Education Department
-
తక్షణమే ప్రక్షాళన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధులు, నియామకాల లేమితో కునారిల్లుతున్నాయని.. వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్ తేల్చినట్టు సమాచారం. బోధన సిబ్బంది కొరత, తాత్కాలిక అధ్యాపకులతో నెట్టుకురావడం, అరకొర నిధులు వంటి కారణాలతో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. ప్రస్తుతం కనీస స్థాయి పరిశోధనలైనా చేపట్టలేని దైన్య స్థితిలో వర్సిటీలు ఉన్నాయని.. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తక్షణమే చర్యలు చేపట్టకుంటే కనీస ప్రమాణాలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నట్టు సమాచారం.ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనున్నట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి.. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, నేరుగా పరిశీలించిన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలతో ఈ నివేదికను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి.పోటీ ఎక్కడ?మన వర్సిటీలు కనీసం జాతీయ స్థాయిలోనూ పోటీ పడలేని పరిస్థితి ఉందని విద్యా కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో రెండింటికి ‘జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్ (న్యాక్)’ గ్రేడ్ కూడా రాలేదని.. ‘ఎ’ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్న వర్సిటీలు కేవలం రెండేనని కమిషన్ వర్గాలు తెలిపాయి. వర్సిటీల్లో 2,825 అధ్యాపక పోస్టులుండగా.. ప్రస్తుతమున్న రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమేనని.. బోధన, బోధనేతర సిబ్బందిని కలిపి చూసినా 74 శాతం పోస్టులు ఖాళీయేనని పేర్కొన్నాయి. అంతా తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారని తెలిపాయి.ప్రాజెక్టులు డొల్ల.. పరిశోధనలు కల్ల.. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కీలకమైన పరిశోధనలు క్రమంగా తగ్గుతున్నాయి. 2020–21లో రూ.52.45 కోట్ల విలువైన ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. ఇక్కడ 1,267 మంది బోధన సిబ్బందికిగాను 340 మందే రెగ్యులర్ వారున్నారు. మిగతా అంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారే. వారికి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఈ వర్సిటీకి గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల పరిశోధన ప్రాజెక్టులూ అరకొరగానే వస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ఆయువు పట్టు అయిన జేఎన్టీయూహెచ్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.200 కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకున్నవారు లేరు. వర్సిటీలో 410 మంది ఫ్యాకల్టీకిగాను ఉన్నది 169 మందే. దీనితో కీలకమైన ఇంజనీరింగ్ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.⇒ మెరికల్లాంటి గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) క్రమంగా వైభవాన్ని కోల్పోతోంది. 2008 నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం దారుణం. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ లేదు. ల్యాప్‌టాప్‌లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.⇒ పాలమూరు వర్సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని కమిషన్ దృష్టికొచ్చింది. పేరుకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినా రూ.7 కోట్లు కూడా అందడం లేదని.. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిధుల కోసం విద్యార్థుల పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, బోధన రుసుములపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోందని అంటున్నారు. ⇒ తెలంగాణ వర్సిటీకి 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైతే... ఉన్నది 61 మందే. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న ఈ వర్సిటీని అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. వర్సిటీకి కనీసం రూ.250 కోట్ల తక్షణ నిధులు అవసమని అంచనా.⇒ కాకతీయ వర్సిటీలోనూ పరిశోధనలు సగం మేర తగ్గిపోయాయి. 405 అధ్యాపక పోస్టులకుగాను 83 మందే రెగ్యులర్ వారు. మిగతా అంతా తాత్కాలిక సిబ్బందే. నిజానికి ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులను కలిపితే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని అంచనా.యూనివర్సిటీల స్థాయి పెరగాలివిశ్వవిద్యాలయాలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కాదు.. అంతర్జాతీయ గుర్తింపు అవసరం. అది సాధ్యం కావాలంటే వర్సిటీల స్థాయి, ప్రమాణాలు పెరగాలి. బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. లైబ్రరీ, పరిశోధన అవకాశాలు, సరికొత్త టెక్నాలజీలను సమకూర్చాలి. ఈ అంశాలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేశాం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నాం. – ఆకునూరి మురళి, విద్యా కమిషన్ చైర్మన్ -
బడికి ఉరి!.. ముంచుకొస్తున్న ప్రమాదం
ప్రతి గ్రామంలో రెండు, మూడు వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే.. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యా శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 3–5 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపేస్తున్నట్టు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే.. తెచ్చిన మార్పు ఓ ఐదేళ్లపాటు కొనసాగాలి, తర్వాత దానిలోని లోటుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి. కానీ.. ఇక్కడ జీవో117 ద్వారా 2022 జూన్‌లో తెచ్చిన విధానాలను కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ.. జీవో–117లో ఉన్న మంచి పోయి.. కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది.కొత్త విధానంతో 10 వేల సబ్జెక్టు టీచర్ల మిగులుజీవో–117 రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దుచేసి, ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి. లేదా 117 జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి. లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసురావాలి. కానీ.. ఈ మూడు విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు.. ఏలూరు జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో 27 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ నమోదైంది. ఆరో తరగతిలో 19 మంది, 7వ తరగతిలో 17 మంది, 8వ తరగతిలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత తరగతులు ఉన్నందున ఇక్కడ ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు బోధన అందిస్తున్నారు. అయితే, 6, 7, 8 తరగతుల్లో మొత్తం 50 మంది విద్యార్థులే ఉన్నందున కొత్త మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడ యూపీ స్కూల్‌ను రద్దు చేస్తారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులు 27 మంది 2025–26 విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో కొనసాగితే అప్పుడు 6, 7, 8 తరగతుల్లో 63 మంది, 9వ తరగతిలో 14 మంది మొత్తం 77 మంది ఉన్నందున ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తారు. కానీ.. అక్కడ బోధనకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను రద్దు చేసి, ఎస్జీటీలను మాత్రమే ఇస్తుంది. అంటే హైస్కూల్‌గా మారినా పరిస్థితి మెరుగుపడకపోగా.. ఉన్న పోస్టులు సైతం వెళ్లిపోయి అప్‌గ్రేడ్‌కు బదులు డౌన్‌గ్రేడ్ అయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,760 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఇలాగే మారే ప్రమాదముంది. ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవో–117 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. దీంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు 8 సెక్షన్లు కొనసాగుతున్నాయి. 180 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కరు చొప్పున.. గణితం, ఇంగ్లిష్‌కు ఇద్దరు చొప్పున 12 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపిస్తే ఉన్నత తరగతుల్లో 140 మంది విద్యార్థులతో 5 సెక్షన్లే మిగులుతాయి. దీంతో ఒక గణితం, ఒక ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, మరో రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు తగ్గిపోతాయి. ఇలానే జీవో–117 ద్వారా 3–5 తరగతులు విలీనమైన 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతమున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సగటున మూడు చొప్పున 10 వేల పోస్టులు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో 10 వేల స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఉంటాయి. ఇంత భారీగా మిగులుతున్న స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు.34 వేల ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావంప్రస్తుతం జీవో–117 ప్రకారం ఉన్నత, యూపీ స్కూళ్లకు కి.మీ. పరిధిలో ఉన్న 4,731 ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. వీరికి సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నారు. అలాగే, 1, 2 తరగతుల్లో 10 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్నా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 117 జీవోను రద్దు చేసి, 3–5 తరగతులను తిరిగి వెనక్కి తెస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతేగాక, 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగించకుండా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం కి.మీ. పరిధిలో 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులనే విలీనం చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 34 వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో విలీనం చేస్తారు. దీని ప్రకారం మూడో తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం 5 కి.మీ. దూరం దాటి వెళ్లాలి. లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఇక 1, 2 తరగతుల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన అప్పటి టీడీపీ సర్కారు.. తాజాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది ఒక ఎత్తయితే ప్రస్తుతం మారుమూల గ్రామాలు, పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాల్లో (హేమ్లెట్స్) దాదాపు 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1–5 తరగతులు చదివే విద్యార్థులు తరగతికి నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు. కూటమి కొత్త మోడల్ ప్రకారం ఇకపై వీటిలో 3 నుంచి 5 తరగతులు చదివే వారు ఇకపై గ్రామం దాటిపోవాల్సిందే.ఆ హైస్కూళ్లకు హెచ్ఎం పోస్టు ఉండదుప్రస్తుతం రాష్ట్రంలో 6,700 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. కూటమి సర్కారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే అక్కడ ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే దాదాపు రెండు వేల హైస్కూళ్లకు హెచ్ఎం, పీఈటీలు ఇకపై ఉండరు. కాగా.. 297 ఉన్నత పాఠశాలల్లో 75 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 297 స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్వస్తి పలకనున్నారు. అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోనూ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను బదిలీ చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లు లెక్కించి ఆమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. దాని ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ఎన్రోల్మెంట్ మొదటి 53 మంది వరకు ఒక సెక్షన్, 54 నుంచి 88 వరకు రెండో సెక్షన్, 89 నుంచి 123 వరకు మూడో సెక్షన్‌గా గుర్తించి టీచర్లను ఇచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 54 మంది విద్యార్థుల వరకు ఒక సెక్షన్, 55 నుంచి 94 వరకు రెండో సెక్షన్, 95 మంది నుంచి 3వ సెక్షన్‌గా నిర్ణయించారు. కొత్త దానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్ మంజూరు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని, ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధ్యాయుల మిగులతో డీఎస్సీపై ప్రభావం కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. 7 నెలలు దాటినా ఇప్పటివరకు నోటిఫికేషన్ జాడ లేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపు 15 వేలకు పైగా పోస్టులు మిగులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో స్కూల్ అసిస్టెంట్లే దాదాపు 5 వేలకు పైగా, ఎస్జీటీలు మరో 10 వేలు మిగిలే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీలో ఖాళీలను ఎక్కడ నుంచి చూపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి: ఏపీటీఎఫ్ అమరావతిఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. జీవో–117 రద్దు చేస్తున్నందున అంతకు ముందున్న వ్యవస్థను పునరుద్ధరించి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వారానికి 10 పీరియడ్లు గణితానికి కేటాయించాలని, 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టని పక్షంలో జీవో–117 రద్దు వల్ల హైస్కూల్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉన్నత పాఠశాల విద్య నిర్వీర్యం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తరగతి గదిలో మొబైల్ నిషిద్ధం.. పూజలు, నమాజ్‌కు పర్మిషన్ నో!
భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది. -
Telangana: 'స్మార్ట్'గా సర్కారీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీ, అన్నిటికీ మించి డిజిటల్ విద్యాబోధనకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లు..తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని విద్యా కమిషన్ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటే మార్గమని స్పష్టం చేస్తోంది. ఈ విధానంతో ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్ళొచ్చని అభిప్రాయపడుతోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 2 లేదా 3 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తోంది. విద్యా రంగం సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ వంద రోజులు స్కూళ్ళ నాణ్యతపై అధ్యయనం చేసింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో త్వరలోనే నివేదిక సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్ విద్యా విధానంతో నాణ్యత: పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు సరిపడా టీచర్లు, ప్రయోగశాలలు, విశాలమైన తరగతులు, స్మార్ట్ కిచెన్, మౌలిక వసతులు, ఆట స్థలం ఉండేలా చూడాలి. విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి వివిధ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా స్టడీ టూర్లు నిర్వహించాలి. తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరగాలి. స్మార్ట్ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది. ఇందుకు కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో స్కూల్లో 100కు పైగా విద్యార్థులుండాలి పెద్ద స్కూళ్ల నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,628 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇందులో 59 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 26,337 ఉంటే, వాటిల్లో 22.63 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఊరూరా లేవు. మండలంలోనూ ఒకటికి మించి ఉండటం లేదు. వీటిల్లో కనిష్టంగా 500, గరిష్టంగా 4 వేల మంది విద్యార్థులుంటున్నారు. కానీ రాష్ట్రంలోని 1,800 ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్లే లేవు. 8,782 స్కూళ్ళల్లో 30కి మించి విద్యార్థులు లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 8 వేలకుపైగా ఉన్నాయి. 10 వేల స్కూళ్ళల్లో 100 మందికి మించి లేరు. 5,800 స్కూళ్ళల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇటీవల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో 20 మందికి ఒక టీచర్ ఉండాలనే నిబంధన తెచ్చారు. అయినప్పటికీ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 1.62 లక్షల ప్రవేశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్కో స్కూల్లో కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పది వేల స్కూళ్ళను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయవచ్చు. ఉచిత రవాణా వ్యవస్థ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు సులభంగా దూరంలో ఉన్న తమ స్కూళ్ళకు తీసుకెళ్తున్నాయి. ఇందుకోసం బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఉపయోగిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత రవాణా వ్యవస్థ ఉండాలి. సూదూర ప్రాంతాలకు విద్యార్థులను పంపేందుకు 92 శాతం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్టు మా అభిప్రాయ సేకరణలో తేలింది. అయితే రవాణా సౌకర్యం కోసం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. -
డీఎస్సీపై పూటకో మాట.. రోజుకో మెలిక
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టులను ప్రకటించారు. డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఏడు నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా.. వాయిదాలకు మరిన్ని కారణాలు వెదుకుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖను కోరడం గమనార్హం. దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించినన్ని పోస్టులు లేకపోవడంతోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు జూన్ 13న మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. దీంతో సెప్టెంబర్‌లో డీఎస్సీ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించడంతో అర్హత గల అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అయితే, కొత్తగా బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించేందుకు జూలైలో ఏపీ టెట్–2024 నోటిఫికేషన్ జారీ చేశారు. టెట్ పూర్తయి మూడు నెలలు గడిచిపోయింది. అయినా.. డీఎస్సీ నిర్వహణకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ పేరుతో హడావుడి ఎన్నికల వేళ 25 వేల టీచర్ పోస్టులని చెప్పినా.. 16,347 పోస్టులను మాత్రమే ప్రభుత్వం ప్రక టించింది. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకు న్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పి స్తామంటూ ఆగస్టులో టెట్ పరీక్షలు నిర్వహించేలా జూలై 2న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆ గస్టులో పరీక్షలంటూ పేర్కొంది. ఇది చేయకపో గా మళ్లీ టెట్‌కు డీఎస్సీకి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెపె్టంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితా లు వచ్చి రెండు నెలలు గడిచినా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం వెలవడలేదు. మరోపక్క ప్రకటించిన పోస్టుల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో (ఆశ్రమ్) దా దాపు 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వి ధానంలో పని చేస్తు న్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర ప న్నింది. వారికి డీఎస్సీలో ఎ లాంటి వెయిటేజీ ఇ వ్వకుండానే దాదాపు 1,150 ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీకి చూపించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. పైగా గత కొన్ని నెలలుగా ఈ విభాగం కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వారి దృష్టి మళ్లించేందుకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు పంపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఆలస్యం చేయడానికేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నా విజయ రహస్యం ఇదే.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి
సాక్షి,హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు చట్టాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన.. ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్, సాధించిన విజయాలతో పాటు.. రానున్న రోజుల్లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ స్థానంలో ఉండి ఎలాంటి సంస్కరణలు చేయనున్నారు.. ఇలా మొదలైన కీలక అంశాలపైన సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌కి ఈయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయగలరు. -
5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ రెండు తరగతుల్లో ఫైనల్ పరీక్షలో ఫెయిలైనప్పటికీ విద్యార్థులు తదుపరి తరగతుల్లో కొనసాగేందుకు ఇప్పటిదాకా వీలుండేది. ఇకపై అలా కాదు.. ‘5వ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ఫైనల్ పరీక్షా ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోగా మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కలి్పంచాలి. ఆ పరీక్షలోనూ ఫెయిలైతే వారిని తిరిగి 5వ తరగతిలోనే కొనసాగించడం తప్పనిసరి. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించని వారికీ ఇదే వర్తిస్తుంది. రెండోసారి పరీక్ష రాసే విద్యారి్థని క్లాస్ టీచర్, తల్లిదండ్రులు మార్గదర్శకత్వంలో పరీక్షలకు సమాయత్తం చేయాలి. విద్యార్థి ఏ విషయంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, ఆయా అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ప్రోత్సహించాలి’అని కేంద్రం విడుదల చేసిన గజెట్ పేర్కొంది. అయితే, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయకుండా ఏ ఒక్కరినీ స్కూల్ నుంచి తొలగించే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టానికి 2019లో చేపట్టిన సవరణతో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్ విధానం’రద్దు చేశాయి. విద్య రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున, గజెట్‌ను అనుసరించి రాష్ట్రాలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని కోరింది. 𝐔𝐧𝐢𝐨𝐧 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 𝐚𝐛𝐨𝐥𝐢𝐬𝐡𝐞𝐬 𝐭𝐡𝐞 '𝐍𝐨 𝐃𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧 𝐏𝐨𝐥𝐢𝐜𝐲':Students in classes 5 and 8 who fail the annual exam can retake it within two months. If they fail again, they won't be promoted, but the school will not expel a… pic.twitter.com/AW4KRz8ch3— All India Radio News (@airnewsalerts) December 23, 2024 -
టార్చ్ బేరర్
ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు.‘ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లో ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్ బేరర్ అంటారు.’ ఇది ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోని ఓ డైలాగ్. నిజ జీవితంలో ఇలాంటివారు అరుదుగా ఉంటారు. 2019 – 24 మధ్య ఏపీలో జరిగిన పాలనను చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్చ్ బేరర్‌గా చెప్పొచ్చు. ఆ ఐదేళ్లలో ఆయన చేసిన సంస్కరణలు అలాంటివి.ఎంపీగా మొదలైన జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాలు కదిపాయి. కోట్ల మంది ఓన్ చేసుకున్న లీడర్!జగన్ దేశంలో ఏ నాయకుడూ సాహసం చేయని పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో కనిపించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలను అందించారు.చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. కార్పొరేట్‌ను పెంచి పోషించారు. కానీ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు కష్టపడ్డారు. ఏపీలోని పల్లెల బిడ్డలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడతారని ఏనాడైనా అనుకున్నామా? ‘నాడు – నేడు’తో బడికి కొత్త కళ వచ్చింది. ఏపీలో విద్యారంగ సంస్కరణల కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 73 వేల కోట్లు. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపిస్తే జగన్ క్షేత్ర స్థాయిలో కనిపించేలా చేశారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం... ఇలా ఆయన చేపట్టినవి ఎన్నో!దేశ చరిత్రలో ఏ నాయకుడిపై జరగనంత వ్యక్తిత్వ హననం జగన్‌పై జరుగుతోంది. జగన్ వీటిని చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నారు తప్ప ఎక్కడా మాట తూలలేదు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా సైకోలు జగన్‌పై నిత్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్‌లలో దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ కూర్చొన్నా, మాట్లాడినా, నవ్వినా, చూసినా పిచ్చిపిచ్చి రాతలతో పోస్టులు, రీల్స్ పెడుతున్న వారి కుటుంబాల్లో ఎంతోమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటారు!జగన్‌కు పడటం కొత్త కాదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్లే వ్యక్తికి ఎలా లేచి నిలబడాలో బాగా తెలుసు. ఏదో మేజిక్ వల్ల గెలిచిన కూటమి పెద్దలు ఆయన పని అయిపోయిందని ఇప్పుడు సంబర పడుతూ ఉండొచ్చు. ఏపీలో అధికా రంలోకి వచ్చిన కొన్ని నెలలకే చంద్రబాబు అంతులేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఒకప్పటిలా సంక్షేమం అందకపోవడంతో జనం నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రజల బాగు కోసం పనిచేసే నాయకుడు ఎప్పటికీ ఫెయిల్ కాడు. ఎందుకంటే వారి సంకల్ప బలం చాలా గొప్పది. నిజమైన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు!– వెంకట్ -
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్, స్టూడెంట్స్, టీచర్స్ ఈవెంట్ గిన్నిస్ బుక్‌లో శాశ్వతంగా లిఖించదగ్గ కార్యక్రమమని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. శనివారం బాపట్ల మున్సిపల్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ దేశంలో నంబర్ వన్ అయిందంటే తాను అమలు చేసిన విజనేనన్నారు. ఇప్పుడు 2047 విజన్ తెచ్చానన్నారు. ప్రైవేట్ పాఠశాలలకంటే బెటర్‌గా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను చదివిస్తామన్నారు. ఏడాదికి మూడు సార్లు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏటా డిసెంబర్ 7న మెగా ఈవెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోని అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. తన హయాంలో 11 డీఎస్సీలు నిర్వహించి.. 1.50 లక్షల మందికి టీచర్ పోస్టులు ఇచ్చామన్నారు. 16,347 మెగా డీఎస్సీ పోస్టులు జూన్ నాటికి భర్తీ చేస్తామన్నారు. ఇక నుంచి ఏటా డీఎస్సీ ఉంటుందన్నారు. 117జీవో 4 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రాని పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఏడాదికి పాఠశాలల్లో పెనుమార్పులు తెస్తామన్నారు. కాగా సభకు చ్చిన ఓ విద్యార్థి తండ్రి గుండెపోటుకు గురైతే నడిపించుకుంటూ తీసుకెళ్లడం ఆందోళనకు గురి చేసింది. సభకు ఎనిమిదో తరగతి చదువుతున్న సాహుల్ అనే విద్యార్థి తండ్రి పఠాన్‌బాజీ హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హైస్కూలుకు పిలిపించారు. సీఎం వచ్చే వరకు అందరినీ అక్కడి నుంచి లేవకుండా ఉంచారు. కనీసం ఫ్యాన్లు కూడా వేయలేదు. ఈ వాతావరణం మధ్య ఇమడలేక 11 గంటల సమయంలో పఠాన్‌బాజీ గుండెపోటుకు గురయ్యాడు. అక్కడే మెడికల్ క్యాంపు ఉన్నప్పటికీ వీల్‌చైర్ కూడా లేకపోవటం, అంబులెన్సు లేకపోవటంతో బాధితుడిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. -
కూటమి ప్రభుత్వం వచ్చాక పిల్లల భవిష్యత్తును నాశనం
-
విద్య విషయంలో ప్రభుత్వం క్షమించరాని తప్పు చేస్తోంది: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ చీకటిని కమ్ముకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆరు నెలలు పూర్తి కావస్తోన్నా ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయన్నారు.ఈ మేరకు బుధవారం వైఎస్సార్ జిల్లాలో మాట్లాడుతూ.. ‘సమాజానికి అత్యంత అవసరమైన విద్య విషయంలో ప్రభుత్వం క్షమించడానికి వీలులేనంత తప్పు చేస్తోంది. అక్షరాభ్యాసం పెంచాలని గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో.. ఈ ఆరు నెలలకాలంలోనే కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యం చేసింది. జగన్ ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. అయిదు సంవత్సరాలు కుంటు లేకుండా అమ్మబడి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పారు. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారు. వైఎస్ జగన్ హయాంలోని ‘నాడు-నేడు’ చాలా గొప్ప పథకం. రాష్ట్ర ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ప్రశంసించారు. ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే ఎత్తేశారు. 8వ తరగతి వారికి ఇచ్చే ట్యాబ్‌ల పథకం అటకెక్కింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం విద్యార్థులకు శాపం లా మారింది.’ అని మండిపడ్డారు. -
‘ఉత్తమ’ టీచర్.. చెత్త పనులు
మంచిర్యాల అర్బన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. అభంశుభం తెలి యని బాలి కల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం మంగళ వారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఓ పాఠశాలలో ఎస్ఏ(తెలుగు) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టి.సత్యనారాయణ కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ప్రధానోపా ద్యాయురాలితో పాటు డీఈవో యాదయ్యకు సమాచారం అందించారు. ఆయన మంగళవారం ఎంఈవో, సెక్టోరల్ అధికారులను విచారణకు ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో విచారణ చేప ట్టారు. సత్యనారాయణ అసభ్యకరంగా తాకుతు న్నాడని, కళ్లు మూసుకుని ధ్యానం చేయాలంటూ సెల్ఫోన్లో చిత్రీ కరించాడని బాలికలు పేర్కొన్నారు. మాటల్లో చెప్పరాని విషయా లను లిఖిత పూర్వకంగా ఇచ్చారు. విచారణ అధికారులు వెళ్లిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిని బయటకు రావాలని తల్లిదండ్రులు పదేపదే పిలి చినా రాకపోవడంతో ఆగ్రహించి దేహశుద్ధి చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. కాగా, సత్యనారాయణ గతంలో ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. -
APలో మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు
-
ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
-
కాలానికి అనుగుణంగా విద్యాబోధన ఉండాలి: సరితా జాదవ్
బంజారాహిల్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక విద్యావిధానాలతో పాఠశాలలను ఎలా సిద్దం చేయాలనే అంశంపై నిర్వాహకులు దృష్టి సారించాలని యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ సూచించారు. ’హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో ’సమన్వయ 2024’ పేరుతో జాతీయ సదస్సును బంజారాహిల్స్‌లో నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలోని 281 సీబీఎస్ఈ స్కూళ్లకు చెందిన ప్రిన్స్పల్స్. అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సరికొత్త విద్యావిధానాలు, మారుతున్న పరిస్థితులు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ మాట్లాడుతూ..గ్లోబల్ ఎడ్యుకేషన్ విధానానికి అనుగుణంగా విద్యాబోధనను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం స్కూళ్లలో ఏర్పాటు చేసుకోవాల్సిన మౌళిక సదుపాయాలు, పరిశోధనలపై దృష్టి పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో రానున్న మార్పులకు సన్నద్ధం చేయడంలో ఇలాంటి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ అజంతా సేన్, ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ కాథన్ దుష్యంత్ శుక్లా, హెచ్ఎస్ఎస్ సీ చైర్మన్ అమీర్ ఖాన్, వైస్ చైర్పర్సన్ డా. ఎబెనీజర్, సెక్రెటరీ రోజా పాల్,డా. సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేనట్లు అనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్ పాయిజన్‌తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్ 2వ తేదీ) వాయిదా వేసింది. చట్టం అమలే లేదు.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రకారం మెనూ అందించడం లేదు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్ జిల్లా గంగాధర్ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజన్ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. పాస్ ఓవర్ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్‌కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్ పాయిజన్‌పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్లను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్ పాయిజన్ ఘటనలతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది. -
YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
కులగణనతో ఏ ఇబ్బంది ఉండదు, ఎవరి రిజర్వేషన్లు తొలగించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామన్న సీఎం.. అన్ని వర్సీటీలకు వీసీలను నియమించామని చెప్పారు. రూ. 650 కోట్లతో పాఠశాలలను బాగు చేస్తున్నామని, పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం సందరర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్ధులే బాగస్వాములు. కలుషితమైన ఆహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితమైన ఆహారం పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం భోజనం పెట్టిన వారితో ఊచలు లెక్కపెట్టిస్తాం. నాణ్యమైన బోజనాన్ని విద్యార్థులకు అందించాలి. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. మసాయిపేటలో రైలు ఢీకొన్న ఘటనలో 30 మంది పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లలో 5 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. పాఠశాలల మూసివేతతో విద్యకు పేదలు దూరమయ్యారు.చదవండి: అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కుల గణన జరగాలి. కేంద్రం మెడలు వంచి కుల గణన జరిపి రిజర్వేషన్తు తీసుకొస్తాం. కుల గణనతో ఎవరి రిజర్వేషన్లు తొలగించం. కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పథకాలు తీసేయడానికి సర్వే చేయడం లేదు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పెంచడం కోసమే. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలికొందరు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాను. కులగణను అడ్డువచ్చే ద్రోహులను సమాజంలోకి రానివ్వొద్దు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు.. స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. చదువులోనే కాదు.. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి.’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
సర్కారు చదువులు చతికిల!
సాక్షి, అమరావతి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా రాష్ట్రంలో విద్యా రంగం పరిస్థితి తయారైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని అనర్థాలకు కారణమైందో చెప్పడానికి ప్రతి మండలంలో లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయం చేపట్టే సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి, సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి, అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి, లేని పాఠశాలల్లో నియమించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మందిని మిగులు చూపించి.. 9,075 మందిని మాత్రమే సర్దుబాటు బదిలీ చేశారు.అయితే, ఈ ప్రక్రియలో ఎన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉంది.. ఎక్కడ మిగులు ఉన్నారు.. వారిని ఏం చేయాలి.. అనే ప్రాథమిక ఆలోచన కూడా చేయకుండానే విద్యా శాఖ అడుగులు ముందుకు వేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 3,758 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3–8 తరగతులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, అక్కడున్న విద్యార్థుల బోధనను గాలికి వదిలేశారు. 502 హైస్కూల్ ప్లస్‌లను సర్దుబాటు నుంచి మినహాయించడంతో కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులే లేకుండాపోయారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లకు అనువుగా రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకు వర్తింపజేసి, అత్యంత జూనియర్ ఎస్జీటీలను హైస్కూళ్లకు.. ఉన్నత పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలకు పంపించారు.విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు » ఈ విద్యా సంవత్సరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. జూన్ చివరి వారంలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించి, మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే అవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దాంతో పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సంఘాలతో సమావేశాలు నిర్వహించి, మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇలా రెండుసార్లు జరగడంతో సెపె్టంబర్ నెలాఖరు దాకా సర్దుబాటు బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సర్దుబాటులో తమకు నష్టం జరిగిందని వందల సంఖ్యలో ఉపాధ్యాయులు పాఠశాల విద్య కమిషనరేట్‌కు వినతులు పంపుతున్నారు.» సర్దుబాటు మార్గదర్శకాల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మందికి మించి విద్యార్థులుంటే స్కూల్ అసిస్టెంట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే తక్కువ రోల్ ఉన్న స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, వారి స్థానంలో ఐదు లేదా ఆరుగురు ఎస్జీటీలను సర్దుబాటు చేస్తామన్నారు.» వాస్తవానికి ఆయా స్కూళ్లల్లో ఉన్న సబ్జెక్టు టీచర్లను బదిలీ చేసినా, వారి స్థానంలో పాఠం చెప్పేందుకు ఒక్క టీచర్‌ను కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని 3 వేలకు పైగా యూపీ స్కూళ్లలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలా వరకు ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి ఉండడం గమనార్హం. స్కూళ్లల్లో మిగులుగా ఉన్న టీచర్లను లేనిచోటకు పంపించాల్సి ఉంది. అయితే మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో అక్కడ ఉన్న టీచర్లను స్థానికంగానే సర్దుబాటు చేశారు. మిగిలిన టీచర్లను సైతం విద్యార్థులు లేకున్నా అక్కడే ఉంచారు. టీచర్లు లేని చోటుకు పక్క మండలం నుంచి పంపాల్సి ఉన్నా పట్టించుకోలేదు. జీవో 117 రద్దుకు కూటమి సర్కారు చర్యలు » పలు సర్వేల అనంతరం విద్యా రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో ఒకే విధమైన విధానాలు అనుసరించాలని పేర్కొంది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పత్తిని తగ్గించాలంది. » విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ–2020 సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో 117 జారీ చేసింది. దీని ప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. » 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన అందించడంతో పాటు ఉపాధ్యాయులపై బోధన ఒత్తిడి తగ్గించేందుకు టీచర్ విద్యార్థుల నిష్పత్తిని 1:20 ఉండేలా చర్యలు తీసుకున్నారు. » దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఏపీ మోడల్ విద్యా విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం నుంచి 1– 5 తరగతులను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చడంతో పాటు ప్రస్తుతం హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ బోధన పొందుతున్న 3– 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయనుంది. హైస్కూల్ స్థాయిలో (6–10) ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని నిర్ణయించింది. అంటే ఐదో తరగతి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒకేసారి ఆరో తరగతిని ఇంగ్లిష్ మీడియం ఎలా చదవగలరన్న కనీస అవగాహన లేకుండా మార్పులకు శ్రీకారం చుడుతోంది. మున్సిపల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్‌ల్లో బోధన గాలికి.. » బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి సమీపంలోనే జూనియర్ కాలేజీ ఉంటే మేలు జరుగుతుందన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో మండల స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులున్న హైస్కూళ్లలో 502 స్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా మార్చి, ఇంటర్ విద్యను ప్రారంభించారు. దీంతో గతేడాది 294 బాలికల జూనియర్ కాలేజీలు, మరో 208 కో ఎడ్యుకేషన్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించి బోధనకు స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్లను నియమించారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల సర్దుబాటులో హైస్కూల్ ప్లస్‌లను మినహాయించడం, ఉన్న అధ్యాపకుల్లో కొందరు రిటైర్ అవ్వడంతో అక్కడ ఇంటర్ విద్యా బోధనకు ఆటంకం ఏర్పడింది. » మున్సిపల్ హైస్కూళ్లల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో గత ప్రభుత్వంలో అర్హత ఉన్న సీనియర్ ఎస్జీటీలను కొరత ఉన్న హైస్కూళ్లకు డీఈవో కార్యాలయం ద్వారా సర్దుబాటు లేదా డెప్యుటేషన్‌పై నియమించి బోధన అందించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల కోసం రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకూ వర్తింపజేయడంతో ఇప్పటి వరకు డెప్యుటేషన్‌పై వచ్చి హైస్కూళ్లల్లో బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లల్లో అత్యంత జూనియర్ మిగులు ఉపాధ్యాయులను హైస్కూళ్లలో సర్దారు. దీంతో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడనుంది. గతంలో జిల్లా స్థాయిలోనే సర్దుబాటు» విద్యా రంగానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. జీవో నంబర్ 117 ప్రకారం ప్రభుత్వ మేనేజ్మెంట్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులను విద్యార్థులకు అవసరం ఉన్న చోటుకు జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేశారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా పక్క మండలాల స్కూళ్లలోనే సర్దుబాటు చేసేవారు. » విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యంగా చేసిన ఈ మార్పుతో విద్యా సంవత్సరంలో ఎక్కడా బోధనకు ఆటంకం ఏర్పడలేదు. ఎక్కడా ఉపాధ్యాయుల కొరత అనేది రాలేదు. తాజాగా కూటమి సర్కారు అసంపూర్ణ సర్దుబాటుతో ఈ ఏడాది విద్యా ఫలితాలు అత్యంత దారుణంగా పడిపోతాయని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో రాష్ట్ర టాపర్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే నిలవగా, ఈసారి ఆ పరిస్థితి ఉండేలా లేదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యా రంగం నాశనమైంది. బడుల్లో ఉపాధ్యాయులు లేకుండా చేసింది. దాన్ని గాడిన పెట్టడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత. అందుకే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న చోటు నుంచి లేని చోటుకు సర్దుబాటు చేస్తున్నాం. – ఆగస్టులో విద్యా శాఖ మంత్రి లోకేష్, ఉన్నతాధికారులు కాకినాడ జిల్లా తుని మండలంలో 58 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్టుగా విద్యా శాఖ గుర్తించింది. అయితే సర్దుబాటులో ఒక్కరు కూడా బదిలీ కాలేదు. ఈ మండలానికి పక్కనే ఉన్న రౌతులపూడిమండలంలోని ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలకు గాను.. ఐదు స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను తొలగించారు. పైగా 20 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నా ఒక్కరినీ ఇవ్వలేదు. -
5 నెలలకే విద్యార్థులను రోడ్డుకు ఎక్కేలా చేశారు
-
ఉద్యోగం నుంచి తొలగించడం సబబే
సాక్షి, అమరావతి: తనకు వినికిడి లోపం ఉందని నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళను సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సర్వీస్ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛను ఆ మహిళా టీచర్‌కు ఇస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.తనకు వినికిడి లోపం లేదని తెలిసి కూడా.. ఆ లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందినందుకు ఆ మహిళకు రూ.లక్ష ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు విశాఖపట్నంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక స్కూల్ నిర్వహిస్తున్న ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెల్లించాలని ఆ మహిళను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కేసు పూర్వాపరాలివీ2012లో నిర్వహించిన డీఎస్సీలో దివ్యాంగుల కోటా (వినికిడి లోపం) కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు జి.వెంకటనాగ మారుతి అనే మహిళ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె తనకు 70 శాతం వినికిడి వైకల్యం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రకాశం జిల్లా పి.నాగులవరం జెడ్పీ హైసూ్కల్లో స్కూల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అయితే.. వినికిడి లోపానికి సంబంధించి ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ 2015 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మారుతి ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ మారుతిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2017లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. దివ్యాంగుల కోటా కిందకు తాను రానని తెలిసి కూడా నాగ మారుతి అదే కోటా కింద దరఖాస్తు చేసి తప్పుడు వివరాలు పొందుపరచి, నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందారని ధర్మాసనం తేల్చింది. ఉద్యోగం పొందేందుకు పిటిషనర్ మోసపూరితంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉండగా, స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు అమెకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. అమెను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంది. -
ఏఏఐ చైర్మన్‌గా విపిన్ కుమార్
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బిహార్‌లో జిల్లా మెజి్రస్టేట్‌గా, బిహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్ తాత్కాలిక చైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
సాక్షి స్పెల్ బి పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన
-
ఇదేం కమిషన్?
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తొలిదశలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన కమిషన్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన సలహా మండలి సభ్యులు ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి హేతుబద్ధత లేకుండా, తమను సంప్రదించకుండానే సభ్యులుగా చేర్చారని కొందరు సభ్యులు మండిపడుతున్నారు.సలహా మండలిలో చేరేదే లేదని ఇప్పటికే ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారని.. మరో ఇద్దరు ఇదే బాటలో ఉన్నారని తెలిసింది. మరోవైపు కమిషన్ చైర్మన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కమిటీ ఏర్పాటు చేసినా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం, సలహాదారుల ఎంపికలో తనకు ప్రమేయమే లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదని తెలిసింది. విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నీ తానే అయి నడిపిస్తుండటమే దీనికి కారణమని విద్యాశాఖ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ఇవేం నియామకాలు? విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించింది. చాలా రోజుల తర్వాత కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమించింది. వాస్తవానికి విద్యా రంగంలోని వివిధ విభాగాల నుంచి సభ్యుల నియామకం జరగాలని కొన్ని నెలల క్రితం జరిగిన మేధావుల సమావేశంలో సీఎంకు పలువురు సూచించారు. కానీ ఒక కార్పొరేటర్, అధికార పారీ్టకి చెందిన ఓ స్కాలర్ సహా మరో వ్యక్తిని సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీనివల్ల సభ్యులు రాజకీయ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని.. విద్యా రంగంలో పారదర్శకంగా సంస్కరణలు చేపట్టలేమనే అభిప్రాయాలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే విద్యా కమిషన్‌కు సలహా కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు ప్రొఫెసర్లను నియమించారు. అయితే ఈ నియామకాలు విద్యా కమిషన్ పరిధిలో జరిగి ఉంటే బాగుండేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కొందరి సూచనల మేరకు సలహా కమిటీని సీఎం వేశారని అంటున్నారు. సలహా కమిటీ కేవలం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు విద్యా కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సంస్కరణలు సాధ్యమేనా? విద్యా కమిషన్‌పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. విద్యా రంగంలో సంస్కరణల దిశగా అడుగులు వేయడం లేదని సలహా కమిటీలో నియమితులైన సభ్యుడొకరు మండిపడ్డారు. కర్నాటకలోనూ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ మొత్తం 14 సబ్ కమిటీలను వేసుకుందని.. వాటి ద్వారా మార్పులకు శ్రీకారం చుడుతోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రాజకీయ, సామాజిక కోణంలోని వారినే ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చారని.. సాంకేతిక విద్య, అంగన్వాడీ, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నిపుణులను భాగస్వామ్యం చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతేగాకుండా అసలు విధులేమిటో చెప్పలేదని, ఏం సలహాలివ్వాలి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టతా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యా కమిషన్‌కు ఆదిలోనే తలపోట్లు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.