Akhil
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
చిత్తూరు నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమా ప్రకటన
అఖిల్ హీరోగా ‘వినరోభాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగిందని, ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అని తెలిసింది. ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే రూరల్ లవ్‌స్టోరీ మూవీ అని ఫిల్మ్‌నగర్ భోగట్టా. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి. అలా మరో యూత్‌ఫుల్ కామెడీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్‌సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్‌బాస్‌లో రెండు సార్లు రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో అతడికి టైటిల్ చేజారింది. బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్‌కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్‌గా వేరే లెవెల్ ఆఫీస్..తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్‌కు రీమేక్‌గా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్- 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. View this post on Instagram A post shared by OTT Updates (@upcoming_ott_release) -
మిషన్ మేకోవర్
సినిమా కథకు తగ్గట్లుగా డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చేయడమే కాదు... క్యారెక్టరైజేషన్‌కు సరిపోయేట్లు హీరోల ఆహార్యం కూడా ఉండాలి... గెటప్ కుదరాలి. అప్పుడే సిల్వర్ స్క్రీన్‌పై కథ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇలా కనెక్ట్ కావడం కోసం కొందరు హీరోలు మేకోవర్ మిషన్‌ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘తండేల్’ కోసం నాగచైతన్య, ‘స్వయంభూ’కి నిఖిల్, ‘స్వాగ్’కి శ్రీవిష్ణు వంటి హీరోలు మేకోవర్ అయ్యారు. త్వరలో సెట్స్‌కి వెళ్లడానికి మిషన్ మేకోవర్ అంటూ రెడీ అవుతున్న హీరోల గురించి తెలుసుకుందాం.⇒ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్‌పై మహేశ్‌బాబును సరికొత్తగా చూపించాలని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. ఇందుకు తగ్గట్లుగానే మహేశ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మేకోవర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మహేశ్ విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ సినిమాలో మహేశ్ లుక్, గెటప్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈ చిత్రకథను ఇప్పటికే పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్. పాటల పని కూడా ఆరంభించారు సంగీతదర్శకుడు కీరవాణి. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ కొత్త సినిమా మేకోవర్ అంటే చాలు... ఎన్టీఆర్ రెడీ అనేస్తారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ గ్యాప్‌లో ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమా తొలి భాగం షూట్‌ను పూర్తి చేసి, ‘డ్రాగన్’ మేకోవర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా, విలన్‌గా బాబీ డియోల్ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్‌తో రామ్‌చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రామ్‌చరణ్ ఆస్ట్రేలియా వెళ్తారు. హాలీడే కోసం కాదు.... బుచ్చిబాబు సన దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలోని క్యారెక్టర్ మేకోవర్ కోసం వెళ్లనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులోప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బుచ్చిబాబు. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీలోని గెటప్స్ కోసం చరణ్ ప్రత్యేక్ష శిక్షణ తీసుకోనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ⇒ విజయ్ దేవరకొండను ఇప్పటివరకు అర్బన్, సెమీ అర్బన్ కుర్రాడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్‌పై చూశాం. కానీ తొలిసారి పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ మాస్ డ్రామాగా ఓ మూవీ రానుంది. ఈ సినిమా కోసమే విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా మేకోవర్ కానున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తన కొత్త మేకోవర్ ఆరంభిస్తారట విజయ్. ⇒ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన గత చిత్రం ‘ఏజెంట్’. ఈ స్పై మూవీ కోసం అఖిల్ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటించాల్సిన కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అఖిల్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఫ్యాంటసీ అండ్ పీరియాడికల్ యాక్షన్ మూవీలో అఖిల్ హీరోగా నటిస్తారని, 11వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ ట్రైబల్ నాయకుడిగా అఖిల్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ్రపోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాలోని తన గెటప్ కోసమే అఖిల్ మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త పోడవాటి జుట్టుతో, సరికొత్త ఫిజిక్‌తో అఖిల్ సరికొత్తగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారట. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ హీరోలే కాదు... కథానుగుణంగా మేకోవర్ అవుతున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
Shooting World Cup: ఆరు పతకాలతో అగ్రస్థానంలో భారత్
కైరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షెరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అఖిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్ ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది. ఇవీ చదవండి... భారత్‌కు ఐదో స్థానం మస్కట్: ‘ఫైవ్–ఎ–సైడ్’ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6–4 గోల్స్ తేడాతో ఈజిప్ట్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మణీందర్ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రాహీల్ (8వ ని.లో), పవన్ (9వ ని.లో), ఉత్తమ్ (13వ ని.లో), మందీప్ (11వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రష్మిక జోడీ ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్‌లో వైదేహి చౌధరీ (భారత్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ‘వైల్డ్ కార్డు’తో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీపై విజయం సాధించింది. -
హైదరాబాద్ అబిడ్స్ లో వ్యభిచారం ముఠా అరెస్ట్
-
గ్లామర్ సీక్రెట్ ఏంటి?
-
వ్యభిచార కేసులో అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
-
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్‌నగర్ అఖిల్ పహల్వాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
Akkineni Nagarjuna-Akhil: విశాఖ ఏయూలో నాగార్జున, అఖిల్ సందడి (ఫొటోలు)
-
సందేశంతో హెచ్చరిక
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు. ‘‘సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో చిక్కు కుని అనాథలు నేరస్థులుగా మారే ప్రమాదం ఉందనే సందేశానికి కమర్షియల్ హంగులు మేళవించి ఈ సినిమా తీస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, రెండు ఫైట్స్‌ను చిత్రీకరించాం. డిసెంబరు కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అంతుచిక్కని మహమ్మారి.. శోక సంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్‌ఆర్‌తో తల్లిదండ్రులు వాపోయారు. తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు. -
అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!
అక్కినేని అఖిల్ ఇటీవలే నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే) అయితే ఈ విషయంలో ఈ మూవీకి మరో షాక్ తగిలింది. అయితే వైజాగ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ మూవీ ఇప్పుడైన వస్తోందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) -
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ టార్గెట్ ఏంటి..?
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. అయితే అనిల్ అనే ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ ఓ కథను రెడీ చేసి, అఖిల్‌కు వినిపించారట. ఈ స్క్రిప్ట్ అఖిల్‌కి నచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లోని సినిమా ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెద కాపు 1’ ఈ నెలలోనే విడుదల కానుంది. ఒకవేళ అఖిల్‌తో సినిమా కన్ఫార్మ్ అయితే.. ‘పెద కాపు 1’ విడుదల తర్వాత ప్రకటన వస్తుందేమో? -
'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో సందడి చేశారు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదల చేశారు. ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున తన కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో తన భార్య అమల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమల గర్భంతో ఉండగా తాను ఆరునెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అమలతోనే ఉన్నానంటూ నాగ్ వెల్లడించారు. కాగా.. అమల, నాగార్జున జంటకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) నాగార్జున మాట్లాడుతూ..' 'మాతృత్వం అనేది నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. అప్పుడు జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తే. అప్పడు హలో బ్రదర్ చిత్రంలో నటిస్తున్నా. అదే సమయంలో అమల గర్భం ధరించింది. దీంతో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. ఆరు నెలలపాటు అమలతో ఉన్నాను. ఏ సినిమా చేయలేదు. చివరికీ డెలివరీ టైంలో కూడా చేయి పట్టుకుని దగ్గరే ఉన్నా. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్‌లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నా. ఆ టైమ్ నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ' అని అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ .. 'తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జునే కారణం. ఆయన బిగ్ బాస్‌లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్‌కు రావాలని కోరా. గుర్తు పెట్టుకుని మరీ వచ్చారు. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నా. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడండి.' అని అన్నారు. యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నాగార్జున చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండండతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
'ఏజెంట్' డిజాస్టర్.. సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనా!
టాలీవుడ్ దర్శకుల్లో వివి వినాయక్‌ది ప్రత్యేక శైలి. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, లక్ష్మీ, సాంబ, బన్నీ, బద్రినాథ్, అదుర్స్, అఖిల్, ఖైదీ నంబర్150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన ఇంటలిజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా హిందీ ఛత్రఫతి రీమేక్ డిజాస్టర్ కావడంతో వినాయక్ పనైపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?) అయితే సరిగ్గా అదే కోవలోకి మరో డైరెక్టర్ చేరిపోయాడు. అఖిల్ ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతనొక్కడే చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సురేందర్..కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి హిట్ చిత్రాలు అందించారు. ఊసరవెల్లి, అతిథి, కిక్-2, సైరా లాంటి ఫ్లాప్‌లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీపై ఎవరితో అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించిన సురేందర్ రెడ్డికి ఇప్పుడు యంగ్ హీరోలే మిగిలారు. తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే సురేందర్ రెడ్డి సినిమాకు ఫైనాన్స్ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి వచ్చిందని సినీవర్గాల టాక్. ఏదేమైనా టాలీవుడ్లో సురేందర్ రెడ్డి మరో వి.వి. వినాయక్ అవుతాడా అనే విషయంపై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!) -
పడతారండి ప్రేమలో మళ్లీ..!
నిన్నమొన్నటివరకూ పాన్ ఇండియా ట్రెండ్‌లో యాక్షన్ సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ లవ్ట్రెండ్ మొదలైంది. యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరోలు మళ్లీ వెండితెరపై ప్రేమలో పడటానికి ప్రేమకథలు వింటున్నారు. కొందరి ప్రేమకథలు ఆల్రెడీ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. ఈ వెండితెర ప్రేమికుల ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ అనగానే సినిమా లవర్స్ ఎక్కువగా ‘బాహుబలి’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘సాహో’ వంటి యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. కాగా ప్రభాస్ కెరీర్లో మంచి హిట్స్ సాధించిన ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన పదేళ్లల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ (2022) తప్ప అన్నీ యాక్షన్ చిత్రాలే చేశారు. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలతో యాక్షన్ మోడ్‌లోనే ఉన్నారు. మళ్లీ ఓ ప్రేమక£ý చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి రెడీ చేసిన ఓ ప్రేమ కథను ప్రభాస్ విన్నారని, ఇది పీరియాడికల్ లవ్‌స్టోరీ అనీ సమాచారం. ► ‘100 పర్సెంట్ లవ్’, ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ , ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘లవ్‌స్టోరీ’.... ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య కెరీర్‌లోని మేజర్ పార్ట్ అంతా ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. కాగా తన గత చిత్రం ‘కస్టడీ’లో నాగ చైతన్య ఎక్కువగా యాక్షన్ చేశారు. అయితే చైతూ తన ప్రేమతో మరోసారి ఆడియన్స్‌ను ప్రేమలో పడేయనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సూరత్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇందులో నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్ర చేయనునున్నారనీ టాక్. ► హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ప్రేమ, మాస్ కథలు సమానంగా కనిపిస్తాయి. కానీ విజయ్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం మాస్ లవ్‌స్టోరీ ‘అర్జున్‌రెడ్డి’, క్లాస్ లవ్‌స్టోరీస్ ‘పెళ్ళి చూపులు’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలే. దీంతో విజయ్ మరోసారి లవ్‌స్టోరీస్‌పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ ప్రస్తుతం ‘ఖుషి’ అనే లవ్‌స్టోరీ చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. అలాగే ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్‌తో మరో సినిమా చేస్తున్నారు విజయ్. ఇది కూడా ప్రేమకథా చిత్రమేనన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ► ‘డీజే టిల్లు’తో మరింత పాపులారిటీని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకురాలు నందినీ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ► ‘దొరసాని’ వంటి ప్రేమకథతో పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘హైవే’ వంటి క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఆనంద్ నటించిన మరో లవ్‌స్టోరీ ‘బేబీ’. ప్రేమకథా చిత్రంగా సాయిరాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. మరికొందరు హీరోలు కూడా ఆడియన్స్‌ను ప్రేమలో పడేసేందుకు ప్రేమకథలు వింటున్నట్లు తెలుస్తోంది. ► ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’... ఇలా కొన్ని ప్రేమకథల్లో నటించారు అఖిల్. అయితే అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. దీంతో తన తర్వాతి చిత్రాన్ని లవ్ జానర్లోనే చేయాలనుకుంటున్నారట అఖిల్. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఫ్యాంటసీ లవ్‌స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని, ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనీ టాక్. -
ధృవ-2లో ఏజెంట్ !
-
Agent Movie Review: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: ఏజెంట్ నటీనటులు: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మురళీ శర్మ, మమ్ముట్టి, సంపత్ రాజ్, డినో మోరియా, విక్రమ్ జీత్ తదితరులు నిర్మాణసంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి కథ: వక్కంతం వంశీ దర్శకత్వం: సురేందర్ రెడ్డి సంగీతం: హిప్హాప్ తమిజా ఆది సినిమాటోగ్రఫీ: రసూల్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023 అసలు కథేంటంటే: అక్కినేని అఖిల్(రామకృష్ణ) అలియాస్ రిక్కీ.. రా ఏజెంట్ కావాలనేది అతని కల. ఆ కలను నిజం చేసుకునేందుకు మూడుసార్లు పరీక్ష రాసి పాసైనా ఇంటర్వ్యూలో మాత్రం రిజెక్ట్ అవుతూ ఉంటాడు. మమ్ముట్టి(మహదేవ్) రా(RAW) ఛీఫ్. ఇండియాను టార్గెట్ చేసిన డినో మోరియా(ది గాడ్)ను అంతం చేయాలన్నదే మహదేవ్ ఆశయం. అందుకోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తాడు. అఖిల్ తన కల నేరవేర్చుకునేందుకు మహదేవ్‌ను కలుస్తాడు. కానీ అఖిల్‌ను చేర్చుకునేందుకు మమ్ముట్టి నిరాకరిస్తాడు. అదే క్రమంలో హీరోయిన్ సాక్షి వైద్య(విద్య)తో అఖిల్‌కు పరిచయం ఏర్పడుతుంది. పైలట్‌గా పనిచేస్తున్న సాక్షి వేధింపులకు గురవుతుంది. ఈ క్రమంలో అమెరికా వెళ్లాలనుకుంటున్న ఆమెకు అఖిల్ అండగా నిలుస్తాడు. అదే సమయంలో మహదేవ్ నుంచి అఖిల్‌కు ఓ ఆఫర్ వస్తుంది. కానీ ఊహించని పరిణామాలతో అఖిల్.. వైద్యను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. అసలు ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? ఇంతకు మమ్ముట్టి(మహాదేవ్).. అఖిల్‌కు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగింది? రా ఏజెంట్ కావాలనుకున్న అఖిల్ కల నేరవేరిందా? మమ్ముట్టి తన ఆశయం కోసం ఏం చేశాడు? అతని మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే అసలు కథ. కథ ఎలా సాగిందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ గుర్తొచ్చేంది యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్. ఊహించని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు ఆడియన్స్‌కి కొత్త కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్స్ మాదిరే ఇందులో కూడా గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించారు. అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి. కానీ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తీర్చిదిద్దడంలో సురేందర్ రెడ్డి విఫలమైనట్లు తెలుస్తోంది. స్పై మూవీ అనగానే అందరూ ఊహించినట్లుగానే టెర్రరిస్టులను అడ్డుకునే రా ఇంటలిజెన్స్ ఆధారంగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ బట్టి కథేంటో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. అఖిల్‌ను ఈ సినిమాలో కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. అది బాగానే వర్కవుట్ అయింది. కథ బాగానే ఉన్నా.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్‌లో మమ్ముట్టి - అఖిల్ మధ్య సన్నివేశాలు, హీరోయిన్‌తో అఖిల్‌కు పరిచయం.. ఆ తర్వాత ఆమెను వదిలేయడం.. కొన్ని ట్విస్టులతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ వచ్చేసరికి అఖిల్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో అఖిల్ యాక్షన్, బాడీ కాస్తా హైలెట్ అని చెప్పొచ్చు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అభిమానుల స్థాయిని అందుకోలేదనే చెప్పాలి. విలన్ (ది గాడ్)ను అంతం చేసేందుకు మహదేవ్ రూపొందించిన మిషన్ సమాచారం అతనికి ముందే తెలియడం కాస్త లాజిక్ లెస్‌గానే అనిపిస్తుంది. అతని కోసం ఎవరిని పంపినా ముందే తెలిసిపోవడం.. అదే క్రమంలో అఖిల్- విలన్ డైరెక్ట్‌గా తలపడే యాక్షన్స్ సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్. మధ్యలో కొన్ని సన్నివేశాలు సంబంధం లేకుండా బోరు కొట్టిస్తాయి కూడా! స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు. ఫుల్ స్పై యాక్షన్ మూవీకి ప్రధాన బలం బీజీఎం. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్. సాంగ్స్ పర్వాలేదనిపించినా.. కొన్ని చోట్ల యాక్షన్స్ సీన్స్ ఓవర్‌గా అనిపిస్తాయి. కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని పెంచింది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ పర్వాలేదనిపించినా.. లాజిక్ లెస్ సీన్స్ వల్ల ఆడియన్స్‌కు అక్కడక్కడా బోరు కొట్టడం ఖాయం. ఎవరెలా చేశారంటే... స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు తగినట్లుగానే అఖిల్ తన బాడీ, స్టైల్‌తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో అఖిల్ ఫుల్ ఎనర్జీటిక్గా చేశాడు. ఈ చిత్రంలో అఖిల్ డిఫెరెంట్ లుక్‌లో కనిపించాడు. గతంలో రొమాంటిక్ అఖిల్‌గా కనిపిస్తే ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోను తలపించాడు. సాక్షి వైద్య తెలుగులో తన డిఫరెంట్ యాసతో అదరగొట్టింది. పైలట్ పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ లేనప్పటికీ.. కెమిస్ట్రీ బాగానే కుదిరింది. మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రా చీఫ్‌గా తన పాత్రకు న్యాయం చేశారు. విలన్‌గా డినో మోరియా లుక్ అదిరిపోయింది. విలన్ పాత్రలో కరెక్ట్‌గా ఒదిగిపోయాడు. అఖిల్ ఫాదర్‌గా మురళీ శర్మ, పొలిటికల్ లీడర్‌గా సంపత్ రాజ్ తమ పాత్రల పరిధిమేర రాణించారు. సాంకేతికత విషయానికొస్తే రసూల్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. హిప్హాప్ సంగీతం అంతగా మెప్పించలేదు. నవీన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
అదో పెద్ద స్కామ్ అనుకున్నా.. తీరా చూస్తే: ఏజెంట్ హీరోయిన్
అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రంలో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది తెలుగులో నా తొలి సినిమా అని.. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు సాక్షి వైద్య. సాక్షి వైద్య మాట్లాడుతూ .. 'వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్‌ని. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ ఛాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్‌ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను' అని అన్నారు. -
వారి ప్రేమ, అభిమానం గొప్పవి
‘‘అక్కినేని ఫ్యాన్స్ ప్రేమ, ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పవి. అభిమానుల ఆదరణ లేకుంటే సినిమాలు హిట్ కావు. అఖిల్‌కి చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం ఉంది. తనలో ఎంతో ఎనర్జీ ఉంది.. ‘ఏజెంట్’ సినిమాతో ఆ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకు తీశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. అఖిల్, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పోరాటాలకు అడ్డా... వీరత్వానికి ఇంటి పేరు వరంగల్. ఓ సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే ఏం కావాలో అవి సమకూర్చుకోవడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు పొందారు. ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా తెరకెక్కించడంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర రాజీ పడలేదు. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సాక్షీ వైద్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మూవీలో నటించేందుకు నటుడు మమ్ముట్టి ఒప్పుకోవడం గొప్ప విషయం. మా చిత్రం హిట్ చేస్తే మంత్రి దయాకర్రావుగారు చెప్పినట్లు మా ప్రతి సినిమా వేడుకకు తప్పకుండా వరంగల్‌కు వస్తాం. తెలుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు.. మంచి సినిమాలను తప్పకుండా హిట్ చేస్తారు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్.. ఆడియో రిలీజ్.. ప్రీ రిలీజ్.. ఇలా ఏదో ఒక కార్యక్రమం వరంగల్‌లో నిర్వహించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న ‘ఏజెంట్’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నా మైండ్‌లో ఒకటే ఉంది. ‘ఏజెంట్’ ని ఇంత హైలో పనిచేసిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలనే ప్రశ్న నాలో కలుగుతోంది’’ అన్నారు. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, సాక్షీ వైద్య, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. -
ఆ విషయం తెలిశాక అమ్మ ఎమోషనల్ అయ్యింది : అఖిల్
‘‘30 ఏళ్లకు పైగా మా నాన్నగారు (నాగార్జున) ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి గ్రిప్ ఉంది. నాకేమైనా సందేహాలు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అయితే ఫలానా స్క్రిప్ట్ ఓకే చేయలా? వద్దా అని అడగను. అలా చేస్తే నా కెరీర్ తాలూకు ఒత్తిడిని నాన్నపై పెట్టినట్లు ఉంటుంది. ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంటే ఓ వ్యక్తిగా నేను ఎదగలేకపోవచ్చు. అందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ కారణంగానే ‘ఏజెంట్’ స్క్రిప్ట్‌ను నాన్నతో షేర్ చేయలేదు’’ అన్నారు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటింన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మింన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు. ఆ ఒక్క సెంటిమెంట్ ఫాలో అవుతున్నా! ♦ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టైమ్‌లో సూరిగారు (సురేందర్ రెడ్డి) ‘ఏజెంట్’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్ చేశాం. అయితే స్క్రిప్ట్ పూర్తి కావడానికి, నా లుక్ మార్చుకోవడం, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ♦ ‘ఏజెంట్’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్ ట్యూన్ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్‌గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్‌లో వచ్చే టార్చర్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. ♦సాధారణంగా నేను సెంటిమెంట్స్‌ను నమ్మను. అయితే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్ సినివలు విడుదలైన ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్‌ను మాత్రం ఫాలో అవుతున్నాను. ♦నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్ అయ్యారు. -
Agent trailer: ‘ఏజెంట్’ ట్రైలర్ రివ్యూ
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. సాక్షివైద్య హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృంది. ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది. ‘నువ్వెందుకు ఏజెంట్ అవ్వాలనుకుంటున్నావు’అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. సిండికేట్‌కి ఒక పవర్ హౌస్ ఉంది. దాని పేరు గాడ్. దాన్ని ట్రేస్ చేయగలిగితే మొత్తం నెట్వర్క్ని నాశనం చేయొచ్చు. ఈ మిషన్ కోసం మమ్ముట్టి టీమ్ అఖిల్‌ని రంగంలోకి దించుతుంది. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే’అని మమ్ముట్టి చెప్పే డైలాగ్‌తో అఖిల్ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. (చదవండి: నా బెడ్రూమ్లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) కోతిలాంటి బిహేవియర్ ఉన్న అఖిల్ ఏజెంట్‌గా మారతాడు. అయితే ఒకానొక దశలో అఖిల్‌నే చంపేయాలని మమ్ముట్టి తన టీమ్ సభ్యులను ఆదేశిస్తాడు. అసలు మమ్ముట్టి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఆ మిషన్ ఎలా సక్సెస్ అయింది? అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ తరహా యాక్షన్ అఖిల్‌కి కొత్త కానీ ఆడియన్స్‌కి కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్స్ మాదిరే ఇందులో కూడా గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి. ఇక కేజీయఫ్ తర్వాత పెద్ద గన్‌తో క్లైమాక్స్‌ని సెట్ చేయడం ఆనవాయితీగా మారింది. విక్రమ్ నుంచి మొన్నటి పఠాన్ వరకు ప్రతి యాక్షన్ సినిమాలో పెద్ద గన్‌తో బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏజెంట్ ట్రైలర్ చివర్లో కూడా ఇలాంటి సీన్ ఒకటి పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాకు భారీ ఖర్చు చేసినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. మొత్తం మీద అఖిల్ పెద్ద సాహసమే చేశాడు. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఏప్రిల్ 28న తెలుస్తుంది. -
అఖిల్ వైల్డ్ క్యారెక్టర్.. ఆ ఫీట్ ఏంట్రా బాబూ!
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఏజెంట్'. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయవాడలో ట్రైలర్ లాంఛ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అఖిల్ కళ్లు చెదిరిపోయే స్టంట్ ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఈసారి చాలా కొత్తగా ట్రై చేశారు. విజయవాడలోని దాదాపు 172 అడుగుల భవనం పైనుంచి దుకుతూ ట్రైలర్ పోస్టర్‌ను ఆవిష్కరించాడు. ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో ‘ఏజెంట్’ ట్రైలర్ లాంఛ్ జరగనుందని పేర్కొన్నారు. ఈ వీడియోను మేకర్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే విడుదలైన అఖిల్ వైల్డ్ లుక్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. SAALA nahin! WILD SAALA 😎 That was a Crazy Event at Vijayawada as @AkhilAkkineni8 jumped off from 172 ft High to unveil the WILD POSTER 🔥 WILD MADNESS Loading in Theaters from APRIL 28TH💥#AGENTonApril28th @mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @Shreyasgroup pic.twitter.com/yJMKmQOTyc — AK Entertainments (@AKentsOfficial) April 16, 2023 -
అఖిల్ ‘ఏజెంట్’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)