ఖరీదైన కారు కొన్న స్టార్‌ కపుల్.. ధర ఎన్ని కోట్లంటే? | Ranbir Kapoor and Alia Bhatt brand new luxury car worth 2 Crores | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: లగ్జరీ కారులో రణ్‌బీర్‌- ఆలియా.. ధర ఎన్ని కోట్లో తెలుసా?

Published Mon, Jun 3 2024 9:52 PM | Last Updated on Mon, Jun 3 2024 9:55 PM

Ranbir Kapoor and Alia Bhatt brand new luxury car worth 2 Crores

బాలీవుడ్ స్టార్‌ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ జంట ఒకరు. తాజాగా ఈ జంట  అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. ఇటలీలో జరిగిన క్రూయిజ్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొని తాజాగా ముంబయికి తిరిగివచ్చారు. తమ ముద్దుల కూతురు రాహా కపూర్‌తో కలిసి ఇండియా చేరుకున్నారు.

అయితే తాజాగా ఈ జంట కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి ముంబయికి వచ్చిన ఈ జంట తమ ఖరీదైన లగ్జరీ కారులో ఇంటికి చేరుకున్నారు. దీంతో అందరి దృష్టి కారుమీదే పడింది. లెక్సస్ ఎల్‌ఎమ్‌ బ్రాండ్‌కు చెందిన ఈ కారు విలువ దాదాపు రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఇటీవల ఏప్రిల్‌ నెలలో బెంటెలీ బ్రాండ్‌ కారును రణ్‌బీర్‌ కొనుగోలు చేశాడు. వీటితో పాటు రణ్‌బీర్‌ గ్యారేజీలో  రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. అలియాకు సైతం రేంజ్ రోవర్, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ, ఆడి క్యూ5, ఆడి క్యూ7 కార్లు కలిగి ఉన్నారు. దీంతో తాజాగా మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. 

కాగా.. గతేడాది యానిమల్‌ మూవీతో  రణ్‌బీర్‌ కపూర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతనికి జోడీగా కనిపించింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement