అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాలను సాక్షి మీడియా గ్రూప్ తరపున కవర్ చేశారు మంగ వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి. మన దేశం నుంచి ఈ అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో వెంకన్న ఒకరు. తెలుగు మీడియాలో వెంకన్న మాత్రమే ఈ అవకాశం అందుకోగలిగారు. నల్గొండ జిల్లా నుంచి చిన్న విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా ఐక్యరాజ్యసమితి ఈవెంట్‌ను కవర్ చేయడం జర్నలిస్టుగా వెంకన్న సాధించిన విజయం. కవరేజ్ గురించి వెంకన్న మాటల్లోనే..
"హై-లెవల్ పొలిటికల్ ఫోరమ్ 2023 సమావేశాల్లో సుస్థిర అభివృద్ధి ఎజెండాగా ఉన్నత స్థాయి రాజకీయ వేదిక (HLPF) ఆర్థిక, సామాజిక మండలి ఆధ్వర్యంలో జూలై 10, సోమవారం నుండి 19 జూలై 2023 వరకు జరిగిన సమావేశాలను కవర్ చేయడం నా జర్నలిజం కెరియర్‌లో దక్కిన అతి పెద్ద అదృష్టం"
ప్రపంచ మేధావుల విలువైన పాఠాలు
UN కౌన్సిల్ యొక్క ఉన్నత-స్థాయి విభాగంలో భాగంగా సస్టైనబిలిటీ ప్రధాన అజెండా ఫోరమ్ యొక్క మూడు రోజుల మంత్రివర్గ ECOSOC యొక్క ఉన్నత-స్థాయి సెగ్మెంట్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేశాను. "కరోనా వైరస్ వ్యాధి (COVID-19) నుండి ప్రపంచ రికవరీని వేగవంతం చేయడం, అన్ని స్థాయిలలో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడం ఎజెండాగా ఈ సమావేశాలు జరిగాయి. ముఖ్య అజెండా లో పేర్కొన్న అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాను. ఒక్కో భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో ఒక్కొక్కరు వినూత్నమైన, విలువైన విషయాలు ఎన్నో చెప్పారు.
(వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చే జర స్టవ్ తో UN స్పెషల్ కన్సల్టేటివ్ మెంబర్ షకీన్ కుమార్)
ఎడ్యుకేషన్ లో ఏపీ.. ది బెస్ట్
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ, బాలికల విద్య కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనాల వివరాలను స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషనల్ సస్టైనబులిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రాం హై లెవెల్ పొలిటికల్ ఫోరం కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానాన్ని అందిస్తున్నారని ఏపీ ప్రతినిధులు ప్రజెంట్ చేశారు. ఈ స్టాల్ ను సందర్శించిన వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సభ్యులు విద్యావేత్తలను నేను జర్నలిస్టుగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆయా దేశాల్లో అనుసరిస్తున్న తీరు, విద్యావిధానాలను తెలుగు ప్రజలకు చెప్పే అవకాశం వచ్చింది. నాడు-నేడు స్టాల్ గురించి తెలుసుకున్న పలువురు విదేశీ విద్యావేత్తలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానాన్ని ప్రశంసించినప్పుడు తెలుగోడిగా గర్వపడ్డాను. ఐక్యరాజ్యసమితి ఆశయాలు భుజాల మీద వేసుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు, నవరత్నాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు140 దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో వివరించడం సంతోషం కలిగింది.
(కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధికా అయ్యంగార్ )
అమెరికాకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్‌లో జరిగే అమెరికా పర్యటన సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాధిక అయ్యంగార్‌ను కలిశాను. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్‌తో కలిసి రాధిక అయ్యంగార్‌తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుగు పాఠకులకు అందించగలిగాం.
ప్రపంచ ఐక్యత కోసం, దేశాల మధ్య సమస్యల పరిష్కారం, ప్రపంచ శాంతి కోసం, పౌర హక్కుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఒక రకంగా ప్రతీ ఒక్కరికి ఎన్నో పాఠాలు చెబుతుంది. అనుభవాలు గొప్పగా అనిపించాయి.
మంగా వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment