Bollywood Actor Ajay Devgn Buys BMW I7 Luxury Electric Car Worth Rs 1.95 Crore - Sakshi
Sakshi News home page

Ajay Devgn: ఖరీదైన కారు కొన్న అజయ్ దేవగణ్.. ధర ఎన్ని కోట్లంటే?

Published Sun, May 28 2023 6:28 PM | Last Updated on Mon, May 29 2023 10:31 AM

Ajay Devgn Buys BMW i7 Luxury Electric Car Worth Rs 1.95 crore - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ బీటౌన్‌తో పాటు దక్షిణాదిలోనూ పరిచయం అక్కర్లేని పేరు.  ఇటీవలే దృశ్యం-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.  శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కార్లపై ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. మార్కెట్‌లో రిలీజైన కొత్త కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. 

(ఇది చదవండి: హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది: నటుడు)

తాజాగా ఈ బాలీవుడ్ హీరో  ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.  అజయ్ దేవగణ్ బీఎండబ్ల్యూ ఐ7 ఈవీ కారును జర్మన్‌ కంపెనీ తయారు చేసింది. ఇండియన్ మార్కెట్లో రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. 
అజయ్ కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆధునాతన సదుపాయాలు ఉన్నాయి. 

(ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement