Sakshi
-
సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
సాయం అందక.. బీమా పొందలేక...
రైతులను తాము నిండా ముంచుతున్నామని చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒప్పుకుంది. వారిలో ఏ ఒక్కరికీ పైసా పరిహారం చెల్లించలేదని అంగీకరించింది. రబీ సీజన్లో నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 60.55 లక్షల ఎకరాలు కాగా, కేవలం 8.80 లక్షల ఎకరాల్లో పంటలకు మాత్రమే బీమా కవరేజ్ కల్పించినట్టుగా కూడా వెల్లడించింది. అంటే తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే దాదాపు 52 లక్షల ఎకరాల్లో సాగవుతున్న నోటిఫైడ్ పంటలకు బీమా దూరమైందని కూడా అంగీకరించింది. గత రబీ సీజన్లో 43.82లక్షల మంది రైతులకు నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అందించగా... నేడు కేవలం 6.50లక్షల మందికే స్వచ్ఛంద నమోదు పంటల బీమా కింద నమోదు చేసినట్టు తెలిపింది. మొత్తం 37.32 లక్షల మంది రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయినట్లు అంగీకరించింది. తద్వారా ఐదేళ్లపాటు రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి, కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛంద నమోదు పద్ధతి వల్ల రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయిందని ఒప్పుకుంది.ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను గాలికి వదిలేసిన తీరుపై పూర్తి ఆధారాలతో ‘సాక్షి’లో వరుసగా రెండు రోజులపాటు ప్రచురితమైన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు సోమవారం విడుదల చేసిన ప్రకటనల ద్వారా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు సమ్మతించడం గమనార్హం. 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ⇒ సాక్షిలో ‘సర్కారు హత్యలు 97’ కథనంపై వ్యవసాయ శాఖ వివరణ సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12 నుంచి నేటి వరకు 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి ఆరు నెలల్లో 49 మంది చనిపోగా, జూన్ నుంచి డిసెంబర్ వరకు 97 మంది చనిపోయారని తేల్చి చెప్పింది. ‘సర్కారు హత్యలు 97’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సాక్షి’లో పేర్కొన్న 97 మంది రైతుల ఆత్మహత్యలు నిజమేనని ఆ ప్రకటనలో అంగీకరించింది. వారిలో ఏ ఒక్కరికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. రైతుల ఆత్మహత్యల వివరాలను పొందుపర్చేందుకు ప్రభుత్వాదేశాల మేరకు ప్రత్యేకంగా ఇటీవలే చంద్రన్న పోర్టల్ ప్రారంభించినట్టు పేర్కొంది.ఈ 97 మందిలో త్రిసభ్య కమిటీ నిర్ధారించిన రైతుల వివరాలను చంద్రన్న పోర్టల్‌లో అప్లోడ్ చేసి, ఆయా రైతు కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సున్నా వడ్డీ రాయితీ చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి అర్హుల వివరాల జాబితాలను అప్లోడ్ చేయడంలో జరిగిన జాప్యం వల్లే రాయితీ విడుదల చేయలేదని పేర్కొంది. ఆ సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి చెల్లించాల్సిన రూ.132 కోట్లను కూడా సాధ్యమైనంత త్వరగానే చెల్లిస్తామని తెలిపింది.పంటల బీమా పరిధిలోకి వచ్చింది 8.80 లక్షల ఎకరాలే ⇒ నేటితో ప్రీమియం చెల్లింపునకు గడువు ముగిసినట్టే.. ⇒ అవగాహన కల్పించినా.. ఆరున్నర లక్షల మందే దరఖాస్తు ⇒ ‘సాక్షి’ కథనంపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సాక్షి, అమరావతి: రబీ సీజన్ నుంచి అమలు చేస్తున్న స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమాలో చేరేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఇప్పటి వరకు 6.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 8.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని పంటలు బీమా పరిధిలోకి తీసుకొచి్చనట్టు పేర్కొన్నారు. ‘ప్రీమియం భారం.. బీమాకు దూరం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మేరకే ఐదేళ్ల పాటు అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నామని తెలిపారు.పంట రుణాలు పొందని రైతులు ఈ పథకంలో చేరేందుకు మంగళవారంతో గడువు ముగిసిందని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు పొందే రైతులు మాత్రం పోర్టల్ ద్వారా పూర్తి వివరాలు అప్లోడ్ చేసేందుకు మరో 15 రోజులు వెసులుబాటు కల్పించామని వివరించారు. జీడిమామిడి పంటకు ఏడు రోజులు, వరిపంటకు మరో 15 రోజులు పొడిగించాలని బీమా కంపెనీలను సంప్రదించామని, వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వెబ్‌ల్యాండ్ డేటాతోపాటు కౌలుదారుల సమాచారం సీసీఆర్సీ డేటా బేస్, ఆర్వోఎఫ్ఆర్ భూముల వివరాలను రెవెన్యూ శాఖ సహకారంతో జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులదే ⇒ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ అన్నారు. బ్యాంకులు మానవీయ కోణంలో స్పందించి రైతులను ఉదారంగా ఆదుకోవాలని ఆయన కోరారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ తుపాన్లు, అధిక వర్షాల వంటి వైపరీత్యాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర ఆటుపోట్లకు గురవుతోందన్నారు.ప్రతికూల పరిస్థితుల నడుమ బ్యాంకర్లు, వ్యవసాయ సిబ్బందికి అవసరమైన చేయూతనివ్వాలన్నారు. పెట్టుబడుల నిమిత్తం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాలన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు మాట్లాడుతూ ఎటువంటి హామీ, పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.60లక్షల నుంచి రూ.2లక్షలకు ఆర్బీఐ పెంచిన విషయాన్ని రైతులకు తెలియజేయాలని సూచించారు. -
‘సాక్షి’ కథనంతో సరిదిద్దారు!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆటో మొబైల్ రిపేర్ వర్క్‌షాప్ నిర్వాహకుడు లింగరాజుకు ఇటీవల వచ్చిన రూ.25,666 కరెంట్ బిల్లును అధికారులు సరి చేశారు. ఈమేరకు ఈ నెల 24న ‘సాక్షి’ జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన ‘గుండె గుబిల్లు’ కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు. బిల్లును రూ.2,100గా సరిదిద్దారు. అధికారులకు మొర పెట్టుకున్నా తన సమస్య పరిష్కారం కాలేదని, సాక్షిలో వెలువడిన కథనంతో ఊరట లభించిందని లింగరాజు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయన ఇంట్లో మీటర్ సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు కొత్తది అమర్చారు. అక్టోబర్, నవంబర్ నెలల బిల్లును సిబ్బంది నమోదు చేయలేదు. డిసెంబర్లో ఏకంగా రూ.25,666 కరెంట్ బిల్లును లింగరాజు చేతిలో పెట్టారు. దీనిపై ‘సాక్షి’ లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు తప్పును సరిదిద్దారు. -
‘సాక్షి’పై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించింది. ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారనే ఉదంతంపై ‘పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనివల్ల పోలీసుల ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ ‘సాక్షి’ కర్నూలు విలేకరి బోయ శ్రీనివాసులుపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో సెక్షన్ 196/2024,యూ, సెక్షన్ 32, 308(3), 353(1)బీ, 356 రెడ్‌విత్ 61(2), బీఎన్ఎస్గా నమోదు చేశారు. కర్నూలు త్రీటౌన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు జిల్లా అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని, పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ఆయన్ను తీసుకురాలేదని, ఈ నెల 17న కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ ఘటనకు సంబంధించిన కేసులో నిందితుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, ఆయన సోదరుడిని విచారించి పంపించామని తెలిపారు.ఇతర మీడియాలోనూ వచ్చినా ‘సాక్షి’పైనే కేసు..భూ వివాదానికి సంబంధించి మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారనే వ్యవహారంపై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, టీవీలు కూడా కథనాలను ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ‘బాస్.. సివిల్ పంచాయతీ’ పేరుతో ఈనాడు కూడా కథనాన్ని ప్రచురించింది. అందులో రాయలసీమ పోలీస్‌బాస్ అని పేర్కొంది. కిడ్నాప్‌నకు గురైన మునీర్ అహ్మద్ ‘సాక్షి’తో పాటు ఇతర మీడియా చానళ్లతోనూ మాట్లాడారు. అందులో పోలీసులు తనను తీసుకెళ్లిన విధానం, భూ వివాదానికి సంబంధించి గతంలో సీఐ, డీఐజీ కోయ ప్రవీణ్ తనను పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పిన విషయాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఆయన భార్య కూడా భూ వివాదంపై మాట్లాడారు. మునీర్ అహ్మద్ ఆయన భార్య తెలిపిన వివరాల మేరకే ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సాక్షిలో ప్రచురించిన ప్రతీ అక్షరం బాధితులైన మునీర్ అహ్మద్ దంపతులు చెప్పిన విషయాలే! వీటినే మిగిలిన వారూ ప్రచురించినా, ప్రసారం చేసినా.. ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదు చేయడం గమనార్హం. -
ఊరులేని ఊరు: భూముల ధరలు మాత్రం ఆకాశానికి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు. ⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు. ⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం. ⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు. ⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు. ⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం. -
చెదరనీకు ఆ చిరునవ్వు..!
రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఉత్సాహంగా పాల్గొన్న బాలసదన్, రిహాబిలిటేషన్ సెంటర్ల బాలలు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పులకింత చిన్నారులకు బహుమతులు అందించిన ఉన్నతాధికారులుసంగారెడ్డి/నారాయణపేట రూరల్/నిజామాబాద్ నాగారం/కామారెడ్డి: వసంతకాలంలో పువ్వులను.. పసి మోముల్లోని నవ్వులను ఎంత చూసినా తనివి తీరదు. పసి బిడ్డల ముఖాల్లోని నవ్వులు స్వచ్ఛతకే కాదు.. కొన్నిసార్లు సహజ స్థితిగతులకూ అద్దంపడతాయి. తల్లిదండ్రుల సంరక్షణ ఉంటేనే పిల్లలు తమ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలరు. కానీ, ఎంతో మంది బాలలు తమకు తెలియకుండానే అనాథాశ్రమాల్లో, రిహాబిలిటేషన్ సెంటర్లలో మగ్గిపోతున్నారు. అలాంటి బాలల ముఖాల్లో చిరునవ్వులు పూయించాలని ‘సాక్షి’ మీడియా సంకలి్పంచింది. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పలువురు ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు అందించి బాలలను ఉత్సాహపరిచారు.నిజామాబాద్‌లో ‘సాక్షి లిటిల్ స్టార్స్’.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్లో ‘సాక్షి లిటిల్‌స్టార్స్’కార్యక్రమం ఘనంగా జరిగింది. సాక్షి మీడియా, అగ్గు భోజన్న నారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అథితిగా హాజరై సాక్షి మీడియా ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వేడుకల్లో చిన్నారుల దేశభక్తి గేయాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. వేడుకల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి షేక్ రసూల్‌బీ, అగ్గు భోజన్న నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అగ్గు భోజన్న, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డిలో..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో సాక్షి మీడియా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను తమ జీవిత లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలు, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, ఇన్చార్జ్ డీడబ్ల్యూవో చందర్‌నాయక్, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలసదనం అధికారులు, ఉద్యోగులు, సాక్షి విలేకరులు పాల్గొన్నారు. నారాయణపేటలో..నారాయణపేటలోని బాలసదన్‌లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సిక్తా పటా్నయక్ పాల్గొన్నారు. చిన్నారులు గులాబీ పువ్వులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాలసదన్‌లోని పిల్లలతో ఆమె సరదాగా గడిపారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించడంతో పాటు, నృత్యాలు చేసి అలరించిన చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మైనారిటీ శాఖ అధికారి రషీద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు యాదయ్య, కమలమ్మ, డీసీపీఓ తిరుపతయ్య, చి్రల్డన్ హోం ఇన్చార్జ్ నిహారిక, సాక్షి సిబ్బంది ఆనంద్, రాజేష్ పాల్గొన్నారు. సంగారెడ్డిలో..‘సాక్షి’మీడియా గ్రూపు, సహారా సొసైటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సహారా ప్రైమరీ రిహాబిలిటేషన్ సెంటర్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై చిన్నారులతో ఉల్లాసంగా గడిపారు. వివిధ రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న సహారా సెంటర్‌ను అభినందించారు. -
Sakshi Special: మొక్కవోని మట్టిబిడ్డలు
మట్టి ఎవరికీ అపకారం చేయదు. నాగలితో దున్నినప్పుడల్లా రైతుకు పంట ఇవ్వాలనే అనుకుంటుంది. కాని ఒక్కోసారి రుతువులు మోసం చేస్తాయి. మరోసారి మార్కెట్ మోసం చేస్తుంది. ఇంకోసారి అకాల వర్షం. అప్పుడు ఏమవుతుంది?ప్రతిరోజూ పొలానికి వెళ్లి తిరిగొచ్చే నాన్న ఆ రోజు రాడు. ‘నా పంటను ఎందుకు నాకు దక్కకుండా చేశావ్’ అని దేవుడితో పోట్లాడటానికి వెళ్లిపోతాడు. అప్పుడు అమ్మ ఉంటుంది. ధైర్యం నింపుకో అని చెప్పే మట్టి ఉంటుంది. ఆ పిల్లలు నిలబడతారు. నిలబడాలి. అందరూ తోడైతే వారి ముఖాలలో ఇంద్రధనువులు సాధ్యమే. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతుల పిల్లలను రానున్న ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేకంగా కలిసింది సాక్షి. ఇక సందడి మొదలైంది.‘మీరు ఫ్రెండ్స్‌తో కలిసి నిద్రపోతారా?’‘సెలవుల్లో పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారా?’‘నైట్‌టైమ్ స్కై అంతా క్లియర్‌గా ఉండి స్టార్స్ కనపడతాయా?‘మీకు లోన్లీగా అనిపించినప్పుడు ఏం చేస్తారు’‘విలేజస్‌లో ఏమేమి ఇంటెరెస్టింగ్‌గా ఉంటాయి’...సినిమాల్లో అందరూ మెచ్చేలా నటించిన లిటిల్ స్టార్స్ జీవితంలో సవాళ్లతో పోరాడుతున్న రియల్స్టార్స్ను ‘సాక్షి’, ‘రైతు స్వరాజ్యవేదిక’ ఉమ్మడి ప్రయత్నం వల్ల కలిశారు. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్‌లోని తార్నాకలో రానున్న ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ఐదు రైతు కుటుంబాలకు చెందిన 11 మంది పిల్లలు ముగ్గురు లిటిల్ స్టార్స్‌ను కలిశారు. ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన శ్రేష్ట, ‘కేజీఎఫ్’లో నటించిన భాను ప్రకాశ్, స్పైడర్, స్వాగ్ వంటి మూవీస్‌లో చేసిన హనీషాలు ఈ చిన్నారులతో కలిసి కబుర్లు చెప్పారు. ఆ పిల్లలు ఈ పిల్లలు పరస్పరం మాట్లాడుకున్నారు. లిటిల్ స్టార్స్ తమ సినిమాల్లో తాము చెప్పిన డైలాగులు చెప్పారు. డాన్సులు చేశారు. షూటింగ్‌కు తీసుకెళతామన్నారు. అలా ఆ పిల్లల మనసు తేలిక చేశారు. కారణం? వారి నాన్నలు వారితో లేరు. వారి నాన్నలంతా రైతులు. వ్యవసాయంలో వచ్చిన కష్టాలు ఆ నాన్నలను హటాత్తుగా లేకుండా చేశాయి. ఆ క్షణం నుంచి ఆ పిల్లలకు ఆమ్మే నాన్నయినా అమ్మయినా. అయితే పిల్లలు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఇలాంటి పిల్లలకు సాయం అందించడానికి ‘రైతు స్వరాజ్యవేదిక’ అనే సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ, సాక్షి కలిసి ఈ పిల్లల సందడిని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఆ రైతుబిడ్డలు ఏమన్నారు?జీవితం అంటే ఏమిటో తెలిసిందిరైతు బిడ్డలను చూసిన స్టార్ సెలబ్రిటీలు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. వారి పట్ల స్నేహహస్తం సాచారు. వారి స్పందన తెలియచేశారు. ‘చిన్న చిన్న కష్టాలకే ఎంతో బాధ పడతాం, కానీ వీరి జీవితకాలవేదన చూశాక మేమెంత మంచి జీవితంలో ఉన్నామో తెలుస్తుంది. ఈ ఒక్కరోజు నాకు జీవితాన్ని పరిచయం చేసింది. భవిష్యత్‌లో కూడా వీరి సమస్యలపై దృష్టి సారిస్తాను. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని భాను ప్రకాశ్ అంటే ‘నాన్న లేకుంటే జీవితం ఎంత చీకటి మయమో తెలిసింది. నాలాంటి పిల్లలే వారు. కానీ నాకున్న సౌకర్యాల్లో ఒక్కశాతం కూడా వారికి లేవు. వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండిపోవాలనుంది’ అన్నది హనీషా రెస్పాన్స్. ‘నా కన్నా పెద్దగా ఉన్న ఆ అక్కలు, అన్నలు ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. వారి కోసం నేను డ్యాన్స్ చేశాను. ‘నా సినిమా షూటింగ్‌లకు తీసుకెళతానని చెప్పాను. వారి ఊరికి కూడా వెళతాను తొందరలో’ అంది శ్రేష్ట.వారి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి‘మాది కౌలు వ్యవసాయం., పంట పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాం. అవి కట్టలేక అదే పత్తి చేనులో పత్తి మందు తాగి చనిపోయడు నా భర్త. అప్పటి నుంచి మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నా కూలీ, ఈ ఆవు పాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను’ అని దేవరకొండకు చెందిన సరోజ చెప్తే, ‘గుంట భూమి లేదు. 8 లక్షల అప్పు మిగిలింది. అప్పులోళ్ల్ల బాధ భరించలేక ఆయన తనువు చాలించాడు. ఇద్దరూ పాపలే.. వారి కాళ్ల మీద వారు నిలబడి బతకగలగాలనే లక్ష్యంతో చదివిస్తున్నాను’ అని మరో తల్లి అంది. ‘మాది కౌలు వ్యవసాయం. మిర్చి పంటలో వచ్చిన నష్టాలకు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నా కొడుక్కు 2 నెలలు. ఎన్ని ఆఫీసులు తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. వ్యవసాయం పై మక్కువ ఉన్నా నా బిడ్డను మాత్రం రైతుగా మారనివ్వను’ జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందిన మానస అన్నారు.‘ఒక్కసారన్నా లాభం రాకపోతుందా అని ఎనిమిదేళ్లు కౌలు చేశాం. ఒక్కసారి మిర్చి పంట పండినా ధర లేదు. దాంతో నా భర్త 2019 ఆత్మహాత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఇల్లు కూడా లేక నాన్న వాళ్లింట్లో ఉంటున్నాను’ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమలత అంటే ‘7,8 ఏళ్లు కౌలు చేశాం. రేటు ఉన్నప్పుడు పంట పండలేదు, పండినప్పుడు «దర లేదు. రెండూ ఉంటే వర్షాలు లేవు. ఆయన ఆత్మహాత్య చేసుకున్నప్పుడు నా గుండె కూడా ఆగినంత పనైంది. కానీ రెండేళ్ల బాబు, నాలుగేళ్ల పాప. వారి కోసం బతికి ఉన్నాను’.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మమత అన్నారు.చదువుకుని ఎంతో ఎదుగుతున్నారు‘రైతు స్వరాజ్య వేదిక’ రైతుల సంక్షేమం కోసం 2011లో ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయని మా అధ్యయనంలో తెలుసుకుని వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో 7600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 80 శాతం కౌలు రైతులే. కౌలు రేట్లు పెరగడం, ప్రభుత్వ సహకారం పట్టాదారులకే ఉండటం వంటి కారణాలతో ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ 7600 మందిలో 1600 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగతా వారివి రైతు ఆత్మహత్య కాదంటారు. దీనికి కౌలు డాక్యుమెంట్లు, అప్పుల కాగితాలు అడుగుతారు. ఇది భార్యభర్తల గొడవ, బిడ్డ పెళ్లి ఖర్చువల్లే, కొడుకు చదువు, ఇల్లు కట్టుకున్నారు.. ఇలాంటి కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యవసాయ సంబంధ అంశాన్ని దూరం చేస్తున్నారు. కానీ వారి ఆదాయ వనరు మాత్రం వ్యవసాయం అని పరిగణించట్లేదు. వివిధ సంస్థల సహకారంతో ఈ కుటుంబాలకు ఉపాధి కోసం బర్రెలు, మేకలు కొనిస్తున్నాం. పిండి గిర్నీ, షాప్‌లు పెట్టిస్తున్నాం. పిల్లల చదువులకూ సహకారం అందిస్తున్నాం. ఇలా సహకారం అందుకుని ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా, ఉత్తమ క్రీడా కారులుగా ఎదిగిన రైతు బిడ్డలు ఉన్నారు.– కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్లాయర్ అవుతాను8వ తరగతి చదువుతున్నాను. అందరూ వారి నాన్నలతో హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం హాస్టల్లో ఆహారం, నీరు పడక ఎలర్జీలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మా నాన్న ఉంటే నన్ను కూడా మంచి ప్రైవేటు స్కూల్లో చదివించేవారు అని బాధగా ఉంటుంది. అయినప్పటికీ అమ్మ కష్టాలను దూరం చేయడానికి లాయర్ అవ్వాలనే ఆశయంతో ఉన్నాను. సినిమాల్లో చూసే సెలబ్రిటీలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. – మింటూఅమ్మను బాగా చూసుకుంటానాన్న మరణం నన్నెంతగానో కుంగదీసింది. కానీ ఆ ఆవేదనను చదువులపై చూపించలేదు. బాగా చదువుకుంటున్నాను. అమ్మను బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. నాన్న ఉండగా ఎప్పుడూ పనికెళ్లని అమ్మ నా కోసం కూలి పనికి వెళుతోంది. పైగా తనకు కిడ్నీ ఆపరేషన్ అయ్యింది. మా కష్టాలను తట్టుకునే శక్తి మాకుంది. మీరంతా మాతో ఉన్నారనే భరోసా ఇస్తే చాలు. – తేజస్వినిమేమే తయారవుతాంఉదయాన్నే నాన్న గుర్తుకొస్తాడు. అందరు నాన్నలు వారి పిల్లల్ని స్కూలుకు తీసుకెళుతుంటే చూసి. అమ్మ పొలం పనికి తొందరగా వెళ్లాలని మేమే త్వరగా తయారయ్యి మా స్కూల్‌కు వెళతాం. నాన్నలా కావొద్దని బాగా సంపాదించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నాన్న చేసిన అప్పుల కష్టాల్లో అమ్మ ఉంది. అందుకే ఎలాంటి అతి ఖర్చులు చేయం. పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి. – చింటూ అమ్మ కోసం నవ్వుతాహాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డాక్టర్ అవ్వాలి, నాన్న చేసిన అప్పులు తీర్చి అమ్మకు భారం తగ్గించాలి. మా హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గరికి అమ్మానాన్నలు వస్తే.. మా దగ్గరికి అమ్మ మాత్రమే వస్తుంది. అప్పుడు ఏడుపొస్తుంది. కాని అమ్మ బాధపడుతుందని నవ్వుతా. – అక్షిత– హనుమాద్రి శ్రీకాంత్– డి.జి. భవానిఫొటోలు: పి. మోహనాచారి -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్‌కు కానీ ఇటు ట్రంప్‌కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్‌లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్‌లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్‌గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్‌జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్‌గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్‌కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్‌కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
పోలవరంపై ‘సాక్షి’ ప్రశ్న.. మంత్రి నిమ్మల బుకాయింపు!
సాక్షి, విజయవాడ: పోలవరంపై సాక్షి అడిగిన ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. కేంద్ర కేబినెట్ నోట్లో ఫేజ్ 1 ప్రస్తావన ఉందా..? అంటూ ప్రశ్నించగా తెల్లమొహం వేశారు. పోలవరం ఎత్తు తగించేందుకు అంగీకరించడంపై ప్రశ్నించగా.. కేంద్ర కేబినెట్ నోట్ చూపించకుండానే వెళ్లిపోయారు. 41.15 మీటర్ల ఎత్తుకి అంగీకారం తెలిపినట్టు ప్రకటించిన మంత్రి నిమ్మల.. ఫేజ్ 2 తర్వాత నిధులు వస్తాయంటూ బుకాయించారు.పోలవరంపై చంద్రబాబు సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది.కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు.ఇదీ చదవండి: పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం! -
మా దగ్గరకు ముందుగా వచ్చింది సాక్షినే
-
ఆపత్కాలంలో మీకు అండగా ‘సాక్షి’..
ఆకస్మిక వరదల్లో లక్షల కుటుంబాలు చిక్కుకున్నాయి. స్వచ్ఛందంగా సాయం చేసేవారు కొందరు ముందుకొస్తున్నా సాయార్థుల జాడ వారికి తెలియటం లేదు. వారికి మార్గదర్శనం చేసే యంత్రాంగమూ లేదు. మీరు గనక వరదల్లో చిక్కుకుని... ఇంకా మీ దరికెవ్వరూ చేరని పరిస్థితుల్లో సాయం కోసం ఎదురు చూస్తుంటే మీరున్న ప్రాంతం.. వివరాలతో మీ ఫోటోలు పంపించండి. సంబంధిత వర్గాలకు మేం చేరవేస్తాం. ‘సాక్షి’ మీకు అండగా ఉంటుంది... ఫొటోలు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ : 9182729310 -
సర్కారు గాయం..‘సాక్షి’ సాయం
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): కంసాలిపేటలో నివాసముంటున్న బుజ్జి భర్త పది రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆమె ఇంటిని వరద ముంచేసింది. సాయం కోసం ఆర్తనాదాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు చిన్న పిల్లలతో మూడు రోజులుగా ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ వరద ముంపులోనే బతుకుతోంది. అధికారులెవరూ ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదని, స్థానిక యువకులే సాయంగా నిలుస్తున్నారని చెబుతోంది. తాతల కాలం నుంచి కంసాలిపేట ఉందని, ఆ తరువాతే రాజరాజేశ్వరిపేట వచ్చిందని.. అయితే ఇప్పుడొచ్చిన అధికారులు కంసాలిపేట వాళ్లు లెక్కల్లో లేరని చెబుతున్నారని వాపోయింది.350కిపైగా కుటుంబాలు జీవిస్తున్న కంసాలిపేట ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ఆమె పాలకులను ప్రశ్నిస్తోంది. బుడమేరు వరద ధాటికి పూర్తిగా మునిగిపోయిన ప్రాంతాల్లో ఒన్ టౌన్‌లోని చిట్టినగర్ వంతెన కిందనున్న కంసాలిపేట కూడా ఒకటి. దాదాపు 1500 మంది ప్రజలు ఇక్కడ జీవిసున్నారు. మూడు రోజులుగా పాలకులుగానీ, అధికారులుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పేటలో ఒక్క ఇల్లు కూడా నీట మునగకుండా లేదు. ఏ వస్తువూ మిగల్లేదు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, టిఫిన్ బళ్లు, బడ్డీ కొట్లు, సైకిళ్లు ఇలా ప్రతీదీ ఇంకా వరద ముంపులోనే ఉంది.అక్కడక్కడా ఉన్న మేడలపైనే స్థానికులు గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగునీరు లేక అలమటిస్తున్నారు. చేతి పంపు నుంచి వచ్చే నీటితోనే కడుపు నింపుకుంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారి వద్దకు వెళ్లిన ‘సాక్షి’ బృందానికి తమగోడును చెప్పుకుని భోరుమన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ‘సాక్షి’ బృందం పలు స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆహారం, తాగు నీరు సమకూర్చింది. స్థానిక యువకుల సాయంతో ఇంటింటికీ తిరిగి స్వయంగా పంచిపెట్టింది. మూడు రోజులైనా తమ వద్దకు మీడియాతో సహా ఎవరూ రాలేదని, మొదటిసారి సాక్షి బృందం మాత్రమే వచ్చి తమకు సాయం చేసిందని బాధితులంతా చెమర్చిన కళ్లతో ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.‘సాక్షి’ ప్రతినిధులే వచ్చారు మా కాలనీ నీళ్లలో ఉండిపోయింది. ఎవ్వరూ పలకరించడానికి రాలేదు. సాక్షి ప్రతినిధులు మాత్రమే వచ్చారు. ఇళ్లలోకి నీళ్లు చేరితో మిద్దెక్కి కూర్చున్నాం. వాడుకోవడానికి నీళ్లు కూడా లేవు. – వెంకటలక్ష్మి, కంసాలిపేటమాపేట ప్రభుత్వానికి తెలియదట.. మా పేట నీళ్లలో మునిగిపోతే, మాకు తెలియదు. మీకు ఏమీ రావంటున్నారు. రాజరాజేశ్వరిపేట తప్ప మీపేట లెక్కల్లో లేదంటున్నారు. ఇప్పటి వరకు మాకు అన్నం పెట్టిన నాథుడే లేడు. సాక్షి మాత్రమే మాకు అండగా నిలిచింది. మా కుర్రోళ్లు జట్టుగా ఏర్పడి ట్యూబులపై తిరుగుతూ సాయం చేస్తున్నారు. – క్రీస్తుబాబు, కంసాలిపేట -
ఆయనకు విపరీతమైన అనుమానం!
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, తెనాలిమీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్‌డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?– కుమార్, కర్నూలుచదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్‌కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
కల సాకారం కోసం తపించే స్నే‘హితుడు’..
ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్న పీజీ.వింద (అష్టాచెమ్మా, సమ్మోహనం, జెంటిల్మన్..ఫేం) నిజమైన హితుడు అని చెప్పాలి. తన కల సాకారంతో పాటు మిత్రులందిరివీ కలిపి మన కలలను సాకారం చేయాలని ఆరాటపడతాడు. సిటీలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు నాకు సహాధ్యాయి. ఇద్దరికీ కళలపట్ల ఆసక్తి, ఏదో సాధించాలన్న తపన.. మా స్నేహబంధంతో పాటు బలపడుతూ వచి్చంది. బేగంపేట్‌లో ఓ చిన్న గదిలో అద్దెకుంటూ చాలీ చాలని డబ్బులతో బిస్కట్లు, సమోసాలతో కడుపు నింపుకుంటూ.. బహుశా ఇవన్నీ ఎదిగే క్రమంలో చాలా మందికి అనుభవమే కావచ్చు. కానీ.. మా లాంటి స్నేహం మాత్రం అతి కొద్దిమందికే దక్కింది అని సగర్వంగా చెప్పగలను. దర్శకులు శేఖర్ కమ్ములకు నన్ను పీజీ.వింద పరిచయం చేసి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇప్పించకపోతే.. బహుశా సినీరంగానికి దూరంగానే ఉండేవాడినేమో. నాలాంటి మరికొంత మంది స్నేహితుల కలల సాకారానికి కూడా సాయం అయ్యాడు. అందుకే ఎందరో ఫ్రెండ్స్.. కానీ కొందరే స్నే‘హితులు’.. అలాంటివారిలో బెస్ట్ పీజీ.వింద. –అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, తెలుగు సినీ దర్శకుడు -
‘ఆధునిక హైదరాబాద్’ ఆ ఇద్దరు మిత్రులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒక అందమైన నగరం. నాలుగు వందల ఏళ్ల చారిత్రక సోయగం. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరం ఇది. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఒకే పాదు నుంచి పూచిన పూలై వికసించాయి. వైవిధ్యభరితమైన స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్ అంటేనే ఆతీ్మయమైన నగరం. ఎంతోమంది గొప్ప స్నేహితులు ఈ నేలపైన పుట్టిపెరిగారు. చరిత్రను సృష్టించారు. ఆదర్శప్రాయమైన స్నేహితులుగా నిలిచారు. నిజాం నవాబుల కాలంలో రాజులకు, ఉన్నతాధికారులకు మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆధునిక హైదరాబాద్ నిర్మాణాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ ఫక్రుల్ముల్క్ బహదూర్. ఇద్దరూ గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయారు. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కలిసి ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదర్శప్రాయమైన, అజరామరమైన వారి స్నేహంపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. అది స్వర్ణయుగం.. ఆ ఇద్దరి స్నేహం హైదరాబాద్ చరిత్రలో స్వర్ణ యుగం. మీర్ మహబూబ్ అలీఖాన్ ఆధునిక హైదరాబాద్ నగరానికి బాటలు పరిచిన గొప్ప పాలకుడు. ఆయన ఆశయాన్ని, ఆలోచనలను ఆచరణలో పెట్టిన పరిపాలనాదక్షుడు ఫక్రుల్ముల్్క. విధినిర్వహణ దృష్ట్యా ప్రధానమంత్రి. ఇద్దరి అభిరుచులు చాలా వరకూ ఒకేవిధంగా ఉండేవి. 1892 నుంచి 1901 ఫక్రుల్ముల్క్ ప్రధానిగా పనిచేశారు. ఇంచుమించు సమయసు్కలు కావడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల పాటు ఆ స్నేహం కొనసాగింది.. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప ప్రతిభావంతుడైన ఫక్రుల్కు సంగీతం, సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. మహబూబ్ అలీఖాన్ కూడా గొప్ప సాహిత్యాభిరుచి కలిగిన వ్యక్తి. ఇద్దరూ కలిసి కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొనేవారు. ఉర్ధూ సాహిత్య వికాసం కోసం మహబూబ్ అలీ ఎంతో కృషి చేశారు. ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టింది ఆయనే. ఎంతోమంది కవులను, కళాకారులను. పండితులను ప్రోత్సహించారు. ఇద్దరు థారి్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలిచారు. అనాథలు, నిస్సహాయులను ఆదుకొనేందుకు ఫక్రుల్ స్వచ్ఛంద సంస్థలకు ధారాళంగా విరాళాలు ఇచ్చేవారు. నిజాంకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా అనేక సమావేశాల్లో, విధానపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా... భావితరాల అవసరాలను, నగర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఇద్దరూ కలిసి అనేక నిర్మాణాలను కొనసాగించారు. రహదారులను నిర్మించారు. కొత్త భవనాలను కట్టించారు. నాటి సంపన్నులు, నవాబుల పిల్లల ఉన్నత చదువుల కోసం 1887లోనే నిజామ్స్ కళాశాలను నిర్మించారు. అనంతర కాలంలో అన్ని వర్గాలకూ చేరువైంది. బాలికల విద్య కోసం మహబూబియా కళాశాల, హైకోర్టు భవనం, అసెంబ్లీహాల్, రైల్వే నిర్మాణం, టెలిఫోన్, బ్యాంకింగ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ వంటి కార్యక్రమాలు మహబూబ్ అలీ హయాంలో చేపట్టినవే. స్కూళ్లు, కళాశాలలు కట్టించారు. ఈ నిర్మాణాలన్నింటిలోనూ నిజాంకు ఫక్రుల్ కుడిభుజంగా నిలిచారు.ఎర్రమంజిల్ ఒక కళాఖండం.. ఆ ఇద్దరి అపురూపమైన, ఆదర్శప్రాయమైన స్నేహానికి చిహ్నంగా ఫక్రుల్ అద్భతమైన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కట్టించాడు. ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ రాజ మందిరం అద్భుతమైన మాన్యుమెంట్గా నిలిచింది. ఎత్తయిన ప్రదేశంలో ఈ అందమైన ప్యాలెస్‌ను కట్టించారు. 1890లో నిర్మాణ పనులు ప్రారంభించగా పదేళ్ల పాటు పనులు కొనసాగాయి. 1900లో ఈ భవన నిర్మాణం పూర్తయింది. దేశంలోని మొఘల్, కుతుబ్‌షాహీ వాస్తు శిల్పాన్ని, యురప్లోని విక్టోరియన్, గోథిక్ నిర్మాణ శైలిని మేళవించి ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మాంచారు. ఫక్రుద్దీన్ నివాస మందిరం ఇది. సభలు, సమావేశాలు, వేడుకలు, విందులు, వినోదాలతో ఈ ప్యాలెస్ నిత్యం సందడిగా ఉండేది. -
Friendship Day: ఓ.. మై ఫ్రెండ్ (ఫొటోలు)
-
స్నేహితుడితో ఓ సెల్ఫీ
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ఈ మాటల్ని వింటే పులకించి పోవాల్సిందే. అదీ స్నేహం గొప్పతనం. స్నేహానికి కులం, మతం, ప్రాంతం, భాష, లింగ భేదాలేవీ వుండవు. ఉన్నదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే. దోస్త్ అంటే వీడేరా అనిపించేంత బంధం. మరి ‘దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీ జాన్.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం’’ అనుకునేంత గొప్ప దోస్తులు మీ జీవితంలో ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి నిజమైన స్నేహితుడితో సంతోష క్షణాలను మళ్లీ గుర్తు చేసుకోండి. ఆగష్టు ఫస్ట్ సండే..(4వ తేదీ) స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ దోస్తుతో సెల్పీ దిగి సాక్షి. కామ్‌కు పంపించండి. ‘దోస్త్ మేరా దోస్త్’ సెల్పీ 9182729310 నెంబరుకు వాట్సాప్ చేయండి. ఆ ఫొటోలను సాక్షి డాట్ కామ్‌లో ప్రచురిస్తాం. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే కాదు.. ఈ జ్ఞాపకాన్ని కలకాలం పదిల పర్చుకోండి. ఫ్రెండ్షిప్ డే గురించి ఇవి మీకు తెలుసా?అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ప్రతిపాదన 1958 జూలై 30న పరాగ్వేలో మొదలైంది. వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఆలోచనను తొలిసారి 1958, జూలై 20న పరాగ్వేలో స్నేహితులతో విందు సందర్భంగా డాక్టర్ ఆర్టెమియో బ్రాచో ప్రతిపాదించారు.ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశంలో ఆగస్టు నెలలోని తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. -
‘సాక్షి’ విలేకరిపై జనసేన ఎమ్మెల్యే దాడి
రాంబిల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల సాక్షి విలేకరి, యలమంచిలి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బుదిరెడ్డి అప్పారావుపై జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దాడికి పాల్పడ్డారు. శనివారం దిమిలి గ్రామంలో తన నివాసంలో అప్పారావు తనపై దాడి ఘటనను మీడియాకు వివరించారు. ‘ఈ నెల 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నా మొబైల్‌కు ఫోన్ చేశారు. నేను లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత ఆయన పీఏ చంద్రారావుతో ఫోన్ చేయించారు.అయినప్పటికీ నేను ఫోన్ తీయలేదు. మళ్లీ 20 నిమిషాల తర్వాత ఎమ్మెల్యే ఫోన్ చేసి మీతో మాట్లాడాలని, అచ్యుతాపురంలోని ఎస్టీబీఎల్ లేఅవుట్లో ఉన్న తన స్వగృహానికి రావాలని చెప్పారు. దానికి నేను రానని చెప్పాను. అయితే వెంటనే పంపించేస్తానని.. రాంబిల్లి మండలం కొత్తూరు వరకు కారు పంపిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అయినప్పటికీ నేను రానంటే రావాలని ఒత్తిడి తెచ్చారు. తప్పనిసరి పరిస్థితిల్లో నా స్వగ్రామం దిమిలి నుంచి బైక్‌పై కొత్తూరుకు వెళ్లాను. అప్పటికే అక్కడ బ్లాక్ స్కార్పియోతో ఎమ్మెల్యే డ్రైవర్ జగదీష్ ఉన్నాడు. నన్ను కారు ఎక్కించుకుని ఎస్టీబీఎల్‌లో అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు ఇంటి ముందు దించారు. అక్కడ 40 నిమిషాలు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కోసం ఎదురుచూశాను. అప్పటికి కూడా ఎమ్మెల్యే నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నేను వెళ్లిపోతానని ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేసి చెప్పాను. దానికి పీఏ తన రూమ్ పక్కనే ఉందని, అక్కడకు రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లగా గదిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఉన్నారు. తాను లోపలకు వెళ్లగానే రూమ్ డోర్ మూసేశారు’ అని అప్పారావు వివరించారు.చంపేస్తానని హెచ్చరించారు..‘నన్ను గదిలో బంధించి ‘యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు’ పేరిట సాక్షిలో ఎందుకు వార్త రాశావు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే ఎన్నికలకు ముందు సాక్షిలో ప్రచురించిన కథనాలపై నిలదీశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ వచ్చాక ఎన్నికల్లో ఓడించడానికి కథనాలు రాశావంటూ మండిపడ్డారు. ఆ కథనాలు నేను రాయలేదని, విశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్లు రాశారని సమాధానమిచ్చినా ఆయన వినిపించుకోలేదు. వారం క్రితం ‘యథేచ్ఛగా మట్టి దందా’ పేరుతో ఎందుకు వార్త రాశావని బెదిరించారు. దానికి నేను సమాధానంగా అక్రమంగా మట్టి దందా చేస్తే ఖచ్చితంగా రాస్తానని.. ఇదే వార్త సాక్షితో పాటు ఈనాడులో కూడా వచ్చిందని చెప్పాను. దీంతో వెంటనే ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నిన్ను చంపేస్తాను’ అని హెచ్చరించారు. నా తల్లిని తిట్టడంతోపాటు నీ సంగతి తేలుస్తానంటూ కోపంతో మెడ పట్టుకుని చంపేస్తా అని బెదిరించారు. ఆ క్షణంలో నాకు ప్రాణహాని ఉందని గ్రహించి అక్కడ నుంచి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డాను. నాకు, నా కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని విన్నవిస్తున్నా’ అని అప్పారావు తెలిపారు. -
ఆర్థిక అక్షరాస్యత
‘ఆర్థికాంశాలు మహిళలకు అంత త్వరగా అర్థం కావు’ అనే దురభిప్రాయం ఒకటి మన సమాజంలో స్థిరపడిపోయింది. ఆర్థిక మంత్రిగా మహిళలు సమర్థంగా బాధ్యతలు నిర్వహించడాన్ని చూస్తూ కూడా తాము పెంచి పోషించుకుంటున్న అపోహను వీడడానికి ఇష్టపడదు సమాజం. చార్టెడ్ అకౌంటెన్సీలో ఎంత మంది మహిళలు ఉన్నప్పటికీ సమాజం మాత్రం తన కళ్లకు కట్టుకున్న గంతలు విప్పడానికి సుముఖంగా ఉండదు. వీటన్నింటినీ పటాపంచలు చేయడానికి కంకణం కట్టుకుంది సాక్షి జైన్. జార్ఖండ్ రాష్ట్రం, రాంచీకి చెందిన సాక్షి సీఏ పూర్తి చేసి ఒక సంస్థలో ఉద్యోగంలో చేరింది. తన జ్ఞానాన్ని తన ఎదుగుదలకే పరిమితం చేసుకోకుండా మహిళాసమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలనుకుందామె.ఫాలోవర్స్ ΄పొలోమన్నారు! ‘‘కొత్తతరం విద్యార్థులకు ఆర్థికాంశాల్లో మెళకువలు నేర్పించే క్రమంలో నాలో ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి. మనదేశంలో మహిళలకు అక్షరాస్యత ఉంది, కానీ ఆర్థిక అక్షరాస్యత తగినంతగా లేదనిపించింది. అయితే వారిలో ఆర్థికాంశాల పట్ల అనేకానేక సందేహాలున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయగలిగితే ప్రతి ఇంట్లో ఒక ఆర్థిక వేత్త తయారవుతారనిపించింది. అప్పుడు మొదలు పెట్టిన ప్రయత్నమే : @ca.sakchijain ఇన్స్టాగామ్కి నాలుగు నెలల్లోనే పదిహేడు లక్షల ఫొలోవర్లు వచ్చారు. ఫిన్‌ఫ్లూయెన్సర్ (ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్)గా సోషల్ మీడియాతో నేను గుర్తింపు పోందాను. నా పరిజ్ఞానంతో వేలాది మహిళలు తమ ఆర్థికాంశాలపై స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన స్థితికి చేరారు. కంటెంట్ క్రియేటర్నయ్యాను! నేను అకౌంటెన్సీలో లోతుగా పాఠాలు చెప్పే ప్రయత్నమేదీ చేయలేదు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ఎన్ని రకాలుగా మదుపు చేయవచ్చో వివరించాను. జీవిత బీమా పథకాల గురించి చెపాను. ఫైనాన్షియల్ ΄ాలసీలతో పాటు రుణాలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి అవసరాలకు తీసుకోవాలి, తీసుకున్న రుణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి... అనే మెళకువలు నేర్పించాను. భారీ పదజాలాన్ని ఉపయోగిస్తే ఇది మనకు అర్థమయ్యే విషయం కాదని తెలుసుకోవడం మానేస్తారు. అందుకే నేను సామాన్య మహిళ మేధస్థాయికి దిగి అలతి అలతి పదాలతో, వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో పోలుస్తూ వివరించాను. మా రాష్ట్రంలోని గ్రామాల్లో చదువుకున్న మహిళలంటే స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మహిళలే. వాళ్లను దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేయడం మొదలుపెట్టాను.ఆశ్చర్యకరంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళలు కూడా నా వీడియోలను చూస్తూ అనేక సందేహాలను వ్యక్తం చేసేవారు. ఒక విధంగా చె΄్పాలంటే నా వీక్షకుల నుంచి వచ్చే కామెంట్స్ నాకు దిశానిర్దేశం చేశాయంటే అతిశయోక్తి కాదు. వీక్షకుల కామెంట్స్ చూసి వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ వివరాలతో వీడియోలు చేశాను. నా వీక్షకులకు అవసరమైన సమాచారాన్ని ఆర్థిక నియమాల చట్రంలో వివరించడానికి నేను చేసిన ప్రయత్నం నన్ను కంటెంట్ క్రియేటర్‌ని చేసింది. ఇప్పుడిది నా ఫుల్‌టైమ్ జాబ్‌గా మారింది. మొదట్లో రోజుకో వీడియో పోస్ట్ చేశాను. కామెంట్ బాక్స్‌లో వస్తున్న రిక్వెస్ట్‌లను చేరాలంటే ఒకటి సరిపోవడం లేదని ఇప్పుడు రోజుకు రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. నేను చెప్తున్న విషయాలు మరీ భారీస్థాయిలో ఉండకూడదని, పెద్ద పెట్టుబడులు పెట్టే వారికి సలహాలనివ్వడానికి ఆర్థిక నిపుణులు ఎందరో ఉన్నారు. మహిళలను చైతన్యవంతం చేయాలంటే వారు సులువుగా అందుకోగలిగిన మెళకువలతో మొదలు పెట్టాను. లక్ష్యాలు ఉన్నతంగా ఉంటున్నాయి నేటి రోజుల్లో దాదాపుగా మహిళలందరూ తమకంటూ ఒక ఉపాధిమార్గాన్ని వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. మరికొందరు గృహిణిగా భర్త సం΄ాదనతో కుటుంబాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించగలుగుతున్నారు. సరాసరిన చూస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటున్నారు. వారికి ఆర్థిక అక్షరాస్యత తెలిస్తే డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎలా మదుపు పెట్టాలి అనే విషయాలు అర్థమవుతాయి. దాంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరు నెలల అనుభవంలో నాకు అర్థమైనదేమిటంటే... ఒక చిన్న ఆసరా లేక΄ోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండి΄ోయారని! సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసి΄ోని స్థాయిలో ఉంటున్నాయి. తాము, తమ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడాలనే ఆలోచనతో΄ాటు సమాజంలో మరికొందరికి ఉపయోగపడే పరస్పర సహకార ధోరణి కనిపిస్తోంది. నా ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోందని నాకూ సంతోషంగా ఉంది’’ అని వివరించారు సాక్షి జైన్.ఒక చిన్న ఆసరా లేకపోవడం వల్లనే ఆర్థికాంశాల్లో మహిళలు ఒక అడుగు వెనుకగా ఉండిపోయారు. సందేహాల రూపంలో వాళ్ల ఆసక్తులు, ఆలోచనలు, లక్ష్యాలు పెద్ద వ్యా΄ారులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉంటున్నాయి. -
సాక్షి వద్దు..మీడియాపై ఆంక్షలు
-
నిజంగా ఆశ్చర్యపోయా..
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలు.. అవి అందిస్తున్న సేవల కోసం పత్రికల్లో చదవడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇవి అందిస్తున్న సేవలు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఈ శతాబ్దంలోనే ఓ గొప్ప విప్లవాత్మక మార్పు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు..’ అని నాబార్డు రిటైర్డ్ జనరల్ మేనేజర్ పి.సాంబశివారెడ్డి ప్రశంసించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా, పైసా భారం పడకుండా ఏపీ సచివాలయ వ్యవస్థ ద్వారా తాను పొందిన లబ్ధిని ఆయన స్వయంగా ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఏమన్నారంటే..ఈ మార్పు చూసి ఆశ్చర్యపోయా..మాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సింగనమల మండలం తూర్పు నరసాపురం. స్వగ్రామంలో మాకు వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోనే ఉంటున్న మా సోదరులు నా భూమిని సాగుచేస్తున్నారు. నేను బ్యాంకింగ్ రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించాను. నాబార్డులో వివిధ హోదాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి జనరల్ మేనేజర్‌గా 2013లో రాష్ట్ర విభజనకు ముందు రిటైరయ్యాను. కుటుంబంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాను.మా స్వగ్రామానికి వెళ్లి దాదాపు దశాబ్దం దాటిపోయింది. గ్రామంలో విశేషాలే కాదు.. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మా సోదరులు, బంధువుల ద్వారా తెలుసుకుంటుంటాను. గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత నేను మా గ్రామానికి వెళ్లలేదు. అయితే, గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి వార్తా పత్రికలతోపాటు మా సోదరుల ద్వారా తెలుసుకున్నాను. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలాంటి సిఫార్సులు లేకుండా అన్ని పనులు గ్రామంలోనే అయిపోతున్నాయని చెబుతుంటే ఆశ్చర్యమేసింది. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారు. పంట ఉత్పత్తులను కూడా గ్రామంలోనే కొంటున్నారని మా బంధువులు చెప్పగా విన్నాను. పత్రికల్లో కూడా అప్పుడప్పుడూ చూస్తున్నాను. ఇది నిజమేనా.. ఇంత మార్పు వచ్చిందా.. అని అనుకున్నాను. కానీ, స్వతహాగా నాకు ఎదురైన అనుభవంతో ఆశ్చర్యపోయాను.సిఫార్సుల్లేకుండా పరిహారం..గత శనివారం నా ఖాతాలో రూ.34వేలు జమైంది. ఆశ్చర్యపోయాను.. ఎక్కడో ఉన్న నా వివరాలు తెలుసుకుని నాకు ఫోన్ చేశారు. ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఎలాంటి సిఫార్సులు లేవు.. ఎవరికీ రూపాయి ఇవ్వలేదు. నేరుగా నా ఖాతాలో కరువు సాయం జమైంది. ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు చూస్తుంటే నిజంగా గొప్ప విప్లవాత్మక మార్పుగా అభివర్ణించొచ్చు. గతంలో విపత్తులు సంభవించిన సందర్భాల్లో పరిహారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. అడిగినంత దక్షిణ సమర్పిస్తే కానీ పరిహారం చేతికి వచ్చే పరిస్థితులు ఉండేవి కావు.కానీ, నేడు అవినీతికి తావులేకుండా సచివాలయ సిబ్బంది ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం. రైతులకు సంబంధించిన సేవలే కాదు.. పౌరసేవలు కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ పొలిమేర దాటకుండానే సామాన్య పౌరులు పొందగలుగుతున్నారని తెలిసి నిజంగా సంతోషమేసింది. ఇలాంటి వ్యవస్థ కదా ప్రజలకు కావాల్సింది. ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వానికి నా అభినందనలు.నమ్మశక్యం కాని రీతిలో..పోలింగ్ ముగిసిన తర్వాత ఒకరోజు తూర్పు నరసాపురం గ్రామ సచివాలయం నుంచి ఆర్బీకే సిబ్బంది (రాజారెడ్డి) ఫోన్‌చేశారు. మన సింగనమల మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. భూ యజమానికి కరువు సాయం జమవుతుంది. మీ ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు చెప్పండని అడిగారు. ముందు నమ్మలేదు.. మీకు నా ఫోన్ నంబరు, వివరాలు ఎవరిచ్చారు అని ఆరాతీస్తే.. గ్రామంలో మీ సోదరులిచ్చారని బదులిచ్చారు. ఆ తర్వాత వారితో క్రాస్ చెక్‌చేసుకున్న తర్వాత నమ్మకం ఏర్పడింది. అయినా ఆదాయపు పన్ను చెల్లించే నాకెందుకు కరువు సాయం వస్తుందని అడిగాను. లేదు సర్.. కరువు సాయం పంపిణీకి పన్ను చెల్లింపునకు సంబంధంలేదని బదులిచ్చారు. అయినా నమ్మకం కలగలేదు. లేదు సర్ మీ పేరిట ఉన్న 7.5 ఎకరాల వ్యవసాయ భూమిలో వేరుశనగ వేశారు. కరువు ప్రభావంతో పంట దెబ్బతిన్నది. ఇదే విషయాన్ని మేం రిపోర్టు చేశాం.. అందుకే కరువు సాయం మంజూరైందని వివరించారు. ఆ తర్వాత సిబ్బంది అడిగిన ఇతర వివరాలు చెప్పాను. -
సాక్షి ఆఫీస్‌లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
-
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొనండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం. -
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
‘గుడ్ మార్నింగ్.... ఇదొక అంద మైన మార్నింగ్’ అంటూ 16 ఏళ్ల క్రితం తెలుగు లోగిళ్లను.. తాకిన ‘సాక్షి’ని తెలు గు ప్రజలందరూ అభిమానపూర్వకంగా మీ మనసుల్లో నిలుపుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వార్తా ప్రపంచంలో ఒంటెత్తు పోకడకు ఫుల్స్టాప్ పెడుతూ నాణేనికి మరోవైపును చూపుతూనే ఉంది ‘సాక్షి’. ఆల్కలర్ పేజీలు, ఏకకాలంలో 23 ఎడిషన్లతో మొదలైన సాక్షి తరువాతి కాలంలో దినదిన ప్రవర్ధమానమై శాటి లైట్ చానల్, డిజిటల్ మీడియాకూ విస్తరించింది. పాఠకుల అవసరాలు.. మనోభావాలకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడంలో సాక్షి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంది. అంత ర్జాతీయ ప్రమాణాలు, డిజైన్లతో ‘సాక్షి’ చానల్ ఇటీవలే సరికొత్త రూపు సంతరించుకున్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు... "Sakshi.com''కు కూడా కొత్త సొబగులు అద్దుతున్నాం.జర్నలిజం విలువలలో ఏమాత్రం రాజీ పడకుండా... డిజైనింగ్, నావి గేషన్ విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మీకోసం మరింత అందంగా తయారైంది మీ వెబ్సైట్! కంటికి ఇంపుగా... వార్తలు చదివేందుకు మరింత సులభతరంగా ఉంటుంది ఇది. ఇంటర్నెట్ తాజా పోకడలను ప్రతిబింబించే లుక్ అండ్ ఫీల్, సులభంగా నావిగేట్ చేసుకునే యూజర్ ఇంటర్ఫేస్, ఏ డివైజ్‌కైనా అనుకూలంగా మారే రెస్పాన్సివ్ వెబ్సైట్, నచ్చిన కంటెంట్‌ను సిఫార్సు చేసే టూల్స్, అంతే కాదు.. వార్తలు చదువుకోవడంతోపాటు హాయిగా మల్టీ మీడియాలో ఫొటోలు, వీడియో లు చూడవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. వీటితోపాటే సాక్షి మొబైల్ అప్లికేషన్ ను కూడా ఆధునికీకరించాం. మీరు మొబైల్ యాప్‌లో సాక్షిని ఫాలో అవుతుంటే (ఆండ్రాయిడ్ లేదా iOS ) యాప్‌ను ఒక్కసారి అప్డేట్ లేదా రీఇన్ స్టాల్ చేసుకోవడమే తరువాయి. సరికొత్త డిజైన్, లుక్స్‌తో సాక్షి.కామ్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది.దశాబ్ద కాలంగా sakshi.comని ఆదరిస్తున్న పాఠకదేవుళ్లు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. డిజిటల్ ప్లాట్‌ఫాంల రీడర్‌షిప్‌ను లెక్కించే ఆధీకృత వ్యవస్థ comscore ప్రకారం.. తెలుగు న్యూస్ వెబ్సైట్లలో www.sakshi.com అత్యధిక యూనిక్ విజిటర్స్‌తో చాలాకాలంగా మొదటి స్థానంలో ఉంది. (··Source: comscore).సాక్షి కుటుంబంలో మీరంతా సభ్యులైనందుకు గర్విస్తున్నాం. కొత్త రూపంలో మీ ముందుకొచ్చిన www.sakshi.com ను ఆశీర్వదించండి. – ఎడిటర్, సాక్షి మీడియా గ్రూప్ -
మళ్లీ జగన్ రావాలి
పథకాలతో జగన్ మాకు డబ్బులు పంచలేదు. ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికంపై పోరాటంలో సాయపడ్డారు. మధ్య తరగతి ప్రజలను కష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కించారు. మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు.. స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించారు. విలేజ్ క్లినిక్‌లతో మా ఆరోగ్యాన్ని కాపాడారు. మహిళలకు ఒక అన్నలా, తమ్ముడిలా ఆర్థికంగా అండగా ఉండి తమ కుటుంబాలను అప్పుల ఊబి నుంచి గట్టున పడేశారు. పెద్ద కొడుకులా మలి వయసులో వృద్ధుల్ని ఆదుకున్నారు. ఇంటివద్దకే సంక్షేమం, సుపరిపాలనతో పాలనాదక్షతను చాటిచెప్పారు. ఏదేమైనా మరోసారి జగన్‌కు ఓటేస్తే ఈ సంక్షేమం కొనసాగడంతో పాటు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని రాష్ట్రంలోని ఓటర్లు ‘సాక్షి రోడ్‌షో’లో అభిప్రాయపడ్డారు.మరో 10 రోజుల్లో ఎన్నికలు.. రాష్ట్రంలో ఎటు చూసినా ఎన్నికల కోలాహలం .. ఎవరికి ఓటర్లు పట్టం కడతారు? అని ఒకటే చర్చ.. ‘సాక్షి రోడ్‌షో’లో భాగంగా ప్రత్యేక బృందం పల్లెలు, పట్టణాల్లో రచ్చబండలు, పంట పొలాలు, రోడ్ల కూడళ్లు, కిళ్లీ షాపులు, ఆటోస్టాండ్లు, మార్కెట్లు ఇలా వీలున్న చోటుకు వెళ్లి ఓటర్లను పలకరించింది. చేనేతకారులు, రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు, రైతులు, మహిళలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలతో ముచ్చటించింది. ఎవరికి.. ఎందుకు ఓటేస్తామో ‘సాక్షి’ రోడ్ షోలో ఓటర్లు స్పష్టం చేశారు. అనంతపురంజిల్లా రోడ్ షోమేలు చేసిన వారిని మరిచిపోలేంఉమ్మడి అనంతపురం జిల్లాలో 70 కిలోమీటర్ల పరిధిలోని ఓటర్లను సాక్షి రోడ్ షో బృందం పలకరించింది. మాకు రాజకీయాలతో పనిలేదు.. సాయం చేసిన వారికి అండగా నిలుస్తామని కొందరు చెబితే.. మహిళలు, చేతివృత్తిదారులు, కూలీలు, రైతులు, వృద్ధులు తమకు సాయం చేసిన జగన్‌కు ఓటేస్తామని నిర్మొహమాటంగా పేర్కొన్నారు. జిల్లాలో అనంతపురం, రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో 75 కిలోమీటర్లు సాగిన రోడ్‌షోæలో ఓటర్ల మనోగతం ఇది.. (జి.రామచంద్రారెడ్డి/బి.నగేష్, అనంతపురం)అనంతపురం సప్తగిరి సర్కిల్లో.. ఉదయం 7.20 గంటలకు అనంతపురం కలెక్టరేట్ వద్దకు వెళ్తే ఫరీద్, రాము టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. జగన్ మళ్లీ గెలుస్తాడని ఫరీద్ చెబితే.. తాను పక్కా టీడీపీ అని అయినా ఈసారి అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి గెలుస్తాడని రాము చెప్పాడు. అక్కడ నుంచి కందుకూరు వైపు రాప్తాడు నియోజకవర్గం వెళ్తుండగా మధ్యలో ఇటుకల బట్టీ వద్ద ఆగి కూలి పని చేస్తున్న మాధవితో మాట్లాడితే.. తనకు ఏటా రూ.9,100 చొప్పున డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అందాయని, అర్హత ఉన్న పథకాలన్నీ వచ్చాయని చెప్పింది.కందుకూరు శివారులో.. ఉదయం 8.10: కందుకూరు శివారులోని జగనన్న కాలనీ వద్ద ఆగాం. లబ్ధిదారులు ఈడిగ మహేశ్వరి, సరస్వతి, లక్ష్మీదేవి లు మాట్లాడుతూ.. ‘ఇక్కడ సెంటు రూ. 3 లక్షలకు పైగా ఉంది. మాకు సెంటున్నర స్థలం ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించారు. జగన్ సాయం మరచిపోలేం’ అన్నారు. కందుకూరులో ఓ అరుగుపై తలారి ఓబుళపతి, సాకే నారాయణ, ఆర్.నారప్పరెడ్డి, రాగే యల్లప్ప కూర్చుని ఉండగా పలకరించాం. పరిటాల సునీతను రెండుసార్లు గెలిపించినా తమ ఊరికి రోడ్డు కూడా వేయించలేదని.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయ్యాక రోడ్డుకు మోక్షం వచ్చిందన్నారు. జగన్ పాలనలో ఇంటికే పథకాలు అందుతున్నాయని చెప్పారు. ధర్మవరం మండలం చిగిచెర్లలో.. ఉదయం 9.20: ధర్మవరం మండలం చిగిచెర్లలో టైలర్ మాబు తారసపడ్డారు. ‘జగన్ సొమ్ము తిని ఎలా మరచిపోతాం. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడు. నా ఇద్దరు కూతుళ్లకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందించారు. నా భార్యకు రూ.70 వేలు డ్వాక్రా రుణ మాఫీ డబ్బులు వేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి పట్టించుకోలేదు’ అని మనసులో మాట బయటపెట్టాడు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌లో.. పెద్దన్నను పలకరించగా.. ‘మాకు అమ్మఒడి, ఆసరా పథకాలు అందాయి. నాకు వృద్ధాప్య పింఛన్ రూ. 3 వేలు వస్తోంది. ప్రతి నెలా వలంటీరు తెచ్చేవాడు. వలంటీర్లు వద్దని ఎవరో చెప్పారంట ఏప్రిల్‌లో ఇంటికి రాలేదు. తెచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డాం’ అని చెప్పాడు.ధర్మవరం శివారు ఇందిరమ్మ కాలనీలో.. ఉదయం 10.10: ధర్మవరం శివారులోని ఇందిరమ్మకాలనీ.. చేనేత కార్మికులైన పల్లా రంగయ్య, నాగరత్నమ్మ ఇంటికి వెళ్లాం. ఇద్దరూ చీర నేస్తుండగా పలకరించాం.. ‘వైఎస్సార్ హయాంలో మాకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించారు. జగన్ వచ్చాక నేతన్ననేస్తంలో ఏటా రూ. 24 వేలు ఇస్తున్నారు. కరోనా సమయంలో చేసిన సాయం మరిచిపోలేం. మా ముగ్గురు కూతుళ్లకు రెండు నెలల వ్యవధిలోనే కాన్పులు చేశాం. ఆ సమయంలో జగనన్న సాయం చేశాడు. జగన్‌కే ఓటు’ అని చెప్పారు. చెన్నేకొత్తపల్లిలో ఉదయం 11 గంటలకు: చెన్నేకొత్తపల్లికి చేరుకున్నాం. టీస్టాల్ నిర్వాహకుడు దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊరిలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయన్నాడు. నాగసముద్రం పంచాయతీ పల్లెన్నగారిపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మళ్లీ జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయనే భయం ఓటర్లలో ఉందన్నాడు. అనంతరం పెనుకొండ మండలం గుట్టూరులో ఆటోడ్రైవరు ఆంజనేయులుతో మాట్లాడాం. మా కుటుంబానికి రూ.5 లక్షలకు పైగా లబ్ధి జరిగింది. పథకాల కోసం ఏ నాయకుడి వద్దకు, అధికారి వద్దకు వెళ్లలేదు. వలంటీరు వచ్చి రాసుకుని వెళ్లేవాడు.’ అని చెప్పాడు.ప్యాదిండి సమీపంలో..ధర్మవరం నుంచి ప్యాదిండి మీదుగా ఎన్ఎస్ గేట్ వైపు వెళ్లగా.. మధ్యలో చీనీ తోటలో కూర్చున్న రైతులు భాస్కర్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడాం. తమకు ఏటా సగటున రూ.లక్ష వరకు పంటల బీమా వచ్చిందన్నారు. ఏటా రూ. 13,500 రైతు భరోసా వస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో మండల కేంద్రానికి వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పాయన్నారు. పెనుకొండ పట్టణంలో.. మధ్యాహ్నం 12 గంటలకు: మునిమడుగులో ఆటో డ్రైవర్ మహిధర్, హోటల్ నిర్వాహకురాలు రాధమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి సంక్షేమ పథకం అందిందని చెప్పారు. మధ్యాహ్నం పెనుకొండ పట్టణంలో రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆంజనేయులును కలవగా.. ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో పేదలకు సాయం జరిగిందని.. సాయం చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. అంతకు ముందు చెన్నేకొత్తపల్లిలో రామాంజనేయులు మాట్లాడుతూ తాను టీడీపీ అభిమానినని, ఈ ప్రభుత్వంలో ఎవరి సిఫార్సు లేకుండానే సంక్షేమ పథకాలు అందాయమన్నారు. అర్హత ఉన్న ప్రతి పథకం అందిందన్నారు. పెనుకొండలో రామకృష్ణ మాట్లాడుతూ పథకాలు నిష్పక్షపాతంగా అందాయని.. ఓటు మాత్రం ఎవరికి వేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. విశాఖ జిల్లా రోడ్ షోపాలన బాగుంది.. మరోసారి అవకాశంపల్లె, పట్టణం, ఊరు, వాడ ఎటు చూసినా ఫ్యాన్ గాలే.. పేద.. ధనిక.. అవ్వా తాత.. అక్కా చెల్లి.. అన్నా.. తమ్ముడు.. ఎవర్ని అడిగినా జగనే అన్నారు. సుపరిపాలనే జగనన్న పాలనకు శ్రీరామరక్ష అని ఆటో డ్రైవర్ అంటే.. ఇంటి దగ్గరకే సంక్షేమాన్ని అందించడం నచ్చిందని కిరాణా కొట్టు మహిళ చెప్పింది. మాకు సాయపడ్డ జగన్‌కే ఓటేస్తామని కొబ్బరి బొండాలమ్మే వ్యక్తి చెప్పగా.. చంద్రబాబు కంటే.. అన్నదాతని ఆదుకున్న జగన్ వెయ్యి రెట్లు మేలని రైతు బదులిచ్చారు. ఇసుక విధానం మార్చితే బాగుంటుందని ఓ మేస్త్రీ అభిప్రాయపడ్డాడు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సాక్షి రోడ్‌షోలో అత్యధిక శాతం జగన్ పాలన బాగుందని, మరోసారి అవకాశం ఇస్తామని చెప్పారు. విశాఖపట్నంలోని ఉత్తర నియోజకవర్గం నుంచి తూర్పు, భీమిలి, పెందుర్తి మీదుగా అనకాపల్లి జిల్లాలోని మాడుగుల, చోడవరం, అనకాపల్లి వరకూ సాగిన రోడ్‌షోలో ఓటర్ల మనోగతం ఇది.. –కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నంబాలయ్య శాస్త్రి లేఅవుట్(విశాఖ ఉత్తరం) ఉదయం 8.30 గంటలు: కొబ్బరి బొండాలు కొడుతున్న రాజుని పలకరించగా.. మనకెందుకు బాబాయ్ రాజకీయాల గురించి.. అంటూ తటపటాయించాడు. ఏ పార్టీ ఈసారి గెలిస్తే బాగుంటుందని అడగ్గా.. ‘ఇక్కడైతే కేకే రాజు పక్కా.. కరోనా రోజుల్లో ప్రతి ఇంటికీ భరోసా ఇచ్చారు. పైన మాత్రం జగనే వస్తాడు. మా బంధువుల్లో ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ఇచ్చారు. చాలా కుటుంబాలు బాగుపడ్డాయి’ అని చెప్పాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే.. రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఇస్త్రీ బండి దగ్గర ఉన్న సన్యాసిరావులు కూడా జగన్ రావచ్చని చెప్పారు. హనుమంతవాక జంక్షన్(విశాఖ తూర్పు) ఉదయం 9 గంటలు: ఆటోడ్రైవర్లు చిన్ని, పాండురంగను పలకరించగా.. ఈ సారి జనసేన వస్తుందని చిన్ని చెప్పగా.. 100 శాతం జగనేనండీ అంటూ పాండు సమాధానమిచ్చాడు. పాండు : 21 సీట్లతో జనసేన ఎలా వస్తుందిరా.? చిన్ని: 21 కాదు.. 25 పాండు : 25 కాదు.. 50 అనుకో.. పవన్ సీఎం అవుతారా.? చూడండి.. ఎవరేమనుకున్నా.. జగనే మళ్లీ సీఎం అవుతారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబు, ఎంవీవీ సత్యనారాయణ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అయితే రాష్ట్రంలో మాత్రం జగన్ మళ్లీ సీఎం అవుతారు అని పాండు అన్నాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లగా.. ఫ్రూట్‌జ్యూస్ అమ్ముతున్న శ్రీను మాత్రం ఎవరొస్తారో చెప్పలేమన్నారు. ముందుకెళ్లి టిఫిన్ సెంటర్ చందుని అడిగితే జగన్ పక్కా అంటూ నవ్వుతూ తన పనిలో మునిగిపోయాడు.సింహాచలం కొండ దిగువన.. ఉదయం 10 గంటలకు: భీమిలి పరిధిలోని సింహాచలం కొండ దిగువన ఆగగా.. వృద్ధురాలు కనిపించింది. మళ్లీ ఎవరొస్తారని అడగ్గా.. ‘చంద్రబాబు రాకూడదు. మాఊళ్లో అందరి జీవితాలు అతని వల్లే పోయాయి. పంచగ్రామాల సమస్య పరిష్కారం కాలేదు. కోర్టుకెళ్లడానికి కారణం చంద్రబాబే. పవన్ ఒక్కడొచ్చుంటే మా కులపోడని ఆలోసించేవాళ్లమేమో. ఇప్పుడది కూడా పోయింది’ అంటూ ఆటో ఎక్కేసింది. పక్కనే ఉన్న సెలూన్ షాప్ ఈశ్వర్, పూల దుకాణం మస్తాను ఫ్యాన్ గ్యారెంటీ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం గాంధీనగర్‌లో.. ఉదయం 11 గంటలకు:నేరుగా పెందుర్తి నియోజకవర్గంలోని గాంధీనగర్‌లో కొత్తగా నిర్మించిన యూపీహెచ్సీకి వెళ్లగా.. తాపీ మేస్త్రీ రామారావు కనిపించాడు. ‘జగన్ బాగా సెయ్యలేదని మేం సెప్పట్లేదు. మా పిల్లలకు మంచి సదువు ఇచ్చారు. ఆస్పత్రి పెట్టి మాకు వైద్యం ఇచ్చినాడు. ఏ ఇబ్బంది వచ్చినా.. ఇక్కడికే ముందు వస్తాం. మందులన్నీ మంచిగా ఇస్తారు. ఒక్క ఇసక ఇషయంలో మాత్రం ఇబ్బంది పడ్డాం’ అని చెప్పుకొచ్చాడు. పెందుర్తి, పినగాడి నుంచి.. సబ్బవరం మండలం గుల్లేపల్లి మీదుగా వెళ్తుండగా.. కల్లుగీత కార్మికుడు లావేటి వెంకట్రావు తారసపడ్డాడు. ‘మేము తీసే కల్లు లాగే మా జగన్ ప్యూర్. జగన్ అంటేనే నిలువెత్తు నమ్మకం. చంద్రబాబు కల్పితాలు ఎన్నయినా చెప్పొచ్చు. కానీ చేసి చూపించింది మాత్రం జగన్ ఒక్కడే’ అన్నాడు.మాడుగుల మండలం కె.కోటపాడులో.. మధ్యాహ్నం 12.30 గంటలకు: మాడుగుల మండలం కె.కోటపాడు వెళ్లి నారాయణమ్మ అనే మహిళను పలకరించాం. ‘ మా ఆయనకు కాలు, చేయి పనిచేయదు. జగన్ మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతి నెలా ఇంటికే పెన్షన్ ఇస్తున్నారు. చేయూతలో రూ.18,750తో చిన్న కొట్టు పెట్టుకున్నాను. ఆ షాపుపై రుణం వచ్చింది. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు’ అని ఆనందంగా చెప్పింది. పీఎస్‌పేట(చోడవరం నియోజకవర్గం, విశాఖ రోడ్‌షో)మధ్యాహ్నం ఒంటి గంటకు: చోడవరం నియోజకవర్గం పీఎస్ పేటలో చెరకు రైతుల్ని పలకరించాం. రైతు తలారి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ హయాంలో రెండు రాçష్ట్రాల్లో 28 కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలుంటే.. చంద్రబాబు వచ్చాక గోవాడ ఒక్కటే మిగిలింది. ఆ ఫ్యాక్టరీని చంద్రబాబు రూ.120 కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. జగన్ వచ్చాక ఆ అప్పుల్ని తగ్గించారు. ఫ్యాక్టరీ నడిపేందుకు రూ.80 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. మళ్లీ జగన్ వస్తేనే ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు. ఒక్క రూపాయి చెల్లించలేదు. నా దగ్గర బాండు ఉంది చూపిస్తాను’ అన్నాడు. మిగిలిన రైతులు నాయుడు, వెంకట్రావు, సూర్యనారాయణ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనకాపల్లి వైపు వెళ్తుండగా.. రిటైర్డ్ ఉద్యోగి కేవీ గౌరీపతిని పలకరించగా.. ‘అనకాపల్లి జిల్లా కేంద్రం కావాలన్న కలని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ లోకల్ నేత బూడి ముత్యాల నాయుడిని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు’ అని చెప్పారు. -
బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు..
ఈర్ష్య, అసూయ, ద్వేషం – ఈ మూడు దుర్గుణాలు మూర్తీభవించినవాడు చలమ దీప్తుడు. తానే పెద్ద తత్వవేత్తననీ, తనకంటే గొప్ప ప్రబోధకుడు ఎవరూ లేరని, తాను గురువులకే గురువని భ్రమించేవాడు. ఇతరుల్ని ఎవ్వరినీ గౌరవించేవాడు కాదు. అతని శిష్యుడు అహితుడు అన్నింటా గురువుని మించిన శిష్యుడే! రాజగృహ నగరానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక పర్వతంపై అతని నివాసం. తనకంటే బుద్ధునికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలగడం అతనిలో కోపాన్ని పెంచింది. కుటిలత్వాన్ని రేపింది. బుద్ధుణ్ణి ఇబ్బందుల పాలు చేయాలనీ, అపకీర్తి కలిగించాలనీ పథకం వేశాడు. అలా చేస్తే తనకు అధిక గౌరవ మర్యాదలు కలుగుతాయని నమ్మాడు. వెంటనే తన ప్రియ శిష్యుడు అహితుణ్ణి పిలిచి, తన మనస్సులోని పథకాన్ని చెప్పాడు. అహితుడు అందుకు అంగీకరించి, నగరంలోకి నడిచాడు. ఆరోజు ఒక రాజపురోహితుడు బుద్ధునికీ, బుద్ధ సంఘానికీ ఆతిథ్యం ఇచ్చాడు. బుద్ధుడు భిక్ష స్వీకరించాక ధర్మోపదేశంప్రారంభించాడు. ఆ సమయానికి అహితుడు అక్కడికి చేరాడు. ఉపదేశానంతరం బుద్ధునికి నమస్కరించి‘‘భగవాన్! నన్నూ మీ భిక్షుసంఘంలో చేర్చుకోండి’’ అని వేడుకున్నాడు. బుద్ధుడు అంగీకరించాడు. కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి నగరంలో భిక్షార్థం బయలు దేరాడు. తన భిక్షా పాత్రను తీసుకోవడానికి చేశాడు. అది కనిపించలేదు. ఆరామం బయట ద్వారం దగ్గర నిలబడిన అహితుడు అటూ ఇటూ చూస్తూ–‘‘భగవాన్! మీ భిక్షాపాత్ర కోసం నేను వెదకనా?’’ అని అడిగి ఆరామం నలుమూలలా చూశాడు. బుద్ధుడు అతని వంక చూసి, చిరునవ్వు నవ్వాడు.‘‘అహితా! వెదకనవసరం లేదు. పద’’ అంటూ బయటకు నడచాడు. బుద్ధుని వెనకే అహితుడు నడచాడు. భిక్షు సంఘం రాజగృహ నగరానికి వెళ్ళే దారిలో ఒక తటాకం ఉంది. బుద్ధుడు ఆ తటాకం వైపు నడచాడు. అది చూసి అహితుడు. ‘నేను ఆ భిక్షాపాత్రను, పగులగొట్టి, ఈ తటాకంలో పడవేసిన విషయం బుద్ధునికి తెలిసింది’ అని భయపడ్డాడు. బుద్ధుడు తటాకం లో దిగి విశాలమైన తామరాకుని తుంచి, దాన్ని, శుభ్రపరిచాడు. దాని అంచులు గిన్నెలా మలిచాడు. ఆరోజు బుద్ధుని భిక్షాపాత్ర అది! మరో రెండు రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి బుద్ధుడు పడుకోడానికి తన సంఘాటి (దుప్పటి) కోసం చూశాడు. అది కనిపించలేదు. బుద్ధుడు అలా వెదకడం గమనిస్తూనే, లోలోపల నవ్వుకుంటున్నాడు అహితుడు. అంతలో... ‘‘అహితా!’’ అనే బుద్ధుని పిలుపు విని ఉలిక్కిపడ్డాడు అహితుడు. ‘‘భగవాన్! సెలవియ్యండి’’ అన్నాడు అతివినయం గా ‘‘నీకు సంఘాటి ఉందిగా’’ అని అడిగాడు. ‘‘భగవాన్! ఉంది’’ ‘‘నీవు పక్క పరుచుకొని పడుకో’’ అని, నేలను శుభ్రం చేసుకుని, తన చీవరాన్ని పక్కగా పరచుకుని బుద్ధుడు పడుకున్నాడు. ఆ రాత్రి బుద్ధునితో సహా భిక్షువులందరూ హాయిగా నిద్ర΄ోయారు. అహితునికి కంటిమీద కునుకే రాలేదు. వేకువ కాకముందే లేచి, తన గురువు చలమదీప్తుని దగ్గరకు వెళ్లి చేరాడు. తెల్లారింది. ‘‘అహితుడు ఏమయ్యాడు?’’అని అందరూ ఆలోచించసాగారు. ఇంతలో... ‘‘అదిగో... అటు చూడండి. అహిత భిక్షు ఎవరినో తీసుకుని వస్తున్నాడు అన్నాడు ఒక భిక్షువు. అహితుడు తన గురువును వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ బుద్ధుని పాదాలకు నమస్కరించారు.‘‘భగవాన్! మీ మీద క్రోధంతో, అసూయ తో వచ్చాను. మీ భిక్షాపాత్ర నేనే పగులగొట్టాను. మీ సంఘాటిని తుప్పల్లో దాచాను. ఆ విషయం మీరు గ్రహించారు. అయినా నన్ను మందలించలేదు. అందరిముందు అవమానం చేయలేదు. ఈ పనులు చేసిన రెండుసార్లూ నేను నిద్రకు దూరమయ్యాను. మనశ్శాంతి కోల్పోయాను. తప్పు తెలుసుకున్నాను. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నాను. వెళ్ళి మా గురువు గారికి విషయం చెప్పాను. మేమిద్దరం తప్పు తెలుసుకున్నాం. మీ శరణు వేడుకుంటున్నాం’’ అన్నాడు అహితుడు. బుద్ధుడు ప్రేమతో వారిని దగ్గరకు పిలిచి భిక్షు దీక్ష ఇచ్చాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: స్నాతక పాఠం అంటే..? -
జగన్ ఏలిక...ఆంధ్రావనికి ఏరువాక!
జనం బాధలు తమవిగా భావించే నేతలే ప్రజా సమస్యల పరిష్కారానికి తపిస్తారు. అలా తపించే నాయకులే నేటి సమాజానికి కావాలి. ఎవరికి ఏ కష్టమొచ్చినా చలించే మనసు ఉండాలి. చలించడంతో సరిపోదు... ఆ బాధలను తీర్చాలన్న పట్టుదల... ఆ కష్టం తీరేదాకా జనం వెన్నంటి ఉన్నప్పుడే రాజకీయ నాయకుడికి గుర్తింపు. అలాంటి గుర్తింపును తండ్రీ తనయులైన దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలోనూ అతి దగ్గరగా చూసిన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త మనోగతమిది... రైతులకు ఏం చేస్తే వారి బతుకులు బాగుపడతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ఈ శాస్త్రవేత్తను సలహాలు అడిగారు. తాను చెప్పిన వాటన్నిటినీ తూచా తప్పకుండా ఆచరించడమే జగన్‌లోని ఆదర్శ నాయకుడిని చూపించాయని ఆ శాస్త్రవేత్త చెబుతున్నారు. జగన్‌లోని వినే గుణం, విన్న తర్వాత ఆచరణలోకి తీసుకురావడమనేది ఈ రాష్ట్ర వ్యవసాయ రంగానికి పట్టిన అదృష్టమని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు, ఏపీ అగ్రి మిషన్ సభ్యుడు...ప్రొఫెసర్ పోలి రాఘవరెడ్డి కొనియాడారు... జగన్‌తో తన స్ఫూర్తిదాయక అనుభవాలను ఇలా ‘సాక్షి’ తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, అమరావతి ‘నాడు ఆ మహానేత వైఎస్సార్.. నేడు ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. రైతుల కోసం ఆలోచించే విధానం.. స్పందించే తీరు ఒకే రీతిలో ఉంది. ప్రతీ అడుగులోనూ రైతులకు మేలు చేయాలన్న తపన వారిద్దరిలోనూ కన్పించింది. ఇద్దరి పాలనా తీరును దగ్గర నుంచి చూశాను. నాన్న ఒక అడుగు వేస్తే నేను నాలుగడుగులు వేస్తానన్న సీఎం వైఎస్ జగన్.. ఐదేళ్లలో రైతుల కోసం ఏకంగా వంద అడుగులు వేశారనే చెప్పాలి. మహానేత హయాంలో రైతులు ఎంత సుభిక్షంగా ఉన్నారో అంతకు రెట్టింపు సంతోషంగా ఈ ఐదేళ్లలో ఉన్నారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఈ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు..నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధికి బాటలు పడ్డాయని చెప్పొచ్చు. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ... రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గర నుంచి చూసిన నేతగా వైఎస్ జగన్ వారి ప్రతీ సమస్య పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. సమస్యలను ఆకళింపు చేసుకోవడమే కాదు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే సాగుకు అవసరమైన పెట్టుబడి, సారవంతమైన నేల, అవసరమైన మేరకు నీరు, సాగు ఉత్పాదకాలు, సాంకేతిక బదలాయింపు, గిట్టుబాటు ధర కల్పన, సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు అవసరం. ఈ ఐదేళ్లలో వీటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతులకు మేలు చేయాలన్నదే ఆయన తపన మహానేత మాదిరిగానే వైఎస్ జగన్ రైతుకు మేలు చేసేందుకు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటున్నారు. అగ్రిమిషన్ తొలి సమావేశంలో పెట్టుబడి సాయం ఇచ్చేటప్పుడు ఎంత విస్తీర్ణం ఉండాలి. ఎవరిని రైతులుగా గుర్తించాలని అడిగారు. అప్పుడు నేను చెప్పిన రెండు సూచనలు ఆచరణలో పెట్టారు. తమలపాకు రైతులు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. పైగా మెజార్టీ సాగుదారులకు ఎకరం కంటే తక్కువ భూమే ఉందని చెప్పాను. ఒక రైతుకు ఇద్దరు ముగ్గురు కొడుకులుంటారు. పెళ్లయిన తర్వాత వారికి పొలాలు వాటాలు పంచినా ఒకే ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించడం సరికాదన్నా.. అని చెప్పాను. అలా చెప్పిన మరుక్షణమే.. రైతుకు 15 సెంట్లున్నా పెట్టుబడి సాయం ఇవ్వాలని, పెళ్లయితే చాలు ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా వేర్వేరు కుటుంబాలుగా పరిగణించి రైతు భరోసా ఇద్దామని సీఎం జగన్ ప్రకటించి ఆచరణలో పెట్టారు. రైతులకు ఒక్క రూపాయి అయినా అదనంగా మేలు చేయాలన్న తపన, తాపత్రయం పెద్దాయనలో మాదిరిగానే వైఎస్ జగన్‌లోనూ చూశాను. పరిశోధనలకు పెద్ద పీట... మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నేను మార్టేరు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా ఉండేవాణ్ని. సీఎంగా పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో మా పరిశోధనా స్థానానికి వచ్చినప్పుడు రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరువ చేసిన రోజు కచ్చితంగా వారికి మేలు జరుగుతుందని చెప్పాను. అంతే.. క్షణం ఆలోచించకుండా పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అక్కడికక్కడే రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఫలితంగా కొత్త రకాలు సృష్టించగలిగాం. ఉత్పత్తిని పెంచేందుకు బలమైన అడుగు వేయగలిగాం. ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా, వీసీగా ఆయన హయాంలో పనిచేసే అవకాశం కలిగింది. ఆ సమయంలో నేను ఇచ్చిన సలహాలు, సూచనలకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఆచరణలో పెట్టేందుకు కృషి చేశారు. ఆ మహానేత కంటే మిన్నగా నేడు సీఎం వైఎస్ జగన్ తాను అమలు చేసే ప్రతీ కార్యక్రమం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. -
ఇంగ్లిష్ వ్యతిరేకులను చీపుర్లతో స్వాగతించండి
‘ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశానికే దిక్సూచిలా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానం భవిష్యత్తులో ప్రతీ ఒక్కరూ అనుసరించక తప్పదు. వద్దన్న వారికి చీపుర్లతో బుద్ధి చెప్పాలి’ అని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష అమలు, దాని ఫలాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. దేశాన్ని మార్చే విద్యా విధానం.. ఇంగ్లిష్ మీడియం కోసం 1990 నుంచి నేను గళం విప్పాను. మండలి బుద్ధప్రసాద్, ఏబీకే ప్రసాద్, చుక్కా రామయ్య.. వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అంటే నా మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో దాడి చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన పోరాటం చాలా గొప్పది. ఆయన దేశాన్ని మార్చే విద్యా విధానం తీసుకొచ్చారు. మొత్తం బీజేపీ ప్రభుత్వ అజెండాను కూడా మార్చే శక్తి దానికుంది. నిజానికి గ్రామాల్లో నుంచి వచ్చే పిల్లలతో నగరాల్లోని పిల్లలు పోటీ పడలేరు. గ్రామీణ పిల్లలకు కేవలం కమ్యూనికేషన్ ఒక్కటే సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. స్కూలు పిల్లల్ని బహిరంగ సభల్లో తెచ్చి మాట్లాడించిన నాయకుడ్ని నా జీవితంలో చూడలేదు. ఇంగ్లిష్ మీడియం విద్య జగన్‌ను గెలిపించబోతోంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇటీవల రాహుల్ గాం«దీకి కూడా చెప్పా. దేశమంతా ఆంధ్ర మోడల్ తీసుకురండి.. బీజేపీని ఓడించగలుగుతారు అని. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియంలను నేను అంబేడ్కర్ గుడి అంటాను. 2002లో నేను మా ఊర్లో గుడ్ షెçపర్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టి.. లంబాడి కూలోళ్ల పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాను. ఇప్పుడు అద్భుతంగా వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు. మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా? వెంకయ్యనాయుడు, రమణ, చంద్రబాబు, పవన్‌కు చెబుతున్నా. మీ ఆధ్వర్యంలో తెలుగు మీడియం స్కూల్స్ పెట్టించండి. మీ పిల్లల్ని, అగ్రకులాల పిల్లల్ని తెలుగు మీడియంలో బాగా చదివించండి. మేం మాత్రం దిక్కుమాలిన ఇంగ్లిష్‌లోనే చదువుకుంటాం. మీరు తెచ్చిన నారాయణ, చైతన్య, విజ్ఞాన్ స్కూల్స్‌ను తెలుగు మీడియంకు మార్చండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి ఊరూరా మహిళలు చీపుర్లతో స్వాగతం చెప్పండి. అలాంటి మేధావులకు అంటిన మురికిని వదిలించడానికి చీపుర్లతో శుభ్రం చేయండి. తొలి మార్పు వైఎస్సార్ నుంచే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2006లో 6 వేల స్కూల్స్‌లో ప్యారలల్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే పలువురు వ్యతిరేకించారు. ఈ విషయం మీద తనని కలిసిన వారిని మీ పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అని వైఎస్సార్ ప్రశ్నించాక నోరు మూసుకున్నారు. మన పిల్లలకు ఇంగ్లిష్ చదువులు కావాలా? బీదల పిల్లలకి అక్కర్లేదా? అని వారందర్నీ మందలించారు. బహుశా అదే జగన్‌కు స్ఫూర్తినిచ్చి ఉంటుంది. పాదయాత్రలో పిల్లల పరిస్థితి చూసిన జగన్.. మేనిఫెస్టోలో ఇంగ్లిష్ విద్య గురించి పెట్టారు. ఇచ్చింన మాట ప్రకారం ఆయన ఇంగ్లిష్ మీడియం తేవడానికి ప్రయత్నిస్తే వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌లాంటి వాళ్లంతా వ్యతిరేకించారు. నా దృష్టిలో వాళ్లంతా యూజ్లెస్. కమ్యూనిస్ట్‌లు, నాతో పనిచేసిన వారు కూడా వ్యతిరేకించారు. ఆఖరికి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రమణ కూడా వీరికి జతకలిశారు. ఆయన తెలుగు భాష గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆయన అసలు ఏం తెలుగు రాశారని? వీళ్లందరికీ ఏం తెలుగు వచ్చని? లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్‌కు చెబుతున్నా. ఒక్కసారి ఆ పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడు. మేధావితనం ముసుగు మాత్రమేనని నీకే తెలుస్తుంది. -
KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే. నాగారం గ్రామం మున్నూరుకాపుల కొటాల్పల్లి... కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు. అయ్యవారిపల్లి గ్రామం ముదిరాజ్‌ల అయ్యవారిపల్లి.... భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు. కొటాల్పల్లి గ్రామం పొలాల మధ్యన నాగారం... లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది. చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్.... గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు. ఎవరి పనుల్లో వారుంటారు... అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది. – బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం అందరం కలిసిమెలిసి ఉంటాం... మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం. – చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం 3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం. – చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం -
‘సాక్షి’ డైరెక్టర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి,హైదరాబాద్: సాక్షి మీడియా సంస్థల డైరెక్టర్ కేఆర్‌పీరెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. బుధవారం(ఏప్రిల్ 3) హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేఆర్‌పీరెడ్డికి పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పురస్కారం ప్రదానం చేశారు. ఇండియా పీఆర్ బాడీ 20వ ఫౌండేషన్ డే సందర్భంగా కేఆర్పీ రెడ్డికి అవార్డు అందజేశారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. కేఆర్పీ రెడ్డి గడిచిన మూడున్నర దశాబ్దాలుగా అడ్వర్టైజింగ్, సర్క్యులేషన్ రంగాల్లో విశేషమైన కృషి చేశారు. -
ఈఏపీసెట్, నీట్ విద్యార్థులకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్‌లు
సాక్షి ఎడ్యుకేషన్: ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం..ఇంజినీరింగ్, లేదా మెడిసిన్. అధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజినీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేరి్పస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్..అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లున్కల్పించే ఈఏపీసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్, నీట్ పరీక్షలకు ‘సాక్షి’ మాక్ టెస్ట్‌లు నిర్వహించనుంది. దీనికి టెక్నాలజీ పార్ట్నర్గా ‘మై ర్యాంక్’ వ్యవహరిస్తోంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్ష లాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్స్ స్థాయిని అంచనా వేసుకుని, దాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్న్ఫీజు రూ.250గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 22 చివరి తేదీ. రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్‌కు హాల్ టికెట్ నంబర్ వస్తుంది. ఏప్రిల్ 27న నీట్, ఏప్రిల్ 28న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలుంటాయి. ఈ ఆన్లైన్ టెస్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. పరీక్షా సమయం 3 గంటలు. ఈ పరీక్షలకు హాల్ టికెట్ నంబర్ (యూజర్ నేమ్), ఫోన్ నెంబర్ (పాస్వర్డ్)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్ అయ్యి రాసుకోవచ్చు. పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్‌ను వెంటనే చెక్ చేసుకోవచ్చు. మాక్ పరీక్షలను https://sakshimocktest.myrank.co.in లో నిర్వహిస్తారు. టెస్ట్ కీ ని ఏప్రిల్ 30న ఇదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. çపూర్తి వివరాలకు 95055 14424, 96660 13544, 96665 72244 నంబర్లకు కాల్ చేయవచ్చు. -
యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించింది. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తక్కువ ధరకు ధాన్యం దళారులకు విక్రయిస్తున్న తీరుపై గురువా రం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం.. దళారుల దోపిడీ’ శీర్షికన వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థను అప్రమత్తం చేసింది. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 15 రోజుల క్రితమే కోతలు ప్రారంభం కావడంతో మిల్లర్లు, దళారులు కల్లాల నుంచే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధికారికంగా విక్రయాల కోసం ఏప్రిల్ 1వరకు వేచి ఉండాల్సి రావ డంతో రైతులు అగ్గువకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ అంశాలను వివరిస్తూ ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే నిజామా బాద్, నల్ల గొండ జిల్లాల్లో అవసరమైన చోట 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్, డీసీ ఎస్ఓ, డీఎంసీఎస్‌ఓ తదితరులతో కలిసి అర్జాలబావిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా యడ్పల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. 7,149 కొనుగోలు కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌కు సంబంధించి 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 కేంద్రాలను ప్రారంభించామని వివరించింది. అవసరమైనచోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్ప టికే సమాచారం అందించినట్లు సంస్థ పేర్కొంది.∙నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరసరఫరాల సంస్థ -
సాగుబడి: ఆంధ్రా వర్సిటీలో ఆర్గానిక్ పంటలు!
'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'. పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్‌ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు. ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..! మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్‌లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. – ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 80 సెంట్లలో బహుళ పంటల సాగు.. ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్‌లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు. సలాడ్లలో వినియోగించే అరుదైన బాక్చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు. ఆకర్షితులవుతున్న ప్రజలు.. పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్‌కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కమ్యూనిటీ ఫార్మింగ్.. ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు. వలంటీర్లకు అవకాశం.. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు. ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్‌ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా.. తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్‌షాప్‌లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050. 7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు.. ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. ఇవి చదవండి: షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి -
ఫన్డే: పిల్లల కథ - 'ఛూ.. మంతర్'
ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి జాలి, కరుణ, దయ అనేవి లేవు. చిన్న చిన్న శాకాహార జంతువులను సైతం చంపి తినేది. పులికి బద్ధకం కూడా ఎక్కువే. ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినటం దానికి అంతగా ఇష్టంలేదు. సులువుగా దొరికే కుందేళ్లను చంపి తినేది. దాంతో.. ఆ అడవిలో కుందేళ్ల సంఖ్య తగ్గిపోసాగింది. ఆ అడవిలో కుందేళ్లన్నీ వాటి నాయకుడిని కలిసి పులి బారి నుంచి కాపాడమన్నాయి. కుందేళ్ల నాయకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ‘మనం నీడని చూసి భయపడకూడదు. దగ్గరలో వెలుగుంటేనే నీడలుంటాయి. పులి ఇలా రెచ్చిపోయి మన సంతతిని నాశనం చేస్తుందంటే దానికి పోయేకాలం దగ్గర పడిందని నాకనిపిస్తోంది’ అంటూ ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు ఆ అడవి మార్గం గుండా ఒక ఇంద్రజాలికుడు గుర్రపు బండిలో ప్రయాణించసాగాడు. గుర్రాన్ని చూసి పులి దూరం నుంచి∙పెద్దగా గాండ్రించింది. దాంతో.. ఆ గుర్రం అడ్డదిడ్డంగా అడవిలో పరుగు లంకించుకుంది. బండి నుంచి గుర్రం విడిపోయింది. ఇంద్రజాలికుడు ప్రాణ భయంతో ఎటో పరుగుతీశాడు. అతడు ప్రదర్శనకు ఉపయోగించే సామాగ్రిలోంచి ఒక కుందేలు పిల్ల బయటకు వచ్చింది. అది భయంతో తుర్రున పొదల్లోకి దూరింది. పొదల్లో భయంతో వణుకుతున్న కుందేలును కుందేళ్ల నాయకుడు చేరదీశాడు. ‘నాయకా! నేను ఎంతో కాలంగా ఇంద్రజాలికుడి వద్ద ఉండటంతో నాకు ఇంద్రజాల విద్యంతా తెలుసు. అతడు తన శిష్యులకు ఇంద్రజాల విద్య నేర్పించేటప్పుడు నేను చూసి కొంత నేర్చుకున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి. నా మంత్ర విద్యతో మిమ్మల్ని వినోదపరుస్తాను’ అంది కుందేలు పిల్ల. ‘అయ్యో! వినోదం సంగతి దేముడెరుగు! అసలు క్షణక్షణం భయంతో కాలం గడుపుతున్నాము. పులి సంగతి నీకు తెలీదు. అది చిన్ని చిన్ని పసికూనలను సైతం మింగేసి ఆకలి తీర్చుకుంటోంది. దాంతో మనజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఈ అడవిలో ఉండటం ప్రమాదం!’ అన్నాడు కుందేళ్ల నాయకుడు. కానీ కుందేలు పిల్ల అక్కడి నుంచి కదలలేదు. తన జాతి సంతతిని అంతం చేస్తున్న పులిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఆ పులిని తను అంతం చేస్తానని నాయకుడికి చెప్పింది. మరుసటిరోజు ఉదయం కుందేలు పిల్ల తనకు తెలిసిన ఇంద్రజాల విద్యలను తన మిత్రుల ముందు ప్రదర్శిస్తూ వాటిని వినోదపరిచింది. ఇంతలో వాటికి దూరంగా పులి గాడ్రింపు వినిపించింది. ‘బాబోయ్! పులి వస్తుంది! పారిపోయి దాక్కోండి!’ పెద్దగా అరిచింది ఒక కుందేలు. వెంటనే మిగిలిన కుందేళ్లన్నీ పొదల్లో దాక్కున్నాయి. కానీ ఈ కుందేలు పిల్ల మాత్రం ధైర్యంగా అక్కడే నిలుచుంది. ‘మిత్రమా! ఆ పులి సంగతి నీకు తెలీదు. పారిపో!’ అంటూ అరిచాయి. కుందేళ్లన్నీ. అయినా అది కదలలేదు. ‘ఓసేయ్.. నీకెంత ధైర్యమే! నేను వస్తున్నా పారిపోలేదు. ఇదిగో నిన్ను ఇప్పుడే లటుక్కున చప్పరిస్తా!’ అంటూ చెయ్యి ముందుకు చాపింది పులి. ‘ఆగక్కడ! నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ అడవిని వదలి పారిపో!’ అని అరిచింది కుందేలు పిల్ల. ఆ మాటకు పులి బిత్తరపోయింది. కుందేలు తన మంత్రదండం తీసుకుంది. కుందేలు ఏం చేస్తుందో పులికి అర్థం కాలేదు. పులి తిరిగి పెద్దగా గాండ్రించింది. ‘ఛూ.. మంతర్’ అంటూ మంత్ర దండాన్ని పులి ముఖం చుట్టూ తిప్పింది. ‘నువ్వు నన్నేమీ చేయలేవు. నీకు శక్తి లేదు. నువ్వు గాఢంగా నిద్ర పోతున్నావ్.. నిద్ర పోతున్నావ్.. పోతున్నావ్!’ అంది కుందేలు పిల్ల. కండ్లు తిరిగి పులి కింద పడిపోయింది. వెంటనే కుందేళ్లన్నీ పులిని మర్రి ఊడలతో బంధించి చెట్టుకు కట్టేశాయి. కొంతసేపటికి పులి తేరుకుంది. కండ్లు తెరిచి చూసి భయపడింది. ఏం జరిగిందో దానికి అర్థంకాలేదు. దాని కాళ్ళు, చేతులు మర్రి ఊడలతో కట్టేసి ఉండటంతో అది ఆహారం తెచ్చుకోలేకపోయింది. తిండి తిప్పలు లేక నీరసించి పోయింది. అటుగా వెళుతున్న నక్క, తోడేలు నీరసించి ఉన్న పులిని చూసి లొట్టలేశాయి, నాలుక చప్పరించాయి. ఇక ఆ అడవిలో పులిబాధ తప్పింది. కుందేలు పిల్లను జంతువులన్నీ అభినందించాయి. –పైడిమర్రి రామకృష్ణ ఇవి చదవండి: ఈ వారం కథ: 'లెఫి బొ' -
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
అరచేతిలో మీ ఆరోగ్య నేస్తం! సాక్షి లైఫ్..
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం.. సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక.. అల్లోపతి నుంచి ఆయుర్వేదం దాకా.. ఆక్యుపంచర్ నుంచి యునానీ వరకు.. హోమియోపతి నుంచి యోగా వరకు.. అన్ని రకాల వైద్య విధానాలను గురించి ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారం మీకోసం అందిస్తున్నాయి సాక్షిలైఫ్ www.life.sakshi.com వెబ్ సైట్, https://www.youtube.com/@life.sakshi/videos సాక్షి లైఫ్ యూట్యూబ్ ఛానెల్. సాక్షిలైఫ్ హెల్త్ ఏమేం అందిస్తుందంటే..? హెల్త్ న్యూస్ ఎప్పటికప్పుడు తాజా హెల్త్ అప్డేట్స్ తోపాటు.. ఫిజికల్ హెల్త్: దీనికి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారాలు,నివారణామార్గాలు. మెంటల్ హెల్త్: మానసిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి..? అసలు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? అనేవాటి గురించి మానసిక నిపుణుల ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూలు అందుబాటులో ఉంటాయి. ఉమెన్ హెల్త్: మహిళల్లో ఎక్కువగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? అవి రాక ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలను గురించిన సమాచారం విపులంగా ఉంది. కిడ్స్ హెల్త్: చిన్నారుల్లో సీజనల్ వ్యాధులు, ముందు జాగ్రత్తలపై వైద్య నిపుణులు అందించే అద్భుతమైన సలహాలు, సూచనలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్: యునానీ , ఆయుర్వేదం, యోగా, ఆక్యుపంచర్, హోమియోపతి వంటి పలురకాల వైద్య విధానాలను గురించి టాప్ డాక్టర్స్ ద్వారా అవసరమైన ఆరోగ్య సమాచారం కోసం ఈ లింక్‌ల పై క్లిక్ చేయండి. https://www.youtube.com/@life.sakshi/videos , www.life.sakshi.com ఇవి రెండూ మీకు ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయి. రీసెర్చ్: పలురకాల వ్యాధుల గురించిన పరిశోధనలు, అధ్యయనాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది మీ సాక్షిలైఫ్. హెల్త్ టిప్స్: ఆరోగ్యంగా ఉండాలంటే ఏమీ చేయాలి..? ఏమి చేయకూడదు..? అనే అంశాలపై డాక్టర్లు ఏమంటున్నారో ఆర్టికల్స్ రూపంలో www.life.sakshi.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మారుమూల గ్రామంలో ఉండే వారికిసైతం అర్థమయ్యేలా ప్రముఖ డాక్టర్ల విలువైన వైద్య సలహాలు, సూచనలను సాక్షి లైఫ్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్ అందిస్తున్నాయి. ప్రతి విభాగంలో ఒక్కో టాప్ డాక్టర్ల ఇంటర్వ్యూలను వీడియోల రూపంలో https://www.youtube.com/@life.sakshi/videos సాక్షి లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందిస్తోంది. అంతేకాదు వారు అందించిన సమాచారాన్ని ఆర్టికల్స్ రూపంలో www.life.sakshi.com వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తోంది. ఇలా ఫాలో అవ్వండి.. మరింత ఆరోగ్య సమాచారం కోసం www.life.sakshi.com వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి..అలాగే https://www.youtube.com/@life.sakshi/videos యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.. లైక్ చేయండి.. షేర్ చేయండి. ► "సాక్షి లైఫ్" గురించి ప్రముఖ వైద్యనిపుణుల మాటల్లో.. "సాక్షి లైఫ్ లో ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నారు. అదికూడా ప్రముఖ డాక్టర్ల ద్వారా అందించడం అభినందనీయం." - డా.డి. నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ► "సమగ్రమైన ఆరోగ్య సమాచార వేదికగా సాక్షి లైఫ్‌ను తీర్చి దిద్దారు. సమాజానికి ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం." - డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ► "శరీరంలో గుండె ప్రధానమైన అవయవం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో చాలా బాగా తెలియజేశారు." - డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ► "వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ,వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు." - డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇవి చదవండి: హెల్త్ టిప్స్: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు.. -
ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి,హైదరాబాద్: ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం.’అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’ వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల’కోసం ఎంట్రీలను ఆహ్వనిస్తోంది. 2023కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు మార్చి 30, 2024 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా ఎంట్రీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసిం చడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’ అభిలషిస్తోంది. ‘సాక్షి’ చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–23256134 నంబర్‌పై గానీ, మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com కేటగిరీలు ఇలా: ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ► ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ► ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ► ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ► ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ ► బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ► బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ►ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ►ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ► ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఎన్జీఓ యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – ఎడ్యుకేషన్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – సోషల్ సర్వీస్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఎన్జీఓ -
రంగుల రంగవల్లులు.. సాక్షి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
సంక్రాంతి సంబరాలు: సాక్షి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
తప్పును సమర్థించుకునే ‘డ్రామా’.. రామోజీ షో అట్టర్ ఫ్లాప్!
కర్నూలు: ఆకలైన వారికి అన్నం పెడితే ఎవరైనా వద్దంటారా? కడుపు నిండా భోజనం చేసిన వారిని తిను తిను అంటే ఎలా తింటారు. కర్నూలు డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత మూడు రోజులుగా ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంటోంది. ఒకసారి చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలే తప్ప, తిరిగి పదే పదే అదే తప్పును చేయబోయి ‘ఈనాడు’ చేతులు కాల్చుకుంటోంది. వండి వార్చిన తప్పుడు కథనాలను సమర్థించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. గత నెల 30న ‘మనసు లేని మామయ్య’ శీర్షికన ఈనాడు మొదటి పేజీలో కర్నూలు డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం వల్ల చలికి గజగజ వణికిపోతున్నట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే 31వ తేదీన వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ‘సాక్షి’ చేసింది. గత డిసెంబర్ 5న ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలకు దుప్పట్లను సరఫరా చేయగా, ఈ పాఠశాలలో 6వ తేదిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ( మొత్తం 90 మంది విద్యార్థులు ) దుప్పట్లను పంపిణీ చేశారని, ఆధారాలతో ‘సాక్షి’లో ‘సిగ్గు సిగ్గు నవ్విపోతారు ... కర్నూలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో రామోజీ షో ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. మరో డ్రామాకు తెరలేపిన ఈనాడు తమ తప్పుడు రాతలను కప్పిపుచ్చుకునేందుకు మరో డ్రామాకు ‘ఈనాడు’ తెరలేపింది. యుగ తులసి ఫౌండేషన్ ద్వారా అదే పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లను అందించేందుకు డిసెంబర్ 31న ప్రయత్నించింది. అయితే తమకు ప్రభుత్వం అందించిన దుప్పట్లు ఉన్నాయని, దాతలు తీసుకొచ్చిన దుప్పట్లను తీసుకునేందుకు విద్యార్థులు తిరస్కరించారు. అనేక రూపాల్లో కాళ్లావేళ్లాపడినా విద్యార్థులు ససేమిరా అన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా చేసిన ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో తిరిగి తమదైన శైలిలో ‘జగన్ మామ.. ఇదేమి పైత్యం’ అంటూ మరో తప్పుడు కథనాన్ని ప్రచురించారు. ఒక్క దుప్పటైనా ఇవ్వండని విద్యార్థులు వేడుకున్నట్లు రాసుకోవడం ఆ పత్రిక పైశాచికత్వానికి నిదర్శనం. రెండు గంటలు వేచి చూసినా, విద్యార్థులు ఎవరు దుప్పట్లు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో తమ పంతం నెగ్గించుకునేందుకు సమీపంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహంలోని విద్యార్థినీలకు దుప్పట్లను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. వేడుకోవడం అవాస్తవం దుప్పట్ల కోసం యుగ తులసి ఫౌండేషన్ ప్రతినిధులను విద్యార్థులు వేడుకోవడం అవాస్తవం. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లను ఇప్పటికే పంపిణీ చేశాం. గత ఏడాది నవంబర్ 30న జిల్లాలోని మూడు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు 725 దుప్పట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయా పాఠశాలలకు పంపించాం. – ఎస్.శ్రీనివాసకుమార్, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి, కర్నూలు -
యాది మరువలేదు.. ‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎంఓ
సాక్షి, కామారెడ్డి: ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో ఆదివారం ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భిక్కనూరు లక్ష్మి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ వివరాలు సేకరించారు. గతేడాది మార్చి 28న జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి కూలిపోయిన ఇంట్లో ఉంటున్న భిక్క నూరు లక్ష్మి బాధలు ఆలకించారు. అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై సీఎంఓ స్పందించి, వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో వెంటనే రెవెన్యూ ఇన్స్పె క్టర్ పూల్‌సింగ్, ఏడీ నర్సింహారెడ్డి చిన్నమల్లా రెడ్డి గ్రామానికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూలిపోగా మిగిలిన కొద్ది భాగంలో లక్ష్మి కుటుంబం నివసిస్తున్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉంటే పొరుగునే ఉన్న తిమ్మక్‌పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తా మని అధికారులు చెప్పారు. అయితే కూలిపోయిన ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్మి కోరడంతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా లక్ష్మితో పాటు ఆమె కు టుంబ సభ్యులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా లావేరు సాక్షి విలేకరి గురిజా దామోదరరావు మృతి బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తన పెదనాన్న గొర్లె శ్రీరాములునాయుడుకు, దామోదరరావు తండ్రి తవిటయ్యతో మంచి అనుబంధం ఉందని, దామోదర్ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా టీడీపీ నేతలు కళా వెంకటరావు, చంద్రబాబు స్పందించిన తీరు శవాలపై రాజకీయం చేసేలా ఉందని విమర్శించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, దామోదర్ నాలుగు నెలలు ఎవరితో ఎక్కువ మాట్లాడారో కాల్స్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. దామోదర్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ కళా వెంకటరావు రాజకీయ లబ్ధి కోసమే దామోదర్ మృతిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కిందట కళా వెంకటరావు తన తమ్ముడినే చంపేశాడని కుటుంబ సభ్యులే కేసు పెట్టారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వేధించారంటూ వంగర ఎస్ఐ, కళాతో పాటు ఆయన పీఏపైనా కేసు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు లావేటిపాలెం వైఎస్సార్సీపీ నేతలు, మృతుడి బంధువులైన లావేరు ఎంపీటీసీ ఇనపకుర్తి సతీష్, ఇనపకుర్తి చంద్రశేఖర్, సగరం విశ్వనాథం మాట్లాడుతూ దామోదర్ ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. టీడీపీ నేత జగ్గన్న దొరకు దామోదర్ రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు దామోదర్ చెప్పాడని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపిపై ఆరోపణలు చేస్తున్నారని, సూసైడ్ లెటర్ కూడా టీడీపీ వాళ్లు పెట్టించి ఉంటారని ఆరోపించారు. -
నాణ్యమైన పంట ఉత్పత్తులకు కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి నిజంగా ప్రశంసనీయమని క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) చైర్పర్సన్ జాక్సే షా చెప్పారు. గ్రామస్థాయిలో రైతులకు అండగా నిలిచేలా ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థతో పాటు నాణ్యమైన ఉత్పాదకాలు అందించాలన్న ఆలోచనతో నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీ గున్వత్ సంకల్ప్ (నాణ్యతకు భరోసా) వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సీఎం వైఎస్ జగన్ చొరవ అభినందనీయం క్యూసీఐతో కలిసి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ముందుకొచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పటివరకు నాలుగైదు రాష్ట్రాలు మాత్రమే.. అది కూడా ఎంపిక చేసిన ఒకటి రెండు రంగాల వారీగా పనిచేసేందుకు మాతో అవగాహన ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్ని రంగాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో క్యూసీఐతో పనిచేయబోతోంది. తాము పండించిన పంట ఉత్పత్తులను అంతర్జాతీయంగా తమకు నచ్చినచోట ప్రీమియం రేటుకు విక్రయించుకునేలా రైతులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం. ఆయన చొరవ నేడు కార్యరూపం దాల్చింది. నాణ్యమైన పంట ఉత్పత్తులకు సర్టిఫికేషన్ చేయాలన్న లక్ష్యంతో దేశంలోనే తొలిసారి స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ అథారిటీని ఏర్పాటు చేయడంతో క్యూసీఐ తరఫున గ్యాప్ సర్టిఫికేషన్ జారీచేసే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించాం. ఈ సంస్థ ద్వారా దేశంలోనే తొలిసారి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు గ్యాప్ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. 130 దేశాలకుపైగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఏపీలో రైతుల కోసం ప్రత్యేకంగా క్యూసీఐ ఇండిగ్యాప్ పోర్టల్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో రైతులెవరైనా సరే ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నిర్దేశిత ప్రమాణాలకనుగుణంగా నాణ్యమైన పంట ఉత్పత్తులను గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా తమకు నచ్చినచోట నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ ద్వారా అంతర్జాతీయంగా 130కి పైగా దేశాల్లో తమ ఉత్పత్తులకు అమ్ముకునే వెలుసుబాటు ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మిగిలిన వ్యవసాయ అనుబంధరంగాల్లో కూడా సర్టిఫికేషన్ కోసం ఏపీ ప్రభుత్వంతో క్యూసీఐ అవగాహన ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేస్తాం ప్రత్యేక ఉత్పత్తులను హైలెట్ చేయడం, రైతుల పరపతిని మరింత మెరుగుపర్చడంతో పాటు ఇండిగ్యాప్, గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన వారిని అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. మత్స్య, డెయిరీ ఉత్పత్తుల్లో ఎప్పటికప్పుడు రసాయన అవశేషాలను పరీక్షించేందుకు అవసరమైన చేయూతనిస్తాం. ఇలా వివిధదశల్లో పరీక్షలు, సాంకేతిక సహకారంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించేందుకు వెసులుబాటు కలుగుతుంది. అలాగే అంతర్జాతీయ విపణిలో నచ్చిన రేటుకు అమ్ముకోవడం ద్వారా కనీసం రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఏర్పడుతుంది. ఏపీ నుంచి ప్రస్తుతం ఎగుమతి అవుతున్న వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు ఇండిగ్యాప్, గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ వల్ల సమీప భవిష్యత్‌లో రెట్టింపు అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలా అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలకే కాదు.. ఇతర రంగాల ద్వారా అందించే సేవల్లో నాణ్యతను పెంచేందుకు క్యూసీఐ ద్వారా అవసరమైన సహకారం అందిస్తాం. ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తాం. సామర్థ్యం పెంపు, జ్ఞాన భాగస్వామ్యంపై దృష్టిపెడతాం. దీర్ఘకాలికంగా నాణ్యతపై హామీ ఇచ్చే పద్ధతులను స్వతంత్రంగా నిర్వహించేందుకు రాష్ట్ర సంస్థలను తీర్చిదిద్దుతాం. వీటితోపాటు క్యూసీఐ చేపట్టే వివిధ కార్యక్రమాల ద్వారా ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావంతో ఉన్నాం. అగ్రి ల్యాబ్‌్సకు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ తాజాగా చేసుకున్న ఒప్పందం ద్వారా త్వరలో ఇండిగ్యాప్తో పాటు గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ కూడా జారీచేయబోతున్నాం. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ల్యాబ్్సకు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ జారీచేసేందుకు క్యూసీఐ సహకారం అందిస్తుంది. అలాగే గ్రామస్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకేలకు పూర్తిస్థాయిలో ఐఎస్వో సర్టిఫికేషన్ వచ్చేలా సహకారం అందిస్తాం. సీజన్లో సకాలంలో భూసార పరీక్షల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తాం. తద్వారా ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఆర్బీకేల ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్లాన్ తయారు చేస్తాం. -
అందుకే మమ్మల్ని కాంగ్రెస్ వదిలేసింది
బొల్లోజు రవి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానం సహా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే మద్దతు ఉంటుందని, లేకుంటే ఉండదని సీపీఎం తేల్చిచెప్పింది. దీంతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం సొంతంగా బరిలోకి దిగింది. కాంగ్రెస్‌తో పొత్తు విచ్ఛిన్నం, కాంగ్రెస్‌తో సీపీఐ వెళ్లిపోవడం, ఒంటరిపోరు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు విఫలమయినట్లేనా? ఇంకా ఏమైనా ఆశలున్నాయా? కాంగ్రెస్‌తో పొత్తు కథ ముగిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక పొత్తు ఉండదు. ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. మేం ప్రకటించిన 19 స్థానాల్లో అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడుగుతారు. మిర్యాలగూడను ఒకవేళ వాళ్లు మాకిచి్చనా కాంగ్రెస్ పార్టీ తన అభ్యరి్థని ఏదో రకంగా రంగంలోకి దింపేది. అయినా ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు లేకుండా పొత్తు ఎలా ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు నష్టమే కదా... అలాంటిది మీతో పొత్తు విషయంలో ఎందుకు ఇలా చేస్తుందని భావిస్తున్నారు? మాతో ప్రయోజనం లేదని కాంగ్రెస్ మమ్మల్ని వదిలేసింది. పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు నష్టమట. మాకు సీట్లు ఇస్తే ఓడిపోతామని, అదే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుస్తారని వారి నమ్మకం. మేము పోటీ చేయడం వల్లే వారికి లాభమట. మాతో చర్చల సందర్భంగా కూడా కాంగ్రెస్ నాయకులు ఈ విధంగానే మాట్లాడారు. అందుకే పొత్తు విషయంలో ముందుకు రావడంలేదు. సీపీఐకి కొత్తగూడెం స్థానంలో మద్దతు ఇస్తారా? అలాగే మీరు పోటీ చేసే 19 స్థానాల్లో మద్దతు కోరతారా? కొత్తగూడెంలో సీపీఐ తరపున పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుకు మద్దతు ఇస్తున్నాము. అయితే మేం పోటీ చేసే 19 చోట్ల సీపీఐ మద్దతు ఇస్తుందని నేననుకోను. ఎందుకంటే సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా పొత్తులో భాగంగానే కొత్తగూడెం స్థానం కేటాయించారు. కాబట్టి సీపీఐ మాకు మద్దతు ఇవ్వదు. ఒకవేళ వారి ఓటర్లు ఎక్కడైనా మాకు మద్దతు ఇస్తే అది వారిష్టం. బీఆర్ఎస్ది అవకాశవాదమని మీరు భావిస్తున్నారా..? బీఆర్ఎస్గానీ, ఇతర ప్రాంతీయ పార్టీలుగానీ అవకాశవాదంతోనే వ్యవహరిస్తాయి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దెదించడమే తమ లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఆ ఊపులో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతావరణాన్ని సృష్టించాలని భావించింది. ఆ సమయంలో కేసీఆర్‌కు మరో మార్గం లేదు. అందుకే బీజేపీని వ్యతిరేకించారు. ఆ తర్వాత కర్నాటక ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. కేసీఆర్ మూడ్ మారిపోయింది. బీజేపీతో ప్రమాదం లేదని అర్ధమైంది. ఈ ఎన్నికల తర్వాత సీట్లు తక్కువైతే బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకునే పరిస్థితి ఉంది. అందుకే కమ్యూనిస్టుల అవసరం కేసీఆర్‌కు లేదు. అవకాశవాదంతో రాజకీయాలను మార్చారు. ఈ ఎన్నికల్లో ఒక్క సీటయినా సాధిస్తారా..? గెలుస్తామన్న నమ్మకంతోనే 19 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం. అన్ని చోట్లా గెలవాలన్నదే మా లక్ష్యం. -
అర్థవంతమైన జీవితం
‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ... ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్ఎస్ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్ ఇంజనీర్. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్ ్సతో ఆర్నమెంట్ మేకింగ్ నేర్పించాడు. జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్ కాలేజ్‌కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. యూ ట్యూబ్ ఆత్మీయులనిచ్చింది కోవిడ్ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్ చానెల్స్ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్‌కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్‌నెయిల్’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను. మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత యూ ట్యూబ్ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్‌స్రైబర్స్ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. డాక్టర్లు, సైంటిస్ట్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్ పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్ పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను. యూ ట్యూబర్‌గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్ చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్టైన్ మెంట్ మన మైండ్‌ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సౌందర్యతో ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రిన్స్.. ఏ సినిమానో తెలుసా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో అలరించనుంది. అయితే రాజ కుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మహేశ్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. (ఇది చదవండి: హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు!) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగువారికి పరిచయం అక్తర్లేని పేరు. అప్పటి స్టార్ హీరోలందరితో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. అయితే సౌందర్యతో నటించే ఛాన్స్ మహేశ్ బాబు మిస్ అయినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మూవీలో మరో హీరోయిన్ నటించింది. రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత యువరాజు చిత్రంలో నటించారు. ఇందులో ప్రిన్స్ సరసన సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా కనిపించారు. అయితే ఈ చిత్రంలో ముందుగా సిమ్రాన్ స్థానంలో డైరెక్టర్ సౌందర్యనే ఎంపిక చేశారు. అయితే సౌందర్య- మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాలేదట. ఎలా చూసిన మహేశ్‌కు అక్కలా కనిపిస్తున్నానని.. ఈ విషయాన్ని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్ వైవీఎస్ చౌదరికి చెప్పిందట. (ఇది చదవండి: రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ అశ్వధామ’.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఈ పాత్రకు తనకంటే సిమ్రాన్ ఫర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సౌందర్య సూచించిదట. దీంతో డైరెక్టర్ సౌందర్యకు బదులుగా సిమ్రాన్‌ను ఎంపిక చేశారు. అలా సౌందర్య- మహేశ్ బాబు జోడిని వెండితెరపై చూసే ఛాన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ కోల్పోయారు. లేదంటే మహేష్ బాబు - సౌందర్య జోడీని తెలుగువారు చూసే అవకాశం దక్కేది. కాగా.. సౌందర్య 2004లో బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. యువరాజు సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని గుంతలక్కడి గుమ్మ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. -
ఆ పల్లెను చూసింది నలుగురు ఎమ్మెల్యేలే!
రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు. సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది. ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్‌లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్‌పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి. కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి. 2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు. రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట చదువు ఆపేశాను నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్‌రెడ్డి, వీరారెడ్డిగూడెం -తాండ్ర కృష్ణగోవింద్ -
నాకు పదవొస్తే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ పదవిలో తనను నియమిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకంత భయాందోళనలకు గురై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదని త్రిపుర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ పక్షాన ఎన్నికల సన్నద్ధతలో కీలకంగా వ్యవహరిస్తున్న తనను మరో రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తే సంతోషపడాలే కాని భయంతో ఉన్నారంటే ఇక్కడున్న పరిస్థితులు అర్థమవు తున్నాయన్నారు. ఇప్పటికే బీసీలు బీజేపీ వైపు ఉండగా, రెడ్డిగా తనకు ఈ పదవి ఇవ్వడం వల్ల ఈ సామాజికవర్గం ఓట్లు కూడా బీజేపీకే పడతాయనే భయంతో కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్‌పై వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదన్నారు. తనకు ఈ పదవి లభించడం పట్ల సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఫోన్ చేసి అభినందించడం, వారిలో నూతనోత్సాహం వెల్లివిరియడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అంకితభావంతో పనిచేస్తే బీజేపీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందనడానికి గవర్నర్‌గా తన నియామకం స్పష్టం చేస్తుందన్నారు. నియామకపత్రాలు అందాక ఈ నెల 24న లేదా 26న పదవీబాధ్యతలను స్వీకరించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. సాక్షి: మీ రాజకీయ జీవితంలో సాధించిన విజయాలు, గుర్తుండిపోయే సందర్భాలు ఏమిటి? ఇంద్రసేనారెడ్డి: 1983 అసెంబ్లీ ఎన్నికల్లో (33 ఏళ్ల వయసులో) నాటి హోంమంత్రి కె.ప్రభాకర్‌రెడ్డిని, 1985 ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావును ఓడించి సంచలనం సృష్టించాను. 1985లో గెలిచాక కొత్త అసెంబ్లీ భవనంలోకి మారాక జరిగిన తొలిరోజు సభలో నేను వేసిన మొట్టమొదటి ప్రశ్న మంత్రులు తమ ఆస్తులను ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరాను. దానిపై అప్పటి సీఎం ఎన్టీరామారావు ఆవేశంగా స్పందిస్తూ...ఒక్క మంత్రులే కాదు, ఎమ్యెల్యేలంతా కూడా ప్రతీ ఏడాది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన బ్యాలెన్స్ షీటు సమర్పించేలా ఆదేశిస్తామన్నారు. దీనినే ఈసీ కూడా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నామినేషన్లు సమర్పణకు ముందు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. దీనికి నా ప్రశ్నే కారణం కావడం గర్వంగా ఉంది. అసెంబ్లీ కమిటీల్లోనూ కీలకపాత్ర పోషించి కొంతమంది ఉన్నతాధికారులు సైతం తమ తప్పులను సరిదిద్దుకునే పరిస్థితిని కల్పించిన సందర్భాలున్నాయి. సాక్షి: బీజేపీలో పలువురు నేతలు ఎమ్మెల్యే అయ్యాక ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రమోషన్ పొందారు? మీకు అది వెలితి అనిపించిందా ? ఇంద్రసేనారెడ్డి: ఎంపీగా వెళితే మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయొచ్చునని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. 1980లోనే బీజేపీ తరఫున నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చవిచూశాను. ఆ తర్వాత పలుమార్లు ఎంపీగా పోటీచేసినా విజయం సాధించలేకపోయాను. 2014లో చివరిసారిగా భువనగిరి నుంచి ఓడిపోయాక ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగాను. అప్పటి నుంచి సంస్థాగతంగా పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాల సమన్వయం తదితర విషయాల్లో నా రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ట్రబుల్ షూటర్‌గా నిలిచాను. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా పార్టీపరంగా పూర్తి సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్నాను. సాక్షి: మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? ఇంద్రసేనారెడ్డి : 1968, 69 నుంచి ఏబీవీపీలో, అంతకు ముందు విద్యార్థిగా ఆరెస్సెస్‌లో తిరిగాను. 1975 ఎమర్జెన్సీ విధించాక మీసా కింద అరెస్టయి జైలుకు కూడా వెళ్లాను. 1977లో లోక్‌నాయక్ జయప్రకాశ్ ప్రారంభించిన ఉద్యమంలో భాగస్వామి అయ్యాను. జనతాపార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించాను. 1980లో బీజేపీలో చేరి కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1983, 1985, 1999లలో మలక్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను. బీజేఎల్పీనేతగా వ్యవహరించా. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నా. ప్రస్తుతం జాతీయకార్యవర్గసభ్యుడిగా కొనసాగుతున్నాను. మొత్తంగా 46 ఏళ్లుగా బీజేపీ, జనతాలతో అనుబంధం ఉంది. సాక్షి: కీలకమైన ఎన్నికల సందర్భంలో గవర్నర్ పదవి రావడంపై ఏమంటారు? ఇంద్రసేనారెడ్డి: ఈ పదవి ఇంకా రెండు, మూడునెలలు ఆలస్యంగా వచ్చి ఉంటే బాగుండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కృషిలో భాగస్వామినై ఉన్నాను. వివిధ కీలకబాధ్యతలను నిర్వహిస్తూ పార్టీకి ఉపయోగపడుతున్నాను. సాక్షి: రాజ్యాంగబద్ధ పదవిని ఎలా భావిస్తున్నారు ? ఇంద్రసేనారెడ్డి : నా మొత్తం రాజకీయజీవితంలోని అనుభవసారాన్ని అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వెచ్చిస్తాను. రాజ్యాంగ పరిధిలో ఏ మేరకు మరింత మెరుగ్గా పనిచేయగలను, ప్రజల అభ్యున్నతికి ఎలా కృషి చేయగలను అన్నవే నా ముందున్న లక్ష్యాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం అందుకు పనికొస్తుందని విశ్వసిస్తున్నాను. -
అటు ఆదాయం.. ఇటు ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్లలో ఔషధ గుణాలు ఎక్కువ. పోషకాహారపరంగా ఇవి ఎంతో కీలకమైనవి. సాగుపరంగా రైతుల కు ఖర్చు తక్కువగా ఉండి..మంచి ఆదాయాన్ని ఇస్తాయి. అందుకే మిల్లెట్లు కీలకమైనవిగా భావిస్తుంటామని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. మిల్లెట్స్ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే....అగ్రి ఎకానమీలో మిల్లెట్ల పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలో మిల్లెట్ల ఉత్పత్తిలో భారత్ వాటా 41 శాతం. ఆసియాలో 81 శాతం మిల్లెట్ విస్తీర్ణం ఇండియాలోనే. మిల్లెట్లు వర్షాభావంలోనూ పండుతాయి. ఇతర పంటలు ఐదు నెలల్లో చేతికి వస్తే, మిల్లెట్లు మూడు నెలల్లోనే చేతికి వస్తాయి. దేశంలో అన్ని రకాల వాతావరణానికి ఇవి అనుకూలం. ప్రజల్లో మిల్లెట్లపై అవగాహన పెంచాలి గతంలో మనం మిల్లెట్లను ఆహారంగా తీసుకునేవారం. కానీ దేశంలో జనాభా పెరగడంతో ఆహారభద్రత సమస్యగా మారింది. దీంతో మన ఆహారపు అలవాట్లు మారి, ప్రజలకు అవసరమైన పంటలను ముందుకు తీసుకొచ్చాం. దీని ఫలితమే హరిత విప్లవం. ప్రజలు గోధుమ, బియ్యమే ఆహారంగా తీసుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ మిల్లెట్లను ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మిల్లెట్ సాగులో రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందాలి.వీటికి మరింత ప్రచారం కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో మిల్లెట్లపై ఇప్పటికే పూర్తి అవగాహన ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా ప్రచారం కల్పించాలి. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం దేశంలో గోధుమలు, బియ్యానికి ప్రాధాన్యం ఉంది. వాటికి ప్రజలు అలవాటు పడ్డారు. దీన్ని రాత్రికి రాత్రే మార్చలేం. బియ్యం, గోధుమలు పండించాలంటే నీరు కావాలి. మిల్లెట్లు పండించాలంటే తక్కువ నీరు సరిపోతుంది. మిల్లెట్లను సుస్థిరమైన వ్యవసాయంగా భావించొచ్చు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉత్పత్తి, ఉత్పాదకత, విక్రయాలు పెరిగితే మిల్లెట్ల ధరలు తగ్గుముఖం పడతాయి. దీనివల్ల వినియోగదారులకు సరసమైన ధరలకు అందించగలం. రూ. లక్ష కోట్ల అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది. దానిద్వారా రుణాలు ఇవ్వాలి. కానీ అందులో రూ. 26 వేల కోట్లు మాత్ర మే వినియోగిస్తున్నారు. మిల్లెట్లకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన విషయం పూర్తిగా విధానపరమైన నిర్ణయం. దీనిని కేంద్రమే చెప్పాలి. ప్రస్తుతం 26 రకాల పంటలకు మద్దతు ధర కల్పించారు. అందులో కొన్ని రకాల మిల్లెట్లు కూడా ఉన్నాయి. -
జస్ట్ పాలు అమ్మి రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పి పుణ్యం కట్టుకోండ
జస్ట్ పాలు అమ్మి.. రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ఆ కిటుకొకటి చెప్పి పుణ్యం కట్టుకోండి సార్! -
అమెరికా తీరుపై చైనా గుర్రు
ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల నేపథ్యంలో అమెరికా తీరుపై చైనా ఆగస్ట్ 18న ఒక నివేదిక విడుదల చేసింది. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను బలహీనపరిచే అమెరికా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ వల్ల లబ్ధి పొందిన అమెరికా, తన దేశీయ సమస్యలకు (వాణిజ్య లోటు, నిరుద్యోగానికి) ప్రపంచ వాణిజ్యం కారణమంటూ, 2017 నుంచి కొత్త అప్పిలేట్ బాడీ సభ్యుల నియామకాలను నిలిపివేసింది. అయితే, అమెరికాను వేలెత్తి చూపుతున్న చైనా ఇతర దేశాల పట్ల తన చర్యల గురించి సమీక్షించలేదు. ఏమైనా, ప్రపంచ వాణిజ్య సంస్థ, దాని చుట్టూ ముసురుకుంటున్న సమస్యల మీద ఇటువంటి నివేదికను భారత ప్రభుత్వం కూడా రూపొందించి ప్రజలకు నివేదిస్తే బాగుంటుంది. 1990 నుంచి భారత ప్రభుత్వాలు ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో పాటు రెండు ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేశాయి. అందులో వ్యవసాయం మీద చేసిన ఒప్పందం కీలకమైనది. ఆనాటి నుంచి కూడా భారతదేశం అనేక రంగాలను అంతర్జాతీయ వాణిజ్యంతో ముడిపెడుతూ వస్తు న్నది. దానికి అనుగుణంగా అనేక రంగాలలో విధానాలు మార్పు చేశారు. ఈ మార్పుల వెనుక అమెరికా ఒత్తిడి ఉన్నది. అయితే, ఇటీవలి కాలంలో అనూహ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాభవం తగ్గుతూ వస్తున్నది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు, చర్చలకు ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే, ప్రపంచ వాణిజ్య సంస్థ తన ప్రయోజనాలకు అనువుగా లేదని అమెరికా భావించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం అమెరికా తన బాధ్యతలను నెరవేరుస్తున్న తీరు పైన చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మొన్న ఆగస్ట్ 18 నాడు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ 65 పేజీల నివేదికలో దాదాపు 210 డాక్యుమెంట్లను ఉటంకిస్తూ, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను బలహీనపరిచే అమెరికా విధాన చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఏకపక్ష వాణిజ్య బెదిరింపులను, పారిశ్రామిక విధా నాలలో ద్వంద్వ ప్రమాణాలను, ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలు సులకు విఘాతం కలిగించే అంశాలను ప్రస్తావించింది. వివాద పరిష్కార సంస్థ తీర్పులు, సిఫార్సులను ఇష్టానుసారం అమలు చేయడం ద్వార డబ్ల్యూటీవో వివాద పరిష్కార యంత్రాంగాన్ని అమెరికా బలహీనపరిచిందని ఈ నివేదిక ఎత్తిచూపింది. 157 వాణిజ్య వివాదాలలో అమెరికా ప్రతివాదిగా ఉందనీ, మొత్తం వాణిజ్య వివాదాలలో ఇది సుమారు 20 శాతం అనీ నివేదిక తెలిపింది. సంస్థాగత సమస్యల కారణంగా 2017 నుంచి కొత్త అప్పీలేట్ బాడీ సభ్యుల నియామకాలను అమెరికా నిలిపివేసిందనీ, ఈ చర్య వల్ల అప్పిలేట్ బాడీ ‘నిరర్థక’ పరిస్థితికి చేరుకున్నదనీ పేర్కొంది.పారిశ్రామిక విధానాలకు సంబంధించి అమెరికా ఇతర సభ్యదేశాల మధ్య వేర్వేరు ప్రమాణాలను వర్తింపజేసిందని నివేదిక తెలిపింది. అధిక సుంకాలు విధించడం లేదా వాణిజ్య–నియంత్రణ చర్యలు తీసుకోవడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి భారీ సబ్సిడీలను అందించడం, పారిశ్రామిక మరియు సరఫరా గొలుసు లను విచ్ఛిన్నం చేయడం వంటి వివిధ రక్షణాత్మక పద్ధతులను అమె రికా అవలంబించిందని ఆరోపించింది. డబ్ల్యూటీవో నిర్దేశిస్తున్న వాణిజ్యం వల్ల ప్రధానంగా అమెరికా లబ్ధి పొందింది. అయితే పటిష్టమైన అంతర్గత ప్రయోజన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వలన, దేశ ఆదాయం, ఉపాధిని సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం వల్ల అమెరికాలో వివిధ వర్గాల మధ్య అసమానతలు పెరిగిపోయాయని చైనా నివేదిక అంటున్నది. ఒక దేశంగా తక్కువ పొదుపు, అధిక వినియోగం, అధిక రుణం ఉన్న పరిస్థితులలో, అమెరికాలో పొదుపు నిలువలు లేకపోవడం వలన ఆర్థికాభివృద్ధికి కరెంట్ ఖాతా లోటులు, వాణిజ్య లోటులపై ఆధార పడవలసి వస్తున్నది. అమెరికా ప్రభుత్వం తన దేశీయ సామాజిక సమస్యలను (వాణిజ్య లోటు, నిరుద్యోగానికి) ప్రపంచ వాణిజ్యం కారణమంటున్నది. దేశీయ విధాన వైఫల్యాలకు ప్రపంచీకరణను, ప్రపంచ వాణిజ్య సంస్థను కారణాలుగా చూపెడుతున్నది. అమెరికా ద్వంద్వ వైఖరిని చైనా నివేదిక ఎత్తి చూపెడుతున్నది. ఒకప్పుడు ఆ దేశానికి ప్రయోజనకారిగా ఉన్న కారణాలు ఈ రోజు కంటగింపుగా మారినాయి. ఇంకొకవైపు, భారత్, మెక్సికో తది తర దేశాల మీద తన ఉత్పత్తులను రుద్దే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ద్వైపాక్షిక, బహుళ పక్ష ఒప్పందాలను ఆయుధంగా వాడుతున్నది.ప్రపంచ వాణిజ్య సంస్థలో వివాద పరిష్కార వేదిక, ఈ వేదిక పనికి ఆమోదించిన పద్ధతి కీలకం. దీని సిఫార్సులు, తీర్పులు వాణిజ్యం సమతుల్యంగా, వివాదరహితంగా కొనసాగడానికి ఉపయో గపడుతున్నాయి. అన్ని తీర్పులు ఆమోదయోగ్యం కాకపోయినా, ఒక ప్రజాస్వామ్య బద్ధ వేదిక ఉండడం ముదావహం. అయితే, 2017 నుంచి అప్పిలేట్ బాడీ నిబంధనల ప్రకారం, సభ్యుల గడువు ముగిసింది. ఖాళీలు ఏర్పడ్డాయి. అనూహ్యంగా, సంస్థాగత సమస్య లను ప్రస్తావిస్తూ అమెరికా కొత్త సభ్యుల నియామకాల ప్రక్రియను నిలిపివేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే ఉంటాయి. అమెరికా మొండి వైఖరితో కొత్త అప్పీలేట్ బాడీ ఏర్పడక వివాద పరిష్కార యంత్రాంగం పని చేయలేని పరిస్థితికి చేరుకున్నది. కొత్త సభ్యులతో వివాద పరిష్కార సంస్థ (డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ) ఏర్పాటుకు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతిపా దనలను డిసెంబర్ 2022 నాటికి అమెరికా దాదాపు 60 సార్లు తిరస్కరించింది. డబ్ల్యూటీవో సభ్యదేశాలలో భారత్ సహా అత్యధికం దీనిని త్వరగా పునఃప్రారంభించడాన్ని సమర్థిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ తన సభ్యులు, ఇతరులపై అనుమతి లేని ఏకపక్ష చర్యలు తీసుకోవడాన్ని నిషేధిస్తుంది. కానీ, అమెరికాకు జాతీయ భద్రత, మానవ హక్కులు, బలవంతపు సాంకేతిక బదిలీ పేరుతో ఇతర సభ్యులపై ఏకపక్ష చర్యలు ప్రకటించిన సుదీర్ఘ చరిత్ర దానికి ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో, సాంకేతిక పరిజ్ఞానంలో తనకున్న ఆధిపత్య జ్ఞానాన్ని ఉపయోగించి, తన దౌత్య విధానాలు మరియు చట్టవిరుద్ధమైన డిమాండ్లను ఇతర దేశాలు, ప్రాంతీయ వాణిజ్య సమూహాలు, సంస్థల మీద కూడా రుద్దింది. ఈ పద్ధతులు అంతర్జాతీయ వాణిజ్యంపై దుష్ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ నివేదికలో చైనా 4 చోట్ల భారత్ ప్రస్తావన తీసుకువచ్చింది. 1997లో అమెరికాలో ఒక వ్యవసాయ సంస్థ బాస్మతి బియ్యాన్ని అమెరికన్ లాంగ్ ఇండికా బియ్యంతో సంకరించిన తరువాత 20 పేటెంట్ల కోసం మేధా హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నది. ఇది భారతదేశం నుండి బాస్మతి బియ్యం ఎగుమతిని తీవ్రంగా పరిమితం చేసిందని వ్యాఖ్యానించింది. ఫిబ్రవరిలో 2019లో చైనా, భారత్, దక్షిణాఫ్రికా, వెనిజులా, లావోస్ పీడీఆర్, బొలీవియా, కెన్యా,సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పాకిస్తాన్, క్యూబా సంయుక్తంగా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఒక విశ్లేషణాత్మక పత్రం సమర్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉండే వివక్షను ఎండగడుతూ, ఆయా దేశా లకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల పరిరక్షణకు హక్కులను కల్పించాల్సిన అవసరాన్ని ఈ పత్రం ద్వారా కోరాయి. అదే సంవత్సరం (2019) అక్టోబర్ నెలలో, 53 సభ్యదేశాలు (చైనా, భారత్, పాకిస్తాన్, ఆఫ్రికన్ గ్రూప్ సహా) సంయుక్తంగా ఒక పత్రం సమర్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక, భిన్నమైన వాణిజ్య నిబంధనలను రూపొందించడం తమ హక్కుగా ఈ పత్రంలో వర్ణించారు. ఈ నివేదిక ద్వారా డబ్ల్యూటీవో సభ్యత్వ దేశాలతో కలిసి పని చేస్తామని చైనా హామీ ఇచ్చింది. చైనా ఇస్తున్న ఈ హామీలు ప్రపంచీ కరణ, ఆర్థిక సరళీకృత విధానాలను వ్యతిరేకించేవారికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కమ్యూనిస్ట్ దేశంగా ముద్ర పడిన చైనా సరళీకృత ఆర్థిక విధానాలకు, ప్రపంచీకరణకు, ప్రైవేటీకరణకు ఆలవాలమైన ప్రపంచ వాణిజ్య సంస్థ కొనసాగింపునకు ఈ విధంగా ఊతం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించకమానదు. అయితే, అమెరికాను వేలెత్తి చూపుతున్న చైనా ఇతర దేశాల పట్ల తన చర్యల గురించి సమీక్షించలేదు. కనీసం ప్రస్తావించలేదు. ఏది ఏమైనా, ప్రపంచ వాణిజ్య సంస్థ, దాని చుట్టూ ముసురుకుంటున్న సమస్యల మీద ఇటువంటి సవివరమైన నివేదికను భారత ప్రభుత్వం కూడా తయారు చేసి, ప్రత్యేకంగా అమెరికా, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ళ గురించి ప్రజలకు, పార్లమెంటుకు నివేదిస్తే బాగుంటుంది. - దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకులు 90102 05742 -
రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. రవీంద్ర భారతిలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సాక్షి ఫొటోగ్రాఫర్లు యాకయ్య(సూర్యాపేట), కే.శివకుమార్(యాదాద్రి భువనగిరి), వీ భాస్కరా చారి(మహబూబ్ నగర్), శ్రీకాంత్(సిరిసిల్ల), సతీష్(సిద్ధిపేట), రాజేశ్ రెడ్డి(హైదరాబాద్), శివప్రసాద్(సంగారెడ్డి), వేణు(జనగాం), ఎస్ఎస్ థాకూర్(హైదరాబాద్) అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. యాకయ్య, సూర్యాపేట భాస్కరా చారి, మహబూబ్ నగర్ ఈ సంద్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అద్భుతమైన ఫోటో తీయడంలో డే తపన, చేసే కృషి గొప్పదని అన్నారు. ఒక్క ఫోటో ఒక చరిత్రను తిరగరాస్తుంది.. చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ఉద్యమమైనా, సామాజిక విప్లవమైనా, చరిత్ర గతిని మార్చిన ఏ సంఘటనలో ఆయినా జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. ఠాకూర్, హైదరాబాద్ నోముల రాజేశ్, హైదరాబాద్ సతీష్, సిద్ధిపేట్ శివ కుమార్, యాదాద్రి 'నాడు జాతీయోద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి విన్నాం. నేటి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కళ్ళ నిండా చూశాం. 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రత్యక్షంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్న దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటా. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన ఎంతో మంది జర్నలిస్టులు నాడు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. జర్నలిస్టులందరితో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అలాంటి మీడియాను, జర్నలిస్టును, ఫోటో జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్నది.' అని హరీష్ రావు అన్నారు. శివ ప్రసాద్, సంగారెడ్డి శ్రీకాంత్, సిరిసిల్ల ఇదీ చదవండి: 86 స్థానాల్లో ‘కారు’ ఖరారు! -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
సాక్షి ఎఫెక్ట్: రాయదుర్గం భూములపై ఎల్‌అండ్‌టి మెట్రో రైల్ వివరణ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం భూములపై ఎల్అండ్టీ మెట్రో రైల్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదంతోనే సబ్‌లైసెన్స్ హక్కులను రాఫర్టీకి అప్పగిమంచామని, ఈజీఎంలో షేర్ హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాతే బీఎస్ఈకి తెలిపామని ఎల్అండ్టీ మెట్రో రైల్ తెలిపింది. స్థిరాస్తి విక్రయించండం జరగదని స్పష్టం చేసింది. సబ్ లైసెన్స్‌పై కొన్ని అనుమతులు రావాల్సి ఉందనిఎల్అండ్టీ మెట్రో రైల్ పేర్కొంది. చదవండి: కేసీఆర్ పక్కా ప్లాన్.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. -
హైదరాబాద్ : ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
Actress Sakshi Vaidya: చీరకట్టులో మెరిసిన హీరోయిన్ సాక్షి వైద్య (ఫోటోలు)
-
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్‌మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
సాక్షి మనీ మంత్రా : 'బేర్'మన్న మార్కెట్లు..భారీ నష్టాలతో ప్రారంభం
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల అంశాలతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయ 9.20 గంటలకు సెన్సెక్స్ 292 పాయింట్లు నష్టపోయి 66166 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 19647 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతి సుజికీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డిస్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, హీరోమోటో కార్పొరేషన్, లార్సెన్, దివీస్ ల్యాబ్స్,ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
‘సాక్షి’ మూవీ రివ్యూ
టైటిల్: సాక్షి నటీనటులు: శరణ్ కుమార్, జాన్వీర్ కౌర్, నాగబాబు, ఆమని, ఇంద్రజ తదితరులు నిర్మాత: మునగాల సుధాకర్ రెడ్డి దర్శకత్వం : శివ కేశన కుర్తి సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఎడిటర్ : సెల్వ కుమార్ విడుదల తేది: జులై 29, 2023 ఇప్పటికే సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. సీనియర్ నరేష్ బావ కుమారుడు శరణ్ కుమార్ కూడా గతంలో హీరోగా మిస్టర్ కింగ్ అనే ఒక సినిమా చేశాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా రిలీజ్ అయిన సాక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శరణ్ కుమార్. శివ కేశన కుర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి నిర్మించారు. నాగబాబు, ఆమని, ఇంద్రజ, దేవీ ప్రసాద్ వంటి సీనియర్ నటులు నటించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సాక్షి కథేంటంటే.. అర్జున్(శరణ్ కుమార్) ఒకపక్క సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూనే పత్రిక నడిపే తన తండ్రి (దేవీ ప్రసాద్)కి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటాడు. ఆఫీసులో మేనేజర్ నుంచి ఎదురైన ఒక అనూహ్యమైన ఇబ్బందితో బాధపడుతున్న సమయంలో పరిచయమైన రిపోర్టర్ నేత్ర (జాన్వీర్ కౌర్)తో ప్రేమలో పడతాడు. అంతా బాగానే ఉంటుందనుకున్న సమయంలో తండ్రి రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆయనకు ఆపరేషన్ చేయాలంటే 20 లక్షలు కావాలి అనడంతో తెలియకుండానే ఒక స్మగ్లింగ్ ఊబిలో కూరుకుపోతాడు. ముందుగా స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మర్డర్ కేసులు కూడా మీద పడతాయి. ఆ స్మగ్లింగ్ నుంచి మర్డర్ కేసుల నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? హాస్పిటల్ లో ఉన్న తండ్రిని కాపాడుకున్నాడా? చివరికి నేత్ర, అర్జున్ ఒకటయ్యారా ? అనేది సినిమా కథ. ఎలా ఉందంటే? సాక్షి అనే పేరుతోనే ఆసక్తి రేకెత్తించిన సినిమాను ఏదో కొత్త కథతో తెరకెక్కించలేదు. రొటీన్ గా మనం చూసే సినిమా లాగానే ఉంటుంది కానీ ఎవరు టచ్ చేయని సబ్జెక్టులను టచ్ చేసి కమర్షియల్ ఎలిమెంట్లతోని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సినిమా యూనిట్. డబ్బు కోసం దేనికైనా దిగజారిపోతున్న రాజకీయ నాయకుల నుంచి నిజాయితీగా పోరాడే తన తండ్రి లాంటి జర్నలిస్టుని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు ఎలా కాపాడుకున్నాడు అనే విషయాన్ని ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించారు. అప్పటివరకు సుకుమారంగా అన్నింటికీ దూరంగా పెరిగిన ఒక వ్యక్తి తన తండ్రి ప్రాణాల మీదకు వస్తే తెగించి ఎంతవరకు పోరాడాడు అనే విషయాన్ని సినిమాలో కరెక్ట్ గా క్యాప్చర్ చేశారు. కథ రొటీన్ అయినా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసేందుకు దర్శకుడు ప్రయత్నించి కొంత వరకు సఫలం అయ్యాడు. సీనియర్ నటీనటులు ఈ సినిమాకి అదనపు బలంగా మారారు. హీరో, హీరోయిన్లు స్క్రీన్ కి కొత్తయినా తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. డైరెక్టర్ శివ తాను చెప్పాలనుకున్న విషయాన్ని కమర్షియల్ ఎలిమెంట్లతో ఒక మెసేజ్ ఇచ్చేలా చెప్పేందుకు ప్రయత్నించి కొంతవరకు సఫలం అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అసలు అర్జున్ స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయాన్ని చూపించగా సెకండ్ హాఫ్ అంతా ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేయడానికి ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ తర్వాత సినిమా కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. వరుస ట్విస్టులతో సినిమా మీద ఆసక్తి పెంచేశాడు డైరెక్టర్. ఎవరెలా చేశారంటే? నటీనటుల విషయానికి వస్తే శరన్ మొదటి సినిమా కంటే ఈ సినిమాలో నటన విషయంలో మెరుగయ్యాడు. జాన్వీర్ కౌర్ కి కూడా నటనకు స్కోప్ ఉన్న రోల్ దక్కింది.. విలన్ గా నాగబాబు ఒక రేంజ్ లో నటించాడు. తన అనుభవం అంత స్క్రీన్ మీద కనిపించింది. ఇంద్రజ, ఆమని, దేవి ప్రసాద్ వంటి వారి పాత్రలకు కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. వారు కూడా తమ అనుభవం స్క్రీన్ మీద పండించారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. భీమ్స్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. అయితే ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగినట్టు ఉన్నాయి. -
దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్ చేయాలి
తిరుపతి సిటీ: దళిత ద్రోహి నారా లోకేశ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ‘సాక్షి’ విలేకరి కరుణాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ వార్తల కవరేజ్ చేస్తున్న దళిత విలేకరిని అతి దారుణంగా లోకేశ్ గూండాలు తిట్టడం, కొట్టడం అమానుషమన్నారు. నాయకులు మల్లారపు మధు, నల్లారి బాబు, వెంకటస్వామి, యలమంచిలి ప్రవీణ్, తళారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ విలేకరులపై టీడీపీ గూండాల దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళిత సామాజికవర్గానికి చెందిన సాక్షి విలేకరులు ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర కవరేజికి వెళ్లిన ఓ విలేకరిపై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి, హింసించారు. పాదయాత్రంలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిత్రీకరించారన్న నెపంతో మరో మరో విలేకరిపై దాడికి పాల్పడ్డారు. లోకేశ్ పాదయాత్రపై వాస్తవాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కసుతో లోకేశ్ ప్రైవేటు సైన్యం ఈ దాడులకు పాల్పడింది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ వద్ద సెల్ఫీ కార్యక్రమం జరిగింది. కొందరు టీడీపీ కార్యకర్తలను సెల్ఫీకి అనుమతించకపోవడంతో అక్కడ గొడవ జరిగింది. ఈ సమయంలో పాదయాత్ర కవరేజికి వెళ్లిన సాక్షి విలేకరి, దళిత సామాజిక వర్గానికి చెందన కరుణాకర్ ఆ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన లోకేశ్ ప్రైవేటు సెక్యూరిటీ కరుణాకర్‌ను టెంట్‌లోకి లాక్కొని వెళ్లి డెయిరీ, సెల్‌ఫోన్, లాక్కొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ పిడుగుద్దులు గుద్దారు. ‘సాక్షి’ విలేకరులకు బాగా బలిసింది.. మీ సంగతి తేలుస్తామని దూషిస్తూ గంటసేపు టెంట్లో నిర్బంధించారు. సెల్‌ఫోన్ మొత్తం పరిశీలించి ఫొటోలు డిలీట్ చేశారు. మరోసారి పాదయాత్రలో ఫొటోలు తీసినా, వ్యతిరేక వార్తలు రాసినా సహించేది లేదని, పాదయాత్రలో కనిపిస్తే చంపుతామంటూ లొకేశ్ పర్సనల్ సిబ్బంది బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ సంగతి తేలుస్తామని బెదిరించి పంపేశారు. వెల్లంపల్లి దగ్గర జరిగిన లోకేశ్ పాదయాత్రలో సాక్షి విలేకరి మరొకరిపైనా టీడీపీ మూక దాడికి పాల్పడంది. పాదయాత్రలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దళిత యువకులపై లోకేశ్ ప్రైవేటు సైన్యం దాడి చేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నాగులుప్పలపాడు మండల ‘సాక్షి’ విలేకరి, దళిత సామాజికవర్గానికి చెందిన అత్తంటి మధుబాబుపై కూడా టీడీపీ మూక దాడికి పాల్పడింది. పది మంది చుట్టుముట్టి చేతిలో నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. మరోమారు ఇటువంటివి పునరావృతమైతే ప్రాణాలు ఉండవంటూ తీవ్రస్థాయిలో బెదిరించి పంపేశారు. విలేకరి మధును వదిలేసినా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన దళిత యువకులను శుక్రవారం రాత్రికి కూడా వారి నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దాడి హేయమైన చర్య: దళిత సంఘాలు ఏ తప్పూ చేయని దళిత విలేకరులపై లోకేశ్ గుండాలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. లోకేశ్ సిబ్బందిని అదుపులో పెట్టుకోకపోతే పాదయాత్ర సాగకుండా అడ్డుకుంటామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. దళిత విలేకరులు కరుణాకర్, మధుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘సాక్షి’ రిపోర్టర్లపై దాడి దారుణం ‘సాక్షి’ విలేకరులు కరుణాకర్, మధుబాబుపై టీడీపీ గుండాల దాడి హేయమైన చర్య. ఒంగోలులో లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన లేదు. సాక్షి పత్రిక ఈ నిజాలను నిర్భయంగా రాస్తోంది. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సెల్ఫోన్లు లాక్కోవడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ సాక్షి దళిత విలేకరి కరుణాకర్, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -
సాక్షి రిపోర్టింగ్ ఫ్రం ఐక్యరాజ్యసమితి
అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాలను సాక్షి మీడియా గ్రూప్ తరపున కవర్ చేశారు మంగ వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి. మన దేశం నుంచి ఈ అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో వెంకన్న ఒకరు. తెలుగు మీడియాలో వెంకన్న మాత్రమే ఈ అవకాశం అందుకోగలిగారు. నల్గొండ జిల్లా నుంచి చిన్న విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా ఐక్యరాజ్యసమితి ఈవెంట్‌ను కవర్ చేయడం జర్నలిస్టుగా వెంకన్న సాధించిన విజయం. కవరేజ్ గురించి వెంకన్న మాటల్లోనే.. "హై-లెవల్ పొలిటికల్ ఫోరమ్ 2023 సమావేశాల్లో సుస్థిర అభివృద్ధి ఎజెండాగా ఉన్నత స్థాయి రాజకీయ వేదిక (HLPF) ఆర్థిక, సామాజిక మండలి ఆధ్వర్యంలో జూలై 10, సోమవారం నుండి 19 జూలై 2023 వరకు జరిగిన సమావేశాలను కవర్ చేయడం నా జర్నలిజం కెరియర్లో దక్కిన అతి పెద్ద అదృష్టం" ప్రపంచ మేధావుల విలువైన పాఠాలు UN కౌన్సిల్ యొక్క ఉన్నత-స్థాయి విభాగంలో భాగంగా సస్టైనబిలిటీ ప్రధాన అజెండా ఫోరమ్ యొక్క మూడు రోజుల మంత్రివర్గ ECOSOC యొక్క ఉన్నత-స్థాయి సెగ్మెంట్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేశాను. "కరోనా వైరస్ వ్యాధి (COVID-19) నుండి ప్రపంచ రికవరీని వేగవంతం చేయడం, అన్ని స్థాయిలలో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడం ఎజెండాగా ఈ సమావేశాలు జరిగాయి. ముఖ్య అజెండా లో పేర్కొన్న అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాను. ఒక్కో భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో ఒక్కొక్కరు వినూత్నమైన, విలువైన విషయాలు ఎన్నో చెప్పారు. (వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చే జర స్టవ్ తో UN స్పెషల్ కన్సల్టేటివ్ మెంబర్ షకీన్ కుమార్) ఎడ్యుకేషన్ లో ఏపీ.. ది బెస్ట్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ, బాలికల విద్య కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనాల వివరాలను స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషనల్ సస్టైనబులిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రాం హై లెవెల్ పొలిటికల్ ఫోరం కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానాన్ని అందిస్తున్నారని ఏపీ ప్రతినిధులు ప్రజెంట్ చేశారు. ఈ స్టాల్ ను సందర్శించిన వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సభ్యులు విద్యావేత్తలను నేను జర్నలిస్టుగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆయా దేశాల్లో అనుసరిస్తున్న తీరు, విద్యావిధానాలను తెలుగు ప్రజలకు చెప్పే అవకాశం వచ్చింది. నాడు-నేడు స్టాల్ గురించి తెలుసుకున్న పలువురు విదేశీ విద్యావేత్తలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానాన్ని ప్రశంసించినప్పుడు తెలుగోడిగా గర్వపడ్డాను. ఐక్యరాజ్యసమితి ఆశయాలు భుజాల మీద వేసుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు, నవరత్నాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు140 దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో వివరించడం సంతోషం కలిగింది. (కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ) అమెరికాకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్‌లో జరిగే అమెరికా పర్యటన సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాధిక అయ్యంగార్ను కలిశాను. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్‌తో కలిసి రాధిక అయ్యంగార్తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుగు పాఠకులకు అందించగలిగాం. ప్రపంచ ఐక్యత కోసం, దేశాల మధ్య సమస్యల పరిష్కారం, ప్రపంచ శాంతి కోసం, పౌర హక్కుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఒక రకంగా ప్రతీ ఒక్కరికి ఎన్నో పాఠాలు చెబుతుంది. అనుభవాలు గొప్పగా అనిపించాయి. మంగా వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి -
సురేష్ కొండేటికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ధోని వైఫ్ సాక్షి
-
శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు..
కరోనా వైరస్ భయపెడుతున్నా... వరద వణికిస్తున్నా... ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా... వలంటీర్లు వెన్నుచూపలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నవారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వాన వచ్చినా... వరద వచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే అవ్వతాతల ఇంటి తలుపుతట్టి పింఛను అందిస్తున్నారు. అర్హత గల తల్లికి అమ్మఒడి... అక్కచెల్లెమ్మలకు ఆసరా... చేయూత... నిరుపేదలకు నివేశన స్థలం.. పక్కా ఇళ్లు... విద్యార్థులకు విద్యాదీవెన... ఇలా ఒకటేమిటీ సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ శభాష్ వలంటీర్ అని అందరి మన్ననలు పొందుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు. వారి వల్లే వైఎస్సార్ బీమా వలంటీర్ మహబూబ్‌బాషా వల్లే నా కుటుంబానికి వైఎస్సార్ బీమా కింద రూ.4.50లక్షలు అందింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధ్రువీకరణపత్రాలు అందజేసి వైఎస్సార్ బీమా దరఖాస్తు చేయించి డబ్బులు అందేలా చేశారు. వలంటీర్లు చేసిన సేవలను మరువలేం. కరోనా సమయంలో పాల ప్యాకెట్లు ఇంటికే తెచ్చి ఇచ్చారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడంతో ప్రాణాలు నిలుపుకున్నాం. – ధనలక్ష్మి, 39వ వార్డు, నంద్యాల పట్టణం నా బాధలు తీర్చారు.. నా వయసు 66 దాటింది. నాకు 62 ఏళ్ల వరకు రేషన్ కార్డు లేదు. పింఛన్ రాలేదు. నా కుటుంబ సభ్యులు ఆదరించకపోవడంతో ఒంటరిగా బతుకీడుస్తున్నా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ వల్ల నాకు ఎంతో మేలు కలిగింది. మా వలంటీర్ నాసు శివశంకర్ నా సమస్యను తెలుసుకుని రేషన్ కార్డు వచ్చేలా చూశాడు. ఆ తర్వాత పింఛను కూడా పెట్టించాడు. ఆ పింఛనే ఇప్పుడు నాకు జీవనాధారం. ఇంత మంచి వ్యవస్థను అందించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. – పొన్నాన రామారావు, కుమ్మరిగుంట,సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా మా కుటుంబాన్ని కాపాడిన వలంటీర్ రెండేళ్ల క్రితం మా కుటుంబంలోని మొత్తం ఆరుగురం కరోనా బారినపడ్డాం. మా వీధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అప్పుడు మేం ఇంట్లో నుంచి వెలుపలికి రాలేక అవస్థలు పడ్డాం. అప్పుడు వలంటీర్ అశోక్ వచ్చి మా కుటుంబానికి అండగా నిలిచాడు. 18 రోజులు పూర్తిగా మాకు సేవలందించాడు.. వంట సామాగ్రి తెచ్చిచ్చాడు. ప్రతి రోజు బిందెలతో తాగునీరు కూడా అందించాడు. ఎవరూ మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు. అటువంటి సమయంలో మా ప్రాణాలను రక్షించింది మా గ్రామ వలంటీరే. – నారాయణప్ప, తాళ్లపల్లి, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా వలంటీర్ వల్లే ఇంటి స్థలం వచ్చింది మాకు సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటూ అవస్థలు పడుతున్నాం. గత ప్రభుత్వంలో ఇంటిస్థలం కోసం అనేకమార్లు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఆర్.మహేష్ మా ఇంటికి వచ్చి ఇంటిస్థలానికి దరఖాస్తు చేయించారు. అధికారులు ఇంటిస్థలం మంజూరు చేశారు. రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం సమీపంలోని అడుసుపాళెం జగనన్న కాలనీలో ఇప్పుడు మేం ఇల్లు నిర్మించుకుంటున్నాం. వలంటీర్ వ్యవస్థ వల్ల నేను ఏ నాయకుని చుట్టూ తిరగకపోయినా, అర్హతను బట్టి ఇంటిస్థలం ఇచ్చారు. – లక్ష్మీపార్వతి, రేణుగుంట, తిరుపతి జిల్లా ఆస్తులన్నీ కరిగిపోయినా... నా పేరు మారంరెడ్డి సుబ్బారావు. నా కుడికాలు, కుడి చేతికి పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా కొండపిలో నలుగురిని యాచిస్తూ జీవిస్తున్నాను. మా గ్రామ వలంటీర్ మారంరెడ్డి గంగాధర్ సహకారంతో నాకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్ వచ్చింది. ప్రస్తుతం నాకు పింఛను వచ్చేటట్లు చేశాడు. ప్రతి నెలా కొండపి వచ్చి నాకు పింఛను అందిస్తున్నాడు. గ్రామ వలంటీర్ వ్యవస్థ వలన నాకు ఎంతో మేలు జరిగింది. – మారంరెడ్డి సుబ్బారావు, పీరాపురం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా కష్టకాలంలో కన్నబిడ్డలా చూసుకుంది నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇద్దరికి పెళ్లి చేశాం. నేను, నా భర్త ఇద్దరమే ఉంటున్నాం. నాకు కరోనా సోకడంతో మాట్లాడేందుకు అందరూ భయపడ్డారు. మా వలంటీర్ తాడువాయి శ్వేత ధైర్యంగా మా ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకుంది. మందులు ఇచ్చింది. కరోనా సోకిన మూడు రోజుల తర్వాత నాకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో నన్ను నరసరావుపేటలోని క్వారెంౖటెన్ సెంటర్‌కు పంపించింది. ఇంటి వద్ద ఉన్న నా భర్తకు కూరగాయలు, సరుకులు, పాలు వంటివి అందించింది. కోలుకుని ఇంటికి వచ్చే వరకు మమ్మల్ని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న వలంటీర్ శ్వేత సేవలను ఎప్పటికీ మరిచిపోలేను. – ఊటా అచ్చమ్మ, ముప్పాళ్ల, పల్నాడు జిల్లా డోలీ మోసి ప్రాణం నిలిపాడు మాది మారుమూల గిరిజన గ్రామం. నేను గత ఏడాది డిసెంబర్లో చెట్టు నుంచి జారి కిందపడిపోయాను. తలకు తీవ్రగాయమై రక్తం అధికంగా పోయింది. బుడపనస గ్రామం నుంచి ప్రధాన రహదారి రంగబయలు వరకు సరైన రహదారి లేకపోవడంతో మా గ్రామ వలంటీర్ రాము మూడు కిలోమీటర్లు గ్రామస్తుల సాయంతో అడవి మార్గంలో మోసుకుని వచ్చాడు. అక్కడ నుంచి 108కి ఫోన్ చేసి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకువెళ్లాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందించాడు. లేకుంటే నేను చనిపోయి ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఖర్చుల నిమిత్తం వలంటీర్ రాము రూ.5 వేలు ఆర్థికసాయం చేశాడు. ఆరోజు ఆస్పత్రికి సకాలంలో తరలించడం వల్ల ఈ ప్రాణాలతో ఉన్నాను. – పాంగి అనుసు, బుడపనస, అల్లూరి సీతారామరాజు జిల్లా నేనున్నానంటూ.. 2021 మే నెలలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరా జుపల్లిలో పేద దంపతులు నాగరాజు, నాగలక్ష్మమ్మ దంపతులకు కష్టమొచ్చింది. వీరి కుమార్తె సుమలత (9)కు తీవ్రజ్వరం 20 రోజులు తగ్గలేదు. హిమోగ్లోబిన్ 1.5కి పడిపోయింది. చనిపోతుందని భావించి ఇంటి బయట పడుకోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ ప్రసాద్ అప్పటి ఎంపీడీవో నరేష్‌కృష్ణకు సమాచారం అందించారు. బాలికను సొంత ఆటోలో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 15 రోజుల పాటు ఇతరుల నుంచి రక్తం ఇప్పించి బాలికకు చికిత్సలో సహాయపడ్డారు. ఆ అమ్మాయి కోలుకుని ఇంటికి చేరుకుంది. అయితే.. ఐదునెలలకే ఆ బాలిక చనిపోయినప్పటికీ.. వలంటీర్ ప్రసాద్ అందించిన సేవలు మాత్రం గ్రామస్తులకు గుర్తుండిపోయాయి. ప్రసాద్ సేవలను ప్రశంసిస్తూ అప్పట్లో పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. ప్రాణాలు కాపాడారు ఈ ఫొటోలో కూరగాయలు ఇస్తున్న యువకులు వలంటీర్లు. కూరగాయలు అందుకుంటున్న వ్యక్తి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం అప్పల అగ్రహారం గ్రామానికి చెందిన కొమనబల్లి సన్యాసిరావు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో సన్యాసిరావు, రమణమ్మ దంపతులు మాత్రమే ఇంటివద్ద ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుమారుడు ఆ సమయంలో ఇంటికి రాలేకపోయాడు. తాము అసలు బతుకుతామా?లేదా? అనుకున్న సమయంలో వలంటీర్లు వీరికి వెన్నుదన్నుగా నిలిచారు. కూరగాయలు వంటివి ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడంతోపాటు వారి కుమారుడిని రప్పించి, కోవిడ్ షెల్టర్‌లో ఉంచి అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కష్టకాలం నుంచి సన్యాసిరావును, అతడి కుటుంబాన్ని గట్టెక్కించారు. వలంటీర్‌కు రుణపడి ఉంటా ఈ ఫొటోలో బెడ్‌పై చికిత్స పొందుతున్న వ్యక్తి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన దూసనపూడి వెంకటేశ్వరరావు. ప్రతి నెల ఒకటో తేదీన వలంటీర్ ద్వారా ఇంటివద్దే పింఛను సొమ్ము అందుకుంటున్న ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో విజయవాడ ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ నెల పింఛను అందదేమో అనుకున్నారు. కానీ.. వలంటీర్ కత్తుల వెంకటశ్రీలక్ష్మి సేవాభావంతో ఆమె సొంత ఖర్చులతో విజయవాడ వెళ్లి వెంకటేశ్వరరావుకు పింఛను అందజేశారు. వలంటీర్లు లేకుంటే తనలాంటి వారి గతేమవుతుందని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. దేవుళ్ల వంటి వలంటీర్లను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా కష్టంలో అండగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కరోనా కాలంలో ఒక కుటుంబానికి అండగా నిలిచారు వలంటీరు తమ్మిశెట్టి యలమందరావు. ఆరోగ్యం ఎలా ఉందని అడగడానికి కూడా ఎవరూ సాహసించని సమయంలో చల్లా లక్ష్మి కుటుంబానికి ధైర్యం చెప్పి బతుకుపై ఆశ కలిగించారు. చల్లా లక్ష్మి.. డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో.. 2019లో కరోనా బారిన పడింది. ఇరుగుపొరుగు వారు, బంధువులు, తోబుట్టువులు కూడా వారి ఇంటికి వెళ్లలేదు. మాట్లాడేందుకు కూడా ఎవరూ రాని ఆ సమయంలో లక్ష్మిని బతుకు భయం వెంటాడింది. ఆయాసంతో బాధపడుతున్న తనకు ఏమైనా అయితే పిల్లల భవిష్యత్తు ఏమిటనే ఆందోళనకు గురైంది. ఆ సమయంలో ఆ కుటుంబానికి వలంటీర్ తమ్మిశెట్టి యలమందరావు అండగా నిలిచారు. ధైర్యంగా వారి ఇంటికి వెళ్లి కరోనా గురించి ఆందోళన చెందవద్దని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన మందుల కిట్లు, పౌష్టికాహారం అందజేశారు. రోజూ ఆమె ఆరోగ్యం గురించి కనుక్కున్నారు. క్రమంగా లక్ష్మి కోలుకుంది. తమ కుటుంబం ఇప్పుడు ఆనందంగా జీవిస్తోందంటే వలంటీరు సేవలే కారణమని ఆమె సంతోషంగా చెబుతోంది. అంతిమంలోను అండగా.. కరోనా విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లిలో వలంటీర్లు మోర్త రవి, స్వామిరెడ్డి శివకామేశ్వరరావు, విజ్జపురెడ్డి నాగేంద్ర. 2021 మే నెల 3వ తేదీ గ్రామంలో తలాటం కొండయ్య కరోనాతో మృతిచెందాడు. అతడి బంధువులకు కరోనా సోకడంతో.. కొండయ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు వారు వచ్చే వీలు లేకపోయింది. ఇతరులు కూడా భయపడి ముందుకు రాలేదు. మృతదేహం ఉదయం నుంచి సాయంత్రం ఇంటి వద్దే ఉండిపోయింది. వలంటీర్లు వెంటనే పీపీఈ కిట్లు తెప్పించుకుని కొండయ్య మృతదేహాన్ని పంచాయతీ రిక్షాపై మరుభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. సేవకు ప్రతిరూపం కరోనా సమయంలోను భయపడకుండా కరోనా బాధితులకు ప్రభుత్వ సాయాన్ని పంపిణీ చేయడ మేగాక అవసరమైన నిత్యావసరాలను కూడా అందించిన ఈమె వలంటీరు రేణుకాదేవి. తిరుపతి అర్బన్ మండలం 47వ డివిజన్ ఎర్రమెట్ట ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మీదేవి భర్త, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. 2020లో లక్ష్మీదేవికి కరోనా సోకడంతో ఇంట్లోనే వేరే గదిలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో వలంటీర్ రేణుకాదేవి ఏఎన్ఎం ద్వారా లక్ష్మీదేవి కుటుంబ సభ్యులకు ఇంటివద్దే కోవిడ్ పరీక్షలు చేయించారు. ప్రభుత్వం అందించినరూ.వెయ్యి సాయాన్ని ధైర్యంగా లక్ష్మీదేవి ఇంటికెళ్లి అందజేశారు. రోజు ఆమె ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీశారు. ఆ కుటుంబ సభ్యులకు అవసరమైన సరుకులను కూడా తీసుకెళ్లి అందజేశారు. బెంగళూరు వెళ్లి.. ఈకేవైసీ కరోనా విజృంభనకు ముందు కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు కర్ణాటకలోని బెంగళూరుకు వలసవెళ్లాయి. కరోనా పెరిగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఆ కుటుంబాలు మూడునెలలు అక్కడే ఉండిపోవడంతో రైస్‌కార్డుల అప్డేట్కు ఈకేవైసీ అవసరమైంది. దీంతో వలంటీర్ శంకర్.. బెంగళూరు వెళ్లాడు. ఆంక్షలను అధిగమించి దాదాపు 400 కుటుంబాలకు అక్కడే ఈకేవైసీ పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, ఆదోని, కోసిగి ప్రాంతాల వాళ్లను కలుసుకుని ఈకేవైసీ పూర్తిచేశాడు. సేవ చేసేందుకే మేము.. ఇతడి పేరు వల్లెపు వెంకటేశ్వరరావు. దివ్యాంగుడు. బాపట్ల జిల్లా అద్దంకి మౌలానగర్ నివాసి. 2021 ఆగస్ట్‌లో ఇంట్లో వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. వెంకటేశ్వరరావుకు కూడా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో మేదరమెట్ల వైద్యశాలలో చేరాడు. బజారులో తిరగడానికే భయపడుతున్న సమయంలో.. వారి వార్డు వలంటీరు సైదా మేదరమెట్ల వైద్యశాలకు వెళ్లి వెంకటేశ్వరరావుకు వికలాంగ పింఛన్ రూ.3 వేలు అందించాడు. దీంతో వెంకటేశ్వరరావు తండ్రి ఇలాంటి సమయంలో మా దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చావని సంతోషిస్తూ అందులో సగం డబ్బు వలంటీరుకు ఇవ్వబోయాడు. ‘మేము సేవ చేయడానికే ఉన్నాం. ఇది మాకు జగన్ ఇచ్చిన వరం. మాకు ఏమీ వద్దు..’ అంటూ సైదా తిరస్కరించాడు. దీంతో అందరూ సైదాను అభినందించారు. మాస్కులు లేని వారికి ఉచితంగా మాస్కులు పంచడం వంటి సేవలు కూడా చేసిన సైదా అందరి ప్రశంసలు అందుకున్నాడు. పరిశుభ్రతలో.. ఇక్కడ రిక్షా తొక్కుతూ బ్లీచింగ్ చల్లుతున్న వారు పారిశుద్ధ్య కార్మికులు కాదు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వలంటీర్లు దట్టి బాలకృష్ణ, సంతోష్‌కుమార్, యోగేశ్వరరావు, రాజరాజేశ్వరి. 2020 మే 26వ తేదీ నాటిది ఈ చిత్రం. కోవిడ్ కాలంలో ప్రజలు బయటకు రావడానికి వణికిపోయారు. శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి భయపడటంతో ఆ పనుల్ని కూడా ఈ నలుగురు భుజానికెత్తుకున్నారు. స్వచ్ఛ భారత్ వాహనాన్ని తీసుకుని వీధుల్లో బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. దట్టి బాలకృష్ణ రిక్షా తొక్కగా సంతోష్‌కుమార్, యోగేశ్వరరావు, రాజరాజేశ్వరి బ్లీచింగ్ చేతపట్టుకుని వీధివీధిన చల్లారు. ట్రాన్స్ఫార్మర్ను భుజాలపై వేసుకుని కొండలెక్కి.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని చలిసింగం గ్రామం రెండు కొండల అవతల ఉంది. ఆ గ్రామంలో తాగునీటి సదుపాయం కోసం చీకాయపాడు బోరుబావి నుంచి కొండపైకి పైపులైన్ వేశారు. గత ఏడాది ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో దానికి అమర్చిన మోటారు పనిచేయక నీటి సరఫరా నిలిచిపోయి తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రాన్స్‌కో సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ను రహదారి ఉన్న చీకాయపాడు వరకు తేగలిగారు. అక్కడి నుంచి కొండపైకి చేర్చే మార్గం లేక అక్కడే వదిలేశారు. ఎవరూ రాకపోవడంతో రెండురోజులు అక్కడే ఉండిపోయింది. దీంతో గ్రామ వలంటీర్లు వంజరి రవీంద్ర, కూడ రవి, తుర్రె రవి, ఒంపురి రాజు, సబ్బారపు రమణ నడుం బిగించారు. బలమైన కర్రల సహాయంతో ట్రాన్స్ఫార్మర్ను భుజాలపైకి ఎత్తుకుని అతి కష్టంపై రెండు కొండలెక్కారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించి తాగునీటి ఇబ్బందులు తొలగించారు. -
రచ్చబండ: ఇదే స్ఫూర్తి.. ప్రజల పక్షాన సాక్షి..
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. ప్రజాతీర్పే అంతిమం.. ప్రభుత్వాలైనా.. రాజకీయ పార్టీలైనా ప్రజాభిప్రాయానికి తలవంచాల్సిందే.. ప్రజల అభిమతం తెలుసుకొని మసులుకోవాల్సిందే.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ఎజెండా కావాలి.. ప్రజాభివృద్ధే రాజకీయ పార్టీల జెండాగా ఎగరాలి.. ఇదే స్ఫూర్తితో సాక్షి ప్రజల పక్షాన నిలబడింది. ప్రజా గొంతుకై సాక్షి పోరాడుతోంది.. ప్రజాకోర్టులో నాయకులను నిలబెడుతుంది.. ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది.. రచ్చబండ వేదికగా ప్రజాభిప్రాయాన్ని వినిపిస్తుంది రచ్చబండ… ప్రతి శనివారం రాత్రి 7.30గంటలకు తిరిగి ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు -
విజయనిర్మల ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న శరణ్
శరణ్‌కుమార్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సాక్షి’. జాన్వీర్ కౌర్ హీరోయిన్. శివకేశన కుర్తి దర్శకత్వంలో ఆర్యూ రెడ్డి, బేబీ లాలిత్య సమర్పణలో మునగాల సుధాకర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– 'విజయనిర్మలగారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, శరణ్తోపాటు చిత్ర యూనిట్‌కి మంచి పేరు రావాలి' అన్నారు. 'సాక్షి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది' అన్నారు శరణ్. 'యూనిట్ సభ్యులందరూ బాగా సహకరించారు' అన్నారు శివ. 'ప్రేక్షకులు మా చిత్రాన్ని విజయవంతం చేయాలి' అన్నారు సుధాకర్‌రెడ్డి, ఆర్యూ రెడ్డి. -
‘‘అబ్బో వందేభారత్‌లు.. ఎవరి కోసమండీ?’’
ఢిల్లీ: కోట్లు ఖర్చు చేసి వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తూ.. ఘనంగా చాటింపు వేసుకుంటారు. కానీ, సాధారణ ప్రయాణికులు తిరిగే రైల్వే స్టేషన్లలోనే కనీస వసతులు ఉండవు. ఐదు లక్షల మందికి కనీసం ఒక ఆంబులెన్స్ ఉండదా?.. ఏదైనా జరిగి ప్రాణం పోయినప్పుడు డబ్బులిస్తే సరిపోతుందా?. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారకులకు శిక్ష పడాల్సిన అవసరం ఉండదా?.. ఇదెక్కడి న్యాయం?.. ఢిల్లీకి చెందిన లోకేష్ కుమార్ చోప్రా ఆవేదన ఇది.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆదివారం సాక్షి ఆహూజా(34) అనే మహిళ కరెంట్ షాక్‌తో ప్రాణం కోల్పోయింది. అంతా చూస్తుండగానే విద్యుత్ ఘాతానికి గురైన ఆమెకు చికిత్స అందించడానికి అక్కడ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. సమయానికి కరెంట్ ఆఫ్ చేసి ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా చికిత్స కోసం దాదాపు 40 నిమిషాల తర్వాత ఆంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. ► దేశ రాజధానిలో నిత్యం కనీసం ఐదు లక్షల మంది తిరిగే ఆ రైల్వే స్టేషన్లో డాక్టర్లు, ఆంబులెన్స్‌ల మాటెరుగు.. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేదంట!. ► హైక్వాలిటీ రైళ్లంటూ కోట్లు ఖర్చుచేసి వందేభారత్ రైళ్లను తయారు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ, లక్షల మంది తిరిగే స్టేషన్లలో కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది మాత్రం చూడం!. అంతా చూస్తుండగానే.. నా కూతురి ప్రాణం పోయింది. ఘటనపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు మాకు చెప్పారు. కానీ, ఇంతవరకు ఏదీ ముందుకు జరగలేదు. ప్రభుత్వాలు జనాలకు కొత్తగా ఏం అక్కర్లేదు.. ఉన్నంతలో సౌకర్యాలను ప్రజలకు మెరుగ్గా అందిస్తే సరిపోతుంది కదా?. గొప్పలను మాత్రమే మీడియాలో ఎందుకు చూపించుకుంటారు? ఇలాంటి వాటి విషయంలోనూ స్పందించాలి కదా అని ప్రభుత్వాల్ని ఆ తండ్రి ఆవేదనభరితంగా నిలదీస్తున్నారు. ► బాధితురాలి తండ్రిగా డబ్బు అందుకునేందుకు నేను సిద్ధంగా లేను. నాకు కావాల్సింది న్యాయం. దీనికి కారకులను కఠినంగా శిక్షించాలి అంతే.. అని లోకేష్ చోప్రా డిమాండ్ చేస్తున్నారు. ► ఢిల్లీ రైల్వేస్టేషన్లో గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందట. దానిపై ఫిర్యాదులు వెళ్లినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ పని చేసే కూలీలు చెబుతున్నారు. ► ఈస్ట్ ఢిల్లీ ప్రీత్ విహార్‌లో టీచర్‌గా పని చేస్తున్న సాక్షి అహూజా తన పిల్లలు, సోదరి కుటుంబంతో కలిసి ఛండీగఢ్ వెళ్లే క్రమంలో ఆదివారం వేకువఝామున ఢిల్లీ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే.. స్టేషన్ ఎగ్జిట్ వద్ద నిలిచిన నీటి గుంత నుంచి తప్పుకునే క్రమంలో ఆమె అక్కడే ఉన్న ఓ పోల్‌ను తాకారు. అయితే అప్పటికే అక్కడ తెగిపడి ఉన్న వైర్లు ఆమెను లాగేసి.. విద్యుత్ ఘాతంతో ఆమె విలవిలలాడిపోయారరు. ఆ సమయంలో ఆమె ఇద్దరు పిల్లలూ ఆమె కూడా ఉండగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ► ఆమె సోదరి, అప్పటికే లగేజ్ తీసుకుని లోపలికి వచ్చిన ఆమె తండ్రి.. ఆ దృశ్యాలను చూసి సాయం కోసం కేకలు వేశారు. కరెంట్ షాక్‌తో కొన్ని నిమిషాలు విలవిలలాడిపోయి ఆమె కిందపడిపోయారు. దాదాపు 30-40 నిమిషాలపాటు ఆమె అలాగే స్పృహ లేకుండా పడి ఉండిపోగా.. అప్పుడు ఆంబులెన్స వచ్చి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటనపై భారతీయ రైల్వేస్ విచారం వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఓ కమిటీ నియమిస్తున్నట్లు తెలిపింది. ఇక ఘటన సమయంలో ఆమె సోదరి మాధవి కూడా వెంట ఉండగా.. వెంటనే ఆమె విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు సైతం నమోదు అయ్యింది. సాక్షి మరణం తర్వాత ఢిల్లీ అధికారులు అక్కడి కరెంట్ పోల్స్‌కు మరమ్మత్తులు చేపడుతుండడం గమనార్హం. #RailwayStation पर #SakshiAhuja की मौत ने उठाए 'सिस्टम' पर सवाल सब्सक्राइब करें #TimesNowNavbharat👉 https://t.co/ogFsKfs8b9#TimesNowNavbharatOriginals #TNNOriginals #DelhiNews pic.twitter.com/HCDMyLfvWd — Times Now Navbharat (@TNNavbharat) June 26, 2023 Video Credits: Times Now Navbharat ఇదీ చదవండి: భార్యను చదివించిన భర్త.. ఆమె మాత్రం మరో వ్యక్తితో.. -
వయసు 18 వృత్తి పైలెట్
సాక్షి కొచ్చర్‌కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి. మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం. పదేళ్ల వయసు నుంచే సాక్షి కొచ్చర్‌ది హిమాచల్ ప్రదేశ్‌కు ముఖద్వారం వంటిదైన పర్వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్‌కు ఫుట్‌వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ్ర΄ోత్సహిస్తూ వచ్చాడు. ‘పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చె΄్పాను. అయితే నాకు కామర్స్ లైన్లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను’ అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదవింది సాక్షి. ఈ క్లబ్‌లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది. 70 లక్షల ఖర్చు అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్‌లో పాల్గొంది. ‘ఇన్స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్‌లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి ΄ోతుంది’ అని చెప్పింది సాక్షి. ‘అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను’ అని తెలిపింది సాక్షి. పైలెట్‌గా ఉద్యోగం ‘మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్‌గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను’ అంది సాక్షి. ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ. -
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు
-
టాప్ 30 హెడ్ లైన్స్..!
-
మారుమూల గ్రామాలకు 4జి సేవలు ప్రారంభించిన సీఎం జగన్
-
స్థిరమైన నిధులతోనే శాస్త్రీయ ప్రగతి
సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. కోవిడ్-19 టీకా, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశాబ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. హింగోలి మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని జిల్లా కేంద్రం. 1948 వరకూ హైదరాబాద్ నిజాం రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని మిలిటరీ కేంద్రంగానూ వాడుకునేవారు. తాజాగా ఈ జిల్లాకు సరికొత్త గుర్తింపు లభిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టు ‘లేజర్ ఇంటెర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’కు కేంద్రంగా ఇది అవతరించనుంది. ఈ మహా భౌతిక శాస్త్ర ప్రయోగ శాల కాస్మిక్ గ్రావిటేషనల్ వేవ్స్‌ను గుర్తించేందుకు ఉద్దేశించింది. ఇలాంటివే అమెరికాలోని హాన్ఫర్డ్, లివింగ్‌స్టోన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మరోరెండు ఇటలీ, జపాన్లలో ఉన్నాయి. 2030 నాటికి హింగోలి లోనూ ఈ వేధశాల నిర్మాణం పూర్తయితే ప్రపంచవ్యాప్త నెట్వర్క్ సంపూర్ణమవుతుంది. నాలుగు కిలోమీటర్ల పొడవైన భుజాల్లాంటి నిర్మాణాలు... ఎల్ ఆకారంలోని ఇంటర్ఫెరోమీటర్లతో కూడిన ఈ ప్రయోగశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదా¯Œ లో నేషనల్ టెక్నాలజీ డే సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఆన్లైన్లో రూ.1,200 కోట్ల విలువైన హింగోలి లిగో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మ కమైన ఈ ప్రాజెక్టును భారత్ చేపట్టడం హర్షణీయమైన విషయమై నప్పటికీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు, మౌలిక శాస్త్ర పరిశోధనల విషయంలో భారత్ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని సమీక్షించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. ఎంత ‘వేగం’గా సాగుతున్నాయంటే... లిగో ప్రాజెక్టు ఆలోచనలకు బీజం పడ్డది 2009 లోనే. భారతీయ శాస్త్ర పరిశోధన సంస్థలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కలిసికట్టుగా గ్రావిటేషనల్ వేవ్స్‌పై పరిశోధనలు చేస్తూండేవారు. ఆ క్రమంలోనే భారత్‌లో గ్రావిటేషనల్ వేవ్స్ వేధశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టింది. రెండేళ్ల తరువాత అమెరికాలోని లిగో పరిశోధనశాల తమ పరిశోధనల్లో భాగం కావాలని భారత శాస్త్రవేత్తలకు ఆహ్వానం పలికింది. ఆ ఏడాదే భారత శాస్త్రవేత్తలు విస్తృత చర్చల తరువాత ఇండియన్ లిగో ఏర్పాటుకు సంబంధించి, భారత అణుశక్తి విభాగానికి ఒక ప్రతిపాదన చేశారు. 2012లో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పచ్చజెండా ఊపుతూ ఓ కమిటీ నిధులు కేటాయించాల్సిందిగా అభ్యర్థించింది. నాలుగేళ్లు వివిధ ప్రభుత్వ విభాగాలకు చక్కర్లు కొట్టిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి 2016లో ‘సూత్రప్రాయ అంగీకారం’ తెలిపింది. ఆ తరువాత సుమారు ఏడేళ్ల నిరీక్షణ తరువాత ఈ ప్రాజె క్టుకు తుది అనుమతులు లభించాయి. దేశంలో సైన్స్ ప్రాజెక్టులు ఎంత ‘వేగంగా’ అమలవుతాయో తెలిపేందుకు ఈ ఉదాహరణ చాలు. హింగోలి ప్రాజెక్టు అమల్లో జరిగిన జాప్యం ఇంకో విషయాన్నీ గుర్తు చేస్తుంది. దేశంలో పరిశోధనల కోసం కేటాయిస్తున్న నిధుల్లో పెరుగుదల లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది. స్థూల జాతీయోత్పత్తిలో పరిశోధనలకు (ఆర్ అండ్ డీ) కేటాయించిన నిధులు దశాబ్ద కాలంగా కేవలం 0.7 శాతం మాత్రమేనని నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఈ మోతాదు బ్రెజిల్ (1.6 శాతం), దక్షిణాఫ్రికా (0.83) కంటే తక్కువ కావడం గమనార్హం. పొరుగు దేశం చైనా తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 2.14 శాతం ‘ఆర్ అండ్ డీ’కి కేటాయిస్తోంది. కేటాయింపులు అత్యల్పంగా ఉంటే పరిశోధనా రంగంలో పురోగతి సాధ్యం కాదని నీతి ఆయోగ్ తన నివేదికలో విస్పష్టంగా తెలిపింది. లక్ష్యాలూ అస్పష్టమే... 2013లో భారత్ తన ‘ద సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్’ పాలసీలో 2020 నాటికల్లా శాస్త్ర పరిశోధనల రంగంలో టాప్–5లోకి చేరాలని సంకల్పం చెప్పుకొంది. తొమ్మిదేళ్ల తరువాత ఇదే పాలసీని ఆధునికీకరించారు. 2030 నాటికి నాణ్యమైన పరిశోధన ఫలితాలు సాధించే టాప్–5 దేశాల్లోకి భారత్ చేరాలన్న అస్పష్ట లక్ష్యం గురించి ఈ విధానంలో పేర్కొన్నారు. పదాలతో గారడీ చేయడం కంటే పరిశోధనలకు స్థిరంగా నిధులు కేటాయించడం మేలన్న విషయం మన విధాన నిర్ణేతలకు అర్థం కావడం లేదు. ఇటీవలి కాలంలో కోవిడ్–19 టీకా తయారీలో సాధించిన విజయం, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకే తిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే అన్నది విస్మరించరాదు. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశా బ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. కోవిడ్ టీకా, జెనెరిక్ మందుల అభివృద్ధినే తీసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలాకాలం క్రితమే మందులు, టీకాల తయారీ, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అవస రమైన అన్ని ఏర్పాట్లూ చేశాయి. ఈ ఏర్పాట్లు 1970 నుంచి ప్రైవేట్ రంగం ఎదుగుదలకు పునాదిగా నిలిచాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ వంటివి భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ వంటి సంస్థలకు తొలినాళ్ల నుంచి అండదండగా నిలిచాయి. ప్రైవేట్ రంగంలోని టీకా తయారీ కంపెనీలకు వందల కోట్ల నిధులు అందించారు కూడా. సుమారు 30 – 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు కోవిడ్ మహమ్మారి దాడి చేసిన వెంటనే అక్కరకు వచ్చాయి. ఐటీ రంగానికీ ఇది వర్తిస్తుంది. కంప్యూటర్ సైన్స్, గణిత, భౌతిక శాస్త్రాల్లో పరిశోధ నల ఫలితంగానే ఐటీ రంగం వృద్ధి చెందింది. అల్గారిథమ్స్, ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ నెట్వర్కింగ్ రంగాల్లో జరిగిన మౌలిక పరిశోధనలే కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల అభివృద్ధికి కారణ మయ్యాయి. భారతీయ విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్ విద్యా బోధనకు దేశం చాలా ముందుగానే పెట్టుబడులు పెట్టింది. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలు (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలని ఇప్పుడు పిలుస్తున్నారు), తరువాతి కాలంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. ప్రభుత్వ రంగంలో పెట్టిన ఈ పెట్టు బడుల ఫలితాలను ప్రైవేట్ రంగమూ పొందింది. ఆ క్రమంలోనే సరి కొత్త డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధికి దారితీసింది. ప్రస్తుత డిజిటల్ విప్లవం వెనుక ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్లు అభివృద్ధి చేసిన ఈ–గవర్నెన్స్, ఇతర డిజిటల్ అప్లికేషన్ల భూమికను విస్మరించలేము. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. దిగుమతి చేసుకున్న హార్ట్‌వేర్, విజ్ఞానంతో టెక్నలాజి కల్ అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల మనం ఇతరులపై ఆధారపడే స్థితి వస్తుంది. మౌలిక రంగ పరిశోధలు ఎన్నో రకాల ఇతర ప్రయోజనాలు అందిస్తాయి. పారిశ్రామిక, సామాజిక లాభాలూ ఒన గూరుతాయి. సర్వవ్యాప్తమైన డిజిటల్ కెమెరా, మెడికల్ ఇమేజింగ్, ఇంటర్నెట్లన్నీ ఇందుకు ఉదాహరణలు. వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి అతి సంక్లిష్టమైన ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారానికీ మౌలిక పరిశోధనలే ఆధారం. రేపటి తరం టెక్నాలజీల కోసం ఈ రోజే సైన్స్ పై పెట్టుబడులు పెట్టడం అవశ్యం. దినేశ్.సి శర్మ - వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆకట్టుకుంటున్న ‘సాక్షి’ టీజర్
సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో శరణ్ కుమార్ నటిస్తున్న సినిమా సాక్షి . శివ కేశన కుర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్.. సరికొత్తగా అప్ డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ప్రముఖ ఇన్ఫ్లూఎన్సర్స్ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు. ఒక నిమిషం 9 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో ఆసక్తికర సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ చూపించారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త హీరో శరణ్ కుమార్ ఫైట్ సీన్స్ ఇరగ దీశారని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. చిత్రంలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌గా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లేటు మ్యారేజీలతో రెండో సంతానం అసాధ్యమవుతోంది
పెళ్లి సంబంధం కుదరడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. పరిచయ వేదికలు, పేరయ్యలు, బంధువర్గమంతా గాలించినా సరైన జోడీ కుదరక నానా తంటాలు పడుతున్నారు. అమ్మాయికి గరిష్టంగా 25 ఏళ్లకైనా కావాల్సిన పెళ్లి వాయిదాల పర్వంతో 30 దాటుతోంది. లేటు మ్యారేజీల వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈడూజోడు కుదిరి పాతికేళ్ల వయసు దాటకుండా పెళ్లయితే ఆరోగ్య వంతులైన పిల్లలు పుడతారు. కానీ అబ్బాయికి 35, అమ్మాయికి 30 దాటాక పిల్లలు కనడం అతి పెద్ద ఇబ్బంది అయ్యింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒకప్పుడు వధూవరుల ఎంపికలో పెద్ద పట్టింపులు లేవు. ఇప్పుడేమో పట్టిపట్టి చూస్తున్నారు. జాతకాలు కలవాలి. చదువు, ఉద్యోగంలో అమ్మాయిల స్థాయిని చూస్తున్నారు. అన్నీ కుదిరినా జాతకం కుదరకపోతే చివరి నిమిషంలో సంబంధం రద్దు చేసుకుంటున్నారు. ఒకవేళ జాతకం కుదిరినా అబ్బాయి తరఫు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నా.. మంచి ఉద్యోగం ఉండి ఆస్తి లేకపోయినా అమ్మాయిలు ఒప్పుకోవడం లేదు. ఇలా రకరకాల సమస్యలతో 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు తదనంతరమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఏటా 55 వేలకు పైగా పెళ్లిళ్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 55వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుండగా.. అందులో 30 శాతం లేటు మ్యారేజీలే. ఇందులో ఎక్కువగా స్థాయికి తగ్గట్టు సంబంధాలు కుదరకపోవడమే. అన్నిటికీ మించి లేటు మ్యారేజీల కారణంగా హార్మోన్ల సమతుల్యత లోపించి రకరకాల గర్భకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మగవాళ్లలో సైతం ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా యుక్తవయసులోనే డయాబెటిక్, హైపర్‌టెన్షన్ సమస్యలు ఎదుర్కొని లైంగిక సమస్యలతో సంతానానికి నోచుకోలేకపోతున్నారు. అసలే సమస్యలు.. ఆపై గ్యాప్ పెళ్లిళ్లు కావడమే జాప్యం జరుగుతూ ఉంటే వీరిలో 70 శాతం మంది వెంటనే బిడ్డలు పుట్టకుండా ఓరల్పిల్స్ తీసుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో 40 ఏళ్లు సమీపిస్తున్న వేళ తొలి కాన్పు అవుతోంది. ఇక రెండో కాన్పునకు అవకాశమే లేకుండా పోతోంది. ఈ కారణాలతో జిల్లాలో జనన రేటు గణనీయంగా పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక జంట సగటున ఇద్దరిని కనాలి..అలాంటి ఈ రేషియో 1.7కు పడిపోయింది. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే ప్రమాదముంది. రెండో బిడ్డకు ఇబ్బంది 28 ఏళ్ల లోపు పిల్లలు పుట్టడం పూర్తి కావాలి. కానీ పెళ్లే 30 ఏళ్ల తర్వాత అంటే మొదటి బిడ్డకే ఆగిపోవాల్సి వస్తుంది. చాలామంది పెళ్లవగానే రెండుమూడేళ్లు బిడ్డలు పుట్టకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వివాహం లేటు వయసులో చేసుకోవడం వల్ల ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి)లో సమస్యలు తలెత్తుతున్నాయి. యుక్తవయసులో పెళ్లి చేసుకుంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. – డాక్టర్ వినూత్న, గైనకాలజిస్ట్ విలాస జీవితం.. జాతకాల పిచ్చి బాగా డబ్బుండాలి.. ప్యాకేజీ ఉండాలి.. విలాసవంతమైన జీవితం.. ఇవన్నీ ఇప్పుడు కీలకమయ్యాయి. వీటికి తోడు జాతకాల పిచ్చి ఎక్కువైంది. ఇవన్నీ సరిపోయే అబ్బాయి లేదా అమ్మాయి కావాలంటే ఏళ్ల తరబడి వెతకాల్సిందే. దీంతో వివాహం తీవ్ర జాప్యం అవుతోంది. జీవితంలో సెటిల్ కావడం అనే అర్థమే మారిపోయింది. –సత్యనారాయణ, విశ్రాంత ఉద్యోగి -
ఇవా పెరోన్ బాటలో ఏపీ
దాతృత్వం పేదల నుంచి సంపన్నులను ఎడంగా ఉంచుతుంది. సహాయం పేద లను సంపన్నులతో సమస్థాయికి పెంచు తుంది. – ఇవా పెరోన్, అర్జెంటీనా దివంగత ప్రథమ మహిళ మే 7 ఇవా పెరోన్ జయంతి. తన జన్మభూమిలోనే కాక, ప్రపంచంలో ఆకలి, పేదరికం, అనారోగ్యం మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రతి మూలలోనూ ఈనాటికీ ఆమె భావాలు ఆమెను కారణజన్మురాలిని చేస్తూనే ఉన్నాయి. జీవితపు కనీసావసరాలకు పరిష్కారం చూపే నాయకులు లేనప్పుడు భారీస్థాయిలో ఆర్థిక అసమానతలు ఏర్పడతాయని నమ్మినవారు ఇవా పెరోన్. శ్రామిక వర్గాల గౌరవాన్ని పొందిన ‘అర్జెంటీనా ఆధ్యాత్మిక నాయకురాలు’గా ఆమె ప్రసిద్ధి చెందారు. మానవీయమైన ఆర్థిక సమానత్వ సాధనకు అంకిత భావంతో పని చేసినందుకే ఆమెకు ఆ పేరు వచ్చి ఉంటుందని నా భావన. ఎందుకంటే అవసరంలో ఉన్న వారి తక్షణ కష్టాలను అర్థం చేసుకోడానికి మనలో ఆధ్యా త్మికమైన బాధ్యత ఉండాలి. అదొక రోజువారీ పనిలానో, వేష ధారణలానో ఉండకూడదు. ఇవా దీనిని అర్థం చేసుకున్నారు. ఆచరణలో పెట్టారు. భవిష్యత్ సంరక్షణ అనే ముసుగులో నాయకులుగా చలా మణీ అవుతున్నవారు.. ఆసరాతో ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు పాటుపడుతున్న నిజమైన నాయకులపై దుష్ప్రచారానికి ఒడిగట్టడం పేదల స్థితిగతులు ఏ మాత్రం మెరుగుపడకుండా అడ్డుకుంటుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జువాన్ పెరోన్ సతీమణిగా ఇవా ఆ దేశంలోని ఉన్నత వర్గాలకు ప్రభుత్వ రాయితీలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె తన సొంత ‘ఇవా ఫౌండేషన్’తో వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచారు. వ్యాపార వర్గాలు సమకూర్చిన నిధులు, నేషనల్ లాటరీ, ఇతర నిధులలో గణనీయమైన కోతలతో మిగిలిన వనరులతో అర్జెంటీనా అంతటా ఆమె ఈ వాలంటీర్ వ్యవస్థతో వేలాది ఆసుపత్రులు, పాఠశా లలు; అనాథ, వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించి ప్రజాసంక్షేమానికి తోడ్పడ్డారు. ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు చట్టం రూపుదాల్చడం ఇవా కృషి ఫలితమే. 1949లో ఆమె పెరొనిస్టా ఫెమినిస్టు పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే – ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, సహాయ పథకాలపై వినిపిస్తున్న కొన్ని ప్రతికూల అభిప్రాయాలు నా చెవిని సోకాయి. కానీ నిశితంగా పరిశీలించిన మీదట రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక తోడ్పాటు ఆదర్శవంతమైనదని నేను గ్రహించాను. ఆ సంకల్పబలం ఇవా పెరోన్‌ను తప్పక గుర్తు చేస్తుంది. రెండు ముఖ్యమైన పరిశీలనలతో నేనీ మాట అంటున్నాను. ఒకటి : ఏపీలో ప్రతి ఒక్క పేద వర్గం గత నాలుగేళ్లలో ఆర్థికంగా మెరుగు పడింది. రెండు వ్యవస్థీకృత నిర్మాణం, ప్రక్రియల ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ అవుతోంది. అది కూడా చాలా గౌరవప్రదంగా, అతి తక్కువ సమస్యలతో అత్యంత ప్రభావవంతంగా! అర్జెంటీనాలో ఇవా స్మారకస్థలి వద్ద వ్యాస రచయిత్రి మరి అలాంటప్పుడు ఆర్థిక సహాయ పథకాలపై ఎందుకీ సణుగుడంతా?! ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం విషయాన్ని వివాదాస్పదం చేయడానికే! ఎవరైనా నేలకు ఒక చెవిని ఆన్చితే రెండు స్పష్టమైన కథనాలు వినిపిస్తాయి. మొదటి కథనం.. సంతృప్తి చెందిన లబ్ధిదారుల గురించి, వారికి సరళంగా అందుతున్న సహాయం గురించి ఉంటుంది. రెండో కథనం మొదటి కథనానికి విరుద్ధంగా, నిందాపూర్వకంగా ఉంటుంది. హమీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడాన్ని ప్రత్యర్థులు ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న చేటుగా ప్రచారం చేస్తున్నారు. ఇటాంటి ప్రచారాలు ఏదీ కూడా... నిబద్ధత కలిగి, పేదల సంక్షేమానికి కట్టుబడి నిశ్చయంతో ముందుకు సాగుతూ ఉన్న నాయకుడిని ఏమీ చేయలేవు. పూర్వం తమ పాలనలో, తమ విధానాలతో పరిశ్రమలను తెచ్చామనీ, నేటి మౌలిక సదు పాయాలన్నీ ఆనాటి తమ చొరవ వల్లే రూపుదిద్దుకున్నాయనీ, అవన్నీ దీర్ఘకాలికమైన ప్రయోజనాలిచ్చేవనీ చెప్పుకునే నాయ కులు ఇవాళ్టి గురించి పట్టించుకోరా? ఆకలితో ఉన్న పిల్లవాడికి ఆహారం ఇవ్వడానికి తల్లి ఈ రోజు పడుతున్న క్షోభను; వృద్ధులు, అశక్తులకు ఈరోజు అవసరమైన ఆసరాను, విద్యార్థి జీవితానికి విద్య ద్వారా ఈ రోజు ఏర్పరచవలసిన ధీమాను కేవలం భవిష్యత్ అవసరాల పెట్టుబడుల గురించి ఆలోచించే మనస్తత్వాలు గుర్తించలేవు. వర్తమానానికి, భవిష్యత్తుకు సమతుల్యత అవసరం. అదిప్పుడు కచ్చితంగా ఏపీలో ఉంది. ఆర్థికాభివృద్ధి పథంలో జరుగుతున్న సహాయ పథకాలపై అబద్ధాలను ప్రచారం చేస్తూ, మంచిని తిరస్కరిస్తున్న ప్రత్యర్థి రాజ నీతిజ్ఞులు పునరాలోచన చేయాలి. ఇవా పెరోన్ మాదిరిగా ప్రపంచంలో చిరస్మరణీయం అయేందుకు నిబద్ధతతో కూడిన నిజా యితీ, పట్టుదల అవసరం. ఇవా పెరోన్ తన 33వ ఏట మరణించారు. ఆమె జీవిత కాలం బహు స్వల్పమే అయినప్పటికీ ఆమె ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిజమైన నాయకులకు ప్రేరణగా పనిచేస్తూనే ఉంటుంది. -రాణీ రెడ్డి -
సాక్షి జర్నలిస్టులకు హైబిజ్ టీవీ అవార్డ్స్
-
అదో పెద్ద స్కామ్ అనుకున్నా.. తీరా చూస్తే: ఏజెంట్ హీరోయిన్
అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రంలో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది తెలుగులో నా తొలి సినిమా అని.. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు సాక్షి వైద్య. సాక్షి వైద్య మాట్లాడుతూ .. 'వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్‌ని. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ ఛాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్‌ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను' అని అన్నారు. -
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్నజీవులని చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో ఎప్పుడు, ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్‌లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది – దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యం ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యం లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యం ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్థుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ – రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్ల మీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్ధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ,మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళకిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకంలో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోధ్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే – మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుద్ధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ చిత్రించేటప్పుడు ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీదారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పథంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి -
అఖిల్ వైల్డ్ క్యారెక్టర్.. ఆ ఫీట్ ఏంట్రా బాబూ!
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఏజెంట్'. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయవాడలో ట్రైలర్ లాంఛ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అఖిల్ కళ్లు చెదిరిపోయే స్టంట్ ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఈసారి చాలా కొత్తగా ట్రై చేశారు. విజయవాడలోని దాదాపు 172 అడుగుల భవనం పైనుంచి దుకుతూ ట్రైలర్ పోస్టర్‌ను ఆవిష్కరించాడు. ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో ‘ఏజెంట్’ ట్రైలర్ లాంఛ్ జరగనుందని పేర్కొన్నారు. ఈ వీడియోను మేకర్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే విడుదలైన అఖిల్ వైల్డ్ లుక్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. SAALA nahin! WILD SAALA 😎 That was a Crazy Event at Vijayawada as @AkhilAkkineni8 jumped off from 172 ft High to unveil the WILD POSTER 🔥 WILD MADNESS Loading in Theaters from APRIL 28TH💥#AGENTonApril28th @mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @Shreyasgroup pic.twitter.com/yJMKmQOTyc — AK Entertainments (@AKentsOfficial) April 16, 2023