ్ వీసాపై ఈనెల 17న అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులు, లేబర్ క్యాంపులు చూసి, పని దొరికే అవకాశం లేక పోవడంతో ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రవి కాటగలిశారు. అతని కోసం శ్రీనివాస్ తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో సిరిసిల్లలోని అతడి భార్య రూపకు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. రవి మిస్ అయినట్లు కేసు నమోదు చేయించిన ఎంబసీ అధికారులు అతడి కోసం పోలీసుల ద్వారా గాలించారు. సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు, సామాజిక సేవకులు గుండెల్లి నర్సింహులకు విషయం తెలియడంతో ఆయన తెలంగాణకు చెందిన వలస కార్మికుల ద్వారా ఆరా తీశారు. మొత్తంగా ఆదివారం షార్జాలో రవి ఉన్నట్లు గుర్తించారు.ఐదు రోజులుగా తిండిలేక.. నడవలేని స్థితిలో ఉన్న రవిని పోలీసులు గుర్తించి ఎంబసీ అధికారులకు అప్పగించారు. అతడి పాస్‌పోర్టును దుబాయ్ నుంచి రికవరీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో రవికి విమాన టిక్కెట్ సమకూర్చి ఇండియాకు పంపించారు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్ రానున్నారు. మరో యువకుడు వేముల శ్రీనివాస్ సోమవారం ఉదయం సిరిసిల్లకు చేరాడు. రవిని స్వదేశానికి రప్పించడానికి చొరవ చూపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
-
ఫోర్జరీ సాంబకు భారీ షాక్..
-
యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్
పరకాల: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చి ంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చి ంది. బాధితుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌస్‌పాషా గుడెప్పాడ్‌లోని జీకే పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గౌస్‌పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేమ్‌కు అలవాటు పడి బంక్‌కు సంబంధించిన రూ.6లక్షలు పొగొట్టాడు. దీంతో బంక్ యజమానులు ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్‌పాషా ఇంటిని రూ.100 స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు. అదే రోజు ఇంటికి చేరుకున్న గౌస్‌పాషా ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకోలేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని..మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో క్రిమిసంహారక మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధితుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పరకాల సీఐ రవిరాజుకు ఫోన్‌చేయగా స్పందించలేదు. -
టీవీ 5 సాంబశివరావు చెప్పేవన్నీ అబద్ధాలే!
సాక్షి, హైదరాబాద్: హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్ రావు ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు. టీవీ–5తో తనకున్న పరిచయాలను వాడి తన కోడలు కొల్లి సౌమ్య పేరు మీద డీలర్షిప్ తీసుకొని అస లు వాస్తవాలను దాస్తూ మీడియా ముందు మాత్రం సాంబశివరావు నంగనాచి కబుర్లు చెబుతున్నాడని శ్రీధర్‌రావు ధ్వజమెత్తారు. మాదాపూర్‌లోని పెట్రోల్ బంక్‌కు సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉంటే హెచ్‌పీసీఎల్ ఎందుకు బంక్‌ను మూసి వేసిందని ప్రశ్నించారు? ఆయనకున్న పోలీసు, రాజకీయ పలుకుబడితో తనకు టుంబ సభ్యులు, వ్యాపారాల గురించి ప్రతికూల వార్తల ను ప్రచారం చేస్తూ పరుపు నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘సాక్షి’తో శ్రీధర్‌రావు చెప్పిన వివరాల ప్రకారం.. స్థలం అసలు కథ ఇదీ.. సరనాల శ్రీధర్ భార్య సంధ్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామంలో సర్వే నంబరు–64లోని హుడా టెక్నో ఎన్‌క్లేవ్‌లో సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో నార్త్ఈస్ట్ దిక్కున 1,200 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో 600 చ.మీ. స్థలాన్ని సంధ్య తన వ్యాపార అవసరాల కోసం ఇతరులకు విక్రయించింది. ఇంకా తన వద్ద 600 చ.మీ. స్థలం ఉంది. 2018లో కొందరు రియల్ ఎస్టేట్ మార్కెట్ మిత్రులతో కలిసి సాంబశివ రావు శ్రీధర్ రావును కలిశాడు. ‘మీది తెనాలే మాది తెనాలే’అంటూ మాట కలిపాడు. 600 చ.మీ. స్థలంలో పెట్రోల్ బంక్ పెడదామని సలహా ఇచ్చాడు. తనకు ఆయిల్ కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నాయని, పోలీసు, మున్సిపల్ అనుమతులన్నీ తానే చూసుకుంటానని నమ్మించాడు. 25:75 శాతం వాటాతో సాంబశివరావు, సంధ్య కన్స్ట్రక్షన్తో ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.3.15 లక్షలు అద్దె చెల్లించేలా 600 చదరపు మీటర్ల స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తూ హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్స్ట్రక్షన్కు రిజిస్టర్డ్ లీజు డీడ్ జరిగింది. పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. అంతా బాగానే నడుస్తున్న క్రమంలో.. పక్కనే ఉన్న మరో 600 చదరపు మీటర్ల స్థలంలో కూడా బంక్‌ను విస్తరిద్దామని సాంబశివరావు సూచించాడు. ఇక్కడే ఫోర్జరీ చేసింది.. దీంతో అప్పటికే ఆమ్మేసిన ఈ స్థలాన్ని 2020 జనవరిలో రూ.కోట్లు వెచ్చించి తిరిగి సంధ్య కన్స్ట్రక్షన్ కొనుగోలు చేసింది. అయితే విస్తరించే ఈ బంక్‌కు నెలకు చెల్లించే అద్దె కేవలం రూ.1.15 లక్షలు మాత్రమేనని తెలిసింది. దీంతో పునరాలోచనలో పడ్డారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలంలో పెట్రోల్ బంక్‌కు వచ్చే అద్దె రూ.1.15 లక్షలు అనే సరికి వెనక్కి తగ్గారు. కానీ, టీవీ–5 సాంబశివరావు హెచ్పీసీఎల్లో డీజీఎం స్థాయిలో తనకున్న పరిచయాలతో స్థలం యజమానికి తెలియకుండా ఈ రెండో భాగం 600 చదరపు మీటర్ల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చేశాడు. కానీ, మీడియా ముందు మాత్రం తొలుత హెచ్‌పీసీఎల్‌కు, సంధ్య కన్స్ట్రక్షన్కు మధ్య 600 చ.మీ. స్థలంలో జరిగిన పెట్రోల్ బంక్ డాక్యుమెంట్లను మాత్రమే చూపిస్తూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అందర్నీ మేనేజ్ చేసి..: జర్నలిస్ట్ కావడంతో తనకున్న రాజకీయ, పోలీసు పరిచయాలను టీవీ–5 సాంబశివరావు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. వాస్తవానికి ఈ పెట్రోల్‌బంక్ వి స్తరణ చేసిన 600 చదరపు మీటర్ల స్థలానికి యజమానికి, హెచ్‌పీసీఎల్‌కు మధ్య ఎలాంటి రిజిస్టర్డ్ లీజు డీడ్ జరగలే దు. హెచ్పీసీఎల్లో తనకున్న పరిచయాలతో స్థల యజమాని సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్‌ను సృష్టించాడు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించే స్థానికంగా పోలీసు, మున్సిపల్ అనుమతులను తీసుకున్నాడు. దిక్కులేక ఠాణా మెట్లెక్కి.. స్థల యజమానికి విషయం తెలియడంతో.. తన వాటా 75 శాతంపై సాంబశివరావును నిలదీశారు. రూ.30 లక్షలు ఇస్తే 75 శాతం వాటా డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొదలుపెడతానని మెలిక పెట్టడంతో చేసేదేం లేక చెక్ రూపంలో రూ.30 లక్షలు సాంబశివరావుకు చెల్లించారు. ఏళ్లు గడిచినా బంక్ డీలర్షిప్ తమ పేరు మీద బదలాయించకపోయే సరికి దిక్కు తోచని స్థితిలో ఈ ఏడాది జనవరి 31న స్థల యజమాని శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ఏం అంటోంది? ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టిన హెచ్‌పీసీఎల్.. పెట్రోల్ బంక్ విస్తరణ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఇంధన సంస్థే వెల్లడించింది. అందుకే విస్తరించిన 600 చదరపు మీటర్ల స్థలాన్ని పాక్షికంగా సీజ్ చేశామని, న్యాయబద్ధంగా ఒప్పందం చేస్తే నెలకు రూ.1.57 లక్షలు అద్దె చొప్పున 2020 నుంచి పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కారు కొట్టేసిన సాంబశివరావు సంధ్య కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లి. (గతంలో సంధ్య హోటల్స్ ప్రై.లి.) 2019 సెప్టెంబర్ 13న మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్ కరెంట్ ఖాతా నంబరు: 910020004191308 నుంచి 039927 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను తీసుకుంది. వరుణ్ మోటార్స్ ప్రై.లి. పేరు మీద మారుతీ స్విప్ట్ కారు కోనుగోలు చేసేందుకు ఈ డీడీను తీసుకుంది. అయితే యాజమాన్యం కోరిన మోడల్ కారు డెలివరీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో టీవీ–5 సాంబశివరావు ఎంటరయ్యాడు. తనకున్న పరిచయాలతో త్వరగా కారు డెలివరీ అయ్యేలా చేస్తానని నమ్మించి డీడీని తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఎలాంటి స్పందన లేదు. గట్టిగా ప్రశ్నిస్తే కొత్త అప్‌గ్రేడ్ మోడల్ వస్తోందని, పాత కారు ధరకే అప్‌గ్రేడ్ మోడల్ ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అతని మాయమాటలు నమ్మి కొంతకాలం వేచిచూశారు. అ యినా నెలలు గడుస్తున్నా కారు డెలివరీ మాత్రం కాలే దు. డీడీ కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో డీడీ ఇవ్వమని మరోసారి అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ, తనకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు బాగా తెలుసని బెదిరించడం మొదలుపెట్టాడు. తీరా అసలు విషయం ఏంటంటే.. ఆ డీడీని ఉపయోగించుకొని సాంబశివరావు తన వ్యక్తిగత అవసరాల కోసం కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈమేరకు మాదాపూర్ పోలీసు స్టేషన్లో బాధితుడు శ్రీధర్ రావు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. డీడీ, బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలను పోలీసులకు అందజేశారు. -
నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు బురిడీ కొట్టించాలనుకున్న టీవీ–5 సాంబశివరావుకు బుర్ర తిరిగిపోయే ఎదురుదెబ్బ తగలింది. పచ్చ మీడియాలో ఒకటైన టీవీ–5లో సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా భూ యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆయ న నడిపిస్తున్న పెట్రోల్ బంక్‌ను హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు బుధవారం సీజ్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో ప్లాట్‌ను అగ్రిమెంట్ చేసుకొని, దాన్ని హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చాడని ప్లాట్ యజమాని సరనాల శ్రీధర్‌రావు హెచ్‌పీసీఎల్‌కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ చేసిన స్థలానికి బుధవారం కంచె వేయడంతో పాటు పెట్రోల్ బంక్‌ను పాక్షికంగా సీజ్ చేశారు. ఆ స్థలంలో ఉన్న పెట్రోల్ పంపులను మూసి వేశారు. ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలున్నాయని నమ్మించి.. సాంబశివరావుపై ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సరనాల శ్రీధర్ భార్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామం, సర్వే నంబరు–64, హుడా టెక్నో ఎన్క్లేవ్, సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో 600 చదరపు మీటర్ల (717.60 చదరపు గజాలు) స్థలం ఉంది. 2018లో సాంబశివరావు వీరిని కలిసి, తనకు ఆయిల్ సంస్థలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్షిప్ ఇప్పిస్తామని నమ్మించాడు. ప్లాట్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూ యజమానులకు తెలియకుండా పెట్రోల్ బంక్ డీలర్‌షిప్‌ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు సాంబశివరావు బదలాయించాడు. జర్నలిస్టులు, పోలీసుల పేరుతో భయపెట్టి.. తన స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్‌ను నడుపుతున్నట్లు తెలుసుకున్న శ్రీధర్‌రావు షాక్‌కు గురయ్యారు. 2021లో దీనిపై సాంబశివరావును నిలదీశారు. దీంతో సాంబశివరావు ఎదురుదాడికి దిగాడు. హెచ్పీసీఎల్తో డీలర్షిప్ అగ్రిమెంట్‌కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన శ్రీధర్‌రావు ఆ డీలర్‌షిప్‌ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరారు. లక్షల్లో వసూలు చేసి డీలర్షిప్ బదలాయించకుండా.. అయితే కొంత నగదు చెల్లిస్తేనే డీలర్‌షిప్‌ను బదలాయిస్తానని సాంబశివరావు చెప్పాడు. వేరే దారిలేక 2021, మార్చిలో రూ.లక్షల్లో నగదు బదలాయించామని శ్రీధర్‌రావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ డీలర్‌షిప్‌ను బదలాయించకపోవడంతో ఈ ఏడాది జనవరి 31న శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ప్రతినిధులకు సైతం శ్రీధర్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్‌పీసీఎల్ అధికారులు సాంబశివరావు నడుపుతున్న పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. చీటింగ్ కేసును నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
100 పెట్రోల్ బంకుల ఏర్పాటులో ఐపీఎం
గువాహటి: ఇంధన రిటైల్ స్టార్టప్ సంస్థ ఇండో పెట్రోలియం మార్కెటింగ్ (ఐపీఎం) తొలి దశలో 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుంది. అస్సాంతో మొదలుపెట్టి వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్ ప్రకాశ్ శర్మ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అయిదు రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని, మొదటిది జోర్హాట్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఔట్లెట్ల ఏర్పాటుకు అనువైన స్థల సమీకరణలో తోడ్పాటు అందించాల్సిందిగా జిల్లాల యంత్రాంగాలకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు శర్మ వివరించారు. ప్రభుత్వ రంగ రిఫైనర్ల నుంచి కొనుగోలు చేయడం లేదా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధనాలను సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ నుమాలిగఢ్ రిఫైనరీస్‌తో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో అస్సాం, నార్త్ పశి్చమ బెంగాల్లో 25 ఔట్లెట్స్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కో బంకులో దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగలదన్నారు. తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు వీలున్న ప్రాంతాల్లో సీఎన్జీ, బయోఇంధనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు. అన్ని బంకుల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయని శర్మ చెప్పారు. -
Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్‌పై పుకార్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లు బంద్ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్‌లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్‌ల యాజమాన్యం స్పష్టం చేశారు. ఇక.. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
పెట్రోల్ బంకుల్లో ఈ సేవలుండాల్సిందే..! లేదంటే..
కరీంనగర్: 'కరీంనగర్‌కు చెందిన శ్రీధర్ కమాన్‌కు సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్ పోసుకుని, బైక్ టైర్లో గాలి నింపాలని అక్కడి సిబ్బందిని కోరగా.. ఇక్కడ అలాంటివేమీ ఉండవని, గాలి పంపు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. చాలాబంకుల్లో గాలి నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఉన్నాయి. గాలే కాదు.. చాలా బంకుల్లో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కానరావడం లేదు.' పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలకు అనుచితంగా వ్యవహరిస్తున్నారా అయితే ఇది మీ కోసమే. బంకుల్లో టైర్లలో గాలి, తాగునీరు, మూత్రశాలలు, ఫోన్ సౌకర్యం తదితర సేవలు ఉచితం. వీటిపై అవగాహన లేకపోవడంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే అదనపు వ్యయం భారంగా మారుతోంది. చిల్లరే కదా అనుకుంటే నెలకు రూ.కోట్లలోనే సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. మనం చెల్లించే డబ్బులే.. డీజిల్ అయినా పెట్రోలైనా లీటరుపై మనం పెట్రోలు బంక్‌కు 4 నుంచి 6 పైసలు కేవలం మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కోసం చెల్లిస్తున్నాం. ప్రతీ బంకులో టాయిలెట్, మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి. ఇలా అందిస్తేనే పెట్రోల్ బంకు నిర్వహణకు అనుమతి దొరుకుతుంది. చాలామంది ప్రయాణంలో ఉన్నవారు టాయిలెట్ అర్జంట్ అయినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ కోసమో.. నిర్మానుష్య ప్రదేశాల కోసమో వెతుకుతారు. కానీ పెట్రోల్ బంకుకు వెళ్లరు. ఇక మీద ఎమర్జెన్సీ టైంలో దర్జాగా బంక్‌లకు వెళ్లండి. అది మన హక్కు. సగటున ఒక బంకులో రోజుకు 10 వేల లీటర్ల చమురు అమ్మితే.. టాయిలెట్ మెయింటనెన్స్ కాస్ట్ కింద ఆ బంకుకు వచ్చే ఆదాయం రోజుకు రూ.600 అంటే నెలకు రూ.18వేలు. జిల్లాలో ఉన్న అన్ని బంకుల్లో కలిపి వాహనదారులు రోజువారీగా చెల్లిస్తున్న మొత్తం రూ.14లక్షలకు పైనే. ఈ డబ్బుతో టాయిలెట్, మంచినీరు అందించాల్సిన బాధ్యత ఆయా బంక్‌లదే. పెట్రోల్ పంపుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందుకోసం ఆర్వోయంత్రం, వాటర్ కూలర్, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాలి. ఏ బంకుల్లోనైనా తాగునీటి వసతి లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛభారత్‌లో భాగంగా అన్ని పెట్రోలు, డీజిల్ బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో చరవాణి వినియోగించుకునే సదుపాయం పంపుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పనిలేదు. ఏదైనా పెట్రోలు పంపును సందర్శించడం ద్వారా మీరు ఏ నంబర్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. వాహన టైర్లలో గాలి నింపడానికి, గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాలి. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఇటీవల గాలికి ప్రత్యామ్నాయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ప్రతి బంకులో ఫిర్యాదు పెటె్ట్ లేదా రిజిష్టరు అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయొ చ్చు. ప్రఽథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతీ బంకు వద్ద ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. చమురు నాణ్యత, ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోలు, డీజిల్ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునేందుకు ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటి ద్వారా నాణ్యతను పరీక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. పెట్రోలు బంకుల్లో సంస్థ పేరు, యజమాని పేరు, సంప్రదింపుల నంబర్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. పంపు యజమాని వాటిని ప్రజలకు కనిపించే విధంగా బంకుల ఎదుట ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకుల్లో బంకులు తెరిచే, మూసివేసే వేళలు తప్పనిసరిగా రాసి ఉంచాలి. పెట్రోలు, డీజిల్ తీసుకున్న తరువాత వినియోగదారులు వాటికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా పొందాలి. ఇలా ఫిర్యాదు చేయండి పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు అందించాల్సిన సౌకర్యాలను నిర్వాహకులు విస్మరిస్తే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్‌ను సంప్రదించడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. బంకులో కచ్చితంగా ఉండాల్సిన ఫిర్యాదు రిజిష్టరులో లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. లేదంటే సంబంధిత చమురు సంస్థ సేల్స్ మేనేజర్ పేరు, చరవాణి నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ అందుబాటులో లేనట్లైతే సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. -
పెట్రోల్ బంక్ ల వద్ద ఇంకా రద్దీ పరిస్థితే
-
పెట్రోల్ బంక్‌ల ముందు భారీ క్యూలైన్లు.. రెండో రోజు కొనసాగుతున్న రద్దీ
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు కూడా ప్రెటోల్ బంక్‌ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒకసారిగా వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో యథావిధిగా బంకుల వద్ద పెట్రోల్ సరఫరా కొనసాగుతుంది. హైదరాబాద్ పలు పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని ముందు జాగ్రత్త చర్యగా బుధవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకుంటున్నారు. బంక్‌లు ఇంకా ఓపెన్ కాకముందే వాహనాలను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో ఉంచారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి -
HYD Traffic Jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న హైదరాబాద్ నగరం
హైదరాబాద్, సాక్షి: ట్రాఫిక్ పద్మవ్యూహంలో హైదరాబాద్ అనే మహా నగరం చిక్కుకుంది. పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూల నేపథ్యంలో నేపథ్యంలో.. ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు. మంగళవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాహనాల రద్దీ నెలకొంది. పెట్రో స్టాక్‌లు నిండుకుంటాయనే ప్రచారాల నేపథ్యంలో.. ట్యాంక్ ఫుల్ చేసుకునేందుకు వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. మరికొందరు క్యాన్లతో బంక్‌ల వద్ద క్యూలలో నిల్చున్నారు. దీంతో బంక్‌ల వద్ద మీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్‌పై ప్రభావం పడింది. దీంతో దాడులు జరగవచ్చనే ఆందోళనతో బంక్ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అంతకు ముందు ఉదయం ఆయిల్ ట్యాంకర్లు రాకపోవడంతో బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్,డీజిల్ దొరకదనే ఆందోళనతో వాహనదారులు బంకుల వైపు పరుగులు తీశారు. తీరా సాయంత్రం కల్లా ఆయిల్ ట్యాంకర్ల రాకతో కాస్త ఉపశనమం లభించింది. అయితే మళ్లీ పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన నడుమ వాహనదారులు బంకుల వైపు వెళ్తున్నారు. వాహనాల రద్దీతో కిలోమీటర్ దూరానికే గంటల కొద్దీ సమయం పడుతోంది. లక్డీకాపూల్‌తో పాటు గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ నెలకొంది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. Ye kya huwa 😂🤣#PetrolDieselPrice #petrolpump #Hyderabad #Petrol #Whatsapp #TruckDriversProtest #ViralVideos #petrolpump pic.twitter.com/sr22sefUjd — Nitin yadav (@Nitinyada7) January 2, 2024 #TruckDriversProtest: Long queues at petrol pumps, with most fuel stations running dry in #Hyderabad. This video from the Assembly metro station petrol pump. pic.twitter.com/sNfoHfRiWI — Iqbal Hussain⭐ اقبال حسین (@iqbalbroadcast) January 2, 2024 Avoid #Ikea #Raidurgam #hitechcity #inorbit #cyberabad Complete chaos, full of traffic wit horn all around.. pls pls don't come out and don't be traffic 🙏🙏@HiHyderabad @3rdEyeDude @Team_Road_Squad @vinay_vangala @KTRBRS @swachhhyd #hyderabad #Telangana #PetrolDieselPrice pic.twitter.com/QVXJjOsATk — TGCitizen (@Citizen_TS) January 2, 2024 -
‘తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదు’
భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ‘హిట్ అండ్ రన్’ నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇంధన ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు కూడా ఇంధన సరఫరా నిలిచిపోయింది. బంకుల ముందు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెపై తెలంగాణ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ స్పందించారు. తెలంగాణలో ఆయిల్ ల్యాంకర్ల సమ్మెలేదని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుతో డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేశారని తెలిపారు. ట్యాంకర్ డ్రైవర్స్ ఆకస్మిక సమ్మెలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. డ్రైవర్లు వాహనాలు నిలిపివేయడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు విధి విధానాలు ఏంటనేది స్పష్టతగా తెలియాల్సి ఉందని చ ఎప్పారు. అందువల్ల వాహనదారులను డ్రైవర్ అసోసియేషన్ ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. చట్ట సవరణ బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుందామన్నారు. కాగా ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను తీసుకొచ్చింది. త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు పెట్టింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అదే విధంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది దీనిపై ట్రక్కు డ్రైవర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు రోజులపాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు, పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లు, హింసాత్మక ఘటనలు, లాఠీఛార్జీలకు దారితీశాయి. పెద్దసంఖ్యలో ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
నాగోలు: ఎల్బీనగర్లోని చింతల్‌కుంటలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ముందున్న కారుతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డుపై ఉన్న నలుగురు వ్యక్తులను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి దుర్మరణం చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకీ నందన్ అనే వ్యక్తి తన బీఎండబ్లూ కారులో దిల్సుఖ్నగర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్నాడు. ఎల్బీనగర్ చింతల్‌కుంట వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యాగనార్ కారు ఢీకొట్టాడు. అక్కడే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని.. రోడ్డు పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మల్లేష్ (50)తో పాటు నగరానికి చెందిన పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతమ్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతంరెడ్డిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలియగానే ఎల్బీనగర్ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై ఓవర్ స్పీడ్‌కు సంబంధించి ఇప్పటికే చాలా చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతుర్ని చూసేందుకు వచ్చి.. చింతలకుంటలో ఉన్న కూతుర్ని చూసేందుకు మల్లేష్ నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి వచ్చి బస్సు దిగాడు. సరస్వతీనగర్‌లోని తన కూతురి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుని ఉండగా..ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మల్లేష్ కుమారుడు వినయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెట్రోల్ బంకుల వద్ద క్యూ.. ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు
బారెడు బారెడు ‘క్యూ’లు అంటే భయం లేనిది ఎవరికి?ఎందుకంటే బోలెడు టైమ్ వృథా అవుతుంది. అసహనం పెట్రోల్ ధరలా పెరుగుతుంది. ఫ్యూయల్ స్టేషన్ల దగ్గర పెద్ద పెద్ద ‘క్యూ’లను చూసిన, వాహనదారుల అసహనాన్ని విన్న అనుభవంతో వైభవ్ కౌశిక్ తన స్నేహితులు ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి స్టార్ట్ చేసిన ‘నవ్గతీ’ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం గ్రేటర్ నోయిడాకు చెందిన వైభవ్ కౌశిక్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్యాబ్ ఒక ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగింది. అక్కడ పెద్ద క్యూ ఉంది. చాలా టైమ్ తరువాత బండి రోడ్డు పైకి వచ్చింది.‘ఇలా అయితే కష్టం కదా’ అని డ్రైవర్‌తో మాటలు కలిపాడు వైభవ్.‘ఎప్పుడూ ఇదే కష్టం. టైమ్ వృథా అవుతుంది. బేరాలు పోతున్నాయి’ అసంతృప్తిగా అన్నాడు డ్రైవర్. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు వైభవ్. కొద్దిసేపటి తరువాత అతనిలో ఒక ఐడియా మెరిసింది. అదే నవ్గతీ. తన కాలేజీ ఫ్రెండ్స్ ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి వైభవ్ కౌశిక్ స్టార్ట్ చేసిన నవ్గతీ (మార్గదర్శనం) స్టార్టప్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇంధన స్టేషన్ల దగ్గర రద్దీ వల్ల వాహనదారుల టైమ్ వృథా కాకుండా, ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వన్–స్టాప్ ఫ్యూయల్ అగ్రిగేటర్ ΄ప్లాట్‌ఫామ్ రియల్–టైమ్ అప్డేట్స్ను అందిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం దిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్‌స్టేషన్‌లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. డాటా–బ్యాక్డ్ ప్లాట్‌ఫామ్ ఆవెగ్, ఫ్యూయలింగ్ యాప్ అనే రెండు సర్వీసులను ఆఫర్ చేస్తోంది నవ్గతీ. బీ2సీ ఫ్యూయల్ డిస్కవరీ యాప్ ఫ్యూయల్ రేటు, అందుబాటు, సర్వ్ టైమ్...మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. ఫ్యూయల్ స్టేషన్‌కు సంబంధించి రివ్యూకు అవకాశం కల్పిస్తుంది. ఇక ‘ఆవేగ్’ ద్వారా ఫ్యూయల్ స్టేషన్లకు సంబంధించి రవాణా సమయం, వెయిటింగ్ టైమ్, సర్వింగ్ టైమ్, వనరుల వినియోగం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా... సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూయల్ స్టేషన్లు తమ సర్వీసులను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. ‘గతంలో ఫ్యూయల్ స్టేషన్లు కాంప్లయెన్స్ డిటైల్స్, లావాదేవీలు, అటెండెన్స్... వాటికి సంబంధించి డే–టు–డే డాటాను మాన్యువల్‌గా రికార్డ్ చేసేవి. ఇప్పుడు మాత్రం ‘ఆవేగ్’ రూపంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని యాక్టివిటీలను ఆటోమేట్ చేయవచ్చు. దీనివల్ల ఫ్యూయల్ స్టేషన్లు తమ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవచ్చు’ అంటున్నాడు వైభవ్ కౌశిక్. ఇంద్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్–దిల్లీ, మహానగర్ గ్యాస్ లిమిటెడ్–ముంబైకి సంబంధించిన 150 ఫ్యూయల్ స్టేషన్లలో ఈ స్టార్టప్ తమ ఎడ్జ్ కంట్రోలర్లను ఇన్స్టాల్ చేసింది. దేశంలోని పెద్ద పట్ణణాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంది.మొదట్లో సూపర్ యూజర్లతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. కొత్త ఫీచర్లను పరీక్షించడానికి, మెరుగు పరచడానికి ఈ గ్రూప్ బీటా టెస్టింగ్ గ్రూప్‌గా ఉపయోగపడింది. ఏకాంత ఆలోచనల్లో నుంచే కాదు చూసే సమస్యల్లో నుంచి కూడా స్టార్టప్ ఐడియాలు పుడతాయని, గట్టి కృషి చేస్తే సార్టప్ కలలు సాకారం అవుతాయని చెప్పడానికి ‘నవ్గతీ’ స్టార్టప్ ఒక ఉదాహరణ. View this post on Instagram A post shared by Vaibhav Kaushik (@_vaibhavkaushik) తెలియక పోయినా పట్టుదలతో... ఇరవై సంవత్సరాల వయసులో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. స్టార్టప్ ప్రపంచం ముఖ్యంగా ఫ్యూయల్–టెక్ గురించి పెద్దగా తెలియకపోయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. వెనక్కి తగ్గలేదు. ఆసక్తి, పట్టుదలతో నేర్చుకున్నాం. సవాలుకు సక్సెస్‌తోనే జవాబు ఇవ్వాలనుకున్నాం. ‘ఐడియా బాగానే ఉందిగానీ వర్కవుట్ అవుతుందా?’ అని సందేహించిన వారికి కూడా మా సక్సెస్‌తో సమాధానం చెప్పాం. – వైభవ్ కౌశిక్, కో–ఫౌండర్, సీయివో నవ్గతీ స్టార్టప్ -
సామాన్యుడిలా వచ్చిన నాగ చైతన్య.. ఏం చేశాడంటే?
అక్కినేని హీరో నాగ చైతన్య కస్టడీ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ యంగ్ హీరో. (ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్) లవ్ స్టోరీ తర్వాత మళ్లీ చై, సాయి పల్లవి కలిసి తెరపై కనిపించనున్నారు. ఈ సూపర్ హిట్ జోడీ తెరపై మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంతో పాటు మరోవైపు ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న హారర్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. అయితే తాజాగా నాగ చైతన్య హైదరాబాద్‌లో సందడి చేశారు. ఓ పెట్రోల్ బంక్‌లో తన ఖరీదైన ఫెరారీ కారులో దర్శనమిచ్చారు. ఓ సామాన్యుడిలా వచ్చి పెట్రోల్ బంక్‌లో కనిపించారు. అయితే నాగ చైతన్య వచ్చిన కారుపై అందరి దృష్టి పడింది. చైతూ వచ్చిన రెడ్ కలర్ ఫెరారీ కారు దాదాపు రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నాగ చైతన్య ఫ్యాన్స్ సైతం సూపర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో అవుతోన్న కాబోయే కోడలు!) View this post on Instagram A post shared by anush7697 (@anush7697) -
పేలిన పెట్రోల్ బంక్.. ఎగసిపడిన మంటలు
సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు. అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కూడా బ్లాస్టయింది. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. -
మరో 8 ‘సివిల్’ బంకులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో 8 రిటైల్ పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ఇటీవలే 9 పెట్రోల్ బంకుల నిర్వహణకు ఆమోదం లభించడంతో మొత్తంగా 17 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లయింది. ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. దీంతో జిల్లాల్లో అనువైన స్థలాలను గుర్తించి ఆయా ఆయిల్ కంపెనీలకు బంకులు కేటాయించేందుకు సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలివిడతలో 9 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ మేరకు పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. ఇక రెండో విడతలో వరంగల్, వనపర్తి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్ తెలిపారు. వీలైనంత త్వరగా వినియోగదారులకు సేవలు అందుబాటులోకి తేవాలని ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలకు సూచించినట్లు చెప్పారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ జీహెచ్ఎంసీ పరిధిలో 3 పెట్రోల్ రిటైల్ బంకులను విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్త బంకులు ఏర్పాటైతే వాటి సంఖ్య 20కి చేరనుంది. -
పెట్రోల్ బంకులకు తాకిడి
హైదరాబాద్: పెట్రోల్ బంకులకు రూ.2 వేల నోట్ల తాకిడి పెరిగింది. బంకుల్లో నోట్లు వినియోగానికి వెసులుబాటు ఉండటంతో వాహనదారులు ఇంధనం పేరిట నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. బంకుకు వచ్చే వాహనదారుల్లో సగానికి పైగా రూ. 2 వేల నోటు ఇస్తుండటంతో పెట్రోల్ బంకుల డీలర్లకు చిల్లర సమస్యగా తయారైంది. దీంతో కనీసం రూ.1000 ఇంధనం వాహనంలో పోయించుకుంటే తప్ప రూ. 2వేల నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొన్ని బంకుల్లో మాత్రం నోటుకు చిల్లర యూపీఐ, బీమ్, పేటీఎం ద్వారా చెల్లిస్తున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకులు మాత్రం రూ.2వేల పైనే విలువగల ఇంధనం పోయిస్తేనే రూ, 2 వేల నోట్టు తీసుకుంటామని ఏకంగా బోర్డులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లు పూర్తిగా రద్దు చేయడంతో వాటిని మార్చుకోవడానికి నగరవాసులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో సెప్టెంబర్ 30 వరకు మార్చు కోవడానికి అవకాశం ఉండటంతో అక్కడ రద్దీ పెరిగింది. దీంతో పెట్రోల్ బంకులు, జ్యువెలరీ షాపుల్లో మార్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగిన అమ్మకాలు.. మహానగర పరిధిలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 560 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా ప్రతిరోజు సగటున 50 లక్షల లీటర్ల పైబడి డీజిల్, పెట్రోల్ డీజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతి రోజు పెట్రోల్ బంకులకు 170 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్లో సగటున 12 నుంచి 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. గత మూడు రోజులుగా సుమారు 20 నుంచి 30 శాతం అమ్మకాలు ఎగబాగడంతో సరఫరాకు మరింత డిమాండ్ పెరిగింది. జ్యువెలరీ షాపులకు పరుగులు.. జ్యువెలరీ షాపులకు రూ. 2వేల నగదు తాకిడి అధికమైంది. గతంలో బంగారం ఇతరత్రా ఆభరణాల కొనుగోళ్లలో రూ.2వేల నోటు వాడకం 2 శాతమే ఉండేది. ప్రస్తుతం 60 నుంచి 80 శాతం పెరిగినట్లు ఓ జ్యువెలరీ షాపు యజమాని తెలిపారు. -
ఆర్బీఐ దెబ్బకు పెట్రోల్ బంకులపై పడిన జనం.. భారీగా తగ్గిన డిజిటల్ పేమెంట్స్
న్యూఢిల్లీ: రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పెట్రోల్ బంకు డీలర్లు వెల్లడించారు. దీనితో తమ దగ్గర నగదు కొరత ఏర్పడుతోందని, తక్కువ విలువ చేసే నోట్లను తగినంతగా తమకు లభించేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్‌ను కోరుతున్నామని వివరించారు. ‘రూ. 2,000 ఉపసంహరణకు ముందు నగదు అమ్మకాల్లో ఈ నోట్ల వాటా 10 శాతమే ఉండేది. కానీ ఇప్పుడు మాకొచ్చే నగదులో 90 శాతం అవే ఉంటున్నాయి. చిన్న కొనుగోళ్లకు కూడా రూ. 2,000 నోట్లు ఇచ్చి మార్చుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా మా దగ్గర నగదు కొరత సమస్య ఏర్పడుతోంది. దీంతో కార్డులు లేదా డిజిటల్ పేమెంట్ విధానాలు వాడాలంటూ అడగాల్సి వస్తోంది. కస్టమర్లకు సజావుగా సేవలు అందించడం కోసం పెట్రోల్ బంకులకు రూ. 2,000 నోట్లకు ప్రతిగా తక్కువ విలువ నోట్లను సమకూర్చాలని బ్యాంకులకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆర్బీఐని కోరుతున్నాం‘ అని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2016లోలాగే మళ్లీ తిప్పలు.. మళ్లీ తమకు 2016 నవంబర్ 8 డీమానిటైజేషన్ నాటి సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని బన్సల్ తెలిపారు. ప్రభుత్వం వెసులుబాటునివ్వడంతో అప్పట్లో పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ ఇలాగే అంతా వచ్చి వాటిని బంకుల్లో మార్చుకునేవారని, తీరా చూస్తే తమ తప్పేమీ లేకున్నా ఆదాయపు పన్ను శాఖ నుంచి తమకు నోటీసులు వచ్చేవని పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపిస్తోందన్నారు. ‘మా రోజువారీ అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపుల వాటా 40 శాతంగా ఉండేది. కానీ అకస్మాత్తుగా అది 10 శాతానికి పడిపోయి నగదు లావాదేవీలు పెరిగిపోయాయి. కస్టమర్లు ఎలాగోలా రూ. 2,000 నోట్లను వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని మేము రోజువారీగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మళ్లీ ఇన్‌కం ట్యాక్స్ అధికారుల నుంచి మాకు సమస్యలు సృష్టించేలా ఉంది‘ అని బన్సల్ పేర్కొన్నారు. 2016లో మెజారిటీ నోట్లను రద్దు చేసినా, పెట్రోల్ బంకుల్లాంటి కొన్ని చోట్ల కాస్త మినహాయింపులు ఉండేవి. దీంతో నల్లధనం మార్పిడికి అవి వేదికలుగా మారుతున్నాయని ఆ సదుపాయాన్ని ప్రభుత్వం తొలగించింది.