alia bhat
-
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
-
స్టార్ హీరోయిన్ ఆలియా ముద్దుల తనయ రాహా కపూర్ బర్త్‌డే సెలబ్రేషన్స్
-
రణబీర్ - అలియా కొత్త ఇల్లు ధర వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
-
దేవర పాట పాడిన అలియా.. టాలీవుడ్ ఫిదా..
-
గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో!
వినాయకవి చవితి పండుగను చిన్నా, పెద్దా అంతా దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించు కుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల గణేష్ నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా. తాజాగా గణేష్ చతుర్థి వేడుకల ఫోటోలను బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ షేర్ చేసింది. ఈ ఫోటోలో కపూర్ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు నిండుగా కనిపించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ కపుల్, రణబీర్ కపూర్, అలియాభట్ ముద్దుల తనయ రాహా తండ్రి ఒడిలో మరింత ముద్దుగా కనిపించింది. ఇంకా స్టార్ కిడ్స్ ఆదార్ జైన్, అలేఖా అద్వానీ, కరీనా కపూర్ కుమారులు జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ కూడా అందంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) తమ ఇంట్లో జరిగిన గణనాధుడి వేడుకలకు సంబంధించిన ఫోటోలను (సెప్టెంబర్ 15) ఆదివారం కరిష్మా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో రణధీర్ కపూర్, బబితా కపూర్ కరిష్మా కపూర్, కరీనా కపూర్, జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, రణబీర్ కపూర్, రాహా కపూర్ , ఇతరులున్నారు. "గణపతి బప్పా మోరియా", అంటూ అంతా కలిసి గణపతి బప్పాకు పూజలు అనంతరం ఫ్యామిలీ ఫోటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే కపూర్ కుటుంబంలో రాహా తల్లి అలియా భట్ , కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ మిస్ అయ్యారు.అలాగే నానమ్మ నీతా కపూర్‌తో, చిన్నారి రాహా క్యూట్ ఇంటరాక్షన్ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో అమ్మ చంకలో ఒదిగిపోయిన రాహా, నానమ్మను చూసి లిటిల్ ప్రిన్సెస్ తెగ సంతోష పడింది. సోమవారం ఉదయం వీరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) తన రాబోయే చిత్రం జిగ్రా ప్రమోషన్లో అలియా బిజీగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ మూవీ యానిమల్ చిత్రంలో రణ్‌బీర్ స్టార్డం అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నితీష్ తివారీ రామాయణంలో శ్రీరాముని పాత్రలో నటిస్తున్నాడు. ఇదీ చదవండి: వాకింగ్ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా? -
ఆలియా ‘ఆల్ఫా’లో అతిథిగా స్టార్ హీరో!
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’. శివ్ రవైల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్లో జరుగుతోంది. ఆలియా, శార్వరీ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఓ అతిథి పాత్ర చేయనున్నారని, ఆయన పాత్ర తాలూకు సన్నివేశాల చిత్రీకరణను కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
Alpha: స్పై యూనివర్స్‌లోకి వచ్చేస్తోన్న ‘ఆల్ఫా’ గర్ల్స్
‘వైఆర్ఎఫ్’ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న మరో హిందీ చిత్రం ‘ఆల్ఫా’. ఆలియా భట్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో శార్వరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వంలో ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఆల్ఫా’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘నిశితంగా గమనిస్తే ప్రతి నగరంలోనూ ఓ అడవి ఉంటుంది. ఆ అడవిని ఏలేది మనమే’’ అంటూ ఆలియా భట్ చెప్పే డైలాగ్ ఈ చిత్రం అనౌన్స్మెంట్ టీజర్లో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయా లనుకుంటున్నారు. -
ఖరీదైన కారు కొన్న స్టార్ కపుల్.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ఒకరు. తాజాగా ఈ జంట అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. ఇటలీలో జరిగిన క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని తాజాగా ముంబయికి తిరిగివచ్చారు. తమ ముద్దుల కూతురు రాహా కపూర్‌తో కలిసి ఇండియా చేరుకున్నారు.అయితే తాజాగా ఈ జంట కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి ముంబయికి వచ్చిన ఈ జంట తమ ఖరీదైన లగ్జరీ కారులో ఇంటికి చేరుకున్నారు. దీంతో అందరి దృష్టి కారుమీదే పడింది. లెక్సస్ ఎల్ఎమ్ బ్రాండ్‌కు చెందిన ఈ కారు విలువ దాదాపు రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఇటీవల ఏప్రిల్ నెలలో బెంటెలీ బ్రాండ్ కారును రణ్‌బీర్ కొనుగోలు చేశాడు. వీటితో పాటు రణ్‌బీర్ గ్యారేజీలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. అలియాకు సైతం రేంజ్ రోవర్, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ, ఆడి క్యూ5, ఆడి క్యూ7 కార్లు కలిగి ఉన్నారు. దీంతో తాజాగా మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. కాగా.. గతేడాది యానిమల్ మూవీతో రణ్‌బీర్ కపూర్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతనికి జోడీగా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
అందాల భామ ఆలియా ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్‌లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్‌లో పార్ట్నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మనీష్ మల్హోత్రా.. డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/- ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్‌ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్లైన్ మార్కెట్టూ విస్తృతమే. (చదవండి: స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..) -
అలియా సొగసులు.. జాన్వీ వయ్యారాలు.. జాక్వెలిన్ నాభి అందాలు
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ రోజు రోజుకు మరింత అందంగా రెడీ అవుతోంది. తాజాగా తన నాభి అందాలను చూపిస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది స్లీవ్ లెస్ బ్లౌజ్.. చీరకట్టులో కట్టిపడేస్తున్న అలియా భట్ అనసూయ విదేశాల్లో ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. వాషింగ్టన్‌లోని సిటీలో ఫుల్ డ్రెస్‌తో నవ్వూతూ రోడ్లు, హార్బర్లో దిగిన పిక్స్‌ని షేర్ చేసింది View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Olivia (@oliviakmorris) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!
న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. మెట్‌గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్లో తళుక్కు మనగా, తొలిసారిగా భర్తతలో కలిసి సందడి చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్‌వైట్ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్‌కు సిరీస్ సిటాడెల్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రిలయన్స్అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్‌బెల్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) Her $25 million @Bulgariofficial necklace is going to be auctioned off after #MetGala @priyankachopra pic.twitter.com/LK0otVUHea — SAMBIT ⚡ (@GirlDontYell) May 2, 2023 -
సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారకు అలియా భట్ సప్రైజ్ గిఫ్ట్
-
సీక్రెట్‌గా నా ఫోటోలు తీశారు.. సరైనా పనేనా?.. అలియా ఫైర్
సినీ ప్రముఖుల పర్సనల్ విషయాలపై సామాన్యులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఖాళీ సమయాల్లో వాళ్లు ఎం చేస్తారు? ఎలా ఉంటారు? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహం కనబరుస్తారు. అయితే అది కొంతవరకు బాగానే ఉన్నా..ఒక్కోసారి వారిని ఇబ్బందికి గురిచేస్తుంటుంది. వాళ్లకు ప్రైవసీని భంగం కలించినట్లవుతుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌కు అలాంటి ఘటనే ఎందురైంది.ఆమె లివింగ్ రూమ్‌లో కూర్చొని ఉండగా.. సీక్రెట్‌గా ఫోటోలు తీసేందుకు ఇద్దరు ఫోటో గ్రాఫర్లు ప్రయత్నించారు. పక్క బిల్డింగ్ టెర్రస్‌పై నిలబడి కెమెరాలతో ఆమె ఇంటిని ఫోకస్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అలియా.. సోషల్ మీడియా వేదికగా వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఏం జరిగిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉండగా.. ఎవరో నన్ను గమనించినట్లు అనిపించింది. పక్కకు తిరిగి చూస్తే ఎవరు ఇద్దరు వ్యక్తులు పక్క బిల్డింగ్‌పై నుంచి కెమెరాలతో నా ఫోటోలు తీస్తున్నారు. ఇది సరైన పనేనా? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించాలనే విషయం తెలియదా? మీరు హద్దులు దాటి ప్రవర్తించారు’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని అలియా చెప్పింది. ఇన్‌స్టా పోస్ట్‌లో ముంబై పోలీసుకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా సిగ్గు చేటు. నా కూతురి విషయంలో ఇలాంటి ఘటనే ఎదురైంది. తన ఫోటోలను తీయొద్దని ఎంత రిక్వెస్ట్ చేసినా..వారు ఆమె ఫోటోలను నెట్టింట పెట్టారు’అని రాసుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ‘ఆది అసహ్యమైన చర్య. నా విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. నాకు తెలియకుండా.. నా పర్మిషన్ లేకుండా ఫోటోలు తీశారు’చెప్పింది. -
బ్రహ్మాస్త్రకు వారిద్దరు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. అందులో నిజమెంత?
బాలీవుడ్ రొమాంటిక్ జోడీ ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో పోషించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ విషయంలో పలు రకాల వదంతులు వ్యాపించాయి. ఈ సినిమా బడ్జెట్ పెరిగడంతో.. అలియాభట్, రణ్‌బీర్ కపూర్ రెమ్యునరేషన్ తీసుకోలేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘చాలా మంది త్యాగాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్‌బీర్ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలియాభట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయినైంది. ఆమెకు ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేం సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ చిత్రంలో భాగమైంది’ అని అన్నారు. (చదవండి: బిగ్‌బాస్ షో.. ఆ స్టార్ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!) రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలపై రణ్‌బీర్ కపూర్ కూడా స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ నిజానికి నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ చిత్రానికి నిర్మాతను కూడా. కానీ నేను అంతకు మించి పొందాను. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయగలమనే నమ్మకం ఉంది. ఒక నటుడిగా నేను ఇంతకంటే పొందగలిగేది ఏముంటుంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. " -
రణబీర్ ఫేవరెట్ హీరోయిన్ ఆమెనట.. ఆలియా భట్ కాదండోయ్!
బాలీవుడ్లో ఇటీవల పెళ్లి చేసుకున్న క్యూట్ కపుల్ ఎవరంటే రణబీర్ కపూర్ ఆలియా భట్. ఈ జంట కొంత కాలం రిలేషన్షిప్లో ఉండి ఇటీవలే వివాహం కూడా చేసుకున్నారు. చివరగా ఈ చాక్లెట్ బాయ్ ‘సంజు’ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత పలు కారణాల వల్ల దాదాపు నాలుగేళ్లు ప్రేక్షకులకు దూరంగా ఉన్నాడు. ఆ గ్యాప్‌ని పూరించడానికి 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' వరుస చిత్రాలతో తన అభిమానులకు ముందుకు రాబోతున్నాడు. వీటిలో ‘షంషేరా’ చిత్రం జూలై 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో పాటు రణ్‌బీర్ కూడా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రణ్‌బీర్. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు ఈ చాక్లెట్ బాయ్. ఏంటా ప్రశ్నంటే? రణ్‌బీర్‌ని తన ఫేవరెట్ కో-స్టార్‌గా ఎవరని అడగగా సౌరభ్ శుక్లా పేరును చెప్పాడు. అతనితో గతంలో బర్ఫీ (2012), జగ్గా జాసూస్ (2017), త్వరలో విడుదల కానున్న ‘షంషేరా’ చిత్రంలో కలిసి నటించారు. ఇక రణ్‌బీర్‌కి ఇష్టమైన నటి ఎవరన్న ప్రశ్నకు బదులుగా.. అనుష్క శర్మ పేరుని చెప్పాడు. వీరిద్దరూ గతంలో.. ఏ దిల్ హై ముష్కిల్ (2016), బాంబే వెల్వెట్ (2015), సంజు (2018) చిత్రాలలో కలిసి నటించారు. అయితే అనుష్క తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారని తెలిపాడు. అంతే కాకుండా ఇద్దరం క్రియేటివిటి విషయంలో ఒకేలా ఆలోచిస్తారని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనుష్క చక్దా 'ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామిగా నటిస్తుంది. నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించనుంది. చదవండి: Allu Arjun: బన్నీ షాకింగ్ లుక్ వైరల్, దారుణంగా ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు -
అలియా బర్త్‌డే సర్ప్రైజ్, బ్రహ్మస్త్ర నుంచి ఫస్ట్‌లుక్ వచ్చేసింది
Alia Bhatt First Look Released From Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఆమె ప్రియుడు రణ్‌బీర్ కపూర్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే నేడు అలియా బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 15న అలియా 29వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అయాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తూ సర్ప్రైజింగ్ వీడియో షేర్ చేశాడు. కాగా ఇందులో అలియా పాత్ర పేరు ఇషా. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే మై లిటిల్ వన్. ఈ ప్రత్యేకమైన రోజున మా బ్రహ్మస్త్ర శక్తి.. ఇషా స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రంలో రణ్‌బీర్ సూపర్ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల చిత్ర బృందం మోషన్ పోస్టర్ ద్వారా తెలిపింది. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున్ అక్కినేని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
మనసు మార్చుకున్న జాన్వీ కపూర్.. ఇక టీటౌన్పైనే ఫోకస్!
దఢక్‌తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే ఫేమస్ అయింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఈ బ్యూటీని టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు మన డైరెక్టర్ట్స్ అండ్ ప్రొడ్యూస్స్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కానీ జాన్వీ మాత్రం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. ముందు బాలీవుడ్లో స్టార్డమ్ అందుకున్న తర్వాతే సౌత్ వైపు చూడాలనుకుంటోంది. అందుకే ఇంత కాలం టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె మనసు మారిందట. బాలీవుడ్ లీడింగ్ లేడీస్ దీపిక, ఆలియాల మాదిరే జాన్వీ కూడా టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే రెండు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుందట. అయితే ఈ రెండూ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఒకటి పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ జనగణమన, మరోకొటి కరణ్ జోహర్ అక్కినేని హీరో అఖిల్ తో ప్లాన్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అట. మరి టాలీవుడ్లో జాన్వీ లక్ ఎలా ఉంటుందో చూడాలి. -
ఒట్టేసి చెబుతున్నా, అది చేసి తీరతాను: ఆలియా
‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు.. ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’ అనే డైలాగ్‌తో ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్ విడుదలైంది. ఆలియా భట్ టైటిల్ రోల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘శ్రద్ధగా వినండి.. మీ కంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది.. అదెలా అంటారా? మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్టే.. మేమయితే రోజూ మా మానాన్ని అమ్ముకుంటాం.. అది అంతమే అవదు, ఒట్టేసి చెబుతున్నా.. మా పిల్లలందరికీ చదువులు నేర్పించే తీరతాను’ అంటూ ఆలియా చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘వేశ్యలు, వారి కుటుంబాల హక్కుల కోసం గంగూబాయి చేసిన పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్ వీడియో వైరల్
Alia Bhatt To Seetha Making Video From RRR Movie: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'పై సినిమాకు బడ్జెట్‌కు (సుమారు రూ. 450 కోట్లు) మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. రేపు (డిసెంబర్ 9) ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్లు, వీడియోలు, పాటలు విడుదల చేశారు. వాటికి అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా అలియా భట్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోను రీలీజ్ చేసింది చిత్రబృందం. ఈ తాజా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచి సీత పాత్రలో ఒదిగిపోయే వరకు చూపించారు. అందులో అలియా పోషిస్తున్న సీత పాత్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్‌ను చూపించారు. వీడియోలోని బిహైండ్ సీన్స్‌లో అలియా భట్ క్యూట్ క్యూట్‌గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది. ఇందులో పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇందులో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. అలియాది.. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు, భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
అలియా సంపాదనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహేశ్ భట్
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అలియా భట్ తోలి సినిమాతో భారీ విజయం సాధించింది. ప్రముఖ ప్రొడ్యూసర్ మహేశ్ భట్ వారసురాలిగా సినిమాల్లోకి అడుగు పెట్టి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ఇక సంపాదన విషయంలో అయితే తండ్రినే మించిపోయిందట. ఈ విషయంలో అలియా గురించి చెబుతూ మురిసిపోతున్నాడు మహేశ్ భట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలియా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా రంగంతో పాటు ఎక్కడైనా సరే రాణించాలంటే టాలెంట్ ఉండాలి. చదవండి: మరో వివాదంలో చిక్కుకున్న రాజ్‌కుంద్రా దంపతులు కొంతమంది తమ టాలెంట్‌తో చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అందులో నా కూతురు అలియ ఉండటం గర్వంగా ఉంది. తన టాలెంట్‌తో ఆలియా మంచి పేరుని సంపాదించడమే కాక నేను 50 ఏళ్లలో కష్టపడి సంపాదించినంత డబ్బును ఆలియా కేవలం రెండేళ్లలోనే సంపాదించింది’ అంటూ తండ్రిగా మురిపిపోయాడు. అయితే గతేడాది అలియా లండన్‌లో ఓ విల్లా కొనుగోలు చేయగా ఇటీవల ముంబైలోని జూహులో ఓ ఇల్లు ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అలియా సినిమాల విషయానికోస్తే ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె తెలుగులో నటించిన ‘ఆర్ఆర్ఆర్’, హాందీ బ్రహాస్త్ర చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకోని విడుదలకు సిద్దమవుతున్నాయి. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
మరోసారి రామ్‌చరణ్‌తో జతకట్టనున్న బాలీవుడ్ భామ!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో భారత సినీ పరిశ్రమకు చెందిన పులువురు స్టార్ నటీనటులు నటించనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ భామా అలియా భట్‌ను తీసుకోవాలని శంకర్ చిత్ర బృందంతో చర్చించారని వినికిడి. దీంతో డైరెక్టర్ శంకర్ టీం ఇటీవల ఆమెతో చర్చలు కూడా జరిపారనే వార్త ఫిలిం దూనియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉందట. ప్రస్తుతం అలియా తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’తో పాటు బాలీవుడ్లో పలు సినిమాలకు సంతకం చేసిందట. ఇప్పటికి ‘ఆర్ఆర్ఆర్’లో అలియా షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తికాలేదు, దీనితో పాటు హిందీలో తాను సంతకం చేసిన పలు చిత్రాలు లైన్లో ఉన్నాయట. మరీ ఇంత బిజీ షెడ్యూల్లో అలియా శంకర్-చరణ్ ప్రాజెక్ట్‌కు ఒకే చేస్తుందో లేదో ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ అంతా ఒకే అయితే అలియాకు చరణ్‌తో ఇది రెండవ సినిమా అవుతుంది. కాగా డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తు లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. -
ఆలియా @ ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపురా
‘‘కామాటిపురాలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగు ఉంటుంది. గౌరవంతో బతకాలి.. ఎవ్వరికీ భయపడకూడదు. నేను గంగూ బాయి.. ప్రెసిడెంట్ కామాటిపురా. మీరు కుమారి అంటూనే ఉన్నారు... నన్ను ఎవరూ శ్రీమతిని చేసిందే లేదు’’ వంటి డైలాగ్స్ ‘గంగూబాయి కాఠియావాడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కాఠియావాడీ’. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వేశ్యా గృహం నడిపే యజమాని గంగూబాయిగా నటిస్తున్నారు ఆలియా భట్. కాగా ‘వకీల్ సాబ్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘గంగూబాయి కాఠియావాడీ’ తెలుగు టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగారు? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ‘గంగూబాయి కాఠియావాడీ’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
రణ్‌బీర్, అలియా వివాహం అప్పుడే!
ముంబై : బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో త్వరలో ఒక్కటవుతారని బాలీవుడ్లో ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో రణ్‌బీర్, అలియా మ్యారేజ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. స్టార్ జంట వివాహానికి రిహార్సల్స్ కోసమే నీతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని కపూర్ కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. ఈ ఏడాది వివాహ వేడుక లేదని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే శుభకార్యంపై స్పష్టత వస్తుందని కపూర్ కుటుంబ సభ్యులు ఒకరు వెల్లడించారు. రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించారని, దీంతో 2021 ద్వితీయార్ధం వరకూ పెళ్లి ఊసే ఉండదని పేర్కొన్నారు. మరోవైపు వివాహంపై రణ్‌బీర్, అలియా సానుకూలంగా ఉంటే నీతూజీకి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని చెప్పుకొచ్చారు. అసలు రణ్‌బీర్, అలియా భట్‌లో ఏ ఒక్కరూ ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని అన్నారు. వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు చాలా సమయం పడుతుందని తేల్చేశారు. చదవండి : తెలుగు పాఠాలు -
తెలుగు పాఠాలు
‘మా మాటలు మేమే మాట్లాడుకుంటాం’ అని పరభాషా తారలు తెలుగు సినిమాలు చేసినప్పుడు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తెలుగులో ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా వంటి ఉత్తరాది భామలు అప్పుడప్పుడూ తమ పాత్రలకు డబ్బింగ్ చెబుతున్నారు. అయితే ఓ పది సినిమాలు చేశాక వాళ్లు ఈ ప్రయత్నం చేశారు. కానీ ఆలియా భట్ మాత్రం తెలుగులో చేస్తున్న తొలి సినిమాకే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట. ఎన్టీఆర్, రామ్‌చరణŠ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ టైమ్‌లో ఈ సినిమా నుండి ఆలియా తప్పుకున్నారనే వార్తలు షికారు చేశాయి. కానీ ఆలియా తప్పుకోలేదు. సీత పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు. తెలుగు నేర్చుకోవటం కోసం కోచ్‌ను కూడా పెట్టుకున్నారని టాక్. డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నారట. సోమవారం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. నవంబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణలో ఆలియా పాల్గొంటారని సమాచారం. -
‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా?
హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి విశేష ఆదరణ పొందారు దీపికా చిఖలియా. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ ‘సరోజిని’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గురువారం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా హిందీ రామాయణ్‌ను దూరదర్శన్‌లో పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో దీపిక క్రేజ్ మరోసారి అమాంతం పెరిగిపోయింది. అయితే నటిగా మంచి గుర్తింపు పొందిన దీపిక రాజకీయ రంగప్రవేశం చేశారని చాలా కొంతమందికే తెలుసు. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి సీత ఇప్పటి సరోజిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రామాయణం సినిమాగా తెరకెక్కించాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయంది. అయితే ఈ సినిమాలో నటించాలన్నా, తెరకెక్కించాలన్న రామాయణం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఒక వేళ రామాయణాన్ని సినిమాగా తెరకెక్కిస్తే సీతారాముల పాత్రలకు హృతిక్ రోషన్, అలియాభట్‌లు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. అంతేకాకుండా అజయ్ దేవ్‌గణ్ రావణుడు, వరుణ్ ధావన్ లక్ష్మణుడి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక రామయణ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పలు మ్యాగజైన్స్ ఫోటో షూట్‌కు పిలిచారు. అందుకు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారు. కానీ ఓ వైపు సీత పాత్ర పోషిస్తూ ఫోటో షూట్లో పాల్గొనడం భావ్యం కాదని సున్నితంగా తిరస్కరించాను. 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను. దివంగత నాయకులు అటల్ బిహార్ వాజ్‌పేయ్ స్పూర్థితో రాజకీయం రంగ ప్రవేశం చేశాను. మా తాత ఆరెస్సెస్ కార్యకర్త. దీంతో నాలో చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్ భావాలు ఉండేవి. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, నరేంద్ర మోదీ తదితరులు నా రాజకీయ సహచరులు. గుజరాత్‌లోని బరోడా లోని లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఇప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సహాయం, సలహాలు అందిస్తుంటాను’అంటూ దీపికా చిఖలియా పేర్కొన్నారు. ఈ నటి తెలుగులో కూడా యమపాశం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు. చదవండి: ‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’ ‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’ -
ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకున్న బాలీవుడ్ బ్యూటీ ?
హైదరాబాద్ : మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో దర్శక ధీర రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి షాకింగ్ అప్డేట్ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ఈ మూవీ హీరోయిన్లలో ఒకరైన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మూవీ కోసం భారీ మొత్తం పారితోషికం అందుకున్న అలియా ఎందుకు సినిమా నుంచి వైదొలిగారనేది ఆసక్తికరంగా మారింది. డేట్లను సర్దుబాటు చేయలేకే గల్లీ బాయ్ నటి రాజమౌళి మూవీ నుంచి వైదొలిగనట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, హైదరాబాద్, గుజరాత్, పుణేల్లో ఈనెల ఆరంభంలో జరిగిన షూటింగ్‌లోనూ అలియా పాల్గొన్నారని తెలిసింది. కరోనా వైరస్ ఆందోళనతో షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది. చదవండి : సంక్రాంతికి సై ఇక మే షెడ్యూల్ కోసం అలియా భట్ మేనేజర్‌తో రాజమౌళి బృందం సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. సడక్ 2, బ్రహ్మాస్త్ర, సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్ట్ వంటి పలు సినిమాలతో ఆమె ఊపిరిసలపని బిజీలో ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్లో డేట్లు కేటాయించలేని స్ధితిలో ఆమె రాజమౌళి ప్రాజెక్టును వదులుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ వార్తలను నిర్మాత ధ్రువీకరించకపోయినా పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల విప్లవ కథ ఆధారంగా రూ 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సన్నద్ధమవుతోంది. చదవండి : ఆర్ఆర్ఆర్తో కేజీఎఫ్ 2 ఢీ : యష్ వివరణ -
డిసెంబర్ 4న ‘బ్రహ్మస్త్ర’
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం విడుదలకు సంబందించి ఒక ఫోటోను బిగ్‌బీ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘బ్రహ్మస్త్ర సినిమా హింది, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి.. డిసెంబర్ 4, 2020 ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని బిగ్‌బీ వెల్లడించారు. T 3429 BRAHMĀSTRA.. coming to cinemas on 4/12/20 & Ayan is NOT allowed to change it now! #Brahmastra #RanbirKapoor @aliaa08 @iamnagarjuna @RoyMouni #AyanMukerji @ipritamofficial @karanjohar @apoorvamehta18 #NamitMalhotra @MARIJKEdeSOUZA @DharmaMovies @FoxStarHindi @BrahmastraFilm — Amitabh Bachchan (@SrBachchan) February 2, 2020 ‘బ్రహ్మస్త్ర’ ఓ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. అదేవిధంగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఆలియా భట్ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో చిత్ర విడుదలకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘బ్రహ్మస్త్ర మూవీ డిసెంబర్ 4న విడుదల అవుతుంది’ అని ఆమె తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా తెరుకెక్కుతున్న ఈ సినిమా చూడాలంటే డిసెంబర్ నాలుగు వరకు ఆగాల్సిందే. చదవండి: పరిశోధకుడు View this post on Instagram @amitabhbachchan #RanbirKapoor #AkkineniNagarjuna @imouniroy @ayan_mukerji @ipritamofficial @karanjohar @apoorva1972 #NamitMalhotra @marijkedesouza @dharmamovies @foxstarhindi @brahmastrafilm A post shared by Alia ☀️ (@aliaabhatt) on Feb 1, 2020 at 9:50pm PST -
అలియా భట్ తల్లి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై : పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూను ఉరితీయడంపై బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూను బలిపశువును చేశారని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయం ఎలా అపహాస్యమవుతుందనేందుకు ఇదే ఉదాహరణని అంటూ అఫ్జల్ గురూ అమాయాకుడైతే పోయిన అతడి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలరని ప్రశ్నించారు. అందుకే మరణ శిక్షను అంత తేలికగా విధించరాదని, ఈ కారణంచేతే అఫ్జల్ గురూను ఎందుకు బలిపశువును చేశారనే దానిపై విచారణ చేపట్టాలని ఆమె ట్వీట్ చేశారు. కశ్మీర్ నుంచి ఢిల్లీకి ఓ ఉగ్రవాదిని తీసుకురావాలని జమ్ము కశ్మీర్ డీజీపీ దేవీందర్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని అఫ్జల్ గురూ రాసిన లేఖలో పేర్కొన్నాడని, ఆ ఉగ్రవాదే తర్వాత పార్లమెంట్‌పై దాడికి తెగబడ్డాడని అదే లేఖలో పొందుపరిచాడని రజ్దాన్ పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో డీజీపీపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదనేది నిగ్గు తేల్చాలని కోరారు. అఫ్జల్ వంటి వారు ఎలాంటి వేధింపులకు గురయ్యారు..నేరస్తుల కోసం ఉగ్ర కార్యకలాపాలు చేపట్టవలసివచ్చిందో విచారణ చేపట్టిన అనంతరమే మరణ శిక్ష విధించాలని అన్నారు. కాగా ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉన్న దేవీందర్ సింగ్‌ను ఎన్ఐఏ త్వరలో విచారించనుందని భావిస్తున్నారు. చదవండి : ‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’ -
పరిశోధకుడు
వారణాసిలో పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితాలు వచ్చే ఏడాది వెండితెరపై విడుదలవుతాయి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారు. శివ పాత్రకు గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది జూన్‌లో నాగార్జునపై వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మనాలిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మూడు విభాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి విభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
‘రణబీర్ సలహాతో కోలుకున్నా’
న్యూఢిల్లీ : కళంక్ మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో నిరాశలో కూరుకుపోయిన తాను రణ్‌బీర్ కపూర్ సూచనలతో కోలుకున్నానని బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పుకొచ్చారు. రూ 100 కోట్లతో తెరకెక్కిన కళంక్ లైఫ్‌టైమ్ వసూళ్లు రూ 80 కోట్లకే పరిమితమవడం చిత్ర బృందాన్ని నిరుత్సాహపరిచింది. తాను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా తన కష్టానికి ఫలితం దక్కలేదని తాను తీవ్ర నిర్వేదానికి లోనయ్యాయని అలియా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమయంలో తనకు తన బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్ అండగా నిలిచారని, ఆయన చెప్పిన మాటలు తనకు స్వాంతన చేకూర్చాయని అలియా చెప్పారు. నువ్వు నీ శక్తిమేర కష్టపడ్డావని, అది ఇప్పటికిప్పుడు ఫలితాలు ఇవ్వకపోయినా కష్టపడే నటిగా, వ్యక్తిగా నీ శ్రమ వృధా కాదని, మరో సినిమా రూపంలో మంచి ఫలితంగా అది కనిపిస్తుందని రణబీర్ తనలో ధైర్యం నూరిపోశారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళంక్ నిర్మాత కరణ్ జోహార్, నటి కరీనా కపూర్లు కూడా పాల్గొన్నారు. -
రాహుల్ ప్రేమలో పడ్డాడా!
ఆకాంక్ష రంజన్ కపూర్ ప్రముఖ మోడల్ అయినప్పటికీ ఆమె.. అలియా భట్ స్నేహితురాలిగానే అందరికీ సుపరిచితం. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు ఈ మోడల్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇక ఆకాంక్ష ఏప్రిల్ 25న రాహుల్, అతియా శెట్టితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇది మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. పైగా ‘ఈ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో రాహుల్ ఆ ఊహాగానాలు నిజమని ఒప్పుకోలేక, కాదని కొట్టిపారేయలేక అవస్థ పడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ ‘ఈ విషయాల గురించి మీడియా ఏం రాసిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దగా పేపర్లు చదవను. కాబట్టి నా గురించి ఏం రాశారనేది నాకు తెలీదు. అయినా నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడుతాను. దాని గురించి పబ్లిక్‌లో మాట్లాడటం ఇష్టముండదు’ అంటూ అసలు విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా ‘నాకైతే ఏం తెలీదు. తెలిసినపుడు మీకు తప్పకుండా చెప్తా’నని తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నాడు. గతంలో నిధి అగర్వాల్, అథియా శెట్టిలతో రాహుల్ డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. అయితే తాజా ప్రేమ వ్యవహారంపై నోరు మెదపటానికి కూడా అతడు ఎందుకు ఇష్టపడట్లేదో! View this post on Instagram ...n i’m so good with that 💛 A post shared by 🦋Kanch (@akansharanjankapoor) on Apr 25, 2019 at 7:01am PDT -
ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..
ముంబై : బాలీవుడ్లో హాట్ లవ్ కపుల్‌గా ప్రచారం సాగుతున్న రణ్‌బీర్ కపూర్, అలియా భట్ల అనుబంధం ఇప్పట్లో పెళ్లిపీటలకు ఎక్కడం లేదని వెల్లడైంది. అలియా భట్ తన పెళ్లి కోసం అప్పుడే వెడ్డింగ్ లెహెంగా కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీకి ఆర్డర్ ఇచ్చినట్టు వార్తలు రాగా అలియా కుటుంబ సభ్యులు అలాంటిదేమీ లేదని తేల్చేశారు. రణ్‌బీర్ కపూర్‌తో అలియా భట్ వివాహంపై వస్తున్నవన్నీ రూమర్లేనని ఆమె అంకుల్, నిర్మాత ముఖేష్ భట్ కొట్టిపారేశారు. ఇవన్నీ అసత్య వార్తలే..అసలు వీటిని ఎవరు పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు అలియా స్టెప్ బ్రదర్ రాహుల్ భట్ సైతం ఆమె పెళ్లి వార్తలను తోసిపుచ్చారు. అలియా, రణ్‌బీర్‌ల వివాహంపై తనకేమీ తెలియదని, వారిద్దరి పెళ్లికి తనను ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని చెప్పుకొచ్చారు. -
ఆన్ వర్క్ మోడ్
ఇటీవల సౌతాఫ్రికాలో సతీమణి ఉపాసనతో కలిసి హాలిడేను బాగా ఎంజాయ్ చేసిన రామ్‌చరణ్ ఇక వర్క్ మోడ్‌లోకి రానున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్లో సోమవారం నుంచి రామ్‌చరణ్ పాల్గొంటారని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. 1921 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదల కానుంది. -
ఈద్‌కి ఫిక్స్
సల్మాన్‌ఖాన్ సినిమాలు రంజాన్‌కు విడుదల అవడం కొత్తేమీ కాదు. ‘వాంటెడ్’, ‘దబాంగ్’ ‘కిక్’, ‘బజరంగీ భాయిజాన్’, ‘సుల్తాన్’ ‘ట్యూబ్‌లైట్’ ‘రేస్ 3’.. ఈ ఏడాది ‘భారత్’ ఈ చిత్రాలన్నీ ఈ లిస్ట్ లోనివే. ఈ క్రమంలో వచ్చే ఏడాది రంజాన్‌కు తన ‘ఇన్షా అల్లా’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు సల్మాన్‌ఖాన్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించనున్న చిత్రం ‘ఇన్షా అల్లా’. ఆలియాభట్ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు ఇరవైఏళ్ల తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో నట్తిస్తున్నారు సల్మాన్. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999) సినిమా వచ్చింది. -
పోరాటం మొదలైంది
బ్రిటీషర్స్‌పై యుద్ధం మొదలెట్టారు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు. ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్ భామ ఆలియా భట్ కథానాయిక. చరణ్ సరసన ఆలియా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు కనిపిస్తారన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. తమిళ నటుడు సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, జిమ్‌లో గాయపడిన కారణంగా చరణ్ కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఈ షూటింగ్లో గాయపడిన ఎన్టీఆర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు హీరోలూ జోష్‌గా ఈ సెట్లోకి ఎంటరయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తాజా షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో ఆరంభం అయింది. నగర శివార్లలో వేసిన సెట్లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని తెలిసింది. దాదాపు నెలరోజులకు పైనే ఈ షెడ్యూల్ సాగనుందని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్. -
ప్రతి అడుగూ విలువైనదే
కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా ‘సడక్ 2’. మహేశ్‌భట్ దర్శకత్వంలోనే 1991లో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యారు ఆలియా. ‘‘సడక్ 2’ సెట్స్‌పైకి వెళ్లింది. మా నాన్నగారు (మహేశ్ భట్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అపారమైన, అందమైన, ఓ ఎమోషనల్ పర్వతాన్ని ఎక్కబోయే చిన్న ఎలుకగా నన్ను నేను ఊహించుకుంటున్నాను. నేను ఈ పర్వత శిఖరాన్ని చేరుకోగలనని అనుకుంటున్నాను. ఇది అనుకున్నంత ఈజీ కాదని తెలుసు (తండ్రి డైరెక్షన్లో, సీనియర్స్‌తో కలిసి నటించడాన్ని ఉద్దేశించి). ఒకవేళ మధ్యలో నేను పడిపోతే తిరిగి పుంజుకోగలననే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం వేసే ప్రతి అడుగూ విలువైనదే’’ అని ఆలియా అన్నారు. తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నారు ఆలియా. ఇక దాదాపు 20ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ సినిమా కోసం మహేశ్ భట్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. 1999లో వచ్చిన ‘కారతూష్’ చిత్రం తర్వాత మహేశ్ భట్ ఇంకో సినిమాకు దర్శకత్వం వహించలేదు. -
రణ్‌బీర్‌తో అనుబంధంపై అలియా రిప్లై
ముంబై : బాలీవుడ్లో లవ్ బర్డ్స్‌గా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అలియా భట్, రణ్‌బీర్ కపూర్ల అనుబంధంపై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది.వీరిద్దరూ కలిసి ఇటీవల ముంబైలో ఓ డిజైన్, ఆర్కిటెక్చర్ సంస్ధను సందర్శించడంతో బాలీవుడ్లో వదంతులు తీవ్రమయ్యాయి. గత ఏడాదిగా వీరు డేటింగ్లో ఉన్నా తమ రిలేషన్‌షిప్‌పై నోరుమెదపకపోవడం కూడా బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో వీరిద్దరి సాన్నిహిత్యం చూసిన వారు సైతం త్వరలో వివాహ బంధంతో వీరు ఒక్కటవుతారని భావించారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అలియా భట్ తేల్చేశారు. పెళ్లి గురించి ఆలోచించే వయసు తనకు లేదని..రణ్‌బీర్‌తో దృఢమైన బంధం అవసరమని తాను అనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని, ఇప్పటికైతే తాను తన పనినే ప్రేమిస్తున్నానని, ఈ దిశగా తన పయనం కూడా సంతృప్తిగా సాగుతోందని అలియా బదులిచ్చారు. -
కంగనా వివాదంపై స్పందించిన అలియా
ముంబై : బాలీవుడ్ భామలు కంగనా రనౌత్, అలియా భట్ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ట్వీట్ వార్ నేపథ్యంలో ఈ వివాదంపై అలియా భట్ నోరుమెదిపారు. అలియా నటనపై క్వీన్ కంగనా ఎద్దేవా , మణికర్ణిక హీరోయిన్‌పై అలియా తల్లి, మహేష్ భట్ భార్య సోని రజ్దాన్ వ్యాఖ్యలు, కంగనా సోదరి కౌంటర్లతో హాట్ హాట్‌గా ట్వీట్ వార్ సాగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలిద్దరి మధ్య ట్వీట్లతో చెలరేగిన చిచ్చుపై అలియా ఎట్టకేలకు స్పందించింది. అలియా ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వేడుకలకు హాజరైన సందర్భంగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ కంగనాతో విభేదాలపై తన వైఖరి ఏంటో స్పష్టం చేసింది. తన కంటే తన కుటుంబ సభ్యులు పది రెట్లు పరిణితి చెందిన వారని, బలమైన వ్యక్తిత్వం కలవారని చెప్పుకొచ్చింది. తానైతే కష్టపడటం, సంతోషంగా ఉండటం, ఇవాల్టికంటే రేపు మెరుగ్గా ఉండటంపైనే దృష్టిసారిస్తానని, ఇతరులు ఏం చెబుతున్నారు..ఏం మాట్లాడటంలేదనే విషయాలను అసలు పట్టించుకోనని, ప్రతిఒక్కరికీ వారు అనుకున్నది చెప్పే హక్కుందని తేల్చిచెప్పింది. కాగా అలియాపై తరచూ కంగనా చేస్తున్న వ్యాఖ్యలు మొత్తం వివాదంపై సోని రజ్ధాన్ స్పందిస్తూ చేసిన ట్వీట్ పెనుదుమారమే రేపింది. కంగనాకు మహేష్ భట్ బాలీవుడ్లో తొలి బ్రేక్ ఇస్తే ఆమె ఏకంగా ఆయన భార్య, కుమార్తెను లక్ష్యంగా చేసుకుని విద్వేషం చిమ్ముతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు కంగనా సోదరి రంగోలి చందేల్ దీటుగా బదులిచ్చారు. అలియా, రజ్దాన్లను ఉద్దేశిస్తూ భారతీయులు కాని వీరు భారత వనరులపై బతుకుతూ ఇక్కడి ప్రజలను వేధిస్తున్నారని, అసహనంపై అసత్యాలు ప్రచారం చేస్తూ ద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నారని ట్వీట్ చేయడం కలకలం రేపింది. -
‘కంగనాపై మహేష్ భట్ చెప్పు విసిరారు’
ముంబై : బాలీవుడ్ భామలు కంగనా రనౌత్, అలియా భట్ల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ గతంలో కంగనా రనౌత్‌పై చెప్పు విసిరారని ఆమె సోదరి రంగోలి చందేల్ తాజా ట్వీట్లో పేర్కొనడం సంచలనం రేపింది. 2006లో కంగనా రనౌత్ తాను నటించిన వాహ్ లంహే చిత్రాన్ని చూసేందుకు రాగా ఆమెపై మహేష్ భట్ చెప్పు విసిరాడని రంగోలి చందేల్ వరుస ట్వీట్లలో భగ్గుమన్నారు. ప్రివ్యూ థియేటర్లోకి కంగనాను అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించడంతో ఆ రాత్రంతా కంగనా ఏడుస్తూనే ఉన్నారని, అప్పుడామెకు 19 ఏళ్లు ఉంటాయని అన్నారు. తాజా ట్వీట్లతో కంగనా సోదరి రంగోలి, మహేష్ భట్ భార్య, అలియా భట్ తల్లి సోని రజ్దాన్ మధ్య సాగుతున్న ట్వీట్ వార్ మరింత ముదిరింది. కంగనా రనౌత్‌కు అవకాశాలు ఇచ్చి తన భర్త (మహేష్ భట్) ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆమె ఆయన భార్య, కుమార్తెపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని సోని రజ్దాన్ మండిపడిన విషయం తెలిసిందే. అలియా భట్‌పై గత కొంతకాలంగా వీలుచిక్కినప్పుడల్లా కంగనా రనౌత్ మండిపడుతున్నారు. తాను నటించిన మణికర్ణిక మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపించినా, అలియా మౌనం దాల్చడంపై కంగనా భగ్గుమన్నారు. అలియా భట్ నటనను చిన్నబుచ్చుతూ తనను ఆమెతో పోల్చవద్దని క్వీన్ పేర్కొనడం కూడా కంగనా, అలియా భట్ల మధ్య దూరాన్ని పెంచింది. -
తెలుగుతో కుస్తీ
అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ.. అంటూ తెలుగు పలుకులు పలుకుతున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. కష్టమైనా ఇష్టంగా తెలుగు పాఠాలను ఐపాడ్ మీద దిద్దుతున్నారామె. ఈ తెలుగు పాఠాలన్నీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసమే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో రామ్‌చరణ్ సరసన హీరోయిన్గా ఆలియా భట్ నటిస్తున్నారు. తన పాత్ర మీద బాధ్యతతో, తెలుగు డైలాగ్స్ పలకడం కోసం స్పెషల్ క్లాసులకు వెళ్తున్నారట ఆలియా . ఈ విషయం గురించి ఆలియా చెబుతూ – ‘‘తెలుగు నేర్చుకోవడం ఓ చాలెంజ్. ఎందుకంటే తెలుగు కొంచెం కష్టమైన భాష. కానీ భావాలను వ్యక్తపరచడానికి వీలైనటువంటి భాష కూడా. భాషకు సంబంధించిన చిన్న చిన్న డీటైల్స్ కూడా తెలుసుకుంటున్నాను. పదాలు ఇలానే ఎందుకు పలకాలి? ప్రతీ పదానికి అర్థమేంటి? అనేది తెలుసుకుంటున్నాను. అప్పుడే నా పాత్ర, అది పలికే సంభాషణలను పూర్తిగా తెలుసుకోగలను. ఒక్క తెలుగు వాక్యం పూర్తిగా పలికినా ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. -
స్క్రీన్ టెస్ట్
హీరోయిన్ అంటే తెరపై కనిపించడం వరకే అనే రోజులు మొదటి తరంలోనే లేవు. తెరపై రాణించడంతో పాటు తెర వెనక కూడా సాంకేతిక నిపుణులుగా సత్తా చాటిన, చాటుతున్న నాయికలు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రతిభావంతుల గురించి స్పెషల్ క్విజ్. 1. తెలుగు చలన చిత్రరంగంలో మొదటితరం సూపర్‌స్టార్ ఈమె. సినిమాకి సంబంధించిన అనేక శాఖల్లో ఈమెకు టాలెంట్ ఉండటం వల్ల ‘అష్టావధాని’ అనేవారు. అలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ఈ ప్రముఖ నటి ఎవరు? ఎ) సావిత్రి బి) భానుమతి సి) వాణిశ్రీ డి) జమున 2. 1990లలో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్న నటి ఆమె. తెలుగులో హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్నారామె. ఎవరా నటి? ఎ) రాధిక బి) ఖుష్బూ సి) విజయశాంతి డి) రాధ 3. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘సింధుభైరవి’కి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఆ చిత్రకథానాయిక ఎవరు? (చిన్న క్లూ: కథానాయిక కాకముందు ఆమె కెమెరా శాఖలో చేశారు) ఎ) సుహాసిని బి) సుమలత సి) ఆమని డి) సరిత 4. ‘అరుంధతి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకు చిరునామాగా మారారు అనుష్క. కానీ ఈమె తన మొదటి సినిమాలో కిలాడి లేడీగా నటించారు. అనుష్కను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) త్రివిక్రమ్ శ్రీనివాస్ సి) పూరి జగన్నాథ్ డి) శ్రీను వైట్ల 5. తమిళ నటుడు ‘శివాజీ గణేశన్’ని డైరెక్ట్ చేసిన నటీమణులు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు సావిత్రి. మరో దర్శకురాలు ఎవరో కనుక్కోండి? ఎ) సుజాత బి) కన్నాంబ సి) భానుమతి డి) విజయనిర్మల 6. ఆమె అసలు పేరు సరస్వతి. మూడు సార్లు నేషనల్ అవార్డు పొందారు. ఆ నటి పేరేంటి? (ఆమె తెలుగులో ఎంత పాపులరో మలయాళంలో కూడా అంతే పాపులర్) ఎ) శారద బి) కాంచన సి) అంజలీదేవి డి) ‘షావుకారు’ జానకి 7. జపాన్, జర్మన్, ఇంగ్లీషు భాషల్లోని పాటలతో పాటు మొత్తం 17 భాషల్లో తన గళాన్ని వినిపించారు ఈమె. వేల పాటలు పాడిన ఆ ప్రముఖ సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) వాణీ జయరాం బి) పి.సుశీల సి) చిత్ర డి) ఎస్. జానకి 8. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారీమె. ఆ తర్వాత కథానాయికగా కూడా రాణించారు. ‘సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా’ అంటూ నాగార్జునతో స్టెప్పులేసిన ఆ అందాల సుందరి ఎవరు? ఎ) సుస్మితా సేన్ బి) ప్రియాంకా చోప్రా సి) దియా మీర్జా డి) మాధురీ ధీక్షిత్ 9. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్, డబ్బింగ్ కళాకారిణి ఎవరు? ఎ) కస్తూరి బి) శ్రీరెడ్డి సి) చిన్మయి డి) కల్పన 10. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా 7 సంవత్సరాలు పని చేశారీమె. 2010లో ‘ద్రోహి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసి తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విజయం సాధించారు. ఎవరా దర్శకురాలు? ఎ) సుధా కొంగర బి) నందినీ రెడ్డి సి) అంజనా డి) చునియా 11. నెల్లూరులో పుట్టిన ఈ నటి పేరు రత్నకుమారి. 1966లో నటి జమున పక్కన చిన్న చెలికత్తె వేషంలో నటించారీమె. తర్వాత కాలంలో ఆమె చాలా పెద్ద హీరోయిన్ అయ్యారు. ఆమెవరో తెలుసా? ఎ) జయంతి బి) శారద సి) వాణీశ్రీ డి) ‘షావుకారు’ జానకి 12. 1994లో శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ‘బాండిట్ క్వీన్’ చిత్రంలో హీరోయిన్గా నటించిన అస్సామీ నటి పేరేంటి? ఎ) సీమా బిస్వాస్ బి) ఆషిమాల్లా సి) పాంచీ బోరా డి) నేహా జుల్కా 13. శివాజీగణేశన్‌తో 17 సినిమాలు, యన్టీఆర్ కాంబినేషన్లో 12 చిత్రాలు, అక్కినేనితో 8 చిత్రాల్లో నటించిన ఈ ప్రముఖ హీరోయిన్ ఎవరో కనుక్కోండి ? ( క్లూ: 2016లో ఆమె మరణించారు) ఎ) అంజలీదేవి బి) సావిత్రి సి) కృష్ణకుమారి డి) జయలలిత 14. ఇద్దరు టీవీ యాంకర్లను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ, దర్శకుడు దాసరి నారాయణరావు ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమా తీశారు. అందులో హీరోగా చేసింది అప్పటి యాంకర్, ఇప్పటి ఫిల్మ్ డైరెక్టర్ వక్కంతం వంశీ. మరి ఈ హీరోయిన్ ఎవరు? ఎ) సుమ బి) ఝాన్సీ సి) ఉదయభాను డి) శిల్పా చక్రవర్తి 15. తమిళంలో కె.బాలచందర్, తెలుగులో కె.రాఘవేంద్రరావు ఆమెను హీరోయిన్గా పరిచయం చేశారు. ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో క్రైమ్ రిపోర్టర్. ఆమె పేరేంటి? ఎ) శ్రీదేవి బి) జయప్రద సి) రేఖ డి) హేమమాలిని 16. మలయాళీ బ్యూటీ విద్యాబాలన్ బాలీవుడ్లో హోమ్లీ క్యారెక్టర్స్‌తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఓ ఐటెమ్ సాంగ్స్ క్వీన్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’లో హాట్‌గా కనిపించారు. ఇంతకీ ఆ ఐటెమ్ క్వీన్ ఎవరో తెలుసా? ఎ) జయమాలిని బి) సిల్క్ స్మిత సి) అనూరాధ డి) జ్యోతిలక్ష్మీ 17. 13వ శతాబ్దానికి చెందిన ‘పద్మావత్’ కథను అద్భుతంగా చూపించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ. పద్మావతిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) అలియా భట్ సి) దీపికా పదుకొనే డి) ప్రియాంకా చోప్రా 18. తెలుగు ప్రేక్షకులకు ‘దేవదాసు’ అనగానే అక్కినేని, సావిత్రి గుర్తుకొస్తారు. అదే పేరుతో బాలీవుడ్లో 2002లో షారుక్ ఖాన్ ఓ సినిమా చేశారు. అందులో దేవ్‌గా షారుఖ్ ఖాన్ నటించారు. మరి పార్వతిగా నటించింది ఎవరో కనుక్కోండి? ఎ) కాజోల్ బి) రాణీ ముఖర్జీ సి) ప్రీతీ జింటా డి) ఐశ్వర్యా రాయ్ 19. ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో దీపికా పదుకొనే లాంటి స్టార్ బాలీవుడ్‌కు లభించారు. ఆమెను ఆ చిత్రం ద్వారా పరిచయం చేసిన ప్రముఖ దర్శకురాలెవరు? ఎ) దీపామెహతా బి) ఫరాఖాన్ సి) జోయాఅక్తర్ డి) కొంకణాసేన్ శర్మ 20. ‘మిత్ర్.. మైఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దక్షిణ భారత నటి ఎవరో తెలుసా? ఎ) రేవతి బి) భానుప్రియ సి) శ్రీప్రియ డి) గౌతమి సమాధానాలు 1) (బి) 2) (సి) 3) (ఎ) 4) (సి) 5) (డి) 6) (ఎ) 7) (డి) 8) (ఎ) 9) (సి) 10) (ఎ) 11) (సి) 12) (ఎ) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (బి) 17) (సి) 18) (డి) 19) (బి) 20) (ఎ) మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! నిర్వహణ: శివ మల్లాల -
స్క్రీన్ టెస్ట్
1960–70లలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది అంటే ఆ పాటల కోసం స్పెషల్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. 90లలో సీన్ మారింది. స్పెషల్ ఆర్టిస్టులతో దాదాపు పని లేకుండా పోయింది. అందుకే అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, హలం, సిల్క్ స్మితల్లా ఇప్పుడు బోలెడంత మంది ఐటమ్ డ్యాన్సర్స్ లేరు. స్పెషల్ సాంగ్స్‌ను హీరోయిన్లు కూడా చేస్తున్నారు. సినిమా మార్కెటింగ్‌కు ఇదో కొత్తరూట్ అన్నమాట. ఏది ఏమైనా ‘ఐటమ్ సాంగ్’ అంటే కిక్కే వేరు. ఇలాంటి మస్త్ మసాలా పాటలకు కాలు కదిపిన తారల గురించి ఈ వారం క్విజ్. సరదాగా ఓ లుక్కేయండి. 1 ‘ఓ సుబ్బారావో ఓ అప్పారావో ఓ వెంకట్రావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా...’ అనే పాట యన్టీఆర్, శ్రీదేవి, జయచిత్ర నటించిన ‘బొబ్బిలిపులి’ చిత్రంలోనిది. ఆ పాట రచయిత ఎవరు? ఎ) వేటూరి బి) దాసరి నారాయణరావు సి) సిరివెన్నెల డి) కొసరాజు 2 ‘ఇప్పటికింకా నా వయను నిండా పదహారే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... ఈ ఒకే ఒక్క పాటతో యూత్ మొత్తానికి దగ్గరైన నటి ఎవరు? ఎ) గాబ్రియేలా బి) ముమైత్‌ఖాన్ సి) ఆండ్రియా డి) ముంతాజ్ 3 1980–90ల దశకంలో ఐటమ్ సాంగ్‌లతో ఓ వెలుగు వెలిగారు ప్రముఖ డ్యాన్సర్ అనూరాధ. అమె దాదాపు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 330 బి) 550 సి) 700 పైన డి) 1000 చిత్రాలు పైనే 4 సూపర్‌హిట్ సాంగ్ ‘లే లే లే లేలేలే నా రాజా..’ ప్రేమనగర్’ చిత్రంలోనిది. ఈ పాటను పాడిన సింగర్ పేరేంటి? ఎ) పి. సుశీల బి) ఎస్. జానకి సి) జిక్కీ డి) ఎల్.ఆర్. ఈశ్వరి 5. ‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకలో...’ అంటూ చిందులేసిన ప్రముఖ హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) అనుష్క సి) నయనతార డి) లావణ్యా త్రిపాఠి 6 1974లో ‘ఆడదాని అదృష్టం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు జయమాలిని. ఆమెను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? ఎ) కె.వి. రెడ్డి బి) విఠలాచార్య సి) వి. మధుసూదన్‌రావు డి) పి.సి. రెడ్డి 7 ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల’ పాట చాలా ఫేమస్. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) వయ్యారిభామలు వగలమారి భర్తలు బి) స్త్రీజన్మ సి) దేవుడు చేసిన మనుషులు డి) విచిత్ర కుటుంబం 8 ‘అ అంటే అమలాపురం ఆ ఆంటే ఆహాపురం...’ సూపర్‌హిట్ సాంగ్‌లో నటించిన నటి పేరేంటి? ఎ) నటాలియా కౌర్ బి) అభినయశ్రీ సి) రచనా మౌర్య డి) స్కార్లెట్ విల్సన్ 9 ‘నా ఇంటిపేరు సిల్క్ నా వంటి రంగు మిల్క్...’ అంటూ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చిందేసిన బ్యూటీ పేరేంటో? ఎ) శ్రియ బి) రాశీఖన్నా సి) సమంత డి) తమన్నా భాటియా 10 ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే...’ అనే పాటలో ప్రభాస్‌తో కాలు కదిపిన భామ ఎవరో? ఎ) మధుశర్మ బి) హంసానందిని సి) జబీన్ ఖాన్ డి) అల్ఫోన్సా 11 ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాణి...’ అంటూ ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ స్టెప్పులేసిన భామ పేరేంటి? ఎ) కియరా అద్వానిæ బి) శ్రుతీహాసన్ సి) అమీ జాక్సన్ డి) పూజా హెగ్డే 12 దర్శకుడు శేఖర్ కమ్ముల మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమాలు చేస్తారని పేరుంది. సందర్భానుసారంగా ఆయన కూడా ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఆ సాంగ్‌లో నటించింది ప్రముఖ టీవి యాంకర్. ఎవరా యాంకర్? ( క్లూ: ఆ పాట ఏంటంటే.. ‘రాజశేఖరా నీపై మోజూ తీరలేదురా, రాజసాన ఏలరా రాజా రాజా...’) ఎ) శిల్పాచక్రవర్తి బి) ఉదయభాను సి) అనసూయ డి) సుమ 13. ‘కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఈదంట నేనెల్తుంటే, కెవ్వుకేక....’ అనే పాటలో నటించిన బాలీవుడ్ హాట్ లేడీ ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) ఊర్మిళా మటోండ్కర్ సి) కత్రినాకైఫ్ డి) మలైకా అరోరా 14 ‘డియో డియో డిసక డిసక...’ అంటూ యూత్‌ను ఎట్రాక్ట్ చేసిన నటి పేరేంటి? ఎ) సన్నీ లియోన్ బి) రాఖీ సావంత్ సి) సెలీనా జైట్లీ డి) యానా గుప్తా 15 ‘బావలు సయ్యా మరదలు సయ్యా, రింబోల రింబోలా..’ అంటూ కోట శ్రీనివాసరావు, బాబుమోహన్లను ఓ ఆట ఆడించిన నటి ఎవరో గుర్తుందా? ఎ) డిస్కో శాంతి బి) ‘సిల్క్’ స్మిత సి) విజయలలిత డి) కుయిలీ 16 ‘చిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ...బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే ’అని అంజలి ఏ హీరోతో డ్యాన్స్ చేశారు? ఎ) రామ్‌చరణ్ బి) మహేశ్‌బాబు సి) యన్టీఆర్ డి) అల్లు అర్జున్ 17. ‘వెల్కమ్ టూ సక్కుబాయ్... గరమ్ చాయ్ తాగేసెయ్.. మజాచెయ్...’ అని చార్మీ ఏ హీరోతో స్టెప్పులేశారో గుర్తుందా? ఎ) నాగార్జున బి) బాలకృష్ణ సి) వెంకటేశ్ డి) రానా 18 ‘పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సాంగ్‌లో యన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేసిన ప్రముఖ డ్యాన్సర్ ఎవరో కనుక్కోండి? ఎ) హలం బి) అనురాధ సి) జయమాలిని డి) జ్యోతిలక్ష్మీ 19 ‘అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి...’ అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన ‘కొత్తజంట’ చిత్రంలోని పాట ఇది. ఈ పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కేథరిన్ బి) హన్సిక సి) మధురిమ డి) ఈషా రెబ్బా 20, ‘బళ్లారి బావ...’ అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డి హీరోలు వెంకటేశ్, రానాలతో కలిసి చిందేశారు. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) క్రిష్ సి) సుకుమార్ డి) కృష్ణవంశీ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) సి 4) డి 5) ఎ 6) బి 7) సి 8) బి 9) డి 10) బి 11) డి 12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) సి 19) సి 20) బి -
స్క్రీన్ టెస్ట్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏ స్థాయికి వెళతారో ఎవరూ ఊహించలేరు. అందుకే సినిమా అనేది చాలా మందికి డ్రీమ్. ఆ కలకి నాయకుడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ణి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక శాఖల్లో పని చేసిన అనుభవంతో మెగాఫోన్ పట్టిన దర్శకుల గురించి ఈ వారం క్విజ్ స్పెషల్... 1. ఈయన మొదట దర్శకుడు కాదు. ఎడిటింగ్ శాఖలో ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద దర్శకుడయ్యారు. ఎవరా డైరెక్టర్? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) వంశీ పైడిపల్లి డి) ఎస్.ఎస్ రాజమౌళి 2. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారామె. ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎవరా హీరోయిన్? ఎ) ‘షావుకారు’ జానకి బి) జమున సి) సావిత్రి డి) వాణిశ్రీ 3. ఈ ప్రముఖ హీరోల్లో ఓ హీరో మెగాఫోన్ పట్టుకోలేదు. ఆయనెవరో కనుక్కోండి? ఎ) అక్కినేని బి) కృష్ణ సి) యన్టీఆర్ డి) చిత్తూరు వి. నాగయ్య 4. దర్శకత్వం చేయకముందు నంబర్ ప్లేట్లకు స్టిక్కర్ డిజైనింగ్ చేయడంలో అందెవేసిన చెయ్యి ఈ దర్శకునిది. ఎవరా దర్శకుడు? ఎ) సుధీర్‌వర్మ బి) మారుతి సి) చిన్నికృష్ణ డి) విరించివర్మ 5. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతో దర్శకునిగా మారారు. అంతకుముందు ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) వక్కంతం వంశీ సి) కొరటాల శివ డి) దశరథ్ 6 నటి విజయశాంతి మేకప్‌మేన్‌గా ఈయన సుపరిచితుడు. ‘పెద్దరికం’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ పేరుంది. ఎవరతను? ఎ) బండ్ల గణేష్ బి) ‘దిల్’ రాజు సి) ఏ.యం.రత్నం డి) కాస్ట్యూమ్స్ కృష్ణ 7. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా 400 చిత్రాలకు పైగా పని చేశారీయన. తన దర్శకత్వ ప్రతిభతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎవరా నటుడు? ఎ) చలం బి) పద్మనాభం సి) రాజబాబు డి) రేలంగి 8. పవన్ కల్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ చిత్రంలో పవన్ సరసన నటించిన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) కీర్తి రెడ్డి బి) రేణూ దేశాయ్ సి) సుప్రియ డి) అమీషా పటేల్ 9. 1957లో ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలకృష్ణుని పాత్రలో నటించారీమె. 1971లో ‘మీనా’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఎవరా ప్రముఖ నటి? ఎ) బి.సరోజాదేవి బి) కృష్ణకుమారి సి) కాంచన డి) విజయనిర్మల 10. తమిళ నటుడు జీవా, కార్తీక కాంబినేషన్లో తమిళ్, తెలుగులో విడుదలైన చిత్రం ‘రంగం’. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామేన్. ఆ కెమెరామేన్ పేరేంటో కనుక్కోండి? ఎ) పీసీ శ్రీరామ్ బి) రాజీవన్ సి) కేవీ ఆనంద్ డి) రసూల్ ఎల్లోర్ 11. నటునిగా 150 చిత్రాలను పూర్తి చేసుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన దర్శకునిగా మారి ఎన్ని చిత్రాలు తెరకెక్కించారో తెలుసా? ఎ) 5 బి) 8 సి) 7 డి) 11 12. 1949లో యన్టీఆర్ నటించిన మొదటి చిత్రం ‘మన దేశం’ రిలీజైంది. 1961లో ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరేంటి? ఎ) తల్లా? పెళ్లామా? బి) వరకట్నం సి) సీతారామ కల్యాణం డి) శ్రీకృష్ణ పాండవీయం 13. దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినీ పరి శ్రమలో మొదట ఆయన ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఎడిటింగ్ బి) కెమెరా సి) ఆడియోగ్రాఫర్ డి) కొరియోగ్రాఫర్ 14 కమల్‌హాసన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చాచీ 420’. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) గౌతమి సి) అమలా డి) రమ్యకృష్ణ 15. ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకునిగా చాలా బాగాన్ని చిత్రీకరించారు క్రిష్. ఆ తర్వాత ఆయన ‘యన్టీఆర్’ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల మిగతా చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాయిక ఎవరో చెప్పుకోండి? ఎ) ఆలియా భట్ బి) దీపికా పదుకోన్ సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16 హీరో కృష్ణ దాదాపు 230 సినిమాల్లో నటించిన తర్వాత ‘సింహాసనం’ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ఆ సినిమాలో విషకన్య పాత్ర ద్వారా తెలుగులో నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) దివ్యభారతి బి) రేఖ సి) హేమమాలిని డి) మందాకిని 17. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం ‘చండీరాణి’. ఆ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఫేమస్ హీరోయిన్ ఎవరు? ఎ) భానుమతి బి) లక్ష్మీ సి) యస్.వరలక్ష్మీ డి) అంజలీదేవి 18. ఆయనో ప్రముఖ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడయ్యారు. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘దసరాబుల్లోడు’తో సంచలన విజయం నమోదు చేశారు. ఆ దర్శక–నిర్మాత ఎవరో తెలుసా? ఎ) వీబీ రాజేంద్రప్రసాద్ బి) కేయస్ ప్రకాశరావు సి) క్రాంతికుమార్ డి) మురారి 19. సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. ఆయన దర్శకుడు కాకముందు ఫేమస్ సినిమాటోగ్రాఫర్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటో గుర్తుందా? ఎ) జయం బి) చిత్రం సి) నిజం డి) ధైర్యం 20. తరుణ్, రాజా, సలోనిలు ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం ‘ఒక ఊరిలో’. ఆ చిత్రంతో దర్శకునిగా మారారు రమేశ్‌వర్మ. దర్శకుడు కాకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా? ఎ) స్టిల్ ఫొటోగ్రఫీ బి) ఆర్ట్ డైరెక్టర్ సి) పోస్టర్ డిజైనర్ డి) మ్యూజిక్ డైరెక్టర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) బి 5) సి 6) సి 7) బి 8) బి 9) డి 10) సి 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) డి 17) ఎ 18) ఎ 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
ప్రశ్నకు ప్రశ్న
ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ముంబైలో అందరికీ తెలుసు. ‘ఇది అర్థం అవ్వడానికి గొప్ప తెలివితేటలేం అక్కర్లేదు’ అంటారు ఆలియా తండ్రి మహేశ్ భట్. కానీ ప్రేమ సంగతి మాత్రం ఆలియా, రణ్‌బీర్ అఫీషియల్‌గా ఒప్పుకోరు. రీసెంట్గా ఆలియా ట్వీటర్లో తన అభిమానులతో చాట్ చేశారు. ఆలియా, రణ్‌బీర్ ప్రేమ విషయాన్ని స్వయంగా ఆలియా భట్ ద్వారానే చెప్పించాలనుకున్నాడు ఓ తుంటరి ఫ్యాన్. ‘‘మిమ్మల్ని ఆలియా కపూర్ అని పిలవొచ్చా?’ అని సూటిగా ప్రశ్నను సంధించాడు. అంత సులువుగా ఒప్పుకోవాలనుకోలేదు ఆలియా. అలాగని ఆ ప్రశ్ననుంచి తప్పించుకోవాలనీ అనుకోలేదు. వెంటనే ఆ ప్రశ్న అడిగిన హిమాన్షూ కకానీకి ‘మిమ్మలి హిమాన్షూ భట్ అని పిలవొచ్చా?’ అని తిరిగి ప్రశ్నించారామె. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. మరి సమాధానం దొరికేదెప్పుడబ్బా అంటే... కాలమే చెబుతుంది అనుకోవాలి. -
కొత్త ప్రయాణం
‘సడక్ 2’ ప్రయాణం మొదలైంది. ఈ చిత్రం కోసం లొకేషన్ సెర్చ్ స్టార్ట్ చేశారు దర్శకుడు మహేశ్ భట్. తన 70వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ భట్ ‘సడక్ 2’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న చిత్రమిదే కావడం విశేషం. 1999లో మహేశ్ భట్ చివరగా ‘కార్తూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘సడక్ 2’ కి సన్నాహాలు మొదలెట్టారు. 1991లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, పూజాభట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘‘సడక్ 2’ ప్రయాణం అధికారికంగా మొదలైంది. లైఫ్‌ను మార్చే కొత్త ప్రయాణం ఆరంభమైన అనుభూతి కలుగుతోంది. డెహ్రాడూన్, కేదార్నాథ్ ప్రదేశాలను షూటింగ్ కోసం పరిశీలించాం’’అన్నారు పూజాభట్. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
అలియా బ్యాగ్‌పైనే అందరి చూపు..
సాక్షి, ముంబై : సెలబ్రిటీలు వాడే దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఏమైనా అందరి చూపులూ వాటిపైనే కేంద్రీకృతమవుతుంటాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో బ్లూకలర్ బెల్ట్ బ్యాగ్‌తో సందడి చేశారు. అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్కైబ్లూ టీ షర్ట్‌పై అదే రంగు డెనిమ్స్ ధరించిన అలియా భట్ సింపుల్‌గా కనిపించినా, ట్రెండీ లుక్ మెయింటెయిన్ చేసింది.1890 అమెరికన్ డాలర్ల ఖరీదైన ఈ బ్యాగ్ మన కరెన్సీలో రూ 1,39,170లు పలుకుతుంది. బ్యాగ్ సైతం నీలం రంగులో ఉండేలా చూసుకున్న అలియా ఆల్ బ్లూ కలర్లో స్టన్నింగ్ ఎయిర్పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. -
మీటూ : నాపై లైంగిక దాడికి ప్రయత్నించారు
సాక్షి, ముంబై : బాలీవుడ్లో లైంగిక వేధింపులపై బాధితులు బాహాటంగా ముందుకొచ్చి చేపట్టిన మీటూ ఉద్యమం రోజురోజుకూ ప్రబలమవుతోంది. తనుశ్రీ దత్తా, వింటా నందా, సోనా మహాపాత్ర, సంధ్యా మృదుల్ వంటి పలువురు మహిళలు తమకెదురైన లైంగిక వేధింపులను వెల్లడించగా, తాజాగా అలియా భట్ తల్లి ప్రముఖ టీవీ, సినీ నటి సోనీ రజ్దాన్ గతంలో తనకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేశారు. తాను లైంగిక వేధింపులు ఎదుర్కోకపోయినా, లైంగిక దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక వ్యక్తి తనపై అత్యాచారం జరిపేందుకు విఫలయత్నం చేశాడని, అదృష్టవశాత్తూ అతని ప్రయత్నం ఫలించలేదని క్వింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దారుణ ఘటన జరిగినప్పటికీ నిందితుడి కుటుంబంపై ప్రభావం పడుతుందనే కారణంతో వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాను అతడితో మాట్లాడలేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాధ్ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తూ అలోక్ నాథ్ ప్రవర్తన అమర్యాదకరంగానే ఉంటుందని, మద్యం సేవిస్తే అలోక్ నాధ్ మరింత రెచ్చిపోతాడన్నారు. అలోక్ తనను చూసే పద్ధతి తనకు నచ్చేది కాదని చెప్పుకొచ్చారు. -
మాధురీతో పోటీ
ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం బల్గేరియాలో ఉన్నారు కథానాయిక ఆలియా భట్. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే ఆమె ఏం చేస్తారంటే ‘కళంక్’ సినిమా సెట్లో జాయిన్ అవుతారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ పీరియాడికల్ మూవీలో మాధురీ దీక్షిత్, ఆలియా భట్ కాంబినేషన్లో కథక్ డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సాంగ్ ఉందట. ఆల్రెడీ పండిట్ బిర్జు మహారాజ్ వద్ద మాధురి కథక్ నేర్చుకున్నారు. ఇక ఆలియా భట్ కూడా ఈ సాంగ్ కోసం ఎప్పటి నుంచో కథక్ నేర్చుకుంటున్నారట. అంతేకాదు సాంగ్ షూట్ టైమ్ దగ్గర పడుతుండటంతో రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నారట ఆలియా. ఏమైనా డౌట్స్ వస్తే మాధురి దగ్గర క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారట. సీనియర్‌తో ఈ పోటీలో ధీటుగా నిలవాలనుకుంటున్నారట. మరి.. ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందనేది వెండితెరపై చూడాల్సిందే. ‘కళంక్’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ముఖ్య తారలుగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. -
ప్రేమ కోసం యుద్ధం!
మొగల్ సామ్రాజ్యం గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కొన్ని సినిమాల్లో చూశాం. కానీ మొగల్ సామ్రాజ్యంలోని మరో కొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు బీటౌన్ దర్శక–నిర్మాత కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా తర్వాత ‘తక్త్’ సినిమాకు పూర్తి స్థాయి దర్శకునిగా చార్జ్ తీసుకున్నట్లు ఆయన గురువారం వెల్లడించారు. ఈ పీరియాడికల్ మూవీలో అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశాల్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్ ముఖ్య తారలుగా నటించనున్నారు. ధర్మ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతుందని బాలీవుడ్ సమాచారం. ‘‘చరిత్రలో పాతుకుపోయిన ఓ అద్భుతమైన కథను వెండితెరపైకి తీసుకు రాబోతున్నాం. ఒక కుంటుంబానికి ఉన్న ఆశ, లక్ష్యాలు, ప్రేమ, విజయాల సమాహారంతో ఈ సినిమా సాగుతుంది. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ‘వార్ ఫర్ లవ్’’ అని కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ధడక్’ సినిమాతో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సిల్వర్‌స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మల్టీస్టారర్ మూవీలో సీనియర్ యాక్టర్స్‌తో కలిసి నటిస్తే ఆమె కెరీర్‌కు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ‘ధడక్’ నిర్మాత కరణ్ జోహార్ అనే విషయం తెలిసిందే. రెండో సినిమా కూడా ఆయన కాంబినేషన్లో కుదిరిందంటే.. జాన్వీ యాక్టింగ్ స్కిల్స్, ప్రవర్తన కరణ్‌కి నచ్చి ఉంటాయి. పెళ్లి తర్వాత కరీనా కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన థర్డ్ మూవీ ఇది. పెళ్లి తర్వాత ‘వీరే దే వెడ్డింగ్’ సినిమాలో నటించిన కరీనా.. రీసెంట్గా అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అప్పుడు ఆలియా చిన్నపిల్ల
‘‘లాస్ట్ టైమ్ నేను హిందీ సినిమా చేసినప్పుడు ఆలియా భట్ చిన్నపిల్ల. ఇప్పుడు తనతో కలిసి యాక్ట్ చేస్తున్నాను’’ అని నవ్వుతూ అంటున్నారు నాగార్జున. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. 15 ఏళ్ల తర్వాత నాగార్జున నటిస్తున్న హిందీ చిత్రం ఇది. ఈ సినిమాలో యాక్ట్ చేయడం గురించి నాగ్ మాట్లాడుతూ – ‘‘లాస్ట్ టైమ్ హిందీ సినిమా ఎప్పుడు చేశానో సరిగ్గా గుర్తు లేదు. ‘బ్రహ్మాస్త్ర’ కథ చాలా నచ్చింది. తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర ఒకటి వస్తుందని ఊహించలేదు. స్టోరీ బావుంటే ఏ సినిమాలో అయినా యాక్ట్ చేయడానికి నేనెప్పుడూ రెడీ. అమితాబ్ తప్ప మిగతా అందరితో యాక్ట్ చేయడం ఫస్ట్ టైమ్. బల్గేరియాలో షూట్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు. ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున రోల్ గురించి కరణ్ మాట్లాడుతూ – ‘‘ఇందులో నాగార్జున యాక్ట్ చేయడం హానర్డ్గా, ఎగై్జటింగ్‌గా అనిపిస్తోంది. మీ (నాగార్జున) ప్రేమకు, ఎనర్జీకి థ్యాంక్యూ’’ అని పేర్కొన్నారు. రెండు పార్ట్స్‌గా రూపొందుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. అన్నట్లు ఈ షూటింగ్ లొకేషన్‌కి అమల కూడా వెళ్లారు. -
స్క్రీన్ టెస్ట్
1. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు నిర్మాతలు సి.అశ్వనీదత్, ‘దిల్’ రాజు. ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) సుకుమార్ బి) వంశీ పైడిపల్లి సి) త్రివిక్రమ్ డి) బోయపాటి శ్రీను 2. భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఏయం రత్నం ఒకరు. ఆయన ఏ హీరోయిన్‌కు మేకప్‌మేన్‌గా పని చేశారో తెలుసా? ఎ) విజయశాంతి బి) రాధిక సి) రాధ డి) శ్రీదేవి 3. ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుని ‘చి.ల.సౌ’ అనే సినిమా ద్వారా దర్శకునిగా మారారు. ఎవరతను? ఎ) నవీన్ చంద్ర బి) హను రాఘవపూడి సి) రాహుల్ రవీంద్రన్ డి) అరుణ్ అదిత్ 4. తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో ‘నాచ్చియార్’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఝాన్సీ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) జ్యోతిక సి) శ్రియ డి) అంజలి 5. ‘మృగం’ అనే డబ్బింగ్ చిత్రంలో నటించిన నటుడు ఇప్పుడు తెలుగులో మంచి ప్రామిసింగ్ ఆర్టిస్ట్. ఎవరు? ఎ) ఆర్య బి) భరత్ సి) శ్యామ్ డి) ఆది పినిశెట్టి 6. జయం, నిజం, వర్షం చిత్రాల విలన్‌గా నటించారీయన. ఈ హీరో నటించిన 25వ చిత్రం ఇటీవల విడుదలైంది. ఎవరా నటుడు? ఎ) నితిన్ బి) గోపీచంద్ సి) రామ్ డి) తరుణ్ 7. ‘బిVŠ బాస్’ మొదటి సీజన్ విజేత శివబాలాజీ. ఆయన తన మొదటి సినిమాలో ఏ హీరోతో కలిసి పనిచేశారో తెలుసా? ఎ) అల్లు అర్జున్ బి) నవదీప్ సి) ‘అల్లరి’ నరేశ్ డి) రవితేజ 8. నితిన్ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రాశీ ఖన్నా బి) ప్రణీత సి) లావణ్యా త్రిపాఠి డి) నివేథా థామస్ 9 తమిళంలోనూ, తెలుగులోనూ ఈ ఆర్టిస్ట్‌ని ‘ఇతను మావాడంటే మావాడు’ అని ఓన్ చేసుకున్నారు. ఆ నటుడెవరో? ఎ) ఎన్టీఆర్ బి) ఏయన్నార్ సి) యస్వీఆర్ డి) కాంతారావు 10. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవలను రచించింది యండమూరి. ఆ నవల ఆధారంగా తీసిన చిత్రంలో హీరో ఎవరో గుర్తుందా? ఎ) శ్రీకాంత్ బి) తరుణ్ సి) జేడీ చక్రవర్తి డి) వడ్డే నవీన్ 11. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే పాట ‘సీతారామ కల్యాణం’ చిత్రంలోనిది. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) కె.వి.మహదేవన్ సి) గాలి పెంచల నరసింహారావు డి) సాలూరి రాజేశ్వరరావు 12. ‘ఛత్రపతి’ చిత్రంలో ‘గుండుసూది గుండుసూది’ అనే పాటకు స్వరాలు సమకూర్చి, గొంతు కలిపింది యం.యం.కీరవాణి. ఆయనతో పాటు గొంతు కలిపిన లేడీ సింగర్ ఎవరో ఓ సారి గుర్తుపడదామా? ఎ) గీతామాధురి బి) శ్రావణ భార్గవి సి) సునీత డి) ప్రణవి 13. దర్శకుడు సుకుమార్ లెక్చరర్ అని చాలామందికి తెలుసు. ఆయన ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవారో తెలుసా? ఎ) మ్యాథ్స్ బి) సోషల్ సి) తెలుగు డి) ఇంగ్లీష్ 14. రీసెంట్గా తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన నటి ఎవరు? ఎ) మనీషా కోయిరాల బి) సోనాలీ బింద్రే సి) గౌతమి డి) మమతా మోహన్‌దాస్ 15. నాగచైతన్య నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అల్లుడు నాగచైతన్య అయితే అత్తగా నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) భూమిక బి) నదియా సి) వాణీ విశ్వనాథ్ డి) రమ్యకృష్ణ 16. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన చిన్న కుమారునికి నామకరణం చేశారు. ఆ నందమూరి చిన్నారికి ఏ పేరు పెట్టారో తెలుసా? ఎ) అభయ్ రామ్ బి) భార్గవ రామ్ సి) శౌర్య రామ్ డి) తారక్ రామ్ 17. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో ఓ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ‘శ్రద్ధాకపూర్’ నటిస్తున్నారు. మరో బాలీవుడ్ నటి కూడా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) ఎవెలిన్ శర్మ బి) అనుష్కా శర్మ సి) ఆలియా భట్ డి) దీపికా పదుకోన్ 18. ‘మిణుగురులు’ చిత్రానికి దర్శకత్వం వహించి, పలు అవార్డులు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ‘24 కిసెస్’ అనే చిత్రం రానుంది. ఆ చిత్రంలో నటిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) కృతీ కర్భందా బి) హెబ్బా పటేల్ సి) రష్మికా మండన్నా డి) నందితా రాజ్ 19. ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) షావుకారు జానకి బి) అంజలీదేవి సి) భానుమతి డి) బి. సరోజాదేవి 20. ఈ కింది ఫోటోలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఇప్పటి టాప్ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) సన్నీ లీయోన్ సి) పరిణీతీ చోప్రా డి) సోనాక్షీ సిన్హా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) బి 5) డి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) డి 16) బి 17) ఎ 18) బి 19) సి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
నాగ్ బ్రహ్మాస్త్రం
దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి హిందీ చిత్రంలో నాగార్జున నటించి. జేపీ దత్తా దర్శకత్వంలో 2003 రూపొందిన ‘ఎల్ఓసీ కార్గిల్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారు నాగార్జున. అంతకు ముందు ‘శివ, ఖుదా గవా, క్రిమినల్, ద్రోహి’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నాగ్. ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, నాగార్జున, ఆలియా భట్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ జరిగిన బల్గేరియాలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టారై్టంది. ఈ షెడ్యూల్లో ఈ నెల 19వరకు నాగార్జున పాల్గొంటారని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ మూడు పార్టులుగా నిర్మించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ‘బ్రహ్మాస్త్ర’ తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని గతంలో చిత్రబృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆ మాటంటే ఒప్పుకోను!
ఓ ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత కొందరు కథానాయికలు యాక్టింగ్‌కు బై బై చెబుతారు. పెళ్లి తర్వాత మరికొందరు స్మాల్ బ్రేక్ ఇచ్చి, మళ్లీ కెమెరా ముందుకు వస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ లాంగ్ బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ అంటూ షూట్‌లోకి అడుగుపెడతారు ఇంకొందరు కథానాయికలు. ఇలా పెళ్లి తర్వాత కథానాయికలు కెరీర్ గ్రాఫ్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి... మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే స్పీడ్‌లో యాక్ట్ చేస్తారా? అన్న ప్రశ్నను ఆలియా ముందు ఉంచితే... ‘‘పెళ్లి చేసుకున్నంత మాత్రాన కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాలన్నా, అవకాశాలు తగ్గిపోతాయని ఎవరైనా అన్నా నేను ఒప్పుకోను. ప్రతిభ ఉంటే చాన్సులు ఆగవు. ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ జర్నీకి పెళ్లితో సంబంధం లేదని నా ఫీలింగ్. ఈ విషయాన్ని అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు కూడా. నేనూ అలాగే కొనసాగుతాను. మంచి యాక్టర్ కెరీర్‌ను రిలేషన్షిప్ స్టేటస్ ప్రభావితం చేయదు’’ అని అంటున్నారు ఆలియా భట్. అలాగే రణ్‌బీర్ కపూర్‌తో రిలేషన్ ఏంటీ? అన్న ప్రశ్నకు మాత్రం–‘‘అమేజింగ్ కో స్టార్’’ అంటూ తెలివిగా మాట దాటేశారు. కానీ, వారిద్దరి పెళ్లి గురించి మీడియాలో వస్తున్న గాసిప్‌లకు ఫుల్స్టాప్ పెట్టలేదు. ప్రస్తుతం ‘కళంక్, బ్రహ్మాస్త్ర’ సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు ఆలియా. -
కాస్టింగ్ కౌచ్ బాధితులకు అలియా భట్ సలహా..
సాక్షి, ముంబయి : కాస్టింగ్ కౌచ్‌పై విస్తృత చర్చ సాగుతున్న క్రమంలో బాలీవుడ్ భామ అలియా భట్ స్పందించారు. కాస్టింగ్ కౌచ్ ఒక్కసారిగా ప్రధాన అంశంగా ముందుకొచ్చిందని, ఇలాంటి అంశాలు చర్చకు రాగానే వాతావరణమంతా ప్రతికూలంగా మారుతుందని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ గురించి ప్రజలు చెడుగా ఆలోచించడం ప్రారంభిస్తారన్నారు. కాస్టింగ్ కౌచ్ తనకెప్పుడూ ఎదురవలేదని చెప్పుకొచ్చారు. అయితే అవకాశాల కోసం యువతీ యువకులు పరిశ్రమలో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారన్నారు. ఈ క్రమంలో వారి బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారని అలియా భట్ వ్యాఖ్యానించారు. కాస్టింగ్ కౌచ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని దీన్ని ఎదుర్కొనేందుకు నటీనటులు తమపై తాము విశ్వాసం ఉంచాలన్నారు. ఇలాంటి అనుభవం ఎదురైతే తక్షణమే తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. కాస్టింగ్ కౌచ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్‌ను సమర్థిస్తూ సరోజ్ ఖాన్, శత్రుజ్ఞ సిన్హా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపగా, ఈ విష సంస్కృతిపై పెద్దసంఖ్యలో హీరోయిన్లు గళమెత్తారు. -
ముంబైలో ఢిల్లీ!
ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడానికి దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఫ్లైట్‌లో వెళ్లినా రెండుగంటల టైమ్ పడుతుంది. కానీ ‘కళంక్’ టీమ్ మెంబర్స్ మాత్రం అరగంటలోపే వెళ్లగలరు. అందుకోసం దాదాపు 17 కోట్లు ఖర్చుపెట్టారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మేటర్ కంటిన్యూ చేస్తే క్లారిటీ దొరుకుతుంది. హిందీ మూవీ ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అదిత్యా రాయ్ కపూర్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘కళంక్’. ఈ నెల 18న మూవీని స్టార్ట్ చేశారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం ముంబైలోని ఓ స్టూడియోలో ఢిల్లీ సెట్ వేశారు. అదీ అసలు విషయం. ఢిల్లీ వెళ్లకుండా ముంబైలోనే ఢిల్లీని చూస్తోంది ఈ యూనిట్. శుక్రవారం నుంచి మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘‘కళంక్’ సినిమా సెట్లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘బక్కెట్ లిస్ట్’ మూవీ తర్వాత కరణ్ జోహార్‌తో అసోసియేట్ అయిన రెండో చిత్రమిది’’ అన్నారు మాధురీ దీక్షిత్. ఆమె లీడ్ రోల్ చేసిన మరాఠి సినిమా ‘బక్కెట్ లిస్ట్’ వచ్చే నెల 25న రిలీజ్ కానుంది. అంతేకాదు మరాఠీలో ఒక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారామె. ‘కళంక్’ సినిమాతో పాటు ‘టోటల్ ధమాల్’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు మాధురీ. ‘టోటల్ ధమాల్’ ఈ ఏడాది డిసెంబర్లో, ‘కళంక్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నాయి. -
వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే..
సాక్షి, ముంబయి: బాలీవుడ్లో ఖాన్ త్రయం తర్వాత యువ కెరటాల్లా దూసుకొస్తున్న నవతరం హీరో, హీరోయిన్లు పెద్దమొత్తంలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ధావన్ వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళుతూ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమాకు వరుణ్ ధావన్ ఏకంగా రూ 32 కోట్లు రెమ్యూనరేషన్ సొంతం చేసుకున్నారు. ఇక బాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ అలియా భట్ హైవే, ఉడ్తా పంజాబ్ సినిమాలతో తన నటనా సామర్థ్యాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ పాతికేళ్ల బ్యూటీ రూ 7 కోట్ల పారితోషికం వసూలు చేస్తున్నారు. పద్మావత్ మూవీలో ఖిల్జీగా నట విశ్వరూపం ప్రదర్శించిన రణ్వీర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ 300 కోట్లు పైగా కలెక్ట్ చేయడంతో తన రెమ్యూనరేషన్‌నూ అమాంతం పెంచేశారు. రణ్వీర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ 13 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతున్న దీపికా పదుకోన్ పద్మావత్ ఘనవిజయంతో తనకు ఆ మాత్రం ఇవ్వడంసముచితమేనంటూ పారితోషికం మరింత పెంచే పనిలో పడ్డారు. షారుక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ రూ 8 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నారు. బాలీవుడ్ కండలవీరుడిగా పేరొందిన సల్మాన్ ఖాన్‌ను మరిపించే బాడీతో తెరపై యాక్షన్ సీక్వెన్స్‌లను అలవోకగా పండిస్తున్న టైగర్ ష్రాఫ్ తక్కువ సినిమాలే చేసినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. బాఘీ 2తో ఘన విజయం అందుకున్న టైగర్ ప్రస్తుతం రూ 3 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ త్వరలోనే ఆయన పారితోషికం భారీగా పెరుగుతుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గత సినిమాలు నిరాశపరిచినప్పటికీ సాహో మూవీకి ఆమె ఏకంగా రూ 9 కోట్లు పారితోషికం రాబట్టడంతో శ్రద్ధ మార్కెట్ చెక్కుచెదరలేదు. బాలీవుడ్ మూవీలకు మాత్రం ఆమె రూ 5 కోట్లు డిమాండ్ చేస్తారని, సాహో పలు భాషల్లో తెరకెక్కుతుండటంతో అదే స్ధాయిలో పారితోషికం డిమాండ్ చేశారు. -
నా కూతురుకి సలహాలు అక్కర్లేదు: నటి తల్లి
ముంబయి: అతి పిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అలియా భట్‌ను చూసి ఆమె తల్లి ఎంతో ముచ్చటపడుతోందట. తండ్రి మహేశ్ భట్, సోదరి షహీన్ భట్ కూడా అలియా గురించి తెగ గర్విస్తుంటారని, నలుగురితో చెప్పుకుంటూ సంబరపడిపోతుంటారని ఆమె తల్లి సోనీ రజ్దాన్ అంటున్నారు. ఏ సినిమాలు చేయాలి? ఏవి చేయకూడదు అనే విషయంలో తాము తమ కూతురుకి సలహాలు ఇవ్వనవసరం లేదని, తానే స్వయంగా ఎంచుకొని నటించగలుగుతుందని, ఇప్పటికే ఆ విషయాన్ని కూడా నిరూపించుకుందని తెలిపారు. తాము ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే అది చేసే పనిలో అంకిత భావం ఉండాలని, ప్రతి రోజూ ఎంతో కొంత మెరుగును చూపించగలగాలని, కష్టపడి పనిచేసే మనస్తత్వం అలవాటు చేసుకోవాలని మాత్రమే చెబుతామన్నారు. ఒక తల్లిగా తానెప్పుడూ అలియాతోనే ఉంటానని, కానీ, వృత్తిరీత్యా, వ్యక్తిగతంగా ఎలా ఉండాలో తనకు తెలుసని చెప్పారు. -
ఆ హీరోతో నో ప్రాబ్లమ్: నటి
ముంబయి: బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండేజ్ చేసిన వ్యాఖ్యలు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు సంతోషాన్నిస్తాయి. కానీ అతడి ప్రేయసి అలియా భట్‌కు మాత్రం చాలా కోసం తెప్పించే ఉంటాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీలంక భామ జాక్వెలైన్ మాట్లాడుతూ.. 'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా ఈజీగా కలిసిపోతాను. అతడితో నటించడమంటే కష్టమనిపించదు. అతడు చాలా ఎనర్జీతో నటిస్తాడు. అందుకే ఇతర హీరోలతో పోల్చితే సిద్ధార్థ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చాలా ఈజీగా ఉంటుందని' ఆమె పేర్కొన్నారు. జాక్వెలైన్ కామెంట్లపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె చెప్పిన విషయం నిజమేనన్నాడు సిద్ధార్థ్. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో బిజీ షెడ్యూలున్నా తనలాగే జాక్వెలైన్ ఎంతో ఎనర్జీతో పనిచేస్తుందని, కష్టించేతత్వం ఆమె సొంతమని కితాబిచ్చాడు. మరోవైపు తన ప్రియుడు సిద్ధార్థ్‌తో జాక్వెలైన్ క్లోజ్‌గా ఉండటంపై అలియా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆ మధ్య ప్రియుడిపై అలిగిన అలియా.. తమ వెకేషన్‌ను రద్దు చేసినట్లు బీటౌన్‌లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు ఒకరిపై మరొకరు ఈ తరహాలో ప్రశంసలు కురిపిస్తుంటే అలియా ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాక్వెలైన్లు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'ఏ జెంటిల్మన్'. ఆగస్టు 25న ఈ మూవీ విడుదల కానుంది. -
'మా సినిమాను బ్యాన్ చేయలేదు'
షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. పంజాబ్‌లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ సినిమాను సర్టిఫై చేయడానికి అంగీకరించటం లేదని, అసలు పూర్తిగా సినిమాను బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర సహనిర్మాత అనురాగ్ కశ్యప్, నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ క్లారిటీ ఇచ్చాయి. తమ సినిమాను బ్యాన్ చేయలేదని, ఎగ్జామినింగ్ కమిటీలో సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయాభేదాలు వచ్చాయని, ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ ముందు ఉందని, త్వరలోనే సినిమాపై ప్రకటన వస్తుందని తెలిపారు. అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో షాహిద్ కపూర్ పాత్ర అసభ్యకర డైలాగ్‌లు ఉన్నాయన్న కారణంతో సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. -
సీక్వల్ సినిమాతో వారసుల ఎంట్రీ
సౌత్ ఇండస్ట్రీలోనే కాదు నార్త్‌లోనూ స్టార్ వారసుల హవా బాగా కనిపిస్తోంది. ఇప్పటికే వారసులగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది తారలు స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతుండగా, ఇప్పుడు ఒకే సినిమాతో ఇద్దరు స్టార్ వారసులు తెరంగేట్రానికి రెడీ అవుతున్నారు. అది కూడా గతంలో స్టార్ వారసులను పరిచయం చేసిన సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న సినిమాతో ఎంట్రీ ఇస్తుండటం మరో విశేషం. ఒకప్పుడు ప్రేమ జంటగా బాలీవుడ్ యమా పాపులర్ అయిన షాహిద్ కపూర్, కరీనా కపూర్ల వారసులు ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్, మొదటి భార్య కూతురు, సారా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. తనతో పాటు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ ఇద్దరు స్టార్ వారసులతో 2012లో ఘన విజయం సాధించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అలియాభట్, వరుణ్ ధావన్, సిద్దార్ధ్ మల్హోత్రలకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే తమ కెరీర్‌కు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఈ స్టార్ వారసులు. -
లక్కీ ఛాన్స్ వదులుకుందా..!
ముంబయి: ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ మూవీ 'నీరజా'. ఈ మూవీలో నటనకు గానూ సోనమ్ కపూర్ విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇందుకు కారణం.. ఆమె నటన మాత్రమే కాదు, ఆమె ఎంచుకున్న పాత్ర కూడా ఇందుకు తోడైంది. ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీలో సోనమ్ కు అవకాశం ఇవ్వాలని దర్శకనిర్మాతలు అసలు అనుకోలేదట. మొదట ఈ మూవీ కోసం ఆలియా భట్ ను తీసుకోవాలని భావించారట. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ సోనమ్ ను ఈ అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో ఒక్కసారిగా మరింత పాపులర్ స్టార్ గా మారిపోయింది. ఆమె చాలా ప్రతిభ గల హీరోయిన్ అని, ఆమె నటించిన నీరజా సినిమాతో తానెంటో రుజువు చేసుకుంటుందని అమీర్ ఖాన్, మరి కొందరు ప్రముఖుల నుంచి సోనమ్ ప్రశంసలు అందుకుంది. రాం మద్వానీ 'నీరజ' మూవీకి దర్శకత్వం వహించారు. నీరజ సినిమాను పాన్ ఎమ్ 73 విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన యదార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన విషయం తెలిసిందే. మహిళా సిబ్బందిలో ఒకరైన నిరజా బానోతు విమానంలోని ప్రయాణికులను కాపాడుకునేందుకు చూపించిన తెగువ అద్భుతంగా తెరకెక్కించారు. ఆలియా భట్ ఓ మంచి అవకాశాన్ని కోల్పోయిందని బాలీవుడ్ లో ఈ మధ్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. తనకు తానే ఈ మూవీలో అవకాశం వదులుకున్నట్లయితే ఓ మంచి సినిమాను ఆలియా చేజేతులారా పోగొట్టుకున్నట్టేనని కొందరు బాలీవుడ్ సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. -
అఖిల్ సరసన అలియా
అఖిల్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని వారసుడు. కొత్త కథతో ప్రయోగం చేసేకన్నా.. ఇప్పటికే ప్రూవ్ అయిన హిట్ సబ్జెక్ట్‌నే ఎంచుకోవటం బెటర్ అని ఫీల్ అవుతున్నాడట. అంతేకాదు అప్పుడే మాస్ ఇమేజ్ కోసం పాకులాడే కన్నా.. తన లుక్, వయసుకు తగ్గట్టుగా లవ్ స్టోరితో ఆడియన్స్‌ను అలరించాలని భావిస్తున్నాడు. అందుకే ఓ బాలీవుడ్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. రణబీర్ కపూర్, దీపిక పదుకొణ్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఏ జవానీ హై దివానీ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. అంతేకాదు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ టాలీవుడ్లో అడుగుపెట్టడానికి ప్లాన్ చేసుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్ అథినేత కరణ్ జోహార్‌తో కలిసి నాగార్జున ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ లీడ్ రోల్లో ఫ్రెంచ్ మూవీ ఇంటచబుల్స్ను ఊపిరి పేరుతో రీమేక్ చేస్తున్నాడు వంశీ. ఫ్రెంచ్ సినిమాను సౌత్ నేటివిటి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన వంశీపైడిపల్లి అయితే ఏ జవానీ హై దివానీని తెలుగు నేటివిటి తగ్గట్టుగా రూపొందిచగలడని భావిస్తున్నాడు నాగ్. ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ డాల్ అలియా భట్ హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. -
తొలిరోజు కలెక్షన్స్ అదుర్స్!
షాహిద్ కపూర్, అలియా భట్ జంటగా దర్శకుడు వికాస్ భల్ తీసిన తాజా చిత్రం 'షాన్‌దార్'. ఈ సినిమాకు వచ్చిన 'రివ్యూ'ల సంగతి ఎలా ఉన్నా.. మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. తొలిరోజు ఈ సినిమా రూ. 11 కోట్లు వసూలు చేసింది. షాహిద్ కెరీర్లోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్ ఇది. దసరా రోజున ఈ విడుదలైన ఈ సినిమా ఈ వీకెండ్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ సాధించినట్టు భావిస్తున్నారు. అయితే వీకెండ్ ట్రేడ్ రిపోర్టు రావాల్సి ఉంది. వెడ్డింగ్ ఆర్గనైజర్ జాగిందర్ జోగిందర్గా షాహిద్ కపూర్, వధువు సోదరిగా అలియ భట్ నటించిన ఈ సినిమాపై విమర్శకులు, సినీ సమీక్షులు పెదవి విరిచారు. ఈ సినిమాకు క్రిటిక్స్ పెద్దగా రేటింగ్ ఇవ్వలేదు. -
'వెడ్డింగ్ పులావ్' మూవీ రివ్యూ
టైటిల్: వెడ్డింగ్ పులావ్ జానర్: రొమాంటిక్ కామెడీ తారాగణం: అనుష్క రంజన్, దిగాంత్, సోనాలి సెహగల్, కరణ్ గ్రోవర్, రిషీ కపూర్. దర్శకత్వం: వినోద్ ప్రధాన్ నిర్మాత: శశీ రంజన్, అను రంజన్ అంతా కొత్తవారితో తెరకెక్కిన బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వెడ్డింగ్ పులావ్. వినోద్ ప్రధాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ పెళ్లి చుట్టూ తిరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రచారంతో కాస్త హైప్ క్రియేట్ చేసిన వెడ్డింగ్ పులావ్ ఆడియన్స్ ను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం. కథ : అనుష్క అలియాస్ లంబు (అనుష్క రంజన్), ఆదిత్య (దిగంత్) లు మంచి స్నేహితులు. ఎంతో స్నేహంగా ఉండే ఈ ఇద్దరు చాలా రోజుల తర్వాత తాము ప్రేమలో ఉన్నట్టు గుర్తిస్తారు. అయితే ఆ సమయానికి ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు కుదురుతాయి. అనుష్కకు జై( కరణ్ గ్రోవర్)తో, ఆదిత్యకు రియా( సొనాలి సెహగల్)తో నిశ్చితార్థం అయిపోతుంది. ఆ తరువాత ఈ ఇద్దరు ప్రేమికులు ఏం చేశారు, తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేదే మిగతా కథ. విశ్లేషణ : కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎన్నో బాలీవుడ్ సినిమాలు తెరకెక్కిన అదే పాత ఫార్ములాతో ఈ సినిమాను తెరకెక్కించారు. పంజాబీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో కాస్త ఫ్రెండ్ షిప్, ఇంకాస్త లవ్ స్టోరీ కలిపి సినిమాటిక్ గా చూపించారు. సినిమాలో ఒక్క రిషి కపూర్ తప్ప మిగతా అంతా కొత్తవారు కావటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. ముఖ్యంగా లవ్ సీన్స్ పండించటంలో కొత్త తారలు ఫెయిల్ అయ్యారు. ప్లస్ పాయింట్స్ : రిషి కపూర్ క్యారెక్టర్ లొకేషన్స్ మైనస్ పాయింట్స్ : హీరో హీరోయిన్ల పర్ఫామెన్స్ రొటీన్ కథ, కథనం ఓవరాల్‌గా 'వెడ్డింగ్ పులావ్' ఏ సెక్షన్ ఆడియన్స్‌కు కూడా టేస్టీగా అనిపించటం లేదు. -
కాలు నిలవడంలేదు: ఆలియా భట్
ముంబై: అతడి వయసేమో 50 ఏళ్లు. అందులో సగం.. అంటే కనీసం పాతికేళ్లు కూడా నిండలేదు ఆమెకు. కానీ అతనితో ఎప్పుడెప్పుడు స్టెప్పులేస్తానా.. అని ఆశగా ఎదురు చూస్తున్నానంటోంది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ తదుపరి సినిమాలో హీరోయిన్గా ఖరారు కావడం అంతులేని ఆనందాన్ని కలిగిస్తున్నదని, షూటింగ్ ప్రారంభమయ్యేదాకా ఆగలేకపోతున్నాని, కాలు నిలవడంలేదంటూ ఆలియా బుధవారం ట్వీట్ చేసింది. తన ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానంపై గతంలో విమర్శలు ఎదుర్కొన్న దృష్ట్యా ఇకపై ఆ భాషతో సమస్యలు తీరిపోయినట్లేనని ఆలియా భావిస్తున్నది. ఎందుకంటే కొత్త సినిమాను డైరెక్ట్ చేయబోయే గౌరీ షిండే.. గతంలో శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ సినిమా 'ఇంగ్లీష్- వింగ్లీష్' తో మంచి పేరుతెచ్చుకుంది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. షారూఖ్ కే చెందిన రెడ్ చిల్లీస్, హోప్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సహసమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మరో ట్వీట్ ద్వారా తెలిపారు దర్శకనిర్మాత కరణ జోహార్. Will no longer have any problem with my English Vinglish.. can't wait to be directed by Gauri Shinde with the man himself Shahrukh Khan!!! — SHAANDAAR Alia (@aliaa08) August 19, 2015