దఢక్‌తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే ఫేమస్ అయింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఈ బ్యూటీని టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు మన డైరెక్టర్ట్స్ అండ్ ప్రొడ్యూస్స్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కానీ జాన్వీ మాత్రం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. ముందు బాలీవుడ్‌లో స్టార్‌డమ్ అందుకున్న తర్వాతే సౌత్ వైపు చూడాలనుకుంటోంది. అందుకే ఇంత కాలం టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది.
కానీ ఇప్పుడు ఆమె మనసు మారిందట. బాలీవుడ్ లీడింగ్ లేడీస్ దీపిక, ఆలియాల మాదిరే జాన్వీ కూడా టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే రెండు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుందట. అయితే ఈ రెండూ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఒకటి పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ జనగణమన, మరోకొటి కరణ్ జోహర్ అక్కినేని హీరో అఖిల్ తో ప్లాన్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అట. మరి టాలీవుడ్‌లో జాన్వీ లక్ ఎలా ఉంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment