
ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ విన్నర్ ఎల్విశ్ యాదవ్. పాము విషం కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై విడదలయ్యారు కూడా. యూట్యూబర్‌గా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఎల్విశ్ యాదవ్ బిగ్‌బాస్ షో మరింత గుర్తింపు దక్కించుకున్నారు.
ఇటీవల జైలు నుంచి బయటికొచ్చిన ఎల్విశ్ యాదవ్ ఖరీదైన లగ్జరీ కారును కొన్నారు. తాజాగా మెర్సిడెస్ గ్వాగన్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఈ కారును 2022లోనే కొనాలనుకున్నట్లు తన వీడియో ఎల్విశ్ వెల్లడించారు. అప్పుడు కుదరకపోవడంతో ఈ ఏడాది తన కల నెరవేరిందని అన్నారు. కాగా.. ఎల్విశ్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2 విజేతగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment