luxury car
-
ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నట్టుండి లగ్జరీ కార్లలో షికార్లు చేయడం మొదలు పెట్టాడు. దాదాపు 22 కోట్ల స్కామ్‌కు పాల్పడి, లగ్జరీ ఫ్లాట్, విలువైన ఆభరణాలు కొనుగోలు చేశాడు. అదీ తన ప్రేయసికోసం. ఏంటా అని ఆరాతీస్తే, ఆరు నెలల పాటు కొనసాగిన ఇతగాడి బండారం బయట పడింది. నెట్టింట హల్చల్ చేస్తున్న స్టోరీ వివరాలు..మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13వేల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసేవాడు హర్ష్ కుమార్ క్షీరసాగర్. లగ్జరీ లైఫ్‌పై మోజు పెంచుకున్న కుమార్ అడ్డదారి వెతుక్కున్నాడు. యశోదా శెట్టి అనే మహిళా ఉద్యోగితో చేతులు కలిపి దాదాపు రూ. 21 కోట్ల 59 లక్షల 38 వేలు కొట్టేశాడు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఖాతా తెరిచారు. తరువాత ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారీ కుంభకోణానికి తెర తీశారు. ఇలా వచ్చిన డబ్బులతో హర్ష్ కుమార్ తన ప్రియురాలికి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఏకంగా 4 బీహెచ్‌కే ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేనా..తగ్గేదేలే అంటూ బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్, ఖరీదైన డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేశాడు. దాదాపు ఆరు నెలల తరువాత వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హర్ష్‌కుమార్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది. ఈ డబ్బులను తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించు కున్నారని పోలీసులు గుర్తించారు.మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ.35 లక్షల విలువైన ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ అనిల్ క్షీరసాగర్ ఎస్‌యూవీతో పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?! -
ఎంజీ తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ‘సైబర్‌స్టర్’ వస్తోంది
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఆల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కన్వర్టబుల్ సైబర్‌స్టర్ మోడల్‌ను 2025 జనవరి–మార్చి మధ్య భారత్‌లో ప్రవేశపెడుతోంది. ధర రూ.65–70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.ఎంజీ సెలెక్ట్ ఔట్లెట్లలో విక్రయానికి రానున్న తొలి మోడల్ ఇదేనని కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు. వచ్చే రెండేళ్లలో నాలుగు ఎలక్ట్రిక్ మోడళ్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. సైబర్స్టర్తోపాటు మరో మోడల్ సైతం మార్చిలోగా అడుగుపెట్టనుందని గుప్తా వెల్లడించారు.భారత్‌లో లగ్జరీ కార్ల విభాగం గత నాలుగేళ్లలో మాస్ సెగ్మెంట్ కార్ల కంటే రెండింతలై దాదాపు 25 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. కంపెనీ పట్ల సానుకూల ప్రభావంతోపాటు సైబర్‌స్టర్ మొత్తం ఈవీలు, బ్రాండ్‌కు మరింత ఆకర్షణను జోడిస్తుందని అన్నారు. ఇది బ్రాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు అదనపు గుర్తింపును ఇస్తుందని వివరించారు. -
కంటైనర్‌లో వచ్చి.. పోలీసులనే ఏమార్చి..
సేలం: కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో శుక్రవారం వేకువజామున ఒకే సమయంలో మూడు ఏటీఎంలలో చోరీలకు పాల్పడి తప్పించుకు వెళ్తున్న దొంగల ముఠా కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు వేట మొదలెట్టారు. ఏటీఎం చోరీల్లో ఆరితేరిన హైటెక్ హర్యానా దొంగలు లగ్జరీ కారు సహా కంటైనర్ లారీలో తప్పించుకెళ్తుండడాన్ని గుర్తించిన నామక్కల్ పోలీసులు సినీ తరహాలో ఛేజింగ్ చేశారు. వారిని పట్టుకునే క్రమంలో పెద్ద ఫైట్ తప్పలేదు. ఏటీఎం దొంగల దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు. దీంతో నామక్కల్ పోలీసులు తుపాకీకి పనిపెట్టారు. ఇందులో ఓ దొంగ హతమయ్యాడు. మరొకడు ఆస్పత్రి పాలు కాగా, మరో ఐదుగురు పోలీసులకు చిక్కారు. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో వేకువ జామున ఒకే సమయంలో ఒకే ముఠా మూడు ఏటీఎంలలో చోరీకి పాల్పడింది. 2.30 నుంచి నాలుగు గంటల మధ్య ఈ చోరీలు జరిగాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎంలను బద్దలు కొట్టి అందులోని నగదును ఈ ముఠా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఓ ఏటీఎంలో మోగిన అలారంతో పోలీసులు అలర్ట్ అయ్యా రు. లగ్జరీ కారులో వచ్చి చోరీకి పాల్పడి తప్పించుకు వెళ్తున్న వారి కోసం వేట మొదలెట్టారు. అయితే, హఠాత్తుగా వీరు జాతీయ రహదారిలోకి వెళ్లగానే కనిపించకుండాపోయారు. కంటైనర్‌లో లగ్జరీ కారు తమ రాష్ట్ర సరిహద్దులలోని చెక్ పోస్టులను త్రిస్సూ ర్ పోలీసులు అలర్ట్ చేశారు. అయితే, ఆ లగ్జరీ కారు కనిపించలేదు. మూడు ఏటీఎంలో రూ.65 లక్షల మేరకు నగదును ఈ ముఠా అపహరించుకెళ్లడంతో కేసును త్రిస్సూర్ నగర పోలీసు కమిషనర్ ఇలంగో సవాలుగా తీసుకున్నారు. త్రిస్సూర్ మీదుగా తమిళనాడులోని కోయంబత్తూరుకు, ఇక్కడి నుంచి కర్ణాటక వైపు వెళ్లే మార్గాలను పరిగణించారు. దీంతో తనతో పాటు ఐపీఎస్ బ్యాచ్‌లో శిక్షణ పొంది తమిళనాడు సరిహద్దు జిల్లాలు, కర్ణాటక సరిహద్దు జిల్లాలో పనిచేస్తూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోయంబత్తూరు, నామక్కల్, ఈరోడ్, సేలం, కృష్ణగిరి మార్గాలలో ఉదయాన్నే రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీవ్ర వేటలో నిమగ్నమైంది. జాతీయ రహదారిలోకి త్రిస్సూర్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ కారు జాడ కాన రాలేదు. అదే సమయంలో గతంలో జరిగిన కేసులను పరిగణించిన పోలీసులు కంటైనర్ లారీలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర రహదారి మీదుగా ప్రవేశం జాతీయ రహదారిలో వెళ్తే తమను పోలీసులు పసిగట్టేస్తారని, రాష్ట్ర రహదారుల్లోని చిన్నచిన్న రోడ్లను అస్త్రంగా చేసుకుని ఈ ముఠా నామక్కల్‌లోకి ప్రవేశించింది. çకుమారపాళయం సమీపంలోని వేప్పడై ప్రాంతంలో తనిఖీల్లో ఉన్న పోలీసులను చూసి ఓ కంటైనర్ లారీ ఆగకుండా వెళ్లింది. ముందుగా, పక్కగా వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి ఆ కంటైనర్ దూసుకెళ్లడంతో అనుమానాలు నెలకొన్నా యి. తర్వాత సినీ కైమ్లాక్స్‌ను తలపించే విధంగా ఛేజింగ్ జరిగింది. నామక్కల్ ఎస్పీ రాజేష్ కన్నన్ నేతృత్వంలో పదుల సంఖ్యలో వాహనాలలో కంటైనర్ లారీని ఛేజ్ చేశారు. ఇందుకోసం నామక్కల్– సేలం రహదారిలోకి ఇతర వాహనాలు రాకుండా కాసేపు మూసివేశారు. సేలం జిల్లా సరిహద్దుల్లోకి ఆ కంటైనర్ లారీ ప్రవేశించే సమయంలో చుట్టుముట్టారు. కూలీలుగా వచ్చి లగ్జరీగా తిరుగుతూ పోలీసుల విచారణ మేరకు..కంటైనర్ లారీలో కొందరు, లగ్జరీ కారులో మరి కొందరు హర్యానా నుంచి త్రిస్సూర్‌కు చేరుకున్నారు. ఇక్కడ తమకు ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా ఎస్బీఐ ఏటీఎంలను గురిపెట్టారు. పథకం ప్రకారం ఒకే రోజు ఏటీఎంలలో అపహరించిన సొమ్ముతో కారులో పరారు కావడం, హైవే లేదా, తాము గూగుల్ మ్యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న రూట్లలో తమతో వచ్చిన కంటైనర్‌ను సమీపించారు. తక్షణం ఆ కారును కంటైనర్‌లోకి ఎక్కించేసి ఏమీ ఏరగనట్టుగా ఏదో భారీ లోడ్ వెళ్తున్నట్టుగా డ్రైవర్ ముందుకు దూసుకెళ్లారు. అయితే, కుమార పాళయం వద్ద పోలీసుల హడావుడి చూసి ఆందోళనతో డ్రైవర్ అతివేగంగా దూసుకెళ్లడం, పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ కంటైనర్‌పై దృష్టి పడింది. ఈ కంటైనర్ ఎస్కే లాజిస్టిక్స్ పేరిట ఉంది. హర్యానా నుంచి త్రిస్సూర్‌కు సరకుల లోడుతో వచ్చింది. అయితే, ఆ లారీ యజమాని సలీమ్ ఖాన్ పేర్కొంటూ తనకు 18 కంటైనర్లు ఉన్నాయని, వాటిని పలు సంస్థలకు అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. అయితే వారు ఎటువంటి పనులకు ఉపయోగిస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశాడు. మూడు రాష్ట్రాల పోలీసుల సకాలంలో సమాచారాన్ని బదిలీ చేసుకోవడంతో ఈ ఎటీఎం దొంగలు పట్టుబడ్డారు. వీరికి ఇతర కేసులతో సంబంధం ఉందా, అని విచారిస్తున్నారు. కేరళ త్రిస్సూర్ పోలీసులు సైతం నామక్కల్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు. కేరళ త్రిస్సూర్‌లో చోరీకి పాల్పడి, నామక్కల్, సేలం జిల్లా సరిహద్దుల వరకు జరిగిన ఈ ఛేజింగ్, ఎన్కౌంటర్లో ఓ దొంగ హతం, ఇద్దరు పోలీసుల అధికారులు గాయపడడం వంటి సినీ తరహా ఈ క్లైమాక్స్ తమిళనాట పెద్ద చర్చకే దారి తీసింది.కాల్పుల్లో ఒకరు హతం తమ కంటైనర్‌ను పోలీసులు చుట్టుముట్టేయడంతో లోపల ఉన్న దొంగలు అలర్ట్ అయ్యారు. లారీని తనిఖీ చేస్తున్న కుమారపాళయం ఇన్స్పెక్టర్ తవమణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ రంజిత్‌లపై ఆ దుండగులు దాడికి దిగారు. గడ్డపార, బస్తాలను మోయడానికి ఉపయోగించే పొడవైన కొక్కి తరహా ఆయుధాలతో దాడి చేశారు. ఆ ఇద్దరికి గాయాలు కావడంతో ఇతర అధికారులు తుపాకీకి పనిపెట్టారు. పోలీసుల కాల్పులలో ఒక దొంగ సంఘటన స్థలంలోనే హతమయ్యాడు. మరొకడు గాయపడ్డాడు. దీంతో మిగిలిన ఐదుగురు దొంగ లు లొంగిపోయారు. ఈ సమాచారం సేలం డీఐజీ ఈ ఎస్ ఉమ నేతృత్వంలో ఎస్పీలు, డీఎస్పీలు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో విచారించారు. కంటైనర్ లారీలో లగ్జరీ కారు, పెద్ద ఎత్తున నగదు ఉండడంతో సీజ్ చేశారు. గాయపడ్డ పోలీసులను డీఐజీ పరామర్శించారు. పోలీసు కాల్పుల లో మరణించిన దొంగ హర్యానా రాష్ట్రం పుల్వామాకు చెందిన జమీనుద్దీన్‌గా గుర్తించారు. గాయపడ్డ దొంగ అజార్ అలీగా తేల్చారు. పట్టుబడ్డ ఐదుగురిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వీరంతా పుల్వామా నుంచి వచ్చి ఏటీఎంలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్టు తేలింది. -
24 క్యారెట్స్ బంగారంతో ‘గోల్డ్ ఫింగర్’ బుల్లి కారు : ధర తక్కువే!
అగోరా మోడల్స్ అరుదైన బాండ్ సేకరణలలో ఒకటైన సూపర్ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కారు 1:8 ఆస్టన్ మార్టిన్ డీబీ5 మోడల్ మినీ కారు ఇది. మోడల్ ఇది. 1964 నాటి మూడో జేమ్స్‌బాండ్ చిత్రం గోల్డ్ ఫింగర్లో ఈ కారు కనిపించింది. ఈ మూవీలో సీన్ కానరీ సీక్రెట్ ఏజెంట్ 007గా నటించాడు. 24 క్యారెట్ బంగారం పూత కలిగిన మ్యూజియం క్వాలిటీతో బ్రిటన్‌కు చెందిన అగోరా మోడల్స్ కంపెనీ ఇలాంటి కేవలం ఏడు కార్లు మాత్రమే తయారు చేసింది. ఇయాన్ ప్రొడక్షన్స్ , ఆస్టన్ మార్టిన్ల సహకారంతో నిర్మించిన గోల్డ్ ఫింగర్ సినిమాకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా దీనిని గురువారం లండన్‌లోని బర్లింగ్టన్ ఆర్కేడ్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఎజెక్టర్ సీట్లు ,రివాల్వింగ్ నంబర్ ప్లేట్ ఉంటాయి. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు ధర సుమారు రూ.27 లక్షలు. -
అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ
నెలకు లక్ష రూపాయలు సంపాదించేవారు కూడా ఓ ఖరీదైన కారు కొనేస్తున్నారు. అయితే కోట్ల రూపాయల డబ్బు ఉన్నప్పటికీ లగ్జరీ కారు కొనుగోలు చేయని వారు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ అండ్ ఎండీ 'రాధికా గుప్తా'.రాధికా గుప్తా ఎందుకు లగ్జరీ కారును కొనుగోలు చేయలేదు అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. బోనస్ పొందిన ప్రతిసారీ.. లగ్జరీ కారును కొనొచ్చు. కానీ కారు అనేది విలువ తగ్గిపోయే ఆస్తి. ఒక కారును కొనుగోలు చేసి మళ్ళీ విక్రయించాలంటే సుమారు 30 శాతం నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి విలువ తగ్గిపోయే ఆస్తి మీద నేను పెట్టుబడి పెట్టను అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: రాత్రిని పగలుగా మార్చేయండిలా.. తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఎన్నో సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వివరించారు. 18 ఏళ్ల వయసులో కాలేజీ చదువు పూర్తయినప్పుడు.. చాలామంది మీ దగ్గర ఫ్యాన్సీ బ్యాగ్ లేదా అని అడిగారు. ఆ మాటలు నన్ను కొంత బాధించాయి. ఇప్పుడు కూడా ఎందుకు ఇన్నోవా ఉపయోగిస్తున్నావు? అని అడుగుతున్నారు. కానీ నా జీవితం.. నా ఇష్టం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేసారు. -
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ @ 4 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్‌లో కొత్త వాంటేజ్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్‌ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్‌లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించడానికి కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు. -
కోట్ల విలువైన కారును కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇటీవల సల్మాన్‌ఖాన్‌కు పక్కటెములకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.అయితే తాజాగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్ షేరా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 1995 నుంచి సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన షేరా కొత్త రేంజ్ రోవర్‌ను కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ.1.4 కోట్లుగా ఉంటుందని సమాచారం. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ కాగా.. సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పని చేయడమే కాకుండా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థను స్థాపించారు. View this post on Instagram A post shared by shera (@beingshera) -
భారత్‌లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో 'జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్' లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ. 97.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్‌తో కూడిన డైమండ్ గ్రిల్, స్పోర్టియర్ ఎయిర్ ఇన్లెట్లు, క్రోమ్ ఇన్సర్ట్ & బ్లాక్ సరౌండ్‌తో మ్యాట్ డార్క్ గ్రేలో పెయింట్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 269 హార్స్ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జెనరేటర్ కూడా పొందుతుంది. ఇది 20 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ. -
బర్త్ డే స్పెషల్.. ఖరీదైన కారుతో డబుల్ ఇస్మార్ట్ నటుడు!
కేజీఎఫ్ సినిమాతో దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బిగ్ బుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే జూలై 29న సంజయ్ దత్ 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీతారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్ డే రోజున అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో గుడ్ఛాడీ మూవీలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్‌తో జతకట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆగస్టు 9న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమాలో కనిపించనున్నారు. #WATCH | Sanjay Dutt Gifts Himself New Range Rover On His 65th Birthday#Bollywood #SanjayDutt @duttsanjay pic.twitter.com/vIhiFbkpV2— Free Press Journal (@fpjindia) July 29, 2024 -
ఫుల్ ఛార్జ్‌తో 560 కిమీ రేంజ్.. సరికొత్త ఎలక్ట్రిక్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ' లాంచ్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ' 250 ప్లస్ అనే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్, 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 7:15 గంటకు పడుతుంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.The wait is almost over! We are ready to introduce the new all-electric Mercedes-Benz EQA to India. Get ready for a new generation of electric luxury. #SwitchOnToStandOut#EQA #MercedesBenzIndia pic.twitter.com/50EqWDwKAA— Mercedes-Benz India (@MercedesBenzInd) July 8, 2024 -
అంబానీ మరో ఖరీదైన కారు.. వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వద్ద ఇప్పటికే ఖరీదైన అనేక అన్యదేశ్య కార్లు ఉన్నాయి. కాగా ఇటీవల మరో రోల్స్ రాయిస్ కారు వారు గ్యారేజిలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే ముకేశ్ అంబానీ గ్యారేజిలో ఎనిమిది రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీడియోలో కనిపించే రోల్స్ రాయిస్.. 9వ కారు అని తెలుస్తోంది. వీడియోలో మహీంద్రా స్కార్పియో, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ జీ63 ఏఎంజీ కార్లు కాన్వాయ్ ముందు భాగంలో ఉన్నాయి. ఆ తరువాత రోల్స్ రాయిస్ కారు రావడం గమనించవచ్చు.వీడియో రాత్రి సమయంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి కారు ఏ కలర్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బహుశా ఇది వైట్ కలర్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 10 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ముకేశ్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా ఇతర సూపర్ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. -
ఖరీదైన కారు కొన్న స్టార్ కపుల్.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ఒకరు. తాజాగా ఈ జంట అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. ఇటలీలో జరిగిన క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని తాజాగా ముంబయికి తిరిగివచ్చారు. తమ ముద్దుల కూతురు రాహా కపూర్‌తో కలిసి ఇండియా చేరుకున్నారు.అయితే తాజాగా ఈ జంట కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి ముంబయికి వచ్చిన ఈ జంట తమ ఖరీదైన లగ్జరీ కారులో ఇంటికి చేరుకున్నారు. దీంతో అందరి దృష్టి కారుమీదే పడింది. లెక్సస్ ఎల్ఎమ్ బ్రాండ్‌కు చెందిన ఈ కారు విలువ దాదాపు రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఇటీవల ఏప్రిల్ నెలలో బెంటెలీ బ్రాండ్ కారును రణ్‌బీర్ కొనుగోలు చేశాడు. వీటితో పాటు రణ్‌బీర్ గ్యారేజీలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. అలియాకు సైతం రేంజ్ రోవర్, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ, ఆడి క్యూ5, ఆడి క్యూ7 కార్లు కలిగి ఉన్నారు. దీంతో తాజాగా మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. కాగా.. గతేడాది యానిమల్ మూవీతో రణ్‌బీర్ కపూర్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతనికి జోడీగా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆటోమొబైల్స్ అంటే తనకున్న ప్రేమకు నిదర్శనంగా చే గ్యారేజీలో సరికొత్త పోర్స్చే 911 GT3 RS వచ్చి చేరింది. దీని విలువ దాదాపు 3.5 కోట్ల రూపాయలు. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Porsche Centre Chennai (@porschecentrechennai)పోర్స్చే సెంటర్ చెన్నై తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్‌కార్‌తో ఉన్న నాగ చైతన్య ఫోటోలను షేర్ చేసింది. ఈ కారును చైతన్యకు విజయవంతంగా డెలివరీ చేసినట్లు ప్రకటించింది. అలా తన కొత్త స్టార్ కస్టమర్‌కు స్వాగతం పలికేందుకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికింది. దీంతో ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నేచురల్ ఆస్పిరేటెడ్ నాలుగు లీటర్ల ఆరు-సిలిండర్ ఇంజన్‌తోవస్తున్న ఈ కారు 7-స్పీడ్ DCT సహాయంతో 518బీహెచ్పీ పవర్‌ను, 468 గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 296 కిమీ వేగంతో దూసుకుపోతుంది.నాగ చైతన్యకు ఇప్పటికే ఒక ఫెరారీ 488 GTB, రెండు సూపర్ బైక్‌లు, ఒక MV అగస్టా F4 , BMW R నైన్ టితో సహా ఇతర కార్లు ఉన్నాయి. వర్క్ ఫ్రంట్‌లో, నాగ చైతన్య రాబోయే యాక్షన్ డ్రామా 'తండేల్'లో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
జైలు నుంచి వచ్చాడు.. రూ.3 కోట్ల కారు కొన్నాడు!
ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ విన్నర్ ఎల్విశ్ యాదవ్. పాము విషం కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై విడదలయ్యారు కూడా. యూట్యూబర్‌గా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఎల్విశ్ యాదవ్ బిగ్‌బాస్ షో మరింత గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల జైలు నుంచి బయటికొచ్చిన ఎల్విశ్ యాదవ్ ఖరీదైన లగ్జరీ కారును కొన్నారు. తాజాగా మెర్సిడెస్ గ్వాగన్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఈ కారును 2022లోనే కొనాలనుకున్నట్లు తన వీడియో ఎల్విశ్ వెల్లడించారు. అప్పుడు కుదరకపోవడంతో ఈ ఏడాది తన కల నెరవేరిందని అన్నారు. కాగా.. ఎల్విశ్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2 విజేతగా నిలిచారు. -
నీతా అంబానీ లగ్జరీ కారు, ఫోటోలు వైరల్, ధర ఎంతంటే..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ అంటే లగ్జరీకి పెట్టింది. డైమండ్ నగలు, వాచ్‌లు, ఖరీదైన చీరలు,విలాసవంతమైన బ్యాగులు, డనుంచి చెప్పులు, లిప్‌స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. స్పెషల్ గా కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు ఇది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి కారు ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.దీని స్టాండర్డ్మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా కారు హెడ్రెస్ట్లపై నీతాముఖేష్ అంబానీ (ఎన్ఎంఏ) కూడా ఎంబ్రాయిడరీ చేసిన పిక్స్కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్ సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్ అధునాతన ఫీచర్లతో ఉన్న కొత్త లగ్జరీ రోల్స్ రాయిస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. గత దీపావళికి, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ప్రముఖ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉన్నవారు ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒకరు. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ గతేడాది యానిమల్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. అంతే కాకుండా మరో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే తాజాగా రణ్‌బీర్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ యానిమల్ హీరో దాదాపు రూ.8 కోట్ల విలువైన కొత్త బెంట్లీ కాంటినెంటల్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారులో ముంబైలోని తన నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. కాగా.. గతేడాది సైతం బెల్గ్రేవియా గ్రీన్ ఎక్స్‌టీరియర్స్‌తో కూడిన అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేశాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను రణ్‌బీర్ కపూర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ రాహా కపూర్ అనే కూతురు జన్మించారు. ఇటీవలే తమ కూతురి కోసం దాదాపు రూ.250 కోట్లతో ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే అత్యంత పిన్న వయసులోనే కోట్ల ఆస్తులున్న స్టార్ కిడ్‌గా రికార్డ్ సృష్టించనుంది. కాగా.. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్.. నితీష్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
భారత్‌లో మొదటిసారి ప్రవేశించిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా..
కార్లంటే కొందరికి అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఉంటే.. ఇంకొందరికి అవో లగ్జరీ సింబల్‌గా మారుతున్నాయి. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసి మరీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన ఆస్టన్ మార్టిన్ డీబీ12 స్పోర్ట్స్ కారు అది. ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు ధర సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు. అయితే ఇంతకీ ఈ కారును కొన్న వ్యక్తి ఎవరిని అనుకుంటున్నారా. అలాంటి యోగం సాధారణ ప్రజలకు ఎక్కడుంటుంది. దీన్ని కొన్నది ఏకంగా రూ.1.34లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు ఆస్టన్ మార్టిన్ బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ డీబీ12 పేరుతో గతేడాది సెప్టెంబరులో కారును లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.4.59 కోట్లు. దీపిందర్ గోయల్ ఈ లగ్జరీ కారును తాజాగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్పోర్ట్స్ కార్ మెర్సిడెస్-బెంజ్-సోర్డ్స్ ఇంజిన్‌తో రూపొందించారు. 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్డ్ వీ8 ఇంజిన్ కలిగి ఉంది. కేవలం 3.5 సెకెన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీన్ని ప్రత్యేకత. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
కిమ్‌కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు బహుమతిగా విలాసవంతమైన లిమోసిన్ కారు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ కారు ఉత్పత్తి చేసిన కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి రెండేళ్లు పూర్తవడం, అలెక్సీ నావల్ని మృతిపై రష్యాపై అమెరికా తాజాగా విధించిన 500 ఆంక్షల జాబితాలో లిమోజిన్ కారు కంపెనీ ఆరస్‌ను కూడా అగ్రరాజ్యం చేర్చడం గమనార్హం. ఉత్తర కొరియాకు రష్యా ఆర్టిలరీ బాంబులు సరఫరా చేస్తుండటం, కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలపై చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వీడియోకాన్ఫరెన్స్‌లో శుక్రవారం చర్చించారు. కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని దక్షిణ కొరియాకు చెందిన ఐలాండ్‌లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు దక్షిణకొరియాను ఉత్తర కొరియా రెచ్చగొడుతోంది. ఇదీ చదవండి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. రెండేళ్లు -
చిరంజీవి సినిమాతో ఫేమస్ అయిన బ్యూటీ కొత్త కారు చూశారా? (ఫోటోలు)
-
చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో..
ప్రముఖ నటి 'గౌహర్ ఖాన్' (Gauahar Khan) ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె కొన్న ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నా పేరే కాంచనమాలా పాటతో శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవితో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన 'గౌహర్ ఖాన్' కొనుగోలు చేసిన లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్' కంపెనీకి చెందిన 'జీఎల్ఈ'. ఈ కారు ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారుని డెలివరీ చేసుకోవడానికి సంబంధించిన ఫోటోలను ముంబైలోని కంపెనీ అధీకృత మెర్సిడెస్-బెంజ్ డీలర్ అయిన ఆటోహంగర్ అండ్ గ్లామర్ డైరీస్ ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోలో గమనించినట్లైతే గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్తో కలిసి ముంబైలోని మెర్సిడెస్-బెంజ్ డీలర్‌షిప్‌లోకి వెళ్లడాన్ని చూడవచ్చు. లగ్జరీ కారుని మాత్రమే కాకుండా వీరు తమ పిల్లల కోసం ఓ బొమ్మ బెంజ్ కారుని కొన్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఈ చిన్న కారు కూడా పార్క్ చేసి ఉండటం చూడవచ్చు. గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్ ఇద్దరూ బొమ్మ కారుని ఆవిష్కరించిన తరువాత, బెంజ్ కారుని ఆవిష్కరించారు. ఇది బెంజ్ GLE300d LWB వెర్షన్ అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదీ చదవండి: ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస.. బ్లాక్ షేడ్‌లో కనిపించే ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 245 పీఎస్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది. View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
నంబర్ ప్లేట్‌కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే..
అతడో ధనవంతుడు.. పైగా ఓ పెద్ద కంపెనీని యజమాని.. కార్లంటే ఎంతో ఇష్టం.. నచ్చిన కారు నంబర్‌ప్లేట్ కోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధం.. అయనే భారత మూలాలున్న దుబాయిలో నివసిస్తున్న అబుసల్హా(బల్విందర్‌సింగ్ సాహ్నీ). ఆయనకు నచ్చిన కారు నంబర్‌ప్లేట్‌కు ఏకంగా రూ.141 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కార్లపై తనకున్న ఆసక్తి ఎలాంటిదో ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయిలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న బల్విందర్‌సింగ్ సాహ్నీ(అబుసల్హా) రాజ్ సాహ్ని గ్రూప్ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్స్, ఇండస్ట్రీయల్ వస్తువులు, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బల్విందర్‌సింగ్ సాహ్నీకి కార్లంటే చాలా ఇష్టం. ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రోల్స్ రాయిస్ విడుదల చేసిన ఖరీదైన కార్లలోని కల్లినన్స్, ఫాంటమ్ VIII సెడాన్ వంటి మోడళ్లు సాహ్నీ గ్యారేజ్‌లో ఉన్నాయి. అతడి వద్ద ఎన్నో అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ కార్లు ఉన్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కార్లతో పాటు తనకు నచ్చిన నంబర్ప్లేట్లను ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేయడం తనకు అలవాటని తెలిపారు. అత్యంత ఖరీదైన లైసెన్స్ ప్లేట్లు తనవద్ద ఉన్నాయన్నారు. వీటిలో కొన్ని కార్ల వాస్తవ ధరకంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఇదీ చదవండి: రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్ సాహ్నీ వద్ద రూ.6 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లే ఉన్నట్లు చెప్పారు. కానీ వాటికి సింగిల్ డిజిట్(1), కొన్నింటికి డబుల్ డిజిట్ నంబర్‌ప్లేట్ తీసుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు ఒక్కోకారుకు దాదాపు రూ. రూ.60 కోట్లు నుంచి రూ.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సాహ్నీ సుమారు రూ.10 కోట్లు వెచ్చించి రోల్స్‌రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేశారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌కు ఏకంగా సుమారు రూ.141 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. ఆ నంబర్‌ప్లేట్‌పై ‘DUBAI D 5’ అని ఉంటుంది. తన వద్ద సింగిల్ డిజిట్ నంబర్‌తో మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కూడా ఉన్నట్లు చెప్పారు. బెంట్లీ రూపొందించిన ఖరీదైన కస్టమ్ ఫర్నిచర్ సైతం తన ఇంట్లో ఉందని సాహ్నీ అన్నారు. -
సామాన్యుడిలా వచ్చిన నాగ చైతన్య.. ఏం చేశాడంటే?
అక్కినేని హీరో నాగ చైతన్య కస్టడీ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ యంగ్ హీరో. (ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్) లవ్ స్టోరీ తర్వాత మళ్లీ చై, సాయి పల్లవి కలిసి తెరపై కనిపించనున్నారు. ఈ సూపర్ హిట్ జోడీ తెరపై మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంతో పాటు మరోవైపు ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న హారర్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. అయితే తాజాగా నాగ చైతన్య హైదరాబాద్‌లో సందడి చేశారు. ఓ పెట్రోల్ బంక్‌లో తన ఖరీదైన ఫెరారీ కారులో దర్శనమిచ్చారు. ఓ సామాన్యుడిలా వచ్చి పెట్రోల్ బంక్‌లో కనిపించారు. అయితే నాగ చైతన్య వచ్చిన కారుపై అందరి దృష్టి పడింది. చైతూ వచ్చిన రెడ్ కలర్ ఫెరారీ కారు దాదాపు రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నాగ చైతన్య ఫ్యాన్స్ సైతం సూపర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో అవుతోన్న కాబోయే కోడలు!) View this post on Instagram A post shared by anush7697 (@anush7697) -
నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
2010లో టీన్ పట్టి చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధా కపూర్. లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్గా కనిపించింది. ఆ తర్వాత ఆషికి-2 చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ఏడాది రణ్‌బీర్ కపూర్ సరసన తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రంలో నటించింది. తాజాగా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్ టెక్నికా అనే మోడల్ కారును సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు విలువ దాదాపు రూ.4 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె రాజ్ కుమార్ రావు సరసన స్ట్రీట్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2018లో వచ్చిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) View this post on Instagram A post shared by Pooja Choudary (@poojachoudary_9) -
ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీ కారును సొంతం చేసుకుంది. ఈ కారు విలువ దాదాపు రూ.1.2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం కరీనా కపూర్ ప్రధాన పాత్రలో హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ది బకింగ్‌హామ్ మర్డర్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని కరీనా ఫస్ట్‌లుక్ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో జస్ భమ్రా అనే డిటెక్టివ్‌గా కరీనా కనిపించనుంది. ఈ పాత్ర గురించి కరీనా మాట్లాడుతూ..' ఇరవై మూడేళ్లుగా ఈ పాత్ర కోసమే ఎదురుచూస్తున్నా. డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కే పాత్రలకి నేను పెద్ద అభిమానిని. కరమ్‌చంద్, హెలెన్ మిరెన్, అగాథా క్రిస్టీలాంటి రచయితల కథలతో తెరకెక్కిన సిరీస్‌లు చూశా. ఇలాంటి పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధమని' చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో యశ్ టాండన్, రణ్వీర్ బ్రార్, కీత్ అలెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా కపూర్, కరీనాకపూర్ నిర్మిస్తున్నారు. -
ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!
బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' (Kim Sharma) పేరు తెలుగు వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ మగధీర సినిమాలో జోర్సే.. జోర్సే పాట గుర్తొస్తే తప్పకుండా ఈమే గుర్తొస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఖడ్గం, ఆంజనేయులు సినిమాల్లో కూడా తనదైన రీతిలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. కిమ్ శర్మ కొనుగోలు చేసిన కొత్త కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ సెడాన్. ఇటీవలే ఈ కారుతో ఓ రెస్టారెంట్ వెలుపల కనిపించింది. ఈ సెడాన్ ధర రూ. 1.95 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఒక వీడియోను కార్స్ ఫర్ యు అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో గమనించినట్లయితే, బీఎండబ్ల్యూ ఐ7 కారు దిగి రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోవడం చూడవచ్చు. గతంలో ఈమె భారతదేశంలో అత్యంత సరసమైన కారు 'టాటా నానో' (Tata Nano) ఉపయోగించేది. అయితే దీని స్థానంలో ఖరీదైన బీఎండబ్ల్యూను చేర్చింది. బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన బీఎండబ్ల్యూ కార్లలో ఐ7 ఒకటి. ఇది అద్భుతమై డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో బ్లూ యాక్సెంట్లు, కొత్త డైమండ్ అల్లాయ్ వీల్ వంటివి గమనించవచ్చు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు షాక్.. ఎక్స్(ట్విటర్)కు రూ.3.21 కోట్లు ఫైన్ - కారణం ఇదే! ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ సెడాన్ 14.9 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ & 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. అంతే కాకుండా రెండవ వరుస ప్రయాణికుల కోసం ఇందులో 31.3 ఇంచెస్ 8కే సినిమా స్క్రీన్ ఉంటుంది. డోర్స్ వద్ద కూడా 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. బీఎండబ్ల్యూ ఐ7 రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి 544 హార్స్ పవర్, 745 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 600 కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని టాప్ స్పీడ్ 239 కిమీ/గం. -
ఇలాంటి బెంజ్ కారు ఎప్పుడైనా చూసారా! ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్..
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అనేక ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టి అత్యధిక ప్రజాదరణ పొందింది. కాగా ఇటీవల ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో విజన్ మేబ్యాక్ 6 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. మెర్సిడెస్ బెంజ్ ప్రదర్శించిన ఈ కొత్త కారు దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండటం గమనించవచ్చు. 2016లో కాలిఫోర్నియాలోని పెబుల్ బీచ్‌లో అడుగుపెట్టి ఈ కారు దాదాపు 7 సంవత్సరాలకు దేశీయ విఫణిలో కనిపించింది. దాదాపు 6 మీటర్ల పొడవున్న ఈ కారు డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. కావున ఇది ఒక్క చూపుతోనే చూపరులను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ లైట్స్, ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్, 24 ఇంచెస్ వీల్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. అయితే ఇంటీరియర్ ఫీచర్స్ గురించి కంపెనీ వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్ 80 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో 750 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక చార్జితో ఏకంగా 500 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ లగ్జరీ బెంజ్ కారు గురించి చాలా వివరాలు తెలియాల్సి ఉంది. -
లగ్జరీ కార్ల అమ్మకాల్లో జోష్.. పండుగల సీజన్‌పై ఆశలు
న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కార్లకు పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుందని మెర్సెడెజ్ బెంజ్, ఆడి, లెక్సస్ భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగల సందర్భంగా ఇంతకుముందెన్నడూ లేనంతగా విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్ ఎంతో ఆశావహంగా కనిపిస్తున్నట్టు మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ఈ సీజన్‌ను సానుకూలంగా ప్రారంభించాం. అమ్మకాల పరంగా సానుకూలంగా ఉన్నాం’’అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన మోడళ్లు ఇందుకు మద్దతుగా నిలుస్తాయన్నారు. ఇక లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ ఇక ముందూ వృద్ధి నమోదు చేస్తుందన్నారు. డిమాండ్ ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అధిక ధనవంతులు పెరుగుతుండడం, మిలీనియల్స్, ఖర్చు పెట్టే ఆదాయం పెరగడం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని నడిపిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. గతేడాదికి మించి అమ్మకాలు ‘‘2022 అమ్మకాలను మేము ఇప్పటికే దాటేశాం. రెండో త్రైమాసికంలో మాదిరే రానున్న పండుగల్లోనూ మెరుగైన విక్రయాలు కొనసాగుతాయి. తాజా బుకింగ్‌లు బలంగా ఉన్నాయి’’ అని ఆనంద్ సోనీ తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కూప్, ఎల్సీ 500 హెచ్‌ను ఈ సంస్థ ఇప్పటికే ప్రవేశపెట్టింది. న్యూ జనరేషన్ ఎల్ఎం మల్టీపర్పస్ వెహికల్‌కు కూడా బుకింగ్‌లు ప్రారంభించనుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెల్లలో 3,474 యూనిట్లను విక్రయించినట్టు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 97 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. ‘‘మా ఎస్‌యూవీలు 217 శాతం అధిక అమ్మకాలు నమోదు చేశాయి. కార్ల పనితీరులో 127 శాతం వృద్ధి నెలకొంది. పండుగల సమయంలోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని అనుకుంటున్నాం’’అని సింగ్ వెల్లడించారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5 మోడళ్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు చెప్పారు. -
నటి తాప్సీ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
'ఝుమ్మంది నాదం'తో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'తాప్సీ' ఆ తరువాత షాడో, వీర వంటి సినిమాలతో తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె గణేష్ చతుర్థి సందర్భంగా ఒక ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నటి తాప్సీ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'జిఎల్ఎస్ 600'. దీని ధర రూ. 3 కోట్లు కంటే ఎక్కువే. దీనిని కంపెనీ ఆదివారం ఆమె ముంబై నివాసంలో డెలివరీ చేసింది. పల్లాడియం సిల్వర్ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు తన గ్యారేజిలో చేరిన రెండవ బెంజ్ కారు. తాప్సీ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ కంపాస్, బీఎండబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఏ8ఎల్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జిఎల్ఎస్ 600 చేరింది. ఈ కొత్త కారు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 విషయానికి వస్తే.. 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజన్ కలిగి 550 హెచ్‌పి పవర్ అండ్ 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది EQ బూస్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున అదనపు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! జిఎల్ఎస్ 600 పెద్ద 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే & 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే కలిగి కారుకి సంబంధించిన అన్ని వివరాలు డ్రైవర్‌కి అందిస్తుంది. అంతే కాకుండా నప్పా లెదర్ అపోల్స్ట్రే, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ కలిగిన రియర్ సీట్లు మొదలైన ఆధునిక ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇదీ చదవండి: గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర ఇప్పటికే ఈ ఖరీదైన లగ్జరీ కారుని ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, కృతి సనన్, అజయ్ దేవగన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ కూడా కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుపై సెలబ్రిటీలకు ఎంత మక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతోంది. -
రకుల్ ప్రీత్ కొన్న లగ్జరీ బెంజ్ కార్ విలువ..ఎన్ని కోట్లో తెలిస్తే బిత్తరపోతారు
-
లగ్జరీ కారు కొనుగోలు చేసిన రకుల్ ప్రీత్.. ధర ఎన్ని కోట్లంటే?
రకుల్ ప్రీత్ సింగ్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది 'అటాక్', 'రన్‌వే 34', 'కట్ పుట్లి, 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', ఛత్రివాలి లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది బూ సినిమాతో ఓటీటీలో అలరించిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన నటించింది. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) టాలీవుడ్లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం. తాజాగా ఈ ముద్దుగమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కారు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది భామ. అంతేకాకుండా అక్కడున్న వారందరికీ స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ లగ్జరీ బెంజ్ కారు విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. (ఇది చదవండి: హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?) View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా!
ముఖేష్ అంబానీ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ.. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. అయితే వీరి వద్ద ఉన్న లగ్జరీ వాహనాలు లెక్కకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ కారు రంగులు మార్చే 'రోల్స్ రాయిస్'. రోల్స్ రాయిస్ కల్లినన్.. రంగులు మార్చే ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కనిపించింది. వీరి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఇది చాలా ప్రత్యేకమైనదికి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీలైక్ఓమ్ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గమనించినట్లైతే పోర్స్చే 911 జీటీ3, టయోటా సుప్రా వంటి కార్లతో పాటు రోల్స్ రాయిస్ కారుని గమనించవచ్చు. ఇది దూరం నుంచి వైలెట్ కలర్ షేడ్‌లో కనిపిస్తుంది.. దగ్గరకు వచ్చే సరికి నీలం (బ్లూ) రంగులోకి మారింది. ఇలా అది దూరం వెళ్లే సరికి మళ్ళీ రంగు మారినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! సైకెడెలిక్ ర్యాప్.. నిజానికి వర్షం కురిసిన సమయంలో ఈ కారు కనిపించడంతో ఇలా కనిపించింది. అదే బాగా ఎండగా ఉన్న సమయంలో అయితే మరింత ఆకర్షణీయంగా కనిపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది కలర్ మార్చే ర్యాప్.. కావున దానిపై పడే కాంతి పరిమాణం, మీరు కారును చూస్తున్న కోణాన్ని బట్టి రంగు మారుతుంది. ఈ రకమైన ర్యాప్‌ను సైకెడెలిక్ ర్యాప్ అని కూడా పిలుస్తారు, ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ కారు అని తెలుస్తోంది. కావున ఈ లగ్జరీ కారు 6.8 లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో గరిష్టంగా 580 బీహెచ్పీ పవర్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఈ రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా.. బిఎమ్‌డబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జిటిబి, ఫెరారీ పోర్టోఫినో వంటి మరెన్నో కార్లు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ! -
జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర అక్షరాలా..
Tiger Shroff BMW: బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'టైగర్ ష్రాఫ్' (Tiger Shroff) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆయన ఇటీవల జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ సెడాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మూవీజ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఇందులో కారుని స్పష్టంగా చూడవచ్చు. టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 330 ఎల్ఐ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 258 పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!) డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, 190 పీఎస్ పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటాకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతంగా అవుతుంది. ఈ లగ్జరీ సెడాన్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్స్ లభిస్తాయి. -
యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
Ramdev Land Rover Defender 130: యోగా గురువు ,పతంజలి ఆయుర్వేదానికి చెందిన రామ్‌దేవ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారా? దాదాపు 1.5 కోట్ల విలువైన కారును డ్రైవ్ చేస్తున్నవీడియో ఒకటి ప్రస్తుం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు నడుపుతూ రామ్‌దేవ్ దర్జా ఒలకబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఆయన ఇతర లగ్జరీకార్ల కలెక్షన్స్, పతంజలి సంపద హాట్‌టాపిక్‌గా నిలిచింది. లగ్జరీ కార్ల కలెక్షన్ యోగా గురు రామ్‌దేవ్ కార్ల కలెక్షన్ కూడా ఆసక్తికరం. మహీంద్రా XUV700, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ ఎవోక్ , జాగ్వార్ XJLలాంటి లగ్జరీ కార్లు అతని గ్యారేజ్‌లో ఉన్నాయి. మహీంద్రా నుంచి ల్యాండ్ రోవర్ కి ప్రమోట్ అయ్యారంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు బాబా రామ్‌దేవ్ ఎప్పుడూ భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ విదేశీ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.రామ్‌దేవ్‌బాబా నేతృత్వంలోని పతంజలి మార్కెట్ క్యాప్ రూ. 46,000కోట్లు. (చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!) వీడియోలో కనిపిస్తున్న ఎస్యూవీ సెడోనా రెడ్ కారును రాందేవ్ కొన్నారా అనేది స్పష్టత లేదు. ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్130 రేంజ్-టాపర్ అండ్ బిగ్గెస్ట్ కారు. కాగా సెడోనా రెడ్ కలర్ ఆప్షన్ డిఫెండర్ 130 2023 ఎడిషన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయింది. డెలివరీలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వెర్షన్‌గా కొనసాగింపుగా తీసుకొచ్చిన డిఫెండర్ 130 అదే వీల్‌బేస్‌ను కలిగి ఉంది, అయితే కంపెనీ వెబ్సైట్ ప్రకారం, బాడీ 340 మిమీ పొడవు ఉంటుంది. మూడు వరుస సీట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సింగిల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటింగ్, కూలింగ్,మెమరీ ఫంక్షన్లతో కూడిన 14-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా లాంటి ఇతర ఫీచర్లున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్) View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) -
గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా కొత్త కారు చూశారా? ధర ఎంతంటే?
Neeraj Chopra buys a new Range Rover Velar ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కొత్త రేంజ్ రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను and Rover Malwa Automotives సోషల్ మీడియాలో షేర్ చేసింది. రూ. 90 లక్షల విలువైన ఈ ఐకానిక్ వాహనాన్ని సొంతం చేసుకున్నాడు. చాలామంది క్రీడాకారుల్లాగానే ఒలంపిక్ సెన్సేషన్ నీరజ్ చోప్రాకు లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువు. కొత్త రేంజ్ రోవర్ వెలార్‌తో పాటు, రేంజ్ రోవర్ స్పోర్ట్ , అనేక ఇతర టాప్-టైర్ వాహనాలు అతని గ్యారీజేలో ఉండడం విశేషం. రేంజ్ రోవర్ వెలార్ ఇండియా ప్రారంభ ధర రూ. 78.87 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అయితే, నీరజ్ చోప్రా చెల్లించిన ఖచ్చితమైన ధర ఇంకా తెలియరాలేదు. (ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!) రేంజ్ రోవర్ వెలార్ పలు డ్రైవింగ్ వేరియంట్లలో లభిస్తోంది. లో వేరియంట్ 179 Bhpతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ లేదా 250 Bhp తో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్కాగా, టాప్-ఎండ్ వేరియంట్లు 296 Bhpపవర్, 3.0-లీటర్ V6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. (అదరగొట్టిన రిలయన్స్ జియో) ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యూజర్ ఫ్రెండ్లీ టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్తో టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, మెమొరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ,యాక్టివ్ రియర్-లాకింగ్ ఇ-డిఫరెన్షియల్ వంటి ముఖ్యమైన హైలైట్లు ఉన్నాయి. కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. నీరజ్ చోప్రాతోపాటు,ప్రముఖ నటి కృతి ఖర్బందా, స్టాండ్-అప్ కమెడియన్ జకీర్ ఖాన్ , నటి అవ్నీత్ కౌర్ లాంటి సెలబ్రిటీలు ఈ రేంజ్‌రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశారు. అంతుకాదు ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో
Ram Kapoor owns Porsche 911 Turbo S (992): ప్రముఖ టెలివిజన్ నటుడు రామ్ కపూర్, "బడే అచ్చే లాగ్తే హై" 'కసమ్ సే' లాంటి పాపులర్ టీవీ సీరియళ్లతోపాటు అనేక బాలీవుడ్ సినిమాలలో నటనతో తనకంటూ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రామ్‌కు లగ్జరీ కార్లు అంటే పిచ్చి. ముఖ్యంగా పోర్షే కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఇటీవల తన గ్యారేజ్‌లో మూడో కారును జోడించాడు. టాప్ వేరియంట్ స్పోర్ట్స్ కారు 992 టర్బో S కారును కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు రూ. 3.6 కోట్లు. తాజాగా ముంబై రోడ్లపై కపూర్ తన కొత్త కారుతో షికారు చేయడం మీడియా కంటపడింది.ఇప్పటికే రెండు పోర్షే కార్లను సొంతం చేసుకున్న రామ్, తాజాగా మరో పోర్షే కారును అదీ టాప్ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం విశేషం. రామ్ కపూర్ భార్య గౌతమి కపూర్ కూడా నటి పోర్షే 911 టర్బో S (992) విశేషాలు అత్యంత అధునాతన మోడల్ 911 టర్బో S వేరియంట్, 560 PS గరిష్ట పపవర్ ను, 700 Nm నుండి భారీ 750 Nm టార్క్ వస్తుంది. ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌తో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ PDK ట్రాన్స్మిషన్ ఇందులో ఉన్నాయి. ఇది కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇవేకాదు 2021లో, రామ్ కపూర్ రూ. 2 కోట్ల విలువైన పోర్షే 911 కారెరా ఎస్‌ని కొనుగోలు చేశారు. ఇంకా రూ. 4.5 కోట్ల విలువైన ఫెరారీ పోర్టోఫినో ఎం , పోర్టోఫినో M పవర్,మెర్సిడెస్-AMG G63 లాంటి లగ్జరీ కార్లు రామ్ కపూర్ సొంతం. వీటితోపాటు బీఎండబ్ల్యూ ఆర్ 18, ఇండియన్ రోడ్‌మాస్టర్ డార్క్ హార్స్ , బీఎండబ్ల్యూ K 1600 B సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి. -
స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు లగ్జరీ కార్లపైమోజును మరోసారి చాటుకున్నాడు. తాజాగా అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు.దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్ ఒక వీడియను షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ 4 లక్షల,11 వేలకు పైగా లైక్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడళ్ల ధర రూ. 3.5 కోట్ల నుండి అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ధావన్ కొనుగోలు చేసిన లేటెస్ట్ వెర్షన్ విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఎప్పటిలాగానే తనదైన స్టయిల్లో పంజాబీ పాటతో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీలు మనసుపడుతున్న కార్లలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. ఫీచర్లు పరివీలిస్తే ఫ్లోటింగ్-స్టైల్, పూర్తిగా డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరిడియన్ 35-స్పీకర్ ఆడియో సిస్టమ్, డైనమిక్ నోయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. ఇది వీల్ వైబ్రేషన్లు, ఇంజిన్ నానోయిస్, టైర్ నోయిస్, రోడ్ నోయిస్ ఇతర బ్యాక్‌గ్రౌండ్ నోయిస్ కంట్రోల్ చేస్తుంది. భారీ 13.1అంగుళాల స్క్రీన్, హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ , బ్యాక్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఇంకా హెడ్‌ల్యాంప్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ లైట్లు , ఇంటిగ్రేటెడ్ LED DRL ఉంటాయి. ప్రీమియం లుక్‌తో రీడిజైన్ చేయబడిన బంపర్తోపాటు అప్‌గ్రేడెడ్ డోర్ హ్యాండిల్స్ ఫ్లష్ ఫిట్టింగ్‌ను కలిగి ఉందీ కారు. కాగా ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు లగ్జరీ కార్లంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్లోమెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్ BMW M8ని కొనుగోలు చేశాడు. ఈ లిస్ట్‌లో తాజాగా ల్యాండ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ చేరడం విశేషం. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
ఖరీదైన కారులో షికారు కొడుతున్న రాఖీభాయ్ - వైరల్ వీడియో
Yash Land Rover Range Rover: కన్నడ సినిమా నటుడైనప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినీ నటులలో 'యష్' ఒకరు. కెజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన యస్ ఇటీవల ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాండల్‌వుడ్ హీరో యష్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర సుమారు రూ. 4 కోట్లు అని సమాచారం. నిజానికి భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించడమే కాకుండా.. లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కారుని ఎగబడి కొంటుంటారు. (ఇదీ చదవండి: ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!) Range Rover Entered ✅#YashBoss #Yash19@TheNameIsYash pic.twitter.com/erQbftMhxd — Abhi ⚡ (@AbhiYashCult) June 15, 2023 ఇప్పటికే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350 డి, మెర్సిడెస్ జిఎల్సి 250 డి కూపే, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 520 డి, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ వంటి కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ కార్ల జాబితాలోకి మరో లగ్జరీ బ్రాండ్ కారు చేరింది. సెలబ్రిటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఈ బ్రాండ్ కారుని చాలా మంది ఈ కారుని కొనుగోలు చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ కపుల్స్ - ఫోటోలు
గత కొన్ని రోజులకు ముందు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ 'ఆదిత్య సీల్, అనుష్క రంజన్' ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బాలీవుడ్ కపుల్ సొంతం చేసుకున్న ఈ కారు ధర ఎంత? దాని ప్రత్యేకతలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఆదిత్య సీల్, అనుష్క రంజన్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'న్యూ మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి' (Mercedes E-350d AMG) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ సెడాన్ ధర సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుంది. ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలు డీలర్షిప్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో ఆదిత్య సీల్, అనుష్క రంజన్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రిటీలు కోరుకునే బెస్ట్ మోడల్. ఇది మంచి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కలిగి, మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో ఐకానిక్ మెర్సిడెస్ గ్రిల్, త్రీ-పాయింటెడ్ స్టార్ ఎంబ్లమ్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. క్యాబిన్ కూడా క్వాలిటీ మెటీరియల్ పొందుతుంది. ఇందులో ఖరీదైన లెదర్ సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) మెర్సిడెస్ బెంజ్ 3 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 286 hp పవర్ అండ్ 600 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి, ఇవన్నీ వాహనం వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి. (ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?) View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
మనవరాలి కోసం లగ్జరీ కొనవే ఏర్పాటు చేసిన ముకేశ్ అంబానీ
-
మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: ముద్దుల మనవరాలి కోసం కొండమీద కోతినైనా తీసుకురాగల సామర్థ్యం ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సొంతం. అందుకే ఏకంగా మనవరాలు బుల్లి ప్రిన్సెస్‌ను ఇంటికి తీసుకెళ్లందుకు భారీ కాన్వాయ్‌నే ఏర్పాటు చేయారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌నుంచి లగ్జరీ కార్లతో కూడిన భారీ కార్ కాన్వాయ్‌తో పాపాయిని ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో బిజినెస్ వర్గాల్లోనూ విశేషంగా నిలుస్తోంది. దిగ్గజ పారిశ్రామికవేత్త మనవరాలు భారీ భద్రత మధ్య, దేశీయ, విదేశీ లగ్జరీ కార్లు కాన్వాయ్‌తో ఇంటికి చేరింది. సుమారు 50 కోట్లకు పైగా విలువైన 20కి పైగా కార్లు ఉన్నాయి.రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి సూపర్ లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్ ముంబై వీధుల్లో సందడి చేసింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే పృథ్వి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అంబానీ కుటుంబంలోని ఈ పాపాయి రావడంతో ముఖేశ్, నీతా అంబానీ తరువాతి వారసుల సంఖ్య నాలుగుకి చేరింది. కుమార్తె ఇషా, ఆనంద్ పిరామల్ దంపతులకు ట్విన్స్ కృష్ణ ,ఆదియా ఉన్నారు. -
అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్
Reuben Singh: భారతీయులకు సహనం, పట్టుదల వంటివి చాలా ఎక్కువ. అయితే కోపంలో కూడా ఏ మాత్రం తీసిపోరు. దీనికి నిదర్శనమే లండన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త 'రూబెన్ సింగ్'. తన తలపాగాను అవమానించిన వారికి సరైన గుణపాఠం చెప్పడానికి ఏకంగా 15 కంటే ఎక్కువ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. ఇన్ని రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న వ్యక్తి ప్రపంచంలో బహుశా ఇతడే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. జీవితంలో ఒక్క రోల్స్ రాయిస్ కొంటే చాలు అనుకునే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, జీవితంలో ఒక్క సారైనా రోల్స్ రాయిస్ కార్లను ఎక్కాలి అని అందరికి ఉంటుంది. అలాంటిది ఎవరో హేళన చేసారని, తలపాగా విలువేంటో చూపించాలని ఇన్ని ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు రూబెన్ సింగ్. ఒక ఇంగ్లాండ్ వ్యక్తి తన తలపాగాను అవమానిస్తూ బ్యాండేజ్ అని ఎగతాళి చేసేవాడని, దానికి విసుగు చెందిన సింగ్ నా తలపాగా పవర్ ఏంటో చూపిస్తా అని తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కొనేసాడు. దెబ్బతో ఎగతాళి చేసినవాడు నివ్వెరపోయాడు. ప్రస్తుతం అతని వద్ద 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. రూబెన్ సింగ్ ఎవరు? బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఇంగ్లాండ్ వ్యక్తికి తనకి జరిగిన ఒక పందెంలో ఎవరు ఓడిపోతే వారు స్వచ్చంద సంస్థకు విరాళంగా డబ్బు ఇవ్వాలని పందెం వేసుకున్నారు. సిక్కు మతానికి చెందిన రూబెన్ వారానికి తాను ధరించే తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. రోల్స్ రాయిస్ కార్లతో వరం రోజులు తానూ ధరించే తలపాగా రంగుని బట్టి దిగిన ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: అనుకున్నదాని కోసం ఐఏఎస్ వదిలేసాడు - ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ బీటౌన్‌తో పాటు దక్షిణాదిలోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే దృశ్యం-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కార్లపై ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. మార్కెట్లో రిలీజైన కొత్త కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. (ఇది చదవండి: హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది: నటుడు) తాజాగా ఈ బాలీవుడ్ హీరో ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ బీఎండబ్ల్యూ ఐ7 ఈవీ కారును జర్మన్ కంపెనీ తయారు చేసింది. ఇండియన్ మార్కెట్లో రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. అజయ్ కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆధునాతన సదుపాయాలు ఉన్నాయి. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) -
ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో
Mahindra XUV700 Catches Fire: దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో విడుదల చేసిన XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఈ కారు అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇటీవల ఈ కారు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కులదీప్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా అతని ఎక్స్‌యూవీ 700లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడానికి ముందు పొగలు రావడంతో కారులోని వారందరూ కిందికి దిగేసారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని ప్రాధమిక పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కానీ కారు కాలిపోయినప్పటికీ ఎక్స్‌యూవీ 700 ఓనర్ మాత్రం మహీంద్రా సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 మంటల్లో కాలిపోయిన కారు కొనుగోలు చేసి కేవలం ఆరు నెలలు మాత్రమే అయినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపైనా మహీంద్రా కంపెనీ స్పందిస్తూ మా కస్టమర్ల సేఫ్టీ ప్రధమ లక్ష్యమని చెబుతూ ప్రమాదానికి కారణం ఫ్యూయెల్ లీక్ లేదా ఇంజిన్‌లో ఏర్పడిన ఒత్తిడి అయి ఉండవచ్చని వెల్లడించింది. అయితే ఆ కారు ఓనర్‌కి మళ్ళీ కొత్త కారు ఇస్తుందా? లేదా? అనేదానిపై ఎటువంటి అధికారిక ప్రకటన ప్రస్తుతానికి వెలువడలేదు. Our customers' safety is always our top most priority. Here is our official statement with reference to an incident on Jaipur National Highway involving the XUV700. pic.twitter.com/hOHEQWhVyC — Mahindra Automotive (@Mahindra_Auto) May 22, 2023 సేఫ్టీ ఫీచర్స్.. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విషయానికి వస్తే, మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటి సేఫ్టీ ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ ప్రయాణికుల భద్రతను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. (ఇదీ చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు నాకొద్దు.. మీరే తీసుకోండి - వైరల్ అవుతున్న పోస్ట్!) మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మల్టిపుల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 14.01 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 26.18 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మంటల్లో కాలిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఇల్లన్తి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఈ బీఎండబ్ల్యూ కారు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే - ధర ఎంతో తెలుసా?
లగ్జరీ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'బీఎండబ్ల్యూ' (BMW) దేశీయ మార్కెట్లో ఒక కొత్త కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బీఎండబ్ల్యూ విడుదల చేసిన ఈ కొత్త కారు 'ఎక్స్3 ఎమ్40ఐ'. ఈ SUV కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా లభిస్తుంది. కావున ఇది ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. కావున ఆసక్తికలిగిన కొనుగోలుదారులు దీనిని కంపెనీ అధికారిక వెబ్సైట్లలో లేదా, సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఎక్స్3 ఎమ్40ఐ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది బ్రూక్లిన్ గ్రే అండ్ బ్లాక్ సఫైర్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎమ్ కిడ్నీ గ్రిల్ చూడవచ్చు. అంతే కాకుండా ముందు భాగంలో మ్యాట్రిక్స్ ఫంక్షన్ తో కూడిన అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సైడ్ ప్రొఫైల్ లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ రెడ్ బ్రేక్ కాలిపర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మల్టీఫంక్షన్తో లెదర్ స్టీరింగ్ వీల్, కాంట్రాస్ట్ స్టిచింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెల్కమ్ లైట్ కార్పెట్, యాంబియంట్ లైటింగ్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్40ఐ 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి 360 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కినీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఇక చివరగా ప్రధానమైనది సేఫ్టీ ఫీచర్స్, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, డైనమిక్ బ్రేకింగ్ లైట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ మొదలైనవి ఉంటాయి. -
రూ.2 కోట్ల స్పోర్ట్స్ కారు.. క్షణాల్లో కాలి బూడిదైంది..
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మన్కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. మన్కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ.. -
Shekhar Suman: భార్యకు రూ. 2.4 కోట్ల కారు గిఫ్ట్ - కొడుకు ఇన్‌స్టా పోస్ట్ ఇలా..!
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన 'శేఖర్ సుమన్' గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భూమి, ఘర్ బజార్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇటీవల తన భార్య 'అల్కా సుమన్'కి తమ పెళ్లి రోజు కానుకగా ఖరీదైన కారుని గిఫ్ట్‌గా అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శేఖర్ సుమన్ తన భార్యకిచ్చిన కారు ధర సుమారు రూ. 2.4 కోట్లు. ఇది జర్మన్ బ్రాండ్ BMW కంపెనీకి చెందిన ఐ7 లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కారుని తన కొడుకు అధ్యాయన్ సుమన్‌తో కలిసి డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. ఈ కారు ఆక్సైడ్ గ్రే మెటాలిక్ క్లాసీ కలర్ లో చూడ చక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోని అధ్యాయన్ సుమన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ అమ్మ, నాన్న మీ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు, నాన్న నుంచి ఇది నీకు స్పెషల్ గిఫ్ట్ అమ్మా అంటూ.. ఏదో ఒకరోజు ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇస్తాను, దేవుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలని ఆశీర్వదించండి అంటూ రాసాడు. (ఇదీ చదవండి: 47 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్స్ బంద్.. అందులో మీరున్నారా?) ఇక బీఎండబ్ల్యూ ఐ7 విషయానికి వస్తే, ఇది 2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో రూ. 1.95 కోట్ల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ xDrive 60 అనే ఒకే వేరియంట్లో లభిస్తుంది. అయితే ఇది CBU మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది, కావున దీని ధర ఎక్స్-షోరూమ్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. (ఇదీ చదవండి: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా?) బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు చాలా ప్రత్యేకమైన డిజైన్ కలిగి, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 14.9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి అత్యాధునిక ఐడ్రైవ్ 8 ఆపరేటింగ్ సిస్టం కూడా పొందుతుంది. ఇందులో ప్రత్యేకంగా 31.3 ఇంచెస్ సినిమా స్క్రీన్ కూడా లభిస్తుంది. 2023 బీఎండబ్ల్యూ ఐ7 సెడాన్ రెండు మోటార్లను కలిగి 544 hp పవర్, 745 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 101.7 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 591 కిమీ నుంచి 625 కిమీ రేంజ్ అందింస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 239 కిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. View this post on Instagram A post shared by Addhyayan Summan (@adhyayansuman) -
భారత్‌లో విడుదలైన రూ. 3.30 కోట్ల జర్మన్ లగ్జరీ కారు - పూర్తి వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో కొత్త కారు 'ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్' (AMG GT 63 S E Performance) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్, పర్ఫామెన్స్ వంటి విషయాలతో పాటు ధరల గురించి కూడా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ విఫణిలో విడుదలైన కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ ధర రూ. 3.30 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది AMG పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్షిప్ మోడల్‌గా నిలుస్తుంది. ఇది 2021లోనే గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అయితే ఇప్పటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్: కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ చూడగానే ఆకర్శించే అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది కొత్త ఎగ్జాస్ట్ అవుట్లెట్లు కలిగి, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉండటం కూడా మీరు గమనించవచ్చు. బ్యాడ్జింగ్ కొత్త ట్విన్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి మరింత అట్రాక్టివ్‌గా ఉంటాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఫీచర్స్: ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ డ్యాష్‌బోర్డ్‌లో 12.4 ఇంచెస్ డ్యూయెల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బకెట్ సీట్లు, AMG స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్లు వంటి లగ్జరీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలను ఈ డిస్ప్లేల ద్వారా చూడవచ్చు. ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ కారు 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ పొందుతుంది. ఇది 639 హెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 204 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ రెండు కలయికతో 843 హెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే టార్క్ 1,470 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గంటకు 316 కిలోమీటర్లు. ఈ సూపర్ సెడాన్‌లో 6.1kWh, 400V బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 89 కేజీల బరువుతో ఉంటుంది. ఇది మోటారుకు శక్తినిస్తుంది. దీని పరిధి 12 కిమీ వరకు వస్తుంది. కానీ EV మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 12 కిలోమీటర్లు. ఇందులో ఏడు డ్రైవ్ మోడ్లు & ఫోర్ లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్అందుబాటులో ఉంటుంది. రెండోది కొన్ని పరిస్థితులలో వన్-పెడల్ డ్రైవింగ్‌ను కూడా అనుమతిస్తుంది. -
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. వామ్మో అన్ని కోట్లా?
మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తన ఇంటికి తీసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపుగా రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాాగా.. మోహన్‌లాల్ వద్ద ఇప్పటికే 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే లంబోర్గినీ కారును కలిగి ఉన్నాడు. టయోటా వెల్ఫైర్ రూ. 1 కోటి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350(సుమారు రూ. 80 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (సుమారు రూ. 2 కోట్లు) మోహన్ లాల్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారుగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ నిలవనుంది. కాగా.. మోహన్‌లాల్ ఇటీవలే రాజస్థాన్‌లో తన రాబోయే చిత్రం మలైకోట్టై వాలిబన్ షెడ్యూల్‌ను ముగించారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్ రజనీకాంత్ జైలర్‌లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. New one to the garage 🚗#RangeRover @Mohanlal #Mohanlal #MalaikottaiVaaliban pic.twitter.com/2bZBuBKL3K — Mohanlal Fans Club (@MohanlalMFC) April 10, 2023 -
కొత్త కారు కొన్న తీన్మార్ బ్యూటీ.. ధర ఎంతో తెలుసా?
హిందీ, కన్నడ భాషలతో పాటు తెలుగులో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన 'కృతి ఖర్బందా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో బోణి చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈమె పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో కూడా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఖరీదైన ఒక రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, కృతి ఖర్బందా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వెలార్ ధర సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు వైట్ కలర్లో చూడచక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేంజ్ రోవర్ వెలార్ ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే కృతి డీజిల్ కారుని కొన్నట్లు సమాచారం. ఈ ఇంజిన్ 204 పీఎస్ పవర్ 430 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటి వాటితో పాటు.. 3D 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 12 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 14 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇది భారతీయ విఫణిలో కూడా త్వరలో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు మార్కెట్లో మెర్సిడెస్ GLE, ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, పోర్స్చే మకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఒక్కసారిగా మైండ్ బ్లాక్!.. వెయిట్రస్‌కు కోట్ల విలువైన కారు టిప్‌గా ఇచ్చాడు
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మీస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్సన్ ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లును సంపాదించుకున్నాడు. వెరైటీ కంటెంట్లతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుంటాడు ఈ యూట్యూబర్. అందుకే తన ఫాలోవర్లు సంఖ్య 139 మిలియన్లకు పెంచుకోగలిగాడు. తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్తగా ప్లాన్లు చేసే ఈ యూట్యూబర్ ఇటీవల ఓ వెయిట్రస్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఊహించని టిప్.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ యూట్యూబర్ అక్కడ పని చేస్తున్న వెయిట్రెస్‌తో.. ఇంత వరకు నువ్వు అత్యధికంగా ఎంత టిప్ తీసుకున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు, ఆమె 50 డాలర్లు అని సమాధానమిస్తుంది. దాంతో ఇప్పటివరకూ నీకు టిప్‌గా కారు ఎవరైన ఇచ్చారా అని అడుగుతూ తన కారు తాళాన్ని వెయిట్రెస్‌కు ఇస్తాడు. మొదట్లో ఆమె ఈ విషయాన్ని నమ్మదు గానీ తర్వాత ఆ యూట్యూబర్ తను కారును పార్క్ చేసిన ప్రదేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. బ్లాక్ టయోటా కారును వెయిట్రెస్‌కు టిప్‌గా అందిస్తాడు ఆ యూట్యూబర్. టిప్‌గా ఇచ్చిన కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. కస్టమర్ నుంచి కోట్లు ఖరీదైన కారుని టిప్‌గా అందుకోవడంతో వెయిట్రెస్ ఆనందంలో మునిగి తేలిపోతుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్ ఔదార్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) -
భారత్‌లో బీఎండబ్ల్యూ హవా: మళ్ళీ కొత్త కారు లాంచ్
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో 2023 ప్రారంభం నుంచి కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని లాంచ్ చేసింది. ఇది ఎక్స్3 లైనప్‌లో చేరిన కొత్త వేరియంట్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ధర: భారతదేశంలో విడుదలైన కొత్త బీఎండబ్ల్యు ఎక్స్3 20డి ఎక్స్లైన్ (BMW X3 20d xLine) ధర రూ. 67.5 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లగ్జరీ కారు ధర దాని మునుపటి అవుట్గోయింగ్ లగ్జరీ ఎడిషన్ ఎక్స్3 కంటే రూ. 20,000 ఎక్కువ. డిజైన్: బీఎండబ్ల్యు ఎక్స్3 ఎక్స్లైన్ కిడ్నీ గ్రిల్‌తో మునుపటి అదే స్టైలింగ్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్, వెనుక భాగం మొత్తం విస్తరించి ఉండే టెయిల్ లైట్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఎక్స్టీరియర్ లైన్స్, రూఫ్ రైల్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: భారత్‌లో మసెరటి రూ. 3.69 కోట్ల సూపర్‌కార్ విడుదల - పూర్తి వివరాలు) ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్3 ఎక్స్లైన్ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ కలిగి హెడ్స్-అప్ డిస్ప్లే, 3D వ్యూ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్-కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ & పనితీరు: కొత్త BMW X3 మోడల్ 2-లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది. తద్వారా అద్భుతమైన పనితీరు లభిస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 213 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి: బంగారం నుంచి మొబైల్స్ వరకు!) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బిఎండబ్ల్యు ఎక్స్3 కారు వోల్వో ఎక్స్‌సి60, ఆడి క్యూ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ కొత్త లగ్జరీ కారు కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్సన్లో మాత్రమే లభిస్తుంది. -
'ముందుచూపు తక్కువ.. కొన్న కార్లను అమ్మేసుకున్నా'
ఐపీఎల్లో ఆర్సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ప్రతీసారి ఫెవరెట్‌గానే కనిపిస్తోంది. కారణం విరాట్ కోహ్లి. అతని బ్రాండ్ జట్టును ఎప్పుడు స్టార్ హోదాలో ఉంచుతుంది. గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరిచినప్పటికి టైటిల్ మాత్రం కొట్టలేకపోయింది. మరో సౌతాఫ్రికా జట్టులా తయారైన ఆర్సీబీకి దురదృష్టం చాలా ఎక్కువ. గత సీజన్లో ప్లేఆఫ్ చేరినప్పటికి క్వాలిఫయర్-2లో ఓడి ఇంటిబాట పట్టింది. 15 సీజన్లుగా బరిలో ఉన్నప్పటికి టైటిల్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. గత సీజన్ లో కోహ్లి పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు అతనున్న ఫామ్ దృశ్యా జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడని ఆర్సీబీ ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లకు ఫోటోషూట్ నిర్వహించింది. వీటన్నింటిని తమ బోల్డ్ డైరీస్‌లో షేర్ చేసింది. కాగా కోహ్లి బోల్డ్ డైరీస్‌లో మాట్లాడుతూ చాలా విషయాలు పేర్కొన్నాడు. కార్లను అమ్మేయడం నుంచి తన ఫెవరెట్ క్రికెటర్లు ఎవరనేది ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. "నేను వాడిన చాలా కార్లు ముందు చూపు లేకుండా కొన్నవే. కానీ వాటిని నేను పెద్దగా నడిపింది లేదు. కానీ ఓ సమయం వచ్చిన తర్వాత అనవసరంగా కొన్నాను అనిపించి వాటిలో చాలా వాటిని అమ్మేశాను. ఇప్పుడు మాకు కచ్చితంగా అవసరం అనిపించేవే వాడుతున్నాను. ఏవి అవసరం ఏవి కాదు అని తెలుసుకునే పరిణతి వచ్చిన తర్వాత అనవసరమైన కార్లను అమ్మేశాను" అని కోహ్లి చెప్పడం విశేషం. ఇక తన ఆరాధ్య క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, సచిన టెండూల్కర్ అని, వాళ్లు క్రికెట్ నే మార్చిన ప్లేయర్స్ అని కొనియాడాడు. 2016 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఏకంగా నాలుగు సెంచరీలతోపాటు 973 రన్స్ చేసిన విరాట్.. ఇప్పటికీ ఆ టీమ్ లో కీలకమైన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్ ద్వారా ఆర్సీబీ ఈ సీజన్‌ను ఆరంభించనుంది. చదవండి: 'ఆందోళన అవసరం లేదు.. ఎలా ఆడాలో మాకు తెలుసు' -
కవలల కల నెరవేరింది.. కొత్త కారు కొన్న సంతోషం కళ్ళల్లో - వీడియో వైరల్
టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తులలో 'చింకి మింకి' కవలలు కూడా ఉన్నారు. అంతే కాకుండా షార్ట్ ఫామ్ (short-form) వీడియోస్ చేస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ట్విన్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా వీరు ఇటీవల ఒక ఆధునిక లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. చింకి మింకీగా ప్రసిద్ధి చెందిన వీరి అసలు పేర్లు 'సురభి మెహ్రా & సమృద్ధి మెహ్రా'. 2016లో టిక్‌టాక్ ద్వారా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తార స్థాయికి చేరింది. కొన్ని టీవీ షోల ద్వారా కూడా వీరు మరింత పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఈ ట్విన్స్ కొన్న చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏఎంజి జిఎల్సి 43'. దీని ధర రూ. 87 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వారు కారు ముందర డ్యాన్స్ చేయడం చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఖరీదైన కార్ల జాబితాలో AMG GLC 43 ఒకటి. ఇది పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, డిజైనో హైసింత్ రెడ్, డిజైనో సెలెనైట్ గ్రే మాగ్నో, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం) మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 లగ్జరీ ఫీచర్స్ కలిగి, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా.. బ్లాక్ నప్పా లెదర్ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్, లంబర్ సపోర్ట్‌తో ఎలక్ట్రానిక్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్లు, మెర్సిడెస్ మీ కనెక్ట్, 64 కలర్డ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?) ఈ జర్మన్ లగ్జరీ కారులో 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 390 హెచ్‌పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా టాప్ స్పీడ్ 250 కిమీ/గం. View this post on Instagram A post shared by Chinki Minki♥️ (@surabhi.samriddhi) -
బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' ఇటీవల ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ (Mercedes Benz GLS 400d) మోడల్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హ్యుమా ఖురేషి కొన్న ఈ కారు ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0 లీటర్ సిక్స్ సిలీండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 325 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరు కారు కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది, అదే సమయంలో దీని టాప్ స్పీడ్ గంటకు 238 కిలోమీటర్లు. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ మోడల్ మల్టీ బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రల్లీ అడ్జస్టబుల్ వెంటిలేటెర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, 12 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రీప్లే ఇలా) వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న హ్యుమా ఖురేషి ఎప్పటికప్పుడు తన గ్యారేజిని ఆధునిక కార్లతో అప్డేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఈమె మొదటి కారు మారుతీ సుజుకీ స్విఫ్ట్ కావడం గమనార్హం. ఆ తరువాత ల్యాండ్ రోవర్ ఫ్రీ ల్యాండర్, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 250డీ వంటి వాటిని కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు మరో లగ్జరీ కారుని తన గ్యారేజిలో చేర్చింది. -
బిఎమ్‌డబ్ల్యు నుంచి మరో లగ్జరీ కారు.. ధర రూ. 69.90 లక్షలు
2023 ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్లో విరివిగా లగ్జరీ కార్లను విడుదల చేస్తున్న బిఎమ్‌డబ్ల్యు ఎట్టకేలకు మరో కొత్త కారుని విడుదల చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు 'ఎక్స్3 20డి స్పోర్ట్' (X3 20d M Sport). దీని ధర రూ. 69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). బిఎమ్‌డబ్ల్యు ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో 'ఎక్స్3' పెట్రోల్ వేరియంట్ నిలిపివేసింది. ఎక్స్3 20డి స్పోర్ట్ మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి 190 హెచ్‌పి పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: Hero Super Splendor XTEC: ఎక్కువ మైలేజ్, అప్డేటెడ్ ఫీచర్స్.. ధర ఎంతంటే?) కొత్త బిఎమ్‌డబ్ల్యు ఎక్స్3 20డి స్పోర్ట్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో విండోస్ చుట్టూ బ్లాక్ అవుట్ ఫ్రేమ్, బ్లాక్ అవుట్ రూఫ్ రైల్, డిఫ్యూజర్ వంటి వాటితో పాటు ఇంటీరియర్‌లో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, లెదర్ స్టీరింగ్ వీల్, కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటివి పొందుతుంది. బిఎమ్‌డబ్ల్యు ఇండియన్ మార్కెట్లో కొత్త తరం M2 కూపేని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లగ్జరీ మోడల్ దేశీయ విఫణిలో కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడిన మొదటి బిఎమ్‌డబ్ల్యు ఇదే అవుతుంది. -
నీతూ కపూర్ కారు ధర అన్ని కోట్లా!
గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. నీతూ కపూర్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన Maybach GLS600. దీని ధర సుమారు రూ. 3 కోట్లు. ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలుతో ఈమె మేబ్యాచ్ కారుని కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో చేరిపోయింది. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా భారతదేశానికి దిగుమతవుతుంది. కావున ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, కావాన్‌సైట్ బ్లూ, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ధర కొంత ఎక్కువైనప్పటికీ ఈ కారు ఆధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ జిఎల్ఎస్600 ఎస్‌యూవీలోని 4.0 లీటర్ వి8 ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇంజన్ 21 బిహెచ్పి పవర్, 249 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జతచేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్‌జి మోటార్: సేల్స్‌లో టాటా స్థానం ఎంతంటే?) మేబ్యాచ్ జిఎల్ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కావున ప్రయాణికుల భద్రతకు ఏ డోకా ఉండదు. -
ఇదో పిచ్చి.. రూ. 3 కోట్ల కారు నాశనం చేశాడు: షాకింగ్ వీడియో!
న్యూఢిల్లీ: కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారును కళ్లముందే ధ్వంసం చేసిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్లో భాగంగా లంబోర్ఘిని ఉరస్‌ను ఒక రష్యన్ యూ ట్యూబర్ ముక్కలు చేసి పారేశాడు. దీంతో వీడియో వైరల్‌గా గారింది. రూ. 3 కోట్లకు పైగా విలువైన లంబోర్ఘిని కారును నాశనం చేయడం నెటిజన్లని షాక్‌కి గురి చేసింది. (మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్ ? షాకింగ్ వీడియో వైరల్) వివరాల్లోకి వెళితే మిఖాయిల్ లిట్విన్ అనే పాపులర్ రష్యన్ యూట్యూబర్ లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్ కోసం తన వైట్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఉరుస్ కారును కేవలం కొన్ని సెకన్లలో ధ్వంసం చేసి, ఆ వీడియో షేర్ చేశాడు. ఒక భారీ క్రేన్‌తో లంబోర్ఘిని కారుపై పడేసి, తద్వారా లిట్ డ్రింక్ చిందేలా చేయడం ఇంటర్నెట్ యూజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఎనర్జీ డ్రింక్ ప్రకటన కోసం రూ. 3.15 కోట్ల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన ఎస్‌యూవీని యూట్యూబర్ ముక్కలు చేయడంపై నెటిజన్లు పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. స్టంట్‌పై స్పందించిన ఒక యూజర్ బీమా కంపెనీ పరిస్థితి ఏంటి ఒకరు వ్యాఖ్యానించారు. పాపులారిటీ కోసం యూట్యూబర్లు ఇదంతా చేస్తున్నారని కొంతమంది మండి పడ్డారు. అనవసరంగా ఇంత పొల్యూషన్ సృష్టించడం నేరమని కొందరు లైక్స్ అండ్ వ్యూస్ కోసం చేస్తున్న ఫక్తు బిజినెస్ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Jist (@jist.news) కాగా మహీంద్రా స్కార్పియోఎన్ రూఫ్ టాప్ లీక్ అవుతున్న వీడియోను ఒక యూట్యూబర్ షేర్ చేసిన క్లిప్ కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో యూట్యూబ్ క్రియేటర్లు ఇలాంటి వైరల్ కంటెంట్‌ను తయారు చేయడంలో ఆరితేరిపోయారనే నవిమర్శలు వినిపిస్తున్నాయి. -
కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్‌మేకర్ పోర్షే భలే చిక్కుల్లో పడింది. కంపెనీ అతిపెద్ద మార్కెట్ చైనాలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే అక్కడి చైనా డీలర్ ఒకరు 148,000 డాలర్ల(రూ. 1.21 కోట్లు) విలువ చేసే స్పోర్ట్స్ కారును కేవలం 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల కంటే కొంచెం ఎక్కువ) అంటూ తప్పుగా లిస్ట్ చేశారు. వాస్తవ ధరలో ఎనిమిదో వంతు తగ్గేసరికి లగ్జరీ కార్ లవర్స్ ముందస్తు బుకింగ్‌కు ఎగబడ్డారు. చివరికి విషయం తెలిసి ..ఇదెక్కడి చోద్యం రా మామా అంటూ ఉసూరుమన్నారట.! బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం ప్రముఖ 2023 పనామెరా మోడల్ విక్రయంలో ఉత్తర చైనా పట్టణంలోని యిన్చువాన్లోని పోర్షే డీలర్ ఇచ్చిన ఆన్లైన్ ప్రకటన కంపెనీని పరుగులు పెట్టించింది. అతి తక్కువ ధరకే తమ ఫ్యావరెట్ కారు అనేసరికి ఊరుకుంటారా? వందలాది మంది ఔత్సాహిక కొనుగోలుదారులు 911 యువాన్లను ముందుగానే చెల్లింపుతో కారును బుక్ చేసేశారు. ఈ బుకింగ్‌లు చూసి ఆశర్చర్యపోయిన కంపెనీ ఏం జరిగిందా? అని ఆరా తీస్తే అసలు విషయం బైటపడింది. దీంతో "లిస్టెడ్ రిటైల్ ధరలో తీవ్రమైన పొరపాటు జరిగింది" అని పోర్షే ప్రకటించాల్సి వచ్చింది. బుకింగ్‌లు చేసి, అడ్వాన్స్‌ను చెల్లించిన మిగతా వారందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. 48 గంటల్లోగా రీఫండ్ ఇస్తామని పేర్కొంది. దీంతో భంగపడిన కస్టమర్లు, ఇతర వినియోగదారులు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో పోర్షేను విపరీతంగా ట్రోల్ చేశారు. కాగా పోర్షే 2022 మొదటి అర్ధ భాగంలోనే చైనాలో 6.2 బిలియన్ డార్లు విలువైన సేల్స్ సాధించింది. 46,664 వాహనాలను విక్రయించింది. ప్రీమియం కార్ బ్రాండ్ పోర్షే ప్రపంచ విక్రయాలలో 30 శాతమట. -
ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్‌తో దూసుకుపోతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్‌లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్‌లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
ఖరీదైన కారు కొన్న మాజీ విశ్వసుందరి.. ఎన్ని కోట్లో తెలుసా?
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి బీ టౌన్లో పరిచయం అక్కర్లేదు. గతంలో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీతో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. సుష్మితా సేన్ 1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది. హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. అయితే సుస్మితా సేన్ తాజాగా ఓ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్రైవింగ్‌ను ఇష్టపడే మహిళగా ఈ బహుమతి ఇచ్చుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. సుస్మితా సేన్ కొన్న కారు ధర రూ.1.92 కోట్లుగా ఉంది. సుస్మితా సేన్ ప్రస్తుతం ఆర్య -3 అనే సీరియల్లో నటిస్తోంది. రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో నమిత్ దాస్, మనీష్ చౌదరి, సికందర్ ఖేర్, వినోద్ రావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఈ షో రెండో సీజన్ డిసెంబర్ 2021లో విడుదలైంది. మూడో సీజన్ విడుదల తేదీని వెల్లడించలేదు. ఇది కాకుండా, సుస్మిత తాళి అనే కొత్త వెబ్ సిరీస్‌లో నటించనుంది. ట్రాన్స్‌జెండర్ కార్యకర్త గౌరీ సావంత్ పాత్రలో కనిపించనుంది. -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
-
బీఎండబ్ల్యూ కొత్త కారు.. అదిరే లుక్‌తో '3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్'
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమజిన్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.57.9 లక్షల నుంచి ప్రారంభం. 2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.2 సెకన్లలో, డీజిల్ వేరియంట్ 7.6 సెకన్లలో అందుకుంటుంది. దేశీయ మార్కెట్లో BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ అనేది లాంగ్ వీల్ బేస్ కలిగి రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఒకటి 330Li పెట్రోల్, రెండోది 320Ld డీజిల్ వేరియంట్స్. కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌తో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 190 hp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇక 2.0 పెట్రోల్ ఇంజిన్ 258 hp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇది 15.39 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. దేశీయంగా ఈ కారును తయారు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా!
భారత ఆటోమొబైల్ రంగం వృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా కరోనా మహ్మమారి తర్వాత కాలం నుంచి కార్ల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఖరీదైన కార్ల కొనుగోళ్లు సైతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లంబోర్ఘిని, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు మన దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మెక్లారెన్ ప్రవేశించింది. ముంబైలో ఇటీవలే తన మొదటి డీలర్ షిప్‌ను ప్రారంభించిన ఈ కంపెనీ ఆ వేడుకల్లో తన సూపర్ కార్ మెక్ లారెన్ 765 LTని ( MCLAREN 765LT SPIDER) లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కాస్ట్లీ కార్లలో మెక్లారెన్ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ భారత్‌లో మొదటి కస్టమర్‌కు ఈ కారును డెలివరీ చేసింది. అత్యంత ఖరీదైన ఈ కారును ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు. ఈ కారు ఖచ్చితమైన ధర తెలియనప్పటికీ.. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జుడ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారుచేయబడింది. ఇందులో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ కన్వర్టిబుల్ కారు పైకప్పు కేవలం 11 సెకన్లలో తెరుచుకుంటుంది. మెక్లారెన్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత వేగవంతమైన కన్వర్టిబుల్‌లలో అద్భుతమైన కార్లలో ఇదీ ఒకటి. ఈ కారుని సొంతం చేసుకున్న నసీర్ ఖాన్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయన ఎన్నో ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు ఇప్పటికే ఈయన వద్ద ఫెరారీ, లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by NASEER KHAN (@naseer_khan0054) చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్ -
లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్
సాక్షి, ముంబై: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కుమార్తెలు రతీజా రెహమాన్, రహీమా రెహమాన్ ఫాస్టెస్ట్, లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పోర్షే టైకాన్ కారు కొన్న విషయాన్ని స్వయంగా రెహమాన్ ట్విటర్లో వెల్లడించారు. యువ నిర్మాతలు, కూల్ మెటావర్స్ ప్రాజెక్ట్ లీడర్స్ రతీజా, రహీమా (ఏఆర్ఆర్ స్టూడియోస్) కారు కొన్నందుకు ముఖ్యంగా కాలుష్య రహిత కార్‌ను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో సంతోషం ప్రకటించారు. అంతేకాదు ‘గర్ల్ పవర్’ అంటూ గర్వాన్ని ప్రకటించారు. “ARR స్టూడియోస్” పేరుతో ఉన్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును, పక్కనే ఖతీజా , రహీమా నిలబడి ఉన్న బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేశారు. జర్మన్ స్పోర్ట్స్ కార్కు చెందిన, జెంటియన్ బ్లూ మెటాలిక్ కలర్లో మెరిసిపోతున్న పోర్షే టైకాన్ ధర రూ. 1.53 కోట్ల నుంచి రూ. 2.34 కోట్లు. ఉంటుంది. జర్మన్ స్పోర్ట్స్ కార్ తయారీదారు Taycan EV టాప్-స్పీడ్‌ను 260Kmphకి పరిమితం చేసింది.ఈ కారు కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో పోర్షే టైకాన్ ఒకటి. ఈ ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారుకు భారతదేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు దీనిపై మనసు పారేసుకుంటున్నారు. 2021లో భారతదేశంలో పోర్షే టైకాన్‌ను లాంచ్ చేసింది. Taycan RWD, Taycan 4S, Taycan Turbo మరియు Taycan Turbo Sin ఉన్నాయి. Our young producers of #ARRstudios spearheading cool #Metaverse projects @RahmanKhatija #RaheemaRahman. Have chosen to go green with the #electriccar. Be the change you want to see. #bosswomen #girlpower #gogreen pic.twitter.com/i8TFUZULF9 — A.R.Rahman (@arrahman) November 23, 2022 -
రోల్స్ రాయిస్ అల్ట్రా-లగ్జరీ తొలి ఈవీ స్పెక్టర్: షాకింగ్ ధర
న్యూఢిల్లీ: బ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కస్టమర్లకోసం తొలి ఆల్-ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్టర్’ ను ఆవిష్కరించింది. 2023 చివరికి కస్టమర్లకు వాహనాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కారు పప్రారంభ ధర సుమారు దాదాపు రూ.3.5 కోట్లుగా ఉండనుంది. దాదాపు ఏడాది క్రితం దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన కంపెనీ తాజాగా దీన్ని లాంచ్ చేసింది.ఇప్పటికే దాదాపు 300కు పైగా ఈ లగ్జరీ కారును ప్రీబుకింగ్ అయ్యాయని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టన్ ముల్లర్-ఓట్వోస్ వెల్లడించారు. ఈవీ కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదే కాదు "అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే" , ఫాంటమ్ కూపేకి కొనసాగింపు అని పేర్కొన్నారు. తమ స్పెక్టర్ 3.4 సెకన్లలో 0-100 (కిమీ/గం) వేగం పుంజుకుంటుందని తెలిపారు. డిజైన్ పరంగా, ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యం, విశాలమైన గ్రిల్‌ను యాడ్ చేసింది. అలాగే బానెట్‌పై కొత్త 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ అని పేర్కొంది. కేవలం 2 డోర్లు మాత్రమే ఉన్న ఈ అతి విలాసవంతమైన కారులోని ఇతర విశేషాలను గమనిస్తే. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేను అందించింది.అలాగే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, హై-మౌంటెడ్ అల్ట్రా-స్లిమ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్), అలాగే ఏరో-ఆప్టిమైజ్ 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 53
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్–ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మ్యాటిక్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2.45 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక్కసారి చార్జి చేస్తే 529–586 కి.మీ. వరకూ నడుస్తుంది. 3.4 సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని పెంచుకునే దిశగా నాలుగు నెలల్లో మూడు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో ఈక్యూఎస్ 580, ఆ తర్వాత నవంబర్‌లో సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూబీని తేనున్నట్లు వివరించారు. రాబోయే అయిదేళ్లలో తమ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు మార్టిన్ చెప్పారు. -
ఒకసారి చార్జింగ్‌తో 400 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా తాజాగా ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్‌సీ40 రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.55.9 లక్షలు. ఆన్లైన్లో మాత్రమే ఈ కారును బుక్ చేయాల్సి ఉంటుంది. భారత్‌లో అసెంబుల్ అయిన తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వెల్లడించింది. 78 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల 500 కిలోల లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. బ్యాటరీపై ఎనమిదేళ్ల వారంటీ ఉంది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. 4.9 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ వీల్ డ్రైవ్, హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, కొలీషన్ మిటిగేషన్ సపోర్ట్ వంటి హంగులు ఉన్నాయి బుకింగ్ కోసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలు అక్టోబర్ నుంచి మొదలవుతాయి. -
వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!
సాక్షి,ముంబై: వోల్వో ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. XC40 రీఛార్జ్ ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధరను రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంచింది. పెట్రోల్‌వెహికల్ ఎక్స్‌సి 40తో పోలిస్తే రూ 1.40 లక్షలు ఎక్కువ. బెంగళూరు సమీపంలోని హోస్కోట్లోని వోల్వో యూనిట్లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది. ఇది వోల్వో వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గలకొనుగోలుదారులు రూ. 50వేలు చెల్లించి రేపటి(జూలై27)నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఎక్స్‌సీ40 రీఛార్జ్ 11kW వాల్-బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది.కారుపై మూడేళ్ల వారంటీతోపాటు, బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది. వోల్వో XC40 రీఛార్జ్ 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78kWh బ్యాటరీని ఈ కారులో అందించింది. 33 నిమిషాల్లో కారులో 10 నుండి 80 శాతం వరకు, 50kW ఫాస్ట్ ఛార్జర్‌తో సుమారు 2.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది. 418km పరిధితో, ఎక్స్‌సీ40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ "ట్విన్" వెర్షన్లో అందుబాటులో ఉంది, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408hp , 660Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్‌తో నడిచే XC40 కంటే దాదాపు రెండు రెట్లు శక్తివంతమైందనీ, లగ్జరీ ఆడి ఇ-ట్రాన్ 55 క్వాట్రో పోలి ఉందని భావిస్తున్నారు. 55.90 లక్షల ధరతో, XC40 రీఛార్జ్ ఒకవైపు మినీ కూపర్ ఎస్ఈ, BMW i4 , Kia EV6 వంటి లగ్జరీ ఈ-కార్లకు గట్టిపోటి ఇస్తుందని అంచనా. -
బీకాం చదువు.. యూట్యూబ్ వీడియోలు చూసి.. రోడ్డుపై..
బొమ్మనహళ్లి(బెంగళూరు): బీకాం పట్టభద్రుడు జైల్లో సహచరుడు, యూట్యూబ్ ద్వారా కార్ల దొంగతనాల్లో మెళకువలు తెలుసుకున్నాడు. కారు అలారం మోగకుండా పని ముగించేవాడు. ఖరీదైన కారు కనిపిస్తే మాయం చేసి అమ్ముకుని జల్సాలు చేసేవాడు. ఈ కార్ల దొంగ బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసుకు పట్టుబడ్డాడు. అతని నుంచి సుమారు రూ. 70 లక్షల విలువ చేసే 10 కార్లు, ఒక బైక్‌ను, చోరీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వరుస ఫిర్యాదులు రావడంతో ఆ దొంగ అరుణ్‌కుమార్ (32). ఇతడు పుట్టిపెరిగింది చిత్తూరు జిల్లాలోని పలమనేరు. బీకాం వరకు చదువుకుని నేరాల బాట పట్టాడు. ములబాగిలుకు వచ్చి అక్కడ అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఇటీవల పార్కింగ్ చేసి ఉన్న కార్లు చోరీ అవుతున్నట్లు యజమానులు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో పోలీసులు ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున హెచ్ఎస్ఆర్ లేఔట్ 5వ సెక్టర్లో ఉన్న టీచర్స్ కాలనీలో కారు చోరీ చేసి వేసుకెళ్తున్న దొంగ అరుణ్‌ను పట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ టూల్స్ సాయంతో అతన్ని విచారించగా నేర చరిత్ర బయటపడింది. ఇతనిపైన దోపిడీ, హత్య కేసులు ఉండటంతో కొన్ని రోజులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నాడు. అక్కడ జైల్లో పరిచయమైన కార్ల దొంగ రాకేష్ ద్వారా కార్లను సులభంగా ఎలా ఎత్తుకెళ్లవచ్చో తెలుసుకున్నాడు. అలాగే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడు. కొన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ సహాయంతో కారు అలారం మోగకుండా లాక్ తీసేవాడు. ఆ కార్లను తమిళనాడులోని తిరుచ్చి, తిరువన్నామలై, వేలూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాల్లో అమ్మేవాడు. ఆగ్నేయ డీసీపీ సి.కే.బాబు, ఏసీపీ సుధీర్, ఎస్ఐ మునిరెడ్డి ఈ కేసును విచారించారు. చదవండి: వాట్సప్‌లో పరిచయం ఆపై చనువు.. అప్పటి నుంచి అసలు కథ మొదలైంది! -
కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రొనాల్డోకు కార్లంటే యమా క్రేజ్. తన ఇంట్లోనే దాదాపు అన్ని మోడల్స్‌కు సంబంధించిన కార్లను కలెక్షన్గా కలిగి ఉన్నాడు. తాజాగా రొనాల్డోకు సంబంధించిన కోట్ల విలువైన కారు అయింది. 1.8 యూరో మిలియన్(భారత కరెన్సీలో దాదాపు రూ. 14 కోట్ల 87 లక్షలు) డాలర్ల విలువ కలిగిన బుగట్టి వెయ్రోన్ సూపర్ కార్ మేజర్ యాక్సిడెంట్‌కు గురయ్యింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సోమవారం స్పెయిన్‌లోని రొనాల్డో నివాసం ముందే కారు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మొదట రొనాల్డో కారులోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫుట్‌బాల్ స్టార్ ప్రస్తుతం హాలిడే గడపడానికి తన ఫ్యామిలితో కలిసి ఒక ఐలాండ్‌లో ఉన్నట్లు తెలిసింది. కాగా రొనాల్డో కారును తన డ్రైవర్ తీసుకెళ్లాడని.. కారును కంట్రోల్ చేయడంలో పట్టు కోల్పోవడంతో రొనాల్డో ఇంటి ముందు ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కానప్పటికి.. కారు ముందు భాగం మాత్రం బాగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు కారును ఆటోగ్యారెజ్కు తరలించారు. ఏ ఇతర వాహనము కారును యాక్సిడెంట్ చేయలేదని.. డ్రైవర్ తనంతట తానుగానే పట్టు తప్పడంతో కారుకు యాక్సిడెంట్ అయిందని పేర్కొనడంతో అతనిపై కేసు నమోదు చేశారు. కాగా రొనాల్డో ఎంతో ఇష్టపడి కొనుకున్న కారు రిపేరుకు సంబంధించిన బిల్ పెద్దదిగానే ఉండనుందని అభిమానులు కామెంట్స్ చేశారు. Cristiano Ronaldo 's Bugatti Veyron suffered an accident on Monday morning in Mallorca. Apparently Cristiano was not inside the vehicle. [@UHmallorca] #mufc pic.twitter.com/WtG5crWWsd — The United Stand (@UnitedStandMUFC) June 20, 2022 చదవండి: Neeraj Chopra: భారత్ స్టార్ నీరజ్ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం -
10 రాష్ట్రాల్లో 61 కేసులు.. ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి’
సాక్షి,హైదరాబాద్: అతడి పేరు సత్యేంద్ర సింగ్ షెకావత్...రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్మీ మాజీ జవాను కుమారుడు...ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేశాడు...కేవలం హైఎండ్ కార్లనే టార్గెట్‌గా చేసుకుని 2003 నుంచి చోరీలు చేస్తున్నాడు...ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో 61 నేరాలు చేసిన ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ ఐదు కేసులు ఉన్నాయి. షెకావత్‌ను ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని శుక్రవారం పీటీ వారెంట్‌పై తమ కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ అధికారులు విచారిస్తున్నారు. ► మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న పంచవటి పోలీసుస్టేషన్ పరిధి నుంచి 2003లో క్వాలిస్‌ను చోరీ చేయడంతో సత్యేంద్ర సింగ్ నేరచరిత్ర మొదలైంది. ప్రస్తుతం ఆడి, బీఎండబ్ల్యూ, స్కార్పియో వంటి అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే టార్గెట్ చేసే షెకావత్ వాటిని చోరీ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటాడు. ► కార్ల తాళాలు స్కాన్ చేయడానికి, వాహనం నంబర్ ఇతర వివరాల ఆధారంగా జీపీఎస్ ద్వారా దాని ఉనికి కనిపెట్టడానికి, మారు తాళాలు త యారు చేయడానికి అవసరమైన ఉపకరణాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఓ కారు ఇంజిన్ నంబర్, ఛాసిస్ నెంబర్ ఆధారంగా దాని తాళం తయారు చేయడం ఇతడికే సొంతం. ► ఇటీవల కాలంలో తాళం పెట్టాల్సిన అవసరం లేకుండా, అది దగ్గర ఉంటే చాలు స్టార్ట్ అయ్యే వాహనాలు వచ్చాయి. ఇలాంటి వాటిని చోరీ చేయడానికి షెకావత్ చైనా నుంచి ఖరీదు చేసిన ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ అనే పరికరం వాడతాడు. సదరు వాహనం ఆగిన వెంటనే డ్రైవర్ కిందికి దిగకుండానే దాని సమీపంలోకి వెళ్తాడు చదవండి: అయ్యా బాబోయ్! అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ.. ► డొంగల్తో కనెక్ట్ చేసి ఉండే ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ ద్వారా దాని ఫ్రీక్వెన్సీ రికార్డు చేస్తాడు. ఆ ఫ్రీక్వెన్సిని తన వద్ద ఉండే వీవీడీఐ మినీ కీటూల్ ద్వారా నకిలీ తాళంలోకి ఇన్‌స్టల్ చేస్తాడు. ఇలా తయారైన తాళం తన వద్ద ఉంచుకుని దర్జాగా కారుతో ఉడాయిస్తాడు. 2003 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, డయ్యూడామన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 58 వాహనాలు తస్కరించాడు. వీటితో పాటు రెండు దోపిడీ, ఓ ఆయుధ చట్టం కేసులు సత్యేంద్ర సింగ్‌పై ఉన్నాయి. ► బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్లో గతేడాది జనవరి 26న పంజా విసిరిన షెకావత్ దాని పార్కింగ్ లాట్ నుంచి కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వి.మంజునాథ్ కారు తస్కరించాడు. అప్పట్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఏప్రిల్‌లో నాచారంలో అడుగుపెట్టిన సత్యేంద్ర సింగ్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాహనం తస్కరించాడు. దీంతో ఆ పోలీసులు జైపూర్ వరకు వెళ్లారు. చోరీల్లో షెకావత్ భార్యకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసినప్పటికీ... పీటీ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించిన అక్కడి కోర్టు అమెకు బెయిల్ ఇచ్చింది. ఆ సందర్భంలో పోలీసులతో వీడియో కాల్లో మాట్లాడిన షెకావత్ ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి. నా భార్యను, కుటుంబాన్ని వేధించొద్దు’ అంటూ సవాల్ విసిరాడు. దీంతో అతడి కోసం అతడి కోసం గాలింపు ముమ్మరమైంది. ఈలోగా మరో మూడుసార్లు ఇక్కడకు వచ్చి వెళ్లిన షెకావత్ పేట్‌బషీరాబాద్, దుండిగల్ల్లో మూడు కార్లు ఎత్తుకుపోయాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. ఇతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చిన బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు విచారించనున్న ఈ అధికారులు చోరీ అయిన కారు రికవరీ చేయనున్నారు. షెకావత్ చోరీ చేసిన కార్లను విక్రయించి సొమ్ము చేసుకుంటాడని, ఆ సొమ్ముతో జల్సాలు చేస్తాడని పోలీసులు చెప్తున్నారు. -
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
-
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. వివరాలు జోధ్‌పూర్‌లోని రహదారిపై డ్రైవర్ అదుపు తప్పడంతో.. పలు ద్విచక్ర వాహనాల మీదకు కారు దూసుకెళ్లింది. బైకుల మీదకు దూసుకెళ్లిన కారు చివరికి రోడ్డు పక్కనున్న దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: వైరల్: తొలిసారి పిజ్జా తిన్న బామ్మ.. ‘అబ్బే బాలేదురా మనవడా’.. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటన దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని సీఎం వెల్లడించారు. మృతులకు సీఎం గెహ్లాట్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం బాధాకరమని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. చదవండి: చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్ -
బాలయ్యకు బహుమతిగా లగ్జరీ కారు, ఖరీదెంతంటే..!
Nandamuri Balakrishna Bentley Luxury Car Cost Goes Viral: నందమూరి బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖు తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ‘అన్‌స్టాపబుల్’ పేరుతో వస్తున్న టాక్ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ షో ప్రారంభ కార్యక్రమంలో ఆహా నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ షోకు బాలయ్య వచ్చిన లగ్జరీ కారు ఖరీదు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే సాధారణంగా బాలయ్యకు ఖరీదైన కార్లు అయినా, బైకులు అన్న పెద్దగా ఆసక్తి ఉండదు. చదవండి: ఆహా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో: బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నిత్యం ఆయన సినిమాలు లేదా రాజకీయాలతో బిజీగా ఉంటారు. ఇక ఖాళీ సమయంలో బసవతారకం హాస్పిటల్ పనులతో బిజీగా ఉంటారు. అలా సాదాసీదాగా ఉండే బాలకృష్ణ ఈ షోకు లగ్జరీ బెంట్లీ కారులో రావడంతో అందరి దృష్టి దానిపై పడింది. దీంతో కోట్లు ఖరీదు చేసే ఈ లగ్జరీ కారును బాలయ్య ఎప్పుడు కొన్నాడా? అని ఆరా తీయగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కారును బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చిందట. దీని ఖరీదు దాదాపు 4 కోట్ల నుంచి 4.5 కోట్లు వరకు ఉంటుందని అంచనా. చదవండి: విడాకుల అనంతరం దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతోన్న సామ్! ప్రస్తుతం కూతురు ఇచ్చిన కారులోనే బాలయ్య షికారు చేస్తున్నాడట. ఇక సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టే బాలయ్య బుల్లితెరపై తొలిసారిగా యాంకర్‌గా వస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తిగా నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారు, తొలి గెస్ట్ ఎవరా అని ప్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక అన్ స్టాపబుల్ పేరుతో వస్తున్న ఈ టాక్ షో 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. 12 ఎపిసోడ్లకు గాను ఆయన దాదాపు రూ. 5 నుంచి రూ. 6 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఈ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. చదవండి: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు -
రూ. 2కోట్ల ఖరీదైన కారు కొన్న హీరోయిన్
Kriti Sanon New Car: ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. దీని ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల ఉంటుందని సమాచారం. ప్రసుత్తం ఈ ఖరీదైన బహుమతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ కొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారు కృతీ కార్ల సేకరణకు అదనపు ఆకర్షణగా నిలిచింది. (చదవండి: ఆ రోజు ఆటోలో కూర్చోని బాగా ఏడ్చాను: కృతి సనన్) ‘మిమి’ సినిమా విజయంతో కృతీ సనన్ బాలీవుడ్లో సక్సెస్‌తో పాటు విమర్శకులు ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇన్నాళ్లు ఆమె పడిన శ్రమకు ‘మిమి’ సినిమాతో ఫలితం లభించింది. ఇక ‘ఆదిపురుష్’ వంటి క్రేజి ప్రాజెక్ట్‌కి సైన్ చేసి బాలీవుడ్ టాప్ హీరోయిన్లా జాబితాలో చేరారు కృతీ సనన్. (చదవండి: గర్భవతిగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోలు.. ఇప్పుడు) ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కృతీ సనన్ 'ఆదిపురుష్', 'బచ్చన్ పాండే,' భేదియా ',' గణపత్ ',' హమ్ దో హమారే దో 'తో పాటు మరికొన్ని పేర్లు ఖరారు చేయని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చదవండి: 'సీత'ను సెట్లోకి ఆహ్వానించిన ప్రభాస్ -
రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్ లంబోర్ఘిని, చరణ్ ఫెరారీ..
Jr NTR and Ram Charan RRR Set Wrapping up Video: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల అంత్యంత విలాసవంతమైన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఫిచర్స్‌తో తయారు చేసిన ఈ కారును ఖరీదు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా తారక్ నిలిచాడు. ఇటీవల ఇంటికి చేరుకున్న ఈ కారు ప్రస్తుతం రోడ్లపై షికారు చేస్తూ కనువిందు చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఉక్రెయిన్‌లో కీలక సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. దాదాపు మెయిన్ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్కడ పలు లిఫ్ట్అప్ సీన్స్‌ను చిత్రీకరణ జరుపుకుంటోంది. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి క్రేజీ అప్డేట్.. షూటింగ్ పూర్తి, కానీ..) ఈ నేపథ్యంలో గురువారం షూటింగ్లో పాల్గోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు షూటింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ టీం షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో తారక్ తన లంబోర్ఘిని కారులో ముందు రయ్యిమంటూ దూసుకుపోతుండగా.. వెనకానే చరణ్ తన ఫెరారీలో వెళుతున్నాడు. ఈ సీన్ అచ్చం రేసును తలపిస్తోంది. ఈ వీడియోకు ఆర్ఆర్ఆర్ టీం ‘టైగర్ వర్సెస్ చీతా’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. మూవీ టీం చెప్పినట్లుగానే ఈ వీడియోలో రెండు కార్లు టైగర్, చిరుతలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా కనువిందు చేశాయి. (చదవండి: అప్పుడే విలన్ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్ బాబు) తమ అభిమాన హీరోలు లగ్జరీ కారులో ఇలా వెళుతుండం చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కాగా దర్శక ధీరుడు రాజమమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తారక్ కోమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియాతో పాటు పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. TIGER and CHEETAH...🐅🐆 Leaving the set after wrapping up their last shot for the movie today!#RRRMovie @tarak9999 @alwaysramcharan pic.twitter.com/ttpthr8ifn — RRR Movie (@RRRMovie) August 26, 2021 -
లగ్జరీ కార్ల కేసు: ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న కార్లు ఇవే
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ కార్ల కేసుల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లను అధికారులు గుర్తించారు. అవి.. ► కిషన్ లోహియా (హురాకన్ లంబోర్గిని) ►నిశాంత్ సాబు (హురాకన్ లంబోర్గిని) ►అమీర్‌శర్మ (ఫెరారీ 488) ►సికిందర్ దారేడియా (హురకిన్ లంబర్గిని) ►ముజీబ్ (రోల్స్ రాయిసి) ►నితిన్‌రెడ్డి (ఫెరారీ) ►రాహుల్ (ఫెరారీ) ►నిఖిల్ (ఫెరారీ) చదవండి: హైదరాబాద్‌లో 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్, ఇదే తొలిసారి కాగా పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్ చేశారు. చదవండి: పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి పట్టుబడితే 200 శాతం కట్టాల్సిందే.. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో నమోదైన బైక్‌లు, కార్లు, తదితర వాహనాలు కనీసం నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఇక్కడ తిరిగితే తప్పనిసరిగా జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు స్వచ్ఛందంగా ఈ పన్ను చెల్లించాలి. కానీ చాలా మంది వాహనదారులు తాము పొరుగు రాష్ట్రాల్లో చట్టబద్ధంగానే వాహనాలను నమోదు చేసుకున్నట్లు భావించి ఇక్కడ చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు. ‘వాహనదారులే స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే నిబంధనల మేరకు వసూలు చేస్తాం. ఆర్టీఏ దాడుల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు పెనాల్టీల భారం పడుతుంది’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు తాజా దాడుల్లో లభించిన సమాచారం ఆధారంగా హైఎండ్ లగ్జరీ వాహనాలపైన దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు డీటీసీ పాపారావు తెలిపారు. అవసరమైతే వాహనదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అయితే హైదరాబాద్‌లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. -
BMW : ఎం5 కాంపిటీషన్... ఓన్లీ ఆన్లైన్ బుకింగ్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ ఆధునీకరించిన ఎం5 కాంపిటీషన్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.62 కోట్లు. 4.4 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్ 625 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 3.3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫీచర్స్ ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, మిర్రర్ క్యాప్స్, లేజర్ లైట్స్, ఆటోమేటిక్ టెయిల్ గేట్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అడ్జస్టేబుల్ సీట్స్, కొత్త షాక్ అబ్సార్బర్స్, ట్రాక్ మోడ్, సెంట్రలైజ్డ్ ఇంటెలిజెంట్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి హంగులు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఎం5 కాంపిటీషన్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి : సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు -
జోరుమీదున్న బీఎమ్‌డబ్ల్యూ 5 సీరీస్
ముంబై: జర్మనకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎమ్‌డబ్ల్యూ గురువారం 5 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.62.90 లక్షలు, రూ.63.90 లక్షలు, 71.90 లక్షలుగా ఉన్నాయి. 6.1 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ ఈ కార్లలో బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్ వేరియంట్ 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 5200 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 252 హెచ్‌పీని, 4800 ఆర్పీఎం 350 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 5 సిరీస్‌కి చెందిన కార్లకు ఇండియాలో మంచి ఆధరణ లభిస్తుండటంతో బీఎండబ్ల్యూ వరుసగా వేరియంట్లను రిలీజ్ చేస్తోంది. చదవండి : లాక్డౌన్లు ఎత్తేస్తే.. టూర్లకు రెడీ -
ఆడి నుంచి ఈ - ట్రోన్ ఎస్యూవీ
వెబ్‌డెస్క్ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి నుంచి ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి రానుంది. ఈ ట్రోన్ పేరుతో తొలి ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌కి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో క్రమంగా అన్ని మేజర్ కార్ల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ ట్రోన్ పేరుతో ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారుని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది ఆడి సంస్థ. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర ఎంతనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్ కారుని న్యూ ఏజ్ లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ EQC, జాగ్వర్ ఐ పేస్ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే పోర్షే, వోల్వో, లాండ్ రోవర్ సంస్థలు కూడా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. చదవండి: ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం! -
లగ్జరీ కారు కొన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్
బిగ్‌బాస్ రియాలిటీ షో సెలబ్రిటీలను ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. అలా వారి పాపులారిటీని పెంచడంతో పాటు మంచి పారితోషికాన్ని కూడా ముట్టచెప్పుతుంది. ఇక షో ముగిశాక బయటకు వచ్చిన సెలబ్రిటీలకు మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. తాజాగా హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో పాల్గొన్న మను పంజాబీ కూడా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన స్వాంకీ కారును సొంతం చేసుకున్నాడు. కొత్త కారులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మంచి బ్రాండెడ్ కారుకు ఓనర్‌గా ఉండాలని నా చిన్నప్పుడు కలలు కంటుండేవాడిని. మరీ ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే మెర్స్ కారు కొనాలనుకునేవాడిని. ఆ కల ఇప్పుడు నెరవేరింది. కానీ ఈ సమయంలో అమ్మ ఉంటే ఈ సెలబ్రేషన్స్ రెట్టింపయ్యేవి. అయితే ఈ కారు కొనాలంటే ఎంత ఖర్చవుతుందో నాకు బాగా తెలుసు. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూశా. ఇప్పుడు నాకు ఆర్థిక సమస్యలేవీ లేవు. అందుకే ఇదే కరెక్ట్ టైమ్ అని భావించి కారు కొనుక్కుని నా కల నిజం చేసుకున్నాను. అంతే తప్ప ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం కాదు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడు ఓ మ్యూజిక్ వీడియో చేస్తున్నాడు. దీంతో పాటు ఓ సినిమా ఆఫర్ సైతం చేజిక్కించుకున్నట్లు సమాచారం. చదవండి: బిగ్‌బాస్ రన్నర్‌కు సల్మాన్ ఖాన్ గిఫ్ట్ గ్లామర్ డోస్ పెంచిన లావణ్య.. హీటెక్కిస్తున్న ‘బద్రి’ భామ -
ఆడి నయా వర్షన్ అదరహో
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత విపణిలోకి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ సెడాన్ కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది. భారత్‌లో ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్‌ను 2017 లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్5 నయా మోడల్ అప్డేటెడ్ వర్షన్‌గా రానుంది. దీని ధర రూ. 79.06 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మరింత ఆకర్షణీయమైన ఔటర్ డిజైనే కాకుండా, అప్డేట్ చేసిన క్యాబిన్‌తో రానుంది. కార్ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే , ప్రస్తుత డిజైన్ స్పోర్టి లూక్‌తో రానుంది. ట్వీక్డ్ ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది, అంతేకాకుండా షార్ప్‌గా కనిపించే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటుగా , డే టైమ్ రన్నింగ్ లైట్లతో( డిఆర్ఎల్) అమర్చారు. క్వాడ్-టిప్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. కారు ఇంటిరియల్స్లో భాగంగా 10 అంగుళాల టచ్ స్క్రీన్ రానుంది. కారుకు 354 హార్స్‌పవర్‌ను అందించగల 3.0-లీటర్ ట్విన్-టర్బో, వి 6 పెట్రోల్ ఇంజన్ తో పాటు వస్తోంది. దీంతో కారుకు 500 ఏన్ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తోంది. స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌లో భాగంగా 8-స్పీడ్ టిప్ట్రోనిక్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకుంటుంది. ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ టాప్ స్పీడ్ 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కారులో డైనమిక్, కంఫర్ట్, ఎఫిషియెన్సీ, ఆటో, ఇండివిజువల్‌తో సహా ఐదు డ్రైవింగ్ మోడ్‌లను ఏర్పాటు చేశారు. మెర్సిడెస్-ఎఎమ్‌జి సి 43, మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 ఎఎమ్‌జి, బీఎండబ్ల్యూ ఎం 340 ఐ వంటి ఇతర లగ్జరీ కార్లతో ఆడి ఎస్ 5 పోటీపడనుంది. (చదవండి: బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్.. రేటు ఎంతంటే? ) -
మెర్సిడెస్ బెంజ్ నుంచి మరో రెండు కార్లు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ సంస్థ నేడు 2021 జీఎల్‌సీని మోడల్ ని భారతదేశంలో 57.40 లక్షల ధరతో లాంచ్ చేసింది. 2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిలో ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ మసాజ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరాతో పార్కింగ్ ప్యాకేజీ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. 2021 మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ మోడల్ జీఎల్సీ 200, జీఎల్సీ 220డీ 4 మాటిక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీఎల్సీ 200 4-సిలిండర్ 2.0-లీటర్ ఎం264 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 197 హెచ్‌పి గరిష్ట శక్తిని, 320ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే జీఎల్సీ 220డి 4 మ్యాటిక్ 4 సిలిండర్ 2.0-లీటర్ ఓఎమ్654 డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 194హెచ్‌పి గరిష్ట శక్తిని, 400ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు మోటార్లు 9 జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడ్డాయి. జీఎల్సీ 200 7.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అదే జీఎల్సీ 220డి 4 మాటిక్ 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 2021 జిఎల్సి 200 ఇండియాలో ఎక్స్-షోరూమ్ ధర రూ.57.40 లక్షలు కాగా.. అదే జీఎల్సీ 220డి 4 మాటిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.57.40 లక్షలుగా ఉంది. మెర్సిడెస్ 2021 జీఎల్సీ నావిగేషన్ సిస్టమ్, అలెక్సా హోమ్, గూగుల్ హోమ్, పార్కింగ్ స్థానాలను కనుగొనే సరికొత్త 'మెర్సిడెస్ మి కనెక్ట్' టెక్నాలజీని కలిగి ఉంది. క్లాసిక్, ప్రోగ్రెసివ్ మరియు స్పోర్టి డిస్ప్లే ఎంపిక గల ఆల్-డిజిటల్ 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు 2021 జిఎల్‌సిలో మసాజ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ సీట్లను తయారు చేశారు. ఇందులో ఉన్న మీడియా ద్వారా మసాజ్ ఫంక్షన్లను సర్దుబాటు చేసుకోవచ్చు. మిడ్-సైజ్ లగ్జరీ ఎస్యూవీ 360 డిగ్రీల కెమెరా, రివర్సింగ్ కెమెరాతో పాటు మూడు అదనపు కెమెరాలను కలిగి ఉంది. 'మెర్సిడెస్ మి' యాప్ సహాయంతో 2021 మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ ఇంజిన్‌ను ఆటోమేటిక్ గా స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఇందులో ఉన్న 2021 జీఎల్సీ నావిగేషన్ సిస్టమ్ ద్వారా మనం కారును ఎక్కడ పార్క్ చేసామో సులభంగా తెలుసుకోవచ్చు. 'మెర్సిడెస్ మి' యాప్ సహాయంతో వాహనాన్ని లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం, దాని హెడ్‌ల్యాంప్‌లు మెరుస్తూ, కిటికీలు, సన్‌రూఫ్‌లను తెరవడం లేదా మూసివేయడం వంటివి ఆటో మెటిక్ గా మనం ఆపరేట్ చేయవచ్చు. 2021 మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ రెండు కొత్త బ్రిలియంట్ బ్లూ, హైటెక్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. -
కొత్త ఆడి A4.. జనవరి 5న విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో లగ్జరీ కార్ల విభాగం మరింత వేడెక్కనుంది. ఈ విభాగంలో ఆడి A4 సెడాన్ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే రూ. 2 లక్షల టోకెన్ అడ్వాన్స్‌తో దేశీయంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆడి డీలర్లు, అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 5న ఆడి కొత్త A4 సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తో్ంది. 2 లీటర్ల పెట్రోల్ టీఎఫ్ఎస్ఐ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు వేరియంట్స్ రూ. 42-48 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరలలో లభించనున్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. నిజానికి ఈ ఏడాది(2020)లో ఆడి పలు మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. A8 L, Q2, Q8, Q8 సెలబ్రేషన్, ఆర్ఎస్ Q8, ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ కార్లతో సందడి చేసింది. చదవండి: (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) ఎడ్జస్టబుల్ సీట్స్ కొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్లలో A4 రూపొందింది. లెడ్ హెడ్‌ల్యాంప్స్, లెడ్ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు బంపర్‌ను సైతం అప్డేట్ చేసింది. కేబిన్‌లో 10.1 అంగుళాల ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునేందుకు వీలయ్యే సీట్లు, 3 జోన్ క్లయిమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, యాంబియెంట్ లైటింగ్, వైర్లెస్ చార్జింగ్, సన్‌రూఫ్‌తోపాటు 8 ఎయిర్‌బ్యాగ్స్‌తో A4 సెడాన్ వెలువడనున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. గరిష్టంగా 190 బీహెచ్పీ పవర్‌ను అందుకోగల, 7స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్ ఫీచర్స్‌తో వెలువడనుంది. 7.3 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్నిఅందుకోగలదని అంచనా. కాగా.. లగ్జరీ సెడాన్ విభాగంలో మెర్సిడీస్ బెంజ్ C-క్లాస్, బీఎండబ్ల్యూ 3 సిరీస్, జాగ్వార్ ఎక్స్ఈలతో A4 పోటీ పడగలదని ఆటో నిపుణులు పేర్కొన్నారు. కొత్తగా విడుదలకానున్న వోల్వో S60కు సైతం పోటీగా నిలిచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
లంబోర్గిని లగ్జరీ కారులో రజనీ
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ లగ్జరీ కార్ల ప్రేమికుడన్న విషయం తెలిసిందే. లంబోర్గిని కారును రజనీ స్వయంగా నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖానికి మాస్క్ ధరించి కారును డ్రైవ్ చేస్తున్నారు రజనీ. ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రపంచంలో అత్యంత వేగంవంతమైన కార్లలో ఒకటి. సాధారణమైన తెల్లని కుర్తా పైజామా ధరించి తనదైన స్టైల్లో లంబోర్గిని కారును నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు సూపర్ స్టార్. ఇక అత్యంత ఖరీదైన ఈ కారును కరోనా వైరస్ సంక్షోభం ముందు కొనుగోలు చేశారా? ఇటీవల కొనుగోలు చేశారా? అనే దానిపై స్పష్టత లేదు. ఓ తమిళ నిర్మాత తనను ఇంటికి తిరిగి వెళ్లడం విషయంలో తీవ్రంగా అవమానించిన విషయాన్ని ‘దర్బార్’ ఆడియో వేడుకలో రజనీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తనను కారు కొనేలా ప్రేరేపించిందని తెలిపారు. (సెట్లోకి సై) ప్రస్తుతం రజనీ వద్ద ప్రీమియర్ పద్మిని, అంబాసిడర్, మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రోల్స్ రాయిస్ ఘోస్ట్ వంటి సూపర్ కార్లు ఉన్నాయి. బాలీవుడ్లో లంబోర్గిని సూపర్ కారును రోహిత్ శెట్టి, రన్వీర్ సింగ్ కలిగి ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా రజనీకాంత్ ఇంటికే పరితమైయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో ఓ సినిమా ఆరంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రానికి ‘అన్నాత్తే’ అని టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. అంటే.. ‘అన్నయ్య’ అని అర్థం. అయితే లాక్డౌన్ ముందు వరకూ జరిపిన షెడ్యూల్స్‌లో 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. (నువ్వంటే నేను) -
అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఇండియా మరోకొత్త లగ్జరీకారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 8 సిరీస్ లో భాగంగా గ్రాన్ కూపే. ఎం8 కూపే పేర్లతో వీటిని లాంచ్ చేసింది. అయితే గ్రాన్ కూపే రెండు వేరియంట్లలో ప్రారంభించింది. వీటి ధరలు రూ. 1.29-1.55 కోట్లుగా నిర్ణయించింది. 'ఎం 8 కూపే' పేరుతో తీసుకొచ్చిన అతి ఖరీదైన అతి విలాసవంతమైన కారు ధర రూ.2.15 కోట్లుగా నిర్ణయించింది. దీంతో కంపనీకి సంబంధించి ఇదే అతి ఖరీదైన కారుగా నిలిచింది. కంపెనీ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన అత్యంత శక్తివంతమైన 8 సిలిండర్ ఇంజన్లలో ఇది ఒకటి అని బీఎండబ్ల్యూ తెలిపింది. కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల తరువాత స్థానిక సంబంధిత అధికారుల అనుమతితో దేశీయంగా చెన్నైప్లాంట్ లోఉత్పత్తిని శుక్రవారం తిరిగి ప్రారంభించినట్టు ప్రకటించింది. గ్రాన్ కూపే : 3 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. ఇది 340 హెచ్‌పీ పవర్, 1600- 4500 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5.2 సెకన్లలో 0 -100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. (షావోమి ఎంఐ10 లాంచ్, ఫీచర్లు ఏంటంటే..) ఎం8 కూపే : ట్విన్ టర్బో 4 లీటర్ 8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 600 హెచ్‌పీ పవర్ ను, 750 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ 1,800 - 5,600 ఆర్‌పిఎమ్ వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో 0 -100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రెండు అత్యంత డైనమిక్ టర్బోచార్జర్లు, హై-ప్రెజర్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇతరప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. రెండు కార్లలోను 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, అటెన్టినెస్ అసిస్టెంట్ ,డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్సి) వంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. అలాగే ఆటో హోల్డ్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, వెనుక భాగాన రెండు ఔటర్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లను కూడా జోడించింది. -
అత్యంత ఖరీదైన లగ్జరీ కారు..ఇది ఎవరికి సొంతం?
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణంచే కార్లలో ఒకటైన బుగాటి ఒక కొత్త లగ్జరీ కారును లాంచ్ చేసింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుగా పేరొందిన ఈ కారు ధర సుమారు రూ. 88కోట్లు (12.47మిలియన్ల డాలర్లు). 2019 జెనీవా మెటార్ షోలో బుగాటి ‘లా వోయర్ నోయర్’ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. 16 సిలిండర్ ఇంజీన్‌తో ఎలిగెంట్లుక్లో ఆకట్టుకుంటున్న ఈ ఖరీదైన కారును జర్మనీకారు మేకర్ ఫోక్స్ వ్యాగన్ మాజీ ఛైర్మన్ ఫెర్డినాండ్ పీచ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. -
రోల్స్ రాయిస్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి
బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీదారు రోల్స్ రాయిస్ భారతదేశంలో మరో న్యూ మోడల్ కారును మన మార్కెట్లోకి తీసుకొచ్చింది. కలినన్ ఎస్యూవీ ధరను భారతదేశంలో రూ .6.95 కోట్ల (ఎక్స్ షోరూం, ఇండియా) ధరగా నిర్ణయించింది. రోల్స్ రాయిస్ కొత్త ఎస్‌యూవీని 'లగ్జరీ ఆర్కిటెక్చర్' గా నిర్మించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రంగా చెప్పుకునే కలినన్ డైమండ్ పేరుతో 'రోల్స్ రాయిస్ కలినన్'ను విడుదల చేసింది రోల్స్ రాయిస్. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాస్ట్లీ ఎస్యూవీ కూడా ఇదేనని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ కారును తయారుచేశామని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా 'ఎవ్రీవేర్' మోడ్ ఆప్షన్ ద్వారా ఇసుక, మట్టి, తడిగడ్డి, కంకరరోడ్డు, మంచురోడ్డు ఇలా దేనిమీదైనా ఈ కారును ఏమాత్రం కుదుపులు లేకుండా, హాయిగా నడపొచ్చని పేర్కొంది. ఫీచర్లు 6.75 లీటర్ల వీ 12 ఇంజిన్, 653 బీహెచ్పీ శక్తిని, 850 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డాష్‌బోర్డుపై టచ్‌స్క్రీన్‌తో పాటు ముందు సీట్ల వెనుక కూడా 12 అంగుళాల టచ్స్క్రీన్లను ఏర్పాటుచేశారు. 22 అంగుళాల అల్లోయ్ వీల్స్ జోడించింది. అలాగే వెనుకవైపు సీట్ల కింద బూట్లో రెండు ఇన్నర్ బెంచీలను ఏర్పాటుచేశారు. కావాలనుకుంటే వాటిని బయటకు లాగి కుర్చీల్లా మార్చుకోవచ్చన్నమాట. -
అనుష్క శర్మ కొత్త కారు: ధర వింటే
సాక్షి, ముంబై: వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కొత్త లగ్జరీకారును సొంతం చేసుకున్నారట. అతి విలాసవంతమైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (లాంగ్‌వీల్ బేస్) కారును ఖరీదు చేసినట్టు తెలుస్తోంది. ఈ అల్టిమేట్ లగ్జరీ ఎస్యూవీ ధర సుమారు. 4కోట్ల రూపాయలు. సూయి ధాగా, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లోని నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు అనుష్క. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్‌తో జతగా నటిస్తున్న ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. అనుష్క ఈ మూవీలో సైంటిస్టుగా ఒక చాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నారు. కాగా ఇటీవల సింగపూర్‌లో మేడం టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను అనుష్క ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
బీఎండబ్ల్యూ కొత్త కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్త కారును లాంచ్ చేసింది. ‘ఎం2 కాంపిటీషన్’ పేరుతో గురువారం ఈ లగ్జరీ కారును విడుదల చేసింది. దీని ధర రూ.79.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. తక్షణమే భారతదేశంలో అన్ని బీఎండబ్ల్యూ డీలర్ల వద్ద పెట్రోల్ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఎం2 కాంపిటీషన్లో మూడు లీటర్ల ఆరు సిలిండర్ పెట్రోల్ ఇంజీన్‌ను అమర్చింది. 4.2 సెకన్లలో 100కి.మీ., గరిష్టంగా గంటకు 250 కి.మీ వేగం అందుకుంటుంది. Introducing the all new BMW M2 Competition. Precision redefined. Know more at : https://t.co/Ir4SnIqoTl pic.twitter.com/mGWwTzsPMO — BMW India (@bmwindia) November 15, 2018 -
పోలీసులకు లొంగిపోయిన అమలాపాల్
చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పన్ను ఎగవేత విషయంలో అమలాపాల్ కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తప్పుడు చిరునామాను వినియోగించి గతేడాది ఆమె రూ. కోటి విలువజేసే కారును కొనుగోలు చేశారు. దీంతో రూ. 20 లక్షల పన్ను ఎగవేసినందుకు కేరళ పోలీసులు అమలాపై కేసు నమోదు చేశారు. కేసు నమోదుతో షాక్‌కు గురైన ఆమె.. కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం ముందు పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ స్టేషన్లో అమలా లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాను కలిసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. -
‘మెర్సిడెస్’దే లగ్జరీ కార్ మార్కెట్..
న్యూఢిల్లీ: దేశీ లగ్జరీ కార్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన హవా కొనసాగిస్తోంది. వరుసగా మూడోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పలు సవాళ్లను అధిగమించి మరీ 2017లో ఏకంగా 15,330 కార్లు, ఎస్‌యూవీలను విక్రయించింది. కంపెనీ కార్ల విక్రయాలు 2016లో 13,231 యూనిట్లుగా ఉన్నాయి. అంటే వార్షిక ప్రాతిపదికన 15.86 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనికి కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ బాగా దోహదపడింది. మెర్సిడెస్ ప్రత్యర్థులైన బీఎండబ్ల్యూ, ఆడి కార్ల విక్రయాలను ఒకసారి పరిశీలిస్తే... 2017లో బీఎండబ్ల్యూ గ్రూప్ విక్రయాలు 9,800 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2016లో 7,861 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇక ఆడి కార్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 7,720 యూనిట్ల నుంచి 7,876 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) విక్రయాలు 3,954 యూనిట్లుగా ఉన్నాయి. 2016లో దీని అమ్మకాలు 2,653 యూనిట్లు. అంటే 49 శాతం వృద్ధి నమోదయ్యింది. ‘గతేడాదిలో పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంది. అయినా మేం రికార్డ్ స్థాయిలో 15,330 యూనిట్లను విక్రయించాం’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్ ఫోల్గర్ చెప్పారు. జీఎస్టీ అమలు తర్వాత పన్ను రేట్లలో మార్పులు చేయడం వల్ల లగ్జరీ విభాగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. దేశీ లగ్జరీ కార్ల విభాగంలో దాదాపు 40 శాతం మార్కెట్ వాటాను తాము సాధించినట్లు ఆయన తెలియజేశారు. కంపెనీ విక్రయాలు 2017 2016 వృ/క్షీ మెర్సిడెస్ బెంజ్ 15,330 13,231 16 బీఎండబ్ల్యూ 9,800 7861 25 ఆడి 7,876 7,720 2 జేఎల్ఆర్ 3,954 2,653 49 -
లగ్జరీ కారు వీరంగం
సాక్షి, చెన్నై: కెథడ్రల్ రోడ్డులో అర్థరాత్రి సమయంలో ఓ లగ్జరీ కారు వీరంగం సృష్టించింది. ఆటోస్టాండ్ వైపుగా ఆ కారు దూసుకురావడంతో ఓ డ్రైవర్ మరణించాడు. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మత్తుకు చిత్తైన సంపన్నుల పిల్లలు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వేలూరు జిల్లా అరక్కోణంకు చెందిన రాజేష్ (38) చెన్నైలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి పోయెస్ గార్డెన్ సమీపంలోని కెథడ్రల్ రోడ్డులోని స్టాండ్‌లో ఆటోను పార్క్ చేశాడు. సహచర డ్రైవర్లతో కలిసి ఆటోలో కూర్చుని పిచ్చాపాటి కబుర్లలో మునిగాడు. ఈ సమయమంలో ఓ లగ్జరీ కారు నుంగంబాక్కం నుంచి మెరీనా వైపుగా దూసుకొచ్చింది. అదుపుతప్పిన ఈ కారు పోయెస్ గార్డెన జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొంది. పెద్ద శబ్దం రావడంతో ఆటోలో ఉన్న డ్రైవర్లు తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగింది. అతి వేగంగా ఆటో స్టాండ్ వైపుగా ఆ కారు దూసుకొచ్చి సమీపంలోని గోడను ఢీకొట్టి ఆగింది. క్షణాల్లో పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. అరుపులు కేకలతో ఆర్తనాదాలు మొదలయ్యాయి. అటు వైపుగా వెళ్తున్న వారు ప్రమాదంపై అడయార్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్లను చికిత్స నిమిత్తం రాయపేట ఆస్పత్రికి తరలించారు. అతి వేగంగా కారును నడపడమే కాకుందా తప్పించుకునే యత్నం చేసిన యువకుల్ని కారు సహా అటు వైపుగా వెళ్తున్న వారు బంధించారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజేష్ సంఘటన స్థలంలోనే మరణించాడు. తిరుమలై(38), మోహన్(31), బాబు(42), బాలు(50)తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆరు ఆటోలు ధ్వంసం అయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. తొలుత కేసును అడయార్ పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. తదుపరి అన్నా సమాధి పోలీసులకు అప్పగించారు. అతి వేగంగా దూసుకొచ్చిన కారులో ఐదుగురు యువకులు ఉన్నట్టు గుర్తించారు. 19 నుంచి 22 ఏళ్ల వయస్సులోపు ఉన్న ఆ యువకులు నుంగంబాక్కంలోని ఓ కళాశాల్లో చదువుకుంటున్నట్టు తెలిసింది. వారు మద్యం తాగి మెరీనా తీరం వైపుగా కారులో దూసుకు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని విచారణలో తేలింది. కారు నడిపిన అహ్మద్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఉన్న హరికృష్ణ, కృష్ణకుమార్, విశాల్ రాజ్‌కుమార్, వినోద్ కుమార్‌లకు రాయపేట ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. -
గుర్మీత్ డేరాలో సోదాలు
⇔ లగ్జరీ కారు, పాత కరెన్సీ స్వాధీనం సిర్సా: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ ఆశ్రమం డేరా సచ్ఛా సౌదాలో రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి ఏకేఎస్ పవార్ నేతృత్వంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నంబర్ ప్లేట్ లేని ఓ లగ్జరీ కారు, ఓబీ వ్యాను, రూ.7 వేలు విలువైన రద్దైన నోట్లు, మరో రూ.12 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు హరియాణా సమాచార, ప్రజాసంబంధాల డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మిశ్రా మీడియాకు తెలిపారు. పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలతో నిర్వహించిన సోదాలను వీడియో తీసినట్లు పేర్కొన్నారు. ఆశ్రమం లో పలు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని గదులను సీల్ చేసినట్లు పేర్కొన్నారు. సిర్సాకు చేరుకున్న ఫోరె న్సిక్ నిపుణులు పలు ఆధారాలు సేకరించి నట్లు వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడడా నికి సిర్సాలో ఈ నెల 10 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశామ న్నారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికను హైకోర్టుతో పాటు హరియాణా ప్రభుత్వానికి సమర్పించ నున్నట్లు వెల్లడించారు. -
మెర్సిడెస్ కొత్త ఈ-క్లాస్ ఎడిషన్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఈ-క్లాస్ సెడాన్ మోడల్లోనే కొత్త వెర్షన్ ‘ఎడిషన్ ఈ’ ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ‘ఈ200’, ‘ఈ250 సీడీఐ’, ‘ఈ350 సీడీఐ’ అనే మూడు వేరియంట్లలో లభ్యంకానున్నది. వీటి ధరలు వరుసగా రూ.48.60 లక్షలుగా, రూ.50.76 లక్షలుగా, రూ.60.61 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ పుణేవి. ఈ200 వేరియంట్లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఈ250 సీడీఐలో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, ఈ350 సీడీఐలో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ మూడు వేరియంట్లలోనూ 7 స్పీడ్ ఆటోమేటిక్ స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ-క్లాస్ మోడల్ ఉత్పత్తి ప్రారంభమై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా కంపెనీ కొత్త ‘ఎడిషన్ ఈ’ వెర్షన్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో ఈ-క్లాస్ మోడల్ తయారీ 1995లో ప్రారంభమైంది. మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన లగ్జరీ కారు ఇదే. -
మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఏఎంజీ సి63 ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.1.3 కోట్లని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ తెలిపింది. ఏఎంజీ క్లాస్‌లో భారత్‌లో తాము అందిస్తున్న పదో మోడల్ ఇదని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో లభించే ఈ 4.0 లీటర్ వీ8 బై-టర్బో ఇంజిన్ కారు ఇంతకు ముందటి మోడళ్లతో పోల్చితే 32 శాతం అధిక మైలేజీనిస్తుందని వివరించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకుంటుందని తెలిపారు. పెర్ఫామెన్స్ కార్ల సెగ్మెంట్లో ఈ కారుతో తమ స్థానం పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
లగ్జరీ కారులో.. హాయిగా షికారు!
లగ్జరీ కారులో షికారుకెళ్లాలంటే లక్షలకు లక్షలు డబ్బులు పోసి కారు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన మహా నగరంలో లగ్జరీ కార్లు అద్దెకు దొరుకుతున్నాయి. స్వయంగా కారును నడుపుకుంటూ, కుటుంబ సభ్యులతో ఎంచక్కా షికారుకెళ్లవచ్చు. లగ్జరీ కారును నడిపామన్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. పైగా కొన్న కారు అయితే ఒకటే ఉంటుంది. అదే అద్దె కారయితే నెలకొకటి చొప్పున అన్ని లగ్జరీ కార్లలోనూ చక్కర్లు కొట్టవచ్చు కదా! ఖరీదైన కార్లను తామే నడుపుతూ ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఆరాట పడుతున్న వారి సంఖ్య నగరంలో రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ ఆడి, జాగ్వార్, మెర్సీడిస్, ల్యాండ్‌రోవర్, బెంజ్ తదితర లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఈ తరహా లగ్జరీ కార్ల ఖరీదంతా కోట్లలోనే ఉంటుంది. అయితే సామాన్య, మధ్య తరగతి జీవి కూడా ఈ లగ్జరీ కారు ప్రయాణాన్ని సెల్ఫ్డ్రైవ్లో ఆస్వాదించేందుకు ఇప్పుడు నగరంలో అవకాశం ఉంది. మెట్రో నగరంలో పెరుగుతున్న ‘సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్’ ట్రెండ్‌పై ప్రత్యేక కథనం... బెంగళూరు: మహేష్...నగరంలోని ప్రముఖ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఖరీదైన ఆడి సిరీస్ కారులో సెల్ఫ్‌డ్రైవ్ చేసుకుంటూ వీకెండ్స్‌లో రైడ్‌కు వెళ్లాలనేది మహేష్ కోరిక. కానీ అతనికి వచ్చే ఆదాయం కారణంగా లగ్జరీ ఆడి కారును కొనే స్థోమత మహేష్‌కు లేదు. అందుకే నగరంలోని ఓ ట్రావెల్స్ సర్వీసును ఆశ్రయించాడు. ఎంచక్కా వీకెండ్లో ఓ కారును అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి సెల్ఫ్‌డ్రైవ్ చేస్తూ విలాసవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాడు. వ్యాపార విస్తరణలో భాగంగా... ట్రావెల్ ఏజన్సీలు అద్దెకు కార్లను ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ అద్దె కార్లను ఆయా సంస్థలకు చెందిన డ్రైవర్లే నడిపేవారు. అయితే ట్రావెల్ ఏజన్సీ తరఫున పనిచేసే డ్రైవర్లు లేకుండా సెల్ఫ్‌డ్రైవింగ్ కోరుకునే వారికి కార్లను అద్దెకు ఇవ్వడం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ప్రస్తుతం ఉద్యాననగరిలోని అనేక మంది ఉద్యోగులు సెల్ఫ్డ్రైవింగ్ని ఆస్వాదించాలనుకోవడమే ఇందుకు కారణం. అంతేకాక తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఆలోచన కూడా ట్రావెల్ ఏజన్సీలను ఈ దిశగా నడిపిస్తోంది. వారాంతాల్లో తమ కుటుంబంతో లేదా మనసైన వారితో లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లాలనుకునే వారంతా ప్రస్తుతం ఈ తరహా లగ్జరీ అద్దె కార్లను ఆశ్రయిస్తుండడంతో నగరంలో సెల్ఫ్‌డ్రైవింగ్ రెంటల్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇక నగరంలోని ఐటీ ఉద్యోగులు చాలా మంది వారాంతాల్లో విహారం కోసం ఈ తరహా సెల్ఫ్‌డ్రైవింగ్ సదుపాయం గల అద్దె కార్లను ఆశ్రయిస్తుండడంతో వారాంతాల్లో అద్దె కార్లకు మరింత డిమాండ్ ఏర్పడుతోంది. ప్రత్యేక ‘సమ్మర్ హాలిడే’ ప్యాకేజీలు కూడా... సాధారణంగా ట్రావెల్ ఏజన్సీలు ఈ తరహా అద్దె కార్లకు రోజుకు చొప్పున అద్దెను వసూలు చేస్తుంటాయి. అయితే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలోని ట్రావెల్ ఏజన్సీలు తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వేసవి సమయంలో కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లడానికి వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు కార్లను అద్దెకు తీసుకునే వారికి చెల్లించాల్సిన మొత్తంపై సబ్సిడీలు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంపై నగరానికి చెందిన ఓ ట్రావెల్ ఏజన్సీలో పనిచేస్తున్న అభిషేక్ మాట్లాడుతూ...‘వేసవి సమయంలో దూర ప్రాంతాలకు కుటుంబంతో విహారయాత్రలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాం. ప్రస్తుతం నగరంలో చాలా మంది బస్‌లు, రైళ్లలో విహారయాత్రలకు వెళ్లడం కంటే తమ సొంత కార్లో వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. తద్వారా తమకు నచ్చిన సమయంలో నచ్చిన ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చనేది వారి ఆలోచన. అందువల్ల ఈ వేసవి సెలవుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్‌కి డిమాండ్ మరికాస్తంత పెరిగింది’ అని చెప్పారు. కొంత మొత్తం డిపాజిట్‌గా... ఏదైనా ట్రావెల్ ఏజన్సీ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ విభాగంలో కార్‌ను అద్దెకు తీసుకోవాలంటే ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు తీసుకునే కారు ధరను బట్టి ఈ మొత్తం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. అంతేకాక కారు అద్దెకు తీసుకునే వారి డ్రైవింగ్ లెసైన్స్, డ్రైవింగ్‌లో ఉన్న అనుభవాన్ని తెలిపే ఐడీ కార్డులు, గుర్తింపు కార్డులను ట్రావెల్ ఏజన్సీలో అందించాల్సి ఉంటుంది. ఇక మిగతా ఒప్పంద పత్రాలు ఆయా సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. -
కుర్రకారు
కారు.. నాడది స్టేటస్ సింబల్. నేటి మెట్రో లైఫ్స్టైల్లో కొందరికది నీడ్! అయితే, ఏదో బ్రాండ్.. ఒక కారుంటే చాలు అనుకునే జనరేషన్ కాదిది. ఈతరం యువత.. తమకెలాంటి కారు కావాలో పేరెంట్స్‌కి చెబుతోంది. లగ్జరీయస్ కార్లకు ఓటేయిస్తోంది. సో.. కార్ల యూసేజ్ ఏజ్ గ్రూప్ మారి సేల్స్‌కు అమాంతం బూమ్ వచ్చింది. - హనుమా పదిపన్నెండేళ్ల కిందటి రోజులతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ ఆలోచనా ధోరణి మారింది. అప్పట్లో యాభై ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా కార్లు కొనేవారు. పైగా ఎటువంటి కారు కావాలో ఇంటి పెద్దే నిర్ణయించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తి భిన్నం. ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగావకాశాల వల్ల ఇన్కమ్ లెవల్స్ భారీగా పెరిగాయి. చిన్న వయసులోనే డబ్బు సంపాదిస్తుండటం, బాధ్యతలు, ఖర్చులు పెద్దగా లేకపోవడం వల్ల స్వేచ్ఛగా విలాసవంతమైన అవసరాలపై ఖర్చు పెడుతున్నారు. అందుబాటులో ఉన్న లగ్జరీస్‌ను ఆస్వాదించాలనే ధోరణి, చూసేవారికి డాబుగా కనిపించాలనే తపన, ఈజీ ఈఎంఐలు, రుణ సౌకర్యాలు... ఇవే కార్లపై యువత మనసు పారేసుకొనేలా చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం కార్లు కొనే ఏజ్ గ్రూప్ ఎక్కువగా 28-48 ఏళ్ల మధ్య ఉంటోంది. ఫీచర్ రిచ్.. లైఫ్‌లో భాగమైపోయిన గాడ్జెట్స్ వంటివే కార్లలో కోరుకొంటున్నారు. కొనుగోలుదారుల్లో ఎక్కువ కుర్రాళ్లే ఉండటం వల్ల ఇలా ఫ్యూచర్ రిచ్ కార్లకు క్రేజ్ పెరిగింది. ఇదివరకు రేడియో, టేపురికార్డర్ ఉంటే చాలనుకొనేవారు. ‘ఇప్పుడు ఎల్ఈడీ, యూఎస్బీ డ్రైవ్, వైఫై, టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్.. ఇలా కార్లలో కూడా టెక్నాలజీ కోరుకొంటున్నారు. అలాగే అన్నీ అందుబాటులో ఉండాలి. అంటే.. ఏరోప్లేన్ కాక్‌పిట్‌లో పెలైట్ చేతికి అన్నీ ఎలా చేరువలో ఉంటాయో అలా! ఆడియో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌పై కావాలి. పవర్ విండోస్, డోర్స్ లాక్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్.. ఇలా అన్ని ఫీచర్సూ ఉండాలి. అవి చేతికి అందాలి. సేమ్‌టైమ్.. స్టైలిష్‌గా, రిచ్‌గా, విభిన్నంగా, వినూత్నంగా ఉండే డ్యాష్‌బోర్డ్స్ ప్రిఫర్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు బేగంపేట్ వరుణ్ మోటర్స్ షోరూమ్ డెరైక్టర్ డీకే రాజు. మైలేజ్ ఇంపార్టెన్స్.. ఇండియన్ మార్కెట్లో మైలేజీకే అధిక ప్రాధాన్యం. అలాగని పికప్ తగ్గకూడదు. సో.. బిగ్గర్ కార్.. స్మాలర్ సీసీ. అమెరికా వంటి దేశాల్లోనూ ఇదే పాలసీ. ఉదాహరణకు సియాజ్, డిజైర్ వంటి వాటిల్లో ఇంజిన్ కెపాసిటీ తక్కువ. కానీ 1.3 లీటర్ ఇంజినే అయినా అందులో విపరీతమైన పవర్ జనరేట్ అవుతుంది. 115 వీహెచ్‌పీ. ఆర్పీఎం ఎక్కువగా ఉంటుంది. టర్బో చార్జర్ల వల్ల పికప్ బాగుంటుంది. ఇప్పటి ట్రెండ్, యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవాలంటే ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చరర్స్ అందించక తప్పడం లేదు. రియర్ షేప్.. లుక్ డిఫరెంట్.. కారు చూడగానే డిఫరెంట్‌గా, ఆకట్టుకొనేలా ఉండాలి. వెర్నా, హోండా సిటీ వంటి కార్లను గమనిస్తే మస్కులర్ డిజైన్స్ కనిపిస్తాయి. ఇలా గ్రీన్లైన్స్ను ఇష్టపడుతున్నారు కుర్రకారు. ఫ్రంట్ షేప్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. రియర్పైనా అంతే ఆసక్తి చూపుతున్నారు. ‘ముందు భాగాన్ని ఏ తయారీదారులైనా పెద్దగా మార్చలేరు. ఏరోడైనమిక్ షేప్‌లో స్లీక్గా ఉండాల్సిందే. బ్యాక్ పోర్షన్‌ను మార్చొచ్చు. అదీగాక కారును వెనక నుంచి చూసేవారే ఎక్కువగా ఉంటారు. కారణం... ఆపోజిట్ డెరైక్షన్‌లో అందరి కళ్లూ ట్రాఫిక్‌పైనే ఉంటాయి. సో.. మ్యానుఫ్యాక్చరర్స్ దీనికి ప్రాధాన్యమిస్తున్నారు. యూత్ టేస్ట్‌కు తగ్గట్టుగా స్లీక్ డిజైన్, హ్యుండై ఐ20లా టేల్ ల్యాంప్స్ ఇలా ప్రతిదానిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు’ అంటారు హిమాయత్‌నగర్ లక్ష్మీ హ్యూండయ్ బ్రాంచ్ మేనేజర్ సంజయ్. యావరేజ్ హైట్.. గతంతో పోలిస్తే యావరేజ్ ఇండియన్ హైట్‌లో కూడా మార్పు వచ్చింది. కొంత పొడవు పెరిగింది. దీంతో ‘టాల్‌బాయ్ డిజైన్ షేప్డ్’ కార్లను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే.. హెడ్, లెగ్ రూమ్స్.. ఏదీ పట్టుకోకుండా కూర్చొని లేవడానికి సులువుగా ఉండాలి. సిటింగ్, డ్రైవింగ్ పోస్టర్స్ బాగుండాలి. ఇక టీ మగ్గులు తొణకకుండా కప్ హోల్డర్స్, మొబైల్ చార్జర్లు, బ్యాక్‌సైడ్ వారికి బెడ్‌ల్యాంప్స్, బ్యాగ్, కోట్ హుక్స్, ముఖ్యమైన, విలువైనవి సీక్రెట్‌గా పెట్టుకోవడానికి సీటు కింద స్టోరేజ్ వంటివన్నీ కామన్ ఫీచర్స్. సిటీలో హయ్యస్ట్ సెల్లింగ్ కారు డిజైర్. స్టైలిష్‌గా, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. తరువాతి కారు స్విఫ్ట్. గతంలో ఆటోగేర్ కార్లు వెయ్యికి ఒకటి అమ్మడం కష్టంగా ఉండేది. ఇప్పుడు సగటున 15-20 శాతం ఈ కార్లు అమ్ముడవుతున్నాయి. కారణం.. మైలేజ్, స్లీక్ మోడల్, ఇంటిగ్రేటెడ్ స్టీరియో వంటి ఫీచర్స్. -
‘కారు’ చౌక ప్రయాణం!
ఆటో చార్జీలతోనే క్యాబ్‌ల్లో అందుబాటులో లగ్జరీ సేవలు అంతర్జాతీయ సంస్థలు రాకతో మారిన పరిస్థితి ప్రత్యేక యాప్‌లు,ఆన్లైన్ బుకింగ్‌లు సిటీబ్యూరో: ఆటో చార్జీతో లగ్జరీ కారులో ప్రయాణం. అదీ మన మహా నగరంలో. మీరు చదివింది నిజమే. క్యాబ్‌లతో ఇది సాధ్యమవుతోంది. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే క్యాబ్ ప్రయాణం అందుబాటులో ఉండేది.. అంతర్జాతీయ సంస్థల ప్రవేశంతో పరిస్థితి మారింది. సంస్థల మధ్య పోటీ పెరిగింది. అత్యాధునిక సౌకర్యాలు, తక్కువ ఖర్చుతో లగ్జరీ కార్లలో సగటు సిటిజనులు ప్రయాణించే సౌలభ్యం కలిగింది. ఇంక ఆలస్యం ఎందుకు? ఎంచక్కా ఆటో చార్జీలతోనే కారులో రయ్..రయ్ మంటూ నగరాన్ని చుట్టేయండి. నగరంలో ప్రస్తుతం గ్రీన్‌క్యాబ్స్, డాట్, ట్యాక్స్ ఫర్ ష్యూర్, ఓలా,ఊబర్, మేరు,ఫాస్ట్‌ట్రాక్, సీ క్యాబ్స్, స్కై క్యాబ్స్ తదితర సంస్థలు క్యాబ్ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇండికా, ఇండిగో, సిడాన్, ఇన్నోవా, స్విఫ్ట్,స్విఫ్ట్ డిజైర్ వంటి వివిధ రకాలకు చెందిన 5000 కార్లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులకు క్యాబ్స్ సేవలను వినియోగించుకొంటున్నారు. మేరు క్యాబ్స్ సుమారు 900 వాహనాలను కలిగి ఉండగా, డాట్స్,ఓలా, గ్రీన్‌క్యాబ్స్ సంస్థలు వందలాది వాహనాలను అందుబాటులో ఉంచాయి. ‘డిమాండ్ బాగా ఉంది. అన్ని క్యాబ్ సంస్థలు కలిసి ప్రస్తుతం ఈ డిమాండ్‌ను 60 శాతం మాత్రమే భర్తీ చేస్తున్నాయి. సమయాభావం, వాహనాల కొరతతో అందరికీ సేవలు అందించలేకపోతున్నాం’ అని నగరానికి చెందిన గ్రీన్‌క్యాబ్స్ సంస్థ ప్రతినిధి అనిల్ కొఠారీ అభిప్రాయపడ్డారు. జపాన్‌కు చెందిన ‘జపనీస్ సాఫ్ట్ బ్యాంక్’, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఊబర్ వంటి అంతర్జాతీయ సంస్థలు సేవలను విస్తరిస్తున్నాయి. క్యాబ్ సంస్థల మధ్య నెలకొన్న ఈ పోటీ వినియోగదారుడికి మేలు చేస్తోంది. యాప్‌లు,ఆన్లైన్ బుకింగ్‌లు... ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, చెన్నై, పూనె నగరాల్లో క్యాబ్స్‌ను ప్రవేశపెట్టిన ఊబర్ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. ఊబర్ వాహనాల కోసం ప్రయాణికులు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవలసి ఉంటుంది. చె ల్లింపులు కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లు ఉన్నాయి. ఊబర్ వంటి పెద్ద సంస్థలే కాదు. కొద్ది పాటి వాహనాలతో ఈ రగంలో కొనసాగుతున్న చిన్న చిన్న క్యాబ్ సంస్థలు సైతం వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రత్యేక యాప్‌లతో ముందుకు వస్తున్నాయి. 300 వాహనాలతో ప్రయాణికులకు సేవలను అందజేస్తున్న గ్రీన్‌క్యాబ్స్ జీపీఆర్ఎస్, వెహికిల్ ట్రాకింగ్, యాప్,ఆన్లైన్ బుకింగ్ సేవలను కొనసాగిస్తోంది. లగ్జరీ వాహనాలు... ఇప్పటి వరకు ఇండికా, సీడాన్, ఇన్నోవా వంటి వాహనాలతో పాటు, మారుతీ స్విఫ్ట్ డిజైర్ వంటివి ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో వాహనాల స్థాయిని బట్టి చార్జీల్లో మార్పులు తప్పనిరి. ఇండికా వంటి వాహనాల్లో కిలోమీటర్‌కు రూ.10 చొప్పున చార్జీ తీసుకుంటే, ఇన్నోవాల్లో రూ.15 చొప్పున తీసుకుంటున్నారు. స్విఫ్ట్డిజైర్లో ఇంకొంచెం ఎక్కువే. ఊబర్క్యాబ్స్ బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌బెంజ్, ఆడి వంటి లగ్జరీ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 1.6 కిలోమీటర్ల కనీస దూరానికి ఆటో చార్జీ రూ.20. ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున చార్జీ ఉంటుంది. ఈ లెక్కన సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరానికి ఆటోచార్జి రూ.108. కానీ ఇప్పుడు కిలోమీఆటర్కు రూ.10 చొప్పున చెల్లించి కేవలం రూ.100తో సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్ వరకు క్యాబ్ జర్నీ చేయవచ్చు. నగరంలో ఎక్కడి నుంచైనా సరే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు గతంలో రూ.490 వరకు చార్జీ విధించిన ఓలా క్యాబ్స్ ఇప్పుడు రూ.390కే ఆ సదుపాయాన్ని అందజేస్తోంది. ఓలా క్యాబ్స్‌తో మిగతా సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి. ఇటీవల నగరంలో తన సేవలను ప్రారంభించిన ఊబర్ క్యాబ్స్ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అత్యాధునిక సదుపాయాలతో ఆకట్టుకుంటోంది. -
బీఎండబ్ల్యూ.. ఎం4 కూపే
గ్రేటర్ నోయిడా: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కొత్త కారు, ఎం4 కూపేను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 1.21 కోట్లని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్సర్ చెప్పారు. దీంతో పాటు ఎం3 సెడాన్‌లో కొత్త వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టామని చెప్పారు. ఎం3 సెడాన్‌లో ఇది ఫిప్త్ జనరేషన్ మోడల్ అని, ధర రూ.1.19 కోట్లని (ఈ రెండు కార్ల ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. కొత్తగా అభివృద్ధి చేసిన 6 సిలిండర్ల ఇంజిన్‌తో ఈ కార్లను రూపొదించామని, పూర్తిగా తయారైన కార్ల రూపంలో వీటిని దిగుమతి చేసుకుని విక్రయిస్తామని తెలిపారు. త్వరలోనే హైబ్రిడ్ కారు ఐ8ను కూడా భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 37గా ఉన్న డీలర్‌షిప్‌లను వచ్చే ఏడాది చివరి కల్లా 50కు పెంచనున్నామని ఆయన వివరించారు. -
తగ్గనున్న లగ్జరీ కార్ల ధరలు
-
లగ్జరీకి మాంద్యం లేదు
మాంద్యం మధ్య తరగతికే తప్ప మాకు కాదంటున్నారు శ్రీమంతులు. అందుకు తగ్గట్టే మామూలు కార్ల అమ్మకాలు కుదేలవుతుండగా... లగ్జరీ కార్ల అమ్మకాలు జిగేల్మంటున్నాయి. బైక్‌ల మార్కెట్‌దీ ఇదే తీరు. సాధారణ బైక్‌ల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నా... లగ్జరీ బైక్‌ల అమ్మకాలు మాత్రం అనూహ్యంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం వంటివి దిగువ, ఎగువ మధ్యతరగతి కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నా... లగ్జరీ బ్రాండ్లపై అదేమీ లేకపోవటంతో బీఎండబ్ల్యూ మోటరాడ్, ట్రంఫ్, తదితర అంతర్జాతీయ లగ్జరీ బైక్‌లు భారత్‌పై కన్నేశాయి. ప్రపంచవ్యాప్తంగా టూవీలర్లు అత్యధికంగా అమ్ముడవుతున్న మార్కెట్లలో మనదొకటి. ఇండియాలో ఏటా 1.4 కోట్ల టూ వీలర్లు అమ్ముడవుతున్నాయి. అయితే ఈ మొత్తం బైక్‌ల విక్రయాల్లో లగ్జరీ బైక్‌ల వాటా 2% కన్నా తక్కువే. కానీ ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 500 సీసీ కంటే అధిక ఇంజిన్ సామర్థ్యం ఉన్న లగ్జరీ బైక్‌ల అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి. గత ఆర్నెళ్లలో ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ లగ్జరీ బైక్‌ల అమ్మకాలు బాగా పెరగటంతో పాటు చిన్న నగరాల్లో కూడా జోరందుకున్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 14% వృద్ధి సాధించిన టూ వీలర్ల అమ్మకాలు 2012-13లో 3% తగ్గాయి. కానీ గడిచిన మూడేళ్లుగా 200-500 సీసీ బైక్‌ల అమ్మకాలు 35% చొప్పున వృద్ధి చెందాయి. ఈ అంచనాతోనే అమెరికా, యూరప్‌లలోని బైక్ కంపెనీలు కూడా భారత్‌వైపు చూస్తున్నాయి. హార్లేదే అగ్రస్థానం.... భారత లగ్జరీ బైక్ మార్కెట్లో హార్లే డేవిడ్సన్దే అగ్రస్థానం. దీంతో పాటు ఇటలీకి చెందిన డుకాటి, జపాన్‌కు చెందిన సుజుకి, హోండా, యమహా, కవాసకి, దక్షిణ కొరియాకు చెందిన హ్యోసంగ్ కంపెనీలూ తమ బైక్‌లను విక్రయిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ట్రంఫ్ కంపెనీ గురువారం తొలిసారిగా పలు లగ్జరీ బైక్‌లను మన మార్కెట్లోకి తెస్తోంది. బైక్‌ల ధరలు రూ.5.5 లక్షల నుంచి రూ.22 లక్షల రేంజ్లో ఉండొచ్చని సమాచారం. కవాసకి కంపెనీ స్పోర్ట్స్ బైక్‌లను బజాజ్ ఆటోయే విక్రయిస్తోంది. ఇక బీఎండబ్ల్యూ మోటరాడ్ కంపెనీ టీవీఎస్ మోటార్స్‌తో కలిసి లగ్జరీ బైక్‌లను విక్రయించడానికి సిద్ధమయింది. రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీని మార్కెట్లోకి తెచ్చింది. త్వరలో 750 సీసీ కాఫీ రేసర్‌ను కూడా తేబోతోంది. ఎవరు కొంటున్నారు..: తాజా సర్వే ప్రకారం... రూ.10 లక్షల వార్షిక వేతనాన్ని మించిన వ్యక్తులు ఈ లగ్జరీ బైక్‌లను కొంటున్నారు. లక్ష డాలర్లకు పైగా సంపద ఉన్న కుటుంబాలు భారత్‌లో 30 లక్షల వరకూ ఉంటాయని, అమెరికా తర్వాత ఆ స్థాయి సంపన్న కుటుంబాలున్నది ఇక్కడేనని సర్వే చెప్పింది. హార్లే చౌక బైకులు.. హార్లే డేవిడ్సన్.. 250-300 సీసీ సెగ్మెంట్లో సైతం బైక్‌లను తేవాలనుకుంటోంది. ఇక్కడ లభ్యమయ్యే కొన్ని విడిభాగాలనుపయోగించి ఇక్కడే బైక్‌లను తయారు చేయడం ద్వారా వాటిని తక్కువ ధరకే ఇవ్వవచ్చన్నది కంపెనీ వ్యూహాం. వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటంతో పాటు మరింత మార్కెట్ వాటా కోసం కంపెనీ ప్రయత్నిస్తోంది. భారత మార్కెట్లోకి తేనున్న రెండు చౌక బైక్‌లు-స్ట్రీట్ 750, స్ట్రీట్ 500లను మిలన్ ఆటో షోలో హర్లే డేవిడ్సన్ ప్రదర్శించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 -12 వరకూ ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలోనూ వీటిని ప్రదర్శించనుంది. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఈ బైక్‌ల ధర రూ.4.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా.