![Akkineni Hero Naga Chaitanya Appears At Petrol Bunk In Car Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/30/naga.jpg.webp?itok=bJKELMM6)
అక్కినేని హీరో నాగ చైతన్య కస్టడీ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ యంగ్ హీరో.
(ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్)
లవ్ స్టోరీ తర్వాత మళ్లీ చై, సాయి పల్లవి కలిసి తెరపై కనిపించనున్నారు. ఈ సూపర్ హిట్ జోడీ తెరపై మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంతో పాటు మరోవైపు ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న హారర్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు.
అయితే తాజాగా నాగ చైతన్య హైదరాబాద్‌లో సందడి చేశారు. ఓ పెట్రోల్ బంక్‌లో తన ఖరీదైన ఫెరారీ కారులో దర్శనమిచ్చారు. ఓ సామాన్యుడిలా వచ్చి పెట్రోల్ బంక్‌లో కనిపించారు. అయితే నాగ చైతన్య వచ్చిన కారుపై అందరి దృష్టి పడింది. చైతూ వచ్చిన రెడ్ కలర్ ఫెరారీ కారు దాదాపు రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నాగ చైతన్య ఫ్యాన్స్ సైతం సూపర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో అవుతోన్న కాబోయే కోడలు!)
Comments
Please login to add a commentAdd a comment