అఖిల్ వైల్డ్ క్యారెక్టర్‌.. ఆ ఫీట్ ఏంట‍్రా బాబూ! | Akhil Jump From 172 Feet Building In Agent Movie Promotions | Sakshi
Sakshi News home page

Agent Movie: 172 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన అఖిల్.. వీడియో వైరల్

Published Sun, Apr 16 2023 8:12 PM | Last Updated on Sun, Apr 16 2023 9:27 PM

Akhil Jump From 172 Feet Building In Agent Movie Promotions - Sakshi

అఖిల్‌  అక్కినేని, సాక్షి వైద్య జంటగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌  'ఏజెంట్‌'. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 18న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయవాడలో ట్రైలర్ లాంఛ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

అఖిల్ కళ్లు చెదిరిపోయే స్టంట్

ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను  మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఈసారి చాలా కొత్తగా ట్రై చేశారు. విజయవాడలోని దాదాపు 172 అడుగుల భవనం పైనుంచి దుకుతూ ట్రైలర్‌ పోస్టర్‌ను ఆవిష్కరించాడు. ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో ‘ఏజెంట్’ ట్రైలర్ లాంఛ్ జరగనుందని పేర్కొన్నారు. ఈ వీడియోను మేకర్స్ తమ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే విడుదలైన అఖిల్ వైల్డ్ లుక్స్, సాంగ్స్, టీజర్‌ సినిమాపై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement